
టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్ (Dhanraj). బుల్లితెర నుంచి వెండితెరకు సాగిన అతడి ప్రయాణంలో భార్య శిరీష వెన్నంటే నిలబడిందని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు. తాజాగా శిరీష తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. శిరీష (Dhanraj Wife Sirisha) మాట్లాడుతూ.. ధనరాజ్‌ది విజయవాడ. నాది ఖమ్మం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. ధనరాజ్ ఫిలిం నగర్‌లో ఓ డ్యాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతున్నారు. అలా నన్ను కలిశాడు.
క్యాన్సర్‌తో కన్నుమూసిన ధనరాజ్ తల్లి
అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీలయ్యాడు. తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. నవంబర్‌లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది. మాది ప్రేమ వివాహం. అది కూడా నేనే ప్లాన్ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు. ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను.
మా పెళ్లయ్యాకే అతడికి పేరొచ్చింది
మా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజైంది. అక్కడి నుంచి ధనరాజ్‌కు అవకాశాలు, ఫేమ్ మొదలైంది. అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఓ సినిమా తీశాడు. అది నాకిష్టం లేదు. ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు. ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే! నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేశాం.. సోషల్ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు.
పదిరోజులు మాట్లాడుకోం
ఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు. ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు. ఇప్పుడేమో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. వారం, పది రోజులపాటు మాట్లాడుకోం. అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్ ఏం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఏవి పడితే అవి రాయొద్దు. ఇకపోతే ధనరాజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉంటారు. సుడిగాలి సుధీర్ నాకు ఎక్కువ క్లోజ్. ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి! అని శిరీష చెప్పుకొచ్చింది.
చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!