
పారిస్: లియోన్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ క్రీడాకారులు దివిజ్ శరణ్, పురవ్ రాజాలు వేర్వేరు భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్ శరణ్–గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) ద్వయం 6–7 (7/9), 7–6 (10/8), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)జోడీపై గెలుపొందింది.
మరో క్వార్టర్ ఫైనల్లో పురవ్ రాజా–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ 7–5, 6–4తో జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 7–5, 4–6, 7–10తో రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment