బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన్‌తార లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మొదటిరోజే భారత్‌లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల మార్క్‌ను దాటింది. 'జైలర్' సినిమాకు అనిరుధ్ బీజీఎం ఎంతగానో తోడ్పడింది. అలాగే జవాన్ సినిమాకు భారీ యాక్షన్ సీన్స్ ఊపిరి పోశాయి. ఇవే ఈ చిత్రానికి ప్రధానమైన బలం అని చెప్పవచ్చు.
(ఇదీ చదవండి: మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్‌లాక్ వీడియో వైరల్)
ఇందులో ప్రతి యాక్షన్ సీన్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జవాన్‌లో చిత్రంలో ఆస్పత్రి వద్ద జరిగే యాక్షన్ సీన్‌తో పాటు డబ్బును కంటైనర్‌లో తరలించే సమయంలో వచ్చే ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు, గగుర్పొడిచే బైక్ స్టంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటంన్నిటి వెనుక ఆరుగురి శ్రమ ఉంది. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్, క్రెయిగ్ మాక్రే, యానిక్ బెన్, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు.. అనే ఆరుగురు స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లను షూట్ చేశారు.
(ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్)
మాములుగా ఇండియాన్ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్ సినిమాకు ఏకంగా ఆరగురు యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారు. అందుకే ఆ సీన్లన్నీ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.
► ఫైట్ మాస్టర్ 'స్పిరో రజాటోస్' హాలీవుడ్ సినిమాల్లో ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస', కెప్టెన్ అమెరికా,' టీనేజ్ మ్యూటాంట్ నింజా తాబేళ్లు, మరియు మరిన్నింటికి ప్రసిద్ధి చెందాడు,
► యాక్షన్ సీన్స్‌లలో ఎంతో అనుభవజ్ఞుడైన పార్కర్ ట్యూటర్‌గా గుర్తింపు పొందిన 'యానిక్ బెన్' హాలీవుడ్ అంతటా పలు చిత్రాలతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. షారుక్ రయీస్, టైగర్ జిందా హై, మహేశ్ బాబు నేనొక్కడినే, ట్రాన్స్‌పోర్టర్ 3, డన్‌కిర్క్ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు.
► 'క్రెయిగ్ మాక్రే' కూడా పలు హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది.
► 'కిచా కఫడ్గీ' ఒక ఆంగ్ల స్టంట్ దర్శకుడు, అతను కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సినిమాలకు పనిచేశాడు. తుపాకి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, బాఘీ 2' వంటి బ్లాక్‌బస్టర్‌లలో తన యాక్షన్‌కు పేరుగాంచాడు.
► 'సునీల్ రోడ్రిగ్స్' యాక్షన్ సన్నివేశాలలో ఆయన కొత్తగా సృష్టించగలడు. సాంకేతిక రూపకల్పనతో పాటుగా దర్శకత్వం, నిర్మాణంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అతను షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సూపర్‌హిట్‌లలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాడు.
► 'అనల్ అరసు' ఒక భారతీయ ఫైట్ మాస్టర్/యాక్షన్ కొరియోగ్రాఫర్, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పని చేస్తున్నారు. కొన్ని హాలీవుడ్ వెబ్‌సీరిస్‌లకు కూడా ఆయన పనిచేశాడు. అతను సుల్తాన్, కత్తి,కిక్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment