టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
గంభీర్ వైపే మొగ్గు
ఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.
ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్!
ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.
ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు.
అయితే, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment