![India Are Scheduled To Play 88 Matches At Home In Upcoming Broadcast Cycle - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/Untitled-15.jpg.webp?itok=DmmmuXcK)
రానున్న బ్రాడ్‌కాస్ట్ సైకిల్‌లో (సెప్టెంబర్ 2023-మార్చి 2028, ఐదేళ్లు) టీమిండియా స్వదేశంలో 88 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు సగం మ్యాచ్‌లు (39) ఇంగ్లండ్, ఆసీస్‌లతోనే జరుగుతాయని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మొదలయ్యే ఈ సైకిల్ 2028 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది.
కాగా, రానున్న బ్రాడ్‌కాస్ట్ సైకిల్‌లో మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇటీవలే టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 25 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు 15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజ్ చెల్లించాలని తెలిపింది.
సెప్టెంబర్ 2023-మార్చి 2028 మధ్యలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు..
- 2023 సెప్టెంబర్: ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్
- 2023 నవంబర్: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2024 జనవరి: ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2024 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
- 2024 సెప్టెంబర్-అక్టోబర్: బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2024 అక్టోబర్-నవంబర్: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
- 2025 జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2025 అక్టోబర్: విండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
- 2025 నవంబర్-డిసెంబర్: సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2026 జనవరి: న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- 2026 జూన్: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్
- 2026 సెప్టెంబర్-అక్టోబర్: విండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
- 2026 డిసెంబర్: శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు
- 2027 జనవరి-మార్చి: ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు
- 2027 నవంబర్-డిసెంబర్: ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు
- 2028 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
Comments
Please login to add a commentAdd a comment