
ముంబై: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే రెండు కీలక సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ప్రకటించింది. ఈ రెండు టీమ్‌లకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఇంగ్లండ్‌తో 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఆ తర్వాత ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆసీస్‌తో టి20 సిరీస్‌కు టీమ్‌ను తర్వాత ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగానే జరుగుతాయి. ఈ నెల 6న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరుగుతుంది.
ఇంగ్లండ్‌తో టి20లకు జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్, శ్రేయాంక, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, కనిక ఆహుజా, మిన్ను మని.
ఇంగ్లండ్, ఆసీస్‌లతో టెస్టులకు జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, స్నేహ్ రాణా, శుభ సతీశ్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రకర్
Comments
Please login to add a commentAdd a comment