వడోదర: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడి పోలీసుల చేతిలో అరెస్టయిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోథే తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెట్టింగ్ అభియోగంపై తుషార్‌తో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా...ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఈ ఘటనపై తుషార్ స్పందించారు. ‘క్రికెట్ నా జీవనాధారం. ఇవాళ నాకు ఈ మాత్రం పేరు వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు క్రికెట్టే కారణం. నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను. చేయడం సంగతేమో కానీ కనీసం ఆలోచించను కూడా. జీవితంలో ఒక్క పైసా విషయంలో కూడా ఎవరినీ మోసం చేయలేదు’ అని అరోథే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment