భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి కోసం ముందు వరుసలో ముంబై జట్టు భారత మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది.
అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. కాగా ముజుందార్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ముజుందార్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్ 2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు.
హెడ్‌కోచ్ పదవికి అర్హతలు
బీసీసీఐ హెడ్‌కోచ్ పదవికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు. అభ్యర్థి తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ లేదా మరేదైనా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా కనీసం ఎన్సీఏ స్థాయి ‘C’ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment