షారుఖ్‌ ఖాన్‌తో ఫొటో.. బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు..: గంభీర్‌ పోస్ట్‌ వైరల్‌ | Gambhir Shares Pic With SRK, Says He Is Not Just King Of Bollywood But The King Of Hearts - Sakshi
Sakshi News home page

Gambhir-SRK Viral Photo: షారుఖ్‌ ఖాన్‌తో ఫొటో.. బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు..: గంభీర్‌ పోస్ట్‌ వైరల్‌

Published Thu, Sep 21 2023 1:16 PM | Last Updated on Thu, Sep 21 2023 1:40 PM

He Is Not Just King Of Bollywood King Of Hearts: Gambhir Shares Pic With SRK - Sakshi

షారుఖ్‌ ఖాన్‌తో గౌతం గంభీర్‌ (PC: Gambhir)

Gautam Gambhir shares a picture with Shah Rukh Khan: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2011 ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని భారత జట్టు 28 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్‌ గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇక గంభీర్‌ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్‌ కూడా ఉంది.

ఐపీఎల్‌లో సత్తా చాటిన గంభీర్‌
2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ధోని సేనలో కూడా గౌతీ సభ్యుడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులతో అదరగొట్టాడు. ఇక టీమిండియాతో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ గంభీర్‌ సత్తా చాటిన విషయం తెలిసిందే.

కేకేఆర్‌ను రెండుసార్లు విజేతగా నిలిపి
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ అందించాడు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ సహ యజమానిగా ఉన్న కేకేఆర్‌ను రెండుసార్లు విజేతగా నిలిపి సత్తా చాటాడు. ఆ తర్వాత కేకేఆర్‌ను వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోయిన గంభీర్‌.. 2018లో తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు.

షారుఖ్‌ ఖాన్‌తో గంభీర్‌ ఫొటో
ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా పనిచేస్తున్న గంభీర్‌.. ఢిల్లీ బీజేపీ ఎంపీ కూడా అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేకేఆర్‌ను వీడినా షారుఖ్‌తో గంభీర్‌ అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఈ మాజీ ఓపెనర్‌ షేర్‌ చేసిన ఫొటో ఇందుకు నిదర్శనం.

బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు
‘‘ఇతడు కేవలం బాలీవుడ్‌ కింగ్‌ మాత్రమే కాదు.. హృదయాలు కొల్లగొట్టే రారాజు. మేము ఎప్పుడు కలిసినా సరే... నేనైతే అంతులేని ప్రేమ.. గౌరవం మూటగట్టుకుని వెళ్తాను. మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు బెస్ట్‌ అంతే’’ అంటూ రెడ్‌ హార్ట్‌ సింబల్స్‌తో షారుఖ్‌పై ప్రేమను చాటుకున్నాడు గంభీర్‌. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

జవాన్‌ సక్సెస్‌ సంబరంలో షారుఖ్‌
కాగా షారుఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం జవాన్‌ సినిమా సక్సెన్‌ను ఆస్వాదిస్తున్నాడు. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కీలక పాత్రలో నటించారు. హిట్‌టాక్‌తో వందల కోట్ల కొద్దీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను చేస్తోంది జవాన్‌. పఠాన్‌ తర్వాత మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సంబరంలో మునిగిపోయిన కింగ్‌ ఖాన్‌ను గంభీర్‌ తాజాగా కలిశాడు.

చదవండి: ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement