Jawan Movie
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
కల్కి కలెక్షన్స్.. షారూఖ్‌ను దాటేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి.. 40 రోజులు దాటినా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఇండియా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. జవాన్ లైఫ్‌టైమ్ రికార్డ్‌ను కల్కి 40 రోజలు కలెక్షన్లతో దాటేసింది.షారూఖ్ లైఫ్ టైమ్ రికార్డ్ దాటేసిన ప్రభాస్నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి సత్తా చాటింది. ఇప్పటి వరకు భారత్‌లో నాలుగో స్థానంలో ఉన్న షారుఖ్ జవాన్ చిత్రాన్ని ఈ చిత్రం అధిగమించింది. జవాన్ మొత్తం రూ.640.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే.. కల్కి భారత్‌లో రూ. 641.13 కోట్ల నెట్ మార్క్‌ను అధిగిమించింది. ప్రస్తుతానికి, కల్కి నెట్, గ్రాస్ కలెక్షన్లలో ముందుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌లో మాత్రం జవాన్ ఇంకా రేసులో ఉంది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1160 కోట్లు రాబడితే.. కల్కి రూ. 1100 కోట్లు సాధించింది. మరో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో కూడా ప్రభాస్ ముందుంటాడు.ఏ వారంలో ఎంత కలెక్షన్కల్కి 2898 AD మొదటి వారంలో రూ. 414.85 కోట్లు, రెండో వారంలో రూ. 128.5 కోట్లు, మూడో వారంలో రూ. 56.1 కోట్లు, నాలుగో వారంలో రూ. 24.4 కోట్లు వసూలు చేసి ఐదవ వారంలో రూ.12.1 కోట్ల వసూళ్లను కొనసాగించింది. ప్రస్తుతం ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 5.18 కోట్లతో మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 641.13 కోట్లు అని ఒక సంస్థ నివేదించింది. మరో రెండు వారాల పాటు కల్కి కలెక్షన్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది.కల్కికి ఉన్న పోటీ ఏంటి..?జవాన్ థియేట్రికల్ రన్ ఎనిమిది వారాల వరకు కొనసాగింది. కల్కి 2898 AD ఇంకా ఆరవ వారంలో ఉంది. మరికొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆగస్ట్ 15న విడుదలవుతున్న స్ట్రీ 2, వేదా, ఖేల్ ఖేల్ మే వంటి కొత్త సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ సినిమాతో పోటీ పడుతూ కల్కి ముందుకు సాగింది. కల్కి 2898 AD హిందూ పురాణాలను ప్రధాన అంశంగా తీసుకుని దానికి సాంకేతికత జోడించి సైన్స్ ఫిక్షన్ రూపంలో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి బలమైన తారాగణం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు. -
'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్
థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా 'కల్కి' జోరు ఇంకా తగ్గట్లేదు. దీనికి పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడం కూడా బాగా ప్లస్ అయింది. దీంతో జనాలు ఇంకా థియేటర్లకు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే వసూళ్లలో అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన 'కల్కి'.. ఇప్పుడు మరో క్రేజీ ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా ఎవరికీ సాధ్యం కానీ విధంగా ప్రభాస్ తన కొత్త సినిమాతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అదేంటంటే?ఒకప్పటితో పోలిస్తే సినిమా టికెట్లన్నీ ఆన్లైన్లోనే దాదాపుగా సేల్ అవుతున్నాయి. అలా బుక్ మై షోలో 'కల్కి' చిత్రానికి ఇప్పటివరకు 12.15 మిలియన్ల బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే 'జవాన్' మూవీకి లైఫ్ టైమ్ వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని ప్రభాస్ మూవీ అధిగమించింది. తద్వారా దేశంలో ఇలా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'కల్కి' అరుదైన ఘనత సాధించింది.ప్రస్తుతం చెప్పుకొన్నది ఆన్లైన్ వరకే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్లు ఉన్న సింగిల్ స్క్రీన్లలో సాధారణంగా ఇచ్చే టికెట్లు కూడా లక్షల్లోనే అమ్ముడిపోయి ఉండొచ్చు. తద్వారా ఇప్పటివరకు లేని విధంగా 'కల్కి' సరికొత్త రికార్డులు సాధిస్తుండటం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఇప్పట్లో ఈ రికార్డులు ఎవరైనా అందుకుంటారా అనేది సందేహంగా మారుతోంది. -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుకు నామినేట్.. షారుక్ మెచ్చుకున్నారు!
భారతీయ సినిమాలో స్టంట్ మాస్టర్‌గా అనల్ అరసుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు పని చేస్తూ ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ జవాన్‌కు అనల్ అరసు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో తెరపైకి రానున్న ఇండియన్–2 చిత్రానికీ ఈయన ఫైట్స్ కంపోజ్ చేశారు. 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు'ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న వా వాద్ధియారే, హిందీలో బేబీజాన్, వార్ 2 తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరో విజయ్‌సేతుపతి వారసుడు సూర్యను హీరోగా పరిచయం చేస్తూ ఫీనిక్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే అనల్ అరసు 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు' పోటీల్లో నామినేట్ అయ్యారు. జవాన్ చిత్రానికి గానూ నామినేట్ దీని గురించి ఆయన సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుపుతూ టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుల్లో.. జవాన్ చిత్రానికి గానూ తన పేరు నామినేట్ అయ్యిందని చెప్పారు. ఇది ఆస్కార్ అవార్డుకు సమానమైనదిగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరికి సంబంధించిన పురస్కారం అని చెప్పారు. ప్రపంచ స్థాయి చిత్రాలలో జవాన్ మూవీతో పాటు హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజబుల్, జాన్ విక్స్ 4 మొదలగు ఐదు చిత్రాలు నామినేట్ అయ్యినట్లు చెప్పారు. అవార్డు వస్తే సంతోషంఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుక కోసం అమెరికాకు పయనమవుతున్నట్లు తెలిపారు. తాను ఇంతకు ముందు 2017లో కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యానని, అయితే అది ప్రాంతీయ చిత్రాల కేటగిరి కావడంతో పెద్దగా ప్రచారం జరగలేదన్నారు. ఇప్పుడు వరల్డ్ స్థాయి చిత్రాల కేటగిరీలో జరుగుతున్న పోటీలో ఇంత వరకూ భారతీయ సినిమాకు చెందిన ఏ స్టంట్ మాస్టర్ ఈ అవార్డును గెలుచుకోలేదన్నారు. అలాంటి తనకు అవార్డు వస్తే సంతోషం అని అనల్ అరసు పేర్కొన్నారు. ఈ అవార్డుకు నామినేట్ అవడంతో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, దర్శకుడు అట్లీ వంటి పలువురు అభినందించారని చెప్పారు. -
ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?
హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసింది గానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంది. దీంతో ఈమె పనైపోయిందనుకున్నారు. కానీ బంతిని గట్టిగా బౌన్స్ అయింది. ఓటీటీ, సహాయ పాత్రల్లో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడైన ఖరీదైన కారు కొనుగోలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రియమణి.. తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో నటిగా ఈమె కెరీర్ మొదలవగా.. తెలుగులో బోలెడన్ని చిత్రాలు చేసింది. మధ్యలో తమిళ, మలయాళంలోనూ నటించింది. 2012-13 మధ్యలో ఈమెకు ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అనుకున్నారు. దీంతో టీవీ షోలు చేస్తూ వచ్చింది. 2017లో ముస్తాఫా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అలా పెళ్లి చేసుకుని గృహిణి అయిన తర్వాత ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఛాన్సులు వరసపెట్టి వచ్చాయి. 'భామా కలాపం' లాంటి సినిమాల్లో హీరోయిన్గా.. జవాన్, నెరు, కస్టడీ తదితర చిత్రాల్లో ప్రాధాన్యమున్న సహాయ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా అనుకోని విధంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ప్రియమణి.. తాజాగా ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ధర రూ.74 లక్షల వరకు ఉంది. ఇప్పటికే కొన్ని కాస్ట్ లీ కార్స్ ఈమె దగ్గర ఉండగా.. ఇప్పుడీ కారు ప్రియమణి గ్యారేజీలో చేరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
Shah Rukh Khan: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ పోటీ!
గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. వాటిలో పఠాన్, జవాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి, రూ.1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక డిసెంబర్లో వచ్చిన ‘డంకీ’కూడా మంచి వసూళ్లను సాధించి, షారుఖ్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి, వాటిలో రెండు చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. (చదవండి: చాలా ఎళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ) తాజాగా బాలీవుడ్ బాద్షా హాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడడానికి పఠాన్, జవాన్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రకటించిన వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్‌లో షారుఖ్ నటించిన ‘జవాన్, పఠాన్ చిత్రాలు ఉన్నాయి. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఇవి పోటీ పడనున్నాయి. (చదవండి: రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ) బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో జవాన్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ‘పఠాన్’ నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో హాలీవుడ్‌కి చెందిన ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్ చిత్రాలు ఉన్నాయి. -
2023 Roundup: స్టార్ డైరెక్టర్స్‌కి ఈ సినిమాలు తెగ నచ్చేశాయ్.. ఇవన్నీ ఆ ఓటీటీల్లో!
కళ్లు మూసి తెరిచేలోపు మరో ఏడాది పూర్తయిపోయింది. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్ మొన్నే చేసుకున్నట్లు. ఇంతలోనే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఈ ఏడాది గడిచిపోయింది. మిగతా విషయాలన్నీ పక్కనబెడితే 2023లో మాత్రం పలు అద్భుతమైన సినిమాలు రిలీజయ్యాయి. మూవీ లవర్స్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ కూడా చాలా సినిమాలకు ఫిదా అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... స్టార్ డైరెక్టర్ ఈ ఏడాది తమకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో చెప్పేశారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. పఠాన్ (హిందీ- అమెజాన్ ప్రైమ్), సప్త సాగర ఎల్లో దాచే-రెండు భాగాలు (కన్నడ-అమెజాన్ ప్రైమ్), జవాన్ (హిందీ-నెట్‌ఫ్లిక్స్) సినిమాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. 'డాడా' (తమిళం) చిత్రం తనని బాగా మెప్పించిందని చెప్పుకొచ్చాడు. ఇది ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కొంకణ సేన్ శర్మ.. 'ద గ్రేట్ ఇండియా కిచెన్' (తమిళ-తెలుగు) సినిమా.. ఈ ఏడాది వచ్చిన వాటిలో తన ఫేవరెట్ అని చెప్పింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌కి అయితే జైలర్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), సప్త సాగర ఎల్లో దాచే సైడ్-ఏ (కన్నడ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు బాగా నచ్చాయని చెప్పాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ జియో బేబీకి.. జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తమిళ-నెట్‌ఫ్లిక్స్), B 32 ముతళ్ 44 వరే (మలయాళ) సినిమాలు బాగా నచ్చేశాయని చెప్పాడు. వీటిలో ఒకటి ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ అవినాష్ అరుణ్.. 12th ఫెయిల్ (హిందీ- హాట్‌స్టార్), రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (హిందీ-అమెజాన్ ప్రైమ్) చిత్రాలు తనకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. కన్నడ దర్శకుడు హేమంత్ ఎమ్ రావు.. తమ తోటీ దర్శకులు తీసిన ఆచార్ అండ్ కో (కన్నడ-అమెజాన్ ప్రైమ్), హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ-జీ5) సినిమాలు బాగా నచ్చాయని అన్నాడు. ఇలా పలువురు స్టార్ దర్శకులకు నచ్చిన సినిమాలంటే కచ్చితంగా అవి బెస్ట్ మూవీస్ అయ్యింటాయ్. వీటిల్లో చాలావరకు మీరు చూసేసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే మాత్రం.. 2023 ముగిసేలోపు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ) -
సలార్ ముందు ఎన్నో భారీ రికార్డ్స్.. ఢీ కొట్టగలడా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. నేడు (డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి వచ్చేశాడు. దీంతో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ట్ కొట్టాడని తెలుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సలార్‌కు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సలార్ ఈ రికార్డ్స్ కొట్టగలడా..? ఈ ఏడాదిలో విజయ్,షారుక్ ఖాన్,రణబీర్ కపూర్ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేశారు. నేడు విడుదలైన సలార్ ఆ రికార్డ్స్‌ను దాటగలుగుతాడా అని చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఆ తర్వాత షారుఖ్ "జవాన్" మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'యానిమల్' చిత్రం కూడా మొదటిరోజు రూ. 116 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల గ్రాస్‌గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా విడుదలైన సలార్ మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఏ రికార్డ్ కొట్టగలుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ సలార్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 150 కోట్లు దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 600 కోట్లు సేఫ్ మార్క్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్‌కు రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. (ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ) ఇదే నిజమైతే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ హక్కులు మాత్రం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఏదేమైనా సలార్ ఫుల్ రన్లో టార్గెట్ రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అని తెలుస్తోంది. -
హిట్ కొట్టారు సరే.. కానీ ఆ స్టార్స్‌ను మరిపిస్తారా?
గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్రాలు విజయాల సంఖ్య బాగానే పెరిగిందనే చెప్పాలి. కొన్ని భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టి చిత్ర పరిశ్రమ మనుగడకు అండగా నిలిచాయి. ముఖ్యంగా దక్షిణాది సినీతారలు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ విశేషం. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ తొలిసారిగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా దక్షిణాది లేడీస్ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. దర్శకుడు అట్లీ, నటి నయనతార, నటుడు విజయ్ సేతుపతికి అక్కడ జవాన్ చిత్రం మైల్‌స్టోన్‌గా మిగిలింది. అంతకు ముందు వరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా తన స్థాయిని విస్తరించుకున్నారు. మరోవైపు డిసెంబర్ 1 విడుదలైన యానిమల్ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అయితే సందీప్‌కు హిందీలో ఇదే తొలి చిత్రం కాగా.. నటి రష్మికకు మూడవ చిత్రం కావడం గమనార్హం. ఈమె ఇంతకు ముందే నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా నటి రష్మిక మందన్నకు నటిగా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక్కడ విజయమే కొలమానం కాబట్టి యానిమల్ చిత్ర విజయం ఈమెకు చాలా కీలకంగా మారింది. కాగా ఈ చిత్ర విషయం రష్మికలో నూతనోత్సాహం వచ్చిందనే చెప్పాలి. గతంలో వహిదా రెహమాన్, హేమమాలిని, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల నటి దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ తారలు టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నా ఆ స్థాయిలో పేరు రాలేదు. కాగా ఈ ఏడాది విడుదలైన దక్షిణాది హీరోయిన్లు నటించిన రెండు హిందీ చిత్రాలు సంచలన విజయాలను సాధించడంతో రష్మిక, నయనతారలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. అలాగని ఈ ఇద్దరికి హిందీలో కొత్తగా అవకాశాలేమీ రాలేదు. రష్మిక తెలుగులో, నయనతార తమిళంలో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. -
వైష్ణో దేవి అమ్మవారి సన్నిధిలో షారుక్ ఖాన్.. మరో హిట్ ఖాయం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు హీరో షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం జమ్మూలోని కత్రా వద్దకు ఆయన చేరుకున్నారు. ఏడాది సమయంలో మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్ సందర్శించారు. 2023లో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన షారుక్ ఆ తర్వాత జవాన్ సినిమాతో కూడా మరో సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఈ రెండు సినిమా విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్' విడుదలకు ముందు 2022 డిసెంబర్ 12న వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన షారుక్.. మళ్లీ 'జవాన్' విడుదలకు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 'డంకీ' విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్ పాటిస్తున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్ తిరుగుతుండగా పలువురు వీడియోలు తీశారు. ఆయనతో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న 'డంకీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 22న డంకీ చిత్రానికి పోటీగా ప్రభాస్ సలార్ వస్తున్న విషయం తెలిసిందే. #WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today. (Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2 — ANI (@ANI) December 12, 2023 -
2023 రౌండప్: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే!
మనకు ఏ డౌట్ వచ్చినా గూగుల్ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్ ఇంజన్. అలా గూగుల్‌లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలివే అంటూ గూగుల్ తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్‌నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి.. ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్ 10 చిత్రాలు ► 1. జవాన్ ► 2. గదర్ 2 ► 3. ఓపెన్‌హైమర్ ► 4. ఆదిపురుష్ ► 5. పఠాన్ ► 6. ది కేరళ స్టోరీ ► 7. జైలర్ ► 8. లియో ► 9. వారిసు/ వారసుడు ► 10. టైగర్ 3 ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 షోలు, వెబ్ సిరీస్‌లు.. ► 1.ఫర్జి ► 2. వెడ్నస్డే ► 3. అసుర్ ► 4. రానా నాయుడు ► 5. ద లాస్ట్ ఆఫ్ అస్ ► 6. స్కామ్ 2003 ► 7. బిగ్‌బాస్ 17 ► 8. గన్స్ అండ్ గులాబ్స్ ► 9. సెక్స్/ లైఫ్ ► 10. తాజా ఖబర్ చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్! -
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్‌ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్‌లో నిలిచాయి. -
మీ వల్లే ఈ ఘనత దక్కింది.. జవాన్ డైరెక్టర్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన జాబితాలో ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న మూవీగా జవాన్ నిలిచింది. ఈ ఏడాది ప్రకటించిన థియేట్రికల్ సినిమాల్లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ నిలిచింది. ఈ సందర్భంగా అట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అట్లీ ఇన్‌స్టాలో రాస్తూ.. "జవాన్ అనేది ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది సమాజంలోని అన్యాయాలను సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి లోతైన భావోద్వేగానికి సంబంధించినగి. ఈ సినిమా మీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ చాలా గొప్పది. ప్రపంచ సినిమా గురించి నాకున్న జ్ఞానానికి ఐఎండీబీ ప్రశంసలు పొందడంతో ఓ కల నిజమైంది. ఈ విజయం కోసం సహకారించిన షారూఖ్ ఖాన్ సార్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నా భార్య, నా టీమ్, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ మీరు నంబర్ వన్ డైరెక్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు జవాన్-2 కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) -
ప్రేమ గాయాలను తట్టుకుని ఆపై పడిలేచిన కెరటం నయనతార
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్‌నే సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో నేడు (నవంబర్ 18) నయన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత.ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్... తర్వాత తన రూట్ మార్చి ప్రేక్షల చేత విజిల్స్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. . నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్‌గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన 'మానస్సినక్కరే' తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్లో 'లక్ష్మీ'లో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి,దుబాయ్ శ్రీను, తులసి తదితర సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అక్కడి నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకుని లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ ఫాదర్లో మెప్పించిగా.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని నిలిచింది సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..? ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ ఇలా చెప్పింది. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.' అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు. నయనతార ఆస్తులు ఎంత..? నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 14 కోట్లు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.200 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.అలాగే, ఆమె ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉంది. హిందూ మతాన్ని స్వీకరించిన నయన్ నయన్ క్రిస్టియన్.. ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతారకు 2011లో నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. -
ఓటీటీలోనూ అదరగొడుతున్న జవాన్.. కేవలం 10 రోజుల్లోనే..
ఓటీటీలో కొత్త సినిమా రిలీజైందంటే చాలు ఎగబడి మరీ చూస్తారు. అందులోనూ స్టార్ హీరో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు చూసి సంతృప్తి చెందుతారు. థియేటర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్టార్ హీరో మూవీ ఓటీటీలో వస్తే ఇంకే రేంజ్లో ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండు నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ సునామీ సృష్టిస్తోంది. ఓటీటీలో రిలీజై 14 రోజులు కావస్తున్నా ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 చిత్రాల్లో తొలి స్థానంలో ఉంటూ సత్తా చాటుతోంది. ఇండియాలోనే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు సహా మరో నాలుగు దేశాల్లోనూ జవాన్‌ను ఎగబడి మరీ చూస్తున్నారు. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం 25 మిలియన్ వాచ్ హవర్స్ సాధించింది. తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా జవాన్ అరుదైన రికార్డు సృష్టించింది. దీంతో ఓటీటీలోనూ జవాన్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న హీరోయిన్ -
ఓటీటీలో అదరగొడుతున్న మ్యాడ్.. బ్లాక్‌బస్టర్ జవాన్‌ను వెనక్కు నెట్టేసింది!
వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఓ పాన్ ఇండియా సినిమాకు ఓ చిన్న సినిమా గట్టి పోటీనిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో దక్షిణాది తారలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీయే. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2న రిలీజ్ అయింది. అప్పుడే ఓటీటీ రిలీజైన మ్యాడ్ ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ సినిమా నిత్యం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్‌లో చోటు దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఝలక్ ఇస్తోంది చిన్న చిత్రం మ్యాడ్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపీక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో హిట్ అయిన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అటు జవాన్, ఇటు మ్యాడ్‌ను ఓటీటీ ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. టాప్ 10 చిత్రాల్లో మ్యాడ్ ఏ స్థానంలో ఉందంటే? ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువమంది చూస్తున్న టాప్ 10 చిత్రాల్లో జవాన్ హిందీ వర్షన్ తొలి స్థానంలో నిలబడి తన ఆధిక్యతను చాటుకుంటోంది. కానీ తమిళ, తెలుగు వర్షన్లను మాత్రం మ్యాడ్ మూవీ వెనక్కు నెట్టేసింది. ఎక్కువమంది చూస్తున్న సినిమాల్లో మ్యాడ్ రెండో స్థానంలో నిలబడింది. జవాన్ తమిళ వర్షన్ మూడో స్థానంలో, తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో నిలిచాయి డ్రీమ్ గర్ల్ 2.. ఐదో స్థానంలో ఉంది. చంద్రముఖి 2 పదో స్థానంలో ఊగిసలాడుతోంది. ఇది ఆదివారం నాటి లెక్కలు.. ఇది చూసిన అభిమానులు ఒక చిన్న తెలుగు సినిమా.. భారీ బడ్జెట్ మూవీ జవాన్‌కు గట్టి పోటీనే ఇస్తుందే అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన మెగా ఇంటి కోడలు.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా? -
అర్థరాత్రి షారుక్ ఖాన్ ఇంటవద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పలు పేర్లతో తన అభిమానులతో పిలుపంచుకునే నటుడు షారుక్ ఖాన్ ఈరోజు తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుక్ ఖాన్‌కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు ఆయన ఇంటికి వస్తుంటారు. అర్ధరాత్రి 12 దాటగానే బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. భారీగా తన అభిమానులు గుమిగూడినప్పటికీ వారిని ఆయన ఏ మాత్రం నిరాశపరచడు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని తన మార్క్ అభివాదంతో చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలుపుతాడు. ఈసారి కూడా తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం 'మన్నత్' సమీపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్నారు. షారుఖ్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో కనిపించి అర్థరాత్రి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులకు చేయి ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానుల ఆనందం వెలకట్టలేనిదని చెప్పవచ్చు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో షారుఖ్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. రొమాంటిక్ పాత్రలను సులువుగా పోషిస్తూ 'కింగ్ ఆఫ్ రొమాన్స్'గా పేరు తెచ్చుకున్నాడు షారుక్. యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపుతున్న షారుఖ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. పఠాన్,జవాన్లతో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న కింగ్ డిసెంబర్లో తన డంకీ మూవీతో ప్రభాస్ సలార్‌ను ఢీ కొట్టనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) View this post on Instagram A post shared by Voompla (@voompla) -
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్‌ఫ్లిక్స్‌లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్‌కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్‌ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్‌ఫ్లెక్స్‌లో చూడొచ్చు. స్కంద- హాట్‌స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్‌స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'తో పాటు పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని కొత్తకొత్తగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్. వాటిలో కొన్ని మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాల సంగతి పక్కనబెడితే వివిధ ఓటీటీల్లో ఓవరాల్‌గా 32 సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో షారుక్ 'జవాన్', రామ్ 'స్కంద' చిత్రాలతో పాటు ఆర్య, స్కామ్ 2003 సిరీసులు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) OTTల్లో ఈ వారం విడుదలయ్యే మూవీస్-వెబ్ సిరీసులు (అక్టోబరు 31- నవంబరు 5) నెట్‌ఫ్లిక్స్ లాక్డ్ ఇన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 01 న్వువో ఒలింపో (ఇటాలియన్ సినిమా) - నవంబరు 01 వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 01 ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02 సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - నవంబరు 02 హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - నవంబరు 02 జవాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 02 ఒనిముషా (జపనీస్ సిరీస్) - నవంబరు 02 యూనికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02 బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబరు 03 ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబరు 03 న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03 ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబరు 03 మ్యాడ్ (తెలుగు సినిమా) - నవంబరు 03 అమెజాన్ ప్రైమ్ నకుల్ గర్ల్ (జపనీస్ సినిమా) - నవంబరు 02 తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 02 టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ సిరీస్) - నవంబరు 02 ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03 PI మీనా (హిందీ సిరీస్) - నవంబరు 03 (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?) హాట్‌స్టార్ బిహైండ్ ద ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01 ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) - నవంబరు 01 స్కంద (తెలుగు సినిమా) - నవంబరు 02 ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03 ఆహా ఆర్ యూ ఓకే బేబీ? (తమిళ సినిమా) - అక్టోబరు 31 సోనీ లివ్ స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03 బుక్ మై షో హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబరు 03 మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 ద థీప్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 03 ఆపిల్ ప్లస్ టీవీ ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03 జియో సినిమా టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 03 (ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?) -
ప్రారంభమైన నయనతార కొత్త చిత్రం
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ విజయాన్ని అందుకున్న ఈ భామ 75 చిత్రాల మార్క్‌ను దాటేశారు. ప్రస్తుతం 76వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి 'మన్నాంగట్టి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. దీన్ని ఇంతకు ముందు సర్దార్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్.లక్షమణన్ తన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఈ చిత్రం ద్వారా యూట్యూబర్ డూడ్ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు యోగిబాబు, గౌరీ కిషన్, దేవదర్శిని, నరేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోడైక్కానల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది పిరియడ్ కథాంశంతో వైవిధ్యభరిత కథనంతో రూపొందుతున్న చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా కోలమావు కోకిల, ఐరా చిత్రాల తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్లో రూపొందటంతో ఈ మన్నాంగట్టి చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. కాగా నయనతార టెస్ట్ అనే మరో చిత్రంలోనూ నటిస్తుండడం గమనార్హం. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
స్టార్ హీరో షారుక్ ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఎందుకంటే గత ఐదేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టాడు. చెరో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించాడు. థియేటర్లలోకి వచ్చిన నెల దాటిపోయినా సరే 'జవాన్' ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?) 'జవాన్' సంగతేంటి? షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తీశాడు. కథ పరంగా చూస్తే చాలా రొటీన్. కానీ స్క్రీన్ ప్లేతో పాటు ప్రతి సీన్లోనూ ఎలివేషన్, భారీతనం కనిపించింది. దీంతో సినీ ప్రేక్షకులు మిగతా విషయాల్ని పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేశారు. దీంతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చాయి. బర్త్‌డే నాడు ఓటీటీలోకి జవాన్ డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పుడు షారుక్ పుట్టినరోజు సందర్భంగా నవంబరు 2న 'జవాన్'ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో లేని సీన్స్‌ని కూడా ఓటీటీ కట్లో ఉండబోతున్నాయని సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే ఓటీటీలోనూ 'జవాన్' రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
రూ.1100 కోట్ల క్లబ్లో ‘జవాన్’.. చరిత్ర సృష్టించిన షారుఖ్!
కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్‌తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్‌లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ తర్వాతే షారుఖ్ జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్‌కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. జవాన్ రికార్డులు విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రం అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్‌గా షారుఖ్ చరిత్రకెక్కాడు. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం Jawan 🤝 Making & breaking box office records every day! 🔥 Book your tickets now!https://t.co/B5xelUahHO Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r — Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023 -
రూ.20 కోట్ల బడ్జెట్ సినిమా.. షారుక్ ఖాన్ పఠాన్‌కే షాకిచ్చింది!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!) అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది. (ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్) View this post on Instagram A post shared by Ormax Media (@ormaxmedia) -
ఆ రోగంతో బాధపడుతున్న 'జవాన్' నటి.. దీని కారణంగా!
హీరోయిన్లని చూడగానే చాలా అందంగా ముద్దుగా భలే ఉంటారు. అయితే బయటకు అలా కనిపిస్తున్నా సరే వాళ్లలో కొంతమంది పలు ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పుకోరంతే. అయితే పలు సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ, ఈ మధ్య 'జవాన్' మూవీతో సక్సెస్ అందుకున్న నటి సన్య మల్హోత్రా.. తనకున్న రోగం గురించి చెప్పుకొచ్చింది. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో కూడా రివీల్ చేసింది. (ఇదీ చదవండి: ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ) సన్యకు ఏమైంది? 'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్‌కు కూతురిగా నటించిన సన్య మల్హోత్రా.. అదే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో సహాయ పాత్రలు చేసిన ఈమె.. తర్వాత తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది. నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. 'జవాన్'లో ఓ మంచి పాత్ర చేసి శెభాష్ అనిపించింది. అయితే తాను చాలాకాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చెప్పింది. దీనికారణంగా ఆత్మన్యూనత (ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్)కి గురవుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది. 'నా యాక్టింగ్ గురించి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నా, బాగా చేశావని అంటున్నా సరే నాకు సందేహంగానే అనిపిస్తుంది. బాగా చేయాలేదేమో అని అనుమానం కలుగుతుంది. అలానే నేను చేసే పని కూడా నచ్చదు. 'బదాయి హో' సినిమా హిట్ అయింది. కానీ నేను మాత్రం బాగా యాక్ట్ చేయాలేదని ఫీలయ్యాను. అయితే ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాను' అని సన్య మల్హోత్రా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) -
మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ
సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్‌ని కూడా తన మ్యూజిక్‌తో బ్లాక్‌బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు. పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్‌గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా! (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?
తమిళ సినిమా: ఇప్పుడు నయనతారను చూస్తుంటే ఆరంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన నటేనా అని ఆశ్చర్యం కలిగించకమానదు. కేరళా రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నయనతార ఇప్పుడు కోట్లకు పడగెత్తి చెన్నైలో అధునాతనమైన భవనంలో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదీ లక్ అంటే. కెరీర్ మొదట్లో సినీ రంగంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలను చవి చూశారు. కాలం అన్నింటినీ అధిగమిస్తుందంటారు. అలా తన జీవితం నేర్పిన గుణపాఠాలతో రాటుదేలిన నయనతార అవరోధాలు, అవమానాలకు అందనంత ఉన్నత స్థాయి ఎదిగిపోయారు. ఎంతగా అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేంత స్థాయికి. ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ చిత్రానికి అక్షరాలా రూ.10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల భోగట్టా. కాగా స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకున్న తర్వాత కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి దూరంగా ఉన్న నయనతార వివాహానంతరం ఆ ఆదాయానికి కూడా గేట్లు తెరిచేశారు. అందుకే అంటారు డబ్బెవరికి చేదు అని. ప్రస్తుతం నయనతార పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల ఒక 50 సెకన్ల వాణిజ్య ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె ఇప్పటి వరకు కూడబెట్టిన ఆస్తులు ఎంతో తెలుసా? రూ. 300 కోట్లకు పై చిలుకేనని సమాచారం. నయనతార నటన, చిత్ర నిర్మాణం వంటి వాటితో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నారు. -
వండర్స్ క్రియేట్ చేస్తున్న జవాన్
-
అద్భుతాలు సృష్టిస్తున్న జవాన్ సినిమా
-
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్‌కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్‌తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్‌ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!
బాద్షా షారుక్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేయడమే గొప్ప. అలాంటిది తమిళం నుంచి బాలీవుడ్‌కి వెళ్లి మరీ దర్శకుడు అట్లీ 'జవాన్' తీశాడు. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్న డైరెక్టర్ అట్లీ.. గతంలో తన రంగు విషయమై చాలా ట్రోల్స్ అనుభవించాడు. ఆ హీరోతో సినిమా వల్ల స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాడు. 'రాజా రాణి' మూవీతో దర్శకుడు అయిపోయాడు. తమిళ, తెలుగులో ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. దీని తర్వాత విజయ్‌తో తెరి (పోలీసోడు) అనే సినిమా తీశాడు. విజయ్ అంటే పడని కొందరు అట్లీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) కలర్ కామెంట్స్ అయితే 'తెరి' సినిమా చేస్తున్న సమయంలోనే నటి కృష్ణప్రియతో అట్లీకి పెళ్లయింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం ఆమెది. సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తూ పేరు తెచ్చుకున్న ఈమె.. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అట్లీకి పరిచయమైంది. అలా ఐదేళ్ల పాటు సాగిన వీళ్ల బంధం చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెద్దల్ని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ తో సినిమా చేస్తున్నాడని పడని కొందరు.. అట్లీ కలర్‌ని ఉద్దేశిస్తూ.. కృష్ణప్రియతో ఉన్న ఫొటోలపై కామెంట్స్ చేశారు. 'కాకి ముక్కుకు దొండపండు' అని ఎగతాళి చేశారు. మొన్న 'జవాన్' రిలీజ్ టైంలోనే ఈ తరహా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా మనసులో పెట్టుకోని అట్లీ.. నవ్వుతూ ముందుగు సాగిపోతున్నాడు. (ఇదీ చదవండి: నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: కమల్ హాసన్) -
షారుఖ్ ఖాన్‌తో ఫొటో.. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు..: గంభీర్ పోస్ట్ వైరల్
Gautam Gambhir shares a picture with Shah Rukh Khan: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2011 ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని భారత జట్టు 28 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్ గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గంభీర్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ కూడా ఉంది. ఐపీఎల్లో సత్తా చాటిన గంభీర్ 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన ధోని సేనలో కూడా గౌతీ సభ్యుడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులతో అదరగొట్టాడు. ఇక టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ గంభీర్ సత్తా చాటిన విషయం తెలిసిందే. కేకేఆర్‌ను రెండుసార్లు విజేతగా నిలిపి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన ఈ ఢిల్లీ బ్యాటర్.. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ అందించాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహ యజమానిగా ఉన్న కేకేఆర్‌ను రెండుసార్లు విజేతగా నిలిపి సత్తా చాటాడు. ఆ తర్వాత కేకేఆర్‌ను వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోయిన గంభీర్.. 2018లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. షారుఖ్ ఖాన్‌తో గంభీర్ ఫొటో ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా పనిచేస్తున్న గంభీర్.. ఢిల్లీ బీజేపీ ఎంపీ కూడా అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేకేఆర్‌ను వీడినా షారుఖ్‌తో గంభీర్ అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఈ మాజీ ఓపెనర్ షేర్ చేసిన ఫొటో ఇందుకు నిదర్శనం. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు ‘‘ఇతడు కేవలం బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు. మేము ఎప్పుడు కలిసినా సరే... నేనైతే అంతులేని ప్రేమ.. గౌరవం మూటగట్టుకుని వెళ్తాను. మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు బెస్ట్ అంతే’’ అంటూ రెడ్ హార్ట్ సింబల్స్‌తో షారుఖ్‌పై ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. జవాన్ సక్సెస్ సంబరంలో షారుఖ్ కాగా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమా సక్సెన్‌ను ఆస్వాదిస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రలో నటించారు. హిట్‌టాక్‌తో వందల కోట్ల కొద్దీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను చేస్తోంది జవాన్. పఠాన్ తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్ సంబరంలో మునిగిపోయిన కింగ్ ఖాన్‌ను గంభీర్ తాజాగా కలిశాడు. చదవండి: ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్ He’s not just the king of Bollywood but the king of hearts. Every time we meet I go back with endless love and respect . So much to learn from u . Simply the best ❤️❤️ SRK @iamsrk pic.twitter.com/VcMV1QahUq — Gautam Gambhir (@GautamGambhir) September 21, 2023 -
జవాన్ కలెక్షన్స్ 800 కోట్లు సీక్వెల్స్ మాయలో పడ్డ ఖాన్స్
-
జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్‌లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్‌కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
జవాన్ డైరెక్టర్ గట్టిగా తిట్టేసరికి ఏడ్చేసాను..
-
'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?
'జవాన్' సినిమా పేరు చెప్పగానే అందరికీ వందల కోట్ల కలెక్షన్సే గుర్తొస్తాయి. ఎందుకంటే గత వారం రిలీజైన ఈ చిత్రం.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో షారుక్‌తోపాటు బోలెడంత మంది స్టార్స్ నటించారు. అయితే మిగతా వాళ్లు కోట్లకు కోట్లు తీసుకున్నారు. కానీ ఇందులో యాక్ట్ చేసిన దీపికా పదుకొణె మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకో తెలుసా? తనకు జరిగిన అన్యాయంపై ఓ జవాన్.. తన కొడుకుతో కలిసి విలన్‌పై ఎలా పగతీర్చుకున్నాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన 'జవాన్' సినిమాని ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇకపోతే ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో షారుక్‌కి జోడీగా దీపికా పదుకొణె యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) సాధారణంగా ఒక్కో సినిమాకు దీపికా పదుకొణె.. రూ.12-15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటదని టాక్. అలాంటిది 'జవాన్'లో ఉచితంగా నటించినట్లు స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటంతో ఇంకేం ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈమె కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఓం శాంతి ఓం'. ఈ చిత్రం నుంచి షారుక్, నిర్మాణ సంస్థతో దీపికకు మంచి బాండింగ్ ఉంది. బహుశా ఈ కారణంతోనే ఫ్రీగా యాక్ట్ చేసి ఉండొచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ K' అలియాస్ 'కల్కి'లో హీరోయిన్గా చేస్తోంది దీపికనే. అయితే గతంలో తన భర్త రణ్వీర్ సింగ్ 83, సర్కస్ సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేసిన దీపికా.. అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు 'జవాన్'కి మాత్రం ఫ్రీగా చేసింది. మరి ఇది విశేషమేగా! (ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!) -
మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియాలో తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్‌ను రీక్రియేట్ చేయని సెలబ్రిటీలు ఉండరు. ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీపై బాలీవుడ్ బాద్షా ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ మూవీ సక్సెస్‌పై బన్నీ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన షారుక్ ఖాన్.. బన్నీని పొగుడుతూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్! ) షారుక్ ట్వీట్లో రాస్తూ.. 'నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీలోని 'ది ఫైర్' నన్ను మెచ్చుకుంటోంది. పుష్ప చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. వీలైనంత త్వరగా వచ్చి మీకు వ్యక్తిగతంగా అందిస్తాను. లవ్ యూ బన్నీ.' అంటూ రిప్లై ఇచ్చారు. షారుక్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. 'షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. షారుక్ అవతార్‌తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three… https://t.co/KEH9FAguKs — Shah Rukh Khan (@iamsrk) September 14, 2023 -
7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. జావాన్ ఖాతాలో అరుదైన రికార్డు విడుదలైన తొలి రోజు జవాన్ చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ అరుదైన రికార్డుని సాధించింది. (చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) అలాగే ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్‌గా షారుఖ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్ 2, పఠాన్ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకుంది. జవాన్ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. -
ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్ మూవీ జవాన్‌లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. గతంలో సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ను వెనక్కి నెట్టి సోషల్ మీడియా ఫేమ్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. IMDb నివేదిక ప్రకారం ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నయనతార నం.1 స్థానంలో ఉంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సోషల్ మీడియాలో అత్యధికంగా శోధించిన, ట్రెండింగ్ సినిమాలను గుర్తించడం ద్వారా ఈ రేటింగ్ ఇస్తుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్) ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను ఈ ఏడాది ప్రారంభం నుంచి IMDb విడుదల చేస్తుంది. వారానికోసారి విడుదలయ్యే ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా అభిమానులు శోధించారు. గ్లోబల్ ఇండియన్ సెలబ్రిటీ అభిమానులు కింగ్ ఖాన్ కంటే నయనతారపై ఎక్కువ ఆసక్తి చూపారు. IMDb షేర్ చేసిన తాజా జాబితాలో, జవాన్ సూపర్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ కంటే నయనతార ముందుంది. గత వారం జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, నయనతార 3వ స్థానంలో నిలిచింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార IMDb ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో ఎక్కువ మంది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. నయనతార అగ్రస్థానంలో ఉండగా, కింగ్‌ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. జవాన్ దర్శకుడు అట్లీ కుమార్ గత వారం పదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. విష్నేష్ శివన్ రియాక్షన్ IMDb యొక్క ప్రముఖ భారతీయ ప్రముఖుల జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉండటంపై విఘ్నేష్ శివన్ స్పందించారు. నయనతార భర్త, చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ తన భార్య సాధించిన విజయాల గురించి తరచుగా ప్రశంసిస్తుంటారు. తాజాగా విఘ్నేష్ తన 'తంగమాయె' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొనియాడాడు. విఘ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ప్రౌడ్ ఆఫ్ యు తంగమయ్య' అని రాసి తన భార్యను ట్యాగ్ చేశాడు. (ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ) -
ఆ విషయంలో అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న ప్రియమణి మొదట్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. కాగా వివాహానంతరం తన వయసుకు తగిన పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రంలో నటించిన గురించి ప్రియమణి ఒక భేటీలో పేర్కొంటూ జవాన్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఏదో క్యామియో పాత్ర అయి ఉంటుందని భావించారన్నారు. అయితే షారుక్ ఖాన్ టీం లో ఒకరిగా ముఖ్యమైన పాత్ర అని తెలియగానే చాలా సంతోషించానన్నారు. అట్లీ దర్శకుడు అని చెప్పగానే నటిస్తానని చెప్పానన్నారు. అలా ఒకసారి జూమ్ కాల్లో దర్శకుడు అట్లీ, ఆర్య మాట్లాడారని చెప్పారు. అట్లీ తన మిత్రుడు అని పరిచయం చేసి ఆర్య వెళ్లిపోయారన్నారు. అలా ప్రియమణి జవాన్ చిత్రంలో నటిస్తుందన్న వార్త వెలువడగానే ఏదో ఐటమ్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారాన్ని తాను పట్టించుకోలేదన్నారు. అయితే దర్శకుడు అట్లీ తనను చాలా ఏమార్చారన్నారు.. జవాన్ చిత్రం తమిళ వర్షన్లో నటుడు విజయ్ గెస్ట్ రోల్ లో నటించనున్నారని, అదే విధంగా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను నటించనున్నారని ప్రచారం హోరెత్తిందన్నారు. విజయ్ ఇందులో నటిస్తున్నారా..? అని తాను అట్లీని అడగ్గా నటింపజేస్తే పోద్ది అన్నారన్నారు. అయితే విజయ్‌తో తనను ఒక్క సన్నివేశంలోనైనా నటింపజేయమని కోరగా అలాగే అన్నారని, అయితే చివరివరకూ దర్శకుడు అట్లీ తనను అలా ఏమార్చుతూనే వచ్చారని వెల్లడించారు. నిజానికి ఈ చిత్రంలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదని ప్రియమణి పేర్కొన్నారు. -
Jawan Film OTT Rights: ఓటీటీకి జవాన్.. కళ్లు చెదిరే ధరకు హక్కులు!
బాలీవుడ్ బాద్ షా తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్రలో మెరిసింగది. ఈనెల 7న బాక్సాఫీస్ బరిలో నిలిచిన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఏడు నెలల గ్యాప్‌లోనే.. పఠాన్ చిత్రం తర్వాత మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇదే ఊపు కొనసాగితే పఠాన్ వసూళ్లను దాటేసే అవకాశముంది. కాగా.. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) అయితే ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి మరో జాక్‌పాట్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ కోసం ఏకంగా రూ.250 కోట్లు మేకర్స్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. స్ట్రీమింగ్ తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి థియేటర్లలో లభిస్తున్న రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో నటించింది. (ఇది చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
'జవాన్'లో షారుక్‌కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?
షారుక్ ఖాన్ 'జవాన్' మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొడుతోంది. రెండు రోజుల్లో రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. అయితే ఇందులో తండ్రి కొడుకుగా డబుల్ రోల్ లో షారుక్ మెప్పించాడని అందరికీ తెలుసు. కానీ చాలా సీన్స్ లో డూప్ యాక్ట్ చేశాడని మీకు తెలిసుండడదు. ఇంతకీ అతడెవరు? రెమ్యునరేషన్ ఎంతిచ్చారు? 15 ఏళ్లుగా డూప్‌గా 'జవాన్' మాత్రమే కాదు.. గత 15 ఏళ్ల నుంచి షారుక్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దె. ఇతడు షారుక్ కి డూప్ గా నటిస్తున్నప్పటికీ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గానూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జవాన్' విశేషాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ఆ రోజే రానా తమ్ముడి వివాహం!) ఒకేరోజు రెండు గెటప్స్ 'జవాన్ సినిమాలో ఓ సీన్ ఉంది. తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం అది. చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే... నేను తండ్రి గెటప్ వేశారు. నన్ను కౌగిలించుకునే టైంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. తర్వాత నేను కొడుకు గెటప్ వేస్తే... షారుక్ తండ్రి గెటప్ సీన్స్ తీశారు. అంటే ఒకేరోజు మేం ఇద్దరం రెండు వేర్వేరు గెటప్స్ వేయాల్సి వచ్చింది' అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Prashant Walde (@prashantwalde) నెలకి అంత సంపాదన అయితే షారుక్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్.. రోజుకి రూ.30 వేల వరకు తీసుకుంటున్నాడట. అంటే నెలకు దాదాపు రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే సినిమా మొత్తంలో ఇతడికి సంబంధించిన సీన్స్ అన్ని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టుంటుంది. దీంతో ఓ రూ.30-40 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుని ఉంటాడని అనిపిస్తుంది. ఏదేమైనా డూప్ గా నటిస్తూ కూడా ఇంత సంపాదించొచ్చనే విషయం ఇతడిని చూశాకే అర్థమైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు టైం ట్రావెల్ మూవీ) View this post on Instagram A post shared by Prashant Walde (@prashantwalde) -
బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
జవాన్ సినిమాకు సినీప్రియులు జై కొడుతున్నారు. షారుక్ ఖాన్ యాక్టింగ్, యాక్షన్ ఇంకా కళ్లముందే కదలాడుతోందంటున్నారు. జవాన్ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మరోసారి చూస్తే కానీ దిల్ ఖుష్ అయ్యేలా లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి రికార్డులు సృష్టించాలన్నా నేనే, రికార్డులు తిరగరాయాలన్నా నేనే అన్నట్లుగా షారుక్ బాక్సాఫీస్ దగ్గర విజృంభిస్తున్నాడు. పఠాన్ మొదటి రోజు రూ.106 కోట్లు రాబడితే జవాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఉందంటున్నారు సినీప్రియులు. మరోపక్క బాక్సాఫీస్ దగ్గర తిరుగు లేకుండా దూసుకుపోతున్న గదర్ 2 చిత్రానికి జవాన్ బ్రేక్ వేసింది. ఈ మూవీ నిన్నటివరకు రూ.510 కోట్లు రాబట్టింది. తాజాగా రిలీజైన జవాన్ గట్టి పోటీ ఇస్తుండటంతో గదర్ 2 కలెక్షన్స్‌కు భారీ స్థాయిలో గండి పడనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా? -
అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత?
తమిళసినిమా: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నది సామెత. అయితే ఇది కొందరి విషయంలో అక్షరసత్యంగా మారుతుంది. ముఖ్యంగా నటి నయనతార పరిస్థితి ఇదే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. తాజాగా జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో ఇండియన్ సినిమా తారగా గుర్తింపుపొందారు. నయనతార నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఈమైపె సంచలన నటిగా ముద్రవేశారు. నటిగా రెండు దశాబ్దాలకు దగ్గరలో ఉన్న నయనతార 75 చిత్రాల మైలురాయిని అవలీలగా అధిగమించి నాటౌట్‌గా వెలుగొందుతున్నారు. కాగా దీని గురించి ఇటీవల ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జవాన్ చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ, నటుడు షారుక్ఖాన్లపై అసంతృప్తిగా ఉన్నారన్నది ఆ వదంతి. అయితే జవాన్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యంగా వసూళ్లను కురిపిస్తోంది. ఇది ఇండియాలో ఒకరోజులో రూ.75 కోట్లు వసూళ్లు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి గత రికార్డులను తిరగరాస్తున్నట్లు సమాచారం. ఇకపోతే జవాన్ చిత్రంలో నయనతారకు తగిన ప్రాధాన్యత ఉంది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే నటుడు షారుక్‌ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం. ఇక అట్లి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకి నయనతారనే ఆ తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన నయనతారనే నటింపజేశారు. ఇకపోతే జవాన్ చిత్రం సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జవాన్ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్‌లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్‌లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్‌లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్‌తో గుండు లుక్‌ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్‌లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్‌లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్'
బాద్షా షారుక్ ఖాన్ మరో హిట్ కొట్టేశాడు. 'జవాన్'తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే.. మరో రూ.1000 కోట్ల పక్కా అనిపిస్తుంది. ఈ ఏడాది 'పఠాన్'తో దుమ్ములేపాడు. ఇప్పుడు మరోసారి రచ్చ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో 'జవాన్', ప్రభాస్ 'ఆదిపురుష్'ని మాత్రం దాటలేకపోయింది. కింగ్ ఖాన్ షారుక్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు 'జవాన్'తో సూపర్‌హిట్ కొట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ఈ చిత్రంలో కథ కొత్తగా లేనప్పటికీ.. స్రీన్ ప్లే రేసీగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజులో ఉండేసరికి జనాలకు సినిమా నచ్చేసింది. దీంతో తొలిరోజు ఏకంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) అయితే హిట్‌తో షారుక్ ఖాన్.. తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించి ఉండొచ్చు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ని మాత్రం దాటలేకపోయాడు. ఎందుకంటే ఈ ఏడాది జూన్ లో రిలీజైన 'ఆదిపురుష్' చిత్రానికి తొలిరోజు రూ.136.84 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నట్లే. మరి డార్లింగ్ హీరోని బీట్ చేయాలంటే మళ్లీ 'సలార్' రావాలేమో? 'జవాన్' కథేంటి? భారత్-చైనా సరిహద్దుల్లోని నదిలో గాయాలతో ఉన్న ఓ వ్యక్తి కొట్టుకొస్తాడు. కట్ చేస్తే ముంబయిలో విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్).. ఆరుగురు అమ్మాయిలతో కలిసి మెట్రో ట్రైన్‌ని హైజాక్ చేస్తాడు. ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే రూ.40 వేల కోట్లు కావాలని అంటాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా. ఇంతకీ విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్‌గా పనిచేస్తున్న ఆజాద్‌తో ఇతడికి సంబంధం ఏంటనేదే 'జవాన్' స్టోరీ. (ఇదీ చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ) God is so kind Thank you everyone Thank you for the Massy-ive love ❤ Book your tickets now!https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/q1TdI37nJZ — atlee (@Atlee_dir) September 8, 2023 Top 5 Openers WW Box Office[2023]#Adipurush - ₹ 136.84 cr#Jawan - ₹ 125.05 cr#Pathaan - ₹ 106 cr#Jailer - ₹ 95.78 cr#PonniyinSelvan2 - ₹ 61.53 cr — Manobala Vijayabalan (@ManobalaV) September 8, 2023 -
'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయన్‌తార లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మొదటిరోజే భారత్‌లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల మార్క్‌ను దాటింది. 'జైలర్' సినిమాకు అనిరుధ్ బీజీఎం ఎంతగానో తోడ్పడింది. అలాగే జవాన్ సినిమాకు భారీ యాక్షన్ సీన్స్ ఊపిరి పోశాయి. ఇవే ఈ చిత్రానికి ప్రధానమైన బలం అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్‌లాక్ వీడియో వైరల్) ఇందులో ప్రతి యాక్షన్ సీన్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జవాన్‌లో చిత్రంలో ఆస్పత్రి వద్ద జరిగే యాక్షన్ సీన్‌తో పాటు డబ్బును కంటైనర్‌లో తరలించే సమయంలో వచ్చే ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు, గగుర్పొడిచే బైక్ స్టంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటంన్నిటి వెనుక ఆరుగురి శ్రమ ఉంది. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్, క్రెయిగ్ మాక్రే, యానిక్ బెన్, కిచా కఫడ్గీ, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు.. అనే ఆరుగురు స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లను షూట్ చేశారు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) మాములుగా ఇండియాన్ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్ సినిమాకు ఏకంగా ఆరగురు యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారు. అందుకే ఆ సీన్లన్నీ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ► ఫైట్ మాస్టర్ 'స్పిరో రజాటోస్' హాలీవుడ్ సినిమాల్లో ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస', కెప్టెన్ అమెరికా,' టీనేజ్ మ్యూటాంట్ నింజా తాబేళ్లు, మరియు మరిన్నింటికి ప్రసిద్ధి చెందాడు, ► యాక్షన్ సీన్స్‌లలో ఎంతో అనుభవజ్ఞుడైన పార్కర్ ట్యూటర్‌గా గుర్తింపు పొందిన 'యానిక్ బెన్' హాలీవుడ్ అంతటా పలు చిత్రాలతో పాటుగా తెలుగు, హిందీ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. షారుక్ రయీస్, టైగర్ జిందా హై, మహేశ్ బాబు నేనొక్కడినే, ట్రాన్స్పోర్టర్ 3, డన్కిర్క్ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు. ► 'క్రెయిగ్ మాక్రే' కూడా పలు హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ► 'కిచా కఫడ్గీ' ఒక ఆంగ్ల స్టంట్ దర్శకుడు, అతను కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సినిమాలకు పనిచేశాడు. తుపాకి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, బాఘీ 2' వంటి బ్లాక్బస్టర్లలో తన యాక్షన్‌కు పేరుగాంచాడు. ► 'సునీల్ రోడ్రిగ్స్' యాక్షన్ సన్నివేశాలలో ఆయన కొత్తగా సృష్టించగలడు. సాంకేతిక రూపకల్పనతో పాటుగా దర్శకత్వం, నిర్మాణంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అతను షేర్షా, సూర్యవంశీ, పఠాన్ వంటి సూపర్హిట్లలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాడు. ► 'అనల్ అరసు' ఒక భారతీయ ఫైట్ మాస్టర్/యాక్షన్ కొరియోగ్రాఫర్, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో పని చేస్తున్నారు. కొన్ని హాలీవుడ్ వెబ్‌సీరిస్‌లకు కూడా ఆయన పనిచేశాడు. అతను సుల్తాన్, కత్తి,కిక్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందాడు. -
జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?
Jawan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్ అత్యధిక వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి తొలి రోజు ఏకంగా రూ.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీనిపై వ్యాపారవేత్త బిలియనీర్, ఆనంద్ మహీంద్ర స్పందించారు.దీంతో ఇది వైరల్‌గా మారింది. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) సాధారణంగా దేశాలన్నీ తమ సహజ ఖనిజ వనరులను భద్రంగా కాపాడుకుంటాయి. వాటిని మైనింగ్ చేసి, విదేశీ మారక ద్రవ్యం కోసం ఎగుమతి చేస్తాయి. ఇపుడిక షారూఖ్ ఖాన్‌ను నేచరల్ రిసోర్స్‌గా ప్రకటించాల్సిన సమయం బహుశా వచ్చిందనుకుంటా అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా దుబాయ్‌లో అభిమానులతో కింగ్ ఆఫ్ బాలీవుడ్ సందడి చేస్తున్న ఒక వీడియోను షేర్ చేశారు. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) All countries guard their natural mineral resources and mine them and usually export them to earn forex. Maybe it’s time to declare @iamsrk a Natural Resource… 🤔 😊 pic.twitter.com/RvXnegLga0 — anand mahindra (@anandmahindra) September 8, 2023 దీంతో ట్వీపుల్ జవాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘ఎస్ఆర్కే అంటే సారే రికార్డ్స్ ఖతం’ అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. అలాగే షారూఖ్ అంటే నేచురల్ రిసోర్స్ మాత్రమేకాదు సార్, నేషనల్ ప్రౌడ్ అంటూ మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఆ సినిమాలో తూటాల్లా పేలుతున్న కొన్ని డైలాగులను షేర్ చేయడం విశేషం. See the Jawan’s craze at Regent Cinema patna, that too at the midnight for the last show of the first day 🔥#Jawan pic.twitter.com/5yfrgonMf5 — Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) September 8, 2023 MASS : King Khan’s JAWAN Dialogue straight from Burj Khalifa - Bete ko haath lagane se pehle baap se baat kar 🔥❤️ #ShahRukhKhan #Jawan #JawanInDubai #JawanCelebrationAtBurjKhalifa pic.twitter.com/Y9icKG63UU — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) August 31, 2023 -
బంగ్లాదేశ్‌లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం 'జవాన్' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. సౌత్ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్లో వసూళ్ల రికార్డును సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదు. గతంలో షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కూడా అదే రోజు బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు. తాజాగా జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్‌లో విడుదల కాకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌లో జవాన్‌ను ఎందుకు విడుదల చేయలేదు.. విశేషమేమిటంటే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అంతర్యుద్ధం లాంటి పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది 2024లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు పలు చోట్ల ప్రభుత్వం పట్ల నిరసనలు వంటివి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావారణం నెలకొని ఉంది. దీంతో అక్కడ జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించబడింది. దీంతో అక్కడ ఆయన ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పట్లో బంగ్లాదేశ్‌లో షారుఖ్ ఖాన్ సినిమా జవాన్‌కి థియేటర్లు ఎప్పుడు లభిస్తాయో చెప్పడం కష్టం. జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్
గత నాలుగేళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో తన సత్తా చాటుతున్నాడు. ఇదే ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ తొలిరోజున భారత్‌లో రూ. 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్'తో మరోసారి బాలీవుడ్ సింహాసనం తనదేనని 57 ఏళ్ల బాద్ షా నిరూపించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ తన విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబడుతోంది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు. షారుక్ ఖాన్ గత 5 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ► 2016లో విడుదలైన 'ఫ్యాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఆయనకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజు రూ.19.10 కోట్లు వసూలు చేసింది. ► ఆ తర్వాతి సంవత్సరం 2017లో షారుఖ్ ఖాన్, పాకిస్థానీ నటి మహిరా ఖాన్ జంటగా నటించిన చిత్రం రయీస్.. షారుఖ్ ఖాన్‌కు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈ సినిమా తొలిరోజే 20.40 కోట్లు రాబట్టింది. ► 2017లో 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో షారుక్ ఖాన్, ఇంతియాజ్ అలీతో పని చేయడం ఇదే మొదటిసారి. 2017లో విడుదలైన ఈ సినిమా షారుఖ్, అనుష్కల 'రబ్ నే బనాదీ'ల హిట్ పెయిరింగ్ ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా తొలిరోజు మొత్తం 15.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ► 2018 సంవత్సరంలో విడుదలైన 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత, బాలీవుడ్లో షారుక్ ఖాన్ కెరీర్ ముగిసిందని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో షారుక్ ఖాన్ ఇంటికే పరిమితం అయ్యాడు. జీరో సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం 19.35 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ► షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. ఈ సినిమా భారత్‌లో మొదటిరోజు ఏకంగా రూ. 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది. బాలీవుడ్లో అతనికి ఇంకా స్థానం ఉందని షారుక్ అప్పుడే అనుకున్నాడు. షారుక్ ఖాన్ కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్‌పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్‌గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్‌పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్‌లను వివిధ రకాల పాస్‌వర్డ్‌లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
జవాన్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఇచ్చిపడేసిందిగా!
పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపాడు షారుక్ ఖాన్. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తన నుంచి మరో సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్‌కు తగ్గట్లే సౌత్ డైరెక్టర్ అట్లీ ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించగా షారుక్‌కు కూడా తెగ నచ్చేసింది. ఇంకేముంది జవాన్ సినిమా మొదలైంది. లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకోణ్ ముఖ్య పాత్రలో మెరిసింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ లేరే అన్న లోటును తీర్చేసిందో బ్యూటీ. బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతు జవాన్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇందులో ఆమె పాత్రకు డైలాగులు లేవు కానీ, షారుక్ పక్కనే కనిపించింది. జైలర్ ఆజాద్‌గా షారుక్ నటించగా, ఆయనకు సబ్ ఆర్డినేట్ ఆఫీసర్‌గా సిరి కనిపించింది. బాలీవుడ్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదంటున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్ ద్వారా మూటగట్టుకున్న నెగెటివిటీని ఈ బ్యూటీ తన అందం, ప్రతిభ ద్వారా వచ్చిన ఆఫర్లతో తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. తమిళ దర్శకుడు అట్లీ కూడా జవాన్‌లో చిన్న పాత్రలో మెరిశారు. ఇకపోతే జవాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో షారుక్ గత సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాలు ఒకే ఓటీటీలో!
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు మరో భారీ సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. అదే జవాన్. జవాన్.. బోలెడన్ని ప్రత్యేకతలు ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించడం, లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం, తమిళ స్టార్ విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే అతిథి పాత్రలో మెరవడం.. ఇలా చాలానే ఉన్నాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నేడే విడుదలవగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఈపాటికే ఓటీటీ పార్ట్‌నర్స్‌తో డీల్ కుదుర్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ రూ.120 కోట్లు పెట్టి మరీ జవాన్ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రెండూ ఒకే ఓటీటీలో సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్లాప్ టాక్ వచ్చిందంటే అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. హిట్ టాక్ వస్తే కొంతకాలం ఆగిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. అంటే, ఈ రెండు సినిమాల ఫలితాన్ని బట్టే ఓటీటీ విడుదల ఖరారు కానుంది. మిస్ శెట్టి.. సెప్టెంబర్ నెలాఖరులో లేదంటే అక్టోబర్ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది! జవాన్ మాత్రం అక్టోబర్ చివర్లో రిలీజయ్యేట్లు కనిపిస్తోంది. చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్: జవాన్ నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్, సంజయ్ దత్ నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ దర్శకత్వం: అట్లీ కుమార్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్‌కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్లో సరైన హిట్ లేకపోవడంతో అక్కడ సౌత్ సినిమాల హవా కొనసాగింది. అలాంటి సమయంలో పఠాన్ విడుదల కావడం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి బాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. అలా పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన షారుక్.. తాజాగా 'జవాన్'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదుల అయిన జవాన్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ‘జవాన్’ కథేంటంటే.. కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) అండ్ టీమ్ హైజాక్ చేస్తారు. ఆ టీమ్‌లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ (షారుక్ ఖాన్) మెట్రోను ఎందుకు హైజాక్ చేశాడు. .? ఆ హైజాక్ సీన్లోకి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్ రాథోడ్ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్ డీలర్‌గా ఉన్న విజయ్ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్ రాథోడ్‌కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ రివేంజ్ సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్ ఓరియేంటేడ్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్ అట్లీ తమిళ హీరో విజయ్‌తో తెరి, మెర్సిల్, బిగిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాలీవుడ్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్‌లో కూడా మంచి మెసేజ్‌ను ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో విక్రమ్ రాథోడ్‌తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్‌కు ప్లస్ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్ సీన్లు ఇవే. ఫస్టాఫ్‌లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్ ఇష్యూలతో జవాన్ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్ నటన, యాక్షన్స్ సీన్స్ ముందు అవన్నీ ఆడియన్స్ పెద్దగా పంటించుకోరు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే.. ఈ విషయంలో జైలర్‌గా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్, ఆజాద్‌కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్‌లో కూడా మంచి యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ అంతగా పండించవనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆజాద్ జైలర్ అయితే విక్రమ్ రాథోడ్ ఒక జవాన్ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్' చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్' ప్రాణాలు పోతాయి. సేమ్ 'జవాన్' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలో షారుక్ ఖాన్ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రంజెంటేషన్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ సీన్స్ పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. జవాన్‌తో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్‌కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్ అనిపించేలా తనదైన మార్క్ నటనతో మెప్పించింది. కానీ షారుక్ ఖాన్‌తో ఆమె జోడీ అంతగా హైలెట్ కాలేదు. విక్రమ్ రాథోడ్‌కు భార్యగా దీపికా పదుకోన్ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్ అయ్యేలా మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాళీ గైక్వాడ్‌గా విజయ్ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్ అతనికి బాలీవుడ్లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్ పెరగడం ఖాయం. సినిమాలో విలన్ రోల్‌తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్‌లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్ దత్ కామియో రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ ఉండదు. విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఇందులో అనిరుధ్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్‌తో పాటు పలు సీన్స్‌లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ ఉండదు. ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’.‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘జవాన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. (చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్ మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జవాన్’కి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. షారుఖ్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందని కామెంట్ చేస్తున్నారు. షారుఖ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమని, షారుఖ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. Just started watching #Jawan, and I'm already hooked! The action scenes are intense, and the story is gripping. Can't wait to see how the hero saves the day. Any recommendations for similar action-packed movies? #MovieNight 🍿 — RushLabs (@RushLab) September 7, 2023 ఇప్పుడే జవాన్ చూశాను. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. కథనం ఆకట్టుకుంది. షారుఖ్ నటన అదుర్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Jawan Early Review B L O C K B U S T E R: ⭐️⭐️⭐️⭐️⭐️#Atlee has delivered a masterpiece, an exhilarating blend of emotion and mass action This year belongs to the baadhshah #ShahRukhKhan𓃵 👑 #VijaySethupathi #Nayantara & rest were great DON'T MISS IT !!#JawanReview pic.twitter.com/lKuYZ6oWGr — ConectMagnet (@ConectMagnet) September 7, 2023 ‘జవాన్ బ్లాక్ బస్టర్ హిట్. అట్లీ ఓ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్ మరియు మాస్ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుఖ్ ఖాన్‌దే. విజయ్ సేతుపతి, నయనతార అద్భుతంగా నంటించారు. జవాన్ చూడడం మిస్ కాకండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #Atlee#OneWordReview #Jawan : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Jawan is a WINNER and more than lives up to the humongous hype… Atlee immerses us into the world of Mass pan-Indian film, delivers a KING-SIZED ENTERTAINER… Go for it. MUST WATCH. #JawanReview #ShahRukhKhan pic.twitter.com/WgtqoKFyjD — Rithik Modi (@rithiek) September 7, 2023 జవాన్ విజయం సాధించాడు. సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్డ్ ఎంటర్టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #jawanReview..!!! 1st Half ok👍 2nd Half average.. Nayanthara Entry 🔥 VJ sethupathi Acting🙏 🔥 'One word ' #Jawan film loved by Shahrukh Khan fans#JawanFirstDayFirstShow#JawanFDFS #ShahRukhKhan𓃵 #AskSRK pic.twitter.com/qC7eArxP79 — Raj (@Rajwriter7) September 7, 2023 ‘ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ యావరేజ్. నయనతార ఎంట్రీ బాగుంది. విజయ్ సేతుపతి నటన అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే...‘జవాన్’ షారుఖ్ అభిమానులను అలరిస్తుంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. The film @iamsrk starer #jawan will create a tsunami at Bharat & overseas box office 🔥🔥🔥 from its Day1, all the existing records in danger. People are going to witness what happens when the world's biggest superstar comes with mass Avtar 💥💥💥 #JawanFDFS #ShahRukhKhan𓃵 💓 — basha (@Noone47949911) September 6, 2023 My friends from New Zealand told me. It's going to be tsunami at the box office for #Jawan. #KingKhan SRK is going to rule Global Box Office. The collections will be earth shattering. 🔥🔥 — Says A man (@saysAmann) September 7, 2023 Jawan came to creat history at box office. Biggest blockbuster of bollywood industry. CRAZE for #Jawan is unmatchable. Even in early morning 🔥🔥🔥#JawanFirstDayFirstShow #JawanReview #JawanAdvanceBooking #JawanFDFS pic.twitter.com/Ta0uM5gZwv — Satya Prakash (@Satya_Prakash08) September 7, 2023 #JawanReview :⭐⭐⭐⭐#Jawan is a fascinating crime filled movie told from multiple perspectives with perfect pace & cinematography. An absolute entertainer package with action, comedy, thrill & what else.. @iamsrk @VijaySethuOffl & @Atlee_dir keep us on the edge of our seat pic.twitter.com/kBVFX3UK4B — Shams Ansari (@realshams01) September 7, 2023 #Jawan craze is like a festival 🔥 This is unbelievable and Unmatchable for other stars.#ShahRukhKhan𓀠 is ready to rule the box office and wins hearts ✅#JawanTsunamiTomorrow #JawanFirstDayFirstShow #Jawan #ShahRukhKhan𓀠 #JawanReviews #Nayanthara #ThalapathyVijay pic.twitter.com/sohSZzbeom — Jani ( Fan Account) (@filmy49515) September 7, 2023 -
క్రికెట్ మ్యాచ్‌లో 'జవాన్' ప్లాన్: అట్లీ
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం జవాన్. దీనికి కారణాలెన్నో. ముఖ్యంగా పఠాన్ వంటి సంచలన విజయం సాథించిన చిత్రం తరువాత తెరపైకి వస్తున్న చిత్రం ఇది కావడం. అదేవిధంగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకుడు కావడం. లేడీ సూపర్‌స్టార్ నయనతార జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం. క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం, తమిళ నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (సెప్టెంబర్ 7) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మీడియాతో ముచ్చటిస్తూ తాను బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఊహించలేదన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్నేనని పేర్కొన్నారు. ఆయన నమ్మకమే జవాన్ చిత్రం అని పేర్కొన్నారు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడడానికి చైన్నె వచ్చినప్పుడు షారూఖ్‌ఖాన్ తన కార్యాలయాలనికి వచ్చారన్నారు. తామిద్దరం సుమారు మూడున్నర గంటలు మాట్లాడుకున్నామని చెప్పారు. అప్పుడే జవాన్ చిత్రానికి బీజం పడిందని చెప్పారు. రూ.350 కోట్లు బడ్జెట్లో చిత్రం చేయడానికి సిద్ధమయ్యామన్నారు. కరోనా కాలంలో షారూఖ్‌ఖాన్ ధైర్యం చేసి ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అయితే తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అలా నటి నయనతార, విజయ్‌సేతుపతి, యోగిబాబు, సంగీత దర్శకుడు అనిరుధ్, ఎడిటర్ రూపన్ ఇలా అందరినీ తానే ఈ చిత్రంలోని తీసుకున్నానని చెప్పారు. అయితే చిత్రం అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందించాలన్నదే లక్ష్యంగా భావించామన్నారు. జవాన్ చిత్రం అందరికీ సంతృప్తికరంగా వచ్చిందన్నారు. పఠాన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ చిత్రాన్ని రీచ్ అవుతుందా? అన్న విషయం గురించి ఆలోచించలేదన్నారు. ఒక మంచి చిత్రం చేయాలన్న ధ్యేయంతోనే జవాన్ చిత్రం చేశామని అట్లీ చెప్పారు. -
షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా జవాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. షారుఖ్‌ని డైరెక్ట్ చేసిన రెండో వ్యక్తి అట్లీ షారుఖ్ ఖాన్ సినీ కెరీర్ 1992లో ప్రారంభమైంది. బాలీవుడ్‌లోని బడా డైరెక్టర్స్ అందరితో షారుఖ్ కలిసి పని చేశాడు. కానీ సౌత్ వాళ్లతో కలిసి పని చేయడం చాలా తక్కువ. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమిళ డైరెక్టర్‌తో కలిసి షారుఖ్ ఓ సినిమా చేస్తున్నాడు. అట్లీ కంటే ముందు 2000 సంవత్సరంలో కమల్ హాసన్ దర్శకత్వంలో ‘హే రామ్’ అనే సినిమా చేశాడు. నయనతార తొలి చిత్రం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’. స్వతహా షారుఖ్ అభిమాని అయిన నయన్.. అతనితో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట. అంతకు ముందు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ‘వన్ టూ త్రీ ఫోర్’.. అనే పాటలో నటించే చాన్స్ ముందుగా నయన్‌కే వచ్చిందట. కారణం ఏంటో తెలియదు కానీ అప్పుడు ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట. నయన్ వద్దనడంతో ఆ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారట. షారుఖ్ ద్విపాత్రాభినయం ‘జవాన్’లో షారుఖ్ ద్విపాత్రాభినయం చేశాడు. అంతేకాదు పలు విభిన్న లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ట్రైలర్లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న టాటు బాగా వైరల్ అయింది. షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. అతిథి పాత్రలో దీపికా పదుకొణె చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుఖ్‌కు జోడిగా నటించిన దీపికా పదుకొణె.. ‘జవాన్’లో అతిథి పాత్రలో మెరవబోతుంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించడంతో షారుఖ్, దీపికా పదుకొణెల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. షారుఖ్ కోసమే దీపికా అతిథి పాత్రను ఒప్పుకుందట విలన్‌గా విజయ్ సేతుపతి జవాన్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించడం మరో విశేషం. విజయ్‌కి రెండో బాలీవుడ్ చిత్రమిది. అంతకు ముందు ముంబైకర్ చిత్రంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు. అయితే అది ఓటీటీలో విడుదల కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. ‘జవాన్’తో విజయ్ సేతుపతి బాలీవుడ్ భారీ విజయం అందుకోబోతున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ రిస్కీ ఫైట్స్ ‘జవాన్’కోసం షారుఖ్ రిస్కీ ఫైట్స్ చేశారట. ఈ చిత్రం కోసం ఆరుగురు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ పని చేయడం గమనార్హం. స్పిరో రజటొస్, యనిక్ బెన్, ట్రెయిన్ మాక్రే, కెచ్చా కంపాక్డీ, అనల్ అరసు మొదలగు ఆరుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు, బైక్, కారు ఛేజింగ్స్ జవాన్ చిత్రంలో హైలెట్ కానున్నాయని యూనిట్ సభ్యులు తెలిపాయి. రూ.300 కోట్ల బడ్జెట్ జవాన్ బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు. ఇందులో దాదాపు రూ. 100 కోట్లు షారుఖ్ రెమ్యునరేషనే కావడం గమనార్హం. ఇక నయనతార కూడా భారీగానే పుచ్చుకున్నారట. తొలి బాలీవుడ్ చిత్రానికిగాను రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్ ముంబై, పుణె, చెన్నై, రాజస్తాన్, హైదరాబాద్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగింది. రన్ టైం ఎంత? జవాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రన్‌టైం 2:49 గంటలు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొన్ని గంటల్లోనే తొలిరోజు షోకి సంబంధించి సుమారు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. బాలీవుడ్ చరిత్రలో ఇదొక రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
'జవాన్’పై మహేశ్ ట్వీట్.. షారుక్ క్రేజీ రిప్లై
పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం షారుఖ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో ‘జవాన్’పై టాలీవుడ్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సైతం ‘జవాన్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తానని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన కోరుకున్నాడు. మహేశ్.. నీతో కలిసి సినిమాకు వస్తా: షారుఖ్ తన సినిమా గురించి మహేశ్ బాబు ట్వీట్ చేయడం పట్ల షారుఖ్ స్పందించాడు. ఈ చిత్రం కచ్చితంగా మహేశ్‌కు నచ్చుతుందని, తాను కూడా మహేశ్‌తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ‘థ్యాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. ‘జవాన్’నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఈ సినిమాను చూడాలనుకుంటున్నావో చెబితే.. నేను కూడా నీతో కలిసి సినిమాకు వస్తా. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు’అని షారుఖ్ ట్వీట్ చేశాడు. కాగా, మహేశ్, షారుఖ్ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. గతంలో మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్‌కి షారుఖ్ వెళ్లి సందడి చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. Thank u so much my friend. Hope you enjoy the film. Let me know when you are watching I will come over and watch it with you. Love to you and the family. Big hug. https://t.co/xW0ZD65uvk — Shah Rukh Khan (@iamsrk) September 6, 2023 -
తిరుమలలో షారుక్, నయనతార- విఘ్నేష్ శివన్ జంట
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్ ఖాన్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్ దర్శించుకున్న విషయం తెలిసిందే.. తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్‌ను షారుఖ్ ధరించగా.. తన కూతురు సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?) OTT విడుదల వివరాలు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. జవాన్ విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఇలా చిత్ర బృందం భారీ ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 7 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులు బద్దలే... జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీ-టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. టిక్కెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే 'జవాన్' విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. మొదటి రోజు రూ. 70 నుంచి 75 కోట్ల రూపాయల బిజినెస్ చేయనుందని టాక్. దీని ద్వారా బాహుబలి 2 (రూ. 58 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 61 కోట్లు), పఠాన్ (రూ. 55 కోట్లు) రికార్డులను అధిగమిస్తారు. #ShahRukhKhan visited #Tirumala for blessing of lord venkateswara before #Jawan Release.#Jawan7thSeptember2023 pic.twitter.com/IiTjBy2MYU — Film Blocks (@FilmBlocks) September 5, 2023 #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv — ANI (@ANI) September 5, 2023 SRK , offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati 🙏🏻❤️ The most secular man on this planet 🇮🇳🙏🏻#ShahRukhKhan pic.twitter.com/J1c01of5Qu — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 5, 2023 -
థియేటర్లో రెండు సినిమాల మధ్య పోటీ.. ఓటీటీలో బోలెడన్ని చిత్రాలు..
సెప్టెంబర్ నెల ఖుషీగా మొదలైంది. చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఖుషి సినిమాతో బోణీ కొట్టారు. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. షారుక్ ఖాన్ నటించిన 'జవాన్'.. నవీన్ పొలిశెట్టి, అనుష్కల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఒకేరోజు విడుదలవుతున్నాయి. అటు ఓటీటీలోనూ బోలెడన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ సెప్టెంబర్ 2వ వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు ► జవాన్ - సెప్టెంబర్ 7 ► మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి - సెప్టెంబర్ 7 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► వన్ షాట్ (వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 5 ► లక్కీ గౌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 6 ► జైలర్ - సెప్టెంబర్ 7 ► సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 హాట్‌స్టార్ ► ఐయామ్ గ్రూట్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 6 ► ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 6 జీ5 ► హడ్డీ - సెప్టెంబర్ 7 నెట్‌ఫ్లిక్స్ ► స్కాట్స్ హానర్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 5 ► షేన్ గిల్లీస్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 5 ► టాప్ బాయ్ (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► కుంగ్‌ఫూ పాండా (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► వర్జిన్ రివర్ (వెబ్ సిరీస్, ఐదో సీజన్) - సెప్టెంబర్ 7 ► సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 8 బుక్ మై షో ► లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 లయన్స్ గేట్ ప్లే ► ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 ఆపిల్ టీవీ ప్లస్ ► ది ఛేంజ్లింగ్ (హాలీవుడ్) - సెప్టెంబర్ 8 హైరిచ్ ► ఉరు(మలయాళం) - సెప్టెంబర్ 4 చదవండి: ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు: గదర్-2 డైరెక్టర్ కామెంట్స్ వైరల్! -
అనిరుధ్ సంగీతంపై బాలీవుడ్ కంప్లైంట్
-
దుమ్ము రేపుతున్న ‘జవాన్’ మేకింగ్ వీడియో
పటాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రతి నాయకుడుగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్ ఖాన్‌కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. -
Jawan: లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్‌తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న చిత్రం జవాన్. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్లో ఉండే 1000 డ్యాన్సర్స్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం ఈ పాట స్పెషల్. ఇందులో ప్రియమణి మరోసారి కింగ్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న కనెక్షన్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. -
జవాన్ రిస్క్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కెప్టెన్ అమెరికా, వెనోమ్, స్టార్ ట్రెక్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సీన్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాంటి ఫైట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు షారుక్ ఖాన్. ఆ హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా చేసిన స్పీరో రజటోస్ ఆధ్వర్యంలో షారుక్ ‘జవాన్’ కోసం రిస్కీ ఫైట్స్ చేశారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రం ‘జవాన్’. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రిస్కీ స్టంట్స్‌ని హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ స్పీరో రజటోస్ సమకూర్చారని యూనిట్ పేర్కొంది. ‘‘జవాన్’లో షారుక్ చేసిన రిస్కీ ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. స్పీరో రజటోస్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
జవాన్ ట్రైలర్ లో ఉన్నది ఏ హీరో...?
-
షారుక్ ఖాన్ గుండుపై టాటు.. దాని అర్థమేంటి?
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జవాన్’. ‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా జవాన్‌పై అంచనాలు పెరిగాయి. ఇక జులై 10 విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. చర్చంతా టాటుపైనే షారుక్ సినిమా అంటే హీరో, హీరోయిన్లు ఎవరు? కథేంటి? అనే దానిపై చర్చ జరుగుతుండేది. కాని ఇప్పుడు నెట్టింట చర్చంతా షారుఖ్ గుండుపైనే నడుస్తుంది. జవాన్ ట్రైలర్ చివర్లో షారుఖ్ గుండుతో కనిపించి షాకిచ్చాడు. అయితే అందరి దృష్టి షారుఖ్ గుండు కంటే.. ఆ గుండుపై ఉన్న ఓ చిన్న టాటు మీద పడింది. షారుఖ్ ఎడమ చెపి పై భాగాన సంస్కృతంలో రాసి ఉన్న అక్షరాలను డీకోడ్ చేశారు. (చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) షారుక్ గుండుపై 'మా జగత్ జనని' అని రాసి ఉంది. అమ్మనే ప్రపంచం అని ఆ టాటు అర్థం. ఆ టాటుకి జవాన్ కథకు సంబంధం ఉందట. తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే ఓ కొడుకు కథే జవాన్ అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇందులో వాస్తమెంతో తెలియదు కానీ ఆ టాటు మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక జవాన్ విషయానికొస్తే.. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. . అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The tattoo on #ShahRukhKhan's head from #JawanPrevue is "माँ जगत जननी " = Mother of the world.#Jawan pic.twitter.com/FOBUlxOwOl — Manobala Vijayabalan (@ManobalaV) July 13, 2023 -
నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!
షారుక్ ఖాన్ మంచి ఊపు మీదున్నాడు. ఐదేళ్లుగా ఒక్క సినిమా చేయక సైలెంట్‌గా ఉన్న ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్'తో హిట్ కొట్టాడు. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. త్వరలో 'జవాన్'తో రాబోతున్నాడు. దీని ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న షారుక్.. ఇప్పుడు నయనతార భర్తకి ఓ విషయమై హెచ్చరించాడు. ఆమెతో జాగ్రత్త ఉండని చెప్పుకొచ్చాడు. షారుక్‌తో కలిసి లేడీ సూపర్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. దక్షిణాదిలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఇన్నాళ్లు సౌత్‌కే పరిమితమైన నయన్.. షారుక్ 'జవాన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఈ మూవీలో నయన్‌ది పోలీస్ క్యారెక్టర్. (ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) విఘ్నేశ్‌కి జాగ్రత్తలు 'జవాన్' ట్రైలర్ చూసిన నయన్ భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. 'అట్లీ ఇలాంటి సూపర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం. ఔట్‌ఫుట్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. హ్యాట్యాఫ్' అని పోస్ట్ పెట్టాడు. అలానే షారుక్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నందుకు నయనతార, అనిరుధ్, విజయ్ సేతుపతికి విషెస్ చెప్పాడు. షారుక్ పంచులు ఇక విఘ్నేశ్ శివన్ పోస్ట్ చూసిన షారుక్.. తనదైన శైలిలో స్పందించాడు. 'విఘ్నేశ్ శివన్ చూపిన ప్రేమకు థ్యాంక్స్. నయనతార అద్భుతంగా చేసింది. అయితే నేను చెప్పబోయేది మీకు ముందే తెలుసనుకుంటాను. కానీ జాగ్రత్త. ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది' అని షారుక్ ఫన్నీగా విఘ్నేశ్‌కి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. @VigneshShivN thank u for all the love. #Nayanthara is awesome…but oh who am I telling this…you toh already know!!! But Hubby, beware, she has now learnt some major kicks & punches!! pic.twitter.com/5aMZ8rzReN — Shah Rukh Khan (@iamsrk) July 12, 2023 (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) -
'సలార్' vs 'జవాన్'.. ఇదెక్కడి గొడవరా బాబు!?
Prabhas Vs Shah Rukh Khan: షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ రిలీజై రోజు గడిచిపోయింది. ఎలా ఉందనేది పక్కనబెడితే యూట్యూబ్‌లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి చెబుతూ నిర్మాతలు పోస్ట్ పెట్టారు. అన్నిచోట్ల కలిపి ఏకంగా 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అదుగో అక్కడే అసలు గొడవ మొదలైంది. ఉదయం నుంచి ఇప్పటికీ ఆయా హీరోల అభిమానులు ఇంకా తిట్టుకుంటూనే ఉన్నారు. నంబర్లు సరిపోలే సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ vs షారుక్ ఫ్యాన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది. జూలై 6న ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదలైంది. ఈ వీడియోలో ప్రభాస్, 10 సెకన్లకు మించి కనిపించలేదు. అయితేనేం 24 గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ నంబర్స్ యూట్యూబ్‌లో కనిపించాయి. 'జవాన్' ట్రైలర్‌కి 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు కానీ ఆ నంబర్ కనిపించలేదు. (ఇదీ చదవండి: 'జవాన్' ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!) గొప్పతనం గొడవ! 'జవాన్' నిర్మాతలు.. 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి గ్రాండ్ గా ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది. కానీ యూట్యూబ్ వ్యూస్‌లో చాలా డిఫరెన్స్ కనిపించింది. 55 మిలియన్ల వ్యూస్(హిందీ, తెలుగు, తమిళం కలిపి) మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, షారుక్ ఫ్యాన్స్.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఒకటే ట్వీట్స్ చేసుకుంటున్నారు. దీంతో ఇదెక్కడి దిక్కుమాలిన గొడవరా బాబు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. రెండూ సెప్టెంబరులోనే షారుక్ ఖాన్ 'జవాన్'.. సెప్టెంబరు 7న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. 'పఠాన్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో కలెక్షన్స్ పరంగా గట్టి అంచనాలున్నాయి. మరోవైపు సెప్టెంబరు 28న 'సలార్' చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. ప్రశాంత్ నీల్ దీనికి డైరెక్టర్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తన్నుకుంటున్నారు కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం రెండు హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాడు. The Dinosaur takes over @YouTubeIndia by storm ❤️🔥#SalaarTeaser hits a whooping 83 Million+ Views in 24 Hours! ▶️ https://t.co/l45lXHFzzD#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/KsJbFuDJLV — Salaar (@SalaarTheSaga) July 7, 2023 The love for Jawan keeps growing! Thank you all ❤️ #JawanPrevue Out Now - https://t.co/CUWX1S7sQ4 #Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/gEz8hMgonA — Red Chillies Entertainment (@RedChilliesEnt) July 11, 2023 Top7 Most Viewed Indian Trailers [All Languages] In 24hrs: 1. #KGF2 - 106.5M 2. #Adipurush - 74M🔥 3. #RadheShyam - 57.5M❤️❤️ 4. #Jawan- 55M** 5. #RRRMovie- 51.1M 6. #TuJhoothiMainMakkaar- 50.9M 7. #Saaho - 49M 🥵💥 What are your expectations on #Salaar Trailer!?🔥🔥#Prabhas pic.twitter.com/syhJJrvDAS — Prabhas ERA™ (@Prabhas_ERA) July 11, 2023 #Jawan - 50 M Views in 24 Hours Across All Languages. (At 10 30 am)#Salaar - 83 M Views in 24 Hours. (At 5 12 am)#SRK𓃵 is a Super-Star, but #Prabhas is a madness.#SalaarCeaseFire #SalaarTeaser #JawanPrevue #JawanTrailer @hombalefilms @RedChilliesEnt @iamsrk @PrabhasRaju pic.twitter.com/vpeGqLf2WC — Akand Sitra (@AkandSitra) July 11, 2023 September Release Book My Show Interests #SALAAR With Just A Small Teaser 188.6K💥🌋 And Haqla #Jawan With Good Trailer Cut 110.6K 👎 Prabhas Ra Lucha 🦖🔥 Shahrukh Khan Gadni Egaresi Dengutam pic.twitter.com/wMWUnxXuH2 — Alex Jurrasic Park 🦖 (@PBRuless) July 11, 2023 Wikipedia page views of some Indian actors. #Jawan #Tiger3 #Leo #Salaar #Fighter pic.twitter.com/YPNKG1ajga — ᴜsᴇʀ ɪs ʜʏᴘᴇᴅ ғᴏʀ Leoᴸᶜᵁ (@JD_Jaffna) July 11, 2023 (ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ అరెస్ట్.. ఆ వీడియో వల్లే ఇదంతా) -
ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!
Jawan Trailer Review: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో షారుక్ తోపాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 'పఠాన్' లాంటి వెయ్యి కోట్ల మూవీ తర్వాత షారుక్ చేస్తున్న చిత్రమిదే. దీంతో అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఈ క్రమంలోనే 'జవాన్' అంతకు మించి ఉండబోతుందనేలా ట్రైలర్ ఉంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) 'జవాన్' కథేంటి? ట్రైలర్‌ని చాలావరకు ఎలివేషన్స్ సీన్స్‌తో నింపేశారు. కాస్త స్టోరీని మాత్రం చెప్పి చెప్పనట్లు చూపించారు. మా అంచనా ప్రకారం.. జైల్లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు(షారుక్ ఖాన్) గతంలో తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె బాధకి కారణమైన వాళ్లని చంపాలనుకుంటాడు. ఎంతకైనా తెగిస్తుంటాడు. మరోవైపు ఇతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ (నయనతార), విలన్(విజయ్ సేతుపతి) వేర్వేరుగా ప్రయత్నిస్తుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. కాపీ షాట్స్! 'జవాన్' ట్రైలర్ అంతా బాగానే ఉంది. అయితే షారుక్ ముఖానికి సగం మాస్క్ పెట్టుకున్న సీన్ 'అపరిచితుడు'లో విక్రమ్‌ని.. చిన్నపిల్లాడ్ని గాల్లో ఎత్తి పట్టుకునే సీన్ 'బాహుబలి' మొదటి భాగాన్ని.. బాడీ మొత్తాన్ని క్లాత్‌తో కప్పేసుకున్న సీన్ 'మూన్ నైట్' వెబ్ సిరీస్‌ని గుర్తుచేసింది. ట్రైలర్ లో కనిపించి అమ్మాయిల గ్యాంగ్.. విజయ్ 'బిగిల్' చిత్రాన్ని జ్ఞాపకం తెచ్చింది. చివర్లో షారుక్ గుండుతో కనిపించే సీన్ చూడగానే 'శివాజీ'లో రజినీకాంతే గుర్తొచ్చాడు. అయితే ఇవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికైతే ఓకే.. లేదంటే మొదటికే మోసపోయే అవకాశముంది. (ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) Your thoughts on Atlee getting inspiration from other movies for #JawanPrevue?#ShahRukhKhan pic.twitter.com/ZLyHki7OJn — Manobala Vijayabalan (@ManobalaV) July 10, 2023 -
జవాన్‌లో ఊహించని ట్విస్ట్.. సౌత్ ఇండియా స్టార్ హీరోను గుర్తించారా?
'పఠాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఇంటర్నెట్లో ఇది తుఫానుగా మారింది. అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్మురేపాడు. నయనతార భారీ యాక్షన్ స్టంట్స్ చూసి అభిమానులు ఫిదా అవడం ఖాయం. జవాన్ ట్రైలర్ చాలా రిచ్‌గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన టాప్ హీరోయిన్!) రెండు నిమిషాల 12 సెకన్ల ప్రివ్యూ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇందులో యాక్షన్ క్వీన్‌గా నయనతార టీజర్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. జవాన్ ప్రీవ్యూలో లేడీ సూపర్‌స్టార్ సైనికురాలిగా గ్లింప్స్ చూపించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్లో ఎంట్రీ కోసం వెయిట్ చేసిన నయనతారకు జవాన్ మంచి క్రేజ్ తీసుకురావడం ఖాయం. జవాన్‌లో సౌత్ ఇండియన్ స్టార్ హీరో జవాన్ ట్రైలర్‌ను చూసిన అభిమానులు అందులో కోలీవుడ్ హీరో దళపతి విజయ్ను గుర్తించారు. ఇందులో అతను అతిధి పాత్రలో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కొంతమంది 'జవాన్' సినిమా ఫ్యాన్స్ తమ డేగ కళ్లతో విజయ్ను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. ముఖం స్పష్టంగా లేనప్పటికీ, అతను విజయ్ కావచ్చునని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Prabhas Project-K: 'ప్రాజెక్ట్ కే' టైటిల్ ఇదేనా..?) ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా, సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో నటిస్తోంది. ప్రియామణి, సన్యా మల్హోత్రా, తమిళ నటుడు యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జవాన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ హోమ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. Is this #Thalapathy @actorvijay?#Leo | #Jawan | #JawanPrevue pic.twitter.com/AVFji2zVOs — ᴊᴜsᴛ sʀᴇᴇʀᴀᴍ (@sreeramhere_) July 10, 2023 View this post on Instagram A post shared by TeaKadai Raja (@teakadai_raja) -
జవాన్ ట్రైలర్: నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘జవాన్’. తాజాగా జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేశారు. ఇందులో షారుక్ నటన, యాక్షన్ చూసిన అభిమానులకు గూస్బంప్స్ రావడం ఖాయం. అనిరుధ్ రవించందర్ సంగీతం సినిమాకు అదనపు బలంగా మారనున్నట్లు కనిపిస్తోంది. 'ఎవరు నేను? ఎవర్నీ కాను.. తెలియదు.. తల్లికిచ్చిన మాట కావచ్చు, నెరవేరని లక్ష్యం కావచ్చు. నేను మంచివాడ్నా? చెడ్డవాడినా? పుణ్యాత్ముణ్ణా, పాపాత్ముణ్ణా నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ' అన్న ఇంట్రస్టింగ్ ఇంట్రోతో ట్రైలర్ మొదలైంది. చీరకట్టులో విలన్‌ను చిత్తు చేస్తున్న సింగంగా దీపికా, బాస్ లుక్‌లో నయనతార, విలన్‌గా విజయ్ సేతుపతి ట్రైలర్లో కొద్ది సెకన్లపాటు కనిపించి పోయారు. ఇది ఆరంభం మాత్రమే.., నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు అని హీరో నోటి నుంచి వచ్చే డైలాగులకు విజిల్స్ పడటం ఖాయం. వీడియో చివర్లో షారుక్ గుండుతో కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే పక్కా కమర్షియల్, యాక్షన్ కథాంశాల మేళవింపుగా ఉన్నట్లు కనిపిస్తోంది. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, నయనతార, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాల సందడి -
కౌంట్ డౌన్ షురూ.. షారూక్ ఖాన్ ‘జవాన్’ క్రేజీ అప్డేట్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జవాన్ ప్రివ్యూను జూలై 10న ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు షారూక్ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) అయితే ఈ సినిమాను ఎలా ఉండబోతుంది? అసలు షారూక్ ఖాన్ స్టార్ డమ్‌ను అట్లీ ఎలా చూపించబోతున్నారు? అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాతో పాటు కౌంట్ డౌన్లో అందరూ భాగస్వామ్యం కావాలని మేకర్స్ ప్రకటించారు. కాగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మాతగా.. జవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్) मैं पुण्य हूँ या पाप हूँ?... मैं भी आप हूँ... Main punya hoon ya paap hoon?... Main bhi aap hoon…#JawanPrevueOn10July#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/GI3RqgVGqr — Shah Rukh Khan (@iamsrk) July 8, 2023 -
నయనతార అందగత్తె, స్వీట్ పర్సన్ : షారుక్ ఖాన్
నయనతార అందమైన నటి. ఈ మాట అన్నది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. పఠాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈయన తాజాగా జవాన్ చిత్రంతో తెరపైకి రావడానికి ముస్తాబ్ అవుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించగా నటుడు విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చదవండి: విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్ ఈ సందర్భంగా షారుక్ ఖాన్ జవాన్ చిత్ర విడుదల తేదీని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆయన ఆన్లైన్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తూ జవాన్ పక్క కమర్షియల్ అంచాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటి నయనతారతో కలిసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఆమె చాలా అందగత్తె అనీ, స్వీటీ అని పేర్కొన్నారు. నటుడు విజయశాంతి చాలా ప్రతిభావంతుడని, చాలా ఒదిగి ఉండే నటుడు అనీ, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని అన్నారు. నటుడు అఖిల్ గురించి చెప్పాలంటే ఆయన తనను రెండు విధాలుగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అట్లీ సంగీత దర్శకుడు కలిసి తనను ఈ చిత్రంలోని పాటల్లో కొన్ని పదాలను పాడించారని చెప్పారు. చదవండి: ఆ బాలీవుడ్ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్ -
ఆదిపురుష్ కు లైన్ క్లియర్... ప్రభాస్ ఫాన్స్ కు పండగే
-
స్టార్ హీరో సినిమాకు బన్నీ నో చెప్పేశాడా?.. కారణం అదేనా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మూవీ భారీ హిట్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. అయితే గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని అప్పట్లో ఓ వార్త తెగ వైరలైంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ జవాన్‌లో ప్రత్యేక పాత్రలో బన్నీ నటిస్తారని అందరూ భావించారు. అల్లు అర్జున్ నటిస్తే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ అభిమానులకు దగ్గర కావొచ్చని అట్లీ ప్లాన్ చేశారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా బన్నీ జవాన్‌లో నటించేందుకు ఒప్పుకోలేదని ఓ వార్త వైరలవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. పుష్ప-2 షూటింగ్ బిజీ షెడ్యూల్ వల్లే జవాన్‌లో అతిథి పాత్రకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో పుష్ప-2 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. చదవండి: జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..! -
షారుక్ సినిమాలో బన్నీ, సల్మాన్ మూవీలో చరణ్..
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో రామ్, భీమ్ చేసిన, హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు. అందుకే దేశంలో ఉన్న మిగతా దర్శకులు ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్‌కు వచ్చే ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్లోకి బన్నీని ఆహ్వానించడం ఈ ట్రెండ్‌లో భాగమే.. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పఠాన్‌లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ పార్ట్‌లో ఇద్దరు ఖాన్స్లు కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను జవాన్‌కు అప్లై చేస్తానంటున్నాడు అట్లీ. అందుకోసం బన్నీని రంగంలోకి దిగమంటున్నాడు. నిజానికి ఈ రోల్ గతంలో విజయ్ దగ్గరికి వెళ్లింది. విజయ్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇప్పుడు బన్నీని అడుగుతున్నాడు అట్లీ. స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కొద్ది నిమిషాల పాటు కనిపించే ట్రెండ్ పాతదే! కాని ఇప్పుడు లేటెస్ట్గా, సరికొత్తగా తీసుకొస్తున్నారు దర్శకులు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ , కిసీ కా జాన్ చిత్రంలోనూ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ మూవీలో ఒక పాటలో రామ్ చరణ్ కొన్ని నిమిషాలు కనిపించబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్‌లో ప్రభాస్ నటించే చిత్రంలో హృతిక్ రోషన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొత్తంగా పాన్ ఇండియా మూవీస్‌ను ఈ గెస్ట్ అప్పీయరెన్సెస్ ట్రెండ్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుందని చెప్పవచ్చు. చదవండి: గ్రాండ్‌గా రిలీజ్.. మొదటిరోజే వన్ ప్లస్ ఆఫర్.. మరీ ఇంత ఘోరమా? సింపుల్‌గా ఉపాసన సీమంతం -
జవాన్‌లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా. ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్లో జవాన్ షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. జవాన్‌లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. -
స్టార్ హీరోకు ముద్దు పెట్టిన నయనతార..వీడియో వైరల్!
పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ షూటింగ్లో పాల్గొన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్ఆర్కే మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు. జవాన్‌లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది. The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP — Samina ✨ (@SRKsSamina_) February 11, 2023 1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭 Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸 We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023 -
నయనతారను పొగిడిన షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం పఠాన్. ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కొద్దికాలంగా సక్సెస్ లేక కళ తప్పిన బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న జవాన్ చిత్రంపై పఠాన్ ప్రభావం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం, సంచలన నటి నయనతార హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు అట్లీతో పాటు నయనతారకి బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే. జవాన్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షారుక్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నయనతార గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు షారుక్ ఖాన్ బదిలిస్తూ ఆమె సో స్వీట్ అని పేర్కొన్నారు. ఆమెకు అనేక భాషలు తెలుసని జవాన్ చిత్రంలో నయనతారతో కలిసి నటించడం మంచి అనుభవమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆమె నటన అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి, నటి ప్రియమణి, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించడం విశేషం. ఇకపోతే జవాన్ నయనతార, దర్శకుడు అట్లిల బాలీవుడ్ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. నయనతార ప్రస్తుతం తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. Yes he is too sweet and Masha Allah healthy https://t.co/2Gz7aEj4Ov — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 చదవండి: చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం