కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్‌లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్(5), చెన్నై సూపర్ కింగ్స్(5) తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్‌కతా(కేకేఆర్).. ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్-2024 విజేతగా అవతరించింది.
ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం విశేషం.
అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానంలో
ఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటార్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.
కేకేఆర్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ కేకేఆర్ మెంటార్‌గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.
కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలిస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతాకు ఆడిన ఈ కేప్‌టౌన్ స్టార్.. 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం ఎత్తాడు.
అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్‌గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్ నియమితుడయ్యాడు.
ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్ కలిస్‌తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ స్థానంలో కలిస్‌ను తమ మెంటార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.
చదవండి: హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment