Praveen
-
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇవ్వలేదని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై రాజమండ్రిలో ఒక కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామని.. విచారణ కొనసాగుతోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని ఎస్పీ నర్సింహ కిషోర్ అన్నారు. -
రిపోర్టర్ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానం దెబ్బకు అందరూ సైలెంట్
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని మిస్టరీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/మచిలీపట్నంటౌన్/నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీ నేటికీ వీడలేదు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి బుల్లెట్ బైక్‌పై వస్తున్న ప్రవీణ్ గత సోమవారం అర్ధరాత్రి దాటాక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఆ రోజు నుంచీ ఇది రోడ్డు ప్రమాదమని పదేపదే చెబుతుండగా.. పోలీసుల వాదనతో క్రైస్తవ సమాజం తీవ్రంగా విభేదిస్తోంది.ఇది ముమ్మాటికీ హత్యేనని, దీనివెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలని క్రైస్తవ సంఘాలు ఘటన జరిగిన నాటినుంచీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాలు సంధిస్తున్న అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాధానం రాకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ప్రవీణ్‌ను పథకం ప్రకారమే అంతమొందించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే దిశగా దర్యాప్తు జరుగుతోందనే అనుమానాన్ని క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. శాంతి ర్యాలీలకు పిలుపు ప్రవీణ్ పగడాల మరణం వెనుక వాస్తవాలను బయటపెట్టాలని కోరుతూ సోమవారం రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయిలో పాస్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆదివారం కాకినాడలో పాస్టర్లు మూర్తి రాజు, స్టీఫెన్ ఆనంద్ , అంకిత్‌రెడ్డి, ఎం.విజయకుమార్, ఏకే శామ్యూల్, ఎండీ రాజు, రత్నంబాబు, చార్లెస్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కాకినాడలోని వివిధ చర్చిల పాస్టర్లు హాజరై పాస్టర్ ప్రవీణ మరణంపై చర్చించారు.సోమవారం శాంతి ర్యాలీ చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి, కాకినాడ సహా పలు జిల్లాల్లో సోమవారం భారీ ఎత్తున శాంతి ర్యాలీలు నిర్వహించేందుకు పాస్టర్ల అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. కాగా, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరులో క్రైస్తవ, మైనారీ్ట, దళిత, ప్రజా సంఘాలు, సంఘ విశ్వాసులు శాంతి ర్యాలీలు నిర్వహించారు.కేసులేమీ వద్దని టీడీపీ అధికార ప్రతినిధి అడగటమేంటి? ప్రవీణ్ పగడాలది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్య. దీనికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ పెదాల మీద నరకడం లేదా కర్రతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. భుజం మీద రాడ్డుతో కొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. తొడ దగ్గర కాలిపోయిన మార్క్స్ ఉన్నాయని చెబుతున్నారు. షర్టుపై కాళ్లతో తన్నిన షూ ప్రింట్స్ ఉన్నాయి. ప్రవీణ్ వాళ్ల ఫ్యామిలీకి ఫోన్లో ‘మీ అమ్మాయిని చంపేస్తాం. ఇక్కడ పోస్టుమార్టం వద్దు. మర్యాదగా తీసుకెళ్లిపోండి’ అనే బెదిరింపులు వచ్చాయి. – పాస్టర్ అజయ్‌బాబు, ప్రచార కమిటీ కన్వినర్, తెలంగాణ కాంగ్రెస్‘చంద్రబాబూ.. నిన్ను ఆ దేవుడు క్షమించడు’ ప్రవీణ్ మరణానికి సంబంధించిన రిపోర్టులు తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ‘చంద్రబాబూ.. నిన్ను ఆ దేవుడు క్షమించడు’. ఇది హత్య కాదు రోడ్డు ప్రమాదం అని తేల్చేయాలని చూస్తే రాష్ట్రంలోని లక్షలాది క్రైస్తవుల, జీసస్ ఆగ్రహానికి లోనవుతారు. అందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళతాం. సీసీ కెమెరా రిపోర్టు ఎక్కడ? చిన్నబిడ్డ తప్పిపోతే వెంటనే సీసీ ఫుటేజీలతో పట్టుకుంటారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది. అసలు హోం మినిస్టర్ ఎవరో, వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇప్పటివరకు తెలీదు. ఏదో బుక్ రాజ్యాంగం అంటూ ఆ దిశగా పని కానిస్తున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలి. అవసరమైతే కేసును సీబీఐకి బదిలీ చేయాలి. – కేఏ పాల్, అధ్యక్షుడు, ప్రజాశాంతి పార్టీ సీఐడీ దర్యాప్తు జరిపించాలి ప్రవీణ్ మృతిపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలి. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. క్రైస్తవులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రోజు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చే వరకు అసలు ఏం జరిగిందనేది బహిరంగ పరచాలి. – బ్రదర్ రిక్కి గూటం, జిల్లా అధ్యక్షుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, కాకినాడ సహజ మరణం కాదు ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదంలో జరిగిన మరణం కాదనే అనుమానాలు క్రైస్తవులకు ఉన్నాయి. ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత మర్నాడు ఉదయం ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలి. ఈ విషయాన్ని మతపరమైన అంశంలా చూడకుండా మానవత్వంతో ముందుకు వెళ్లి అందరి అనుమానాలు తీర్చాలి. ఆయన కాల్ హిస్టరీని మరింత లోతుగా పరిశీలన చేయాలి. – పర్ల డేవిడ్, ఒన్నెస్, సువార్తికుడు -
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు. -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల ప్రెస్ మీట్
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం
-
పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటనపై మార్గని భారత్,హర్ష కుమార్ రియాక్షన్
-
పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు.. ప్రమాదమా? లేక హత్యా?
సాక్షి, రాజమండ్రి: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిలో గామన్ బ్రిడ్జ్‌పై ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని పాస్టర్లు కోరుతున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. -
మంచి సందేశంతో ‘మహీష’
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మహీష". ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ - చిన్న సినిమాలు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడం కష్టం. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది పెద్ద నెంబర్ కాకపోవచ్చు కానీ మా మహీష సినిమా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. మా సినిమాలో విలన్ గా చేసిన విజయ్ రాజ్ గారికి మంచి పేరొస్తుంది. మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాం. త్వరలోనే మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. మహీష సినిమాలో మంచి మేసేజ్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది’ అన్నారు. ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవెంకట్. ‘మహీష మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటిగా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు నటి శ్రీలత. -
ప్రవీణ్ తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు. వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్లో ప్రవీణ్ 0–6 (28–29, 29–30, 27–28)తో వెన్‌చావో (చైనా) చేతిలో ఓడాడు. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్ శనివారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనున్నారు. -
మట్టుబెట్టి.. ప్రమాదమని నమ్మించి..
రఘునాథపాలెం: ఓ యువతితో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి భార్య, ఇద్దరు కుమార్తెలు అడ్డుగా ఉన్నారని భావించిన డాక్టర్.. తనకు ఉన్న విషయ, వైద్య పరిజ్ఞానంతో ముగ్గురినీ మట్టుబెట్టాడు. భార్య అనారోగ్యంతో ఉందని చెప్పడంతో చికిత్స పేరిట అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చిన ఆ దుర్మార్గుడు ..ఆపై ఇద్దరు చిన్నారుల ముక్కు, నోరు మూసి చంపేశాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అందరినీ నమ్మించే యత్నం చేసినా పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈమేరకు వివరాలను రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, సీఐ శ్రీహరి, ఎస్ఐ రాము వెల్లడించారు. హైదరాబాద్‌లో డాక్టర్... నర్స్‌తో సంబంధం రఘునాథపాలెం మండలం బావోజితండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య కుమారితో పాటు నాలుగేళ్ల లోపు కుమార్తెలు క్రుషిక, కృతిక ఉన్నారు. అతను పనిచేసే ఆస్పత్రిలోనే కేరళ కు చెందిన నర్స్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్య కుమారికి తెలియడంతో నిలదీస్తూ వచ్చి0ది. ప్రవీణ్ తల్లితండ్రులు, కుమారి తల్లితండ్రులు హైదరాబాద్‌కు వెళ్లి ఇరువురికీ పలుమార్లు నచ్చచెప్పారు. హైదరాబాద్ వదిలేసి వైద్య వృత్తిని ఖమ్మంలోనే కొనసాగించాలని అతని తల్లిదండ్రులు సూచించారు. అయితే ఇవేమీ పట్టని ప్రవీణ్ భార్యాబిడ్డలను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే భార్యాపిల్లలను తీసుకుని స్వగ్రామమైన బావోజీ తండాకు మే నెల రెండో వారంలో వచ్చాడు. కలిసొచ్చిన భార్య అనారోగ్యం.. స్వగ్రామానికి వచ్చాక కుమారికి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో అదును కోసం చూస్తున్న ప్రవీణ్‌కు కలిసొచ్చినట్లయింది. ఆమెకు చికిత్స పేరిట మే 27న ఇంజక్షన్ వేశాడు. ఆ తర్వాత ఆధార్ కార్డులో తప్పులు సరిదిద్దేందుకు కారులో వెళ్లి వస్తుండగా 28న కూడా ఆమె ఒంట్లో సుస్తీగా ఉందనడంతో చికిత్స కోసం వేస్తున్న ఇంజక్షన్‌తో పాటు అప్పటికే కారులో దాచిన మత్తు మందు హైడోస్ కలిపి ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కన్నుమూసింది.కాగా, తల్లికి ఇంజక్షన్ వేసిన విషయాన్ని పిల్లలు చూడడంతో వారి ముక్కు, గొంతు మూసి హత్య చేశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకున్న ప్రవీణ్ కారును తీసుకెళ్లి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించాడు. బంధువులు నమ్మకపోవడంతో... కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ప్రవీణ్‌కు స్వల్పగాయాలే కావడంతో అక్కడి నుంచి హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఘటనాస్థలికి చేరుకున్న కుమారి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం తమ అల్లుడి వ్యవహార శైలి తెలియడంతో అతనే చంపేశాడని అనుమానిస్తూ ఆందోళన చేయడమే కాక పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఘటన తర్వాత అంత్యక్రియలకు హాజరైన ప్రవీణ్ ఆ తర్వాత ముఖం చాటేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. గూగుల్ హిస్టరీతో బయటపడిన నిర్వాకంఘటనపై తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టం వచ్చేవరకు వేచిచూశారు. అందులో కుమారి శరీరంలో మత్తు మందు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపై కారులో ప్రవీణ్ ఉపయోగించిన ఇంజక్షన్ నీడిల్ లభించగా మత్తుమందు ఆనవాళ్లు కనిపించాయి. ఏ మత్తు మందు వాడితే శరీరంపై ఎంతసేపు ప్రభావం ఉంటుందనే వివరాలను ప్రవీణ్ గూగుల్‌లో వెతికినట్లు హిస్టరీ ద్వారా గుర్తించారు.ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ప్రవీణ్‌తో పాటు హత్యకు ప్రేరేపించిన అతని ప్రియురాలు సోనీ ఫ్రాన్సిపైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్సై సురేశ్, సిబ్బందిని అభినందించిన ఏసీపీ రివార్డుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. -
లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్
కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ‘స్టాండింగ్ ఒవేషన్’ అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన ‘మట్కా భవ’ డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు. -
అల్లుడు హైడ్రామా..!
రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్‌ను భార్య కుమారి ప్రశి్నస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగి ఉంటుంది? కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు. కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్‌కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
టీడీపీ నేత ప్రవీణ్ కు వాలంటీర్లు స్ట్రాంగ్ వార్నింగ్
-
ప్రవీణ్‌కు నిరాశ
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ తన అత్యుత్తమ ప్రదర్శన కూడా నమోదు చేయలేకపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 22 ఏళ్ల ప్రవీణ్ 16.45 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. ఫాబ్రిస్ జాంగో (బుర్కినఫాసో; 17.53 మీటర్లు) స్వర్ణం, యాసిర్ మొహమ్మద్ ట్రికీ (అల్జీరియా; 17.35 మీటర్లు), టియాగో పెరీరా (పోర్చుగల్; 17.08 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. 17.37 మీటర్లతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు ప్రదర్శనను ప్రవీణ్ గ్లాస్గోలో పునరావృతం చేసి ఉంటే అతని ఖాతాలో రజత పతకం చేరేది. గత ఏడాది ఆసియా క్రీడల్లో ప్రవీణ్ (17.68 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
గ్రేహౌండ్స్ కమాండో మృతి.. స్వగ్రామంలో విషాదం!
ఆదిలాబాద్: నిరుపేద కుటుంబం. కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకులు ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించారు. 2012లో పెద్ద కుమారుడు అడే ప్రవీణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడంతో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. కానీవారి ఆనందం ఎక్కువకాలం నిలువలేదు. విధి నిర్వహణలో కొడుకు ప్రాణాలు కో ల్పోవడం కుటుంబంలో విషాదం నింపింది. నా ర్నూర్ మండలం రాజులగూడకు చెందిన అడే అ నంత, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు, కు మార్తె ఉంది. అనంత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు ప్రవీణ్(35) గ్రేహౌండ్స్ కమాండోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యుత్ తీగలు తగిలి.. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లాల్సి ఉండగా ఆదివారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కమాండో ప్రవీణ్ మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామం రాజులగూడకు తీసుకువచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. ఎస్పీ గౌస్ ఆలం, 15వ బెటాలియన్ పోలీసు అధికారులు పాడే మోశారు. రాజులగూడ గ్రామం నుంచి మండల కేంద్రంలోని గాంధీచౌక్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో మాన్కాపూర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రముఖుల నివాళులు.. ప్రవీణ్ కుటుంబీకులను మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటవీ ప్రాంతంలో వేట కోసం విద్యుత్ తీగలు అమర్చిన వారిని పట్టుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో 15వ బెటాలియన్ డీఎస్పీలు పీకేఎస్ రమేశ్, జి.రమేశ్, బి.రామ్, దయానంద్, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ రెడ్డినాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్‌నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, మాజీ సర్పంచ్ రాథోడ్ సావీందర్ పాల్గొన్నారు. ఇవి చదవండి: సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
ఫైమా కోసం ఎంతో ఏడ్చాను.. ఫైనల్‌గా నన్ను రిజక్ట్ చేసింది: ప్రవీణ్
ప్రవీణ్, ఫైమా పలు ఎంటర్టైన్మెంట్ షోలతో స్టేజీపైన మెప్పించిన బుల్లితెర నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వీడియోలు షేర్ చేశారు. ఈ విషయంపై ప్రవీణ్ మొదటిసారి తన ప్రేమ గురించి రివీల్ చేశాడు. బిగ్ బాస్ ఫైమాతో ప్రవీణ్ ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైమాతో ప్రేమలో పడినట్లు టీవీ స్టేజీలపైనే ఓపెన్‌గా చెప్పాడు.. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఫైమా నుంచి కూడా వ్యతిరేకత రాలేదు. కానీ అవన్నీ ఆడియన్స్‌ను మెప్పించేందుకు చేసిన స్క్రిప్ట్స్ అని చెప్పుకున్నా.. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వారి సొంత యూట్యూబ్ చానల్స్లలో పలు వీడియోలు కూడా చేశారు. చివరకు ఫైమా వాళ్ల ఇంటికి కూడా ప్రవీణ్ పలుమార్లు వెళ్లాడు.. ఆ సమయంలో ఫైమా తల్లిగారిని అత్తయ్య అని పిలిచేవాడు. అంత సన్నిహిత్యం ఆమె కుటుంబంతో ప్రవీణ్‌కు ఉంది. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ విషయాలన్నింటిపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ రియాక్ట్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?) 'ఫైమాతో ప్రేమ అనేది ఫ్రెండ్సిప్తో ప్రారంభమైంది. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉన్నారు. అందుకే ప్రేమిస్తున్నాని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను.. ఆమెకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు ఆమె నిర్ణయాన్ని తప్పపట్టలేను. అంతేకాకుండా ఆమె నో చెప్పిందని తనకు దూరంగా నేను ఎప్పుడూ లేను. మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్స్‌గా ఉందామని అనుకున్నాం. ఒక మంచి ఫ్రెండ్‌గా ఆమె వెంట ఎప్పుడూ ఉంటాను. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించలేదనే బాధ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఒకానొక సమయంలో బాగా ఏడ్చాను. ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అంటారు కదా.. అందుకే ఆమె గురించి ఏడ్చాను. ఆమె రిజెక్ట్ చేసినప్పుడు ముందు బాధపడినా... తర్వాత రిలైజ్ అయ్యి అంతా నా మంచికే అనుకున్నా. ప్రస్తుతం నా ఫ్యామిలీ సమస్యలు నాకు ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించే ఎక్కువగా పోరాడుతున్నాను. ఈ మధ్య మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయాకు మా అప్పుల గురించి తెలిసింది. ప్రస్తుతం వాటిని చెల్లించే పనిలో ఉన్నాను. ఒకవేళ ఫైమా నన్ను ప్రేమిస్తున్నాను అని భవిష్యత్‌లో చెబితే తప్పకుండా అంగీకరిస్తాను.' అని ప్రవీణ్ తెలిపాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకే ఫైమాలో మార్పు..? బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫైమాలో చాలా మార్పులు వచ్చాయని, ఆ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సెలబ్రిటీ హోదా రావడంతోనే ప్రవీణ్‌ను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. వాటికి ప్రవీణ్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యాక ఫైమా బాగా హర్ట్ అయింది. ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయింది. మొదట కొద్దరోజులు ఆమె ఎవర్నీ కలవలేదు. తర్వాత నాతో మంచిగానే మాట్లాడింది. ఆమె బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం నేను ఎంతో సపోర్ట్ చేశాను. నేను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఫైమాకు ఓట్లు వేయాలని కోరినా.. ఆమె నా మనిషి అని ఆమె విజయం కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను.' అని తెలిపాడు. ప్రవీణ్‌ను ఫైమా మోసం చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రవీణ్ ఆ విషయం చెప్పకుండా తను మాత్రమే ప్రేమించానని.. ఫైమా ప్రేమించలేదని చెబుతూ ఆమెను సేఫ్ చేస్తున్నాడని చెబుతున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పడే ప్రవీణ్ అంటే ఇష్టం అని నాగార్జున గారితో ఫైమా చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా ప్రవీణ్ మాత్రం వన్‌సైడ్ లవర్ బాయ్‌లా మిగిలాడు. -
భర్తను కడతేర్చిన భార్య..! అనుమానంతోనే ఇలా..
కరీంనగర్: అక్రమ సంబంధం ఏర్పర్చుకుని సొమ్మంతా వేరే ఆమెకు పెడుతున్నాడనే కారణంతో భర్తను భార్య అంతమొందించింది. ఈ ఘటన గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారింది. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు వివరాల ప్రకారం.. స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన కొచ్చర ప్రవీణ్(42) గోదావరిఖని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇళ్లు నిర్మించి విక్రయిస్తుంటాడు. కొంతకాలంగా వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడితో భార్య లలిత రోజూ ఇంట్లో గొడవకు దిగేది. ఆస్తి వ్యవహారాలు తనకు ఏమి చెప్పడం లేదని కోపంతో ఉండేది. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని కోపంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో తన భర్త వద్ద పనిచేసే రామగుండం ప్రాంతానికి చెందిన మచ్చ సురేశ్‌కు (సెంట్రింగ్ కార్మికుడు) తన బాధ చెప్పుకుంది. భర్తను చంపాలని, దానికి సహకరించాలని కోరగా సురేశ్ ఒప్పుకున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి ఇంట్లో ప్రవీణ్ నిద్రిస్తుండగా లలిత కాళ్లు పట్టుకోగా సురేశ్, మరికొందరు నిందితులు దిండుతో అతడి ముఖంపై గట్టిగా అదిమిపట్టుకోగా శ్వాస ఆడక చనిపోయాడు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఇంకా పూర్తి వివరాలపై కూపీ లాగుతున్నామని, నిందితులను త్వరగా పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
పథకం ప్రకారమే హత్య..! ఆ రోజు జరిగింది ఇదీ..!!
వికారాబాద్: వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. మనస్పర్థల కారణంగా నెలకొన్న గొడవలతో పథకం ప్రకారమే యువకుడిని హత్య చేశారు. ఈ నెల 4న వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన కేసు వివరాలను గురువారం చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల పరిధిలోని హైతాబాద్ చెరువులో ఈనెల 4న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పైకి తేలింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న సీఐ యాదయ్యగౌడ్ చెరువులో నుంచి బాడీని బయటకు తీయించారు. మృతుడి వివరాలను ఆరా తీయగా.. సంకెపల్లిగూడకు చెందిన కుమ్మరి ప్రవీణ్(31) అనే వ్యక్తి.. ఈనెల 1న రాత్రి 9గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకున్నారని తెలిసింది. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం ప్రవీణ్దేనని గుర్తించారు. తల వైపు ఒక సంచి, కాళ్ల వైపు మరో సంచి కట్టి.. చున్నీతో చేతులను వెనక్కి కట్టేసి.. నడుముకు బండరాయి కట్టి చెరువులో పడేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నేరం అంగీకారం.. హతుడు ప్రవీణ్‌కు ఇదే గ్రామానికి చెందిన కుమ్మరి మమతతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఈ దిశగా విచారణ చేపట్టి మమతతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కూపీ లాగగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. మమత భర్త సుధాకర్ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ తర్వాత ప్రవీణ్, మమత మధ్య పరిచయం, సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో మృతుడు పదేపదే మమత ఇంటికి వెళ్లేవాడు. మనస్పర్థలతో శత్రుత్వం.. కొద్దిరోజులుగా మమత, ప్రవీణ్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారాలు గొడవల వరకూ వెళ్లాయి. దీంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం మొండిగా వారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో మమత అతనిపై శత్రుత్వం పెంచుకుంది. ప్రవీణ్‌తో తనకు ఇబ్బందులు తప్పేలా భావించి, ఎలాగైనా అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంది. ఆ రోజు జరిగింది ఇదీ.. ఈనెల 1న ప్రవీణ్‌కు ఫోన్ చేసిన మమత ఇంటికి రావాలని చెప్పింది. దీంతో అతడు వెళ్లి తాను ఎప్పటిలాగే మిద్దైపె ఉన్నానని, పైకి రావాలని కోరగా.. మా అత్త, మామ పడుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేరు నువ్వే కిందికి రా.. అని సూచించింది. ఇది నమ్మిన మృతుడు ఇంట్లోకి వెళ్లగానే గడియ పెట్టింది. అప్పటికే మమతతో పాటు ఆమె అత్త, మామ, తల్లి, అన్న, మరో వ్యక్తి ఉన్నారు. ప్రవీణ్ చూసిన వారు అతనితో గొడవ పడ్డారు. హతుడు సైతం వీరితో గట్టిగానే వారించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రోకలితో వెనక నుంచి ప్రవీణ్ తలపై మమత బలంగా కొట్టింది. ఆమె అన్న కుమార్ సైతం కొట్టడంతో ప్రవీణ్ పెద్దగా అరుపులు చేశాడు. దీంతో అతడి నోటికి చున్నీ బిగించి.. తల, కాళ్లపై రోకలితో మోదారు. దీంతో స్పృహ తప్పిన ప్రవీణ్ రక్తస్రావమై, ఊపిరాడక చనిపోయాడు. శవాన్ని మూటగట్టి.. ప్రవీణ్ మరణించాడని నిర్ధారించుకున్న మమత అన్న కుమార్, ఇతడి బావమర్ది మహేశ్ శవాన్ని సంచిలో పెట్టి మూటకట్టారు. స్కూటీపై బాడీ పెట్టుకుని హైతాబాద్ చెరువు ఓడ్డున దింపారు. ఇక్కడ మృతదేహానికి బండరాయిని కట్టి చెరువులో పడేశారు. అనంతరం ఇంటికి వచ్చి రక్తం అంటిన దుస్తులకు నిప్పు పెట్టి కాల్చేశారు. మృతుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి కాల్చేశారు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. సీసీ పుటేజీల తొలగింపు.. ప్రవీణ్ వచ్చిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని గ్రహించిన మమత దామర్లపల్లికి చెందిన కమ్మరి వెంకటేశ్ అనే వ్యక్తిని ఇంటికి పిలిపించి.. సీసీ పుటేజీలన్నింటినీ తీసేయించింది. ఈ కేసులో నిందితులైన కుమ్మరి మమత, కృష్ణయ్య, చంద్రకళ, కుమార్, లక్ష్మి, మహేశ్, కమ్మరి వెంకటేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. హత్యకు ఉపయోగించిన రోకలి, ఎలక్ట్రిక్ స్కూటీ, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో షాబాద్ సీఐ యాదయ్యగౌడ్, ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
'ఎంత పని చేశావ్ నాన్న..! నాకు ఇక దిక్కెవరు అమ్మా'..?
కరీంనగర్: ‘ఎంత పని చేశావ్ నాన్న.. నాకు ఇక దిక్కెవరు అమ్మా.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా..’ అంటూ ఆ కూతురు గుండెలవిసేలా రోదించిన తీరు కంటతడి పెట్టించింది. కుటుంబ కలహాలు తల్లిదండ్రులను బలిగొనగా, వారి కూతురు అనాథగా మారింది. కరీంనగర్ టూటౌన్ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్కాలనీకి చెందిన వేముల ప్రవీణ్(50), లావణ్య(42)కు 18 ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి కూతురు కళ్యాణి సంతానం. ప్రవీణ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుండగా, లావణ్య టైలరింగ్ పనిచేసేది. వీరి కూతురు కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఇంట్లో దంపతులు ఇద్దరే ఉండేవారు. ఇంటి పై అంతస్తులో ప్రవీణ్ తల్లిదండ్రులు ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి ప్రవీణ్ దంపతులకు గొడవలు జరుగగా పెద్దలు సర్దిచెప్పారు. శనివారం మరోసారి గొడవ తీవ్రరూపం దాల్చి ఆవేశానికి లోనైన ప్రవీణ్ భార్య తలపై సిమెంట్ ఇటుకతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున అతడు హాస్టల్‌కు వెళ్లి తన కూతురును చూసి వచ్చినట్లు తెలిసింది. అనంతరం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ప్రవీణ్‌కు పలుమార్లు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయకపోవడంతో వారు వచ్చి చూసేసరికి భార్యాభర్తలు చనిపోయి ఉన్నారు. టూటౌన్ సీఐ రాంచందర్‌రావు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మెడికల్ కాలేజీకి ఇవ్వండి.. ‘మా శవాలను మెడికల్ కాలేజీకి ఇవ్వండి. ఎలాంటి సంస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరూ ఇబ్బంది పడొద్దు. మనిషి పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. కానీ విధిని బట్టి వేర్వేరు విధాలుగా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. స్వార్థం కోసం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయకండి. జరిగిన ఘటనకు ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు’ అని ప్రవీణ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. -
అదరహో అదితి... ఓహో ఓజస్
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్ ఓజస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్ కూడా పసిడి గెలవడంతో ‘డబుల్ ధమాకా’ మోగింది! చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్‌పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా – అదితి స్వామి బెర్లిన్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒకే రోజు భారత్ తరఫున ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్స్కీ (పోలాండ్)ను ఓడించాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్‌కు ప్రవీణ్ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు. ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. పూర్తి ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్ సారా లోపెజ్‌ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది. శనివారం సెమీస్, ఫైనల్లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్ ‘పర్ఫెక్ట్ స్కోర్’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్ చివర్లో ఒక పాయింట్ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు. జ్యోతి సురేఖకు కాంస్యం ప్రపంచ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది. -
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
పటాస్ ప్రవీణ్‌కు పెళ్లి చేసిన కొమరక్క..
-
World Cup Archery: సురేఖ జోడీకి స్వర్ణం
World Cup Archery- షాంఘై: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్–2 (కాంపౌండ్ విభాగం)లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. సురేఖ– ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే జోడి ఫైనల్లో 156–155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్ జోంగో–ఓహ్యూహ్యూన్ను ఓడించింది. తొలి మూడు ఎండ్లలో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39, 39 చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 117–117తో సమంగా నిలిచింది. చివరి ఎండ్‌లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ–ఓజస్లకు పసిడి దక్కింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ జౌకర్ సంచలనం సృష్టించాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో నెదర్లాండ్స్‌కు చెందిన వరల్డ్ నంబర్‌వన్ మైక్ స్కోసర్పై విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రథమేశ్ కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన అవనీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవనీత్ 147–144తో ఐపెక్ తోమ్రుక్ (తుర్కియే)ను ఓడించింది. -
సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ఈయన రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ సూద్.. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవికాలం పూర్తయిన తర్వాత ఆయన నుంచి సూద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలవురు పేర్లను పరిశీలించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఈ కమిటీ శనివారం సాయంత్రం సమావేశమై తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవికి కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఎంపిక చేసింది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఖరారయ్యారు. కాగా సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీ కాలం రెండేళ్లు. అయితే ఈ పదవీ కాలన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ సభ్యుడు పదవుల కోసం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జైశ్వాల్.. 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్. గతంలో ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ రెండేళ్ల పదవీకాలం మే 25తో పూర్తికానుంది. చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్.. -
చిలకలూరిపేట టిక్కెట్ నాదే..?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తనకు నచ్చకపోయినా.. గెలవడన్న అనుమానం వచ్చినా.. అప్పటి వరకూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ఎంతటి వారినైనా చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాడన్న విషయం అందరికీ ఎరుకే. తాజాగా పదేళ్లపాటు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్గా పనిచేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రత్తిపాటిని వదిలించుకునేందుకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మరో వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. దీనికి గత ఏడాది ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు నాందీ పలికింది. గుంటూరు జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాష్యం ప్రవీణ్‌ను చిలకలూరిపేటలో రంగంలోకి దింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతు న్నాయి. ఇటీవల భాష్యం ప్రవీణ్ గుంటూరు పట్టణంతో పాటు యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోనూ చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశాడు. టీడీపీ మహానాడు ప్రకాశం జిల్లా లో జరిగినప్పుడు యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామం హైవే పక్కనే మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని మూడు రోజులు ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు ప్రారంభించి అక్కడే ప్రచార రథంపై ఉండి ప్రసంగించారు. ఆ తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు వెళ్లి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర విజయవంతం కావాలంటూ కొన్ని పాటల్నీ రిలీజ్ చేశారు. చిలకలూరిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా, అలాగే రోజా ఉన్న దీక్షాధారులకు ఇఫ్తార్ విందును వేర్వేరుగా ఇవ్వనున్నట్లు అలాగే పట్టణంలోని అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేస్తానంటూ మీడియాకు వెల్లడించారు. దీంతో కంగారుపడిన ప్రత్తిపాటి తనకు సన్నిహితంగా ఉండే అచ్చెన్నాయుడి ద్వారా ప్రవీణ్‌కు ఫోన్ చేయించి ఈ కార్యక్రమం జరగకుండా చూశారు. తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసి తన గోడు వినిపించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందగానే హైదరాబాద్‌కు ప్రత్తిపాటి ఫ్యామిలీతో సహా మకాం మార్చిన విషయాన్ని, కోవిడ్ వేళలోనూ పార్టీ వర్గీయులను పట్టించుకోలేదని, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను పట్టించుకోని విషయాన్ని, గత ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య చేసిన వసూళ్లను అడ్డుకోలేదన్న విషయాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. అయినా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా చూద్దాం అని చెప్పి పంపినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాలలో మిర్చి రైతులను పరామర్శించేందుకు చేపట్టిన యాత్రకు చిలకలూరిపేటలో స్పందన లేకపోవడం కూడా ప్రత్తిపాటిపై ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు చిలకలూరిపేట నియోజకవర్గం టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న భాష్యం ప్రవీణ్ చంద్రబాబు 73వ పుట్టినరోజు నాడు వెళ్లి రూ.73 లక్షలు పార్టీకి విరాళంగా అందజేసి మార్కులు కొట్టేశాడు. ఇప్పటికే తనకు సహకరిస్తున్న కొంతమంది ప్రత్తిపాటిని వ్యతిరేకిస్తున్న నాయకుల ద్వారా పేట లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం యువ గళం కార్యక్రమంలో లోకేష్‌ను ప్రత్తిపాటి కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే లోకేష్ నుంచి ఎటువంటి హామీ రాలేదని సమాచారం. దీంతో ఈ నెల 15 నాటికి సీటు నాదే అని ప్రకటించకపోతే మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చని, దానికి తాను కూడా సహకరిస్తానని చెప్పినట్లు బాష్యం ప్రవీణ్ వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ తమ మద్దతు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేసిన పుల్లారావు
-
Archery World Cup: శెభాష్ జ్యోతి సురేఖ- ప్రవీణ్.. భారత్ ఖాతాలో స్వర్ణం
Archery World Cup: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ- మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె జోడీ భారత్‌కు స్వర్ణం అందించారు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ- చైనీస్ తైపీ ద్వయంతో తలపడింది. ఈ క్రమంలో 159- 154తో ప్రత్యర్థిపై గెలుపొంది సురేఖ- ప్రవీణ్ భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేర్చారు. కాగా జ్యోతి సురేఖకు మెగా ఈవెంట్లో ఇది రెండో స్వర్ణ పతకం. పారిస్‌లో 2022లో జరిగిన వరల్డ్‌కప్-3లో జ్యోతి సురేఖ- అభిషేక్ వర్మతో కలిసి విజేతగా నిలిచారు. తాజాగా ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీ ఫైనల్లో ప్రవీణ్‌తో కలిసి చెన్ యి సువాన్–చెన్ చియె లున్ జోడీని ఓడించి తన ఖాతాలో మరో పసిడి పతకం జమచేసుకున్నారు. చదవండి: WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్ టెండుల్కర్ INDIAN DOMINANCE 💪 🇮🇳 It's gold for Jyothi Surekha Vennam and Ojas Pravin Deotale in Antalya#ArcheryWorldCup pic.twitter.com/hhk9OsjifV — World Archery (@worldarchery) April 22, 2023 -
లీకేజీ కేసులో ఈడీ స్పీడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో హవాలా లావాదేవీలకు అవకాశం ఉన్నందున వీటిపై దర్యాప్తు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకమైన టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితోపాటు టీఎస్పీఎస్సీ తరఫున ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యనారాయణలను గురువారం ఈడీ అధికారులు 10 గంటలపాటు విచారించినట్టు సమాచారం. శంకర లక్ష్మిని ఈ కేసులో కేవలం సాక్షిగానే సిట్ పేర్కొనగా.. ఇప్పుడు ఈడీ మాత్రం శంకర్ లక్ష్మి నుంచే దర్యాప్తు ప్రారంభించడం ఈ కేసు విచారణపర్వంలో కొత్త కోణంగా చెప్పవచ్చు. మొత్తం పేపర్ల లీకేజీ కుట్రకు శంకర్లక్ష్మి కంప్యూటర్ నుంచే మూలాలు ఉండడంతో తొలుత ఆమెను ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం. ప్రధా నంగా ఈ కేసులో కీలక నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారని విచారణానంతరం శంకరలక్ష్మి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తన ఆధార్, పాన్ వివరాలు తీసుకున్నారని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని ఆమె చెప్పారు. మీ సిస్టంలోకి వాళ్లు యాక్సెస్ ఎలా అయ్యారు? శంకర్‌లక్ష్మికి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఉన్న పరిచయం, ఆఫీస్‌లో వారి ప్రవర్తన, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో వారు వచ్చేవారా..? డబ్బు లావాదేవీల గురించి మీతో ఎప్పుడైనా చర్చించే వారా..? మీ కంప్యూటర్లోకి యా క్సెస్ ఎలా అవుతారు..? ఈ కంప్యూటర్ పాస్వర్డ్లు ఇంకా ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా?..మీ కంప్యూటర్ పరిసరా ల్లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉంటాయా?.. అన్న అంశాలపై నా ప్రశ్నించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ అధికారి సత్యనారాయ ణ నుంచి సైతం కీలక వివరాలు సేకరించినట్టు తెలిసింది. పేపర్‌లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ దృష్టికి ఎలా వచ్చింది? ఏయే పేపర్లు లీకైనట్టు గుర్తించారు..? ఉద్యోగుల పాత్రపై అంతర్గతంగా ఏ చర్యలు తీసుకున్నారు? ఇలాంటి వివరాలు సేకరించినట్టు తెలిసింది. వీటిని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. సిట్ అధికారులను వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరైన శంకర్లక్ష్మి, సత్యనారాయణలను అవసరం మేరకు మరోమారు పిలుస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ల ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ పేపర్ల లీకేజీలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. గురువారం దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, ఈ కేసులో సిట్ వివరాలు ఇవ్వవడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. 8 డాక్యుమెంట్లు కావాలని, కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌ను ఆదేశించాలని ఈడీ కోరింది. అయితే కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలిపింది. -
టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. కమిషన్ సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ శంకరలక్ష్మిలకు బుధ, గురువారాల్లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డు చేసిన తర్వాత కమిషన్ కార్యదర్శిని, చైర్మన్‌ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేగంబజార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ ప్రారంభించింది. పేపర్ లీకేజీతో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పీఎమ్ఎల్ఏ) కింద ఈడీ జప్తు చేయనుంది. వారి విచారణకు అనుమతించండి.. చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, నిందితుల విచారణకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లేందుకు వీలుగా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. కాగా ప్రశ్నపత్రాల లీకేజీపై మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, నిఘా విభాగాల ద్వారా వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ప్రశ్నపత్రాల అమ్మకాల్లో మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో గత నెల 23న సీసీఎస్ ఏసీపీకి రాసిన లెటర్‌ను పిటిషన్‌కు అటాచ్ చేసింది. రూ.40 లక్షలపై ఆరా ఈ కేసులో సిట్ ఇప్పటివరకు రూ.40 లక్షలు సీజ్ చేసింది. వీటి వివరాలను ఈడీ సేకరించనుంది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల బ్యాంక్ లావాదేవీలు ఆధారంగా మనీలాండరింగ్‌పై సమాచారం సేకరించింది. న్యూజిలాండ్‌లోని రాజశేఖర్‌రెడ్డి బావకు ఎనీడెస్క్ యాప్ ద్వారా గ్రూప్–1 పేపర్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి ద్వారా విదేశాల్లో ఉన్న ఎవరికైనా పేపర్ షేర్ అయ్యిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. వారి నుంచి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఖాతాలకు కానీ, ఇతరులకు కానీ మనీలాండరింగ్ జరిగిందా అనే వివరాలను రాబట్టనుంది. లీకేజీ సమయంలో నిందితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు లేఖలు రాయనుంది. -
టెన్త్ పరీక్షలకు సకలం సిద్ధం
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతోంది. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఆయా జిల్లాల డీఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్ని జిల్లాల అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. – సాక్షి, అమరావతి ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు.. ఈ పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉ.8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. తద్వారా వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయగలుగుతారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అలాగే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కెమెరాలు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్‌కో తదితర విభాగాలు ఈ పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి పాయింట్లోనూ పోలీసు భద్రత పరీక్ష పత్రాల రక్షణ దృష్ట్యా అన్ని డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్ల వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు భద్రత ఉండేలా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనాలకు జిల్లా కేంద్రాల నుంచి ఎస్కార్ట్ ఏర్పాటుచేస్తారు. పరీక్షా కేంద్రాల సందర్శనకు పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు కేంద్రాల వద్ద సాయుధ గార్డులను పెట్టనున్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను నిలువరించే చర్యలకు వీలుగా మొబైల్ పోలీస్ స్క్వాడ్లకు సూచనలు అందిస్తారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు. శాంతిభద్రతల నిర్వహణకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్‌సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలకు పరీక్షలు జరిగినన్ని రోజులూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే.. ♦ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటుచేయనుంది. మొబైల్ మెడికల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచనుంది. ♦ అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తో పాటు వెంటిలేషన్, పరిశుభ్ర వాతావరణం, ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో సహా అన్ని జిల్లాల విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేయనున్నారు. డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0866–2974540 ♦ వొకేషనల్ పబ్లిక్ పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులకు బార్‌కోడింగ్ విధానాన్ని పొడిగించనున్నారు. కోడింగ్ విధానంపై జిల్లా స్థాయిలో బార్కోడ్ సూపర్వైజర్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తారు. సమాధాన పత్రాలను కోడింగ్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు. ♦ కోడింగ్ నంబర్ల పరిశీలన తదితర పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఇన్విజిలేటర్లు ఉ.8:15లోపు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌కి రిపోర్ట్ చేయాలి. ♦ విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాల బుక్లెట్లపై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు అటుఇటు కాకుండా ఉండేందుకు బుక్లెట్పై క్రమసంఖ్యను రాసేలా చూడాలి. -
‘టీఎస్పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ బి.శంకరలక్ష్మి కీలక సాక్షిగా మారారు. తొలుత అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాల అదనపు కస్టడీతోపాటు తాజాగా అరెస్టు చేసిన షమీమ్, సురేశ్,రమేశ్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఐదు పరీక్షలకు సంబంధించిన 11 ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే తస్కరించారు. ఈ వ్యవహరంలో ఆమె నిర్లక్ష్యం ఉందని అధికారులు ఇప్పటికే తేల్చడంతో చర్యలు కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆమెను ఈ కేసులో రెండో సాక్షిగా పరిగణిస్తున్నట్లు కోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసిన రిమాండ్ కేస్ డైరీలో ఈ విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో వివరాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిందితుల కస్టడీ అవసరమని పేర్కొంది. రాజశేఖర్ బంధువుకు నోటీసులు! న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన కమిషన్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు ప్రశాంత్‌ను ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అతనికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. అత డు విచారణకు రాకుంటే లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కేసులో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మందిలో శుక్రవారం నాటికి 40 మంది విచారణ పూర్తయింది. ఏఈ పరీక్ష ప్రశ్న పత్రం విషయంలోనే క్రయవిక్రయాలు జరిగాయని, గ్రూప్– 1లో ఇలాంటివి జరిగినట్లు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. బండి సంజయ్ గైర్హాజరు... పరీక్ష పత్రాల లీకేజీ కేసుల్లో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందుకుతగ్గ ఆధారాలను శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చి సమర్పించాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి సంజయ్ హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం సిట్ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. -
దావత్లో గొడవ.. వెలుగులోకి లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఎస్పీఎస్సీ ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్ లీక్ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. పంచాంగల్లో ప్రిపరేషన్..వనపర్తిలో దావత్ ఏ–1 నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణు క, డాక్యా దంపతులు గండేడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్ (మేడ్చల్ కానిస్టేబుల్), ఈయన స్నేహితులు కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ కూడా వచ్చినట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్‌నాయక్ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్‌తో కలిసి పేపర్ లీకేజీ స్కెచ్ వేశారు. రేణుక సొంతూరు గండేడ్ మండలంలోని మన్సూర్‌పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్ తండా. ఇలావుండగా వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘర్షణ, బెదిరింపుతో.. దావత్ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్‌నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్‌ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. -
TSPSC: పాలమూరులో ప్రకంపనలు.. 9 మందిలో ఆరుగురు ఇక్కడివాళ్లే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/గండేడ్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన లు సృష్టిస్తోంది. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండ డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం మ హబూబ్‌నగర్‌తో పాటు గండేడ్ మండలంలోని మ న్సూర్‌పల్లి, పంచాంగల్ తండాలు, వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చుట్టూ తిరుగుతోంది. ఈ బాగోతంలో వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా?..అనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. రేణుక, డాక్యా ఇక్కడి వారే.. పేపర్ల లీకేజీకి పాల్పడింది కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కాగా..నిందితుల జాబితాలో రేణుక, లవుడ్యావత్ డాక్యా దంపతులు ఉన్నారు. రేణుకది మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్ తండా. డాక్యా బీటెక్ పూర్తయిన తర్వాత 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో నాలుగేళ్ల పాటు టీఏగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పనిచేస్తున్నాడు. రేణుకకు 2018లో వనపర్తి గురుకుల పాఠశాలలో హిందీ పండిట్ ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. ప్రస్తుతం రేణుక బుద్దా రం గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. అంతా బంధువులు, సన్నిహితులే: ప్రవీణ్ ద్వారా పేపర్లు సంపాదించిన రేణుక మొదట తన తమ్ముడు రాజేశ్వర్‌కు సమాచారమిచ్చింది. ఇతను మహబూబ్‌నగర్‌లోనే ఉంటున్నాడు. రాజేశ్వర్ తన పెద్దనాయన చంద్రానాయక్ కొడుకు శ్రీనివాస్ (బీటెక్)కు సమాచారం ఇచ్చాడు. అతడికి 2020లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మేడ్చల్‌లో పనిచేస్తున్నాడు. ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. దీంతో తనకు ప్రశ్నపత్రం వద్దని.. తనకు సన్నిహితులైన మన్సూర్‌పల్లి తండా కు చెందిన కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్రనాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్‌నాయక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రేణుక, డాక్యా దంపతులు ఒప్పందం కుదుర్చుకున్న వారిని వెంటబెట్టుకుని పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. అక్కడే వారితో రెండు రోజుల పాటు చదివించి.. పరీక్ష రోజు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ పరీక్షను రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా రాశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
TSPSC: మెయిన్ సర్వర్ నుంచే పేపర్ కొట్టేశాడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్‌ను సేకరించాడు. సేకరించిన పేపర్‌ను ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్ చేశాడు ప్రవీణ్. ఆపై.. పేపర్ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్‌నగర్‌లోని సెంటర్ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇదీ చదవండి: ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫొటోలు నిందితులకు 14 రోజుల రిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ కోరిన పోలీసులు పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. -
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు, గతంలో జరిగిన ఉదంతాల నిగ్గు తేల్చేందుకు కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నగర పోలీసులు బదిలీ చేశారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరగనుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఏ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి? గతంలోనూ ఇలా జరిగాయా? తదితర అంశాలపై సిట్ లోతైన దర్యాప్తు జరపనుంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులకు నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రేణుకను చంచల్‌గూడ మహిళ జైలుకు మిగతా ఎనిమిది మందిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు మంగళవారం జ్యుడీíÙయల్ రిమాండ్‌కు (చంచల్‌గూడ జైలుకు) తరలించారు. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు వీలుగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇలావుండగా ఈ కేసులో నిందితుడు గత అక్టోబర్‌లో గ్రూప్–1 పరీక్ష రాయడం, 150కి ఏకంగా 103 మార్కులు సాధించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ వైరల్ టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న పులిదిండి ప్రవీణ్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 పరీక్ష రాశాడు. కానీ పరీక్షకు ప్రిపేర్ కావడానికి కనీసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అయినా మొత్తం 150 మార్కులకు గాను ఏకంగా 103 సాధించాడు. దీంతో ఆ పేపర్‌ను కూడా తస్కరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓఎంఆర్ షీట్‌ను నింపడంలో చేసిన పొరపాటు కారణంగా ప్రవీణ్ డిస్క్వాలిఫై అయ్యాడు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్‌లోని ప్రతి అంశాన్నీ పక్కాగా నింపాల్సి ఉంటుంది. దీని పైభాగంలో హాల్ టిక్కెట్ నంబర్‌తో పాటు టెస్ట్ బుక్లెట్ నంబర్, వెన్యూ కోడ్లను తొలుత అంకెల్లో నింపి, వాటి కింద ఓఎంఆర్ విభాగంలో సున్నాలు చుడుతూ పూరించాలి. అంకెల్ని సక్రమంగా వేసిన ప్రవీణ్‌కుమార్ సున్నాలు చుట్టడంలో మాత్రం పొరపడ్డాడు. టెస్ట్ బుక్లెట్ నంబర్‌కు అంకెల్లో ‘459244’గా వేసిన ఇతను సున్నాల దగ్గరకు వచ్చేసరికి ‘4599244’అని రీడ్ అయ్యేలా పూరించాడు. దీంతో అతను ఆ పరీక్షలో డిస్క్వాలిఫై అయ్యాడని అధికారులు చెప్తున్నారు. ఈ ఓఎంఆర్ షీట్ మంగళవారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పది రోజుల కస్టడీ కోరనున్న పోలీసులు ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవడ్యావత్ డాక్యా సహా మొత్తం తొమ్మిది మందినీ తదుపరి విచారణ నిమిత్తం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. నిందితులను ప్రశ్నించడంతోపాటు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ల పరిశీలన, ఫోరెన్సిక్ నివేదిక అందాకే లీకేజీలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లి, సోదరుడి ఆర్థిక ఇబ్బందులతో.. పోలీసులు కోర్టుకు సమరి్పంచిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు పొందుపరిచారు. రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ గతంలో వ్యాపారం చేసి నష్టపోయాడు. ఆమె తల్లికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేణుక తనకు పరిచయస్తుడైన ప్రవీణ్‌ను ట్రాప్ చేసి, పరీక్ష పేపర్లు బయటకు తీసుకువస్తానని, వాటిని అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని చెప్పింది. పేపర్లు చేజిక్కిన తర్వాత భర్త లవడ్యావత్ డాక్యా, రాజేశ్వర్లతో కలిసి ప్రధానంగా తమ సామాజిక వర్గం వారికే విక్రయించాలని నిర్ణయించుకుంది. నీలేష్, గోపాల్‌లకు అమ్మడానికి సిద్ధమై ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. అయితే వాళ్లు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు వారి నుంచి తీసుకున్న రూ.15 లక్షల్లో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచి్చంది. 48 మందితో అసభ్య చాటింగ్.. ఫొటోల షేరింగ్ కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దాన్ని ఆన్లైన్లో నింపే క్రమంలో పొరపాట్లు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కమిషన్ నిర్లక్ష్యం వల్ల తప్పులు దొర్లుతూ ఉంటాయి. వీటిని సరి చేసుకోవడానికి అనేక మంది అభ్యర్థులు, అభ్యర్థినులు టీఎస్పీఎస్సీకి వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో యువతులు, మహిళలకు సహాయపడే ప్రవీణ్.. ఆపై వారిని ట్రాప్ చేసి లోబర్చుకునేవాడని తెలుస్తోంది. దాదాపు 48 మందితో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం చేశాడని ప్రవీణ్ ఫోన్‌ను విశ్లేషించిన సైబర్ నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేణుక కూడా ప్రవీణ్‌కు గురుకుల పరీక్షల నేపథ్యంలో పరిచయమైంది. 2018లో గురుకులాల్లో హిందీ టీచర్ పోస్టుకు ఆమె దరఖాస్తు చేసుకుంది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కమిషన్‌కు వచ్చిన ఈమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. పరీక్ష సమస్య పరిష్కారం కాగా.. పరిచయం కాస్తా సన్నిహిత సంబంధం వరకు వెళ్లింది. వీళ్లు కొన్ని వ్యక్తిగత ఫొటోలను కూడా షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో రేణుక గురుకుల పరీక్షలో క్వాలిఫై కావడంలోనూ లీకేజీ వ్యవహారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస సెలవులు.. మరిన్ని అనుమానాలు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 2018 నుంచి పనిచేస్తున్న రేణుక..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 11 సెలవులు తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష ఈ నెల 5న జరగగా.. నాలుగో తేదీన సెలవు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐదో తేదీ ఆదివారం కాగా.. బంధువులు చనిపోయారని ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సెలవులో ఉన్నట్లు ఆమె సహోపాధ్యాయులు తెలిపారు. మరోవైపు గ్రూప్–1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరగగా.. నవంబర్‌లో 12 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యింది. 14 రోజులు మెడికల్ లీవ్ పెట్టినట్లు సిబ్బంది తెలిపారు. ఇప్పుడు, అప్పుడు పరీక్షల తర్వాత వరుస సెలవులు పెట్టిన క్రమంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో 13 మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్ -
ఒకే వేదికపైకి రాజయ్య, నవ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు సంబంధించి.. ఆమెతోపాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి వెళ్లిన రాజయ్య.. సర్పంచ్ కురుసవల్లి నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ కలిగితే క్షమాపణలు చెప్తున్నా: రాజయ్య మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ‘‘నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. నాకు నలుగురు చెల్లెళ్లు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. తెలిసీ తెలియక తప్పులు జరిగితే ఒప్పుకోక తప్పదు. జానకీపురం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నా. సర్పంచ్ నవ్య, ప్రవీణ్‌లను అన్నిరకాలుగా కాపాడుకుంటాను. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..’’అని పేర్కొన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో.. సర్పంచ్ కె.నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే.. రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లినట్టు తెలిసింది. రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసు సర్పంచ్ నవ్య ఆరోపణల అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా వచ్చిన అభ్యర్థనపై మహిళా కమిషన్ ఆదివారం స్పందించింది. రాజయ్యకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌కు కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాసినట్టు తెలిపింది. మహిళల పట్ల పిచ్చి వేషాలు వేయొద్దు: నవ్య ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ‘‘చెడును కచ్చితంగా ఖండిస్తాను. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యాను. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టడానికైనా వెనుకాడను. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకుని మహిళలను గౌరవించాలి. ఇక మీదట తప్పులు చేయకూడదు. గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నేను చేసిన ఆరోపణలు నిజం. సమాజంలో మహిళలు కొన్ని విషయాల్లో కొందరి చేత మోసపోతున్నారు. అలాంటి వారు బయటికి వచ్చి నిలదీయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారిపక్షాన నేను ముందుండి కొట్లాడుతా..’’అని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని.. ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. -
టాలీవుడ్లో విషాదం.. తారకరత్నను మరవకముందే మరొకరు మృతి
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. తారకరత్న మరణం మర్చిపోకముందే మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 2017లో వచ్చిన 'దర్శకుడు' మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా సేవలందించారు. ప్రవీణ్ మృతి చెందడం టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది. -
‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’మూవీ రివ్యూ
టైటిల్: రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం నటీనటులు: ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి తదితరులు నిర్మాణ సంస్థ: వారధి క్రియేషన్స్ ప్రై.లి. దర్శకత్వం: జైదీప్ విష్ణు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అర్పుల ఎడిటింగ్: జైదీప్ విష్ణు విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటేంటే.. ఈ సినిమా కథంతా తుపాకులగూడెం అనే ఓ గ్రామం చుటూ తిరుగుతుంది. నక్సలైట్ల సమస్యను తగ్గించడానికి కేంద్ర హోంమంత్రి ఓ స్కీం ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం సరెండర్ అయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలు, పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, అందుకు గాను తక్షణమే 100 మంది నక్సలైట్లను లొంగిపోయేలా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆదేశాలు అందుతాయి. దీంతో పోలీసులు ఈ పనిని ఏజెన్సీ ఏరియాకు చెందిన బ్రోకర్‌కి అప్పగిస్తాడు. ఈ విషయాన్ని ఏజెన్సీ మొత్తం దొరలా ఫీలయ్యే రాజన్న(ప్రవీణ్) దృష్టికి తీసుకుకెళ్లగా.. అతను తన అనుచరుడు కుమార్(శ్రీకాంత్ రాథోడ్)కు చెబుతాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి అతనితో పాటు తుపాకులగూడెంలోని ప్రజలంతా నక్సలైట్లుగా లొంగిపోవడానికి ముందుకు వస్తారు. అయితే ఉద్యోగం కావాలంటే తలా ఒక లక్ష ఇవ్వాలని బ్రోకర్ కండీషన్ పెట్టడంతో అప్పు చేసి మరీ డబ్బులు కడతారు. మరి నిజంగానే ఈ 100 మందికి పోలీసు ఉద్యోగాలు వచ్చాయా? కుమార్ మాటలు నమ్మి నక్సలైట్లగా లొంగిపోవడానికి సిద్ధపడిన తర్వాత తుపాకులగూడెం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? కుమార్, మమతల ప్రేమ కథ ఏంటి? ఊరి బాగు కోసం ప్రయత్నించిన క్రాంతి ఎవరు? రాజన్నతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అడవి నేపథ్యంలో సాగే ఓ గూడెం ప్రజల కథ ఇది. 100 మంది అమాయకపు గిరిజన ప్రజలను ఓ బ్రోకర్ ఎలా మోసం చేశాడు? పోలీసులకు, నక్సటైట్లకు మధ్య జరుగుతున్న పోరులో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది అద్భుతమైన కథ అని చెప్పలేం కానీ.. చూసినంత సేపు బోర్ కొట్టకుండా కామెడీగా సాగుతుంది. కుమార్, మమత లవ్‌స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే కుసుమ ఎవరనే విషయాన్ని చివరి వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఊరి బాగుకోసం పాటుపడిన తన అన్న క్రాంతిపై పడిన మోసగాడు అనే నిందను తొలగించడానికి రాజన్న చేసే ప్రయత్నం మెప్పిస్తుంది. నటీనటులంతా కొత్త వాళ్లు అయినా సరే మంచి ఔట్పుట్ తెప్పించుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన వారంతా కొత్తవారే.. అయినప్పటికీ చక్కగా నటించారు. కుమార్ పాత్రకి శ్రీకాంత్ రాథోడ్ న్యాయం చేశాడు. ఈయన పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే యువకుడి పాత్ర తనది. తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. రాజన్నగా నటించిన ప్రవీణ్.. అడవిలో వచ్చే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. క్రాంతిగా సురంజిత్, కుమార్ లవర్ మమతగా జయత్రి, శివన్నగా శివరాంలతో పాటు శరత్, వంశీ, వినీత్, విజయ్, కిషోర్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, మ్యాగీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమా ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా చక్కగా, కథకి తగ్గట్టుగా ఉన్నాయి. శ్రీకాంత్ అర్పుల సినిమాటోగ్రఫీ, జైదీప్ విష్ణు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో.. మరో మలుపు చోటు చేసుకుంది. తెర మీదకు మరో హైదరాబాదీ పేరు వచ్చింది. లిక్కర్ స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ ఛార్జిషీట్లో కీలకాంశాలు వెలుగు చూశాయి. దుబాయ్ కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ప్రముఖ సైంటిస్ట్ ప్రవీణ్ గొరకవి(33) పేరు తెర మీదకు వచ్చింది. సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ గొరకవి సన్నిహితుడిగా తేలింది. ఫై(Phi ) కంపెనీ ఫౌండర్‌గా ఉన్నాడు ప్రవీణ్ గొరకవి. దీంతో సైంటిస్ట్ అయిన ప్రవీణ్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే.. ఈ కుంభకోణంలోని నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ప్రవీణ్ కుమార్‌కు కవాడిగూడలో ఉన్న ఇంటిపై ఈడీ దాడులు చేసింది. రూ.24 లక్షలు స్వాధీనం చేసుకుంది కూడా. బాలమేధావిగా పేరు దక్కించుకున్న ప్రవీణ్.. పలు ఆవిష్కరణలు కూడా చేశాడు. గతంలో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం నుంచి అవార్డు, అభినందనలు సైతం అందుకోవడం గమనార్హం. -
వాళ్లది తొండి గేమ్, ఫైమాకు వెటకారం ఎక్కువే!: కమెడియన్ ప్రవీణ్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మరొకరిని బయటకు పంపించేందుకు సమయం ఆసన్నమైంది. అయితే ఈసారి ఒకరిని కాకుండా ఇద్దర్ని ఎలిమినేట్ చేయనున్నారు. ఈపాటికే షూటింగ్ ముగియడంతో బాలాదిత్య, మెరీనా హౌస్ నుంచి బయటకు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి గీతూ వెళ్లిపోగానే శ్రీసత్య, ఫైమాలను కూడా పంపించేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ శ్రీసత్య కెప్టెన్ కావడంతో నామినేషన్ నుంచి తప్పించుకుంది. శ్రీసత్య తర్వాత ఫైమా కొత్తగా కెప్టెన్‌గా అవతరించడంతో ఆమె నెక్స్ట్ వీక్ నామినేషన్ నుంచి తప్పించుకోనుంది. ఇక ఈ వారం అంటారా? తనకన్నా వీక్ కంటెస్టెంట్ అయిన మెరీనా హౌస్‌లో ఉండనే ఉంది. మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే బాలాదిత్య గేమ్ బాగానే ఆడినప్పటికీ ఫ్యాన్ బేస్ లేదు. దీంతో ఫైమా ఎస్కేప్ అవగా బాలాదిత్య, మెరీనా ఎలిమినేట్ అయ్యారట! తాజాగా ఫైమా ప్రియుడు, కమెడియన్ ప్రవీణ్ వారి ప్రేమ గురించి, ఆమె ఆట గురించి స్పందించాడు. 'ఫైమాకు మొదట నేనే ప్రపోజ్ చేశాను. మూడుసార్లు ప్రపోజ్ చేశాను, ఒప్పుకునేదాకా వదల్లేదు. బిగ్‌బాస్ విషయానికి వస్తే హౌస్‌లో ఫైమాది తొండి గేమ్ అంటున్నారు, ఆమెనే కాదు, చాలామంది తొండి గేమ్ ఆడుతున్నారు. ఇనయ గేమ్ నాకసలు నచ్చలేదు. ఫైమాను ఏమనలేక ఆమె మీద కోపాన్ని గేమ్‌లో చూపించింది. ఫైమాకు వెటకారం ఎక్కువైందంటున్నారు. బహుశా అది తన గేమ్ కావచ్చు. ఫైమాకు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవరాక్షన్ ఎక్కువైందంటున్నారు, కానీ తన మాట తీరే అంత అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. చదవండి: ఈ వారం డబుల్ ఎలిమినేషన్, ఆ ఇద్దరే అవుట్ -
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సాక్షి " ఎక్స్ క్లూజివ్ చిట్ చాట్ "
-
టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రవీణ్
సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ను తెలంగాణ పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా, సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) వైస్ చైర్మన్‌గా, ‘సెస్’పర్సన్ ఇన్చార్జిగా ఆయన పనిచేశారు. -
బుల్లితెర కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల చిరునవ్వు వెనక కొండం విషాదం ఉంటుంది. కానీ ఆ బాధలను, దుఃఖాలను దిగమింగుకుని మోముపై బలవంతపు నవ్వును పులుముకొంటారు. కడుపులోనే కష్టాన్ని దాచుకుని కడుపుబ్బా నవ్విస్తారు. ముళ్లదారిలో నడిచిన కమెడియన్ల జాబితాలో పటాస్ ప్రవీణ్ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ సహా పలు కామెడీ షోలలో కమెడియన్‌గా రాణిస్తున్న అతడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయనను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించగా వెన్నుపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిందని, ప్రస్తుతం ఆయన చివరి స్టేజీలో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో ప్రవీణ్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్‌ను, అతడి అన్నను చదివించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని మంచి స్థాయిలో నిలబెట్టారు. కన్నకొడుకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. చదవండి: రాకెట్రీ కోసం ఇల్లు అమ్మేసిన హీరో, మాధవన్ ఏమన్నాడంటే? రౌడీ హీరో ఇంట పూజలు, హీరోహీరోయిన్లకు తాయత్తులు! -
భార్య ఉందని హత్య ఆలస్యం.. మసూద్ మర్డర్‌కు ప్రతీకారంగానే?
సాక్షి, కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారెలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కేరళలో తలదాచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. గురువారం మంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రవీణ్ హత్య తరువాత నిందితులు శియాబుద్దీన్, రియాజ్, బషీర్‌లు కేరళకు పరారయ్యారని, తలపాడి చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశామని చెప్పారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిని కూడా విచారిస్తున్నాం. ఎందుకు హత్య చేశారు అనేదానిపై కూలంకషంగా విచారణ చేస్తున్నాం. హంతకులతో కలిసి శియాబుద్దీన్ పథకం పన్నారు. ప్రవీణ్ ప్రతి రోజూ భార్యతో షాపునకు వచ్చి వెళ్తుండడంతో హత్యను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జూలై 26వ తేదీ రాత్రి ప్రవీణ్ ఒక్కడే షాపు నుంచి రావడం చూసి దాడి చేశారు. మసూద్ హత్యకు ప్రతీకారం? మసూద్ అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్‌ను చంపారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏడీజీపీ తెలిపారు. ప్రవీణ్ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. జూలై 19వ తేదీన బెళ్లారెలో మసూద్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మంగళూరులో చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత మృతి చెందాడు. ఇందుకు బదులుగా ప్రవీణ్‌పై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ హత్యకు ముందే కేరళలో ఎక్కడ తలదాచుకోవాలా అని హంతకులు ప్లాన్ సిద్ధం చేశారు. 15 రోజుల్లో ఏడు చోట్ల హంతకులు ఆశ్రయం పొందారు. దీంతో పోలీసులు నిందితుల కుటుంబసభ్యులు, ఆత్మీయులను తీవ్ర విచారణ చేపట్టారు. రకరకాల రీతిలో ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు నిందితులు బయటకు వచ్చారు. ఈ కేసును ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. చదవండి: (బీజేపీ నేత దారుణ హత్య.. అక్కడి నుంచే ప్లాన్ జరిగింది!) -
చికోటి ప్రవీణ్ జూదం దందాలో విస్తుపోయే విషయాలు
-
క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్ సెంటర్ కాదు.. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తేగానీ.. గల్లీలో పేకాట ఆడించే వాడు కాదు. ఏకంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడించే ఖతర్నాక్ ఆర్గనైజర్. అతడే చీకోటి ప్రవీణ్. అలాంటివాడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్‌పై ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అలాగే, మాధవరెడ్డి ఇంట్లో ఒక కారుపై మంత్రికి సంబంధించిన కారు స్టిక్కర్ అతికించి ఉంది. హవాలాతో అడ్డంగా దొరికి.. చీకోటి ప్రవీణ్ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ తది తర ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటుచేసి దందా సాగించేవాడు. 2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి రూ.కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంకలో పేకాట ఆడించేందుకు హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేసి ఈడీకి అడ్డంగా బుక్కయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆమేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించాడు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగినట్టు తెలిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రవీణ్ నివాసం, ఫాంహౌజ్తోపాటు మరో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఈడీ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. సెలబ్రిటీల వీడియోలు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్ తినేలా చేసినట్టు తెలుస్తోంది. గతంలో బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్‌డే ఫంక్షన్లో క్యాసినో ఏర్పాటుచేసిన అంశం పెద్ద దుమారమే రేపింది. ఆ పార్టీకి ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు హాజరవడం సంచలనం రేపింది. ఆరు నెలల క్రితం చీకోటి పేకాట వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఆయనకు సారీ చెప్పి మరీ... గత నెల 17న కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో చీకోటి తన 46వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఫంక్షన్ హాలంతా సెలబ్రిటీలే. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్ చేసుకున్న రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ కారును ప్రముఖ హీరో, ఓ రాజకీయ పార్టీ అధినేత కూడా ఇష్టపడ్డాడు. సేమ్ కలర్ కూడా కావడంతో ఆ హీరో ప్రవీణ్‌కు ఫోన్‌చేసి ఆ కారు కావాలని అడగ్గా, సారీ.. సర్.. తనకే కావాలని సున్నితంగా చెప్పి సొంతం చేసుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కారు విలువ సుమారు రూ.3.5 కోట్లు. ►నగర శివార్లలోని కడ్తాల్‌లో ప్రవీణ్‌కు 20 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని సమాచారం. ఇక్కడే అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు హైఫై పార్టీలు ఇస్తుంటాడని తెలుస్తోంది. వీటిలో అత్యంత ఖరీదైన మద్యం ఏరులై పారుతుంది. అనేక మందిని ఆకర్షించడానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్లతో గానా బజానాలూ ఏర్పాటు చేస్తుంటాడు. ఉత్తరాది టాప్ మోడల్స్ కూడా తళుక్కుమంటారని సమాచారం. జైల్లో పరిచయాలతో... ఓ రియల్టర్‌ను బెదిరించి రూ.30 లక్షలు గుంజిన కేసులో ప్రవీణ్ కొద్ది రోజులు జైల్లోఉన్నాడు. అప్పడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్ క్యాసినో నిర్వాహకుడిగా మారాడని అంటుంటారు. తొలినాళ్లల్లో క్రికెట్ బుకీగా వ్యవహరించాడు. రాష్ట్రంలో క్లబ్స్ నిషేధించడంతో గోవాకు చెందిన ప్రముఖ గో డాడీ క్యాసినోలో పార్ట్నర్గా మారాడని, ఆపై చెన్నై శివార్లలో సొంతంగా ఓ క్యాసినో పెట్టాడని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలు, పేకాట శిబిరాలూ ఇతడి నేతృత్వంలోనివే అని పోలీసులు చెప్తున్నారు. కుడి భుజంగా మాధవరెడ్డి బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి.. ప్రవీణ్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రితో దగ్గర బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ నిర్వహించే క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌లకు ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకునేవాడు. బోయిన్‌పల్లికే చెందిన ఓ వ్యక్తి ఇటీవల నేపాల్‌లోని వీరి క్యాసినోకు వెళ్లారు. ముందుగానే రూ.10 లక్షలు చెల్లించారు. అయితే అక్కడ అదనపు ఖర్చులకంటూ మాధవరెడ్డి ఆయనకు డబ్బులు ఇచ్చాడు. తిరిగి వచ్చాక ఆ డబ్బు ఇవ్వాలని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని తమ వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది పేకాటరాయుళ్ల భూములను వీరిద్దరూ ఇదే పంథాలో బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు అనేకం. కొంపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ ఇప్పటికీ పేకాటరాయుళ్లకు అడ్డాగా ఉంది. ప్రవీణ్, మాధవరెడ్డి దాన్ని లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ ప్రతి నెలా రెండు రోజులపాటు పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఇటువైపు పోలీసులు కన్నెత్తి చూడరన్న ఆరోపణలున్నాయి. బంగారం వ్యాపారంలోనూ... చీకోటి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ సంబంధాలున్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు ఏర్పాట్లు చేసి తాను బంగారం బ్లాక్‌మార్కెట్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్ జూ చీకోటి కుటుంబం ప్రస్తుతం ఐఎస్ సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని సాయి కిరణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ప్రవీణ్ కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్ జూ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో రూ.కోట్ల విలువైన వైట్హార్స్తోపాటు మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, పశువులు.. ఇలా అనేక రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమాలో విలన్‌గానూ నటించాడు. 2007లో పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఓ చిత్ర నిర్మాణం కోసం ఒక హీరోకి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్ తొలినాళ్లల్లో కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా తిరిగి తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. ఆడంబర జీవితం గడిపే అతని వెంట అనునిత్యం ప్రైవేట్ సైన్యం ఉంటుంది. తన కుమారులకు రూ.కోట్ల విలువైన కార్లు బహుమతులుగా ఇచ్చాడు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు చీకోటి ప్రవీణ్ ఒక్కో ఆటకు ఒక్కో రేటు ఫిక్స్ చేస్తాడు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన డిపాజిట్ తీసుకుంటాడు. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాలకు క్యాసినో ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా తనకు 200 మంది రెగ్యులర్ కస్టమర్లుండగా వారికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసి పెడతాడు. ప్రయాణానికి ముందే కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటాడు. ఇండోనేషియా, నేపాల్‌కు క్యాసినో ఆడేందుకు వెళ్లే వారు రూ.5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్ చేస్తారు. రూ.15లక్షల వరకు చెల్లించిన వారిని సాధారణ విమానాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తీసుకెళ్తాడు. రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు డిపాజిట్ చేసే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తాడు. ఒక్కో వీకెండ్‌కు రూ.40 లక్షల సంపాదన ఒక్కో టేబుల్‌పై రూ.2 లక్షల నుంచి 2కోట్ల వరకు పేకాట నడుస్తుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఒక్కో కిట్‌గా పిలుస్తారు. ప్రతీ కిట్‌పై 5 శాతం కమిషన్‌ను ముందే తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి రూ.5లక్షల గేమ్ ఆడితే మొత్తం ఆట విలువ రూ.25లక్షలు అవుతుంది. ఈ ఆటలో కమీషన్ కింద 5 శాతం అంటే రూ.1.75లక్షలు వస్తుంది. ఇలా ఒక్కో వీకెండ్లో రూ.40 లక్షల వరకు ప్రవీణ్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.5లక్షల వరకే ఆడదామని వెళ్లిన వారు అక్కడి వాతావరణానికి రెచ్చిపోయి రూ.20లక్షల వరకు ఆడతారని జూదరులు చెప్పారు. 2017లో మారియట్ హోటల్లో... హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2017 అక్టోబర్‌లో లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌పై దాడి చేశారు. దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాసినో గుట్టురట్టు చేశారు. కేవలం మూడు రోజుల్లో రూ.80 లక్షలకు పైగా చేతులు మారింది. వారాసిగూడకు చెందిన సంజయ్‌కుమార్ ఈ శిబిరం ఏర్పాటు చేయగా... ప్రవీణ్ సహా నలుగురు కీలకపాత్ర పోషించి పోలీసులకు చిక్కారు. ఈ శిబిరంలో ప్రవేశించడానికి పేకాటరాయుళ్లు కనీసం రూ.2 లక్షలు చెల్లించి కాయిన్స్ (చిప్స్) తీసుకుని పేకాట టేబుల్‌పై కూర్చునేలా చేశారు. ఏడో అంతస్తు మొత్తాన్ని బుక్ చేసి... సూట్ రూమ్‌లో ఒక్కో టేబుల్‌పై 8 మంది కూర్చునేలా మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. -
గోవా బీజేపీకి షాక్
పణజి: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో, మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. కలంగుటే నియోజక వర్గం నుంచి మైఖేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రజల పక్షాన లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు మైఖేల్ తెలిపారు. మైఖేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మయం నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే చెప్పారు. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, సమస్యకు బీజేపీ సర్కార్ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని ప్రవీణ్ ఆరోపించారు. -
పోలవరం పనులు భేష్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పిల్ వే, గేట్ల పనితీరు, ఎగువ కాఫర్ డ్యామ్, ఫిస్ లాడర్, దిగువ కాఫర్ డ్యామ్ పనుల పురోగతిపై వివరాలడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేసే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, గేట్ల పనితీరు తదితర అంశాలపై ఆయనకు వివరించారు. సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ కె.లతాకుమారి, ఈఈలు పి.సుధాకర్‌రావు, మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాసితుల వినతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌కు నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. వరదల సమయంలో పాత గ్రామాలను విడిచి అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నామన్నారు. పాత గ్రామాల్లో తమకు సంబంధించిన పశువులు, ఇంటి సామగ్రి, వ్యవసాయ పనిముట్లు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని తెచ్చుకునేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని తూటికుంట సర్పంచ్ కుంజం లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. -
జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తనకున్న విచక్షణాధికారాలతో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 23న ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడానికి ప్రవీణ్ ప్రకాశే కారణమని తాను చేయించిన విచారణల్లో తేలిందన్నారు. నేను నిబంధనల మేరకే పనిచేశా: పవీణ్ ప్రకాశ్ వివరణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాను నిబంధనల ప్రకారమే పనిచేశానని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖపై వివరణ ఇస్తూ ఆయన సీఎస్‌కు శుక్రవారం లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖలో పూర్తి అంశాలను వివరించలేదన్నారు. ఎస్ఈసీ నుంచి తనకు మెయిల్ ద్వారా వచ్చిన లేఖపై తాను వెంటనే స్పందించానని, జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) కార్యాలయం స్వతంత్రమైంది కాదని, జీఏడీకి సీఎస్ అధిపతి అని, తాను ఆయనకే రిపోర్టు చేస్తాననే విషయాన్ని రమేష్ తెలుసుకోవాలన్నారు. జీఏడీలోని ఐదుగురు ముఖ్య కార్యదర్శుల్లో జీఏడీ పొలిటికల్ కార్యదర్శి సీఎస్‌కు సపోర్టింగ్ అధికారి మాత్రమేనన్నారు. కాబట్టి తాను స్పందించలేదని ఎస్ఈసీ అనడం ఎంతవరకు న్యాయమని, ఇది నైతికమా? అని ప్రశ్నించారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై న్యాయవివాదం కొనసాగుతున్నందున, యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపిన విషయం కలెక్టర్లు, ఎస్పీలందరికీ తెలుసు. వారు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడానికి అదే కారణం. ఈ అంశంలో నేను ప్రత్యేకంగా అధికారులను ఆదేశించింది ఏమీ లేదు. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. వాస్తవాలిలా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ జరక్కుండా నేను అడ్డుకున్నానని ఎస్ఈసీ అనడం ఏమాత్రం సమంజసం కాదు’’ అని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. -
టీఆర్ఎస్కు షాక్.. మున్సిపల్ చైర్మన్ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన షాక్ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ సోమవారం రాజీనామా సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. (మేయర్ ఎన్నిక.. కార్పొరేటర్లకు 5కోట్లు) -
వీసీ ప్రవీణ్‌రావుకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అవార్డుని ఏర్పాటు చేశాయి. దేశంలో వ్యవసాయ రంగ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న శాస్త్రవేత్తలకు, వృత్తి నిపుణులకు రెండేళ్లకోసారి ఈ అవార్డుని అందజేస్తారు. ఐకార్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ పరోడా నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో నిష్ణాతులైన 13 మంది నుంచి వచ్చిన దరఖాస్తులను, రికార్డులను పరిశీలించి ఈ అవార్డుకి ఎంపిక చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రవీణ్‌రావు బోధన, పరిశోధన, విస్తరణలలో తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యల కారణంగా దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ యూనివర్సిటీ ఆరో స్థానంలో నిలిచింది. -
దసరా సరదాలు
-
హాత్ వే హెడ్ ప్రవీణ్ ఇంటికి వెళ్లిన దత్తాత్రేయ
-
జై సేన విజయం సాధించాలి
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్ రోల్. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్ రెడ్డి. -
పదికాలాల పాటు నిలిచిపోయేలా...
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్యతారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘జై సేన’. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందు లోనూ ఉన్నాయి. సహ నిర్మాత శిరీష్ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే సూపర్‌స్టార్. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మారకుండా అలాగే ఉన్న వ్యక్తుల్లో సముద్ర ఒకరు’’ అన్నారు సునీల్. ‘‘సముద్రతోనే నా జర్నీ స్టార్ట్ అయింది’’ అన్నారు సంగీత దర్శకుడు రవిశంకర్. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్, శిరీష్ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సహ నిర్మాతలు: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్. -
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్బీఐ ప్రాయోజిత 16 ఆర్ఆర్బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల విలీనంపై... రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్ఆర్బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి. స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు. మాతృ బ్యాంకులో విలీనం ఉండదు ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి. 2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి. -
రైతుని కాపాడండి
‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్ అఫ్ యూత్’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్: ఎస్ఆర్ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్ రెడ్డి, శ్రీనివాస్. -
హీరోగా చేసినా నవ్వించాలి
‘‘ఊర్లో జులాయిగా తిరిగే పాత్రలు మావి. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన లక్ష్మీ రాయ్‌ని వెంటపడి ఆనందిస్తాం. ఆ తర్వాత మమ్మల్ని ఊరికి ఉపయోగపడేలా ఆమె ఎలా మారుస్తుంది? అన్నది కథ. హారర్ టచ్ ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సినిమాలో మా ఇద్దరి సీన్స్ ఎంత నవ్విస్తాయో లక్ష్మీరాయ్‌తో ఉన్న సీన్స్ ఇంకా బాగా నవ్విస్తాయి’’ అని ప్రవీణ్, మధు నందన్ అన్నారు. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. ప్రవీణ్, మధు నందన్ వినోదాత్మక పాత్రల్లో నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రవీణ్, మధునందన్ మాట్లాడుతూ – ‘‘మేం సినిమాను అంగీకరించినప్పుడు లక్ష్మీరాయ్ లేరు. కథే ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. లక్ష్మీ రాయ్ ఆ ఊరికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది కథాంశం. మేం ఈ సినిమాను అంగీకరించడానికి కారణం కథ. మా పాత్రల ముగింపు. బయట మేం చాలా క్లోజ్‌ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ సినిమాలో మేం చేసే కామెడీలో కనిపిస్తుంటుంది. ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఓ కమెడియన్ హీరోగా చేస్తే.. సినిమాలో 90 శాతం నవ్వులే ఉండాలి. అప్పుడే సోలో హీరోగా నటించాలి. ఫైట్లు, డ్యాన్స్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే.. వాటికి పెద్ద హీరోలు ఎలాగూ ఉన్నారు కదా?’’ అన్నారు. -
స్పీడు పెంచిన ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ టీం
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా రాయ్ లక్ష్మీపై తెరకెక్కించిన ఓ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాపా అత్తిలి పాప అంటూ సాగే ఈ పాటలో రాయ్ లక్ష్మీతో పాటు హస్య నటులు ప్రవీణ్, మదునందన్ కూడా ఆడి పాడారు. హరి గౌర సంగీతమందించిన ఈ పాటకు సురేష్ బానిశెట్టి సాహిత్యమందివ్వగా మంగ్లీ, హరిగౌర ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
కూలీ కొడుకు... ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీ కుమారుడు ప్రవీణ్ చిత్రవేళ్ కాంస్య పతకంతో మెరిశాడు. అతను ట్రిపుల్ జంప్‌లో ఈ పతకం సాధించాడు. ఈ క్రీడల్లో ఓవరాల్‌గా భారత్‌కిది 12వ పతకం కాగా... అథ్లెటిక్స్‌లో రెండోది. ఈ పోటీలో అతను స్టేజ్–2లో 15.68 మీ.దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే స్టేజ్–1లో మెరుగైన 15.84 మీ. దూరంతో కలిపి 31.52 మీ. సగటుతో పోడియంలో నిలిచి కాంస్యంతో తృప్తిపడ్డాడు. ఈ యూత్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో ఫైనల్స్ నిర్వహించడం లేదు. ఒక్కో అథ్లెట్‌కు రెండు అవకాశాలిస్తారు. మెరుగైన సంయుక్త ప్రదర్శన ఆధారంగా స్థానాలను కేటాయిస్తారు. తంజావూరు జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన ప్రవీణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి దినసరి వ్యవసాయ కూలీ. అయితే క్రీడల్లో ప్రావీణ్యమున్న ప్రవీణ్ అనుకోకుండా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అథ్లె టిక్స్ కోచ్ ఇందిరా సురేశ్ కంటపడ్డాడు. అతని ప్రతిభను గుర్తించిన ఆమె తన శిక్షణలో ప్రవీణ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దింది. ఈ ఏడాది ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్‌లో అతను స్వర్ణం, జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. ప్రస్తుతం అతను మంగళూరులోని కాలేజీలో స్పోర్ట్స్ కోటాలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ఆకాశ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ఆకాశ్ 6–0తో సెన్నా రూస్ (బెల్జియం)పై గెలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాడు. -
పిల్లా నీకేదంటే ఇష్టం
లక్ష్మీ రాయ్, రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ ముఖ్య తారలుగా కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్. శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక–నిర్మాతలు లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పిల్లా నీకేదంటే ఇష్టం.. యాపిల్ పిల్లా నీకేదంటే ఇష్టం’ అనే మాసీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు శేఖర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అమలాపురంలో దాదాపు 40 రోజులు షూటింగ్ జరిపాం. ఇంకో పదిరోజులు అక్కడే షూటింగ్ జరిపితే ఈ సినిమా దాదాపు పూర్తి అవుతుంది. కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. లక్ష్మీరాయ్ బహుభాషా నటి. అద్భుతంగా నటిస్తున్నారు. డైరెక్టర్ కిశోర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ బాగా నటిస్తున్నారు. హరి మంచి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌రెడ్డి. ‘‘కామెడీ చిత్రమిది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీ. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ రాయ్. ‘‘నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు కిశోర్. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, ప్రవీణ్, మధు నందన్, డీఓపీ వెంకట్, కిశోర్, పూజిత, పంకజ్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో దివిజ్, పురవ్ జోడీలు
పారిస్: లియోన్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ క్రీడాకారులు దివిజ్ శరణ్, పురవ్ రాజాలు వేర్వేరు భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్ శరణ్–గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) ద్వయం 6–7 (7/9), 7–6 (10/8), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్ ఫైనల్లో పురవ్ రాజా–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ 7–5, 6–4తో జూలియో పెరాల్టా (చిలీ)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. మరోవైపు రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 7–5, 4–6, 7–10తో రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన రిజిస్ట్రార్ పోస్టులో కొనసాగుతారని పేర్కొంది. ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం వరంగల్‌లోని మహాత్మా గాంధీ స్మారక ఆస్పత్రిలో అనస్తీషియా విభాగం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు ఆగస్టు 31న ఖాళీ అయింది. -
హమ్మయ్య.. బాబు దొరికాడు..!
-
హమ్మయ్య.. బాబు దొరికాడు..!
► తెల్లవారు జామున ఆస్పత్రి నుంచి అపహరణ.. ► అర్ధరాత్రి కరీంనగర్ శివారులో దొరికిన వైనం.. కరీంనగర్ రూరల్: కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం వేకువజామున అపహరించుకుపోయారు. అయితే, చిన్నారి అర్ధరాత్రి 12గంటల సమయంలో కరీం నగర్ శివారులో లభ్యమైనట్లు విశ్వసనీ యంగా తెలిసింది. పోలీసులు చిన్నారిని తల్లివద్దకు చేర్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ రమ్య, ప్రవీణ్ దంపతులు. రమ్య తొలి కాన్పు కోసం చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చేరగా, ఈనెల 14న ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. సోమవారం రాత్రి బాబును పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని రమ్యమ నిద్రిం చింది. మంగళవారం ఉదయం 5 గంటల కు నిద్రలేచిన రమ్యకు బాబు కనిపించ లేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. పరిసరాలన్నీ వెదికారు. బాబు కనిపించకపోవడంతో బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఒకదశలో ఆస్పత్రి అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించగా, అప్పటికే వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీల్లో వేకువజామున 4 గంటలకు గుర్తుతెలియని మహిళ ప్రసూతివార్డులోకి వెళ్లి బాబును బ్యాగులో పెట్టుకొని మరో యువకుడితో కలసి హోండా యాక్టివా వాహనంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ క్లారిటీ లేకపోవడంతో.. ల్యాబ్‌కు పంపించి పరిశీలిస్తామని సీపీ తెలిపారు. అనంతరం తల్లి రమ్య వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి డైరెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సూపరింటెండెంట్ వాసీంఅలీ, సెక్యూరిటీ ఇన్చార్జి తివారీతో చర్చించారు. బాబును తీసుకెళ్లినవారిని వెంటనే పట్టుకోవాలని బంధువులు, గ్రామస్తులు రాజీవ్‌రహదారిపై ఆందోళనకు దిగారు. ఐదు బృందాలతో గాలింపు బాలుడిను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అనుమానిత మహిళ, యువకుడి ఫొటోలను విడుదల చేశారు. -
ఢాంపావళి
సినిమాకి ఓ స్టార్టింగ్.. ఓ ఎండింగ్.. ఉంటుంది. మధ్యలో ఉన్న కామాలన్నీ కామెడీలే. హీరో హీరోయిన్లు గొడవపడ్డా.. ప్రేమించుకున్నా.. హీరో విలన్లు తనుకున్నా... కొద్దిగా రిలీఫ్ ఇచ్చే కామాలే కామెడీలు. ఫుల్‌స్టాప్‌కి క్లోజింగ్ ఉంటుందేమో కానీ కామాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇదిగో ఈ రెండు కామాల్లాగా... వాళ్లకు హ్యాపీ దీపావళి.. ‘సాక్షి’ పాఠకులకు హ్యాపీ ఢాం..పావళి. టపాకాయలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? శ్రీనివాసరెడ్డి : నా వీపు. అదేంటి? శ్రీనివాసరెడ్డి : అవునండీ... మా ఇంట్లో ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య... ఆఖరువాణ్ణి నేను. ఇంట్లో ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా కనపడేది నా వీపే. వంచి టపాటపా ఢాంఢామ్మని కొట్టేసి వాళ్ల పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయేవాళ్లు. అఫ్కోర్స్... నా అల్లరి కూడా ఆ లెవిల్‌లోనే ఉండేదనుకోండి. చెప్పులు వేసుకుంటుంటే చాలు ఎక్కడికి మాయమైపోతానో అని మా అమ్మ హడలిపోతుండేది. అంత బలాదూరు. నేనెంత పాపులర్ అంటే ఊళ్లో అడ్రస్ వెతుక్కుంటూ ఎవరైనా వస్తే అందరూ నన్నే చూపించేవాళ్లు. ప్రతి వీధి నాకు తెలుసు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినవాళ్లని మీరెళ్లాల్సిన ఇంటివాళ్లకు ఆడపిల్ల వుందా అని అడిగేవాణ్ణి. ఉంది అనంటే పేరడిగేవాణ్ణి. పేరు చెప్పగానే ఆ ఫలానా గోపీ కలర్ మేడ అని టక్కున చూపించేసేవాణ్ణి. ఆడపిల్లలందరూ అంత కంఠోపాఠం. మరి మీ సంగతి ప్రవీణ్ ప్రవీణ్ : టపాకాయలనగానే నాకు సిసింద్రీ గుర్తుకొస్తుంది. దానిని అంటిస్తే సర్రుమంటూ అంటుకుని సర్‌సర్‌మని ఎటెటో పోతుంది. ఒకసారి అంటిస్తే సర్‌మంటూ దారినపోతున్నవాళ్ల పంచెల్లోకి దూరింది. వాళ్లు కంగారుగా జంప్ కొట్టి నన్ను పట్టుకోవడానికి రన్నింగ్ మొదలెట్టారు. మనం దొరుకుతామా? పరార్. దీపావళి అల్లరి ఏదైనా గుర్తుందా? శ్రీనివాసరెడ్డి : లేకేమీ... ఉంది సుయోధనా. అవి ‘రాక్షసుడు’ సినిమా రిలీజైన రోజులు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక తెచ్చిన టపాకాయల్లో అందరికీ అన్నీ పోగా నా మొహాన కొన్ని నేల టపాకాయలు కొట్టారు. అయితే నేను ముందే తెలివిగా ఒక చిచ్చుబుడ్డి దాచిపెట్టుకొని దీపావళి ముగిసి అన్నీ అందరూ తగలెట్టేశారని నిర్థారించుకున్నాక నా దగ్గరున్న చిచ్చుబుడ్డీని చూపిస్తూ ఏడిపించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అని స్టయిల్‌గా హమ్ చేస్తూ ఆ చిచ్చుబుడ్డీ అంటిస్తే... ఇంకేముంది.. ఢామ్ అని పేలింది. ఈ చేయి చూడండి (కుడి చేయి చూపిస్తూ) ఈ వేళ్లకు ఉన్న మచ్చ అప్పుడు పడినదే. ప్రవీణ్: నాకు టపాకాయల కంటే కృష్ణవంశీ సినిమాల్లోలాగా దీపాలను ఇల్లంతా వెలిగించి పెట్టడం ఇష్టంగా ఉండేది. ఒకసారి ఆ దీపాలను వెలిగిస్తూ వాటితోనే ఇంగ్లిష్ ఎస్ లెటర్ వచ్చేలా చేశాను. మా ఫ్రెండ్స్ చూసి ‘స్వప్న’ గురించా ‘సూర్యకుమారి’ గురించా అని అడగడం మొదలుపెట్టారు. కాని నేను పెట్టింది మాత్రం హీరోయిన్ శాంతిప్రియ గురించి. ఆమె నటించిన తొలి సినిమా ‘మహర్షి’ నాకు అట్రాక్షన్. ఆ పోస్టర్లో స్టాప్ బోర్డ్ పట్టుకుని రిషికొండ బీచ్‌లో నిలబడిన శాంతిప్రియ స్టిల్ నా సినిమా రాకకు నాంది. ఆ విషయం తెలుసుకోకుండా మా ఫ్రెండ్స్ అందరూ గోలగోల చేసేసరికి బయటపడటానికి చచ్చే చావొచ్చింది. ఆడపిల్లలని టపాకాయలతో పోల్చవచ్చా శ్రీనివాసరెడ్డి : ఎందుకు పోల్చకూడదండీ? ఇప్పుడు మన రకుల్ ప్రీత్ ఉంది కదండీ. ఏఒన్ తారాజువ్వ. జుమ్ అని దూసుకుపోతోంది. సమంత కలర్ పూల చిచ్చుబుడ్డీ. వచ్చినప్పటి నుంచి స్థిరంగా బ్రైట్‌గా వెలుగుతూనే ఉంది. ప్రవీణ్ : ‘అ... ఆ’ సినిమా షూటింగ్లో అనుపమ పరమేశ్వరన్‌ను గమనించానండీ. బాబోయ్... ఆ అమ్మాయి కాలు నేల మీద అస్సలు నిలవదు. భూచక్రమే అనుకోండీ. సరే. ఇక మీ ఇంటి వెలుగు గురించి చెప్పండి. శ్రీనివాసరెడ్డి : చెప్పేదేముందండీ... మా ఇంట్లో అన్నీ బజాజ్ లైట్లే. అవే మా ఇంటి వెలుగు. అది కాదండీ మీ శ్రీమతి గురించి. శ్రీనివాసరెడ్డి : ఓ ఆ వెలుగా... తను మా సొంత అక్క కూతురే. పేరు స్వాతి. చిన్నప్పుడు ఎత్తుకునేవాణ్ణి. తను గొప్పగా బతకాలని అమెరికా సంబంధం చేసుకోవాలని అనుకుంటే తను నేనే గొప్పవాణ్ణని నన్ను ఎంచుకుంది. టపాకాయ్లలో వెన్నముద్దలు అని ఒక టైప్ ఉంటాయి గుర్తుందా. అలాంటి కోటి వెన్నముద్దల కాంతి తను. మరి మీ సంగతి? ప్రవీణ్ : తను మా కజిన్ ఫ్రెండ్. నాకు ముందు నుంచి తెలుగుదనం ఉన్న అమ్మాయిని చేసుకోవాలని ఉండేది. అలాంటి అమ్మాయే తను. పెద్దలను వెళ్లి మాట్లాడమంటే మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. నాకో కూతురు. శ్రీనివాసరెడ్డి: నాక్కూడా ఒక కూతురు. చూశావా... మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. ఆడపిల్లలే పుడతారు. ఏంటి... మీరిద్దరు మంచివారా? ప్రవీణ్ : సినిమాల్లో హీరో ఫ్రెండ్స్‌గా ఉంటూ హీరో కోసం ఏ మంచికైనా రెడీ కదండీ.. అదన్నమాట. ఈసరదా పక్కన పెడితే ఆడపిల్ల కంటే అద్భుతం ఏముంటుంది. షూటింగ్ నుంచి ఇంటికెళ్లి పాపను చూసుకుంటే ఆ ఆనందమే వేరు. శ్రీనివాసరెడ్డి : బాగా చెప్పావు. నా కూతురును చూసినా నాకు అదే సంతోషం. తను అచ్చు నా పోలిక. ఆన్లైన్ షాపింగ్‌లో రకరకాల వస్తువులు చూస్తూ ఫలానావి కొనండి అని మమ్మల్ని దబాయించేస్తుంటుంది. శ్రీమతి అలిగితే ఎలా సముదాయిస్తారు? శ్రీనివాసరెడ్డి : మా ఆవిడ ఎప్పుడూ అలగదండీ. ఫ్రెండ్స్‌తో ఉన్నా పార్టీలో ఉన్నా మధ్యమధ్య ఫోన్ చేసి విసిగించదు. ఆ విధంగా నేను లక్కీ అని అందరూ అంటుంటారు. ప్రవీణ్: నా భార్య కూడా ఎప్పుడూ అలగలేదండీ. శ్రీనివాసరెడ్డి: అంటే ఇతను పొద్దున్నే లేచి వంటంతా చేసి వచ్చేస్తాడండీ... ఇంకెందుకు అలుగుతుంది (నవ్వులు) ఇల్లు ఇల్లాలు పిల్లలు సరే... మరి ఓ... శ్రీనివాసరెడ్డి: ఓ.. అంటే ఇంగ్లిష్‌లో ఎమ్ ఎన్ తర్వాత వచ్చే ఓ నా... కాదండీ.. ఫ్యాన్సూ... లేడీస్ ఫాలోయింగూ... ప్రవీణ్: (లేచి నిలబడుతూ): బాబోయ్... నేను వెళతాను. ఇదేదో ఇరికించేలా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి: కూచో. ఎందుకు భయపడతావు. చూడండి... మాకు ఓ... లు పి క్యు ఆర్ ఎస్ టిలు తెలియవు. ఎప్పుడైనా కొందరు ఆడవాళ్లు ఫోన్ చేసి ఫలానా రోల్ బాగుందండీ అనగానే థ్యాంక్స్ చెప్పి పెట్టేస్తాం. అంతకు మించి వెళ్లం. ప్రవీణ్: వెళ్తే బతుకుతావా ఏంటి? ఒకవేళ మీరు రకుల్‌ప్రీత్‌కు ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? శ్రీనివాసరెడ్డి: రకుల్ ప్రీత్నా? ప్రపోజా? చేస్తే ఓకే అంటుందా? ప్రవీణ్: అంటే ప్రపోజ్ చేసేద్దామనే? శ్రీనివాసరెడ్డి: అహ... మనకు రకుల్ ఓకే అంటుందా అని డౌటు. ప్రవీణ్: మనకేం తక్కువ. ఓకే అనొచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో పరిస్థితి ఏంటి. రోటి పచ్చడే. పచ్చడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది చెప్పండి... మీ తిండి సంగతి ఏంటి? శ్రీనివాసరెడ్డి: నేను ప్యూర్ నాన్వెజిటేరియన్నండీ. రొయ్యలు పీక మొయ్యా తింటాను. ప్రవీణ్: నాకు ఉప్పుచేప ఇష్టం. లైఫ్ చప్పగా ఉండకూడదంటే ఉప్పుచేపే తినాలి. సెట్లో మీరు అందర్నీ నవ్విస్తుంటారు కదా. మిమ్మల్ని నవ్వించేది ఎవరు? ప్రవీణ్: కృష్ణ భగవాన్ గారండీ. ఆయన వేసే పంచ్‌లు అదిరిపోతాయి. మొన్నొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావ్రా అని అడిగారు. షూటింగ్లో గురూజీ అన్నాను. చూడ్డానికి వెళ్లావా చేయడానికి వెళ్లావా అన్నారు. చేయడానికే గురూజీ అన్నాను. ఏమైనా నువ్వు చాలా బిజీ అయిపోయావురా... ఏ సినిమాలో కనిపించవుగాని అని పంచ్ వేశారు. నా పరిస్థితి ఊహించుకోండి. మీరు నవ్విస్తే అస్సలు నవ్వనివాళ్లు? శ్రీనివాసరెడ్డి: హిందీ ఆర్టిస్ట్లండీ... జోక్ చేస్తే అస్సలు నవ్వరు. క్యా బోలా అంటారు. ప్రవీణ్: ఒక్కోసారి అందరితో పాటు పెద్దగా నవ్వేసి ఆ తర్వాత తీరిగ్గా అడుగుతారండీ.. క్యాబోలా అని. {స్కీన్ మీద మీకిష్టమైన కమెడియన్? ఇద్దరూ: ఇంకెవరు బ్రహ్మానందమే. మీకిష్టమైన కామెడీ సినిమాలు? ఇద్దరూ: జంధ్యాల గారివి, ఇవివి గారివి, రాజేంద్రప్రసాద్ గారివీ అన్ని సినిమాలు. హీరోయిన్లలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరోయిన్? శ్రీనివాసరెడ్డి: సమంత. ప్రవీణ్: శ్రీనివాసరెడ్డి ప్రెజెన్స్ సమంతకు చాలా ఇష్టం. పెంచుకుంటాను వచ్చెయ్ అని బతిమిలాడుతుంటుంది (నవ్వు). శ్రీనివాసరెడ్డి గొప్పతనం ఏమిటంటే తను ఎవరినీ హర్ట్ చేయకుండా నవ్విస్తాడు. హీరోల్లో ఎవరు బాగా జోక్స్ వేస్తారు? శ్రీనివాసరెడ్డి: మహేశ్‌బాబు... ఆయన కట్ చేసే జోకులు... మంచి మూడ్‌లో ఉండాలేగాని అందరినీ కూచోబెట్టుకుని ఒకటే జోకులు వేసి నవ్వుతాడాయన. ఆ మహేశ్‌బాబుని చాలా తక్కువ మందే చూసి ఉంటారు. హీరోల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ప్రవీణ్: రవితేజ, సునీల్ శ్రీనివాసరెడ్డి: తారక్‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాణ్ణి. ఆయన పెళ్లయ్యాక తరచూ కలవడం తగ్గింది. మీ ఇద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఇద్దరూ: చాలా చేశామండీ. మొన్నటి ప్రేమమ్‌లో కూడా ఉన్నాం. ప్రవీణ్: రాబోయే ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కలిసి చేశాం. అందులో శ్రీనివాస రెడ్డి హీరో. ‘అవును’ ఫేమ్ పూర్ణ హీరోయిన్. నేను తత్కాల్ అనే క్యారెక్టర్ చేశాను. ఒక కరీంనగర్ అబ్బాయికి కాకినాడ అమ్మాయికి మధ్య సాగే అందమైన ప్రేమ కథ అది. భాగ్యరాజా స్టయిల్లో ఉంటుంది. మీ ఇద్దరి యాక్టింగ్‌లో కామన్ ఎలిమెంట్ ఏమిటి? శ్రీనివాసరెడ్డి: డైలాగ్ ఎంత వేగంగా చెప్పినా అక్షరం అక్షరం రిజిస్టర్ అవుతుంది. పెద్ద డైలాగ్ కూడా ఇబ్బంది లేకుండా చెప్తాం. ఆరోగ్యానికీ యోగా ఏమైనా... శ్రీనివాసరెడ్డి: ఓ ఎందుకు చేయనండీ. పేకాట ఆడతానండీ. 52 కార్డ్స్‌ని గుర్తు పెట్టుకుని అరేంజ్ చేసుకోని... అబ్బో చాలా ధ్యానంతో ముడిపడిన సంగతండి అది. ప్రవీణ్: నేను నడుస్తానండీ. మా మధురా నగర్లో వాకింగ్ చేస్తాను. మాకు బోర్ కొడితే సినిమా హాలుకి వెళతాం. మరి మీకు? శ్రీనివాసరెడ్డి: ఇక్కడే హైదరాబాద్‌లో ఉన్న మా చిన్నక్క ఇంటికి వెళతానండీ. ఫ్యామిలీని తీసుకుని ఊళ్లకెళ్లడం అలాంటివి చేయను. మా వాళ్ల ఇళ్లే నాకు పెద్ద రిలాక్సేషన్. ప్రవీణ్: మా అంతర్వేదికి పదహారు కిలోమీటర్ల దూరంలో కేసినపల్లి అనే ఊరు ఉందండీ. అక్కడికెళ్లిపోతాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికెళితే 24 గంటలూ కామెడీయే. ఫైనల్‌గా దీపావళికి మీరిచ్చే మెసేజ్ ఏమిటి? శ్రీనివాసరెడ్డి: ఎంత కష్టమొచ్చినా ఏడవకుండా కాకరపువ్వొత్తుల్లా నవ్వుతూ ఉండమనే. ప్రవీణ్: చీకటి తర్వాత వెలుగు వస్తుందండీ. ఇంత పెద్ద అమావాస్యను మనం దీపాల వెలుగుతో ఓడిద్దామని అనుకుంటాం. ఆ ఆశ ఆత్మవిశ్వాసం ముఖ్యమండీ. అవి ఉంటే లైఫ్ హ్యాపీనే. ధ్యాంక్యూ.. హ్యాపీ దీపావళి. ఇద్దరూ: సాక్షి పాఠకులందరికీ హ్యాపీ దీపావళి. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది? శ్రీనివాసరెడ్డి: అది నిజంగా విచిత్రం అండి. ఈ కథ జేడీ చక్రవర్తిగారి దగ్గరకు వెళ్లింది. ఆయన్ను నేను పర్సనల్‌గా ఎప్పుడూ కలిసింది లేదు. నా సినిమాలు చూసి ఉంటారు కాబట్టి, ఈ కథ నాకైతే బాగుంటుందనుకున్నారట. అలా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రౌడీ కామెడీ
పవన్‌కల్యాణ్‌గారు మా అందర్నీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టిన రోజుని జీవితంలో మేం మరచిపోలేం. సాధారణంగా ఒంటిగంటకు భోజనం చేసే ఆయన.. రెండింటి వరకూ తినకుండా వెయిట్ చేశారు. ‘ఈ రోజు మీరు నా అతిథులు’ అని చెప్పి స్వయంగా ఆయనే ప్లేట్స్ ఇచ్చి వడ్డించారు. భోజనాలు పూర్తయిన తర్వాత రెండు గంటల పాటు మాతో మాట్లాడారు. బస్ ఎక్కితే చేసేది ఇదే.. పిక్నిక్లో చేసేది ఇదే.. ఏం తోచకపోతే చేసేదీ ఇదే.. భరించలేని ధ్వని.. కానీ, తెలిసిన రాగం.. మేనత్త కావొచ్చు.. కోడలు కావొచ్చు.. కూతురు కావొచ్చు.. బావగారు కావొచ్చు.. ఎవరు పాడినా చప్పట్లు కొడతారు. కానీ, రౌడీలు పాడారండీ... ఆ అంత్యాక్షరికి చిందులు వేశాం. ఈ రౌడీల వెనకాల ఎన్ని ‘ఢీ’లు... ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్. రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా... - ఆంజనేయులు మాది తణుకు. చిన్నప్పుడు చదువుకోవడం మానేసి సినిమాలు చూసేవాణ్ణి. స్టేజీల మీద డ్యాన్స్ చేస్తూ మిమిక్రీ చేసేవాణ్ణి. కామెడీ ఆర్టిస్టుగా చేయాలని ఉండేది. అవకాశాలు వెతుక్కుందామని నా భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఫిల్మ్‌నగర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ణి. బస్సుల్లో తిరగాలంటే టికెట్లకే బోల్డంత డబ్బు అయిపోతుంది. నా జేబులు ఎప్పుడూ ఖాళీయే. అందుకే స్టూడియోలు ఎంత దూరమైనా నడ్చుకుంటూ వెళ్లేవాణ్ణి. కృష్ణానగర్‌లో ఓ రేకుల గదిలో ఉండేవాణ్ణి. అద్దె 75 రూపాయలు. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులుండేవి కాదు. వేషాల కోసం ఎదురు చూస్తే కష్టం అని, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో చేరాను. రోజుకి వంద రూపాయలు ఇచ్చేవారు. నెలకి ఓ పది రోజులు పని ఉండేది. ఒక్కోసారి ఆ పని కూడా దొరికేది కాదు. ఈ గ్యాప్‌లో నటుడిగా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కాస్ట్యూమ్ వర్క్ చేస్తూనే చాలా సినిమాల్లో వెనక అటూ ఇటూ తిరిగే క్యారెక్టర్లు చేశాను. బాబు పుట్టడంతో ఫ్యామిలీ గడవడం కష్టమైంది. ఆ తర్వాత రెండో బాబు కూడా పుట్టాడు. షూటింగ్ ఉంటే నేనక్కడ తినేవాణ్ణి. ఇంట్లో మా ఆవిడ, పిల్లల పరిస్థితి దారుణంగా ఉండేది. పిల్లలకు పాలు కొనలేని పరిస్థితి. ఊరెళ్లిపోయి పొలం పనులు చేసుకుందామనుకున్నా. ‘ఇక్కడే ఉందాం... నేనూ పని చేస్తా’ అని మా ఆవిడ ఇళ్ల పనులు చేయడం మొదలుపెట్టింది. నాలుగేళ్ల క్రితం వరకూ తను పనులు చేసింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాల్లో నటిస్తూ, డ్యాన్సర్‌గానూ చేస్తుండేవాణ్ణి. ఇప్పటివరకూ పలు సినిమాల్లో నటించా. మా పెదబాబు కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చినబాబు డిగ్రీ ఫైనలియర్లో ఉండగా యాక్సిడెంట్లో మరణించాడు. జీవితాంతం వెంటాడే బాధ ఏదైనా ఉందంటే అది మా అబ్బాయి మరణమే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆర్థిక కష్టాలు తప్పాయి. అవకాశాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా రోజుకి పదివేలు ఇస్తున్నారు. నేను రాజశేఖర్‌గారి దగ్గర పనిచేశా. ‘గబ్బర్ సింగ్’లో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, చేసిన ‘రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా..’ చూసి.. ‘నాకన్నా నువ్వే బాగా చేశావ్’ అన్నారు. ఇప్పుడో ఇల్లు కొనుకున్నాను. పెద్దబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్నాం. మల్లె తీగెకు పందిరి వోలె... - రమేశ్ మాది హైదరాబాద్ పాతబస్తీ. పదో తరగతి వరకూ చదువుకున్నా. నా ముఖం చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు సినిమాలపై ఆసక్తి లేదు. రామ్‌గోపాల్ వర్మగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే మహేశ్ అన్న మా ఇంటి దగ్గర ఉండేవారు. ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ‘షాక్’ సినిమా అప్పుడు హీరోయిన్‌కి బాడీగార్డుగా చేశా. మోహన్‌బాబుగారితో పాటు పలువురి దగ్గర బాడీగార్డుగా పనిచేశా. ‘ఢీ’ నుంచి యాక్టింగ్ మొదలైంది. పదేళ్ల పాటు మెయిన్ విలన్ వెనక రౌడీ క్యారెక్టర్లు చేశాను. నెలలో పది రోజులు షూటింగ్ ఉండేది. ‘గబ్బర్ సింగ్’తో లైమ్‌లైట్‌లోకి వచ్చా. ఆ సినిమాలో చేసిన ‘మల్లె తీగెకు పందిరి వోలె..’ పాట చూసి, నారాయణమూర్తిగారు మెచ్చుకున్నారు. బాడీగార్డుగా పనిచేసినప్పుడు ‘ఇప్పటిదాక కుర్సీలో కూసున్నాం. ఏ రోజైనా క్యార్‌వ్యాన్ ఎక్కాలి మనం. కష్టపడి ఆ స్టేజికి రావాలి’ అనుకున్నా. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కొన్ని చిన్న సినిమాలకు, టీవీ షోలకు క్యార్‌వ్యాన్ ఇచ్చారు. నా ఆశ నెరవేరింది. నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతుర్ని చేసుకున్నా. మామ ఇంట్లో వాళ్లందరూ ‘షూటింగులకు పోతే ఏమొస్తది’ అన్నారు. బంధువులు కూడా చాలా మాటలన్నారు. దాంతో పిల్లనివ్వడానికి మామవాళ్లు భయపడ్డారు. నా మరదలే ఒప్పించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘వాడు మావాడే’ అని గర్వంగా చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ‘గబ్బర్ సింగ్’ విడుదలకు ముందు మా బ్యాచ్ దగ్గరకి రావడానికి భయపడేవారు. ఇప్పుడు ‘అన్నా.. ఓ సెల్ఫీ’ అంటున్నారు. చిన్నపిల్లల్లో మాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇండస్ట్రీకి రాకముందు టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్, సెటిల్మెంట్లు చేసేవాణ్ణి. నాతో తిరగొద్దని మా ఫ్రెండ్స్ వాళ్లింట్లో గొడవ చేసేవారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘మా అబ్బాయిని కూడా తీసుకు వెళ్లొచ్చు కదా’ అంటున్నారు. హరీశ్ శంకర్ సర్ ‘గబ్బర్ సింగ్’లోనే కాదు.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలోనూ నేనుంటా. ఇప్పుడు చాన్సులు బాగానే ఉన్నాయి. జలక్ దిక్లాజా... - రెమ్సన్ రాజు మాది చార్మినార్ దగ్గర యాకుత్‌పుర. పదో తరగతి ఫెయిలయ్యా. జిమ్‌కు వెళ్లడం.. ఫ్రెండ్స్‌తో తిరగడం.. ఇవే పనులు. మా చిన్నమ్మ కొడుక్కి ఇండస్ట్రీతో టచ్ ఉంది. ‘గొడవలు, గట్రా ఎందుకురా.. నాతో రా, నిన్ను సినిమాల్లో తీసుకుంటారు’ అన్నాడు. ‘ఊకో అన్నా.. నన్నెవరు తీసుకుంటారు’ అన్నాను. రాధాకృష్ణ అనే సార్‌తో కలిసి ‘చక్రం’ షూటింగ్ చూడ్డానికి వెళ్లా. కృష్ణవంశీగారు చూసి, రౌడీ బ్యాచ్‌లో ఒకడిగా తీసుకున్నారు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ప్రసాద్ అన్న వాళ్లింటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. నేను అమ్మాయిలతో అస్సలు మాట్లాడేవాణ్ణి కాదు. దాంతో సతాయిద్దామని ఫోన్ చేసి, మా అన్నయ్యవాళ్లు ఆ అమ్మాయికి ఇచ్చారు. ‘మీరు సినిమాల్లో చేస్తారు కదా. నేను మీకు పెద్ద ఫ్యాన్. నెట్లో మీ నంబర్ తీసుకున్నా’ అని చెప్పింది. ‘చిన్న చిన్న రౌడీ క్యారెక్టర్లు చేస్తా. నా నంబర్ నెట్లో పెట్టేంత సీన్ లేదు. ఫోన్ పెట్టు’ అన్నాను. మళ్లీ తెల్లారి ఫోన్ చేసి అవే మాటలు. ‘ఓవర్ యాక్షన్ చేయకు’ అని తిట్టా. ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్ అయ్యింది. ఆ టైమ్‌లోనే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ‘అతను పైసల్.. అని వేధిస్తున్నాడు. ఇంట్లోవాళ్లు బాధపడతారని ఒప్పుకున్నా. నాకతను నచ్చలేదు’ అంది. ఆ అమ్మాయికో లవర్ ఉందని ఆ అబ్బాయికి చెప్పించా. నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి, వెనక్కి తగ్గేది లేదని పెద్దలన్నారు. దాంతో ‘నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం’ అంది. ‘ఎప్పుడో ఇష్టం’ అన్నాను. మేం పెళ్లి చేసుకున్నాం. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లలో ‘నాలుగు రోజులు అవుట్ డోర్ షూటింగ్ ఉంది’ అని చెప్పి మాతో వచ్చేశారు. గొడవలు జరిగాయి. మన సంతోషం కోసం ఆలోచించి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందర్నీ కష్టపెట్టడం తప్పని అర్థమైంది. ఇప్పుడంతా కాంప్రమైజ్ అయింది. ఇప్పుడెవరైనా లవ్ మ్యారేజ్ అంటే నేను వద్దని చెప్తా. మా పెళ్లయి ఆరేళ్లయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. ‘గబ్బర్ సింగ్’ 50వ రోజున బాబు పుట్టాడు. వాడికి ‘గబ్బర్ సింగ్’ అనే నిక్‌నేమ్ పెట్టాను. ఆ సినిమాలో చేసిన ‘జలక్ దిక్లాజా..’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ప్రస్తుతం నా పొజిషన్ ఫర్వాలేదు. సినిమాలు చేస్తున్నాను. పెద్ద సినిమాలకు పదివేలు ఇస్తున్నారు. చిన్న సినిమావాళ్ల రిక్వెస్ట్‌ను బట్టి తీసుకుంటున్నా. నన్ను కొట్టకురో bతిట్టకురో.... - సాయిబాబా మాది సికింద్రాబాద్. ఒకటి, మూడు తరగతులు నాలుగుసార్లు, రెండో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యా. స్కూల్లో ఇంటర్వెల్‌కి గోడ దూకి 47 బస్ ఎక్కి అపోలో దగ్గరకు వచ్చేవాణ్ణి. నడుచుకుంటూ నానక్‌రామ్‌గూడా వెళ్లి కృష్ణగారి ‘మాయలోడు’ షూటింగ్ చూసేవాణ్ణి. ఓసారి గోడ దూకుతుంటే మేడమ్ పట్టుకున్నారు. ‘నీ కొడుకు చదువుకు పనికిరాడు. బస్తాలు మోయడానికి పనికొస్తాడు’ అని నాన్నకు చెప్పారు. ఓ రోజు కోపం వచ్చి పేపర్లు రౌండ్‌గా ఉండ చుట్టి మేడమ్‌ను కొట్టా. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చి, సస్పెండ్ చేశారు. ఆల్ఫా హోటల్ పక్కన పెట్రోల్ పంపులో జాడూ కొడుతూ, టైర్లలో గాలి పడుతూ ఓ ఏడాది చేశా. తర్వాత అక్కడే హెల్పర్‌గా, క్యాషియర్‌గా చేశా. ఓనర్‌కి నాపై నమ్మకం పెరగడంతో మేనేజర్ని చేశారు. మోహన్‌బాబుగారి దగ్గర పనిచేసే రాజుతో పరిచయమైంది. నాకు షూటింగులంటే ఇష్టం. పెట్రోల్ పంపులో పనిచేస్తూనే.. మోహన్‌బాబుగారి ఆడియో ఫంక్షన్స్, ఇంకేవి జరిగినా రాజు వెనకుండి ఆయన పనులు చేసేవాణ్ణి. హైట్, బాడీ బాగుందని ‘శివశంకర్’లో చిన్న వేషం ఇచ్చారు. ఓ నెల రోజులు సెలవు పెట్టేశా. ఓనర్ నన్ను పెట్రోల్ పంపు నుండి వెళ్లగొట్టారు. చేసేదేం లేక సినిమాల్లో కంటిన్యూ అయిపోయా. చిన్నప్పుడు అమ్మాయిలంటే చాలా సిగ్గు. బోనాలు, గణేశ్ చతుర్థి, అయ్యప్ప పూజలు చేయడంతో ఓ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఓ పేపర్‌పై లవ్ సింబల్ వేసి నా పేరు, తన పేరూ రాిసి పంపింది. నాకు చదవడం రాదు. ఇంకో పిల్లగాడితో చదివించుకున్నా. తర్వాత ‘ప్రేమదేశం’ పాటల క్యాసెట్ అడిగి మళ్లీ సేమ్ లవ్ సింబల్, పేర్లు రాసి పంపింది. కాస్ట్ ఫీలింగ్‌తో మా ఇంట్లోవాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ‘ఆ అమ్మాయిని చేసుకుంటే, ఇద్దరు సిస్టర్స్‌కి సంబంధాలు రావు’ అని భయపెట్టారు. వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. నేనంటే ఆ అమ్మాయికీ, తనంటే నాకూ ఇష్టం లేదు. పెళ్లైన నెలకు ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి గ్రీటింగులు పంపించడం స్టార్ట్ చేశాడు. గొడవలు మొదలయ్యాయి. ఏడాది తిరక్కుండానే విడాకులు ఇచ్చేశా. ఆ తర్వాత మా అమ్మే, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమ్మంది. అలాగే చేసుకున్నా. మాకు ముగ్గురు పాపలు. ‘గబ్బర్ సింగ్’లో చేసిన ‘నన్ను కొట్టకురో.. తిట్టకురో..’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. మా నాన్న సినిమాలు బాగా చూసేవారు. ‘నువ్ మంచి హైట్ ఉన్నావ్‌గా, సినిమాల్లో ట్రై చేయ్’ అని నాన్న చెప్పేవారు. నేను పెట్రోల్ పంపులో జాబ్ చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయన ముగ్గురు అక్కలకు పెళ్లి చేస్తే, నేను ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేశా. నా డెవలప్మెంట్ చూడకుండా నాన్న చనిపోయారని నా బాధ. అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి - ప్రవీణ్ మాది హైదరాబాద్ ఉప్పుగూడా రైల్వే స్టేషన్ దగ్గర. రామ్‌కోఠిలోని ఓ షాపులో టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్ చేసేవాణ్ణి. హీరో రవితేజగారి బాడీగార్డ్ కుమార్ అన్న నాకు తెలుసు. ‘పోకిరి’ షూటింగ్‌కి వస్తావా? అన్నారు. సరే.. అన్నా. షూటింగ్ అంటే 9 గంటలకు జాబ్‌కు వెళ్లడమే అనుకుని పడుకున్నా. తెల్లారక ముందు వచ్చి నిద్రలేపారు. ‘ఇప్పుడేం షూటింగ్ అన్నా. నేను రాను పో’ అని చెప్పా. ‘ఆరింటికే షూటింగ్ స్పాట్’లో ఉండాలని చెప్పి తీసుకువెళ్ళారు. విలన్స్ బ్యాచ్‌లో గన్ పట్టుకుని నిలబడమన్నారు. నేను నవ్వుతున్నా. ‘సీరియస్‌గా ఉండాలమ్మా’ అని చెప్పారు. ఆ తర్వాత ‘ఆట’ చేశా. అప్పట్నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నా. విలన్స్ బ్యాచ్‌లో ఉండేవాణ్ణి. షూటింగ్ లేదంటే కలెక్షన్ చేసేవాణ్ణి. ఓ టైమ్‌లో జాబ్ మానేశాను. కానీ, నెలలో పది రోజులు షూటింగ్ ఉంటే 20 రోజులు ఖాళీగా ఉండేవాణ్ణి. ఇబ్బంది అవుతోందని మళ్లీ కలెక్షన్ జాబ్ షురూ చేశా. మొదట్లో ఇంట్లోవాళ్లు సినిమాలు వద్దన్నారు. ‘ఏం చేస్తున్నావ్ రా’ అని తిట్టేవాళ్లు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. థియేటర్లో సినిమా చూసిన తర్వాత వాళ్లు ఫుల్ ఖుషీ. ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్‌కి, ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ పాటలో నా యాక్టింగ్‌కు అంత మంచి పేరొస్తుందని ఊహించలేదు. సినిమా విడుదలైన రోజున ఫైనాన్స్ కలెక్షన్ చేస్తుంటే... ‘అరే, ‘గబ్బర్ సింగ్’లో మంచిగా చేశావ్’ అని చాలామంది ఫోన్లు చేశారు. నాకింకా పెళ్లి కాలేదు. మా అన్నకు పెళ్లైన తర్వాత నాదే. మొదట్లో మనల్ని చూసి ఎవరు లవ్ చేయలే. అందరూ భయపడుతుండే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత చాలామంది ఫోన్లు చేసి ‘మీరంటే ఇష్టం’ అని టార్చర్ చేశారు. నాకు భయమైంది. ‘నాకు ఇసువంటివి నచ్చవ్. వద్దు’ అని చెప్పా. అవన్నీ పట్టించుకోలేదు. అంతకు ముందు మా మామవాళ్లు పిల్లను ఇవ్వడానికి వెనకాడారు. ఇప్పుడు ‘మా బిడ్డను చేసుకో..’ అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే.. తనని చేసుకుంటా. ఒకప్పుడు ఎవడైనా ఏమైనా అంటే.. గొడవపడుతుండే. ఇప్పుడు ‘ఓయ్.. గిట్లరా. ఓ ఫొటో దిగుదాం’ అనడిగినా గమ్మునుంటున్నా. - ‘సాక్షి’ సినిమా డెస్క్ -
ఓవరాల్ చాంప్స్ ప్రవీణ్, జాహ్నవి
హైదరాబాద్: వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ప్రవీణ్, శ్రీలలిత జాహ్నవి సత్తాచాటారు. బేగంపేట్‌లోని ఎయిర్‌లైన్స్ కాలనీలో సోమవారం జరిగిన ఈ టోర్నీలో అండర్-15 విభాగంలో ప్రవీణ్, అండర్- 9 విభాగంలో జాహ్నవి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో దాదాపు 80 మంది చిన్నారులు పాల్గొన్నారు. పోటీల అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ మాస్టర్ పీడీఎస్ గిరిధర్, టీఎస్‌సీఏ కార్యదర్శి ఎ. వెంకటేశ్వర రావు చిన్నారులకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్-7 బాలురు: 1. సంకేత్ రెడ్డి, 2. కె. సుశాంత్. బాలికలు: 1. శ్రీలలిత జాహ్నవి, 2. ప్రణీత ప్రియ. అండర్-9 బాలురు: 1. గణేశ్ సారుు, 2. రోహిత్. బాలికలు: 1. శ్రీశాంతి, 2. అక్షర. అండర్-11 బాలురు: 1. అభిరామ్, 2. గాంధీ. బాలికలు: 1. యజ్ఞ ప్రియ, 2. శృతిక. అండర్-13 బాలురు: 1. ప్రవీణ్, 2. నమన్. బాలికలు: 1. శ్రీచందన, 2. సాయి అఖిల. అండర్-15 బాలురు: 1. అత్యుత్, 2. కృష్ణ దేవర్ష్. బాలికలు: 1. సాయి ప్రియ, 2. రోలీ. -
'అసలు నేనేంటి? ఎందుకిలా చేస్తున్నాను?'
హైదరాబాద్: 'నేనెందుకు సరిగా చదవలేకపోతున్నాను? నేను ఎందుకు ఇతరులతో కలవలేకపోతున్నాను?' ఈ వ్యాఖ్యలు శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఎన్ ప్రవీణ్ కుమార్ తన నోట్ బుక్ లో రాసుకున్నవి. ఎంఎఫ్ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారు జామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు. అతడు ఆత్మహత్య పాల్పడటానికి గలకారణాలేమీ తెలియరాలేదు. అయితే, అతడి ఉంటున్న గదిలో ఓ ల్యాప్ ట్యాప్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని నోట్ బుక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని ఓ నోట్‌బుక్ లో మాత్రం సెప్టెంబర్ 9నాటి తేదితో ఓ లేఖ మాత్రం దొరికింది. అందులో ప్రవీణ్ స్వయంగా ఇలా రాసుకున్నాడు. 'నాకెందుకు ఇంత భయం వేస్తోంది? నా మీద నాకే కోపం వేస్తోంది. నేను అందరితో ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? నేను ఒంటరివాడిననే భావన ఎందుకు వస్తుంది? నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఈ రోజు ఉదయం మా డిపార్ట్మెంట్కు వెళ్లినప్పుడు ఓ విద్యార్థి వచ్చి నన్ను పలకరించాడు. కానీ నేను అతడితో సరిగా మాట్లాడలేకపోయాను.. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఇంకా బాగా చదవాలి. అందుకోసం ఇంకా ఏదో చేయాలి. లేదంటే నా జీవితానికి అర్థం లేదు. నేను ఎందుకసలు సంతోషంగా ఉండలేకపోతున్నాను. నాకు నేనుగా ఒంటరిగా ఎందుకు భావిస్తున్నాను' అంటూ అందులో పేర్కొన్నాడు. కాగా, ప్రవీణ్ ఆత్మహత్యకు సంబంధించి డీసీపీ కార్తీకేయ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 'నాకెందుకు ఇంత సోమరితనం, భయం' అంటూ ప్రవీణ్ లో నోట్లో రాసి పెట్టుకున్నాడని ఆ కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రవీణ్ కుమార్ ది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. అతడి తండ్రి ఓ బీఎస్ఎన్ఎల్ అధికారి. -
సెంట్రల్ వర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరవకముందే సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారుజామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యపై సహచర విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. యూనివర్సిటీ వీసీ పి. అప్పారావు హుటాహుటిన ఎల్ బ్లాక్‌కు చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంతా తెలియలేదని వీసీ అప్పారావు తెలిపారు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడని చెప్పారు. ప్రవీణ్ స్వస్థలం మహబుబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ అని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ అత్మహత్యపై యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రవీణ్ గదిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎటువంటి లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్యాంటిన్షెడ్ కూల్చివేశారని ఆత్మహత్యాయత్నం
జీవనోపాధి కల్పిస్తున్న క్యాంటిన్ షెడ్‌ను కూల్చివేశారనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో షెడ్ ఏర్పాటు చేసుకుని కాంటీన్ నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈస్థలాన్ని ఖాళీ చెయ్యాలని ఇండస్ట్రియల్ అధికారులు ఒత్తిడి చేశారు. అతడు షెడ్ ఖాలీ చేయడానికి నిరాకరించాడు. దీంతో అధికారులు శుక్రవారం షెడ్‌ను కూల్చివేశారు. మనస్తానపం చెందిన ప్రవీణ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల సాయంతో అతడ్ని రక్షించారు. -
తాను చనిపోతూ....మరికొందరి జీవితాల్లో వెలుగులు
– బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన ప్రవీణ్ – అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు – మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు చిగరపల్లె(ఐరాల) : ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడా స్పృహలోకి రాలేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతి చెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు. -
రీమేక్ కాదు.. ఫ్రీమేక్ కూడా కాదు...
‘అంకుశం’, ‘ఆహుతి’, ‘మహంకాళి’.. ఇలా రాజశేఖర్‌కి యాంగ్రీమ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చినవి పోలీస్ క్యారెక్టర్లే. మరోసారి ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘చందమామ కథలు’, ‘గుంటూర్ టాకీస్’ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆయన్ను పోలీస్‌గా చూపించడానికి రెడీ అయ్యారు. అయితే ప్రచారంలో ఉన్నట్టు హాలీవుడ్ మూవీ ‘డై హార్డ్’కి ఫ్రీమేకో.. రీమేకో కాదట. ఆ చిత్రంలో బ్రూస్ విల్లీస్ పాత్ర తరహాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఉంటుందని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజశేఖర్‌తో పాటు పలువురు కొత్త, పాత నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న తాజా చిత్రం ఆ కొరతను తీర్చే విధంగా ఉంటుందని ఈ స్క్రిప్ట్ గురించి తెలిసినవాళ్లు అంటున్నారు. -
మంగినపూడి బీచ్‌లో ఈతకెళ్లి ఇద్దరి మృతి
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో సముద్రంలో ఈతకెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మృతులు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ప్రవీణ్(20), అక్షిత(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
-
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
జనగామ (వరంగల్) : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్(16)ను రెండో సంవత్సరం చదువుతున్న ఉమేష్ తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఈ నెల 3న తేదీన ఉమేష్‌తో గొడవపడి.. పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుమారుడిపై కళాశాలలో దాడి జరిగిన విషయాన్ని దాచిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పారిశుధ్య కార్మికుడిపై దాడి..
పారిశుద్ధ్య కార్మికుడిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రవీణ్‌ను సోమవారం ఉదయం నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఏలూరు కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఏలూరు సెంట్రల్: రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా పైపులైను పనులకు అధికారులు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం బట్టలమగుటూరు గ్రామ సర్పంచి ఈలి అనిత భర్త ప్రవీణ్ గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో రిజర్వాయర్ పనులను చేపట్టాడు. పనులన్నీ పూర్తయినప్పటికీ గ్రామంలోకి వేయాల్సిన పైపులైన్ విషయంలో అధికారులు అనుమతి ఇవ్వలేదు. వారు కాలయాపన చేస్తున్నారని విసుగుచెందిన ప్రవీణ్.. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కలెక్టర్ భాస్కర్ సమక్షంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకోబోయాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనిని వారించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో జవాను మృతి
సారంగపూర్ మండలం వజర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ అనే బీఎస్ఎఫ్ జవాను మృతిచెందాడు. బైక్‌పై స్వగ్రామం వస్తుండగా మరో బైక్ ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రవీణ్‌కు ఇటీవలే వివాహం అయింది. ప్రవీణ్ స్వస్థలం సారంగపూర్ మండలం వైకుంఠాపూర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో ముగ్గురు ‘ఎర్ర’దొంగలపై పీడీ చట్టం
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బంగారుపాళ్యం మండలం తంబిగానిపల్లికి చెందిన దేవళ్ల రాజేష్, పుల్లూరు మురళి, తిరుపతిలోని గిరిపురానికి చెందిన చింతమాకుల ప్రవీణ్‌లను ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఏప్రిల్ 30న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు అనుమతి ఇస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం కింద వీరిని ఏడాది పాటు జైలులో ఉంచనున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు పట్టణానికి చెందిన ప్రవీణ్(22), నవీరసూల్(23) తిరుపతిలోని ఎదలవాడ రమణమ్మ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. బుధవారం పరీక్షలు పూర్తవడంతో.. శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి ద్విచక్రవాహనం పై సొంతూరుకు బయలుదేరారు. బైక్ ఏకోపల్లి వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రసూల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రసూల్ కూడా మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హోలీ వేడుకల్లో అపశ్రుతి
ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం టేకులచెరువులో బుధవారం జరిగిన హోలీ సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రవీణ్ అను 14 ఏళ్ల బాలుడు ప్రమాద వశాత్తూ ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రహదారిపై స్నేహితులతో ప్రవీణ్ హోలీ సంబరాలు చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ కింద ప్రవీణ్ పడిపోయాడు. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి
రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతిచెందాడు. వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన బీబీనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయాన్నే తన స్నేహితుని రియల్ఎస్టేట్ కార్యాలయానికి వచ్చిన గొలనుకొండ ప్రవీణ్(25) అక్కడే అనుమానాస్పదంగా మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ మెసేజ్ ప్రతి ఆడపిల్లకీ..!
ఫేస్బుక్లో మొదట ముఖాలు చూస్తారు. తర్వాత మెసేజ్‌లు పెడతారు. తర్వాత మెసేజ్‌నే సంభాషణగా మారుస్తారు. ఆ తర్వాత ఆ మెసేజ్‌నే వలగా.. విషపుకోరగా... కబళించే అగాధంగా మారుస్తారు. అన్ని మెసేజ్‌లు పెళ్లి కోసం కాదు... ప్రేమ కోసం కూడా కాదు... మరెందుకో తెలుసుకుంటే ఆ చైతన్యాన్ని ఒక మెసేజ్‌గా అందరికీ చేరవేస్తే ‘శ్రావ్య’లాంటి ఉదంతాలు మళ్లీ జరగవు. శ్రావ్య... ఆమె ఇష్టపడిన ప్రవీణ్‌చక్రవర్తి తనను ఇష్టంగా పిలిచే పేరు అది. ఈ తరం యువత జీవనశైలిలో భాగమైన ఫేస్బుక్లో ఆమెకూ అకౌంట్ ఉంది. అదిగో అక్కడే ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఆమెకు తారసపడ్డాడు కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి. అక్కడి నుంచి శ్రావ్య కథే మరిపోయింది. కువైట్‌లో ఉన్న అమ్మ, అన్న పంపిస్తున్న డబ్బుతో తన చదువేదో తాను చదువుకుంటున్న ఆమె ఇప్పుడు భార్య స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె నేపథ్యం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లల మామిడాడ శ్రావ్య సొంతూరు. దళిత ఆడబిడ్డ. ఆమెకు ఓ అన్న. ఎనిమిదేళ్ల కిందట అమ్మ, నాన్నకు మధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. ఉపాధి కోసం అన్న కువైట్ వెళ్లాడు. ఆరేళ్ల కిందట అమ్మ కూడా వెళ్లింది. అప్పటి నుంచి కాకినాడలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది శ్రావ్య. ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తోంది. ప్రవీణ్‌చక్రవర్తి వలలో... ఫేస్బుక్లో మామూలుగా ఇతర స్నేహితులతో చాటింగ్ చేసినట్టే గత ఏడాది మేలో తన ఫ్రెండ్లిస్ట్లో చేరిన ప్రవీణ్‌తోనూ చాటింగ్ చేసింది. కొంచెం చనువు ఏర్పడ్డాక శ్రావ్య ఫోన్ నంబర్ తెలుసుకొని ఒకరోజు ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఓ మతబోధకుడినని, చాలామంది సమస్యలను పరిష్కరించానంటూ ఫోన్లో తన గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు. దాంతో శ్రావ్య ఆమె స్నేహితురాలి అనారోగ్యం గురించి చెప్పింది. ఆమె కోసం ఫోన్లోనే ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన స్పందించిన తీరు, అంతకుముందు ఆయన చెప్పిన మాటలను బట్టి శ్రావ్య ప్రవీణ్‌ను ఓ మంచి వ్యక్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. పగలు,రేయి తేడా లేకుండా ఫోన్ సంభాషణ కొనసాగింది. ఒకరోజు ఓ వ్యక్తితో శ్రావ్యకు ఐ ఫోన్ పంపాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నా ప్రేమకానుకగా ఆ ఫోన్ తీసుకో’ అని చెప్పాడు. కొంత బెరుకు, ఎంతో మొహమాటంతోనే ఫోన్ తీసుకుంది శ్రావ్య. ఇంకొన్నాళ్లకు ల్యాప్‌టాప్ పంపాడు. వద్దని వారిస్తే.. నీ చదువుకి ఉపయోగపడ్తుందనే ఇస్తున్నాను తీసుకో అన్నాడు. కాదనలేకపోయింది శ్రావ్య. ఇద్దరి మధ్య ప్రణయబంధం బలపడింది. సెప్టెంబర్ 6... ‘మన ప్రేమ విషయం మన పెద్దలకు చెప్పేద్దాం. ఎలా చెప్పాలో ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫలానా చోటకు రా’ అంటూ శ్రావ్యను పిలిపించాడు ప్రవీణ్. అదో హోటల్. తనదే అన్నాడు శ్రావ్యతో. ఆ హోటల్ పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రావ్యతో ‘మా కుటుంబ సభ్యులందరి పేర్లు కలిపి పెట్టా’నని వివరించాడు. ఈ హోటల్ ఒక్కటే కాదు, తనకో స్కూల్, స్వచ్ఛంద సంస్థా ఉన్నాయని, వాటికి బోలెడు ఫండ్స్ వస్తాయని చెప్పాడు. ఓ గదికి తీసుకెళ్లి అల్మరాలో ఉన్న డబ్బులు, నగలు చూపించాడు. ‘నా భార్యవు కాబోతున్న నీకే ఇవన్నీ’ అన్నాడు. అంతేకాదు హోటల్ మేనేజ్మెంట్ చేశావు కాబట్టి ఈ హోటల్ నిర్వహణ బాధ్యతా నీకే అప్పగిస్తా’ అంటూ ఆ హోటల్లోని 306 రూమ్‌కి తీసుకెళ్లాడు. చేతివేలికి ఉంగరం తొడిగాడు. తమ మత సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయినట్లే అన్నాడు. ఆ సందిగ్ధాశ్చర్యాల్లోనే ఉన్న శ్రావ్యను శారీరకంగా వశపర్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెతో ఓ భర్త ప్రవర్తించినట్టే ప్రవర్తించసాగాడు. ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి 85 వేల రూపాయలు డిపాజిట్ చేశాడు. హోండా యాక్టివా బండి కొనిపెట్టాడు. ఆయనకున్న ఖరీదైన కార్లన్నీ చూపించి.. భవిష్యత్‌లో అవసరం పడొచ్చు అని డ్రైవింగ్ నేర్పించాడు. ‘అంతా బాగుంది.. కానీ ఇంతకీ మన పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించింది శ్రావ్య. గత నవంబర్‌లో కలిసినప్పుడు నిలదీసింది.‘మీ అమ్మను వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడమను’ అన్నాడు. కువైట్ నుంచి తన తల్లిని పిలిపించింది శ్రావ్య. మొన్న డిసెంబర్లో తన వాళ్లను తీసుకొని ప్రవీణ్ వాళ్లింటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడి వచ్చింది శ్రావ్య తల్లి. ఈ పెళ్లి కుదరదని ఓ టీచర్ ద్వారా కబురు పంపించాడు ప్రవీణ్. ఆ మాట విని షాక్ అయింది శ్రావ్య. ఈ కబురు పంపింది ప్రవీణేనా? విస్మయం చెందింది. నమ్మలేకపోయింది. కానీ నిజమే అని... నమ్మక తప్పదని నిరూపించింది ప్రవీణ్ ప్రవర్తన. అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రపంచం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది శ్రావ్యకు. నిద్రమాత్రలు మింగింది. శ్వాస ఆగిపోలేదు. చావు కూడా మోసం చేసిందని బాధపడింది. కానీ ఆడుతున్న ఊపిరి తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించమనే ధైర్యాన్నిచ్చింది ఆమెకు. ‘ప్రేమిస్తున్నానంటే మనసిచ్చా... కానీ నీ ఆస్తిపాస్తులను చూసి నీకు పడిపోలేదు. నన్ను ‘పెళ్లి చేసుకో... నా బతుకు నాకివ్వు’ అంటూ ప్రవీణ్ ఇంటి తలుపు తట్టింది. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు తప్ప భార్యగా స్వీకరించలేదు. లాభం లేదని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. అక్కడా వైద్యపరీక్షలు, శల్యపరీక్షలు అంటూ అవమానమే ఎదురైంది. వారం అయినా ఆ తతంగం ఆగలేదు. ఫేస్బుక్ ప్రేమ చక్రవర్తిపై ఈగ కూడా వాలలేదు. ఇదెక్కడి న్యాయమంటూ మీడియా ముందు మొరపెట్టుకుంది! తనలా మరెవ్వరూ మోసపోకూడదని పోరాటానికి సిద్ధమవుతోంది శ్రావ్య. - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ప్రవీణ్‌ను వదిలేసి నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారు నన్ను మోసం చేయడమే కాకుండా నాపై తిమ్మాపురం పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు కూడా పెట్టించాడు. ఈ విషయం వారం రోజుల క్రితం అతనిపై ఫిర్యాదు చేయడానికి కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్‌కు వెళ్తే తెలిసింది. నాకు అసహ్యం వేసింది. కానీ ఎవ్వరినైతే భర్తగా ఊహించుకొని సర్వస్వం అర్పించానో... ఎప్పటికీ అతనే నా భర్త. నన్ను ఎలా వశపరచుకున్నాడో ఈ 500 ఫేస్బుక్ మెసేజ్‌లు, వాట్సాప్‌లో పంపిన ఫొటోలు చూడండి (అవన్నీ ఒక బౌండ్ చేయించారు). వీటిని చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రవీణ్‌ను వదిలేసి... నన్ను ఇంటరాగేషన్ పేరుతో పోలీసుస్టేషన్‌కు తిప్పుతున్నారు. వారం రోజుల్లో ఏడుసార్లు వెళ్లాను. మళ్లీ రమ్మంటున్నారు (ఈ విషయం చెప్తున్నప్పుడే ఆమెకు సీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది). ఏదిఏమైనా నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాను. - శ్రావ్య మేమంతా అండగా ఉంటాం... ఆమెకు ఎవ్వరూ లేరని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకుంటే పొరపాటు. ఇప్పటికే మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించాం. ఆమెను ప్రవీణ్ పెళ్లిచేసుకోవాలి. తర్వాత కూడా ఆమెకు ఎలాంటి హాని జరగకుండా మేము అండగా నిలబడతాం. ఆమె పోరాటానికి మద్దతు ఇస్తాం. - సరోజ కాకినాడ మాజీ మేయర్ -
రైలు కింద పడి యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎం.ప్రవీణ్ అనే పీజీ విద్యార్థి మంచిర్యాల నుంచి సోమవారం రైలులో జమ్మికుంట రైల్వేస్టేషన్లో దిగాడు. ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మృతి చెందాడు. ఇతడు మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. హన్మకొండలో పీజీ చదువుతున్నాడు. -
అమెరికాలో మృతి చెందిన తిరుపతి విద్యార్థి
ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లాడు అనుమానాస్పద స్థితిలోచనిపోయాడు అక్కడే అంత్యక్రియలు తిరుపతి క్రైం : తిరుపతి నగరానికి చెందిన గల్లా ప్రవీణ్ (23) అనే విద్యార్థి ఇటీవల అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అతని తండ్రి గల్లా నాగేశ్వరరావు గురువారం మీడియాకు తెలిపారు. తిరుపతిలో నివాసముంటున్న నాగేశ్వరరావు కుమారుడు గల్లా ప్రవీణ్ (23) ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పుల్లెర్టన్ నగరంలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒకటో తేదీ వర్సిటీకి బయలుదేరిన ప్రవీణ్ అదృశ్యమయ్యాడు. తీవ్రంగా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. 2వ తేదీ నుంచి గల్లా ప్రవీణ్ అదృశ్యం అయినట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోద యింది. ఈనేపథ్యంలో రెండు రోజుల క్రితం గల్లా ప్రవీణ్ న్యూపోర్టులోని బీచ్‌లో శవమై తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో మృతదేహం గల్లా ప్రవీణ్‌దిగా గుర్తించి సంబంధిత యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే న్యూ జెర్సీలోని నాగేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్‌కు చెందిన సొంత స్థలంలో గల్లా ప్రవీణ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా గల్లా ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ప్రవీణ్‌కు మార్కులు తగ్గడంతో మానసికంగా ఒత్తిడికి గురై ఉండవచ్చని వారి స్నేహితులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన కుమారుడు బాగా చదివేవాడని, అన్నింటిలో చురుగ్గా ఉండేవాడని అన్నారు. మృతికి బలమైన కారణాలు ఏమైఉంటాయో తెలియడం లేదన్నారు. -
పెళ్లి చేసుకున్నాడు.. వెళ్లిపోయాడు
♦ నా భర్తను నాకు అప్పగించండి ♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు వేంపల్లె : ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. అతని తల్లిదండ్రులు పిలవడంతో పని ఉందని వెళ్లాడు.. తిరిగిరాలేదు.. నా భర్తను వారు బంధించారు.. నాకు అప్పగించి న్యాయం చేయాల’ని వేంపల్లె క్రిష్టియన్ కాలనీకి చెందిన చిట్వేలి సుప్రియ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యోగా, శారదల పెద్ద కుమార్తె సుప్రియ అలవలపాడు గ్రామానికి చెందిన చిలకల ప్రవీణ్ ప్రేమించుకున్నారు. జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆయన ప్రియురాలిని వివాహం చేసుకొనేందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. మరోవైపు సుప్రియ తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటానని ప్రవీణ్ ముందుకు రావడంతో ఈ నెల 10న కడప చిన్నచౌకులోని చర్చిలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు ఇంటి నుంచి ప్రవీణ్‌కు ఫోన్ రావడంతో వెళ్లి వస్తానని చెప్పాడు. తిరిగి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలియజేసింది. తల్లిదండ్రులు బంధించి తన వద్దకు రాకుండా చేశారని వాపోయింది. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో మాజీ సీఎం కుమారుడు
-
ప్రవీణ్ ఫోన్ లో పలువురి అభ్యంతకర ఫోటోలు
మలికిపురం: పోలీస్ ఇన్ఫార్మర్గా ఆ శాఖ ఉన్నతాధికారుల అండ చూసుకుని పలు అకృత్యాలకు పాల్పడుతున్న ముప్పర్తి ప్రవీణ్ అనే యువకుడిని తూర్పు గోదావరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి అరెస్టు ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రమేయంతో జరగ్గా.. తెలంగాణకు చెందిన కొందరు పోలీస్ ఉన్నతాధికారుల జోక్యంతో కేసును బలహీనపరిచే యత్నం జరుగుతోందంటున్నారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... మలికిపురం మండలం చింతపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటూ ఇన్ఫార్మర్గా పలు కేసుల్లో కీలక సమాచారం అందించాడు. కొందరు అధికారుల అండ చూసుకుని ఉన్నత వర్గాలకు చెందిన మహిళలను లోబరుచుకున్నాడు. వారిలో ఓ సినీ హీరో కుటుంబ పు మహిళ, మరో యువహీరో తల్లి, పలు ఉన్నత కుటుంబాల మహిళలు ఉన్నారు. వారిని నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించి, తనకు అండగా నిలుస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వాంఛనూ తీర్చమనేవాడు. మలికిపురంలో కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పలు అక్రమాలకు పాల్పడ్డాడు. అతడు తమలోనే ఒకరి బంధువుల అమ్మాయిని లోబరుచుకున్నట్టు గుర్తించిన బృందంలోని వారు దాడి చేశారు. ప్రవీణ్ హైదరాబాద్‌లోని పోలీస్ బాస్ ద్వారా స్థానిక పోలీసులకు ఫోన్ చేయించి తనపై దాడి చేసిన వారిపై చర్యలకు ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు బంధువైన ముప్పర్తి సత్తిరాజుతో గురువారం మలికిపురంలో గొడవ జరిగి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలోనూ తెలంగాణ పోలీస్ బాస్‌లు ప్రవీణ్‌కు అండగా నిలవడంతో సత్తిరాజు హోం మంత్రి రాజప్పకు తెలపగా స్థానిక పోలీసులు ప్రవీణ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుకు పోలీస్ స్టిక్కర్, డైరీలో పోలీసులతో ఉన్న సంబంధాలు,సెల్ ఫోన్లో పలు ఉన్నత కుటుంబాల మహిళల నగ్న చిత్రాలను గుర్తించారు. అయితే పోలీసులు కేవలం సత్తిరాజు ఫిర్యాదు, కారుకు పోలీస్ స్టిక్కర్ ఉండడంపై 420, 341 సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేసి, శనివారం అతన్ని అరెస్టు చేసి అమలాపురం కోర్టుకు తరలించారు. -
ఫేస్బుక్ పరిచయంతో మోసపోయిన యువతి
ప్రేమించిన వ్యక్తి కోసం బీహార్ నుంచి నెల్లూరు రాక మూడు నెలలుగా ఇక్కడే యువతిని వదిలివెళ్లిన యువకుడు నెల్లూరు(క్రైమ్): ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించిన వ్యక్తి కోసం బీహార్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయి మూడు నెలల కిందట నెల్లూరు చేరింది. మూడు నెలలు కలిసి జీవించిన తర్వాత హఠాత్తుగా ప్రేమించిన వ్యక్తి ప్రవీణ్ అదృశ్యమయ్యాడు. నాలుగు రోజుల కిందట ప్రవీణ్ ఆమెకు కన్పించకుండా పోయాడు. దీంతో ఆ యువతి తాను మోసపోయానని తెలుసుకుంది. కుటుంబసభ్యులకు ఒకచోట నుంచి ఫోన్ చేసింది. దీంతో వారు ఆ ఫోన్ వివరాలను బీహార్ పోలీసుల ఆధారంగా తెలుసుకున్నారు. ఆంద్రప్రదేశ్‌లో నెల్లూరు నుంచి ఫోన్ వచ్చిందని తెలుసుకుని హుటాహుటిన కుటుంబసభ్యులు సోమవారం నెల్లూరు చేరారు. జిల్లా ఎస్పీని డాక్టర్ గజరావుభూపాల్ను కలిసి సమస్య విన్నవించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఐదోనగర పోలీసులు మంగళవారం యువతిని గుర్తించి అప్పగించారు. బీహార్ రాష్ట్రం తల్కాసర్కు చెందిన రంజిత్‌సింగ్ కుమార్తె డింప్ల్నకు ఫేస్బుక్లో నెల్లూరుకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ప్రవీణ్‌ను కలిసేందుకు ఆమె నెల్లూరు చేరింది. కమార్తె అదృశ్యంపై ఆమె తండ్రి రంజిత్‌సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అటు బీహార్ పోలీసులు, ఇటు బాధిత కుటుంబసభ్యులు డింపుల్ కోసం తీవ్రంగా గాలించారు. జిల్లా ఎస్పీ యువతి ఆచూకీ కనుగొనాలని నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు ఐదోనగర ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు తన సిబ్బందితో కలిసి ఆటోనగర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం డింపుల్ అయ్యప్పగుడి వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆమెను విచారించగా తాను మోసపోయానని పేర్కొంది. దీంతో బాధిత యువతిని వెంటబెట్టుకొని పోలీసులు ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో డింపుల్‌ను ఆమె కుటంబసభ్యులకు అప్పగించారు. -
చిట్ చాట్ / ప్రవీణ్, హాస్యనటుడు
నవ్వంటే... మహత్తర శక్తి! గోదావరి యాసతో ప్రవీణ్ చేసే ‘కామెడీ’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘నవ్వితే పోయేదేమీ లేదు...మనసులో బాధ తప్ప’ అంటున్న ఈ ‘కొత్త బంగారు లోకం’ (ఇది ప్రవీణ్ తొలిచిత్రం) కురాడ్రు చెప్పే కబుర్లు... దొంగలకు దొంగలు సన్నిహితులవుతారు. తాగుబోతులకు తాగుబోతులు సన్నిహితులవుతారు. అలాగే నవ్వంటే ఇష్టపడే వాళ్లకు, నవ్వించే వాళ్లకు అలాంటి వాళ్లే పరిచయం అవుతారు. మా అంతర్వేదిలో నాకు అలాంటి మిత్ర బృందమే ఉంది. నవ్వడం, నవ్వించడం, నవ్వులను పంచుకోవడం మా పని. నేను హాస్య పాత్రలు పోషించడానికి మూలాలు అక్కడ ఉన్నాయన్నమాట! దర్శకుడిగానే కాదు.. రచయితగా కూడా జంధ్యాల అంటే తెగ ఇష్టం నాకు. ఈవీవీ సినిమాలు కూడా చాలా ఇష్టపడతాను. కామెడీ సినిమా అంటే సినిమా చూస్తున్న ఆ సమయానికి, ఆ రోజు వరకు మాత్రమే నవ్విస్తే సరిపోదు. సంవత్సరాలైనా సరే ఆ సినిమాలోని దృశ్యాలు మన పెదాలపై నవ్వులై మెరవాలి. ఆ స్థాయిలో సినిమాలు తీయగల శక్తి జంధ్యాల, ఈవీవీలకు ఉంది. నాకు బాగా నచ్చిన సినిమా ఈవీవి ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ సినిమాను ఆ ఒక్కసారి చూస్తే మాత్రమే సరిపోదు. చూస్తున్నకొద్దీ... మన నవ్వులు రెట్టింపు అవుతూనే ఉంటాయి. కమెడియన్లు అందరూ ఇష్టమే. ఆనాటి తరంలో రమణారెడ్డి మొదలు ఈనాటి బ్రహ్మానందం, సునీల్ వరకు అందరి హాస్యాన్ని ఇష్టపడతాను. నవ్వే కదా అని నవ్వును తేలిగ్గా తీసుకోవద్దు. దానికి మహత్తరమైన శక్తి ఉంది. ఆ శక్తితో ఒత్తిడి నుంచి బయట పడొచ్చు, కొత్త శక్తితో ఉత్తేజితం కావచ్చు. -
అనుమానంతోనే హతమార్చాడు
భార్య, కుమారుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్ నాలుగు రోజుల్లోనే మిస్టరీ చేధించిన పోలీసులు పరకాల : పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో ఈ నెల 9న జరిగిన తల్లి, కుమారుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని ఆమెతోపాటు కుమారుడిని హతమార్చిన వ్యక్తిని వారు గురువారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ పుల్లా సంజీవరావు నిందితుల వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన కుంటల ప్రవీణ్‌కు మొదట నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఏ పని చేయకుండా జల్సాలకు అలవాటుపడి భార్యతో గొడవ పడడంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. తర్వాత అతడికి పరకాల పట్టణంలోని బలిజవాడకు చెందిన మంజులతో 2008 ఆగస్టు 24న వివాహమైంది. వారికి 8 నెలల క్రితం బాబు సాయి చరణ్ జన్మించాడు. వారు పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ హన్మకొండలోని భవా నీ పుట్వేర్ షాపులో చెప్పుల డిజైన్ పనిచేస్తూ రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడు. 6 నెలలు మంచిగానే ఉన్న ప్రవీణ్ తర్వాత మంజులపై అనుమానం పెంచుకుని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడి మంజులను వేధించడంతో 2012లో హన్మకొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో అతడు పోలీసులకు దొరకకుండా కేరళకు పారిపోయాడు. కేరళలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొంతకాలం జైలు జీవితం అనుభవించాక ప్రవీణ్ తన భార్యను ఒప్పించుకుని కేసు కొట్టివేయించుకుని మళ్లీ కాపురం చేయసాగాడు. ఈ క్రమంలో మళ్లీ అనుమానంతో మంజులను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. భార్యపై అనుమానంతో సాయిచరణ్ తనకు పుట్టలేదని, వారిని చంపాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న హన్మకొండకు వెళదామని ప్రవీణ్ చెప్పడంతో మంజుల నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమె తలపై గొడ్డలితో దాడి చేయగా కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. అతిదారుణంగా సాయిచరణ్ హత్య సాయిచరణ్ కింద ఉండి ఏడుస్తుండగా బెడ్‌పై వేసి కరెంట్ మోటార్‌కు వేసే ప్లాస్టర్‌ను బాబు ముక్కుకు, నోటికి వేసి రెండు దిండులను పెట్టి బెడ్‌షీట్ కప్పి అతిదారుణంగా హత్య చేశాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి తానే మొదట పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల్లి చంద్రగిరి లక్ష్మీ ఫిర్యాదు, డాగ్‌స్క్వాడ్‌తో చేసిన సోదాల కారణంగా ప్రవీణ్‌ను విచారించగా మంజుల, సాయి చరణ్‌ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. పోలీసులను తప్పుదోవపట్టించబోయినప్పటికీ పోలీసులు కేసు చేధించా రు. సీఐ బి. మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
భార్యపై అసత్య ప్రచారం, సాప్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
హైదరాబాద్ : తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న ఓ శాడిస్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం... సైదాబాద్‌కు చెందిన ఎస్.ప్రవీణ్ (47) సాప్ట్వేర్ ఇంజినీర్. అతని భార్య (45), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతా అమెరికాలో స్థిరపడ్డారు. రెండేళ్లుగా విభేదాలు తలెత్తడంతో భార్యపిల్లల నుంచి ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా... భార్యపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ బెదిరిస్తూ ఈ-మెయిల్ పంపడంతో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు, కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్లు, మెయిల్స్ పంపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. -
విఐపి రిపోర్టర్ - గ్రేటర్ విశాఖ కమీషనర్ ప్రవీణ్
-
స్వచ్ఛ విశాఖే లక్ష్యం
రోజూ నగరంలో పర్యటిస్తున్నా నేడు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కొత్తగా ఉంది. దీని వల్ల ప్రజలకు మరిం త సన్నిహితమవడం ఆనందంగా ఉంది. స్వచ్ఛ విశాఖే మనందరి ధ్యే యం కావాలి. అందుకోసం పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నగరంలో పెద్ద ఎత్తున టాయిలెట్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొం దిస్తు న్నాం. నగరం అంతా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకు ప్రజల సహకారం కావా లి. అధికారులు, ప్రజలు కలసి పనిచేస్తే విశాఖను మరింత సుందరనగరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగలం. అందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.’ కమిషనర్ ప్రవీణ్: ఏమ్మా ఇక్కడ ఎవరికీ టాయిలెట్లు లేనట్టున్నాయి. ఎక్కడికి పోతున్నారు మీరంతా..! శారద: సార్.. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టాయిలెట్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. ఇళ్లలో అంత చోటూ లేదు. మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌కు వెళ్తే అక్కడ నీరుండదు. మోటార్ పని చేయదంటారు. రెండు నెలలుగా మోటారు పనిచేయడం లేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నాం. మా ఆడోళ్ల బాధలు చెప్పుకుంటే సిగ్గేస్తాదండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు మీదకే పోతున్నాం. నేవీ ఉద్యోగులు ఒప్పుకోరని వారికంట పడకుండా అర్ధరాత్రి, వారు లేని వేళల్లో వెళ్లాల్సిన పరిస్థితి.. (కమిషనర్ వెంటనే అక్కడే వున్న జోనల్ కమిషనర్ నాగ నర్సింహారావు, చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్‌లను పిలిచారు.) కమిషనర్: మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌లో మోటారు పనిచేయడం లేదా? రెండు నెలలుగా పనిచేయకుండా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? జోనల్ కమిషనర్: మోటారు కోసం ప్రపోజల్ పెట్టాం సర్. ఇంకా శాంక్షన్ ఆర్డర్స్ రాలేదు. కమిషనర్: నేను ఇప్పుడు ఆ సులాభ్ కాంప్లెక్స్ పరిశీలిస్తాను. మోటారు కోసం వెంటనే రూ. 2 లక్షలు శాంక్షన్ చేస్తున్నా. వెంటనే కొత్త మోటారు వేయించండి. అనంతరం కమిషనర్ ప్రవీణ్ ఆ సమీపంలోని పేదల ఇళ్లలోకి వెళ్లారు. ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్న జి.మాధవిని పలకరించారు. కమిషనర్: ఏమ్మా.. ఎలా ఉన్నారు.. మీకు మరుగుదొ డ్డి ఉందా? మాధవి: లేదండి. కమిషనర్: లేకపోవడం ఏంటమ్మా.. మ రి కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకుంటున్నారు? మాధవి: అలా రోడ్డు పక్కకు వెళ్లాల్సి వస్తోందండి (ఒకింత ఇబ్బంది పడుతూ) కమిషనర్: డబ్బులిస్తాం కట్టుకుంటారా? మాధవి: మాకు ఇల్లే లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇక మరుగుదొడ్డి ఎక్కడ కట్టుకోవాలండీ? (ఇంటి యజమాని సత్యనారాయణని పిలిచి మాట్లాడుతూ..) కమిషనర్: మీకు కార్పొరేషన్ తరపున డబ్బులిస్తాం. మరుగుదొడ్డి కట్టించండి. ఇంటి యజమాని:అలాగే సార్. అనంతరం కమిషనర్ మహిళా సంఘాల ప్రతినిధులను పలకరించారు. కమిషనర్: అంగన్వాడీ కేంద్రం ఉందా..! మహిళలు: ఉందండి. కమిషనర్: పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా.. మహిళలు: ఆ! పెడుతున్నారండి. కమిషనర్: స్కూల్ ఉందా..పిల్లలందర్నీ చదివిస్తున్నారా.. మహిళలు: ఎలిమెంటరీ బడి మాత్రమే వుందండి. 6వ తరగతి దాటితే కంచరపాలెమో, మర్రిపాలెమో పోవాలి సర్.. కమిషనర్: ఆస్పత్రి వుందా..! మహిళలు: లేదండి..కేజీహెచ్‌కే పోతున్నాం. అక్కడి నుంచి మరో రెండడుగులు వేశారు. అక్కడున్న వృద్ధులు పోలాకి గిరి, ఉడుంబిల్లి పోతురాజులను పలకరించారు. కమిషనర్: ఏమండీ బాగున్నారా... పోలాకి గిరి: బాబూ పింఛన్ ఆపేశారు.. కమిషనర్: ఎప్పుడు... పోలాకి గిరి: ఈ నెలే.. కమిషనర్: ఈ నెల నుంచి పోస్టాఫీసుకు మార్చడం వల్ల చిన్న సమస్య ఏర్పడింది. వచ్చే నెల నుంచి ఆ సమస్య ఉండదు. అందరికీ సమాయానికి పింఛన్ వచ్చేస్తుంది. ఉడుంబిల్లి పోతురాజు: పోస్టాఫీస్ చుట్టూ తిరగడానికి రోజుకి వందవుతోంది. ఎలా సర్..ఎన్ని రోజులు తిరగాలి.. కమిషనర్ యూసీడీ అధికారులను పిలచి అన్ని పోస్టాఫీస్‌లకు సిబ్బందిని పంపించి సమస్య రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. మార్గమధ్యంలో ఓ దుకాణం వ్యక్తితో కమిషనర్ మాట్లాడుతూ పాన్‌పరాగ్, ఖైనీలు అమ్ముతున్నావా.. అనడిగారు. లేదనడంతో ఇరుకు రోడ్డు గుండా రోడ్డుపైనే పుల్లలతో వంటలు చేస్తున్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కనిపించారు. వారితో సంభాషిస్తూ.. కమిషనర్: ఏమండీ మీ పేరు..! పారిశుద్ధ్య కార్మికులు: పల్లా నాగయమ్మ...బొమ్మ రమణండీ..! కమిషనర్: ఎన్ని గంటలకు డ్యూటీకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు: పొద్దున్నే అయిదో గంటకే వచ్చేస్తామండి.. కమిషనర్: జీతమెంత ఇస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులు: ఆరు వేలండి.. కానీ సరిగా ఇవ్వడం లేదు. గత రెండు నెలలది మొన్న ఇచ్చారు. ఈ నెలది ఇంకా రాలేదండి. ఇలా అయితే మా బోటోళ్లం ఎలా బతకాలి సారూ.. కమిషనర్ వెంటనే అక్కడే ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.రాజు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా.మురళీమోహన్ను అడిగారు. ఇంకా జీతాలు చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ నెల కొంత ఆలస్యమైందని వారిద్దరూ చెప్పారు. రికార్డుల పరిశీలన, ఇతరత్రా పనుల వల్ల ఆలస్యమైం దన్నారు. ఇక నుంచి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి 7వ తేదీ లోగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఇంతలోనే పారిశుధ్య కార్మికులు నాగాయమ్మ, రమణలు కమిషనర్‌తో మాట్లాడుతూ... నాగాయమ్మ, రమణ: మాకు గ్లౌజులు ఇవ్వలేదు సార్. ఆరు నెలలుగా వట్టి చేతులతోనే చెత్త చెదారం ఎత్తాల్సి వస్తోంది. చేతుల్లో గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. కొత్తవి ఇప్పించండి సారూ. కమిషనర్: గ్లౌజులు ఇస్తున్నారు కదా.. అంటూ జోనల్ కమిషనర్ వైపు చూశారు. మొన్ననే ఇచ్చామండీ అంటూ ఆయన సమాధానం ఇస్తుండగానే.. మరో అధికారి కల్పించుకుని రెండు మూడు మాసాలై వుంటుందండీ అని చెప్పారు. బొమ్మా రమణ: అబ్బే ఆర్నెల్లు అయ్యిందండి.. జోనల్ కమిషనర్: మరి అంతే.. అస్తమానూ ఎక్కడ నుంచి తెచ్చిస్తాం.. దాన్నే జాగ్రత్తగా దాచుకోవాలి. బొమ్మా రమణ: ఏంటండీ ఆర్నెల్లు దాచుకోవాలా.. రోజూ ఉతికి ఆరేసుకుంటుంటే ఆర్నెల్లు మన్నుతుందా? కమిషనర్ అందరికీ ప్రొక్యూర్చేసి ఇవ్వాలని సూచించారు. ఇలా సాక్షి రిపోర్టర్ అవతారమెత్తిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆశవానిపాలెంలో విసృ్తతంగా పర్యటించారు. ప్రతి వీధిని కలియదిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరిం చగలిగే వాటిపై అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలపై నివేదిక సమర్పించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజ ల్లో అవగాహన కల్పించారు. ప్రజల ఫిర్యాదు మేరకు సులాభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వెంటనే రూ.2 లక్షలతో మోటారు మంజూరు చేశారు. ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
హిందువుల జనాభా పెంచండి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సామ్రాజ్యంలా విస్తరించాలని పిలుపు నలుగురు భార్యల విధానం తొలగిపోవాలి ఘనంగా భాగ్యనగర్ హిందూశక్తి సంగమం సాక్షి, హైదరాబాద్: హిందూ మతానికి చెందిన ఏ ఒక్కరూ మత మార్పిడి ప్రభావానికి లోనుకావద్దని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. దేశంలో నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ పాత రోజులు రావాలని, దేశంలో వంద శాతం హిందువులు ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా హిందువుల్లో కలవాలనుకుంటే వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని, వారిని తమలో కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వర్ణజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం భాగ్యనగర్ హిందూశక్తి సంగమం పేరుతో నిర్వహించిన హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనన్నారు. కశ్మీర్లో ఉన్న నాలుగు లక్షల మంది హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే అందరూ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఈ భూమి మీద గోవధ జరగనప్పుడే హిందువులకు నిజమైన సంబరాలని అన్నారు. హిందువుల సంఖ్య తగ్గితే భవిష్యత్‌లో మందిరాలు ఉండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతంగా ఉన్న హిందువులు 8 శాతానికి తగ్గిపోయారని, పాకిస్తాన్లో పది శాతం ఉన్నవారు ఒక శాతానికి పడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఒకప్పుడు నూరు శాతం ఉన్న హిందూ జనాభా రోజు రోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నలుగురు భార్యల సంస్కృతి తొలగిపోవాలన్నారు. భారత్‌లో తగ్గిపోతున్న హిందూ జనాభాను పెంచుకోవాలని సూచించారు. ఏ ఒక్క హిందువు కూడా విద్యా, వైద్య సౌకర్యాలు లేకుండా ఉండకూడదన్నారు. ఆకలితో అలమటించకూడదని అన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అవసరమైన హిందువులు 1860 2333 666 నంబర్లో సంప్రదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి 30 కోట్ల రూపాయలు కేటాయించి, తెలుగు అకాడమీకి 30 లక్షల రూపాయలను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ముస్లింలను హజ్‌కు, క్రైస్తవులను జెరూసలెంకు పంపుతున్న ప్రభుత్వాలు హిందువులను ఏ ఒక్కరినైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హిందువుల కోసం ఆలోచించే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ మన దేశంలో ఏ వారసత్వానికైనా, ఏ సంప్రదాయానికైనా వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. 2300 సంవత్సరాల క్రితం మేకల కాపరి రాజ్యాన్ని పరిపాలిస్తే, నేడు చాయ్‌వాలా దేశాన్ని పరిపాలిస్తున్నాడని పేర్కొన్నారు. భగవంతుడికి జన్మనిచ్చింది హిందువేనన్నారు. యుగాలు తరాలు మారినా ధర్మం మారదన్నారు. అలాంటి ధర్మమే హిందూ ధర్మమని కొనియాడారు. హిందూ ధర్మంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, మంత్రాలయం మఠాధిపతి సుభుదేంద్ర తీర్థస్వామి, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషిజీ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కేశవరాజు, స్వర్ణ జయంతి మహోత్సవ సమితి ప్రాంత అధ్యక్షులు త్రిపురనేని హనుమాన్ చౌదరి, భాగ్యనగర్ అధ్యక్షుడు నంగునూరి చంద్రశేఖర్లతో పాటు అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు. -
నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాం
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా శుక్రవారం నంద్యాల, కర్నూలులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజుకోసారి పిడికెడు బియ్యం, ఒక రూపాయిని సహాయంగా అందజేస్తే నిరుపేదలైన హిందువుల ఆకలి తీర్చవచ్చునని, విద్య, వైద్య, ఉపాధి సదుపాయాలను కల్పించి ఆదుకోవచ్చునని ఆయన పిలుపునిచ్చారు. నంద్యాలటౌన్/కర్నూలు (న్యూసిటీ): రోజుకోసారి పిడికెడు బియ్యం, ఒక రూపాయిని సహాయంగా అందజేస్తే నిరుపేదలైన హిందువుల ఆకలి తీర్చవచ్చునని, విద్య, వైద్య, ఉపాధి సదుపాయాలను కల్పించి ఆదుకోవచ్చునని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌తొగాడియా పిలుపునిచ్చారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. శతాబ్దాల క్రితం హిందువులు విశ్వ వ్యాప్తంగా ఉండేవారని, అప్పట్లోనే సంస్కృతి, సాంప్రదాయాలు ఉండేవన్నారు. క్రమేపీ హిందువుల ప్రాబల్యం తగ్గి కేవలం భారతదేశానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం భారతదేశ యువకులు విద్యాభ్యాసానికి అమెరికాకు వెళ్తున్నారని, కాని అప్పట్లో అమెరికా వారే భారతదేశానికి వచ్చి విద్యాభ్యాసం చేసే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలకు అమెరికా కేంద్రంగా ఉందని, అప్పట్లో భారతదేశంలోని హస్తినాపురం ఉండేదన్నారు. చైతన్యం, ఐకమత్యం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందకోట్ల మంది హిందువులను రక్షించడమే లక్ష్యంగా వీహెచ్‌పీ పని చేస్తుందని ఆయన చెప్పారు. వీహెచ్‌పీ 53 వేల గ్రామాలను దత్తత తీసుకుందని, 20 లక్షల మందికి ఫీజులు లేకుండా విద్యాభ్యాసాన్ని అందజేస్తుందని చెప్పారు. ఏ హిందువైనా హెల్ప్‌లైన్ నం. 108602333666 ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా.. తక్షణం సహాయాలను పొందవచ్చునన్నారు. ఆయా ప్రాంతంలోని వీహెచ్‌పీ కార్యకర్తలు, నేతలు అందుబాటులోకి వచ్చి సహాయాన్ని అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు వైఎన్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, పట్టణ గౌరవాధ్యక్షులు బాచం నాగేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి సురేంద్రారెడ్డి, స్వర్ణజయంతి కమిటీ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, ప్రాంతీయ సంఘటన కార్యదర్శి ఆకారపు రామరాజు, మున్సిపల్ చైర్మన్ సులోచన, సాధువులు అచల పరిపూర్ణానందస్వాములు, రంగనాథస్వామి, మౌనిస్వామి, శివానందస్వామి, మధుబాబు గురుభవాని, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని పాటిద్దాం కర్నూలు(న్యూసిటీ): హిందూ ధర్మాన్ని పాటిస్తే పాపాలు తొలగుతాయని విశ్వహిందూ పరిషత్తు అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరంలోని టీజె కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తమ పరిపాలన పద్ధతిని మార్చుకోవాలన్నారు. పేద విద్యార్థులు చదువుకోడానికి సాయం చేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువుల జెండాతో నిండిపోవాలని పేర్కొన్నారు. ముందుగా డాక్టర్ ప్రవీణ్‌బాయి తొగాడియాకు విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, మంత్రాలయం సంస్కృత విద్యాపీఠం ప్రిన్సిపల్ వాదిరాజ ఆచార్ శాలువలతో సన్మానించారు. సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రాణేష్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.కిష్టన్న, ప్రాంత సంఘటన ప్రఖండ్ ఆకారం కేశవరాజు, రాయలసీమ కన్వీనర్ బాలసుబ్రమణ్యం, ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు జిఎస్.నాగరాజు అనేకమంది పాల్గొన్నారు. -
ఇద్దరు యువకుల జల సమాధి
చందర్లపాడు : ఇంటికి కూత వేటుదూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులతో కలసి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకుల ప్రాణాలను మృత్యువు కబళించింది. దీంతో ఇద్దరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కాసరబాదలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. గ్రామానికి చెందిన వాసిరెడ్డి వెంకట కమల ప్రవీణ్(18), అరవపల్లి ఫణిశేఖర్(32) ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో నివశిస్తుంటారు. ప్రవీణ్ గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫణిశేఖర్ ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండుగను చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానదిలోకి మిత్రులైన గోకర ్లయోగానందం, ఉదయ్‌తో కలసి స్నానానికి వెళ్లారు. వీరితో పాటు ప్రవీణ్ తమ్ముడు కార్తీక్ ఉన్నాడు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవీణ్ లోతుగా ఉండే ప్రదేశంలోకి వెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న అతడిని కాపాడేందుకు ఫణిశేఖర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మరణంచాడు. దీనిని గమనించిన కార్తీక్ ఒడ్డుకు వచ్చి తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి హుటాహుటిన వచ్చారు. జాలర్ల సాయంతో గాలించి, ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శర్మ, ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ తరలించారు. కాయకష్టంతో పిల్లలను చదివించారు.. చంద్రశేఖర్, సుభద్ర దంపతులకు ప్రవీణ్, కార్తీక్ సంతానం. చంద్రశేఖర్ తనకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ, ప్రైవేటు పాల డెయిరీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. సుభద్ర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సీతారామయ్య, శ్రీలక్ష్మి దంపతులకు ఫణీంద్ర, సంకీర్తన సంతానం. సీతారామయ్యకు 1.50 సెంట్ల భూమి ఉంది. తమ పొలాన్ని సాగుచేసుకుంటూనే సీతారామయ్య దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించారు. ఫణిశేఖర్‌ను ఎంసీఏ వరకు చదివించారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఫణిశేఖర్‌కు ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటులో టాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబసభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలు కూడా రాశాడు. ఇద్దరి మరణంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
ఈసారి తెలంగాణ యాసతో...
సంభాషణం: బయట ఎవరైనా గుర్తుపట్టి పలకరిస్తే ఏమనిపిస్తుంది? ఏ నటుడికైనా తననందరూ గుర్తు పడుతుంటే సంతోషమేస్తుంది. నాకూ అంతే. కానీ ఈ అభిమానానికి ఒక్కోసారి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఓసారి భీమవరం వెళ్తుంటే సునీల్‌కి యాక్సిడెంట్ అయ్యింది. విరిగిపోయిన చేతిని మరో చేత్తో పట్టుకుని, రక్తం కారుతూ ఉన్న తన దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ‘ఆటోగ్రాఫ్ ఇస్తారా’ అని అడిగాడట. సునీల్ చెబుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. ఏదేమైనా ప్రేక్షకుల ఆదరణే మాలాంటి నటులకు బలం ప్రాణం. నవ్వినంత తేలికగా ఎదుటివాడిని నవ్వించలేం. దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు మెండుగా ఉన్నవాడు ప్రవీణ్. గోదావరి యాసతో డైలాగులు పలుకుతూ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే ఈ యువ హాస్యనటుడి సినీ ప్రయాణం అనుకోకుండా మొదలైంది. ఆనందంగా సాగిపోతోంది. దాని గురించి ప్రవీణ్ చెబుతోన్న కబుర్లు... అందరూ ఏదో అవ్వబోయి నటుడయ్యానంటారు. మరి మీరు...? నేను ఏమవ్వబోయానో తెలియదు కానీ... న టన అంటే మాత్రం పిచ్చి నాకు. కానీ నా మనసులోని మాటను ఎప్పుడూ ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పేవాణ్ని కాదు. ఎందుకని? మాది సాధారణ రైతు కుటుంబం. ఇంటికి పెద్ద కొడుకుని. నాన్న లేరు. అమ్మని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అలాంటప్పుడు సినిమాలు, నటన అంటే కంగారు పడతారు కదా! అందుకని చెప్పలేదు. (నవ్వుతూ) అందరిలాగా మద్రాస్ రెలైక్కేద్దామంటే ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. అందుకే డిగ్రీ అయ్యాక బస్సెక్కి హైదరాబాద్ వచ్చేశాను. ఓ చిన్న ఉద్యోగంలో చేరి, ఎం.కాం. కరెస్పాండెన్స్ కోర్సు చేస్తూ ప్రయత్నాలు మొదలెట్టాను. ఒక్కటీ ఫలించలేదు. ఇక వర్కవుటవ్వదని తిరుగు టపా కట్టాను. వెళ్లిపోయినవారు మళ్లీ ఎందుకొచ్చారు? నేను రాలేదు... దిల్ రాజు తీసుకొచ్చారు. మాది అంతర్వేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా ప్రత్యక్షమైపోయేవాడిని. ‘ఒక ఊరిలో’ షూటింగు చూడ్డానికి వెళ్లినప్పుడు సునీల్ తో పరిచయమయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘కాంచనమాల కేబుల్ టీవీ’ షూటింగు కోసం వచ్చినప్పుడు తనతో స్నేహం ఏర్పడింది. అప్పట్నుంచీ ఎప్పుడు షూటింగుకొచ్చినా నన్ను పిలిచేవాడు. ‘పరుగు’ షూటింగ్ చూడ్డానికి వెళ్లినప్పుడు నన్ను చూసిన దిల్‌రాజు... ‘బంగారులోకం సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంది చేస్తావా’ అని అడిగారు. ‘కచ్చితంగా చేస్తాడు, వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం’ అన్నాడు సునీల్. అలా నటుడినైపోయాను. డెబ్భై సినిమాల వరకూ చేశారు కదా... మీకు బాగా నచ్చినదేంటి? ‘కొత్త బంగారులోకం’ తర్వాత నాకు అంతగా పేరు తెచ్చింది ‘ప్రేమకథా చిత్రమ్’. ిసినిమాలోని ప్రతి మలుపుకీ కారణమవుతాను. ఓ కమెడియన్‌కి అలాంటి పాత్ర దొరకడం అరుదు, అదృష్టం కూడాను. ‘మిరపకాయ్’లో రోల్ కూడా ఇష్టం నాకు. కమెడియన్లంతా హీరోలవుతున్నారు కదా... మీరు కూడా? హీరో అవ్వాలని లేదు. ఒకవేళ అవకాశమొస్తే రాజేంద్రప్రసాద్గారిలా సినిమా అంతా నవ్వించే పాత్ర అయితే చేస్తాను. ఎందుకు... మీ ఫ్రెండ్ సునీల్ అయ్యారుగా హీరో? అది వేరు. కొందరే అలా అవ్వగలరు. సునీల్ పడిన కష్టమేంటో నాకు తెలుసు. కష్టపడి సిక్స్ ప్యాక్ పెంచాడు. దానికి తోడు అద్భుతం గా డ్యాన్సు, ఫైట్లు చేయగలడు కాబట్టి హీరోగా రాణిస్తున్నాడు. తను మీకు సలహాలు ఇస్తుంటారా? పనిగట్టుకుని ఇవ్వడు. ఏదైనా అడిగితే చెబుతాడు. మొదట్లో మాత్రం ఓ సినిమా చూసి పిలిచాడు. ‘ఓ సీన్లో బాడీని ఫ్రీగా వదిలేశావ్, నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు కనిపించావ్, ఇంకెప్పుడూ అలా చేయకు, దృష్టి పని మీదే ఉండాలి’ అంటూ క్లాస్ పీకాడు. మీ రోల్ మోడల్ ఎవరు? రమణారెడ్డి గారంటే చాలా ఇష్టం. సన్నగా, పీలగా ఉండే ఆయన తన బాడీ లాంగ్వేజీతోనే సూపర్బ్ కామెడీని సృష్టించారు. రేలంగి, నగేశ్, బ్రహ్మానందంగారు... అందరూ నాకు రోల్ మోడళ్లే. అయితే అసలు నటన అంటే పిచ్చి ఏర్పడ్డానికి మాత్రం చిరంజీవిగారే కారణం. ఆయన 150వ సినిమాలో అవకాశం దొరికితే బాగుణ్నని ఆశపడుతున్నాను. ఎన్టీఆర్ (సీనియర్) అంటే కూడా ఎంతో గౌరవం నాకు. ఓ పక్క డెరైక్షన్ చేస్తూనే ‘దానవీరశూరకర్ణ’లో ఆరు పాత్రలను పోషించడం మాటలు కాదు. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ఓ నెగిటివ్ రోల్ చేస్తే బాగుణ్ననిపిస్తూ ఉంటుంది. అలాగే నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతానని రవితేజ, హరీశ్ శంకర్ అంటూ ఉంటారు. ఆ యాస మాట్లాడే రోల్ చేయాలి. హరీశ్ ఆ చాన్స్ ఇస్తానన్నారు. వెయిట్ చేస్తున్నాను. అప్పుడు మీ ఇంట్లో వాళ్లు కంగారు పడతారన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఆనందపడుతున్నారు. ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఎవ్వరైనా అనుమానపడతారు. అదే నిరూపించుకుని వెళ్లి వాళ్లముందు నిలబడితే సంతోషపడతారు. అందుకే నేనలా చేశాను. ఇప్పుడు వాళ్లూ హ్యాపీ, నేనూ హ్యాపీ! - సమీర నేలపూడి -
ప్రేమిస్తే పోయే.. కాలం మూవీ స్టిల్స్
-
ప్రాణం తీసిన సరదా
పుల్కల్: ఆటో నడపాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణం తీయగా, మరో ఇద్దరిని గాయాలుపాలు చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేట చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం...పుల్కల్ మండలంలోని సింగూర్ గురుకుల పాఠశాలలో 9వ చదువుతున్న ప్రవీణ్‌ను చూసేందుకు ఆదివారం అతని తల్లిదండ్రులు ఆటోలో వచ్చారు. ఆటోను గురుకుల పాఠశాల ఆవరణలో నిలిపి ప్రవీణ్‌తో మాట్లాడుతుండగా, ప్రవీణ్‌తో పాటు గురుకుల పాఠశాలలో చదువుతున్న రాయికోడ్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్(14), సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన ఉదయ్, అందోల్ గ్రామానికి చెందిన రవిలు ఆటో నడపాలన్న సరదాతో తన స్నేహితుని తల్లిదండ్రులు తెచ్చిన ఆటోను తీసుకువెళ్లారు. అయితే ముద్దాయిపేట చౌరస్తా వద్ద ఆ ఆటో ఓ చెట్టుకు గుద్దుకుని బోల్తా పడింది. ఈ ఘటనలో సుదర్శన్ తీవ్రంగా గాయపడగా, ఉదయ్, రవిలు స్వల్పంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు విద్యార్థులను అదే ఆటోలో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సుదర్శన్ మృతి చెందాడు. దీంతో వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం సుదర్శన్ మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ లోకేష్‌ను వివరణ కోరగా, రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. -
క్షణక్షణం..భయం గుప్పిట్లో..
ఇరాక్‌లో ఏవో గొడవలు జరుగుతున్నయట.. ఇది తెలిసినప్పటి నుంచి పాణంల పాణముంటలేదు బిడ్డా.. నువ్వెంబడే రా బిడ్డా.. నీ బాంచెన్.. ఓ తల్లి ఆవేదన.బతికుంటే ఏదైనా చేస్కొని బతకొచ్చు.. నువ్వుంటే మాకు గదే సాలు.. నువ్వు రాయే... భార్య దీనరోదన.నాన్న మాకు భయమైతంది. నీకు ఏమో అయితదట కద. మాకు ఏడు పొస్తుంది. తొందరగా రా నాన్నా... పిల్లల మారాం ఇది. అన్నా ఆ పని, పైసలు లేకుంటే మాయె. నువ్వు మా కాడుంటె ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యంతో బతుకుతం... నువ్వెంబడే రావాలన్నా.. ఓ తమ్ముడు, చెల్లీ వేడుకోలు. ఇరాక్‌లో తలెత్తిన అంతర్యుద్ధం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, జన్నారం ప్రాంతానికి చెందిన పలువురు యువకులు అక్కడికి జీవనోపాధికి వెళ్లారు. ప్రస్తుతం ఇరాక్‌లో తీవ్రవాదులకు, అక్కడ ప్రభుత్వం భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న సంగ్రామం నేపథ్యంలో ఇక్కడున్న జిల్లావారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులదీ అదే దుస్థితి. రాజీనామా చేసినా అంతే ఖానాపూర్ : ఇక్కడి కంపెనీలకు చెందిన పనులు చివరి వరకు చేరడంతో పూర్తిస్థాయిలో పనిచేయించుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇండియాకు పంపడం లేదు. ఎవరైనా పోతామన్నా.. వారికి ఫినిష్ ఇచ్చినా.. వేతనం నుంచి టికెట్ డబ్బులు కట్ చేస్తామని మా కంపెనీ ప్రకటించింది. మా సమస్యను ఇండియన్ ఎంబసీలు టోల్ఫ్రీలకు తెలియజేసినా స్పందన లేదు. మేం 60 మందిమి రాజీనామా చేసినా కంపెనీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. - కతులాపురం ప్రవీణ్, ఖానాపూర్ కాలయాపన చేస్తున్నారు ఖానాపూర్ : ప్రమాదం పొంచి ఉన్నందున మమ్మల్ని ఇండియాకు పంపమని కంపెనీని అడిగితే ప్రస్తుతానికి మేముంటున్న ప్రాంతానికి ఎటువంటి ప్రమాదం లేదని నోటీసు మా కంపెనీ ప్రాంతంలో అతికించారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. వెంటనే మమ్మల్ని పంపకుంటే మాకు ఏమవుతుందోనని మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. - బొమ్మెన మధుకర్, రేవోజిపేట, కడెం క్షేమంగా రప్పించాలె దండేపల్లి : మా తమ్ముడు శంకర్ ఇరాక్ వెళ్లి మూడు నెలలైంది. అక్కడేమో బాంబు లేసుకుంటున్నారని తెలవడంతో అప్పటి నుంచి మాకు చాలా భయంగా ఉంది. ఇటీవల ఫోన్ చేసిండు మాట్లాడిండు. అక్కడ లొల్లులైతన్నయట నువ్వు తొందరగా వచ్చేయ్ అని చెప్పిన. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మాలాంటోళ్ల బాధను జర అర్థం చేసుకోవాలె. - గంధం రాయలింగు, దండేపల్లి ఎలాగైనా రప్పించండి జన్నారం : మాది జన్నారం మండలం రోటిగూడ. నేను ఇరాక్ పోయి 8 నెలలు అవుతోంది. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతోంది. యాజమాన్యం కంపెనీ మూసుకుని వెళ్లింది. నెల జీతం ఇయ్యలేదు. భయంతో ఇంటికి వెళ్తామంటే వెళ్లనీయడం లేదు. వెయ్యి డాలర్లు ఇస్తే పంపిస్తామని అంటున్నారు. భయటకు వెళ్తే చంపివేస్తామని బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది. మమ్ములను ఎలాగైనా ఇంటికి వచ్చేలా చేయండి. - నాడెం నాగరాజు -
చీకట్లో కనుమరుగై.. చివరికి అమ్మ ఒడికి
అనకాపల్లిలో అదృశ్యమైన పసిపాప రాజమండ్రిలో యాచకుల వద్ద ప్రత్యక్షం పోలీసులకు అప్పగించిన మహిళలు టీవీ స్క్రోలింగ్‌తో చివరికి కథ సుఖాంతం నవమాసాలు మోసి కన్నబిడ్డ.. ఈదురుగాలికి తెగిపడి, ఎటో కొట్టుకుపోయిన చిగురాకులా అదృశ్యం కాగా- ఆ తల్లిమనసు రంపపుకోతను అనుభవించింది. ‘మమ్మీడాడీ’ అన్న మాటలు తప్ప తన పేరు కూడా చెప్పలేని ఆ చిన్నారి.. చిమ్మచీకట్లో అమ్మానాన్నలకు దూరమై.. ఎన్నడూ ఎరగని చోటికి చేరుకుని.. గూటిని వీడిన పక్షికూనలా బెంగటిల్లింది. అయితే.. విధి వశాత్తు కథ సుఖాంతమైంది. ఆ తల్లి దుఃఖాశ్రువులు ఆనందబాష్పాలుగా మారాయి. ఆ బిడ్డ తిరిగి తల్లి ఒడికి చేరింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈనెల 24న రాత్రి అదృశ్యమైన రెండున్నరేళ్ల పసిపాప.. బుధవారం రాజమండ్రిలో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది. రాజమండ్రి/అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : అనకాపల్లిలో ‘హైటెక్ ఆప్టికల్స్’ పేరుతో కళ్లజోళ్ల వ్యాపారం నిర్వహించే విన్నకోట ప్రవీణ్ కుమార్తె కౌశిక ఈ నెల 24న రాత్రి 7.30 గంటల సమయంలో షాపు వద్ద ఆడుకుంటుండగా ఈదురుగాలులు వీచి కరెంటు పోయింది. ఆ చీకట్లోనే పాప అదృశ్యమైంది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరపత్రాలతో పాటు ఛానల్లో స్క్రోలింగ్ ద్వారా ప్రచారం చేశారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కాగా ఈనెల 26న రాజమండ్రిలోని గీతా అప్సరా థియేటర్ వద్ద తప్పతాగిన ఇద్దరు స్త్రీ పురుష యాచకులు వారి వద్ద ఉన్న రెండున్నరేళ్ల చిన్నారి ‘నాదంటే, నాదని’ ఘర్షణ పడుతుండగా సమీపంలో కూరగాయల వ్యాపారం చేసే పోకల కామమ్మ, పిట్టా ఆదిలక్ష్మి, ముత్తులక్ష్మి, పిట్టా యర్రమ్మ, రట్టె యల్లమ్మలకు అనుమానం వచ్చి నిలదీశారు. యాచకులు ఆ పాప తమ కూతురి కుమార్తె అని చెప్పారు. మహిళలు పాప తల్లిని తీసుకురావాలంటే చనిపోయిందన్నారు. పోనీ, తండ్రినైనా తీసుకురావాలంటే అతడూ మరణించాడని చెప్పారు. దీంతో అనుమానం బలపడిన యాచకులను, బిడ్డను వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. యాచకులను మందలించి వదిలేసిన పోలీసులు..బిడ్డను ఆచూకీ తెలిసే వరకూ సంరక్షించాలని ఆ మహిళల్లో పిల్లలు లేని ముత్తులక్ష్మికి అప్పగించారు. జిల్లాలోని చోడవరానికి చెందిన దుర్గాప్రసాద్ బుధవారం టీవీలో కౌశిక తప్పిపోయినట్టు వచ్చిన స్క్రోలింగ్ చూశాడు. ముత్తులక్ష్మి కుటుంబానికి పరిచితుడైన అతడికి తప్పిపోయిన ఓ పాప రాజమండ్రిలో వారి వద్ద ఉంటున్న సంగతి తెలుసు. దాంతో అతడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రవీణ్ వెంటనే రాజమండ్రిలో తన స్నేహితుడైన గీతా ఆప్టికల్స్ యజమాని గజేంద్రకు ఫోన్ చేసి ముత్తులక్ష్మి వద్ద ఉన్న పాప ఫోటో తీసి తనకు పంపాలని కోరాడు. గజేంద్ర పంపిన ఫొటో తమ కుమార్తెదే కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు. వెంటనే రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి వన్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ అనకాపల్లి ఎస్ఐ పి.కోటేశ్వరరావు సమక్షంలో కౌశికను తల్లిదండ్రులకు అప్పగించారు. యాచకులే కిడ్నాప్ చేశారా? అనకాపల్లిలో అదృశ్యమైన కౌశిక రాజమండ్రిలో యాచకుల వద్దకు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చిక్కుప్రశ్నగానే ఉంది. పాపను యాచకులే కిడ్నాప్ చేసి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. మహిళలు తమకు అప్పగించిన యాచకులను మందలించి వదిలేసిన పోలీసుల వైఖరి కూడా విమర్శనార్హమవుతోంది. యాచకులను నిర్బంధంలోకి తీసుకుని క్షుణ్నంగా విచారించి ఉంటే.. కౌశిక అదృశ్యం వెనుక పిల్లలను అపహరించే ముఠా ఉన్న పక్షంలో బయటపడేది. అలా చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. శనివారం అదృశ్యమైన కౌశిక సోమవారం వరకూ ఎక్కడ ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరిట వంచన
హైదరాబాద్ : ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు.. చివరికి పెళ్లికి నిరాకరించాడో ప్రబుద్ధుడు. బాధిత యువతి, నేరేడ్మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ కృప కాంప్లెక్స్ వద్ద నివాసముండే ఓ యువతి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు చిక్కడపల్లికి చెందిన సీహెచ్ ప్రవీణ్(29)తో సంవత్సరం క్రితం ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. అప్పుడప్పుడు ఆ యువతి వద్ద ప్రవీణ్ డబ్బులు తీసుకునేవాడు. తీరా పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసి, పెళ్లికి తన కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని తేల్చిచెప్పాడు. దీంతో బాధిత యువతి నెల రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. కాగా ప్రవీణ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు న్యాయవాది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారంలో యువతికి ప్రవీణ్ పంపించిన సుమారు 8556 మెసెజ్‌లు, మెయిల్స్ వివరాలు అందచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. -
అమ్మాయిలా మారాలని యువకుడి తపన
తొలి శస్త్ర చికిత్స విజయవంతం రెండవ ఆపరేషన్‌కు డబ్బు కోసం చోరీలు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న అతడి పేరు ప్రవీణ్. అమ్మాయిలా మారాలన్న తపనతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. తొలి శస్త్ర చికిత్స పూర్తి అయింది. రెండవ సారి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలకు తెగబడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. డీసీపీ సందీప్ పాటిల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా.... పీణ్యా సమీపంలోని మంజునాథ నగరకు చెందిన ప్రవీణ్ అలియాస్ కాంత(23) ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేవాడు. తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నగరంలో హిజ్రాలు నివాసముంటున్న ప్రాంతానికి చేరుకుని చీర కట్టుకుని రోడ్డుపైకి వచ్చేవాడు. తర్వాత నిర్జన ప్రదేశాలలో సంచరించేవారిని లైంగికంగా రెచ్చగొట్టి వ్యభిచారం సాగించేవాడు. ఇందులో భాగంగా ఈ నెల 6న రాత్రి గోరగుంటపాళ్యకు చెందిన గార్మెంట్స్ ఉద్యోగి మురుగేష్‌ను అతను లైంగికంగా రెచ్చగొట్టాడు. ఆ సమయంలో మురుగేస్ వద్ద ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఆర్ఎంసీ యార్డు పోలీసు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ కచ్చితమైన సమాచారం సేకరించి కాంతను అరెస్ట్ చేశారు. అయితే ఇంత కాలం ప్రవీణ్ మగవాడేనని కుటుంబసభ్యులు భావించారని, అతను హిజ్రా అని వారికి తెలియదని పోలీసులు తెలిపారు. కాగా, తనతో లైంగిక వాంఛ తీర్చుకున్న తర్వాత నగదు ఇవ్వకుండా మురుగేష్ మోసం చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో బంగారు గొలుసు లాక్కొన్నట్లు పోలీసుల ఎదుట ప్రవీణ్ అంగీకరించాడు. తాను చోరీ చేసిన బంగారు గొలుసును సుంకదకట్టలోని ఓ జ్యువెలరీ షాప్‌లో విక్రయించగా వచ్చిన రూ. 30 వేలతో దేవుడి ఫొటోలు కొనుగోలు చేశానని, మిగిలిన సొమ్ముతో తోటి హిజ్రాలతో కలిసి జాలీ ట్రిప్ వెళ్లి వచ్చినట్లు వివరించాడు. అమ్మాయిగా మారేందుకు గతంలో ఒకసారి ప్రవీణ్ ఆపరేషన్ చేయించుకున్నాడని, ప్రస్తుతం మరోసారి ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తునట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. -
ఫేస్బుక్ కామెంట్లు.. ప్రాణం తీశాయి
బాలిక విషయమై విద్యార్థుల తగాదా ఆవేశంతో దాడి.. ఒకరి హత్య నాగోలు / హస్తినాపురం, న్యూస్‌లైన్: పసి మనసులు కసితో రగిలాయి. ఓ బాలిక విషయమై ఫేస్బుక్లో చేసుకున్న ‘కామెంట్లు’ శనివారం ఓ బాలుడి హత్యకు దారితీశాయి. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం షిర్డీసాయినగర్‌కు చెందిన గొట్టి దుర్గయ్య, రమ దంపతుల కుమారుడు ప్రవీణ్ (14) హస్తినాపురంలోని ఓ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అనిల్, యశ్వంత్, మరో బాలిక అదే స్కూలో చదువుతున్నారు. కాగా,ఎస్‌కేడీనగర్‌కు చెందిన అజార్ దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. యశ్వంత్, ప్రవీణ్, అనిల్‌ల స్నేహితురాలితో పరిచయం పెంచుకోవడం కోసం రోజూ హస్తినాపురం చౌరస్తాకు వచ్చేవాడు. ఈ క్రమంలో అనిల్, యశ్వంత్, ప్రవీణ్‌లతో అజార్‌కు పరిచయం ఏర్పడింది. వీరు తరచుగా ఫేస్బుక్లో అభిప్రాయాలు షేర్ చేసుకుంటుండేవారు. కాగా, బాలిక ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉంటుండటంతో అజార్ కక్ష పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. శనివారం సాయంత్రం హస్తినాపురంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫేస్బుక్ ద్వారా ప్రవీణ్, అనిల్, యశ్వంత్‌లు అజార్‌ను దుర్భాషలాడారు. ఆవేశానికి గురైన అజార్ సాహెబ్‌నగర్‌కు చెందిన కొంతమందితో కలిసి ఆటోలో నాగార్జున హైస్కూల్‌కు వచ్చాడు. స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ప్రవీణ్, అనిల్, యశ్వంత్‌ను హస్తినాపురం చౌరస్తాలో ఆటో ఎక్కించుకుని లక్ష్మీనరసింహకాలనీ కమాన్ వద్దకు తీసుకెళ్లాడు. యశ్వంత్ పారిపోగా ప్రవీణ్‌ను కిందపడేసి చేతికి ఉన్న కడియంతో తలభాగంలో తీవ్రంగా కొట్టి పడేశారు. అనంతరం అనిల్‌ను బీఎన్‌రెడ్డినగర్‌కు తీసుకెళ్లి దాడిచేసి వదిలేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి దుర్గయ్య, అన్న మహేష్.. ప్రవీణ్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందాడు. ఎల్బీనగర్ పోలీసులు.. దాడికి పాల్పడిన అజార్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. వారిపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
ఉస్మానియాలో తెగిన లిఫ్టు వైర్
15 మంది చిక్కుకుపోయిన వైనం ఆపరేటర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం తొలగించి రక్షించిన పోలీసులు అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలోని లిఫ్టు హఠాత్తుగా మధ్యలో నిలిచిపోయింది. అందులో చిక్కుకుపోయిన రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు లిఫ్టులో ఊపిరాడక నరకయాతన అనుభవించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగింది. రెండో అంతస్తు నుంచి కిందకు వస్తున్న ఈ లిఫ్టులో ఆసుపత్రి వైద్యులు సాంబిరెడ్డి, హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఆయా లక్ష్మీ, లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణలతో పాటు నిలోఫర్ ఆసుపత్రి నుంచి వచ్చిన గర్భిణి శ్రీదేవి, అత్తాపూర్‌కు చెందిన సురేష్ కేతాన్, రమేష్ కేతాన్లతో పాటు మొత్తం 15 మంది ఉన్నారు. లిఫ్టు కిందకు వస్తున్న క్రమంలో హఠాత్తుగా లిఫ్టు వైరు తెగిపోయింది. ఇది గమనించిన లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణ అప్రమత్తమై సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ మధ్యలో నిలిచిపోయింది. లిఫ్టు ఒక వైపు కొంచెం ఒరిగి ఉండటంతో అందులో చిక్కుకున్న రోగులు, వారి సహాయకులు పెద్ద పెట్టున అరుపులు, కేకలు పెట్టారు. సుమారు అరగంటసేపు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లిఫ్టు నుంచి సెల్ఫోన్లకు సిగ్నళ్లు అందకపోవడంతో ఈ సమాచారాన్ని చేరవేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు రమేష్ కేతాన్ సెల్‌ఫోన్ నుంచి అతని స్నేహితుడైన జిఎల్ బిరానియాకు మెసేజ్ అందడంతో.. విషయం పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నాడు. పోలీసులు, లిఫ్టు మెకానిక్‌లు గ్రిల్స్ తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని నిచ్చెన సహాయంతో కిందకు దింపడంతో రోగుల సహాయకులు, వారి బంధువులు ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన సంభవించిందని రమేష్ కేతాన్ ఆవేదన వ్యక్తంచేశారు. -
అదే పోరు..అదే జోరు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. దీక్షలు, ర్యాలీలు, ప్రదర్శనలతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాచలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షల్లో ఐకేపీ ఉద్యోగులు, ఐటీడీఏ నాల్గో తరగతి ఉద్యోగులు కూర్చొన్నారు. ఇదే శిబిరంలో నంగారభేరి పోరాట హక్కుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘానికి చెందిన పలువురు నాయకులు దీక్షలు చేపట్టారు. భద్రాచలాన్ని జిల్లాలోనే ఉంచాలని తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు ప్రవీణ్, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. దాసు డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా జిల్లాలోని నీళ్లు, ఉద్యోగాలు, వనరులను ఆంధ్ర పాలకులు దోపిడీ చేశారని, వీటిని కొనసాగించేందుకే భద్రాచలం, హైదరాబాద్‌లపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దీక్షల్లో ఐకేపీ ఉద్యోగులు ఎం. నాగార్జున, నాగేశ్వరరావు, రమేష్‌బాబు, దుర్గారావు, రామారావు, శశిపూర్ణిమ, జ్యోతి, త్రిగుణ, వెంకటేశ్వర్లు, కె. అప్పారావు, చంద్రమోహన్ కూర్చొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్‌రావు, రాజేంద్రప్రసాద్, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, బీజే పీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, ఏపీటీఎఫ్ మహిళా నాయకురాలు రవికుమారి తదితరులు సంఘీభావం ప్రకటించారు. లంబాడ హక్కుల పోరాట సమితి దీక్షల్లో హుస్సేన్‌నాయక్, హరిసింగ్రాథోడ్, రామకృష్ణ, మదార్నాయక్, ప్రతాప్‌సింగ్, రత్ననాయక్, సీతారాములు, హరి, మాన్సింగ్, గోవింద్‌నాయక్ కూర్చొన్నారు. ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలి.. భద్రాచలాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని కాంట్రాక్ట్ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్వర్లు కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించారు. భద్రాచలం , అశ్వారాావుపేట నియోజకవర్గాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలోనూ గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును బేషరత్తుగా నిలిపివేయాలన్నారు. దీక్షల్లో విద్యాశాఖకు చెందిన ఆదివాసీ ఉద్యోగులు శేఖర్, భాస్కర్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీను, సీతారామయ్య కూర్చొన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, తిప్పన సిద్దులు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె. సీతారాములు సంఘీభావం ప్రకటించారు. కేబుల్ ఆపరేటర్ల జలదీక్ష తెలంగాణ గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరిలో జలదీక్ష చేపట్టారు. అంతకుముందు సమావేశమైన వారు భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని తీర్మానం చేశారు. ర్యాలీగా వెళ్లి రామాలయంలో పూజలు నిర్వహించారు. గోదావరిలో జలదీక్ష చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నెబోయిన సీతారామయ్య, యానాల మల్లారెడ్డి, చల్లా కోటేశ్వరరావు, పోట్లపల్లి వెంకటేశ్వర్లు, వెంకట్, మహ్మద్ సలీంతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఆపరేటర్లు పాల్గొన్నారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు కూడా ఆదివాసీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి... భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని గాంధీపథం జిల్లా కన్వీనర్, భద్రాద్రి రాజకీయ జేఏసీ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివాసీ దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ పెంచాలన్నారు. కార్యక్రమంలో రేగలగడ్డ ముత్తయ్య, పాల్‌రాజ్, టీఆర్ఎస్ నాయకులు నలజాల శ్రీను, టీఆర్ఎల్డీ నాయకులు రామాచారి పాల్గొన్నారు. -
‘దేశం కోసం పరుగు’కు అనూహ్య స్పందన
సిద్దిపేట, న్యూస్‌లైన్: స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో ఉపన్యాసం చేసి సెప్టెంబర్ 11తో 120ఏళ్లు పూర్తయ్యాయి. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటినది ఈ ఉపన్యాసమే. దీంతో స్వా మికి ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చాయి. ఈ రోజు ను పురస్కరించుకుని బుధవారం జిల్లాలో చేపట్టిన ‘దేశం కోసం పరుగు’కు అనూహ్య స్పంద న లభించింది. ముఖ్యంగా యువత, విద్యార్థులు అధికసంఖ్యలో ఈ పరుగులో పాల్గొని దేశభక్తిని చాటారు. సిద్దిపేటలో జరిగిన ‘దేశం కోసం పరుగు’ను వన్‌టౌన్ సీఐ నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరసావర్క ర్ సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరియాద అంజిరెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడిన వా ళ్లే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ నాయకులు ప్రవీణ్, మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, హిందూ ప్రతి నిధులు శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్, గోల్కొండ రాఘవులు, రాజేశం, చంద్రశేఖర్, భానుచందర్ పాల్గొన్నారు. మానవసేవకే పరితపించారు: బాలేంద్రజీ రామాయంపేట: రామాయంపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశంకో సం పరుగులో విద్యార్థులు భారీగా పాల్గొన్నా రు. అనంతరం సిద్దిపేట ఎక్స్‌రోడ్‌లో నిర్వహించిన సమావేశానికి వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ బాలేంద్రజీ హాజరై మా ట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా దీనజనోద్ధరణ కోసం వివేకా పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలకృష్ణారెడ్డి, విద్యార్థులు, వివేకానంద యూత్ నాయకులు, ఆవాస విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు. వివేకా ఆశయ సాధనకు కృషి చేయాలి గజ్వేల్: వివేకానందా ఆశయ సాధనకు యువ త కృషిచేయాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరేష్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో ‘దేశ భవితకు యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వమత సమ్మేళనంలో వివేకానందా భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారని కొని యాడారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికి నలువైపులు నుంచి ప్రమాదాలు ముం చుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డ్రిగీ కళాశాల సైకాలజీ లెక్చరర్ శ్రీని వాసచారి మాట్లాడుతూ యువత శారీరక శక్తితో మానసిక శక్తిని అలవర్చుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వివేకానందా ఉత్సవసమితి గజ్వేల్ నియోజకవర్గ శాఖ కన్వీనర్ తుమ్మ క్రిష్ణ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తిని యువకుల్లో నింపేందుకే వివేకా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు స్వామి, క్రాంతి, క్రిష్ణ, కర్ణాకర్‌రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద చూపిన మార్గంలో నడవాలి స్వామి వివేకనంద చూపిన మార్గంలో యువత నడవాలని జిల్లా యువజన సంక్షేమాధికారి ఎస్. రామచంద్రయ్య సూచించారు. బుధవారం గజ్వేల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో ‘సేవా’ వలీంటరీ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్(జాతీయ సేవా పథకం) అధ్వర్యంలో ‘వివేకనందుడు యువతకు ఆదర్శం’ అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ఈ సదస్సులో జూనియర్ కళశాల ప్రిన్సిపాల్ ఎలిజబెత్, ‘సేవా’ సంస్థ అధ్యక్షుడు దేశబోయిన నర్సింహులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి వం శీధర్, డీడబ్ల్యూఓ మేనేజర్ బాలయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద జోగిపేట: యువతుక ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని సీఐ సైదానాయక్ అన్నారు. జోగిపేటలో నిర్వహించిన జాతీయ యువ పరుగును ఆయన ప్రారంభించారు. అనంతరం అందోలు వద్ద ఉన్న వివేకానందుడి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జయంతి ఉత్సవాల కమి టీ జిల్లా కార్యదర్శి జె.లక్ష్మన్,సభ్యులు ఆర్.ప్రభాకర్‌గౌడ్, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీటీపై దాడిచేసిన నటుడి అరెస్టు
తమిళ సినిమా, న్యూస్‌లైన్: రైల్వే టికెట్ కలెక్టర్‌పై దాడిచేసిన మలయాళ నటుడు మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే కేరళలోని పత్రణ తిట్టా ప్రాంతానికి చెందిన నటుడు మనోజ్ కుమార్. ఈయన గాంధేయన్, సూర్యవనం తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో నటించడానికి మనోజ్‌కుమార్ చెన్నై వచ్చారు. ఆదివారం రాత్రి ఈయన చెన్నై నుంచి త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లో కేరళకు పయనమయ్యారు. రైలు సేలం దాటిన తరువాత నటుడు మనోజ్ కుమార్ ఉన్న కంపార్ట్మెంట్లోకి రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులు ఎక్కారు. దీంతో మనోజ్ కుమార్ వారిపై మండి పడ్డారు. ఇదే విషయం గురించి టికెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. సహనం కోల్పోయిన నటుడు మనోజ్ కుమార్ టికెట్ కలెక్టర్‌పై దాడి చేశారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ కృష్ణమూర్తి ఈరోడ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నటుడు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నటుడు మనోజ్ కుమార్ కూడా టికెట్ కలెక్టర్, మరో ఐదుగురు తనను కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెయింట్ సాయిని గెలిపించిన ప్రవీణ
సాక్షి, హైదరాబాద్:ప్రవీణ్ (101) వీరోచిత సెంచరీతో కదం తొక్కడంతో సెయింట్ సాయి జట్టు 6 వికెట్ల తేడాతో యాదవ్ డెయిరీపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన యాదవ్ డెయిరీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. విఘ్నేశ్వర్ (87), అభిషేక్ (76) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ సాయి జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రవీణ్‌తో పాటు రాజా (54), జీతు (61) అర్ధసెంచరీలు సాధించారు. మరో మ్యాచ్‌లో ఎంపీ స్పోర్టింగ్ 111 పరుగుల తేడాతో పీకేసీసీపై గెలుపొందింది. మొదట ఎంపీ స్పోర్టింగ్ 7 వికెట్లకు 306 పరుగుల భారీస్కోరు చేసింది. నవీన్ (76), వినీత్ (82 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. పీకేసీసీ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత పీకేసీసీ 195 పరుగులకే కుప్పకూలింది. విజయ్ (55) అర్ధసెంచరీ చేశాడు. ప్రేమ్ 31 పరుగులు చేయగా చైతన్య 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సెయింట్ ప్యాట్రిక్స్: 176 (సాత్యకి 89; భరత్ 3/48); సన్‌షైన్: 166 (కిరణ్ 81; సాత్యకి 4/53) ఎలెవన్ మాస్టర్స్: 205 (సృజన్ 100 నాటౌట్, ప్రసాద్ 31; వంశీ 5/56), ఆల్ సెయింట్స్: 203/8 (ఇబ్రహీం 38) నటరాజ్: 122 (హసీబ్ 4/28, జావెద్ 3/28), పీఎన్ యంగ్‌స్టర్స్: 123/7 (హసీబ్ 34; మణికుమార్ 3/35) సాక్రెడ్ హార్ట్: 161 (జెరోమ్ అరోకియనధన్ 34, జోసెఫ్ రాయప్ప 32), ఎంపీ బ్లూస్: 107 (జెరోమ్ 3/42).