
జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy).. దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు చేశాడు. తన మేనరిజంతో, స్పెషల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్‌గా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన 74 ఏళ్ల వయసులో మరణించారు. జయప్రకాశ్ కుమార్తె మల్లిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. మల్లిక మాట్లాడుతూ.. 'నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోపక్క స్టేజీపై నాటకాలు వేసేవారు.
రూ.5 లక్షల అప్పు
ఆయన నటన చూసి సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. కొన్నాళ్లకు అక్కడ సెట్ కాకపోవడంతో నాన్న ఐదేళ్లకే తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు. రూ.5 లక్షల వరకు అప్పు కావడంతో మళ్లీ సినిమాల్లోకి వెళ్లకూడదనుకున్నారు. ఏడేళ్లపాటు టీచర్‌గానే ఉన్నారు. కానీ ఓసారి రామానాయుడు కంటపడటంతో ఆయన తిరిగి సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రేమించుకుందాం రా మూవీతో నాన్నకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు.
లాక్‌డౌన్‌లో మరణం
నాన్నగారి కంటే రెండేళ్ల ముందు అమ్మ చనిపోయింది. నాన్నకు లో బీపీ. కరోనా సమయంలో నా తమ్ముడికి, అతడి పిల్లలకు కూడా వైరస్ సోకడంతో ఆయన భయపడిపోయాడు. షుగర్ లెవల్స్ కూడా తగ్గడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర లేచాడు. స్నానానికి వెళ్లినప్పుడు ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో ఇంట్లో వాళ్లు డోర్ తెరిచి చూస్తే ఆయన నిర్జీవంగా పడి ఉన్నాడు.
అఖండలో ఆఫర్
ఆయన మరణం మమ్మల్ని అందరినీ షాక్‌కు గురి చేసింది. లాక్‌డౌన్ వల్ల నాన్న అంతిమయాత్రలకు సెలబ్రిటీలు ఎవరూ హాజరు కాలేకపోయారు. నాన్న చనిపోవడానికి ముందు అఖండ, క్రాక్ సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతలోనే ఇది జరిగిపోయింది. నాన్న ఎన్నో సహాయకార్యక్రమాలు చేశారు. చాలామందిని చదివించారు. నాన్న మరణించాక ఈ విషయాలు తెలిసి కన్నీళ్లు వచ్చాయి. అమ్మానాన్న ఇద్దరూ గుండెపోటుతోనే మరణించారు.
నిర్మాతగా..
తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు నిర్మాతగా మారాను. అలా నేను నిర్మిస్తున్న ఓ మూవీ షూటింగ్‌కు వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి మా కారు బోల్తా కొట్టింది. అప్పుడు నాకు శరీరంపై 42 కుట్లు పడ్డాయి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని నా సినిమాను పూర్తి చేశాను అని మల్లిక చెప్పుకొచ్చింది. ప్రేమించుకుందాం రా.., జయం మనదేరా, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, నిజం, కబడ్డీ కబడ్డీ, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, ఢీ, యమదొంగ, రెడీ, నాయక్.. ఇలా వందల సినిమాలతో వినోదం పంచిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న మరణించారు.
చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం..: మోహన్‌బాబు