ప్రముఖ నటుడు తలైవాసల్ విజయ్ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. తమిళనాడు క్రికెటర్ అపరాజిత్‌తో విజయ్ కూతురు జయవీణ ఏడడుగులు నడిచింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం వీరి వివాహం జరిగింది. కొద్ది నెలల క్రితమే వీరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా నేడు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలోనూ అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పెళ్లికూతురు జయవీణ విషయానికి వస్తే.. ఆమె కూడా క్రీడాకారిణి. స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. పెళ్లికొడుకు బాబా అపరాజిత్ క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. 2012లో జూనియర్ వరల్డ్ కప్‌లో పాల్గొన్న అతడు 2013లో దులీప్ ట్రోఫీలో రెండు సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం అతడు చెపాక్ సూపర్ గిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి లవ్ స్టోరీకి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధికారికంగా ఈ పెళ్లి జరిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నటుడు విజయ్ విషయానికి వస్తే.. ఈయన తలైవాసి చిత్రంతో 1992లో వెండితెరపై అరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అలా ఆయన పేరు తలైవాసి విజయ్‌గా స్థిపరడిపోయింది. 30 ఏళ్ల కెరీర్‌లో 260కు పైగా చిత్రాలు చేశారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఎందరో నటులకు తన గొంతు అరువిచ్చాడు.
చదవండి: 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు!
Comments
Please login to add a commentAdd a comment