
ఐపీఎల్-2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.
గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు.
"ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.
ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్‌కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment