టీ20 వరల్డ్‌కప్ 2024పై జోస్యాల పర్వం తారాస్థాయికి చేరింది. పలనా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయంటూ మాజీలు, విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. తాజాగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ క్రికెట్ జ్యోతిష్యుల సరసన చేరాడు. ఈసారి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం.
కాగా, ఇంగ్లండ్ నిన్న (జూన్ 4) జరగాల్సిన తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. సూపర్-8 చేరే క్రమంలో ఇంగ్లండ్‌కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్న గ్రూప్‌లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో (ఒమన్‌తో) గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.
Jos Buttler reveals his predictions for the top four teams in the T20 World Cup 2024.
Share your own selections in the comments section below👇 pic.twitter.com/SX0TZxuD5D— CricTracker (@Cricketracker) June 5, 2024
ఇదిలా ఉంటే, ఇవాళ జరిగే గ్రూప్-ఏ పోటీలో భారత్-ఐర్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది. గ్రూప్-ఏలో ఇప్పటివరకు జరిగిన ఏకైక మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. కెనడాపై విజయం సాధించింది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, ఐర్లాండ్, యూఎస్‌ఏ, కెనడాతో పాటు పాకిస్తాన్ ఉంది. భారత్.. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా-ఒమన్ (6 గంటలకు).. పపువా న్యూ గినియా-ఉగాండ (5 గంటలకు) తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment