
అమాయకమైన హావభావాలతో పంచు డైలాగులు పేల్చే బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన స్టెల్లాను వివాహమాడాడు. ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి నాగబాబు, ఆకాష్ పూరి, యాంకర్ ప్రదీప్, బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, ముక్కు అవినాష్, సోహైల్, నటి శ్రీవాణి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా యాదమ్మరాజు రెండేళ్లక్రితమే తన ప్రేయసి స్టెల్లాను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మొదట ఫ్రెండ్ అయిందని, తర్వాత ప్రేయసిగా మారిందని చెప్పుకొచ్చాడు. ఇక స్టెల్లా ప్రియుడి మీద ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో బయటపెట్టింది. చేతిపై యాదమ్మరాజు పేరును పచ్చబొట్టు వేయించుకుంది.
చదవండి: గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్
అన్‌స్టాపబుల్ 2లో ప్రభాస్..ఫొటోలు, వీడియోలు లీక్
Comments
Please login to add a commentAdd a comment