team india head coach
-
రాహుల్ ద్రవిడ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్‌కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్ రోడ్) రాహుల్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.In #Bengaluru: A video of former India cricket captain and coach Rahul Dravid getting into an argument with an autodriver on Cunningham Road after a minor collision surfaced on Tuesday evening. No one was injured. pic.twitter.com/0tAtoqQk96— TOI Bengaluru (@TOIBengaluru) February 4, 2025ఈ ప్రమాదంలో రాహుల్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ద్రవిడ్.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శించాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ద్రవిడ్ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్.. తన 16 ఏళ్ల కెరీర్లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్ ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే, ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉండగా భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌కు అదే చివరి టోర్నమెంట్. టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రీ జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్ సూచనలతో రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
గౌతమ్ గంభీర్‌పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్‌పై టెస్ట్, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. -
ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 104 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది.46 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ ఓటమి ఖరారైనా ట్రవిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47) కొద్దిసేపు పోరాడారు.తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.స్వదేశానికి గంభీర్తొలి టెస్ట్‌లో ఘన విజయం అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత గంభీర్ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను బీసీసీఐ వద్ద అనుమతులు కూడా తీసుకున్నట్లు సమాచారం. గంభీర్.. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ సమయానికి తిరిగి జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ మధ్యలో భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కాన్బెర్రా వేదికగా నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్‌ను కూడా పింక్ బాల్తోనే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో హిట్‌మ్యాన్ తొలి టెస్ట్‌కు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియాకు విందుభారత క్రికెట్ జట్టు బుధవారం రోజున కాన్‌బెర్రాకు బయల్దేరనుంది. ఆ రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వచ్చినందుకు గానూ భారత ఆటగాళ్లకు ఇది వెల్కమ్ పార్టీ. -
టీమిండియా తదుపరి హెడ్‌కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్‌లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్‌వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో నంబర్లో బ్యాటింగ్‌కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్‌గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్‌లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్‌కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
సౌతాఫ్రికాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్లు క్లాష్ కానున్న నేపథ్యంలో టీమిండియాకు ఇద్దరు హెడ్ కోచ్‌లు అవసరమయ్యారు. తొలుత టీమిండియా షెడ్యూల్లో సౌతాఫ్రికా టీ20 సిరీస్ లేదు. ఈ మధ్యలో క్రికెట్ సౌతాఫ్రికా విన్నపం మేరకు బీసీసీఐ ఈ సిరీస్‌కు ఒప్పుకుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్ నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో జరుగనుండగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10 లేదా 11 తేదీల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ సపోర్టింగ్ స్టాఫ్‌గా ఎన్సీఏ సభ్యులు సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, సుబదీప్ ఘోష్ ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నీలో టీమిండియా కోచింగ్ సభ్యులుగా వ్యవహరించారు.కాగా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత బృందాన్ని అక్టోబర్ 25న ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి సభ్యులెవరికీ ఈ జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు నవంబర్ 4న బయల్దేరి వెళ్లనుంది.సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్ , యష్ దయాళ్ -
గంభీర్ ఎదుర్కొన్న ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ముగ్గురికి చోటు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాను ఎదుర్కొన్న ఆల్‌టైమ్ వరల్డ్ బెస్ట్ టీమ్ వివరాలను స్పోర్ట్స్‌కీడాతో పంచుకున్నాడు. ఈ టీమ్‌లో గంభీర్ ఆసక్తికరంగా ముగ్గురు పాకిస్తానీ మాజీలకు చోటిచ్చాడు. అలాగే ముగ్గురు ఆసీస్ మాజీలకు, ఇద్దరు సౌతాఫ్రికా మాజీలకు, విండీస్, ఇంగ్లండ్, శ్రీలంక నుంచి చెరో మాజీకి చోటిచ్చాడు. ఈ జట్టులో గంభీర్ తన జమానాలో కఠినమైన ప్రత్యర్థులైన రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌కు చోటివ్వకపోవడం విశేషం. గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్థి టీమ్‌లో ప్రస్తుత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా చోటివ్వడం మరో విశేషం.గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లుగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్లను ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో ఏబీ డివిలియర్స్, నాలుగో స్థానంలో బ్రియాన్ లారా, ఐదో ప్లేస్‌లో ఇంజమామ్ ఉల్ హాక్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో గంభీర్ ఆసక్తికరంగా పాక్ మాజీ అబ్దుల్ రజాక్‌కు చోటిచ్చాడు. మిగతా ఇద్దరు ఆల్రౌండర్లుగా ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆండ్రూ సైమండ్స్‌లను ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీథరన్‌కు అవకాశం ఇచ్చిన గంభీర్.. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్‌గా షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేశాడు. గంభీర్ తన జట్టులో ముగ్గురు కెప్టెన్లుగా పని చేసిన వారిని ఎంపిక చేసినప్పటికీ ఎవ్వరికీ ఆ హోదా ఇవ్వలేదు. గంభీర్ తన ప్రత్యర్ధి జట్టులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా చోటివ్వలేదు.గంభీర్ వరల్డ్ ఎలెవన్: ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్-ఉల్-హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ముత్తయ్య మురళీధరన్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. అధికారిక ప్రకటన
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ఆహ్వానిస్తున్నట్లు షా ట్విటర్లో పేర్కొన్నారు. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ— Jay Shah (@JayShah) July 9, 2024కాగా, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్ అనంతరం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేయబడ్డాడు. గంభీర్ త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ప్రధానంగా వినిపించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బీసీసీఐ ఇవాళ గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టనుండటంతో కేకేఆర్ మెంటార్షిప్కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేకేఆర్ గంభీర్ స్థానాన్ని రాహుల్ ద్రవిడ్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు గంభీర్ బీసీసీఐ ముందు ఓ షరతు పెట్టినట్లు ప్రచారం జరిగింది. తన సహాయ సిబ్బంది (కోచింగ్ స్టాఫ్) ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్‌గా జాంటీ రోడ్స్ (ఫీల్డింగ్ కోచ్), అభిషేక్ నాయర్‌ను (అసిస్టెంట్ కోచ్) ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. -
BCCI: గంభీర్ మనసులో ఏముంది?.. ఆలస్యానికి కారణం ఇదే
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్‌కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్?అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్‌గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.కాగా రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.అదే విధంగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.చదవండి: BCCI: రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం! -
శ్రీలంక సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త కోచ్.. రేసులో ఇద్దరు..!
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్మెంట్ను బట్టి తెలుస్తుంది. భారత్ హెడ్ కోచ్ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్‌తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్) భారత హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కొత్త హెడ్ కోచ్ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్ పెర్పార్మెన్స్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను ఇదివరకే ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. -
T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్‌గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?
టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది. కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్‌ను జింబాబ్వే పర్యటనకు హెడ్‌కోచ్‌గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
BCCI: గంభీర్‌తో పోటాపోటీ.. రామన్ ట్వీట్ వైరల్
భారత పురుషుల క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు. ఈ పదవి కోసం మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడని.. అతడి నియామకం దాదాపుగా ఖరారైపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే, మంగళవారం నాటి ఇంటర్వ్యూ నేపథ్యంలో రేసులోకి కొత్త పేరు దూసుకువచ్చింది. డబ్ల్యూవీ రామన్ సైతం ప్రధాన కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న విషయం బయటకు వచ్చింది.సీఏసీని ఇంప్రెస్ చేసింది ఎవరు?గంభీర్‌తో పాటు రామన్ కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్లైన్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత జట్టు కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తానని, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ కమిటీకి తెలిపాడు.సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా రామన్ సైతం తన ప్రణాళిక గురించి వివరించినట్లు సమాచారం. అయితే, గంభీర్ కంటే కూడా రామన్ ఇచ్చిన ప్రజెంటేషన్ సీఏసీకి ఎక్కువగా నచ్చినట్లు సమాచారం.ఈ క్రమంలో బుధవారం నాటి సెకండ్ రౌండ్ తర్వాత కమిటి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రామన్ ట్వీట్ వైరల్‘‘ఓ డియర్!!’’ అంటూ నిరాశలో కూరుకుపోక తప్పదన్న అర్థం వచ్చేలా రామన్ పోస్ట్ పెట్టాడు. అయితే, అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గంభీర్ వైపే బోర్డు మొగ్గు చూపుతుందే కాబట్టి రామన్ ఇలా ట్వీట్ చేశాడా? లేదంటే గంభీర్ కంటే తానే బెటర్ అని చెప్తున్నాడా అని బుర్రకు పదునుపెడతున్నారు. ఇక హెడ్ కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలు తప్పవు.ద్రవిడ్ తర్వాతకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్-2024 తర్వాత తప్పుకోనున్నాడు. ఈ మెగా టోర్నీలో అమెరికాలో లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత తర్వాత భారత జట్టు తదుపరి జింబాబ్వేతో సిరీస్ ఆడనుంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు -
టీమిండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు
టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన తరుణంలో రేసులోకి కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్‌తో పాటు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఇవాళ (జూన్ 18) గంభీర్‌తో పాటు రామన్‌ను కూడా ఇంటర్వ్యూ చేసిందని సమాచారం. CAC ముందు రామన్ ఇన్ పర్సన్ హాజరయ్యారని.. గంభీర్ వర్చువల్‌గా హాజరయ్యాడని బీసీసీఐ వర్గాల సమాచారం.భారత హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్, రామన్‌తో పాటు మరో వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ విదేశీ మాజీ క్రికెటర్ గంభీర్, రామన్‌లకు పోటీగా దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తుంది. CAC సదరు విదేశీ మాజీని రేపు ఇంటర్వ్యూ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. CAC ఎంత మందిని ఇంటర్వ్యూ చేసినా మరో 48 గంటల్లో భారత తదుపరి హెడ్ కోచ్ పేరును ప్రకటించాలని బీసీసీఐ డెడ్‌లైన్ పెట్టుకున్నట్లు సమాచారం. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకోలేదు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు యూఎస్ఏ సూపర్-8కు అర్హత సాధించగా, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ , గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ , వెస్టిండీస్, గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా , బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్‌కు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్‌ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్‌తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్‌గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్
భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మే 27తో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఎవరెవరు పోటీలో ఉన్నారు? అనే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం గంభీర్‌కు హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదని పేర్కొంటున్నాయి. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపిన తర్వాత గంభీర్ వరుస కార్యక్రమాలతో బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అబుదాబిలోని మెడియర్ ఆసుపత్రిలో విద్యార్థులతో గౌతీ ఇంటరాక్టయ్యాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ పదవిపై తన అభిప్రాయాలను చెప్పమని గౌతీని విద్యార్థులు ప్రశ్నించారు. జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. "భారత జట్టు హెడ్‌కోచ్ పనిచేసేందుకు నేను ఇష్టపడతాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. మేము దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఆడుతాము. అంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుందని" గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC: సునీల్ గవాస్కర్‌ను కలిసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్ -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024తో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్‌కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేటను మొదులెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ధరఖాస్తులను సైతం బీసీసీఐ అహ్హనించింది. హెడ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంటలతో గడువు ముగియునుంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌కోచ్ పదవికి ధరఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని బీసీసీఐతో గంభీర్ చెప్పినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుత సమాచారం ప్రకారం ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చెపట్టడం దాదాపు ఖాయమన్పిస్తోంది. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్‌రైజర్స్ ముందుకు -
భారత హెడ్‌కోచ్ సెలక్షన్.. అతడిని ఒప్పించే బాధ్యత ధోనీదే!
టీమిండియా హెడ్ కోచ్ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను అహ్హనించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా పలు దిగ్గజాలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలను ఎలాగైనా ఫ్లెమింగ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతలు చెపట్టేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలతో కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. అయితే జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనే వంటి ఇతర అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఒప్పించడంపై బోర్డు ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."భారత హెడ్‌కోచ్ పదవి కోసం స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను బీసీసీఐ సంప్రదించింది. అందుకు ఫ్లెమింగ్ నో చెప్పలేదు. కానీ అతడు ఫ్రాంచైజీలతో తన కాంట్రాక్ట్ పదవీకాలం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కూడా తొలుత భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ అతడిని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్యతను ఎంఎస్ ధోనికి అప్పగించారు. ఎందుకంటే స్టీఫెన్‌తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయని" ఓ బీసీసీఐ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌గా ఉండాలని గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్‌తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్‌గా పనిచేయనప్పటికి మెంటార్‌గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్‌తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌కు రెండు సార్లు టైటిల్‌ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
టీమిండియా హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది.. ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా బీసీసీఐ నిర్ణయించింది. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.అతడి నేతృత్వంలోనే సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించాలి.అదే విధంగా ఏడాదికి 10 నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి. ఒకవేళ ఫ్లెమింగ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడితే సీఎస్కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హెడ్ కోచ్ రేసులో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
కోచ్‌గా ద్రవిడ్ ట్రాక్ రికార్డు ఇలా.. అయినా..!
టీమిండియా హెడ్ కోచ్‌గా బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్‌నే కొనసాగించింది. ద్రవిడ్‌తో పాటు విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ మళ్లీ పొడిగించింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ కోచింగ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు సుముఖంగా లేనప్పటికీ బీసీసీఐ ప్రాధేయపడి అతన్ని ఒప్పించినట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడంపై పలువురు భారత క్రికెట్ అభిమానులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా వరుస వైఫల్యాలు చెందిన వ్యక్తిని మళ్లీ ఎందుకు నియమించారంటూ మండిపడుతున్నారు. కోచ్‌గా ద్రవిడ్ ట్రాక్ రికార్డు ఇలా..! రాహుల్ ద్రవిడ్ 2021 నవంబర్ 17నుంచి తొలి సారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ల పదవీ కాలాన్ని అతనికి బోర్డు నిర్దేశించింది. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న సీనియర్ ఆటగాళ్లతో పాటు అంతకు ముందు వరకు ద్రవిడ్ కోచింగ్‌లో అండర్–19, భారత్ ‘ఎ’ జట్లకు ఆడిన ఆటగాళ్లు చాలా మంది జట్టులో ఉండటంతో కోచింగ్‌లో ద్రవిడ్ పని సులువైంది. అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. అయితే మూడు అవకాశాలు లభించినా ఒక్క సారి కూడా ఐసీసీ టోర్నీని మాత్రం గెలవలేకపోయింది. 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్, 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. అయితే ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించింది. ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. రెండో సారి కోచ్‌గా ఇప్పుడు ద్రవిడ్ బాధ్యతలు డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో మొదలవుతాయి. ఈ టూర్లో 3 టి20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడుతుంది. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని రికార్డు భారత్‌కు ఉంది. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. -
కాంట్రాక్ట్ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ అతడే..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. 2021 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ భారత జట్టు కోచింగ్ పదవికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన అనంతరం కోచ్‌గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. ద్రవిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ప్రస్తుత ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ పలు సిరీస్‌ల్లో టీమిండియా కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్‌గా ట్రాన్స్ఫర్ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ ఓ ఐపీఎల్ జట్టుతో జత కట్టనున్నాడని టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్ దిగిపోతే టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
ద్రవిడ్‌ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్‌కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు స్టాండ్ ఇన్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్‌తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్‌నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్‌లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్ దిగ్గజం
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. ‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన. ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. -
'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే తొలగించండి'
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లిలకు విశ్రాంతినివ్వడం ఏంటని తప్పబట్టారు. పనిలో పనిగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా అభిమానులు ఒక రౌండ్ వేసుకున్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి రావడం లేదని.. ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అదే ప్రొటిస్ జట్టుకు వన్డే సిరీస్‌ను కూడా అప్పగించింది. అటుపై ఆసియా కప్‌ను నెగ్గడంలో విఫలమైన టీమిండియా టి20 వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోనే చేతులెత్తేసింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను నెగ్గినా వన్డే సిరీస్‌ను.. ఆ తర్వాత జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ ఫైనల్ 2023)లో ఆసీస్ చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం ఆసక్తి కలిగించింది. ఈ లెక్కన టీమిండియా ద్రవిడ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా ఓడిన సిరీస్‌లు ► బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ► సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ► ఆసియా కప్‌లో ఓటమి ► టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి ► స్వదేశంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి ► డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ద్రవిడ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ''సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రవిడ్‌ను తొలగించండి'' అని ఓ నెటిజన్ కోరారు. అయితే ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఆసియా కప్, ఆ తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని సమర్థించుకోవడం ఆసక్తి రేపింది. declared innings when sachin was batting on 194 now resting kohli in every other series when he's in red hot form many problems , one solution#SackDravid pic.twitter.com/ptfyTCTECb — flick (@onlykohly) July 29, 2023 Now ive become death, the destroyer of Indian Cricket team with my politics.#sackdravid💔 pic.twitter.com/oaNSKfy83q — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨𝐂𝐒𝐊 (@SergioCSKK) July 29, 2023 Rahul Dravid as a coach : - lost odi series against ban - lost test series against sa - lost odi series aginst sa - lost asia cup - lost 2022 T20 wc - lost ODI series against aus - lost WTC final - lost ODI Agaisnt WI who didn't qualify for Wc Dravid Destroyed ICT #SackDravid pic.twitter.com/T6Zx8a6KMk — Laksh Sharma (@im_laksh_18) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: వరల్డ్‌కప్ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది? Carlos Alcaraz: సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా -
టీమిండియా హెడ్ కోచ్‌గా ముజుందార్!
భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి కోసం ముందు వరుసలో ముంబై జట్టు భారత మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత డిసెంబర్లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. కాగా ముజుందార్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ముజుందార్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్ 2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు. హెడ్‌కోచ్ పదవికి అర్హతలు బీసీసీఐ హెడ్‌కోచ్ పదవికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు. అభ్యర్థి తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ లేదా మరేదైనా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా కనీసం ఎన్సీఏ స్థాయి ‘C’ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక టీమ్‌ను లీడ్ చేయనున్నాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ, తన స్వయం కృషితో సారధిగా నియమించబడ్డాడు. రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్.. 2019-20 సీజన్లో అండర్-14 క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా అన్న తరహాలోనే రాణించి, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అన్వయ్ కూడా తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనికి ముందు టీమిండియాకు సమర్ధవంతుడైన రెగ్యులర్ వికెట్‌కీపర్ లేకపోవడంతో ద్రవిడ్ చాన్నాళ్ల పాటు వికెట్‌కీపింగ్ భారాన్ని మోసాడు. ధోని రాకతో ద్రవిడ్ బ్యాటింగ్‌పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ద్రవిడ్ కోచింగ్‌లో భారత్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అతని ఆధ్వర్యంలో టీమిండియా.. న్యూజిలాండ్‌ను తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఓడించి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జనవరి 21న రాయ్‌పూర్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆసియాకప్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో అతడికి నెగిటివ్‌గా నిర్థారణైంది. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 28) దుబాయ్ వేదికగా జరగనున్న దాయాదుల పోరుకు ముందు ద్రవిడ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు దృవీకరించారు. రాహుల్‌కు నిర్వహించన తాజా టెస్టులో నెగిటివ్‌గా తేలింది. అతడు యూఏఈ వెళ్లడానికి సిద్దంగా ఉన్నాడు" అని అతడు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ద్రవిడ్ తిరిగి జట్టుతో కలవడం భారత శిభరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. కాగా ద్రవిడ్ కరోనా బారిన పడడంతో భారత తాత్కలిక హెడ్ కోచ్‌గా వీవీయస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Pak- Virat Kohli: నాడు ఓపెనర్లు డకౌట్... మిగతా వాళ్లంతా విఫలం.. కోహ్లి ఒక్కడే! ఇప్పుడు కూడా! -
IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..?
సౌతాంప్టన్ వేదికగా జులై 7న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన (జులై 5) రోజు గ్యాప్‌లోనే తొలి టీ20 జరుగనుండటంతో రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కు లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్ష్మణ్.. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనలో తొలిసారి టీమిండియా (హార్ధిక్ సేన) హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు కోచ్‌తో పాటు సీనియర్ సభ్యులు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ద్రవిడ్‌తో పాటు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైన వీరందరికి కూడా విశ్రాంతినిచ్చేందకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఇదివరకే జట్లను కూడా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జట్టులో చేరితే రుతురాజ్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకోనున్నారు. తొలి మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 2, 3 టీ20లకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవి జడేజా, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ మూడు టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, లియమ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమాల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, ఫిల్ సాల్ట్ చదవండి: IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా? -
"అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"
జూలై1న ప్రారంభం కానున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకురులతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. భారత స్టా్ర్ ఆటగాడు విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి చాలా మంది భారత ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చాడని ద్రవిడ్ కొనియాడాడు. ఇంత అంకితభావంతో పనిచేసే ఆటగాడిని తాను ఇంతవరకూ చూడలేదని ద్రవిడ్ తెలిపాడు. అదే విధంగా కోహ్లి సెంచరీలు సాధించకపోయినా పర్వాలేదు, అతడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడితే చాలు అని ద్రవిడ్ అన్నాడు. "కోహ్లి ఫామ్‌లో లేడు అని వస్తున్న విమర్శలను నేను విభేదిస్తున్నాను. ఎందుకంటే కోహ్లి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిన విధానం అద్భుతమైనది. అతడికి ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు. కోహ్లి సెంచరీలు సాధిస్తానే ఫామ్‌లో ఉన్నట్లు కాదు. అతడు సెంచరీలు సాధించాల్సిన అవసరం లేదు..మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తే మాకు చాలు. ఇక డ్రెసింగ్ రూమ్‌లో ఎంతో మంది ఆటగాళ్లకు కోహ్లి ఆదర్శంగా నిలిచాడు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..! -
బీజేపీ మీటింగ్‌కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓ రాజకీయ పార్టీ మీటింగ్‌కు హాజరవుతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో జరుగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్ ద్రవిడ్ పాల్గొనబోతున్నాడని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే విశాల్ నహేరియా మంగళవారం ప్రకటించాడు. దీంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలో నెట్టింట వైరల్‌గా మారింది. ద్రవిడ్ లాంటి సౌమ్యమైన వ్యక్తి రాజకీయ పార్టీ మీటింగ్‌లో పాల్గొంటున్నాడా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ద వాల్ తాజాగా స్పందించాడు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. బీజేపీ మీటింగ్‌లో పాల్గొనబోతున్నాడన్న వార్తను ఖండించాడు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్ ద్రవిడ్ పాల్గొనబోతున్నాడని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ద్రవిడ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్‌తో టి20 సిరీస్.. టి20 ప్రపంచకప్ 2022 లక్ష్యంగా! -
ద్రవిడ్ రూటే సెపరేటు! గ్రౌండ్స్‌మెన్‌కు రూ.35 వేలు.. కారణం
ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుంది అంటే పిచ్ మన బౌలర్లకు అనూకూలంగా తయారు చేయడం సహజం. కానీ రాహుల్ ద్రవిడ్ రూటు మాత్రం సెపరేటు. టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి తనమార్క్ కోచ్ అంటే ఏంటో చూపిస్తూ వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య ముగిసిన తొలి టెస్టు గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. చదవండి: Rahane-Dravid: రహానే ఫామ్‌పై ఆందోళన వ్యర్థం: ద్రవిడ్ కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టుకు స్పోర్టింగ్ పిచ్ తయారు చేయాలంటూ గ్రౌండ్ మేనేజ్మెంట్ను కోరినట్లు తెలిసింది. అందుకు ద్రవిడ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి రూ.35 వేలు గ్రీన్‌పార్క్ గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యుపీసీఏ) మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ద్రవిడ్‌పైన ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ యూపీ క్రికెట్ తెలిపింది. ద్రవిడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆట ఫెయిర్‌గా.. స్పోర్టివ్‌గా ఉండాలని భావించేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా ద్రవిడ్‌లో అదే తీరు కనబడిందని.. పిచ్ తమకు అనుకూలంగా కాకుండా స్పోర్టింగ్ పిచ్‌ను తయారు చేయమని చెప్పడం ఒక్క ద్రవిడ్‌కు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం ద్రవిడ్ చేసిన పని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. '' మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న బాధ కంటే ద్రవిడ్ చేసిన పని ఆనందం కలిగించింది.. ఎంతైనా కోచ్‌గా ద్రవిడ్ రూటే సెపరేటు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rachin-Ajaz Patel: రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్‌తో బంధం -
హెడ్‌కోచ్‌గా ఆఫర్.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది
Ricky Ponting Reveals About Approach For Team Indias Head Coach.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలోనే తనకు టీమిండియా హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అయితే వర్క్‌లోడ్ దృష్యా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్న పాంటింగ్ గ్రేడ్ క్రికెట్ పాడ్‌కాస్ట్ ఇంటర్య్వూలో మాట్లాడాడు. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? ''ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్నా. సంవత్సరంలో 300 రోజులు భారత్‌లోనే గడుపుతున్నా. టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వెళ్తే .. రెండు పనులు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. కానీ అంత టైమ్ కూడా వేస్ట్ చేయలేదు. వర్క్‌లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఐపీఎల్లో కోచ్ పదవిని పక్కనబెట్టి టీమిండియాకు మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదు. అందుకే తిరస్కరించా. కానీ రాహుల్ ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంపై ఒక్కక్షణం ఆశ్చర్యపోయా. అయితే అండర్-19 క్రికెట్లో కోచ్‌గా ద్రవిడ్ పాత్ర అభినందనీయం. అతను అటు ఫ్యామిలీని.. ఇటు బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలడు. ద్రవిడ్‌కు అప్పజెప్పి బీసీసీఐ మంచి పని చేసింది. రానున్న కాలంలో అతని పర్యవేక్షణలో టీమిండియా రాటుదేలడం గ్యారంటీ'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కారణం ఏంటంటే! -
వాల్ కే బాధ్యతలు
-
హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం
Rahul Dravid Comments After Selected As Team India Head Coach.. టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడంపై ద్రవిడ్ స్పందించాడు. ''భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోచ్‌గా జట్టుతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా. రవిశాస్త్రి మార్గనిర్దేశంలో భారత జట్టు గొప్ప విజయాలను సాధించింది. నేను దీన్ని కొనసాగిస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న కొందరు ప్లేయర్లతో ఎన్సీఏ చీఫ్‌గా, భారత్ అండర్–19, భారత్ ‘ఎ’ జట్ల కోచ్‌గా నేను ఇప్పటికే పనిచేశా. రాబోయే రెండేళ్లలో టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. వాటిల్లో మంచి ఫలితాలు సాధించేందుకు టీమ్ సభ్యులతో, సహాయక సిబ్బందితో కలిసి పనిచేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే టి20 సిరీస్ నుంచి కోచ్ హోదాలో ద్రవిడ్ టీమిండియా డగౌట్లో దర్శనం ఇవ్వనున్నాడు. భారత్‌లో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉంటాడు. గతంలో ద్రవిడ్ శిక్షణలో భారత అండర్–19 జట్టు రెండుసార్లు అండర్–19 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌గా నిలి చింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. చదవండి: Rahul Dravid As Team India Head Coach: అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ -
Ind Vs NZ: న్యూజిలాండ్ సిరీస్‌కు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid As Team India Coach For New Zeleand Series.. రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరు అవుతారనేది పెద్ద సమస్యగా మారిపోయింది. టి20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కాగా కోచ్ పదవిపై ఆయన ఆసక్తి చూపకపోవడంతో టీమిండియాకు కొత్త కోచ్ అనివార్యంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్‌కు ద్రవిడ్‌ను టీమిండియా తాత్కాలిక కోచ్‌గా ఉండాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్ పట్టారు.. ఊహించని ట్విస్ట్ ఇదే విషయమై ఒక బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు. ''న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా కోచ్‌గా పనిచేయాలంటూ ద్రవిడ్‌ను కోరిన మాట నిజమే. దక్షిణాప్రికా టూర్ వరకు కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తామని.. అప్పటివరకు ఆ పదవిలో ఉండాలని ద్రవిడ్‌ను కోరాం. అందుకు ఆయన సముఖుత వ్యక్తం చేశారు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ వరకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే కొత్త కోచ్‌కు సంబంధించి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. టీమిండియా కోచ్‌గా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడం వెనుక ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయించాలనుకోవడమే. టీమిండియాకు ఉండే బిజీ షెడ్యూల్ కారణంగా తాను కూడా పూర్తిగా టీమిండియాతో ఉండాలన్న షరతుపై ద్రవిడ్ ఇష్టపడడం లేదు '' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Team India head Coach: రవిశాస్త్రి స్థానంలో ఆయనా?! కాగా టీమిండియా కోచ్ పదవికి ద్రవిడ్‌తో పాటు పలువురి పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ పదవిని మరోసారి చేపడతాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీని వెనుక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే కుంబ్లే కోచ్‌గా రావడంపై కోహ్లి సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక సమయంలో టీమిండియా విదేశీ కోచ్‌లు వస్తున్నారని.. టామ్ మూడీ, లాన్స్ క్లుసేనర్, రికీ పాంటింగ్ లాంటి వారు టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అయితే టీమిండియా ప్రతీ సీజన్లో కనీసం 50 మ్యాచ్‌లతో బిజీగా ఉండడంతో విదేశీ కోచ్‌లు అన్ని రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కష్టమని మరికొందరు అభిప్రాయం. మొత్తానికి రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్‌గా వస్తేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: T20 World Cup 2021: అక్షర్‌ను పక్కన పెట్టడానికి హార్దిక్ పాండ్యానే కారణం! -
కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్!
Foreign Head Coach For Team India.. టి20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోచ్ పదవికి సంబంధించి టి20 ప్రపంచకప్ అనంతరం దరఖాస్తులు కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లు ముందుగా తెరపైకి రాగా ఆ తర్వాత అనిల్ కుంబ్లేకి టీమిండియా కోచ్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. చదవండి: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే! తాజాగా బీసీసీఐ మరో కొత్త ప్రతిపాధనను తెరమీదకు తీసుకువచ్చింది. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి ఆసక్తి చూపించడం లేదని.. గంగూలీ ఒక్కడే కుంబ్లే కోచ్‌గా రావాలని అడిగినట్లు బీసీసీఐ ప్రతినిధి అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం బోర్డు సభ్యులకు నచ్చకపోవడంతో గంగూలీ ఆ ఆలోచనను విరమించుకునే అవకాశం ఉందని.. అందుకే టీమిండియాకు విదేశీ కోచ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే పలువురు విదేశీ కోచ్‌లను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే బీసీసీఐ ఎవరిని సంప్రదించిదనే వివరాలపై స్పష్టత లేదు. అంతేగాక ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే పనితనం అనుకున్నంత సజావుగా లేదు. అతని పర్యవేక్షణలో పంజాబ్ కింగ్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది. కుంబ్లే ఇప్పటికే తనకు కోచ్ పదవిపై ఆసక్తి లేదని అనధికారికంగా పేర్కొన్నప్పటికీ.. బహిరంగంగా మాత్రం ఐపీఎల్లో పంజాబ్‌ను సరిగా నడిపించలేకపోతున్నాడు.. ఇక టీమిండియాను ఎలా నడిపిస్తాడని బీసీసీఐ సభ్యులు గంగూలీ ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. ఇక వివిఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ పదవి చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్లే. అందుకే బీసీసీఐ విదేశీ కోచ్‌పై ఆసక్తి చూపిస్తుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: Sunil Gavaskar: రానున్న రెండు వరల్డ్‌కప్‌లకు అతడే కెప్టెన్‌గా ఉండాలి! -
టీమిండియా కోచ్ పదవి వద్దన్న లంక మాజీ క్రికెటర్!
ముంబై: టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌కు సంబంధించి వెతుకులాట మొదలుపెట్టిందని సమాచారం. దీనికి అనుగుణంగానే కోచ్ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తుంది. తొలుత ద్రవిడ్, సెహ్వాగ్‌లలో ఎవరు ఒకరు కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనేకు కోచ్ పదవి ఆఫర్ కోసం సంపద్రించినట్లు రిపోర్ట్స్ ద్వారా సమాచారం అందింది. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా కోచ్ పదవిపై జయవర్దనేకు ఆసక్తి లేదట. అంతేగాక అతను ప్రస్తుతం శ్రీలంక అండర్-19 క్రికెట్ టీమ్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ కంటే శ్రీలంక ప్రధానకోచ్‌గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం. చదవండి: Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే! ఇక జయవర్దనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2017 నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయవర్దనే కోచ్‌గా 2017, 2019లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉండాలంటే ఏ జట్టుకు కోచ్‌గా కొనసాగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జయవర్దనేను వదులుకోవడానికి ఇష్టపడదు. అందులోనూ శ్రీలంక క్రికెట్లో ఇలాంటి రూల్స్ లేవు. ఒక రకంగా జయవర్దనే టీమిండియా కోచ్ పదవి వద్దనడానికి ఇది కూడా ఒక కారణంగా భావించొచ్చు. అయితే ఇప్పటికైతే జయవర్దనే బీసీసీఐకి తెలిపిన విషయంలో క్లారిటీ లేదు. టి 20 ప్రపంచకప్ తర్వతే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది. ఇక జయవర్దనే లంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. బ్యాట్స్‌మన్‌గా... కెప్టెన్‌గా లంక జట్టుకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. లంక తరపున 448 వన్డేల్లో 12560 పరుగులు, 149 టెస్టు మ్యాచ్‌ల్లో 11814 పరుగులు, 55 టి20 మ్యాచ్‌ల్లో 1493 పరుగులు చేశాడు. జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 54 సెంచరీలు చేశాడు. దీనితో పాటు ఏడు డబుల్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఐపీఎల్లో 80 మ్యాచ్‌లాడిన జయవర్దనే 1802 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి -
టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే!
Anil Kumble As Team India Coach.. టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దీనికి సంబంధించి బీసీసీఐ టి20 ప్రపంచకప్ తర్వాత దరఖాస్తులను కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లలో ఎవరో ఒకరిని ప్రధాన కోచ్ పదవి వరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజాగా అనిల్ కుంబ్లే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ అతన్ని కోరినట్లు అనధికారిక రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఇంతకముందు అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లికి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై చాయిస్‌ను వెల్లడించిన లిటిల్ మాస్టర్ ఇక 2016లో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. ఏడాది కాలానికి గానూ కుంబ్లే కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ మేనేజ్మెంట్ తెలిపింది. అయితే 2017 జనవరిలో ధోని పరిమిత ఓవర్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడు. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్ అవడం జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగానే వెలుగుచూశాయి. కాగా కుంబ్లే, కోహ్లి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అప్పటి బీసీసీఐ సభ్యుడు వినోద్ రాయ్ కుంబ్లే వెస్టిండీస్ టూర్ వరకు ఆ పదవిలో ఉంటాడని తెలిపాడు. కాగా 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. తన కాంట్రాక్ట్‌కు ఇంకా సమయమున్నప్పటికీ 2017 జూన్ 20న కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోహ్లి రవిశాస్త్రిని ప్రధాన కోచ్ పదవి ఇవ్వాలని బీసీసీఐని కోరడం.. వెంటనే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి ఇప్పటికైతే కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. కోహ్లీతో విభేదాల కారణంగానే పదవికి రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు కోహ్లి జట్టులోనే ఉన్నాడు.. టి20 ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కుంబ్లేతో పాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే టి20 ప్రపంచకప్ ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఇప్పటికైతే రోహిత్.. మరి తర్వాత ఎవరు? -
టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్!
Ravi Shastri Step Down Team India Coach: టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడని సమాచారం. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు కోచ్ పదవిలో ఉండాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవిశాస్త్రి మాత్రం టి20 ప్రపంచకప్ తర్వాతే వైదొలిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేది ఎవరనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: T20 World Cup 2021: ఆ ఫలితాన్ని రిపీట్ చేస్తాం.. టీమిండియాపై పాక్ బౌలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మాత్రం కోచ్ పదవి రాహుల్ ద్రవిడ్‌నే వరిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే టీమిండియా-ఏ జట్టు రాటు దేలడం.. ఆపై సీనియర్ టీమ్ గైర్హాజరీలో టీమిండియా రెండో టీమ్ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేగాక టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని.. అతని సలహాలతో జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందనేది చాలా మంది అభిప్రాయం. ఇక టీమిండియాకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ నిలిచాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు.. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ టీమిండియా గెలవడంతో కోచ్‌గా కిర్‌స్టన్ పాత్ర కీలకం. 2017లో కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాకా రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం.. కోహ్లి కెప్టెన్ కావడం.. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి టీమిండియాకు మంచి విజయాల్ని కట్టబెట్టారు. రవిశాస్త్రి కోచ్‌గా వచ్చిన తర్వాత కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను స్వదేశంతో పాటు వారి గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది. దీంతోపాటు ఎన్నో సిరీస్‌ల్లోనూ వీరి జోడి పర్‌ఫ్టెక్ట్‌గా కనిపించింది. కోహ్లి కూడా రవిశాస్త్రి నిర్ణయాలతో ఏకీభవిస్తూ.. అతనికి మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. అయితే ఐసీసీ మేజర్ టోర్నీలకు వచ్చేసరికి మాత్రం రవిశాస్త్రి కోచ్‌గా సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్.. తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్ ఫైనల్లోనూ టీమిండియా అపజయాలే చూసింది. కేవలం ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లోనే కోచ్‌గా విఫలమయ్యాననే కారణంతో రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’ అయితే, కోచ్‌గా రవిశాస్త్రి తప్పుకుంటున్నాడనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. టి20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించే అవకాశం ఉంటుంది. అయితే ద్రవిడ్ మాత్రం ఎన్సీఏ చీఫ్ కోచ్‌గా ఉండడానికి ఈ మధ్యనే మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని గమనిస్తే.. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేయడానికి ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే రవిశాస్త్రి కోచ్‌గా వైదొలిగిన తర్వాత అతని టీమ్‌లోని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కూడా బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఒకవేళ టీమిండియాకు కొత్త కోచ్ వస్తే గనుక కొత్త టీమ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టి20 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా ఉంచి.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ జరిగే నాటికి కోచ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ ద్రవిడ్ ఫుల్‌టైం ప్రధాన కోచ్‌గా ఉండేందుకు అంగీకరిస్తే మాత్రం బీసీసీఐకి ఇబ్బంది తొలగినట్టే. ఇక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టి20 ప్రపంచకప్ అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో రోహిత్ టెస్టు కెప్టెన్ అని రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ ఖండించింది. -
రవిశాస్త్రినే రైట్
ఓ ఎంపిక తంతు ముగిసింది...! టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రికే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సాధించలేకపోయినా... జట్టు కూర్పులో విమర్శలెదుర్కొన్నా... కెప్టెన్ విరాట్ కోహ్లి అండదండలు సమృద్ధిగా ఉన్న అతడు... అందరినీ తోసిరాజంటూ మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. హెడ్‌కోచ్ ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. కుదించిన జాబితాలో శాస్త్రి సహా మొత్తం ఆరుగురు ఉండగా, వీరిలో చివరి దశకు ముగ్గురే మిగిలారు. అందులోంచి అంతా అనుకుంటున్నట్లుగా... ముందే నిర్ణయించేసినట్లుగా... ‘రవి భాయ్’కే పట్టం కట్టారు. ముంబై: పెద్దగా మలుపులేం లేవు. అనూహ్యమేమీ జరగలేదు. అంచనాలకు తగ్గట్లే, కెప్టెన్ కోహ్లి మనోగతానికి అనువుగానే అంతా సాగిపోయింది. భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్ వరకు పదిలమైంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం రోజంతా సమావేశమైన కపిల్ బృందం... వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్ లాల్‌సింగ్ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. మరో దరఖాస్తుదారు ఫిల్ సిమన్స్ (వెస్టిండీస్) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు. హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 2017 జులైలో శాస్త్రిని హెడ్ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎంపిక చేశారు. అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్ తెలిపాడు. డైరెక్టర్‌గా వచ్చి... కోచ్‌గా పాతుకుపోయాడు 2014 వరకు పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా ఉన్న రవి ఆ ఏడాది ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడటంతో వన్డే సిరీస్‌కు టీమ్ డైరెక్టర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో నియమితుడయ్యాడు. నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఉండగానే డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూశాడు. ఫ్లెచర్ 2015 ప్రపంచ కప్ అనంతరం వైదొలిగాక, 2016 జూన్‌లో మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా వచ్చేవరకు డైరెక్టర్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూలైలో కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తప్పుకోవడంతో ప్రధాన కోచ్ అయ్యాడు. తాజా ఎంపికకు అతడి ఆధ్వర్యంలో జట్టు సాధించిన విజయాలు ఓ కారణంగా చెబుతున్నారు. శాస్త్రి హయాంలో భారత్ 2017–18 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో లీగ్ దశలో టాప్‌లో నిలిచి సెమీస్ చేరింది. మధ్యలో ఆసియా కప్ వంటి చిన్నాచితక టోర్నీలు, స్వదేశంలో సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పుడు 2021 వరకు ఎంపిక చేసినందున బహుశా భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసినవాడిగా రికార్డులకెక్కుతాడు. కోహ్లి వ్యాఖ్యల ప్రభావం లేదు ‘కోచ్ ఎంపికలో మేం కోహ్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ అలానే చేసి ఉంటే... మిగతా జట్టు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేవారం. ఈ విషయంలో మేమెవరినీ సంప్రదించలేదు. అసలు అందుకు అవకాశమే లేదు. ప్రపంచ కప్ సాధించనంత మాత్రాన వేటు వేయాలని ఏమైనా ఉందా? మీరు మొత్తం విజయాలను చూడండి. వారి ప్రజంటేషన్‌నే మేం చూశాం. దాని ప్రకారమే వెళ్లాం. అందరూ నిపుణులే అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ రవిశాస్త్రిని ముందంజలో నిలిపాయి’ – రవిశాస్త్రి ఎంపికపై కపిల్ స్పందన -
కోచ్ ఎవరైతే ఏంటి: కుంబ్లే
ముంబై: అనుభవం, యువ ఆటగాళ్ల మేలికలయికతో భారత క్రికెట్ జట్టు సమతూకంగా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి జట్టుకు శిక్షకుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు. కోచ్ గురించి మాట్లాడాల్సిన పనిలేదని.. ఆటగాళ్లు, జట్టు గురించే ఆలోచించాలని పేర్కొన్నాడు. 'కోచ్ నేనా, రవిశాస్త్రా అన్నది పక్కనపెట్టండి. టీమిండియా బాగా ఆడాలని అందరూ కోరుకోవాలి. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదో గొప్ప అవకాశం. ఏడాది పాటే నన్ను కోచ్ గా నియమించినందుకు బాధ లేదు. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తా'నని కుంబ్లే చెప్పాడు. కాగా, భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా 18 నెలల పాటు పని చేసిన తనను ప్రధాన కోచ్‌గా నియమించకపోవడంతో రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డెరైక్టర్‌గా తను ఉన్న సమయంలో భారత జట్టు అనేక చిరస్మరణీయ విజయాలు అందుకుందని గుర్తు చేశారు. కోచ్‌గా తనని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. -
రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ పదవి దక్కనందుకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ తనను ఇంటర్వ్యూ చేసినపుడు కమిటీ సభ్యుడు సౌరభ్ గంగూలీ పాల్గొనలేదని రవిశాస్త్రి చెప్పాడు. థాయ్‌లాండ్ నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు అడిగారని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా స్పందిస్తూ.. ఇంటర్వ్యూ పూర్తిగా రహస్య విషయమని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాను మాట్లాడదలచుకోలేదని చెబుతూనే.. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని తెలిపాడు. ఆ సమయంలో తాను క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్‌ను కలిశానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే.