Indian womens cricket team
-
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్‌కు పనిచెప్పింది. ఈ మ్యాచ్‌లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బేట్స్ ఆల్‌టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్‌గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్‌లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాధ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్‌కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదింది. అలీన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్‌బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
ఆసియా కప్-2024కు భారత జట్టు ప్రకటన.. తెలుగు ప్లేయర్లకు చోటు
న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్‌లో పాల్గొననున్న భారత అండర్–19 జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ చోటు దక్కించుకున్నారు. కౌలాలాంపూర్ వేదికగా ఈ నెల 15 నుంచి 22 వరకు జూనియర్ మహిళల ఆసియా కప్ జరగనుంది.సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నికీ ప్రసాద్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా... సనికా చాల్కె వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. అండర్–19 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం ఉన్న త్రిషతో పాటు మహిళల ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నమ్ ఇందులో చోటు దక్కించుకున్నారు.నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించగా... అందులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ కావ్యశ్రీ కూడా ఉంది. ఈ టోరీ్నలో పాకిస్తాన్, నేపాల్‌తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. టోర్నీ ఆరంభ పోరులో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 జరగనున్న ఫైనల్లో తలపడనున్నాయి. భారత జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సనికా చాల్కె (వైస్ కెపె్టన్), గొంగడి త్రిష, కమలిని, భావిక అహిరె, ఈశ్వరి అవాసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, అనందిత కిషోర్, షబ్నమ్, నందన. స్టాండ్‌బైలు: హర్లీ గాలా, హ్యాపీ కుమారి, గుగులోత్ కావ్యశ్రీ, గాయత్రి. -
ఆస్ట్రేలియా బ్యాటర్ల ఊచకోత.. భారత్ ముందు భారీ టార్గెట్
ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సైతం భారత బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. మన బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 110, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. గార్డనర్(50), కెప్టెన్ మెక్‌గ్రాత్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో ఒక్క అరుంధతి రెడ్డి మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. అరుంధతి తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మాన్ సేన భావిస్తోంది. ఇప్పుడు ఆ భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది. -
ఆస్ట్రేలియా అదుర్స్.. ఒకేరోజు టీమిండియాకు రెండు షాక్‌లు
ఆస్ట్రేలియా గడ్డపై ఒకే రోజు భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ పురుషల జట్టు పరాజయం పాలవ్వగా.. మరోవైపు బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో భారత మహిళల టీమ్ ఘోర ఓటమి చవిచూసింది. 372 పరుగుల లక్ష్య చేధనలో భారత అమ్మాయిల జట్టు 44.5 ఓవర్లలో కేవలం 249 పరుగులకే కుప్పకూలింది.భారత బ్యాటర్లలో రిచా ఘోష్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిన్ను మణి(46), రోడ్రిగ్స్(43), హర్మాన్ ప్రీత్(38) పరుగులతో పర్వాలేదన్పించారు. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. స్కాట్, కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.పెర్రీ, వాల్ సెంచరీలు..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 371 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్(87 బంతుల్లో 12 ఫోర్లుతో 101), ఎల్లీస్ పెర్రీ(75 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు.వీరిద్దరితో పాటు లిచ్‌ఫీల్డ్(60),బీత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 ఆతిథ్య ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే పెర్త్ వేదికగా డిసెంబర్ 11న జరగనుంది.చదవండి: ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్ -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. 100 పరుగులకే టీమిండియా ఆలౌట్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల దాటికి ఇండియా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఉమెన్ ఇన్ బ్లూ ఆఖరి 5 వికెట్లు కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. భారత జట్టు బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతోపాటు హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగల్గారు.మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మెగాన్ స్కాట్ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేదు.ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్ -
వచ్చే నెలలో విండీస్‌తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి. -
IND Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
మహిళల టి20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం కూడా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగనుంది. తాజా వరల్డ్‌కప్‌లో భారత జట్టు గ్రూప్ దశ నుంచే ని్రష్కమించగా... సారథ్య మార్పు అంశం తెరపైకి వచ్చింది. కానీ, సెలెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి నాయకత్వ మార్పు జోలికి వెళ్లకుండా హర్మన్‌పైనే నమ్మకం ఉంచారు. అహ్మదాబాద్‌లో ఈ నెల 24, 27, 29న జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.ఇందులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. 12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్ పూజ వ్రస్తాకర్‌కు విశ్రాంతినివ్వగా... ఆశ శోభనను గాయం కారణంగా పరిగణించలేదు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’జట్టు నుంచి తేజల్ హస్నాబిస్, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాతో పాటు మహిళల ఐపీఎల్లో రాణించిన సైమా ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్ హసాబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ -
న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని భారత జట్టు ఘోర ఓటమితో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు.. గ్రూపు-ఎలో న్యూజిలాండ్, పాకిస్థాన్,శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు కలిసి ఉంది. ప్రస్తుతం టీమిండియా -2.900 రన్‌రేట్‌తో గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో ఉంది.సెమీస్ చేరాలంటే?భారత్ సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంకా భారత్‌కు మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఉమెన్ ఇన్ బ్లూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది.భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే తమ తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగుపడుతోంది. ఆ తర్వాత తమ చివరి లీగ్‌లో మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ సాధారణ విజయం సాధించినా చాలు సెమీఫైనల్‌కు ఆర్హత సాధించవచ్చు. ఒకవేళ ఆసీస్‌పై భారత్ ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. కాగా గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు ఖాయం. అయితే ఇదే సమయంలో ఆసీస్ మినహా పాక్, శ్రీలంక, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడాలి. అప్పుడే ఈ మూడు జట్ల కంటే భారత్ పాయింట్లు ఎక్కువగా సాధించి సెమీస్‌లో అడుగు పెడుతోంది.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
న్యూజిలాండ్ కెప్టెన్ సూపర్ ఫిప్టీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ కెప్టెన్ సోఫీ డివైన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగింది.36 బంతులు ఎదుర్కొన్న డివైన్.. 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ప్లిమ్మర్(34), బేట్స్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరుందతి రెడ్డి, శోభనా తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చెప్పకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. -
ఈసారి టీ20 వరల్డ్‌కప్ భారత్‌దే.. ఆ ఇద్దరే కీలకం: శ్రీశాంత్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మహిళలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఉమెన్ ఇన్ బ్లూ ఉవ్విళ్లూరుతోంది.ఈ నేపథ్యంలో హర్మన్ సేనను ఉద్దేశించి భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసేకునేందుకు భారత్‌కు అన్ని విధాలగా అర్హత ఉందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టు అద్బుతంగా ఉంది. టీమ్‌తో పాటు భారత్‌కు గొప్ప కోచింగ్ స్టాప్ ఉంది. ముఖ్యంగా హెడ్‌కోచ్ అమోల్ భాయ్ (ముజుందార్) కోసం ఎంత చెప్పకున్న తక్కవే. అతడొక అద్బుతమైన కోచ్. ఈ సారి అతడి నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. కోచ్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నేను చూశాను. తమ జట్టు 100 శాతం ఎఫెక్ట్ పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదని ఆమె చెప్పుకొచ్చింది అంటూ శ్రీశాంత్ పేర్కొన్నాడు.ఆ ఇద్దరే కీలకం..ఈ టోర్నీలో భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు ఎక్స్ ఫ్యాక్టర్స్(కీలక ఆటగాళ్లగా) మారనున్నారు.హర్మన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఇన్నింగ్స్ మళ్లీ ఈసారి చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఆమె ఈ సారి ఏదో మ్యాజిక్‌తో ముందుకు వస్తుందని నమ్మకం నాకు ఉంది. మరోవైపు స్మృతి మంధాన కూడా సత్తాచాటనుంది. అదేవిధంగా జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ప్లేయర్. వీరుముగ్గరు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరిగుండదు అని శ్రీశాత్ చెప్పుకొచ్చాడు. -
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో భారత జట్టు అదరగొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్ధులను భారత్ చిత్తు చేసింది. మంగళవారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
యూఏఈతో మ్యాచ్.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్‌ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్‌చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్ -
ఆసియాకప్‌లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. -
8 జట్లు.. 15 మ్యాచ్‌లు.. ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదే?
శ్రీలంక వేదికగా మహిళల ఆసియాకప్-2024కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. జూలై 19(శుక్రవారం) దంబుల్లా వేదికగా నేపాల్, యూఏఈ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 8 జట్లను రెండు గ్రుపులగా విభిజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈలు ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఆసియాకప్-2024 షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలను తెలుసుకుందాం.ఆసియాకప్ షెడ్యూల్ ఇదే.. జూలై 19, శుక్రవారం - యూఏఈ వర్సెస్ నేపాల్ - 2:00 PMజూలై 19, శుక్రవారం - భారత్ వర్సెస్ పాకిస్తాన్ - 7:00 PMజూలై 20, శనివారం - మలేషియా వర్సెస్ థాయిలాండ్ - 2:00 PMజూలై 20, శనివారం - శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ - 7:00 PMజూలై 21, ఆదివారం - భారత్ వర్సెస్ యూఏఈ - 2:00 PMజూలై 21, ఆదివారం - పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 22, సోమవారం - శ్రీలంక వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 22, సోమవారం - బంగ్లాదేశ్ వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 23, మంగళవారం - పాకిస్తాన్ డ యూఏఈ - 2:00 PMజూలై 23, మంగళవారం - భారత్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 24, బుధవారం - బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 24, బుధవారం - శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 1 - 2:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 2 - 7:00 PMజూలై 28, ఆదివారం - ఫైనల్ - 7:00 PMఆసియాకప్‌లో పాల్గోనే జట్లు ఇవే.. భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్ - ట్రావెలింగ్ రిజర్వ్‌లు: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్థాయిలాండ్: తిపట్చా పుట్టావాంగ్ (కెప్టెన్), సువనన్ ఖియాటో (వాక్), నన్నపట్ కొచరోయెంకై (వాక్), నట్టయా బూచతం, ఒన్నిచా కమ్‌చోంఫు, రోసెనన్ కానో, ఫన్నితా మాయ, చనిదా సుత్తిరువాంగ్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ ఫొనాంగ్టానా చాపతన్సేన్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ బూంతన్సాన్సన్, చపతన్సేన్, కోరనిత్ సువంచోంరతి, అఫిసర సువంచోంరతిమలేషియా: వినిఫ్రెడ్ దురైసింగం (కెప్టెన్), ఐనా నజ్వా (వికెట్ కీపర్), ఎల్సా హంటర్, మాస్ ఎలిసా, వాన్ జూలియా (వికెట్ కీపర్), అయిన హమీజా హషీమ్, మహిరా ఇజ్జతీ ఇస్మాయిల్, నూర్ అరియానా నాట్యా, ఐస్యా ఎలీసా, అమలిన్ సోర్ఫినా, ధనుశ్రీ ముహునాన్, ఇర్డ్నా బెహనాన్ , నూర్ ఐషా, నూర్ ఇజ్జతుల్ సయాఫికా, సుయాబికా మణివణ్ణన్నేపాల్: ఇందు బర్మా (కెప్టెన్), సీతా రాణా మగర్, రాజమతి ఐరీ, రుబీనా ఛెత్రీ, డాలీ భట్టా, మమతా చౌదరి, కబితా జోషి, కబితా కున్వర్, కృతికా మరాసిని, పూజ మహతో, బిందు రావల్, రోమా థాపా, సబ్నమ్ రాయ్, సంజన ఖడ్కా, (వికెట్ కీపర్)యుఎఈ: ఇషా ఓజా (కెప్టెన్), తీర్థ సతీష్ (వికెట్ కీపర్), ఎమిలీ థామస్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, లావణ్య కెనీ, ఖుషీ శర్మ, ఇంధుజా నందకుమార్, రినిత రజిత్, రిషిత రజిత్, వైష్ణవే మహేష్, సురక్షా కొట్టె, హీనా హాట్చందనీ, మెహక్చందనీ, రితికా రజిత్పాకిస్థాన్: నిదా దార్ (కెప్టెన్), ఇరామ్ జావేద్, సాదియా ఇక్బాల్, అలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునీబా అలీ, సిద్రా అమీన్, నజిహా అల్వీ, సయ్యదా అరూబ్ షా, నష్రా సుంధు, తస్మియా రుబాబ్, ఒమైమా సోహైల్, తుబా హసన్ .శ్రీలంక: చమరి అతపత్తు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, కావ్య కవింది, సుగండికా కుమారి, అచ్చిని కులసూర్య, కవీషా దిల్హరి, విష్మి గుణరత్నే, శనివా గుణరత్నే, శనివాణి సక్షిలా గిమ్హానిబంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), షోర్నా అక్టర్, నహిదా అక్టర్, ముర్షిదా ఖాతున్, షోరిఫా ఖాతున్, రీతు మోని, రుబ్యా హైదర్ ఝెలిక్, సుల్తానా ఖాతున్, జహనారా ఆలం, దిలారా అక్టర్, ఇష్మా తంజిమ్, రబేయా ఖాన్, రుమానా అహ్మద్, సబికున్ అక్టర్, నహర్ జెస్మిన్మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాక్‌తోనే తొలి మ్యాచ్
మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌తో పాటు ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో జూలై 23న నేపాల్‌తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
చెన్నై: ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి... జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌నూ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి ఉండటం ఖాయమనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఏకైక టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన షఫాలీ వర్మ అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో పేసర్లు రేణుక సింగ్, అరుంధతి రెడ్డి... స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా అవకాశాలన్నీ కెపె్టన్ లౌరా వొల్వార్ట్, మరిజన్ కాప్, సునె లుస్ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్‌గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్‌ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్‌గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్‌ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్‌ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్‌లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్‌ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్‌ప్రీత్ బృందం సఫారీపై సూపర్‌గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్‌కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్‌కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్‌ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్‌లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్‌గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్‌లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.