సర్కస్‌ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం | IPL 2025: Vishnu Vishal Slams MS Dhoni For Batting At Last In CSK Vs KKR Match | Sakshi
Sakshi News home page

చివర్లో రావాలా.. దారుణమిది.. సర్కస్‌లానే ఉంది.. ధోనిపై హీరో సెటైర్లు

Published Sat, Apr 12 2025 7:26 AM | Last Updated on Sat, Apr 12 2025 8:59 AM

IPL 2025: Vishnu Vishal Slams MS Dhoni For Batting At Last In CSK Vs KKR Match

ధోని కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టినా సీఎస్‌కే తీరు ఏమీ మారలేదు. వరుసగా ఐదోసారి పరాజయం పొందింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయం సాధించింది. శుక్రవారం జరిగిన చెన్నై వర్సెస్‌ కోల్‌కతా మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కేవలం నాలగు బంతులు మాత్రమే ఎదుర్కొని సింగిల్‌ రన్‌ తీసి అవుట్‌ అయ్యాడు. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 

దారుణం..
టీమ్‌ను గెలిపించేందుకు టాప్‌ ఆర్డర్‌లో రావాల్సింది పోయి చివర్లో వస్తాడేంటని సోషల్‌ మీడియాలో పలువురూ విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal) సైతం ధోని తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం దారుణమని మండిపడ్డాడు. ఎవరైనా గెలవకూడదని ఆడతారా? అని ప్రశ్నించాడు. ఇదంతా సర్కస్‌లా ఉందని.. స్పోర్ట్స్‌ కంటే ఏ వ్యక్తి కూడా గొప్పవారు కాదంటూ ట్వీట్‌ చేశాడు. 

కరెక్ట్‌గా చెప్పావ్‌..
ఇది చూసిన నెటిజన్లు కరెక్ట్‌గా చెప్పావ్‌.. ధోని (MS Dhoni) మరీ 9వ స్థానంలో రావడం ఏంటో.. ఆయన హుందాగా రిటైర్‌మెంట్‌ తీసుకుంటే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఎవరైనా గెలవడానికే ప్రయత్నిస్తారు. తమ టీమ్‌ ఓడిపోవాలని ఏ ఆటగాడు కోరుకోరు. అందరిలాగే తనూ తన పని చేస్తున్నాడు. ఎందుకని అందరు ఆయనపై  పడి ఏడుస్తున్నారు? అని అభిమానులు ధోనిని వెనకేసుకొస్తున్నారు.

అప్పట్లో 'తలా' రేంజే వేరు
ఇప్పుడంటే ధోనికి బ్యాడ్‌ టైం నడుస్తోంది కానీ ఒకప్పుడు ఆయన రేంజే వేరే. అప్పట్లో ధోని క్రీజులో అడుగుపెడితే బాల్స్‌ బౌండరీలు దాటాల్సిందే.. ట్రోఫీలు చెన్నై హస్తగతం కావాల్సిందే! తలా నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీలు అందుకుంది. అంతేకాదు, తన జట్టును పదిసార్లు ఫైనల్స్‌ దాకా చేర్చాడు. విష్ణు విశాల్‌ విషయానికి వస్తే ఆయన చివరగా లాల్‌ సలాం సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం తమిళంలో మఘడు సినిమాలు చేస్తున్నాడు.

 

 

చదవండి: మిస్టర్‌ హౌస్‌కీపింగ్‌ రివ్యూ.. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement