semis
-
సెమీస్‌లో స్వియాటెక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది. మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు. షెల్టన్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
సెమీస్‌లో సహజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మరో సంచలన విజయం సాధించింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 6–3, 5–7, 6–3తో ప్రపంచ 190వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ మరియా మాటీస్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహజ మూడో సీడ్, 214వ ర్యాంకర్ హీన్ షి (చైనా)ను బోల్తా కొట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 153వ ర్యాంకర్ కథింక వోన్ డెష్మన్ (లిష్టన్స్టయిన్)తో సహజ తలపడుతుంది. -
సెమీస్‌లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్
పుణే: గత ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌లో 11వ స్థానంతో సరిపెట్టుకున్న యూపీ యోధాస్ ఈసారి మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ యోధాస్ 46–18 పాయింట్ల తేడా మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును చిత్తుగా ఓడించింది. రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 12 పాయింట్లతో మెరిసి యూపీ యోధాస్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. హితేశ్ 6 పాయింట్లు రాబట్టగా... గగన్ గౌడ, సుమిత్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. భవానీ రాజ్‌పుత్ 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లాడు. 9 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. రెండుసార్లు దొరికిపోగా, మూడుసార్లు పాయింట్ సాధించకుండానే వెనక్కి వచ్చాడు. మరోవైపు పింక్ పాంథర్స్ జట్టు సమష్టిగా విఫలమైంది. ఆ జట్టు రెయిడర్లుగానీ, డిఫెండర్లుగానీ ఆకట్టుకోలేకపోయారు. డిఫెండర్ రెజా మీర్బాఘేరి ఐదు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కేవలం రెండు రెయిడింగ్ పాయింట్లు సాధించి నిరాశపరిచాడు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 31–23 పాయింట్ల తేడాతో మాజీ విజేత యు ముంబా జట్టును ఓడించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్లు దేవాంక్ 8 పాయింట్లు, అయాన్ 10 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్ గుర్దీప్ ఐదు పాయింట్లతో రాణించాడు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు... అజిత్ చౌహాన్ 5 పాయింట్లు సాధించారు.నేడు జరిగే సెమీఫైనల్స్‌లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్లో, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్‌లో కిరణ్ జార్జి
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.ఒబయాషిపై కిరణ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో కిరణ్ తలపడతాడు. -
‘హ్యాట్రిక్’ విజయంతో సెమీస్‌లోకి భారత్
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. -
సెమీస్‌లో జొకోవిచ్
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ అయిన జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) తుంటి గాయంతో వైదొలిగాడు. దాంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు ఇటలీ రైజింగ్ స్టార్ లొరెంజో ముసెట్టి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 3–6, 7–6 (7/5), 6–2, 3–6, 6–1తో గెలిచి సెమీస్‌లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 31వ సీడ్ బార్బరా క్రిచికో వా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రిబాకినా 6–3, 6–2తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, క్రిచికోవా 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకో (లాతి్వయా)పై గెలిచారు. -
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్‌పై గెలుపు.. సెమీస్‌కు సౌతాఫ్రికా
టీ20 వరల్డ్‌కప్ 2024లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చివరి ఓవర్లో విజయం సాధించింది. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. జన్సెన్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు చేశాడు.వర్షం అంతరాయం నడుమ సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. తబ్రేజ్ షంషి (4-0-27-3), జన్సెన్ (2-0-17-1), మార్క్రమ్ (4-0-28-1), కేశవ్ మహారాజ్ (4-0-24-1), రబాడ (2-0-11-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (52), కైల్ మేయర్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో ఓవర్లో మొదలైన వర్షం దాదాపు గంటపాటు కొనసాగడంతో 17 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి, సౌతాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. వర్షం ప్రారంభానికి ముందే 2 వికెట్లు (15 పరుగులకే) కోల్పోయిన సౌతాఫ్రికా ఆతర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిపించింది. అయితే మార్కో జన్సెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (21 నాటౌట్) ఆడి సౌతాఫ్రికాను గెలిపించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లు రోస్టన్ ఛేజ్ (3-0-12-3), ఆండ్రీ రసెల్ (4-0-19-2), అల్జరీ జోసఫ్ (4-0-25-2) దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏపై గెలుపుతో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరగా.. విండీస్, యూఎస్ఏ టోర్నీ నుంచి వైదొలిగాయి. -
T20 World Cup 2024: సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాలంటే 136 పరుగులు చేయాలి
టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 పోరులో ఇవాళ (జూన్ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. -
ఐటీఎఫ్ టోర్నీ సెమీస్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలోని విచిటా సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో ఒలీవియా లిన్సెర్ (పోలాండ్)పై విజయం సాధించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
T20 World Cup 2024: సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే.. ఆసీస్‌కు నో ఛాన్స్..?
టీ20 వరల్డ్‌కప్ 2024పై జోస్యాల పర్వం తారాస్థాయికి చేరింది. పలనా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయంటూ మాజీలు, విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. తాజాగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ క్రికెట్ జ్యోతిష్యుల సరసన చేరాడు. ఈసారి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం.కాగా, ఇంగ్లండ్ నిన్న (జూన్ 4) జరగాల్సిన తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. సూపర్-8 చేరే క్రమంలో ఇంగ్లండ్‌కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్న గ్రూప్‌లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో (ఒమన్‌తో) గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.Jos Buttler reveals his predictions for the top four teams in the T20 World Cup 2024.Share your own selections in the comments section below👇 pic.twitter.com/SX0TZxuD5D— CricTracker (@Cricketracker) June 5, 2024ఇదిలా ఉంటే, ఇవాళ జరిగే గ్రూప్-ఏ పోటీలో భారత్-ఐర్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది. గ్రూప్-ఏలో ఇప్పటివరకు జరిగిన ఏకైక మ్యాచ్‌లో యూఎస్ఏ.. కెనడాపై విజయం సాధించింది. ప్రస్తుతం యూఎస్ఏ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడాతో పాటు పాకిస్తాన్ ఉంది. భారత్.. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా-ఒమన్ (6 గంటలకు).. పపువా న్యూ గినియా-ఉగాండ (5 గంటలకు) తలపడనున్నాయి. -
సెమీస్‌లో అనిరుధ్, రిత్విక్ జోడీలు
అకాపుల్కో (మెక్సికో): జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్, బొల్లిపల్లి రి త్విక్ చౌదరీ సంచలనం సృష్టించారు. అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో)... రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) జోడీలు సీడెడ్ జంటలను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రి త్విక్–నిక్కీ జంట 6–4, 6–1తో రెండో సీడ్ పీటర్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జోడీని ఓడించగా... అనిరుధ్–వెర్డొగో ద్వయం 3–6, 6–4, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ రింకీ హిజికాటా (ఆ్రస్టేలియా)–మ్యాక్ కిగెర్ (అమెరికా) జంటకు షాక్ ఇచ్చింది. -
సెమీస్‌లో ఓడిన సిక్కిరెడ్డి–సుమీత్ జోడీ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి సెమీఫైనల్లో వెనుదిరిగింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 66వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి–సుమీత్ 17–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంక్‌లో ఉన్న రినోవ్ రివాల్డీ–పితా మెంతారి (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. సిక్కి–సుమీత్ జోడీకి 2,940 డాలర్ల (రూ. 2 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సిక్కి–సుమీత్ జోడి
మాడ్రిడ్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (సూపర్ 300) టోర్నీ స్పెయిన్ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఓడగా...మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరో సీడ్ సుపనిద కేట్‌టాంగ్ 24–26, 21–17, 22–20తో రెండో సీడ్ సింధును ఓడించింది. 77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు షట్లర్లూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌లో 4–8తో వెనుకబడిన తర్వాత వరుస 7 పాయింట్లతో సింధు 11–8కి వెళ్లింది. అయితే ఆ తర్వాత సుపనిద కోలుకుంది. దాంతో స్కోరు 17–17, 20–20, 24–24 వరకు సమంగా సాగగా, చివరకు గేమ్ సింధు గెలుచుకుంది. రెండో గేమ్‌లో 8–11తో వెనుకబడి కూడా సుపనిద పోరాడి గేమ్‌ను సొంతం చేసుకోగలిగింది. చివరి గేమ్‌లో 8–4తో సింధు ముందంజ వేసింది. అయితే భారత షట్లర్ వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. ఒక దశలో వరుస 10 పాయింట్లలో 9 సుపనిద ఖాతాలోకే చేరాయి. 15–20తో ఓటమి దాదాపు ఖాయమైన దశలో సింధు వరుసగా 5 మ్యాచ్ పాయింట్లు సాధించి 20–20 వరకు తీసుకొచ్చింది. అయితే వరుస రెండు పాయింట్లతో సుపనిద ఆట ముగించడంతో రాకెట్ విసిరేసి సింధు కోర్టులోనే కుప్పకూలిపోయింది. డబుల్స్ జోడీల పరాజయం... 41 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సుమీత్ – సిక్కి జోడి 14–21, 21–11, 21–17 స్కోరుతో ఇండోనేసియాకు చెందిన రేహన్ నౌఫల్ – లిసా ఆయు ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన భారత జంట తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన మూడో సీడ్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోకు ఓటమి ఎదురైంది. ఆరో సీడ్ లీ చియా సిన్ – టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) వరుస గేమ్‌లలో 21–12, 21–10తో అశ్విని – తనీషాలను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లోలో భారత్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ధ్రువ్ కపిల – ఎంఆర్ అర్జున్ 19–21, 23–21, 17–21 తేడాతో మలేసియాకు చెందిన జునేదీ ఆరిఫ్ – రాయ్ కింగ్ చేతిలో పరాజయంపాలయ్యారు. -
సెమీస్‌లో శ్రీకాంత్ పరాజయం
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. బాసెల్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్‌పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో జరిగిన సెమీస్‌లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు. ఈ గేమ్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్‌లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు. -
సెమీస్‌లో అల్కరాజ్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 6–1తో ఆరో ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత సినెర్ (ఇటలీ) 6–3, 6–3తో లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి అల్కరాజ్తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
‘శత’క్కొట్టిన తనుష్, తుషార్
ముంబై: బరోడా, ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతం చోటు చేసుకుంది. ముంబై జట్టుకు చెందిన చివరి వరుస బ్యాటర్లు తనుష్ కొటియన్ (129 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తుషార్ దేశ్‌పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకాలతో అదరగొట్టారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరిగే మ్యాచ్‌లు) ఒకే ఇన్నింగ్స్‌లో పదో నంబర్, పదకొండో నంబర్ బ్యాటర్లిద్దరూ సెంచరీలు చేయడం కేవలం ఇది రెండోసారికాగా, రంజీ ట్రోఫీలో మాత్రం తొలిసారి. 1946లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా సర్రే కౌంటీ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున పదో నంబర్ ప్లేయర్ చందూ సర్వాతే (124 నాటౌట్), పదకొండో నంబర్ ప్లేయర్ శుతె బెనర్జీ (121) సెంచరీలు చేశారు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓవర్‌నైట్ స్కోరు 379/9తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 132 ఓవర్లలో 569 పరుగులకు ఆలౌటైంది. తనుష్, తుషార్ సెంచరీలు చేయడంతోపాటు పదో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఒక పరుగు తేడాతో రంజీ రికార్డును సమం చేసే అవకాశం కోల్పోయారు. 1992 రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అజయ్ శర్మ–మణీందర్ సింగ్ పదో వికెట్‌కు 233 పరుగులు జత చేశారు. ముంబై నిర్దేశించిన 606 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ సెషన్ తర్వాత రెండు జట్ల కెపె్టన్లు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబై జట్టు సెమీఫైనల్ చేరుకుంది. విదర్భ విజయం నాగ్‌పూర్‌లో కర్ణాటకతో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ 127 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. విదర్భ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 62.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు హర్‡్ష దూబే (4/65), ఆదిత్య సర్వాతే (4/78) కర్ణాటకను దెబ్బ తీశారు. మార్చి 2 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో విదర్భ; తమిళనాడుతో ముంబై తలపడతాయి. -
సెమీస్‌లో వైదేహి–రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోర్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–2, 6–1తో మూడో సీడ్ కరోల్ మొనెట్ (ఫ్రాన్స్) –యషీనా (రష్యా) జంటపై నెగ్గింది. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
భారత్ X జర్మనీ
కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్‌కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్‌గా నిలిచింది. అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్ నాలుగో సారి ఫైనల్ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్ తేడాతో డచ్‌పై జయభేరి మోగించింది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్ కీపర్ మోహిత్‌తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడుతుంది. -
డేవిస్ కప్ సెమీస్‌లో సెర్బియా
మలగ (స్పెయిన్): ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్‌కు చేర్చాడు. తద్వారా డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్ ఈవెంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో లోమిర్ కెమనొవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)ను ఓడించగా... రెండో సింగిల్స్‌లో జొకోవిచ్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్ లాజొవిక్తో కలిసి జొకోవిచ్ డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. డేవిస్ కప్ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్ స్టార్ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్‌గా ఈ టీమ్ ఈవెంట్లో రికార్డు స్థాయిలో జొకోవిచ్ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్‌నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్‌లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్‌లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. -
NZ VS SL: పెరీరా మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం: కేన్ విలియమ్సన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపుతో పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్ ఆశలు వదులుకున్నాయి. ఈ గెలుపుతో పాయింట్లతో పాటు రన్‌రేట్‌ను సైతం భారీగా మెరుగుపర్చుకున్న కివీస్.. పాక్, ఆఫ్ఘన్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా సెమీస్‌కు చేరే అవకాశాలు లేకుండా చేసింది. ఏదో అద్భుతాలు జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేవు. కివీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు.. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే అతను ఔటయ్యాక ఏ ఒక్క లంక బ్యాటర్ కూడా రాణించకపోవడంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో తీక్షణ (38 నాటౌట్), మధుషంక (19) పోరాడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ట్రెంట్ బౌల్ట్ (10-3-37-3) లంక బ్యాటర్లను గడగడలాడించగా.. రచిన్ రవీంద్ర (2/21), ఫెర్గూసన్ (2/35), సాంట్నర్ (2/22) సత్తా చాటారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కాన్వే (45), రచిన్ (42) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరితో పాటు డారిల్ మిచెల్ (43) కూడా రాణించడంతో కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాలుగా ఉండింది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబడ్డాం. ఛేదనలో పిచ్ బాగా నెమ్మదించింది. మా బ్యాటర్లు కృత నిశ్చయం కలిగి బ్యాటింగ్ చేశారు. వరుణుడు అడ్డుతగులుతాడేమోనని భయపడ్డాం. పరుగులు అంత ఈజీగా రాలేదు. ఓవరాల్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లు అద్భుతం. ప్రత్యర్ధిని త్వరగా ఆలౌట్ చేసి గెలుపుకు మంచి పునాది వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగినందుకు సంతోషంగా ఉంది. పెరీరా మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం. అలాంటి ఆటగాళ్లు నిమిషాల వ్యవధిలో ఫలితాన్ని మార్చేయగలరు. అయితే మా బౌలర్లు అతన్ని త్వరగా సాగనంపి మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేశారు. ఓవరాల్‌గా మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన. సెమీస్ బెర్త్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే, ఫైనల్ ఫోర్కు చేరితే బాగుంటుంది. సెమీస్‌లో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం సవాలుగా ఉంటుంది. ఇది జట్టుగా మమ్మల్ని పరీక్షిస్తుందని విలియమ్సన్ అన్నాడు. -
CWC 2023: పాక్‌ను సెమీస్‌కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్‌కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్‌లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్‌కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్‌కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్‌పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సెమీస్ బెర్త్‌పై ఆశ చావని ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడాలని భావిస్తుంది. అయితే వారు సెమీస్‌కు చేరడం అంత ఈజీ కాదు. దాదాపుగా అసాధ్యం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్లు అద్భుతమైన పోరాటాలు చేసినప్పటికీ.. అన్ని విభాగాల్లో పటిష్టమైన సౌతాఫ్రికా దగ్గర పప్పులు ఉడకకపోవచ్చు. 438 పరుగుల తేడాతో గెలిస్తేనే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఒక్కసారైన కనీసం 300 స్కోర్ దాటని ఆఫ్ఘన్లకు ఇది స్థాయికి మించిన పనే అవుతుంది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి ఉంటే, నాలుగో సెమీస్ బెర్త్ కోసం పోటీ ఎన్నడూ లేనంత రసవత్తరంగా ఉండేది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్‌కు చేరుకోగా.. సాంకేతికంగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. సెమీస్‌కు ముందు మరో మూడు లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 11న ఆసీస్, బంగ్లాదేశ్ మధ్య నామమాత్రపు మ్యాచ్, అదే రోజు ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్, 12న భారత్,నెదర్లాండ్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరుగుతుంది. చదవండి: పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..! -
పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో సెమీస్ బెర్త్‌లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్ నాలుగో సెమీస్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుని భారత్‌తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్‌కు చేరలేవు. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు.. అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్‌పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లండ్ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్‌ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు..! -
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్‌లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్‌కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్‌కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్‌వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్‌వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్‌కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్‌కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్‌లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్‌ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్‌లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్‌లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్‌కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్‌కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్‌తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్‌తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్‌వెల్ భారీ హిట్టింగ్‌కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్‌తో కలిసి జట్టు రాతను తన బ్యాట్‌తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్‌పై 8వ వికెట్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్‌రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్‌వుడ్ (బి) మ్యాక్స్‌వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్‌వుడ్ 9–0–39–2, మ్యాక్స్‌వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్‌లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
సెమీస్‌లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రషి్మక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక 6–2, 6–3తో వలెరి జినీనా (రష్యా)పై గెలిచింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్íÙప్లో అండర్–14 బాలుర డబుల్స్ విభాగంలో హృతిక్ కటకం (తెలంగాణ)–తవీష్ (హరియాణా) జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో హృతిక్–తవీష్ ద్వయం 6–4, 7–5తో శౌర్య–రణ్వీర్ జంటపై నెగ్గింది. సింగిల్స్‌లో హృతిక్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో హృతిక్ 6–4, 6–1తో అనురాగ్‌పై గెలిచాడు. -
సెమీస్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–2తో అరెవాలో (ఎల్‌సాల్వడార్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
‘రికార్డు’తో సెమీస్‌లోకి జొకోవిచ్
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. ఫ్రిట్జ్‌తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఫ్రిట్జ్‌పై విజయంతో జొకోవిచ్ రికార్డు పుస్తకాల్లోకి కూడా ఎక్కాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా కెరీర్లో 47వ సారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్న జొకోవిచ్ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (46 సార్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2011 తర్వాత సెమీస్‌లోకి బోపన్న పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 43 ఏళ్ల బోపన్న 2011 తర్వా త యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–6 (12/10), 6–1తో లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయంపై గెలిచింది. వరుసగా మూడో ఏడాది... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచింది. తొమ్మిదో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా... మరో క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అన్‌సీడెడ్ అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ 3 గంటల 7 నిమిషాల్లో 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో అమెరికాకే చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత 23 ఏళ్లలో ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఐదో అన్‌సీడెడ్ ప్లేయర్‌గా షెల్టన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో టాడ్ మార్టిన్ (అమెరికా; 2000లో), రాబీ జినెప్రి (అమెరికా; 2005లో), మిఖాయిల్ యూజ్నీ (రష్యా; 2006లో), దిమిత్రోవ్ (బల్గేరియా; 2019లో) ఉన్నారు. సెమీఫైనల్లో జొకోవిచ్పై షెల్టన్ గెలిస్తే 1996లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఆ్రస్టేలియా) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఘనత సాధిస్తాడు. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
పుణే: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–10, 18–21, 21–16 స్కోరుతో కార్తికేయ కుమార్‌పై విజయం సాధించాడు. ఇతర పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, హర్షీల్ దాని, మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జంట సెమీస్‌లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా 21–16, 21–12 తేడాతో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అస్మిత చలీహ సెమీస్ చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో హేమనాగేంద్ర–కనికా కన్వాల్ జోడి సెమీస్ చేరుకుంది. ఇషాన్ భట్నాగర్ –తనీషా క్రాస్టో జంట వీరికి వాకోవర్ ఇచ్చింది. -
హర్మన్, జెమీమా పోరాటం వృథా.. సెమీస్‌లో టీమిండియా ఓటమి
2017 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్... 2020 టి20 వరల్డ్‌కప్ ఫైనల్... 2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్... గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు వేదన మిగుల్చుతున్న నాకౌట్ మ్యాచ్‌ల పరాజయాల జాబితాలో మరొకటి చేరింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో పోరులో చివరి వరకు పోరాడినా మన జట్టుకు ఓటమి తప్పలేదు. తాజా టి20 వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రస్థానం సెమీస్‌కే పరిమితమైంది. రెండు మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు గెలుపు ఆశలు రేపినా... గెలుపు గీత దాటలేక జట్టు నిరాశగా నిష్క్రమించింది. కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆట ముగిసింది. గత టోర్నీ రన్నరప్ అయిన భారత్ ఈసారి సెమీఫైనల్లో ఆసీస్‌కే తలవంచింది. గురువారం ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), మెగ్ లానింగ్ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లీ గార్డ్నర్ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆసీస్ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్‌కు ఇది ఏడో ఫైనల్ కాగా, నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు తలపడుతుంది. లానింగ్ జోరు... ఆ్రస్టేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ (26 బంతుల్లో 25; 3 ఫోర్లు), మూనీ శుభారంభం అందించారు. రేణుక వేసిన తొలి బంతినే హీలీ ఫోర్‌గా మలచడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి వికెట్‌కు 52 పరుగులు (45 బంతుల్లో) జోడించిన అనంతరం రాధా యాదవ్ బౌలింగ్‌లో హీలీ స్టంపౌట్ అయింది. అనంతరం మూనీ, లానింగ్ కలిసి జట్టును నడిపించారు. భారత ఫీల్డర్లు వదిలేసిన రెండు క్యాచ్‌లు కూడా వీరికి కలిసొచ్చాయి. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆసీస్ 69 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆ్రస్టేలియా జోరు పెంచింది. శిఖా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మూనీ అదే ఓవర్లో వెనుదిరిగినా... స్నేహ్ రాణా ఓవర్లో లానింగ్, రాధ ఓవర్లో గార్డ్నర్ రెండేసి ఫోర్లు కొట్టారు. చివర్లో ఐదు బంతుల వ్యవధిలో భారత్ 2 కీలక వికెట్లు తీసినా... రేణుక వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 20 పరుగులు రాబట్టి లానింగ్ ఘనంగా ముగించింది. చివరి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 103 పరుగులు సాధించగా... ఇందులో ఆఖరి 5 ఓవర్లలో వచి్చన 59 పరుగులు ఉన్నాయి. కీలక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. 4 ఓవర్లు ముగిసేలోపే 28 పరుగులకు టాప్–3 బ్యాటర్లు షఫాలీ (9), స్మృతి మంధాన (2), యస్తిక భాటియా (4) పెవిలియన్ చేరారు. ఈ దశలో జెమీమా, హర్మన్ భాగస్వామ్యం గెలుపుపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి ధాటిగా ఆడారు. వీరి దూకుడుకు ఆసీస్ బౌలర్లు కొద్దిసేపు అచేతనంగా మారిపోయారు. అయితే ఇదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జెమీమా వెనుదిరిగింది. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 41 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. మరోవైపు హర్మన్ మాత్రం తగ్గకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయింది. 36, 37 పరుగుల వద్ద కీపర్ హీలీ తన క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన హర్మన్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే కీలక దశలో హర్మన్ రనౌట్ కావడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. చివర్లో రిచా (14), దీప్తి శర్మ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడినా విజయానికి అది సరిపోలేదు. హర్మన్ రనౌట్‌తో... మ్యాచ్‌కు కొద్దిసేపు క్రితం వరకు కూడా జ్వరం కారణంగా ఆడలేని స్థితిలో ఉన్న కెప్టెన్ హర్మన్ పట్టుదలగా బరిలోకి దిగింది. మెరుపు బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తెచ్చిం ది. విజయం కోసం 33 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రెండో పరుగుకు ప్రయత్నిస్తూ క్రీజ్‌లో చేరే సమయంలో బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోవడంతో హర్మన్ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో ఆట ఆసీస్ వైపు మొగ్గింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే... ఫీల్డింగ్‌లో వదిలేసిన రెండు క్యాచ్‌లు భారత్‌ను నష్టపరిచాయి. లానింగ్ 1 వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రిచా, 32 వద్ద మూనీ క్యాచ్‌ను షఫాలీ వర్మ వదిలేశారు. వీటి నష్టం ఏకంగా 70 పరుగులు! వీటిని పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (స్టంప్డ్) రిచా (బి) రాధ 25; మూనీ (సి) షఫాలీ (బి) శిఖా 54; లానింగ్ (నాటౌట్) 49; గార్డ్నర్ (బి) దీప్తి 31; హారిస్ (బి) శిఖా 7; ఎలీస్ పెర్రీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–52, 2–88, 3–141, 4–148. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–41–0, దీప్తి శర్మ 4–0–30–1, శిఖా పాండే 4–0–32–2, రాధ యాదవ్ 4–0–35–1, స్నేహ్ రాణా 4–0–33–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) షుట్ 9; స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 2; యస్తిక (రనౌట్) 4; జెమీమా (సి) హీలీ (బి) బ్రౌన్ 43; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 52; రిచా (సి) తాలియా (బి) బ్రౌన్ 14; దీప్తి (నాటౌట్) 20; స్నేహ్ రాణా (బి) జొనాసెన్ 11; రాధ (సి) పెర్రీ (బి) గార్డ్నర్ 0; శిఖా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–11, 2– 15, 3–28, 4–97, 5–133, 6–135, 7–157, 8– 162. బౌలింగ్: యాష్లీ గార్డ్నర్ 4–0–37–2, షుట్ 4–0–34–1, డార్సీ బ్రౌన్ 4–0–18–2, ఎలీస్ పెర్రీ 1–0–14–0, జొనాసెన్ 3–0–22–1, వేర్హామ్ 3–0–29–0, తాలియా మెక్‌గ్రాత్ 1–0–13–0. -
జ్వెరెవ్ జోరు
న్యూయార్క్: ‘బిగ్ త్రీ’ నీడలో ఇన్నాళ్లూ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో వెనుకబడిపోయిన జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరో అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 27వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 1–6, 7–6 (7/5), 7–6 (7/1), 6–3తో గెలుపొందాడు. 1995లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. జూనియర్‌స్థాయి నుంచి తన ప్రత్యర్థిగా ఉన్న చోరిచ్తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జ్వెరెవ్ తొలి సెట్లో తేలిపోయాడు. మూడు డబుల్ ఫాల్ట్‌లు, 12 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి జ్వెరెవ్ గాడిలో పడ్డాడు. ఈ సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లో జ్వెరెవ్ పైచేయి సాధించాడు. మూడో సెట్లోనూ ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్‌లోనే ఫలితం వచ్చింది. ఈసారీ జ్వెరెవ్ ఆధిక్యం కనబరిచాడు. టైబ్రేక్‌లో రెండు సెట్లను కోల్పోయిన చోరిచ్ నాలుగో సెట్లో తడబడ్డాడు. ఎనిమిదో గేమ్‌లో చోరిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరెవ్ ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన జ్వెరెవ్ కేవలం రెండోసారి మాత్రమే సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి అతను సెమీస్ చేరి డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో జ్వెరెవ్ ఆడతాడు. బుస్టా పోరాటం... ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)తో తొలి సెట్లో 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ కోపంలో బంతిని వెనక్కి కొట్టడం... అదికాస్తా లైన్ జడ్జికి తగలడంతో... నిర్వాహకులు జొకోవిచ్పై అనర్హత వేటు వేశారు. దాంతో పూర్తిస్థాయి మ్యాచ్ ఆడకుండానే కరెనో బుస్టా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టాకు 12వ సీడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 4 గంటల 8 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టా 3–6, 7–6 (7/5), 7–6 (7/0), 0–6, 6–3తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఒసాకా అలవోకగా... కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 6–3, 6–4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లో 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)తో పోరాటానికి సిద్ధమైంది. షెల్బీ రోజర్స్‌తో 80 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా ఏడు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. సెమీస్‌లో సెరెనా అమెరికా స్టార్ సెరెనా వరుసగా 11వ సారి యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరింది. బుధవారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌లో మూడో సీడ్ సెరెనా 4–6, 6–3, 6–2తో స్వెతానా పిరన్కోవా (బల్గేరియా)పై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా వెంటనే కోలుకుంది. రెండో సెట్లోని ఎనిమిదో గేమ్‌లో పిరన్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–3తో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో పిరన్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్‌కురా (థాయ్‌లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్‌లాండ్) జోడీని ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్‌షిప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
సెమీస్‌లో శ్రీకాంత్
హాంకాంగ్: అదృష్టం కలిసి వస్తుండటంతో... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ను శ్రీకాంత్ 21–13తో గెలిచిన తర్వాత... గాయం కారణంగా చెన్ లాంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఓవరాల్‌గా చెన్ లాంగ్‌పై శ్రీకాంత్‌కిది రెండో విజయం. గతంలో ఆరుసార్లు చెన్ లాంగ్ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్ టోర్నీలో సెమీస్ చేరిన తర్వాత శ్రీకాంత్ మరో టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశను అధిగమించడం ఇదే తొలిసారి. నేడు జరిగే సెమీఫైనల్లో లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో లీ చెయుక్ యియు 21–14, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడాల్సింది. అయితే మొమోటా టోర్నీ నుంచి వైదొలగడంతో శ్రీకాంత్‌కు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. మొమోటా చేతిలో శ్రీకాంత్ ఇప్పటివరకు 12 సార్లు ఓడిపోయి, మూడుసార్లు గెలిచాడు. శ్రీకాంత్ చివరిసారి మొమోటాపై 2015లో గెలుపొందడం గమనార్హం. -
ముంబై ఆశలపై వర్షం
ఆలూరు (బెంగళూరు): విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో ముంబై సెమీస్ చేరే అవకాశాన్ని వర్షం అడ్డుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై విజయం దిశగా సాగుతున్న దశలో వర్షం రావడం... వాన ఎంతకూ తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాకుండానే రద్దయింది. దాంతో నిబంధనల ప్రకారం లీగ్ దశలో ముంబై (4) కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఛత్తీస్‌గఢ్ (5)కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులతో ఉన్న సమయంలో వాన కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వీజేడీ పద్ధతి ద్వారా ముంబై లక్ష్యాన్ని 40 ఓవర్లలో 192 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ముంబై 11.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులతో ఉండగా... వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (38 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తమిళనాడు, పంజాబ్ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్స్ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే రద్దయింది. మొదట తమిళనాడు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 39 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. పంజాబ్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులతో ఉన్న సమయంలో వాన కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో లీగ్ దశలో పంజాబ్ (5) విజయాల కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన తమిళనాడు (9) సెమీస్ చేరింది. 23న జరిగే సెమీఫైనల్స్‌లో కర్ణాటకతో ఛత్తీస్‌గఢ్; గుజరాత్‌తో తమిళనాడు తలపడతాయి. -
నాలుగు పతకాలు ఖాయం
చెన్నై: మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు సెమీస్ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (భారత్) 5–0తో అనస్తాసియ సిగెవ (రష్యా)పై విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో పూజా రాణి (భారత్) 4–1తో లారా మమెద్కులోవ (రష్యా)పై గెలిచి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదే విధంగా మహిళల క్వార్టర్స్‌లో నీరజ్ (57 కేజీలు) 4–1తో సయాన సగతేవ (రష్యా)పై గెలవగా... జాని (60 కేజీలు) 5–0తో అనస్తాసియ ఒబుషెంకోవ (బెలారస్)ను ఓడించి సెమీస్ చేరింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత పింకీ జాంగ్రా (51 కేజీలు)కు మాత్రం క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 0–5తో యులియా అపనసోవిచ్ (బెలారస్) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ గేమ్ పసిడి పతక విజేత గౌరవ్ సొలంకీ (56 కేజీలు), గోవింద్ సహాని (49 కేజీలు), సంజిత్ (91 కేజీలు),అభిషేక్ (52 కేజీలు) క్వార్టర్స్ చేరారు. -
సమఉజ్జీల సమరం
లార్డ్స్: క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానం సమఉజ్జీల సమరానికి వేదిక కానుంది. ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తలపడనుంది. ఇంగ్లండ్‌పై గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్.. శ్రీలంక చేతిలో ఎదురైన అనూహ్య పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇంగ్లండ్ భావిస్తున్నాయి. 1992 తర్వాత ప్రపంచ కప్ వేదికపై ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఓడించలేదు. గత రికార్డులతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలనే లక్ష్యంతో మోర్గాన్ బృందం ఉంది. ఏదేమైనా రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం. ఓపెనర్ల బెంగ.. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ తొడ కండరాల గాయంతో దూరమైనప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఓపెనింగ్ బెంగ మొదలైంది. రాయ్ స్థానంలో వచ్చిన విన్స్ గత రెండు మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అయితే సోమవారం చేసిన స్కానింగ్‌లో రాయ్ గాయం తగ్గిందని నిర్ధారణ అయింది. అదే విధంగా రాయ్ సోమవారం నెట్స్‌లో సాధన కూడా చేశాడు. ఆసీస్‌పై 47.43 సగటుతో 759 పరుగులు చేసిన ఈ ఓపెనర్‌కు మంచి రికార్డుంది. నేటి మ్యాచ్‌లో రాయ్ బరిలోకి దిగితే ఇంగ్లండ్ ఓపెనింగ్ కష్టాలు తీరినట్టే. గెలుపు తప్పనిసరి... శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరే సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. శ్రీలంకపై బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేసినా ఇతర సభ్యుల నుంచి సహకారం లభించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని గెలవాల్సిన పరిస్థితి. ఒక మ్యాచ్ గెలిచినా వెళ్తుంది కానీ అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఈ ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు ఏర్పడుతుంది. అయితే ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లను పటిష్టమైన ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్‌లతో ఆడాలి. ఇటువంటి పరిస్థితిల్లో నేడు జరిగే ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇంగ్లండ్ పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అదే విధంగా స్లో వికెట్లపై తడబడుతుండటం మోర్గాన్ సేనకు ప్రతికూలాంశం. ఆత్మవిశ్వాసంతో కంగారులు... మరోవైపు టోర్నీలో కేవలం భారత్ చేతిలో మాత్రమే ఓడిన ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓటమి అనంతరం హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కంగారులు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నారు. వార్నర్, ఫించ్‌లు సూపర్ ఫామ్‌లో ఉండడం, స్మిత్, ఖాజాలు నిలకడగా రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చివర్లో ఫినిష్ చేయడానికి మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీలు ఉండనే ఉన్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 381 పరుగులు చేసినా కేవలం 48 పరుగులతో గెలవడంతో బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఆసీస్‌కు ఏర్పడింది. మిచెల్ స్టార్క్ (15 వికెట్లు), కమిన్స్, కూల్టర్ నైల్ రాణిస్తున్నా లెగ్ స్పిన్నర్ జంపా మాత్రం భారీగా పరుగులిస్తుండటం ఆసీస్‌ను ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో నాథన్ లయన్‌కి చాన్స్ దొరికే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై గత మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 308 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 259 పరుగులు చేసింది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. లార్డ్స్‌లో మంగళవారం వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చిరుజల్లులు కురిసినా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కాకపోవచ్చు. ముఖాముఖి రికార్డు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 147 వన్డేలు జరిగాయి. ఇంగ్లండ్ 81 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 61 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు మ్యాచ్‌లు ‘టై’కాగా... మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు ఇంగ్లండ్, ఐదుసార్లు ఆస్ట్రేలియా గెలిచాయి. ఇంగ్లండ్ నెట్స్‌లో అర్జున్ టెండూల్కర్ ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్‌కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తనవంతు సహాయం చేశాడు. సోమవారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అర్జున్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు. ఎడంచేతి ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ ఇంగ్లండ్ స్పిన్ సలహాదారుడు సక్లాయిన్ ముస్తాక్ పర్యవేక్షణలో బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేయడం అర్జున్‌కు కొత్తేం కాదు. ఇది వరకు 2015 యాషెస్ సందర్భంగా కూడా అర్జున్ ఇంగ్లండ్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఇటీవల మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)తరపున బరిలో దిగిన 19 ఏళ్ల అర్జున్.. సర్రే సెకండ్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 11 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. జట్లు (అంచనా) ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విన్స్/జేసన్ రాయ్, జో రూట్, బెన్ స్టోక్స్, బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, ఆర్చర్, ప్లంకెట్/వుడ్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అలెక్స్ క్యారీ, కూల్టర్ నైల్, కమిన్స్, స్టార్క్, జంపా/నాథన్ లయన్. -
టాటా ఓపెన్ టోర్నీ ఫైనల్లో వృశాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఎనిమిదో సీడ్ వృశాలి 21–11, 21–12తో ముగ్ధా ఆగ్రే (భారత్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అష్మిత (భారత్) 21–19, 21–19తో నాలుగో సీడ్ చానన్‌చిడా జుచారోన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి వృశాలితో ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ (భారత్) 17–21, 21–9, 21–12తో కంటావత్ లీలావెచబుర్ (థాయ్‌లాండ్)పై గెలుపొంది ఫైనల్ చేరాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంట 21–18, 9–21, 25–23తో రుతుపర్ణ పాండా–ఆరతి సునీల్ (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి–అర్జున్ రామచంద్రన్ ద్వయం 21–16, 20–22, 21–14తో టిన్ ఇస్రియానెత్– తనుపట్ విరియాంగ్‌కురా (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. -
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో లక్ష్యసేన్
భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ లక్ష్యసేన్ 21–8, 21–18తో ఆదిల్ అలీ సాదికిన్ (మలేసియా)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. అండర్–19 పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో హైదరాబాదీ జోడి శ్రీకృష్ణ సాయికుమార్–విష్ణువర్ధన్ గౌడ్ 11–21, 8–21తో యాంగ్ షిన్–చాన్ వాంగ్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. -
సెరెనా సెమీస్‌కు...
ఆరుసార్లు యూఎస్ చాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ మరో టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ అమెరికన్ స్టార్ 6–4, 6–3తో 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 2016లో ఇక్కడ జరిగిన సెమీస్‌లో ప్లిస్కోవా చేతిలో ఎదురైన పరాజయానికి బదులుతీర్చుకుంది. గంటన్నర (1.26 ని.)లోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 13 ఏస్‌లను సంధించి, 35 విన్నర్లు ఆడింది. సెమీఫైనల్లో అమెరికా నల్లకలువ 19వ సీడ్ అనస్తసిజా సెవస్తోవా (లాత్వియా)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–7 (5/7), 6–3, 7–6 (7/4), 6–2 జాన్ ఇస్నర్ (అమెరికా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో నాదల్... డెల్‌పొట్రోతో తలపడతాడు. -
వియత్నాం ఓపెన్ టోర్నీ సెమీస్‌లో అజయ్ జయరామ్
తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జయరామ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో యువ ఆటగాడు మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో జయరామ్ 26–24, 21–17తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందగా... మిథున్ 17–21, 21–19, 21–11తో జెకి జౌ (చైనా)ను ఓడించాడు. -
సెమీస్‌లో హుసాముద్దీన్
న్యూఢిల్లీ: కెమిస్ట్రీ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కే జీలు) సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జర్మనీలో జరిగిన క్వార్టర్స్‌లో హుసాముద్దీన్ 5–0తో అల్వాడి (జోర్డాన్)పై విజయం సాధించాడు. హుసాముద్దీన్‌తో పాటు మదన్ (56 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)లు కూడా సెమీస్‌కు చేరారు. మరోవైపు ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో శివ థాపా (60 కేజీలు), మన్దీప్ (69 కేజీలు), వాన్‌లింపుయా (75 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు) సెమీస్‌కు అర్హత సాధించారు. -
సెమీస్‌లో దివిజ్, పురవ్ జోడీలు
పారిస్: లియోన్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ క్రీడాకారులు దివిజ్ శరణ్, పురవ్ రాజాలు వేర్వేరు భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్ శరణ్–గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) ద్వయం 6–7 (7/9), 7–6 (10/8), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్ ఫైనల్లో పురవ్ రాజా–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ 7–5, 6–4తో జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 7–5, 4–6, 7–10తో రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
సిడ్నీ ఓపెన్ సెమీస్‌లో బోపన్న జంట
సిడ్నీ: భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న తన భాగస్వామి ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలిసి సిడ్నీ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సిడ్నీలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నాలుగో సీడ్ ఫ్యాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–నికోలస్ మొన్రో (అమెరికా) జంటను కంగుతినిపించింది. -
సెమీస్‌లో రుత్విక
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక 17–21, 21–10, 21–17తో హైదరాబాద్‌కే చెందిన రెండో సీడ్ కుదరవల్లి శ్రీకృష్ణప్రియపై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానంలో ఉన్న శ్రీకృష్ణప్రియపై రుత్వికకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి ఇరా శర్మ సంచలన విజయంతో సెమీస్‌లోకి అడుగు పెట్టింది. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డీ ఎస్.ఎం.ఆరిఫ్ వద్ద శిక్షణ పొందుతోన్న 17 ఏళ్ల ఇరా క్వార్టర్ ఫైనల్లో 18–21, 21–18, 21–19తో టాప్ సీడ్ రితూపర్ణ దాస్ (భారత్)ను బోల్తా కొట్టించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 24–22, 23–21తో ఇంకారత్–తనూపత్ (థాయ్‌లాండ్) జోడీపై గెలిచింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రియా ముఖర్జీ (భారత్)తో ఇరా శర్మ; థినా (మలేసియా)తో రుత్విక తలపడతారు. -
పసిడి పోరుకు శ్యామ్
సెమీస్‌లో సంచలన విజయం న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ అదరగొట్టాడు. బ్యాంకాక్‌లో గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 49 కేజీల విభాగంలో తలపడిన శ్యామ్... గ్యాంకుయాగ్ గ్యాన్ ఎర్డ్నె (మంగోలియా)పై సంచలన విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించాడు. 2015లో ఈ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించిన శ్యామ్ మరోసారి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు. ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ హసన్‌బోయ్ డస్మటోవ్ (ఉజ్బెకిస్థాన్) తో అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ టోకస్ (64 కేజీ)... అబ్దుర్ రైమోవ్ ఎల్నూర్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 2015లో కూడా రోహిత్ కాంస్యం సాధించాడు. -
హారిక ‘హ్యాట్రిక్’
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి సెమీస్‌కు టెహరాన్ (ఇరాన్): మరోసారి టైబ్రేక్‌లో పైచేయి సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 53 ఎత్తుల్లో గెలిచి... నల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు మంగళవారం నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించారు. గురువారం జరిగే సెమీఫైనల్ తొలి గేమ్‌లో తాన్ జోంగి (చైనా)తో హారిక తలపడుతుంది. ఈ టోర్నీలో హారిక విజయాలన్నీ టైబ్రేక్‌లోనే ఖాయం కావడం గమనార్హం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక వరుసగా మూడోసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2012, 2015లలో హారిక సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలను గెల్చుకుంది. -
ఎన్నాళ్లకెన్నేళ్లకు...
18 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లో మిర్యానా క్వార్టర్స్‌లో ఐదో సీడ్ ప్లిస్కోవాపై విజయం రెండో సీడ్ సెరెనాతో సెమీస్ పోరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: ఒకప్పుడు సత్తా ఉండి, సమస్యల కారణంగా మిర్యానా కెరీర్ ఛిన్నాభిన్నం అయినా... ఇప్పుడు జీవితంలో కుదురుకున్నాక తన రాకెట్‌తో మళ్లీ మెరిపిస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన 34 ఏళ్ల మిర్యానా లూసిచ్ అచ్చెరువొందే ఆటతీరుతో అదరగొడుతోంది. గతంలో వరుసగా ఏడుసార్లు ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ క్రొయేషియా క్రీడాకారిణి ఈసారి మాత్రం తన ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ వారిని ఇంటిముఖం పట్టిస్తోంది. తాజాగా మిర్యానా ధాటికి ఐదో సీడ్, గత ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. బుధవారం గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్ మిర్యానా 6–4, 3–6, 6–4తో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్–5లోపు క్రీడాకారిణిని మిర్యానా ఓడించడం ఇది రెండోసారి. రెండో రౌండ్లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) పై కూడా మిర్యానా గెలిచింది. మిర్యానా 1999లో చివరిసారి వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ప్లిస్కోవా, మిర్యానా దూకుడుగానే ఆడారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఏకంగా 14 సర్వీస్ బ్రేక్‌లు నమోదయ్యాయి. ఆరంభంలో సర్వీస్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన మిర్యానా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ప్లిస్కోవా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 32 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా పుంజుకుంది. నాలుగుసార్లు మిర్యానా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆమె సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అయితే మూడో సెట్లో మిర్యానా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్నా, ప్లిస్కోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి మిర్యానా విజయాన్ని ఖాయం చేసుకుంది. సెరెనా అదే జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై అలవోకగా గెలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 10 ఏస్‌లు సంధించింది. తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఎదురులేని నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో నాదల్ 6–4, 7–6 (9/7), 6–4తో మూడో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించగా... దిమిత్రోవ్ 6–3, 6–2, 6–4తో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. నాదల్, దిమిత్రోవ్ మధ్య రెండో సెమీఫైనల్ శుక్రవారం జరుగుతుంది. రావ్‌నిచ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి సెట్లో, మూడో సెట్లో ఒక్కోసారి రావ్‌నిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. రెండో సెట్లో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్ పైచేయి సాధించాడు. రావ్‌నిచ్ 14 ఏస్‌లు సంధించినా... 32 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు ఒక్కసారి కూడా నాదల్ సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సంపాదించడంలో విఫలమయ్యాడు. బోపన్న జంటపై సానియా జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట సెమీఫైనల్‌కు చేరింది. 67 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా–డోడిగ్ ద్వయం 6–4, 3–6, 12–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంటను ఓడించింది. జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి జీల్ దేశాయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐదో సీడ్ ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)తో జరిగిన మూడో రౌండ్లో జీల్ తొలి సెట్లో 3–5తో వెనుకబడిన దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. నమ్మశక్యంగా లేదు. దేవుడు నాకు అండగా నిలిచాడని మాత్రం చెప్పగలను. ఈ రోజును, గత రెండు వారాలను నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. –మిర్యానా నేటి సెమీఫైనల్స్ వీనస్ విలియమ్స్ vs కోకో వాండెవె సెరెనా విలియమ్స్ vs మిర్యానా లూసిచ్ ఉదయం గం. 7.30 నుంచి రోజర్ ఫెడరర్ vs వావ్రింకా మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వాందివేగీ మరో సంచలనం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో అమెరికా క్రీడాకారిణి వాందివేగీ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత రెండు రోజుల క్రితం ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారణి ఎంజెలిక్ కెర్బర్ ను ఓడించి సంచలనం సృష్టించిన వాందివేగీ.. తాజాగా స్పెయిన్ కు చెందిన ఏడో సీడ్ గార్బెన్ ముగురుజాను ఓడించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో 6-4, 6-0 తేడాతో ముగురుజాపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచిన వాందివేగీ.. తాను కూడా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో ఉన్నానంటూ మేటి క్రీడాకారిణులకు సవాల్ విసిరింది. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో గెలిచిన వీనస్ విలియమ్స్ తో వాందివేగీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. వీనస్ విలియమ్స్ 6-4, 7-6(3)తేడాతో అనస్తసియాపై గెలిచి సెమీస్ కు చేరింది. -
సెమీస్‌లో ముంబై మహారథి
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో ముంబై మహారథి జట్టు సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు 4–3 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. ముంబైతోపాటు ఇప్పటికే హరియాణా, జైపూర్, పంజాబ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఢిల్లీ, యూపీ దంగల్ జట్లు ఆడిన నాలుగేసి మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ముంబై జట్టులో హసనోవ్ (74 కేజీలు), వికాస్ (65 కేజీలు), ఎరీకా వీబ్ (75 కేజీలు), పావ్లో ఓలియ్‌నిక్ (97 కేజీలు) గెలిచారు. ఢిల్లీ జట్టులో డేవిడ్ (70 కేజీలు), మరియా స్టడ్‌నిక్ (48 కేజీలు), సాక్షి మలిక్ (58 కేజీలు) విజయం సాధించారు. శనివారం జరిగే పోరులో హరియాణా హ్యామర్స్ జట్టు జైపూర్ నింజాస్‌తో తలపడుతుంది. -
విజేత భారత్
న్యూఢిల్లీ: ఆసియా కప్ జూనియర్ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో భారత జూనియర్ బృందం సత్తా చాటింది. దోహాలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 2–0తో ఉజ్బెకిస్తాన్‌పై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో దేవ్ జావియా (భారత్) 6–2, 6–1తో అజీజ్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో సందీప్ 6–3, 6–2తో బగ్రినోవ్స్కీని ఓడించాడు. ఆర్యన్, జైశ్విన్, దేవ్, సందీప్‌లతో కూడిన భారత బృందం ఈ టోర్నీలో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ 3–0తో హాంకాంగ్, ఖతార్, జోర్డాన్ జట్లను ఓడించింది. సెమీస్‌లో 2–0తో శ్రీలంకపై నెగ్గింది. -
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య 6-0, 6-2తో మల్లిక (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో దేదీప్య మహారాష్ట్రకే చెందిన పూజతో తలపడుతుంది. -
సెమీస్‌లో కశ్యప్
జెజు (కొరియా): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతోన్న ఏడో టోర్నమెంట్లో ఎట్టకేలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-8, 21-16తో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)పై విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ తలపడతాడు. -
నిషికొరి కొట్టేశాడు
ముర్రేపై సంచలన విజయం సెమీస్‌కు చేరిన జపాన్ స్టార్ వావ్రింకా, సెరెనా కూడా యూఎస్ ఓపెన్ న్యూయార్క్: రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీ నిషికొరి (జపాన్) మళ్లీ ఇన్నాళ్లకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన నిషికొరి భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 1-6, 6-4, 4-6, 6-1, 7-5తో సంచలన విజయం సాధించాడు. కీలక సమయాల్లో దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన జపాన్ ప్లేయర్ దానికి తగిన ఫలితాన్ని అందుకోగా... ఒక దశలో ముర్రే వరుసగా ఏడు గేమ్‌లు కోల్పోయాడు. మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి 17 బ్రేక్ పాయింట్లు నమోదు చేయడం విశేషం. 2014 ఫైనల్లో సిలిక్ చేతిలో ఓడిన నిషికొరి సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో తలపడతాడు. హోరాహోరీ... తొలి సెట్లో చక్కటి నియంత్రణతో ఆడిన ముర్రే ,పదునైన రిటర్న్‌ల సహాయంతో 35 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. అనంతరం రెండో సెట్లో వ్యూహం మార్చిన నిషికొరి డ్రాప్ షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. ఆసక్తికరంగా సాగిన మూడో సెట్లో స్కోరు 4-4 వద్ద సమంగా ఉన్నప్పుడు తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆ తర్వాత సెట్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగో సెట్ ఆరంభంలో ఆర్థర్ యాష్ స్టేడియంలో సౌండ్ సిస్టం వ్యవస్థ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. ఈ గోలపై రిఫరీకి ఫిర్యాదు కూడా చేసిన ముర్రే, ఈ దశలో పూర్తిగా ఏకాగ్రత కోల్పోయాడు. మరో వైపు సంయమనం పాటించిన ఆరో సీడ్ దూసుకుపోయాడు. వరుసగా ఐదో గేమ్‌లు సొంతం చేసుకొని మ్యాచ్‌ను చివరి సెట్‌కు తీసుకుపోయాడు. ఐదో సెట్లోనూ 2-0తో అతను ముందంజ వేశాడు. అయితే కోలుకున్న ముర్రే 2-2తో స్కోరును సమం చేశాడు. నిషికొరి తర్వాతి రెండు గేమ్‌లు గెలిచినా... ముర్రే వరుసగా మూడు గేమ్‌లను సొంతం చేసుకొని 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే స్కోరు మళ్లీ 5-5తో సమమైంది. ఈ దశలో అద్భుతంగా ఆడి ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన నిషికొరి తర్వాతి గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. స్టేడియంలో గోల వల్ల తాను ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా... తన ఓటమికి అది మాత్రం కారణం కాదని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల తర్వాత... మరో క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 4-6, 6-3, 6-2 స్కోరుతో ప్రపంచ 142వ ర్యాంకర్ యువాన్ డెల్‌పొట్రొ (అర్జెంటీనా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విస్ ఆటగాడు 10 ఏస్‌లు సంధించాడు. 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ డెల్పొట్రొను వావ్రింకా ఓడించడం 2008 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. వింబుల్డన్ రెండో రౌండ్లో డెల్‌పొట్రొ చేతిలో వావ్రింకా చిత్తయ్యాడు. పోరాడి గెలిచిన సెరెనా... మహిళల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌కు చేరడంలో మూడు సెట్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2 గంటల 14 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 6-2, 4-6, 6-3తో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. టోర్నీలో తొలి సారి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేసింది. అయితే 18 ఏస్‌లు కొట్టి ఆమె మ్యాచ్‌ను కాపాడుకుంది. సెమీస్‌లో సెరెనా పదో సీడ్ ప్లిస్కోవా (చెక్)తో తలపడుతుంది. ఆండీ ముర్రేతో గతంలో తలపడిన ఎనిమిది మ్యాచ్‌లలో కీ నిషికొరి ఏడు సార్లు ఓడిపోయాడు. కొద్ది రోజుల క్రితమే రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో కూడా అతనికి పరాజయం ఎదురైంది. అయితే ఈ సారి ఈ జపాన్ స్టార్ తన ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన పోరులో వరల్డ్ నంబర్ 2ను ఓడించి కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. మ్యాచ్ ఐదో సెట్‌కు వెళితే చాలు... నిషికొరి చెలరేగిపోతాడని అతని ఏటీపీ రికార్డు చెబుతోంది. ఇలాంటి మ్యాచ్‌లలో 79 శాతం నెగ్గిన ఘనత ఓపెన్ ఎరాలో ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా అతను అదే చేసి చూపించగా... ఈ క్యాలెండర్ ఇయర్లో నాలుగో స్లామ్లోనూ ఫైనల్‌కు చేరాలని భావించిన ముర్రే కోరిక తీరలేదు. 3 గంటల 57 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో చివరకు నిషికొరిదే పైచేయి అయింది. -
టైటాన్స్‌కు షాక్
వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేని తెలుగు టైటాన్స్ కీలక పోరులో చతికిలపడింది. సొంత గడ్డపై పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించినా మరోసారి సెమీఫైనల్లోనే చిత్తయ్యింది. ప్రథమార్ధంలో తెగువ చూపించినా ఆ తర్వాత పేలవ ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచింది. అటు పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకున్నా సమష్టి ఆటతీరుతో రాణించిన జైపూర్ పింక్ పాంథర్స్ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో పట్నా జట్టు పుణెరిపై గెలిచింది. * సెమీస్‌లో జైపూర్ చేతిలో ఓటమి * ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై తెలుగు టైటాన్స్‌కు షాక్ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టైటాన్స్ 24-34 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో మట్టికరిచింది. తొలి సీజన్లో విజేతగా నిలిచిన జైపూర్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. టైటాన్స్ నుంచి రాహుల్ చౌదరి 9, నీలేశ్ 6 రైడింగ్ పాయింట్లు సాధించగా జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్ 7 రైడింగ్, 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జైపూర్ జట్టు పట్నా పైరేట్స్‌తో ఢీకొంటుంది. మూడో స్థానం కోసం జరిగే పోరులో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టన్‌తో ఆడుతుంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు కొదమసింహాల్లా తలపడడంతో పాయింట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. దీంతో 18వ నిమిషం వరకు కూడా స్కోరు 8-8తో సమానంగానే ఉంది. ఈ దశలో టైటాన్స్‌కు నీలేష్ ఓ పాయింట్ తేగా వెంటనే జైపూర్‌కు అజయ్ కుమార్ రెండు పాయింట్లు తేవడంతో 10-9తో పైచేయి సాధించింది. ఆ తర్వాత రాహుల్ విజయవంతమైన రైడ్‌తో జట్టు ప్రథమార్ధాన్ని 11-10స్వల్పఆధిక్యంతో ముగించింది. కానీ ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆట పూర్తిగా గతి తప్పింది. దీంతో జైపూర్ రెచ్చిపోయింది. జస్వీర్ సింగ్ సూపర్ రైడింగ్‌తో అదరగొట్టాడు. దీంతో వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్‌ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒక్క పాయిం ట్నూ కోల్పోకుండా టైటాన్స్‌ను మరోసారి ఆలౌట్ చేయడంతో స్కోరు 26-14కు పెరిగింది. 33వ నిమిషంలో రాహుల్ వరుసగా తన రెండు రైడింగ్‌లలో రెండేసి చొప్పున 4 పాయింట్లు సాధించాడు. 34వ నిమిషంలో జైపూర్ సూపర్ ట్యాకిల్‌లో రాహుల్‌ను అవుట్ చేసి రెండు పాయింట్లు రాబట్టింది. చివరి రెండు నిమిషాల్లో వ్యత్యాసం పది పాయింట్లు తేడా ఉండడంతో టైటాన్స్ చేసేదేమీ లేకుండా పోయింది. పట్నా వరుసగా రెండోసారి: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఈ జట్టు 37-33 తేడాతో పుణెరి పల్టన్‌పై నెగ్గింది. పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 8, రాజేశ్ 6 రైడింగ్ పాయింట్లతో రాణించగా కుల్దీప్ 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పుణెరిలో దీపక్ హుడా 9 పాయింట్లు సాధించాడు. తొలి పది నిమిషాలపాటు మ్యాచ్ 6-6 పాయింట్లతో పోటాపోటీగా సాగింది. ఈ దశలో పర్మోద్ నర్వాల్ మూడు పాయింట్లు తేవడంతో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లినా మరో ఆరు నిమిషాల వరకు పట్నా హవా సాగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 15-9తో పుంజుకుంది. ఇదే జోరుతో తొలి అర్ధభాగాన్ని 16-13తో ముగించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి మెరుగ్గా ఆడింది. 32వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేయడంతో పుణెరి 25-22తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యం దాదాపు చివరి వరకు కాపాడుకున్నా ఆ తర్వాత మాత్రం చేజార్చుకుంది. 37వ నిమిషంలో రాజేశ్ మొండల్ రెండు పాయింట్లు తేవడంతో పట్నా మ్యాచ్‌ను 29-29తో సమం చేసింది. ఇక పర్దీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో దూసుకెళ్లిన పట్నా మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
ఓరేటర్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు ‘కైట్’
తాళ్లరేవు : అంతర్జాతీయ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఓరేటర్ 2016 చాంపియన్‌షిప్‌లో కైట్ విద్యార్థులు సెమీస్‌కు చేరినట్టు చైర్మన్ పి.వి. విశ్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని బాచుపల్లి బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రెండో రౌండ్ పోటీల్లో 10 మంది సెమీస్‌కు చేరుకున్నారని, ఆగస్టు ఏడోతేదీన ఫైనల్ పోటీలు జరుగుతాయని ఏపీ ఏరియా మేనేజర్ రతన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ విశ్వం, డైరెక్టర్ జాన్ ఉదయ్‌కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.వీరాంజనేయులు, ప్రసన్న అభినందించారు. 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి స్వల్పంగా పెరిగింది. మంగళవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ నుంచి 2,78,704 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ గేట్లను 0.60 మీటర్లు మేర పైకి లేపి ఉంచారు. బ్యారేజ్ వద్ద 9.60అడుగులు నీటి మట్టం నెలకొంది. భద్రాచలం వద్ద 25.50 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 2300 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు నాలుగు వేలు క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. -
ఫైనల్లో భారత్
తైపీ: ఆసియా టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-1తో టాప్ సీడ్ హాంకాంగ్‌ను బోల్తా కొట్టించింది. పురుషుల సెమీస్‌లో భారత్ 1-2తో పాకిస్తాన్ చేతిలో ఓడింది. -
రాణించిన ఉన్ముక్ చంద్ :ఫైనల్‌కు ఢిల్లీ
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ ఫైనల్ కు చేరింది. శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని 41.0 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్లలో శిఖర్ ధవన్(39), రిషబ్ పాంట్(18)లు కాస్త ఫర్వాలేదనిపించగా, అనంతరం ఉన్ముక్ చంద్(80 నాటౌట్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఉన్ముక్ కు నితీష్ రానా(19 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో ఢిల్లీ సునాయాసంగా ఫైనల్ కు చేరుకుంది. ఢిల్లీ మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ గౌతం గంభీర్(16), మిలంద్ కుమార్(10)లు నిరాశపరిచారు. అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ 50. 0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగల్గింది. హిమాచల్ ప్రదేశ్ ఆటగాళ్లలో ప్రశాంత్ చోప్రా(33), దోగ్రా(28),కెప్టెన్ బిపుల్ శర్మ(51)లు ఓ మోస్తరుగా రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రానా, నేగీ,భాటీలకు తలో రెండు వికెట్లు లభించగా, ఇషాంత్ శర్మ,సైనీలకు చెరో వికెట్ దక్కింది. -
భారత్ ప్రదర్శన అద్భుతం: దాల్మియా
న్యూఢిల్లీ: సెమీస్‌లో ఓటమిని పక్కనబెడితే... ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రశంసించారు. ఏడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఊహించని స్థాయిలో రాణించిందన్నారు. ‘వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రదర్శన చాలా బాగుంది. జట్టు మొత్తానికి నా అభినందనలు. మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లందరూ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు నిజమైన స్ఫూర్తితో ఆట ఆడారు. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు’ అని దాల్మియా పేర్కొన్నారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు. -
నిబంధనలు మార్చాలి: ధోని
మెల్బోర్న్: వన్డేల్లో బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రస్తుత నిబంధనలు మార్చాలని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఐసీసీ అనుసరిస్తున్న నలుగురు ఫీల్డర్ల వ్యూహం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మండలి నిబంధన ప్రకారం మ్యాచ్ మొత్తంలో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురికంటే ఎక్కువ మంది ఫీల్డర్లను ఉంచరాదు. ఈ నిబంధన భారత్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభా వం చూపిందని చెప్పిన మహీ సరైన సీమర్ ఆల్‌రౌండర్ లేకపోవడం సెమీస్‌లో దెబ్బతీసిందన్నాడు. ‘ఈ నిబంధనలను మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వన్డేల్లో గత చరిత్రను పరిశీలిస్తే డబుల్ సెంచరీలను చూడలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వ్యవధిలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయి. ఎక్స్ట్రా ఫీల్డర్‌ను సర్కిల్ లోపలికి తీసుకురావడంతో చాలా డాట్ బాల్స్ నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అదే లాజిక్ అయితే మరి 11 మందిని సర్కిల్లోనే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ వస్తాయి కదా’ అని ధోని విమర్శించాడు. వన్డేల్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు ఉంటే ఆట బోరింగ్‌గా ఉంటుందన్నాడు. ‘తొలి, చివరి 10 ఓవర్లలో ఎలాగూ టి20ల మాదిరిగా ఆడతాం. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌పైనే వన్డేలు ఆధారపడి ఉండాలి. కాబట్టి ప్రస్తుత నిబంధన చాలా కఠినంగా ఉంది. స్పిన్నర్లకు ఇది మరింత భారంగా మారింది. ప్రతి బ్యాట్స్‌మన్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో పాటు ఇతరత్రా షాట్స్ అన్నీ అడుతున్నారు’ అని మహీ వ్యాఖ్యానించాడు. -
విజయీభవ
కోట్లాదిమంది క్రీడాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా సెమీస్ సమరం మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియా అదే ఉత్సాహంతో గెలుపుపై ధీమా ప్రదర్శిస్తుండగా, సొంతగడ్డపై ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఆటగాళ్లు దుమ్మురేపాలని, ఫైనల్‌కు చేరి వరల్డ్ కప్ సాధించాలని నగర క్రీడాలోకం ప్రార్థనలు చేస్తోంది. విజయవాడ స్పోర్ట్స్ : క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్లో టీమిండియా దుమ్ము రేపుతుందన్న ఆశతో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికాపై దంచేసిన ధావన్, జింబాబ్వేపై చెలరేగిన రైనా, నాకౌట్లో సత్తా చాటిన రోహిత్‌శర్మ, అంచనాలకు అనుగుణంగా రాణించిన రహానేపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా ఊపు చూస్తుంటే డిఫెండింగ్ చాంపియన్‌గా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ కోచ్‌లు, పీడీలు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విజయం తప్పనిసరి ఈ వరల్డ్ కప్‌లో బౌలింగే మనకు బలం. మనవాళ్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్‌లో కూడా మనం నంబర్‌వన్ స్థాయిలో ఉన్నాం. ఫీల్డింగ్ కూడా బాగుంది. కూల్ కెప్టెన్‌గా ధోని చక్కటి నాయకత్వం వహిస్తున్నాడు. టీమిండియా విజయం తప్పనిసరి. - ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ఏసీఏ క్రికెట్ కోచ్ చెలరేగిపోతారు.. ఈ సెమీఫైనల్లో టీమిండియా విజయం తప్పనిసరి. కోట్లాది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై కసిగా ఆడతారు. అక్కడ పిచ్‌లకు ఇప్పటికే అలవాటు పడ్డారు. తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. కోహ్లి సెమీస్‌లో చెలరేగి ఆడతాడు. - రంభా ప్రసాద్, ఆత్యాపాత్యా సంఘ రాష్ట్ర కార్యదర్శి గెలుపు మనదే.. టీమిండియాను విజయం తప్పకుండా వరిస్తుంది. నేటి మ్యాచ్ చాలా బాగుంటుంది. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ టఫ్‌గానే సాగుతుంది. పైగా వాళ్ల సొంతగడ్డ మీద ఆడటం వల్ల ఆస్ట్రేలియాపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అది మనకు కలిసొచ్చే అంశం. - వైవీఆర్‌కే ప్రసాద్, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల పీడీ అదే థ్రిల్.. టీమిండియా అన్ని విభాగాల్లో బాగుంది. కోహ్లి చెలరేగి ఆడతాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. షమీ బౌలింగ్ చాలా బాగుంది. ఆడితే ఆస్ట్రేలియా మీద ఆడి గెలవాలి. అప్పుడే థ్రిల్. ఈసారి కూడా వరల్డ్ కప్ మనదే. - పి.వేణుగోపాల్‌రెడ్డి, వ్యాపారవేత్త -
సెమీస్‌లో సానియా జంట
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-4, 6-2తో డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-కరీన్ నాప్ (ఇటలీ) జోడీపై గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీస్‌లో లీసా రేమండ్ (అమెరికా)-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
సెమీస్‌లో తెలంగాణ, ఏపీ
విజయవాడ స్పోర్ట్స్ : చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్స్‌లో తెలంగాణ 29-23, 29-22తో బెంగాల్‌పై, ఏపీ 29-24, 29-11తో మహారాష్ట్రపై గెలిచాయి. మహిళల విభాగంలో ఏపీ జట్టు క్వార్టర్స్‌లో 29-22, 29-21తో ముంబైపై గెలిచి సెమీస్‌కు చేరింది. తెలంగాణ మహిళల జట్టు క్వార్టర్స్‌లో 9-29, 6-29తో కర్ణాటక చేతిలో ఓడింది. -
సెమీస్‌లో హైదరాబాద్, రంగారెడ్డి
అంతర్ జిల్లా స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ అంతర్ జిల్లా స్కూల్ అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్, రంగారెడ్డి బాలబాలికల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బాలుర విభాగంలో వరంగల్, ఖమ్మం జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం హైదరాబాద్ 19-18తో వరంగల్‌పై విజయం సాధించింది, హైదరాబాద్ జట్టులో కపిల్, శంకర్ చక్కటి పోరాటపటిమతో జట్టుకు విజయాన్ని అందించారు. బాలికల లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 6-1తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. ఆదివారం జరిగే బాలుర సెమీఫైనల్లో హైదరాబాద్‌తో ఖమ్మం, వరంగల్‌తో రంగారెడ్డి జట్టు తలపడతాయి. బాలికల విభాగం సెమీఫైనల్లో హైదరాబాద్‌తో వరంగల్, రంగారెడ్డి జిల్లాతో నిజామాబాద్ ఢీకొంటాయి. శనివారం జరిగిన లీగ్ ఫలితాలు ఇలా ఉన్నాయి. బాలుర లీగ్ ఫలితాలు: కరీంనగర్ 23-10తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 31-1తో నల్లగొండపై, ఖమ్మం 29-4తో ఆదిలాబాద్‌పై, వరంగల్ 26-4తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 40-11తో ఖమ్మంపై, మహబూబ్‌నగర్ 22-4తో మెదక్‌పై, ఆదిలాబాద్ 13-11తో నిజామాబాద్‌పై, ఖమ్మం 31-21తో కరీంనగర్‌పై, హైదరాబాద్ 16-2తో మెదక్‌పై గెలిచాయి. బాలికల లీగ్ ఫలితాలు: హైదరాబాద్ 23-1లో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి 28-2తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 14-4తో ఖమ్మంపై, రంగారెడ్డి 22-2తో మెదక్‌పై, నిజామాబాద్ 19-4తో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి 17-6తో వరంగల్‌పై, హైదరాబాద్ 10-0తో ఖమ్మంపై గెలుపొందాయి. -
సెమీస్‌లో సోలంకి ఓటమి
యూత్ ఒలింపిక్స్ బాక్సింగ్ నాన్జింగ్: యూత్ ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి సెమీస్‌లో చిత్తయ్యాడు. ఆదివారం నాన్జింగ్లో జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ పోరులో సోలంకి 0-3 తేడాతో పింగ్ లూ(చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీఫైనల్లో ఏ దశలోనూ ప్రత్యర్థితో పోటీపడలేకపోయిన సోలంకి సోమవారం జరిగే కాంస్య పతక పోరులో మహ్మద్ అలీ (గ్రేట్ బ్రిటన్)తో తలపడనున్నాడు. ఇక ఇతర క్రీడాంశాల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు నిరాశపరిచారు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసినప్పటికీ ‘ఎ’ ఫైనల్లో ఐదో స్థానంలో నిలిచాడు. రేసును అజయ్ 3 నిమిషాల 46.92 సెకన్లలో పూర్తి చేసినా ఆఫ్రికా రన్నర్ల ముందు నిలవలేకపోయాడు. మహిళల జావెలిన్ త్రోలో పుష్పా జకార్ నేడు ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్లో పుష్ప వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రెండవ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటిదాకా ఒకే ఒక రజత పతకం సాధించింది. -
సెమీస్‌లో స్వీప్
-
చెన్నైకి ట్రినిడాడ్ షాక్
న్యూఢిల్లీ: సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు మెరుపులు మెరిపించింది. ఒక్క విజయంతో అటు సెమీస్ బెర్త సాధించడంతో పాటు... ఇటు పటిష్టమైన చెన్నై సూపర్కింగ్సను వెనక్కినెట్టి గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచింది. దీంతో నాకౌట్ పోరులో ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ట్రినిడాడ్ బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్సకు షాకిచ్చింది.ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్కింగ్స 19.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. రైనా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. విజయ్ (24 బంతుల్లో 27; 4 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రెండో ఓవర్లోనే హస్సీ (1) అవుటైనా.... రైనా, విజయ్‌లు రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆరంభంలో వేగంగా ఆడిన చెనై్న బ్యాట్సమెన్ని కరీబియన్ బౌలర్లు మధ్యలో పూర్తిగా కట్టడి చేశారు. ఈ జోడి అవుటైన తర్వాత ధోని నిలకడను కనబర్చినా... రెండో ఎండ్‌లో సహకారం కరువైంది.ఫీల్డింగ్‌లోనూ చెలరేగిన విండీస్ ఆటగాళ్లు ముగ్గురు కీలక బ్యాట్సమెన్ను రనౌట్ చేసి చెన్నైని ఘోరంగా దెబ్బతీశారు. మొత్తానికి ఏడుగురు బ్యాట్సమెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడంతో ధోనిసేన ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఎమ్రిట్ 3, రాంపాల్, సిమ్మన్‌స చెరో రెండు వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. 17.4 ఓవర్లలో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా నిలిచే ట్రినిడాడ్... మరింత ముందుగానే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్ సిమ్మన్‌స (41 బంతుల్లో 63; 5 ఫోర్లు; 4 సిక్సర్లు) చెలరేగగా... లూయిస్ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), చివర్లో బ్రేవో (14 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్) రాణించారు. అశ్విన్, రైనా చెరో వికెట్ తీశారు. సిమ్మన్సకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: చెనై్న సూపర్కింగ్స ఇన్నింగ్స: హస్సీ (బి) రాంపాల్ 1; విజయ్ (బి) సిమ్మన్‌స 27; రైనా (సి) రాంపాల్ (బి) సిమ్మన్‌స 38; ధోని (సి) సిమ్మన్‌స (బి) ఎమ్రిట్ 25; డ్వేన్ బ్రేవో (సి) రామ్‌దిన్ (బి) ఎమ్రిట్ 2; జడేజా రనౌట్ 3; ఆల్బీ మోర్కెల్ (బి) రాంపాల్ 4; బద్రీనాథ్ రనౌట్ 3; అశ్విన్ రనౌట్ 9; హోల్డర్ (సి) సిమ్మన్‌స (బి) ఎమ్రిట్ 0; మోహిత్ శర్మ నాటౌట్ 0; ఎక్సట్రాలు: (లెగ్‌బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్లపతనం: 1-7; 2-62; 3-78; 4-84; 5-88; 6-102; 7-106; 8-116; 9-117; 10-118 బౌలింగ్: బద్రీ 4-0-24-0; రాంపాల్ 4-0-31-2; యాన్నిక్ ఓట్లే 2-0-17-0; ఎమ్రిట్ 3.4-0-21-3; సిమ్మన్‌స 2-0-10-2; నరైన్ 4-0-12-0 ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స: సిమ్మన్‌స (సి) మోహిత్ శర్మ (బి) అశ్విన్ 63; లూయిస్ ఎల్బీడబ్ల్యూ (బి) రైనా 38; డారెన్ బ్రేవో నాటౌట్ 11; ఓట్లీ నాటౌట్ 1; ఎక్సట్రాలు: (బైస్ 5, లెగ్‌బైస్ 1); మొత్తం: 15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 119. వికెట్లపతనం: 1-79; 2-116 బౌలింగ్: అశ్విన్ 4-0-24-1; అల్బీ మోర్కెల్ 2-0-18-0; జడేజా 2-0-30-0; రైనా 4-0-16-1; హోల్డర్ 2-0-17-0; బ్రేవో 1.1-0-8-0.