
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల చిరునవ్వు వెనక కొండం విషాదం ఉంటుంది. కానీ ఆ బాధలను, దుఃఖాలను దిగమింగుకుని మోముపై బలవంతపు నవ్వును పులుముకొంటారు. కడుపులోనే కష్టాన్ని దాచుకుని కడుపుబ్బా నవ్విస్తారు. ముళ్లదారిలో నడిచిన కమెడియన్ల జాబితాలో పటాస్ ప్రవీణ్ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ సహా పలు కామెడీ షోలలో కమెడియన్‌గా రాణిస్తున్న అతడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు.
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయనను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించగా వెన్నుపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిందని, ప్రస్తుతం ఆయన చివరి స్టేజీలో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో ప్రవీణ్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
కాగా ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్‌ను, అతడి అన్నను చదివించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని మంచి స్థాయిలో నిలబెట్టారు. కన్నకొడుకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
చదవండి: రాకెట్రీ కోసం ఇల్లు అమ్మేసిన హీరో, మాధవన్ ఏమన్నాడంటే?
రౌడీ హీరో ఇంట పూజలు, హీరోహీరోయిన్లకు తాయత్తులు!
Comments
Please login to add a commentAdd a comment