jayaprakash reddy
-
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ షురూ
దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్‌పై ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. నరేన్ వనపర్తి హీరోగా, పాయల్ గుప్తా హీరోయిన్గా నటిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బి.గోపాల్ క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు అవినాష్ కొకటి. ‘‘నాన్నగారి (జేపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్మాణంలోకి వచ్చాను’’ అన్నారు మల్లికా రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శివ. -
సింగపూర్ 'రీజినల్ కోఆర్డినేటర్'గా ఇచ్చాపురం వాసి
అమరావతి : ఇచ్చాపురం సీనియర్ నాయకులు దక్కత లోకనాధం రెడ్డి పెద్ద కుమారుడు దక్కత జయప్రకాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్నార్టీ సంస్థ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు నియామక పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు చేసిన విశేష సేవ కార్యక్రమాలు, పని పట్ల అకింత భావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనకు ఈ భాద్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్‌కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. తన భాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ.. పెట్టుబడులు, ఇతర అవకాశాలకు సింగపూర్‌లోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని జయప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. -
జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం
గుంటూరు ఈస్ట్ /సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: సుప్రసిద్ధ విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి (74) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు విద్యానగర్‌లోని ఆయన నివాసంలో బాతురూమ్కు వెళ్లగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రకాష్‌రెడ్డి, కుమార్తె మల్లిక ఉన్నారు. జయప్రకాష్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోదరులు, ఇతర బంధువులంతా అమెరికాలో ఉన్నారు. కొడుకు, కోడలు హోమ్ ఐసోలేషన్‌లో ఉండడంతో పీపీఈ కిట్లు ధరించి భౌతికకాయం వద్దకు వచ్చారు. కొరిటెపాడులోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు జయప్రకాష్‌రెడ్డికి ఆయన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. నటనా రంగాన్ని వేదికగా చేసుకుని సమాజాన్ని చైతన్యపరచడానికి నిరంతరం పోరాడిన ఆ యోధునికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, మద్దాళి గిరిధరరావు, కిలారి రోశయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయప్రకాష్‌రెడ్డి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. విలక్షణ నటుడుగా గుర్తింపు.. ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రంగస్థల దిగ్గజంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటనా రంగంలో అలుపెరగకుండా చేసిన కృషి ఆయనను నటనా రంగంలో లెజెండ్‌గా నిలిపింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 340 సినిమాలు, 3 వేల నాటకాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ యాసతో ఆయన నటనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. సినీ లోకానికి తీరనిలోటు జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణంపై ప్రధాని సంతాపం తెలుగు చలనచిత్ర విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. ‘జయప్రకాష్‌రెడ్డి తనదైన నటనా శైలితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరనిలోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’.. అని మంగళవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా జయప్రకాష్‌రెడ్డి మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ విచారం జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రఖ్యాత నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. తన హావభావాలు, డైలాగులు చెప్పే విధానంతో ఆయన సినీ పరిశ్రమలో సరికొత్త స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. జయప్రకాష్‌రెడ్డి మృతికి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్పీపీ నేత వి. విజయసాయిరెడ్డి విచారం వ్యక్తంచేశారు. తెలుగు సినీ పరిశ్రమ, రంగస్థలం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందన్నారు. -
సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం
నటుడు కాకముందు టీచర్ జయప్రకాశ్ రెడ్డి.. పిల్లలకు హోమ్ వర్క్ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చాక యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి... పాత్రలు బాగా చేయడానికి హోమ్ వర్క్ చేశారు. ప్రతీ పాత్రకు హోమ్ వర్క్ ముఖ్యమనేవారు. కామెడీ–సీరియస్ రెండూ భిన్న ఎమోషన్లు. ఎలా కలుస్తాయి? జేపీకి కుదిరింది. రెంటినీ కలిపారు. ప్రేక్షకులను భయపెట్టారు... నవ్వించారు. తెరపై ‘ప్రతి నాయకుడి’గా కనిపించినా.. తన నటనతో ప్రతి ఇంటికి దగ్గరైన నటుడయ్యారు. ‘‘అలా అడ్డగాడిదల్లా ఖాళీగా కూర్చొని కాలయాపన చేయకపోతే, ఏదైనా నాటకం రాసి రిహార్సల్స్ చేసుకోవచ్చుగా’ – జయప్రకాశ్ రెడ్డి (జేపీ) నాటకాల్లో శ్రద్ధ పెంచుకోవడానికి దారి చూపిన తిట్టు. తిట్టింది జేపీ నాన్నగారే. సాంబిరెడ్డి (జేపీ తండ్రి)కి నాటకాలంటే పిచ్చి. నటుడు కూడా. ఇంట్లోనే విపరీతమైన ప్రోత్సాహం ఉండటంతో నాటికలు రాయడం, వేయడం వైపు అడుగులేశారు జేపీ. స్కూల్ రోజుల్లో రుద్రమదేవి నాటికలో అంబదేవుడు అనే సామంతరాజు వేషం వేశారు. అదే జేపీ తొలి వేషం. చిన్న పాత్ర అయినా రెండు పద్యాలు పడ్డాయి. ఆయన పద్యం పూర్తి చేసేసరికి చప్పట్లు పడ్డాయి. తొలి వేషాన్నే డిస్టింక్షన్లో పాసయ్యారు జేపీ. యాస మీధ ధ్యాస కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో సామ్రాజమ్మ, సాంబి రెడ్డి దంపతులకు 1945లో జన్మించారు జేపీ. సాంబిరెడ్డి పోలీస్ ఉద్యోగి. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు కావడంతో ప్రాంతానికో యాస ఉండటం, అవి గమ్మత్తుగా ఉండటం జేపీలో ఉత్సుకతను పెంచాయి. ఎక్కడికెళ్తే అక్కడి యాసను ఇట్టే పట్టేయడం అలవాటు చేసుకున్నాడు. కడప, కర్నూల్, ప్రొద్దుటూర్, అనంతపురం, గుంటూర్, నల్గొండ.. ఇలా ఉద్యోగం నిమిత్తం తండ్రికి అయిన బదిలీలన్నీ జేపీకి ఉపయోగపడ్డాయి. స్కూల్ చదువులన్నీ సీమ ప్రాంతంలో పూర్తి చేసిన జేపీ కాలేజీ చదువులన్నీ గుంటూరులో చేశాడు. నాటకానికి పనికిరావు అనంతపురంలో చదువుకునేటప్పుడు జేపీ, అతని స్నేహితుడు నాటకం వేయాలనుకున్నారు. ‘దుర్యోధన గర్వభంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ పట్టారు. ‘ఏదీ చూపించండి’ అని సైన్స్ మాస్టారు అడిగితే, నాటకాన్ని మొత్తం చేసి చూపించారు. ‘ఇంకోసారి నాటకం అంటే కాళ్లు విరగ్గొడతా’ అని చివాట్లు పెట్టారాయన. అవమానంగా అనిపించింది జేపీకి. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నా, అధైర్యపడలేదు. ఎప్పటికైనా నాటకం వేసి ప్రేక్షకుల్ని అలరించాలని బలంగా నిర్ణయించుకున్నాడు జేపీ. (జయప్రకాశ్ మరణం తీరని లోటు: ప్రధాని మోదీ) ఉత్తమ నటి బహుమతి కాలేజీలో ‘స్టేజీ రాచరికం’ అనే నాటికలో వేషం వేయమని సీనియర్లు కోరితే ‘ఊ’ అన్నాడు జేపీ. చెలికత్తె వేషం అది. అంటే అమ్మాయిగా కనిపించాలి. జేపీ చేసేశాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు కాలేజీ నోటీస్ బోర్డ్‌లో ‘ఉత్తమ నటి – జయప్రకాశ్ రెడ్డి’ అని బహుమతుల జాబితాలో రాసుంది. ఆ తర్వాత కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో జేపీ హాజరు పడాల్సిందే అన్నట్టుగా ఉండేది. కాలేజీ స్టార్లా చూసేవాళ్లు. సన్నగా, పొడుగ్గా ఉండటంతో ఎక్కువగా వినోద ప్రధానంగా ఉండే పాత్రలే చేసేవాడు జేపీ. గుంటూరులోనే బీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగంలో చేరారు. చూడ్డానికి డ్రిల్ మాస్టార్లా ఉండటంతో అందరూ ఆయన్ను డ్రిల్ మాస్టార్ అనుకున్నారు. కానీ జేపీ లెక్కల మాస్టార్. టీచర్‌గా మారినా నాటకాల మీద తన ఇష్టాన్ని వదులుకోలేదు. స్కూల్లో పిల్లలతో తరచూ నాటికలు వేయిస్తూ ఉండేవారు. అప్పటికి పెళ్లయింది కూడా.. ఓ బాబు పుట్టాడు. కొడుకుని తన తండ్రి దగ్గర నల్గొండలో ఉంచారు జేపీ. అలా తరచూ నల్గొండ వెళ్లడంతో అక్కడ యాసను పట్టేశారు. కొత్త కెరీర్‌కి అన్‌లాక్ జేపీ నటుడిగా మారే టర్న్ నల్గొండలో జరిగింది. జేపీ శిష్యుడు ఓ పత్రికను స్థాపించారు. అందులో భాగంగా ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి, దర్శకుడు దాసరి నారాయణరావును అతిథిగా ఆహ్వానించారు. జెపిని ఒక నాటకం కూడా ఆడాలన్నాడు ఆయన శిష్యుడు. సరే అనుకున్నారంతా. కానీ దాసరికి ఏదో పని ఉండి త్వరగా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసి, మైక్ అందుకున్న జేపీ, ‘మా నాటకాన్ని పూర్తిగా అస్వాదించి వెళ్తారనే అనుకుంటున్నాం’ అని దాసరిని లాక్ చేశారు. ఇది తన కొత్త కెరీర్‌ను అన్‌లాక్ చేస్తుందని ఆ నిమిషం జేపీకి తెలియదు. ‘భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా. మొదటి పావుగంటా చూస్తా’ అన్నారు దాసరి. అయితే నాటకంలో నిమగ్నమై గడియారాన్ని చూసుకోవడం కూడా మర్చిపోయిన దాసరి చివరి వరకూ ఉన్నారు. ‘నువ్వుండాల్సింది సినిమాల్లో. నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తాను’ అని జేపీని అభినందించారు కూడా. వారం తిరగ్గానే రామానాయుడు స్టూడియోస్ నుంచి వేషం ఉందని ఫోన్. సినిమా ప్రయాణం రామానాయుడు నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) సినిమాలో తొలిసారి నటుడిగా స్క్రీన్ మీద కనిపించారు జేపీ. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా, ప్రేమఖైదీ’ ఇలా వరుస వేషాలు వేస్తూ వచ్చారు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేంత సంపాదన లేదు. అప్పటికి ఓ కుమార్తె కూడా ఉంది జేపీకి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కొన్ని అప్పులు కూడా మిగిలాయి. అరకొర సంపాదనతో బండి నడపడం కష్టమని గుంటూరు బండెక్కేశారు. టీచర్‌గా పిల్లలకు చదువు చెప్పడంలో పడిపోయారు. ఇలా నాలుగైదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఏదో పని మీద హైదరాబాద్‌లో అనుకోకుండా మళ్లీ రామానాయుడ్ని కలవడం జరిగింది. అప్పుడు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఆఫర్ చేశారు రామానాయుడు. అమ్రీష్ పురి, నానా పటేకర్.. ఇంకా ఎవరెవర్నో ఆ పాత్రకు అనుకున్నారు. కానీ జేపీకి కుదిరింది. పాత్ర బాగా పండాలంటే ఏం చేయాలని ఆలోచించిన జేపీకి డైలాగులు రాయలసీమ యాసలో చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. ఆ ఆలోచన చిత్రరచయితలు పరుచూరి బ్రదర్స్‌తో పాటు అందరికీ నచ్చింది. వెంటనే సీమ ప్రాంతంలో మారుమూల ఊళ్లల్లో కొన్నిరోజులు తిరిగి యాస మీద ఇంకా పట్టు సాధించారు. తెలియని పదాలను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకున్నారు. పరుచూరి సోదరులనుంచి డైలాగ్స్ ముందే తెప్పించుకుని వాటిని యాసలోకి మార్చుకుని, ప్రాక్టీస్ చేసి నటించారు జేపీ. సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి’ ఇలా వరుస హిట్లు. ఇక కెరీర్ బాగుందని టీచర్ పదవికి రాజీనామా చేసి దృష్టంతా సినిమా మీదే పెట్టాలని నిశ్చయించుకున్నారు. శ్రీను వైట్ల ప్రతి సినిమాలోనూ జేపీ పాత్ర ఉంటుంది. వాటిలో ‘ఢీ’ ఒకటి. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే జేపీ ఈ సినిమాలో ఒక్క డైలాగ్ లేకున్నా సైగలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. తెలుగులో 300కి పైనే సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనిపించారు జేపీ. గుర్తుండిపోయే పాత్రలు ‘జంబలకిడి పంబ’లో అల్లరి పిల్లాడిగా, ‘సమరసింహారెడ్డి’లో క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌గా, ‘సొంతం’లో గులాబీ అనే కామెడీ దొంగగా, ‘ఎవడిగోల వాడిది’లో టవల్ మీదే కనిపించే బండ్రెడ్డి.. ఇంకా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, రెడీ, కిక్, ఊసరవెల్లి, నాయక్ వంటి సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఆయన చివరి రిలీజ్. శివభక్తుడు జేపీకి తెలుగు భాష అంటే ఎనలేని మమకారం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, సామెతలు రాయడం చేసేవారు. సినిమాల్లో విలనే అయినా నిజజీవితంలో సౌమ్యుడు. అంతకుమించి శివభక్తుడు. దాదాపు 18 ఏళ్ల పాటు శివ దీక్ష చేశారు. ‘శివ ప్రకాశం’ పేరుతో ఓ ఆల్బమ్ చేశారు. అందులోని పాటలను ఆయనే పాడటం విశేషం. జేపీది సేవాగుణం కూడా. ఎంతోమందిని చదివించారు. రంగస్థలం మీద గుండెపోటు వచ్చినట్లు నటిస్తే.. నిజంగా వచ్చిందా అని కంగారుపడ్డారు ప్రేక్షకులు. జీవితం అనే వేదిక మీద ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చింది. ఇది కూడా నటనే అయితే బాగుండు అని జేపీని అభిమానించేవారు కోరుకోకుండా ఉండరు. జేపీ మరణం పరిశ్రమకే కాదు నాటకానికీ తీరని లోటు. అయితే జేపీ భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. తాను చేసిన పాత్రల ద్వారా ప్రకాశిస్తూనే ఉంటారు... సినిమా ఉన్నంతవరకూ జయ‘ప్రకాశం’ ఉంటుంది. సినిమా – నాటకం సినిమాల్లో బిజీ నటుడిగా ఉన్నప్పటికీ జేపీ నాటకాన్ని వదలలేదు. వీలున్నప్పుడల్లా నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాటకాల్ని బతికించాలని నాటకాలు వేస్తూనే ఉన్నారు. జేపీకి బాగా పేరు తెచ్చిన నాటకాల్లో ‘అలెగ్జాండర్’ ఒకటి. ఆ నాటకంలో సుమారు వంద నిమిషాలు ఏకపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేపీ. నాటకం క్లైమాక్స్‌లో జేపీ పాత్రకు గుండెపోటు వస్తుంది. ఆ సీన్ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరు నిజంగా గుండెపోటు వచ్చిందేమో అనుకొని అరిచేశారట. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జేపీ. ఈ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించాలనుకున్నారు. కానీ 66సార్లు మాత్రమే వేయగలిగారు. ఈ నాటకాన్ని సినిమాలానూ మలిచారు. తీరా విడుదల సమయానికి లాక్డౌన్ పడింది. – సినిమా డెస్క్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రాయలసీమ యాస కోసం చాలా కృషి చేశారు
జయప్రకాశ్రెడ్డిగారు మొదట వెంకటేశ్ బాబు సినిమా ‘బ్రహ్మపుత్రుడు’, ‘బొబ్బిలిరాజా’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో ఆ పాత్ర (హీరోయిన్ తండ్రి పాత్ర)ని ఎవరు చేస్తే బావుంటుంది? అనుకున్నప్పుడు నా మైండ్లోకి జేపీగారు వచ్చారు. ఆ సినిమాలో ఆయన పాత్రకి మంచి పేరు రావడం, ఆ తర్వాత ఆయన కెరీర్ మారిపోవటం తెలిందే. ఆయన వ్యక్తిగతంగా చాలా పద్ధతి కలిగిన మనిషి. ఎంతో హుందాగా వ్యవహరించేవారు. వ్యక్తిగతంగా దైవభక్తి చాలా ఎక్కువ. హైదరాబాద్‌లో తక్కువ ఉండేవారు. షూటింగ్‌కు కూడా వచ్చినప్పుడు మా గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. తనకి మొదటి నుండి నాన్నగారన్నా (రామానాయుడు), నేనన్నా చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆయనకు తొలి అవకాశం మా ద్వారా వచ్చిందని మాతో ఎంతో గౌరవంతో ఉండేవారు. నేను కూడా ఆయనతో చాలా అభిమానంగా ఉండేవాణ్ణి. జేపీగారు సినిమాల్లోకి రాకముందు రాయలసీమ భాష ఒకలా ఉంటే ఆయన వచ్చాక ఆ భాషను పూర్తిగా మార్చేశారు. ‘ప్రేమించుకుందాం రా’లో చేసిన పాత్ర కోసం ఆయన ఓ టేప్ రికార్డర్ తీసుకుని రాయలసీమలోని అనేక ప్రాంతాలు తిరిగి ఆ యాసను పట్టుకున్నారు. చాలా కృషి చేశారు. ఆయన ఏకపాత్రాభినయం చేసిన ‘అలెగ్జాండర్’ నాటకం గొప్పగా ఉంటుంది. ఆ నాటకాన్ని 400 సార్లు ప్రదర్శించిన గొప్ప నటుడు. – నిర్మాత సురేశ్‌బాబు జేపీగారిని మాత్రమే అంకుల్ అని పిలుస్తా నా మొదటి సినిమా ‘నీకోసం’ నుంచి ఇటీవల తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వరకు నా సినిమాల్లో జయప్రకాశ్‌రెడ్డి అంకుల్ ఉండేవారు. ఎప్పుడైనా డేట్లు ఖాళీ లేక ఒకటీ రెండు సినిమాలు చేయలేదు. నేను కొంచెం రిజర్వ్డ్గా లో ప్రొఫైల్‌లో ఉంటానని అందరికీ తెలుసు. జేపీగారికి వ్యక్తిగతంగా నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎంతో ఆప్యాయంగా ‘నాన్నా’ అని పిలిచేవారు. సినిమా పరిశ్రమలో ఆయన్ని మాత్రమే నేను అంకుల్ అని పిలిచేవాణ్ణి. మొదట్నుంచీ తెలియకుండానే మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండేది. నెల క్రితం ఆయన నాకు ఫోన్ చేసి, ‘ఏంటి నాన్నా.. ఎలా ఉన్నావు’ అని అడిగారు. ఇద్దరం త్వరలోనే కలుద్దాం అనుకున్నాం. రెండు రోజుల క్రితం మా డైలాగ్ రైటర్ గోపీ మోహన్‌తో ‘మన సినిమాలో అంకుల్‌కి కీలకమైన పాత్ర ఉండేలా బాగా డిజైన్ చేయ్యాలి’ అని చెప్పాను. ఆయన చూడటానికి అలా గంభీరంగా ఉంటారు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారు. తక్కువగా తింటారు. అనుకోకుండా ఆయన మనల్ని వదిలి వెళ్లడంతో షాక్‌లో ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. – దర్శకుడు శ్రీను వైట్ల జేపీ కోసమే ఆ సినిమా చూశారు నేను దర్శకత్వం వహించిన ‘లారీ డ్రైవర్’ సినిమాలో జయప్రకాశ్ రెడ్డిగారు చిన్నవేషం వేశారు. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా’ చిత్రంలో కోయ దొర వేషం వేశారు. సీరియస్ పాత్రను ఎంత బాగా చేసేవారో, కామెడీని కూడా అంతే బాగా పండించేవారు. ఆయన్ని జేపీ అని పిలిచేవాణ్ణి. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమాల్లో బాలకృష్ణగారితో పాటు ఎంతో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ఆయన సొంతంగా తన రాయలసీమ యాసను పరిశోధన చేసి డెవలప్ చేసుకున్నారు. మంచి స్టేజ్ ఆర్టిస్ట్.. చాలా గొప్ప వ్యక్తి. ‘సమరసింహా రెడ్డి’ సినిమా విడుదల తర్వాత నన్ను, ఆయన్ను రాయలసీమకి ఆహ్వానించారు అక్కడి ప్రజలు. రాయలసీమకి వెళితే వారందరూ ఆయన్ని కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఎప్పడూ సినిమా చూడని చాలామంది ఈయన కోసం ఆ సినిమా చూశామని చెప్పటం నాకింకా గుర్తు. తెలుగు సినిమా పరిశ్రమకి జేపీ మరణం తీరని లోటు. – దర్శకుడు బి. గోపాల్ విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి పలువురు సినిమారంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జయప్రకాశ్ రెడ్డిగారి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో ఎన్నో మంచి పాత్రలు చేశారాయన. నటుడిగా ఆయన బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి ఆయన. – మంచు మోహన్ బాబు జయప్రకాశ్ రెడ్డిగారి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో ఆయనతో కలిసి చివరిసారిగా నటించా. ‘నాటక రంగం నా కన్నతల్లి. సినిమా రంగం నా పెంచిన తల్లి. అందుకే శని, ఆదివారాల్లో షూటింగ్ పెట్టుకోను.. వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటా.. మీరు ఎప్పుడైనా నాటకం చూసేందుకు రావాలి’ అని అడిగేవారు. కానీ నేను ఆయన నాటకం చూసే అవకాశాన్ని పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదట గుర్తొచ్చేది ఆయనే. తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారాయన. – చిరంజీవి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డిగారి మృతి విచారకరం. పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. – బాలకృష్ణ నా ప్రియమైన మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి మరణం విని ఎంతో బాధ కలిగింది. తెరమీద మా ఇద్దరిదీ గ్రేట్ కాంబినేషన్. ఖచ్చితంగా నిన్ను మేము మిస్ అవుతున్నాం. నిన్ను అభిమానించేవారికి, మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. – వెంకటేశ్ జయప్రకాశ్ రెడ్డిగారు ఎంతో మంచి మనిషి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నా. – నాగార్జున రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని చూపించారు జయప్రకాశ్ రెడ్డిగారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా, హాస్యనటుడిగా అలరించారాయన. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పోలీస్ కమిషనర్ పాత్ర చేశారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయేవారు. సినిమా, నాటక రంగాలకు ఆయన లేని లోటు తీరనిది. – పవన్ కల్యాణ్ జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం ఎంతో బాధ కలిగించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని మంచి హాస్య నటుల్లో ఆయనొకరు. ఆయనతో పనిచేసిన రోజుల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. – మహేశ్‌బాబు అద్భుతమైన నటనతో అందర్నీ అలరించిన జయప్రకాశ్ రెడ్డిగారు ఇక లేరనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – ఎన్టీఆర్ జయప్రకాష్ రెడ్డిగారు ఇక లేరు అనడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. – అల్లు అర్జున్ టాలీవుడ్ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. రంగస్థలం మీద, వెండితెరపైన తనదైన ప్రత్యేకశైలి నటన, వాచకం, విభిన్నమైన పాత్రలతో ఎందరో అభిమానులను జయప్రకాశ్ రెడ్డిగారు సంపాదించుకున్నారు. మా సొంత నిర్మాణ సంస్థల్లో కూడా 3 చిత్రాల్లో నటించి, మెప్పించారు. ఆయనతో చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కలసి నటించాను. ఆయన విలక్షణ నటన చిరకాలం గుర్తుండిపోతుంది. – విజయశాంతి జయప్రకాశ్ రెడ్డిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఇకలేరనే విషయం తెలియగానే షాక్‌కి గురయ్యా. ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలోనూ ఆయన ఉన్నారు. అలాంటి మంచి నటుణ్ణి, మంచి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. – వీవీ వినాయక్ జయప్రకాష్ రెడ్డిగారి హఠాన్మరణం గురించి తెలియగానే ముందు షాక్ అయ్యాను.. ఆ తర్వాత బాధపడ్డాను. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కొన్ని దశాబ్దాలుగా మీ శైలిలో మధురమైన హాస్య పాత్రలు, విలన్ పాత్రలు పోషించి మాకు వినోదం పంచినందుకు కృతజ్ఞతలు సార్. – రాజమౌళి జయప్రకాష్ రెడ్డిగారికి నేను గొప్ప అభిమానిని. ఆయన లేరనే విషయం తెలిసి షాక్ అయ్యా.. నా గుండె పగిలింది. స్టూడియోలో మేమంతా ఆయన శైలిలో డైలాగులు చెబుతూ పగలబడి నవ్వుతుంటాం. ఈ విషయాన్ని ఆయనకి ఎన్నో సార్లు చెప్పాను కూడా. ఆయన ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ వినయంగా ఉండేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆయన నటనని చాలా ఎంజాయ్ చేశాను. మిస్ యు సార్. – దేవిశ్రీ ప్రసాద్ -
నటుడు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలు
-
‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’
సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు జయప్రకాష్‌రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్ పేర్కొన్నారు. -
ఆయన మరణం నన్నెంతో బాధించింది: మోహన్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పదిమందికి సహాయం చేయాలనుకునే మంచి వ్యక్తి అని, లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన సినిమాల్లో ఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారని జయప్రకాశ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ``జయప్రకాశ్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. జయప్రకాశ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.(చదవండి: నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత) ఆ అవకాశం పొందలేకపోయాను: చిరంజీవి ‘‘సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్ 150 సినిమాలో. ఆయన గొప్ప నటుడు. ‘‘నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి’’అనే వారు. ‘‘అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకోనండి, స్టేజీ మీద పర్ఫామెన్స్ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి’’అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే మొదట గుర్తువచ్చేది జయప్రకాశ్ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదిగకా నివాళులు అర్పించారు. ఆయన మృతి విషాదకరం: రాజమౌళి జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఆకస్మిక మరణ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. విషాదకరం. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. విలక్షణ నటన, మీదైన కామెడీ, విలనిజంతో దశాబ్దాల తరబడి మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ప్రార్థించారు. విలక్షణ నటుడిని కోల్పోయిన సినీ నాటక రంగం: ఎఫ్డిసి చైర్మన్ విజయ్ చందర్ తెలుగు సినీ రంగంలో తనదంటూ ఒక నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందిన విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలిపారు. రంగ స్థల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి దాదాపు వందకు పైగా చలన చిత్రాలలో నటించి, నాటక సినీ రంగంలో జయప్రకాశ్ రెడ్డి ఒక సంచలనం సృష్టించారని ఆయన చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను ఉర్రుతలూగించి యాస, భావ వ్యక్తీకరణలో తనదంటూ ఒక శైలిని సృష్టించారని విజయ్ చందర్ తెలిపారు. జయప్రకాశ్ రెడ్డితో ఇండస్ట్రీలో తనకు కూడా మంచి అనుబంధం ఉండేదని ఆయనతో పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు తరచూ చర్చించే వారని ఎఫ్డిసి చైర్మన్ తెలిపారు. తెలుగు సినీ నాటక రంగానికి తీరని లోటు : ఎఫ్డిసి ఎండి టీవీకే రెడ్డి ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి తెలుగు సినీ, నాటక రంగానికి తీరని లోటని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు లో తుది శ్వాస విడిచిన జయప్రకాశ్ రెడ్డి అనేక మంది సినీ జన హృదయాలలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. సినిమాలకు, నాటకాలకు కూడా ఆయన ప్రతిష్టాకరమైన నందీ అవార్డులను సాధించి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారని అన్నారు. ఆయన కుటుంబానికి విజయకుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గొప్ప నటుల్లో ఒకరు: మహేష్ బాబు జయప్రకాశ్‌రెడ్డి గారి మరణం ఎంతో విషాదకరం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి: జూ. ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చాలా సినిమాల్లో కలిసి నటించాను: రకుల్ ఇది చాలా బాధాకరం. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి. జయప్రకాశ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి. ఓం శాంతి: కాజల్ అగర్వాల్ జయప్రకాశ్‌రెడ్డి గారి కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలుపుతున్నా. ఓం శాంతి. -
గుంటూరు: నటుడు జయప్రకాశ్‌రెడ్డికి నివాళులు
-
ఒకే ఒక్క పాత్రతో...
విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తెలుగు చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి ఏకపాత్రాభినయం చేసి, నిర్మించిన సినిమా ‘అలెగ్జాండర్’. ధవళ సత్యం దర్శకుడు. జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా నాకు నాటకాలంటే ప్రాణం. అదే నన్ను సినిమా నటుణ్ణి చేసింది. వన్ మ్యాన్ షో చేద్దామని రచయిత పూసలకు చెబితే ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. వంద నిమిషాల నిడివితో ఉండే కథతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 ప్రదర్శనలు ఇచ్చాను. ఆ కథనే సినిమాగా తీద్దామని ధవళ సత్యం దర్శకత్వంలో నటించాను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది ప్రేక్షకులకు చేరువకావడం కష్టం. ఆ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ సినిమాను ఎవరైనా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారేమోనని చూస్తున్నాం. రిటైర్డ్ మేజర్ ఒక హెల్ప్‌లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథలో కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి ఒక్కడే పాత్రధారి కావడం విశేషం. అయితే వెనక నుంచి వచ్చే కొందరు నటుల మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి’’ అన్నారు ధవళ సత్యం. -
అలెగ్జాండర్ ఒక్కడే
నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు సంపాదించారు జయప్రకాశ్ రెడ్డి. ఆయన ముఖ్య భూమిక పోషించిన చిత్రం ‘అలెగ్జాండర్’. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి మాత్రమే నటించటం విశేషం. కొన్ని వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న జయప్రకాశ్ రెడ్డి ఒకే పాత్ర ఉన్న చిత్రంలో హీరోగా నటించిన చిత్రం ఇది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. -
సీఎల్పీ నేతగా అవకాశమిస్తే న్యాయం చేస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తే న్యాయం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారతారని తాను అనుకోవడం లేదన్నారు. కొందరికి కొన్ని బలహీనతలున్నాయని, వాటిని తెలుసుకుని అండగా ఉంటే ఎవరూ పార్టీని వీడివెళ్లరని చెప్పారు. పార్టీ వీడాలనుకునే వారిని గుర్తించి వారితో పాటు కేడర్‌కు ధైర్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కుంతియా, ఉత్తమ్‌తో పాటు హైకమాండ్ రంగంలోకి దిగి ఇందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయినందునే ఓడిపోయామని చెప్పారు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో తన గెలుపునకు కూడా అన్ని కారణాలున్నాయన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం తన భార్య నిర్మలకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరనున్నట్టు ఆయన చెప్పారు. తన కుమార్తె జయను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచన లేదని, ఎన్ఎస్యూఐలో క్రియాశీలకంగా పనిచేయించి సంస్థాగతంగా ఆమెను చురుకుగా తయారు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. -
‘కేసీఆర్, హరీశ్‌లను అరెస్ట్ చేయాలి’
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసు లో కేసీఆర్, హరీశ్‌రావులను కూడా అరెస్టు చేయాలని మాజీ ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) సతీమణి నిర్మల డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీశ్‌రావులను వదిలిపెట్టి తన భర్తను అక్రమంగా ఇరికించారన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని బుధవారం ఆమె ములాఖత్‌లో కలసి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోంచి మాటలు స్పష్టంగా వినపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మచ్చలేని మనిషి అని కేసీఆర్ ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసన్నారు. జగ్గారెడ్డిని కలిసినవారిలో కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కూతురు జయలక్ష్మీ ఉన్నారు. -
మార్తాండం ఇక్కడ
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...అంటూ తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తోన్న పృథ్వీ హీరోగా రూపొందిన చిత్రం ‘మైడియర్ మార్తాండం’. హరీష్ కె.వి దర్శకత్వంలో మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత సయ్యద్ మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ టైటిల్ పాత్రలో నటించారు. ముఫ్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా? అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్. క్రైమ్ కామెడీగా కోర్ట్ రూమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మరి.. మార్తాండం ఇక్కడ అంటూ ఈ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై పృథ్వీ ఎలా రెచ్చిపోతారో చూడాలి. జయ ప్రకాశ్‌రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్ తదితరులు నటించిన ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. -
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
సంగారెడ్డి టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టీపీసీసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలోని జగ్గారెడ్డి స్వగృహం నుంచి ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ పక్కన గల రాంమందిర్ కమాన్ వద్ద డీఎస్పీ తిరుపతన్న నేతృత్యంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జగ్గారెడ్డితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, జిల్లాలో ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం సరికాదన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులు, ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కరించగలదన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జీమ్యాథుస్, నాయకులు కుమార్, సంజీవ్, కూన సంతోష్‌కుమార్, నగేష్, భిక్షపతి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఏ దుస్తులు వేసుకోవాలో అడగాలి: నటుడు
ఆర్టిస్టులకు నిలువుటద్దం మాయాబజార్ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఘనంగా మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవం సాక్షి, నాంపల్లి : మాయాబజార్ చిత్రంలోని ఏ సన్నివేశం చూసినా నటించే నటన ఎంతో సహజంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు ఆ అవకాశం లేదని సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో షూటింగ్‌కు వెళ్లాక ఈ రోజు నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి బాబు అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదికానీ నెలజీతం కోసం కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసేవారన్నారు. సాహిత్య సంగీత సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో విజయ వారి మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్ర విశ్లేషకులుగా హాజరైన జయప్రకాష్‌రెడ్డి, రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకులు ఎస్. గోపాల్‌రెడ్డి, నాట్య కళాకారిణి శోభానాయుడు, సినీనటులు తనికెళ్ల భరణి, ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాస్, శాంతా బయోటెక్ అధినేత కెఐ వరప్రసాదరెడ్డి, బి. వెంకటరామరెడ్డి, బి. భారతిరెడ్డి హాజరై విశ్లేషించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో సహజంగా నటించే సన్నివేశాలు లేవనన్నారు. ప్రతి ఆర్టిస్టుకు మాయాబజార్ చిత్రం ఓ నిలువుటద్దం లాంటిదన్నారు. సావిత్ర శశిరేఖ లాగా నటించడమంత గొప్పది కాదేమో కానీ, ఘటోత్కచునిగా నటించడం మాత్రం చాలా గొప్ప సన్నివేశమన్నారు. ప్రతి పాత్రకు జీవం పోసిన చిత్రం మాయాబజార్ మరువలేనిదిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ హ్యూమర్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో పిబరే హ్యూమరసం కడుపుబ్బా నవ్వించే ఆరోగ్యదాయకమైన సభ్యతతో కూడిన లఘు ప్రహసనాల కార్యక్రమం జరిగింది. -
శివమ్ ప్రకాశమ్!
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు... మరి సినిమా స్టార్స్?!.. ఆ.. వీళ్లకు పక్క నుంచి ఓ లైట్, పై నుంచి ఓ లైట్, ఫ్రంట్ నుంచి ఓ లైట్ వేస్తే కానీ మెరవరు... అయితే, స్వయం ప్రకాశాన్ని కట్ చేస్తే... శివం ప్రకాశమ్ ఎందుకొచ్చిందో.. ‘సంతోషం సంబరమైతే.. ఆనందమే తాండవిస్తే... శివుడు ప్రకాశం అంటున్నారు’ జయప్రకాశ్‌రెడ్డి అందరూ కష్టాల్లో దేవుణ్ణి తలుచుకుంటే... తను సంతోషంలో దేవుణ్ణి దర్శిస్తుంటారు. ‘‘జయ ప్రకాశం జయ ప్రకాశం నా బతుకే శివప్రకాశం.. సాక్ష్యం భూమి, ఆకాశం.. సదాశివునిపై భక్త్యావేశం... ’’ సినిమాల్లో విలన్‌గా మనకు తెలిసిన జయప్రకాశ్‌రెడ్డి శివగానం చేస్తుంటే ఆశ్చర్యంతో చూస్తుండిపోయాం. హైదరాబాద్ మోతీనగర్‌లోని జయప్రకాశ్‌రెడ్డిని కలిసి, మీ ఇష్ట దైవం గురించి చెప్పమని అడిగినప్పుడు పాటతో ఇలా పరవశించిపోయారాయన. ♦ ఇంత అద్భుతంగా పాడుతున్నారు. సదాశివుడు మీ దైవం ఎప్పుడయ్యాడు? తాతల నాటి నుంచి మా కుల దైవం శివయ్యే! ఇప్పటికీ ఇంట్లో రోజూ ఉదయం దీపారాధన చేస్తుంటాను. అలాగని మిగతా దేవుళ్లను తక్కువ చేయను. సోమవారం శివయ్య, మంగళవారం ఆంజనేయస్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయి బాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర్లు, ఆది– సోమ మళ్ళీ శివయ్య.. ఏది జరిగినా ‘ఈశ్వరా’ అనుకోవడమే శ్వాస. ♦ కష్టంలోనూ శివయ్యనే తల్చుకుని గట్టెక్కారా? ముప్పై ఏళ్ళ కిందటి వరకు అష్టకష్టాలే. బి.ఎస్సీ బీఈడీ చదువుకున్న నేను మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేవాడిని. నాటకాలు నా ప్రాణం. ఒకసారి దాసరి నారాయణరావు గారు నా నాటకం చూసి ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో టీచర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మద్రాసుకు వెళ్లాను. ఆ తర్వాత చిన్నా చితక వేషాలు ఉన్నా రాబడి ఏమీ లేదు. నాకు ఓ కొడుకు, కూతురు. వాళ్లు స్కూల్ నుంచి కాలేజీ చదువులకు వస్తున్నారు. ఫీజులు, కుటుంబ ఖర్చులు పెరగుతున్నాయి. బాగా అప్పులయ్యాయి. కుటుంబం ఎలా గడుస్తుందని భయం. ‘ఎలారా దేవుడా’ అనుకున్నప్పుడు ఉద్యోగమే మేలని ఊరొచ్చేశాను. ప్రైవేట్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేస్తూ ఐదేళ్లు సినిమా రంగం గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆ టైమ్‌లో శ్రీశైలంలో జరిగే శివదీక్ష గురించి తెలిసింది. నాకూ ఆ దీక్ష తీసుకోవాలనిపించింది. నలభై ఒక్కరోజుల పాటు శివదీక్ష తీసుకున్నాను. ఈ దీక్ష తీసుకున్నవారు సరిగ్గా మహాశివరాత్రి నాటికి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్లాలి. లింగోద్భవ కాలంలో దేవాలయానికి తలపాగా చుడతారు. అది తప్పక చూసి రావాలి. అలా ప్రతి ఏటా 18 ఏళ్ల పాటు శివదీక్ష చేశాను. ఇదీ అని చెప్పలేను గానీ అప్పటి నుంచి నా దశ కూడా మారుతూ వచ్చింది. అనుకోకుండా రామానాయుడిగారి కంటపడటం ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత శ్రీరాములయ్య, ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’... అలా అలా బతుకు చిత్రమే మారిపోయింది. ఈ మూడేళ్లుగా దీక్ష తీసుకోవడం లేదు. శివయ్యకు చెప్పేశాను. ‘లక్షలాది జనం మధ్య జ్యోతిర్ముడితో రావడం కుదరడం లేదయ్యా! కరుణించు’ అని వేడుకున్నాను. అంతా ఆయనిచ్చిన అదృష్టం. ♦ ఆ అదృష్టమే మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిందా? దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అదృష్టానికి మన కష్టం తోడవ్వాలి. ‘ప్రేమంటే ఇదేరా!’ సమయంలో రాయలసీమ మాండలికంలో డైలాగులు కావాలన్నారు. నంద్యాలలో పెరిగినందుకు ఆ భాష కలిసొచ్చింది. అయినప్పటికీ మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లి టేపురికార్డర్ పట్టుకొని, అక్కడి షాపుల వాళ్లతో మాట్లాడి ఆ మాటలన్నీ రాత్రిపూట వింటూ, యాస కోసం బాగా సాధన చేసేవాడిని. ముందురోజే స్క్రిప్టు కావాలని రైటర్లను అడిగేవాడిని. వాళ్లెంత బిజీగా ఉన్నప్పటికీ నా అభ్యర్ధనను మన్నించారు. ముందుగానే స్ట్రిప్టు ఇచ్చేవారు. దానిని నేను నాదైన బాసలోకి మార్చుకుని సాధన చేసేవాడిని. ఆ కష్టం ఊరికేపోలేదు. ‘సమరసంహారెడ్డి’ సినిమాతో బాగా పేరొచ్చింది. యేటా ఏదో ఒక మంచి వస్తూనే ఉండేది. అప్పులు తీర్చుకుంటూ వచ్చాను. నన్ను నిమ్మి ఆ సమయంలో జనాలు కూడా సాయం చేసేవారు. ♦ మనుషుల్లో దైవత్వాన్ని ఎప్పుడు చూశారు? ఎక్కడో కాదు. ఇంట్లోనే. మా నాయిన సాంబిరెడ్డిలో చూశాను. ఆయన నాకు సాక్షాత్తు శివయ్యే! మా నాయిన పోలీసు ఆఫీసర్. విపరీతమైన నిజాయితీపరుడు. ఆయన కొలీగ్స్ అంతా సంపాదించుకుంటే ఈయన మాత్రం తాతల ఆస్తిని అమ్మేసుకున్నాడు కుటుంబ పోషణకు. వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. జనం ఆయన్ని ఓ దేవుడిలా చూసేవారు. పెద్ద పెద్ద వాళ్లు ఎంతో గౌరవంగా చూసేవారు. అలా బతకాలి అనిపించేది. మా నాన్న నాకు చెప్పింది నేర్పింది ఒక్కటే ఆత్మసంతృప్తి. ‘ఒరేయ్, ఈ లోకంలో తిండి లేక, సరైన బట్ట లేక ఎంత మంది యాతన పడుతున్నారో చూడు. నీకు తినడానికి మూడు పూటలా తిండి ఉంది. బట్ట కట్టుకుంటున్నావ్. ఇది దేవుడు నీకు ఇచ్చిన అదృష్టం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు. పచ్చడి అయినా ఒకటే, పరమాన్నం అయినా ఒకటే అని భావించు’ అన్నాడు. ఆ స్ఫూర్తే ఆయన నాకు ఇచ్చిన ఆస్తి. అంతేకాదు, ఆయన చూపిన తోవే నన్ను ఈ రోజు ఎంతోమందికి తెలిసేలా చేసింది. మా నాన్నకు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. పోలీసాఫీసర్‌గా నాటకాలు వేయడం ఆయనకు కుదిరేది కాదు. ఎప్పుడైనా నేను ఖాళీగా కనపడితే చాలు ‘నాటకం వేయకుండా ఏం చేస్తున్నావ్‌రా!’ అని తిట్టేవాడు. ఆయనకున్న నాటకాల పిచ్చి, అభిమానం నాకూ బాగా వంటబట్టాయి. ♦ ఎప్పుడూ దైవం మీద కోపం రాలేదా? కష్టం వస్తే ‘ఈశ్వరా’ అనుకున్న రోజులున్నాయి గానీ, కోపమా?! ఎంతమాట. మొదటిసారి శ్రీశైలంలో స్వామిని కలిసినప్పుడే ఒక ధైర్యం కలిగింది. ఏదొచ్చినా శివయ్య ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు అనిపించేది. ఆ స్వామి దగ్గర నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను. కాకపోతే ‘ఇదియ్యి, అదియ్యి’ అని ఎప్పుడూ మూర్ఖంగా కోరుకోలేదు. ఫలానా పని అవలేదు అని ఎప్పుడూ తిట్టుకోలేదు. ఏ ప్రాంతానికి వెళ్లినా నన్ను ఫలానా అని గుర్తుపట్టేస్తారు. అంతకుమించి ఏం కావాలండీ! ♦ ఆలయాలకు ఎప్పుడెప్పుడు వెళుతుంటారు? ఆలయం విషయం వస్తే.. ముందు నలభై ఏళ్ల కిందటి సంఘటన ఒకటి చెప్పాలి. మా అమ్మమ్మ ఊరు వెళ్లాను. ఇంటికి కావల్సినవి ఏవో కొనుక్కురమ్మన్ని మార్కెట్‌కి పంపించారు. మార్కెట్‌కి బస్‌స్టాప్ మీదుగ వెళ్లాను. అక్కడ శ్రీశైలం బోర్డున్న బస్సు కనిపించింది. అప్పటి వరకు శ్రీశైలం గురించి విని ఉన్నాను. కానీ, ఎప్పుడూ వెళ్లింది లేదు. ఎవరో మంత్రం వేసినట్టు వెళ్లి ఆ బస్సులో కూర్చున్నాను. శ్రీశైలం చేరుకున్నాను. అక్కడ స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ.. నా తలను శివ లింగానికి తాకించారు. అంతే, ఒక్క క్షణం.. ఓ తెలియని విద్యుత్తు ఏదో ఆ లింగం నుంచి నా నుదుటి ద్వారా ఒళ్లంతా పాకినట్టు అనిపించింది. దానిని ఇన్నేళ్లు అయినా మర్చిపోలేను. ఒక అలౌకికమైన ఆనందం. ఆ రాత్రి అక్కడి సత్రంలోనే బస చేసి, ఉదయాన్నే మళ్ళీ దర్శనం చేసుకొని ఊరొచ్చాను. అప్పుడు ఫలానా చోట ఉన్నానని చెప్పడానికి ఫోను సదుపాయం లేదు. మా ఇంట్లో వారంతా ఏడుపులు.. పిల్లాడు ఎక్కడికి పోయాడో అని. ఇప్పుడైతే.. సంతోషంగా ఉన్నప్పుడు. దేవుడికి కృతజ్ఞత చెప్పాలనిపించినప్పుడల్లా తప్పక వెళతాను. శ్రీశైలమే కాదు తిరుపతికి, శిరిడీకి కూడా వెళుతుంటాను. ♦ మీలో దైవత్వాన్ని చూసినవారి గురించి... మా నాన్న చేసినంత సాయం నేను చేయలేదు. నా పరిధిలో ఉన్నంతవరకు మా జూనియర్ ఆర్టిస్టుల పిల్లలకు చదువులు చెప్పించాను. చెప్పిస్తుంటాను. వాళ్ల చేతికి డబ్బు ఇవ్వను. కాలేజీ, స్కూళ్లకు వెళ్లి ఫీజులు కట్టివస్తుంటాను. 40 సంవత్సరాల క్రితం నాతో పనిచేసిన టీచర్లు ‘నువ్వేం మారలేదయ్యా’ అంటుంటారు. అదే నాకు ఆనందం. ♦ విశ్రాంతి జీవితంలో దైవం ఆలంబన? నా వయసు 71. ఈ రోజుకీ బీపీ కూడా లేదు. ఉపాధ్యాయుడిగానూ, నటుడిగానూ రాణించగలిగాను. ప్రతి నెలా నాటక పరిషత్ ద్వారా నాటకాలు వేయిస్తుంటాను. నాకు ఎంతో ఇష్టమైన ‘అలెగ్జాండర్’ నాటకాన్ని ఇప్పటికీ వేస్తుంటాను. పిల్లల జీవితాలు బాగున్నాయి. నన్ను అర్థం చేసుకునే అర్ధాంగి ఉంది. దేవుడి దయ వల్ల పెన్షన్ వస్తుంది. ఇది లేదు అనే దిగుల్లేదు. ఇప్పటికీ ఏమీ లేకపోయినా శ్రీశైలం వెళితే.. అక్కడి సత్రంలో ఓ గది ఇస్తారు. నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే చాలు భోజనం పెడతారు. పొద్దునే ఓం నమఃశివాయ అని వినిపిస్తూ ఉంటుంది. ఇంక ఏం కావాలి? మనం సంతోషంగా ఉండాలనే దైవం కోరుకుంటుంది. అందుకే వర్రీస్ గురించి వర్రీ అవ్వద్దు. ♦ శివయ్య గురించి అంత బాగా గానం చేశారు. ఎలా వచ్చింది ఆ పాట..? శివయ్య మీద ఉన్న భక్తి భావాలను పేపర్ మీద పెట్టడానికి చాలా ప్రయత్నించాను. కానీ, అద్భుతంగా కీర్తిస్తూ రాయలేను. నా జీవితాన్ని నడుపుతున్నది శివయ్యే! ఆయన మీద నోరారా పాటలు పాడుకోవాలి ఎలా అని పరితపించాను. రచయిత జొన్నవిత్తులను అడిగాను. మహానుభావుడు పైసా అడగలేదు, ఆరుపాటలు రాసిపెట్టాడు. వీణాపాణి బాణీలు కట్టారు. ఆ పాటలు పాడి ‘శివ ప్రకాశం’ పేరుతో ఆల్బమ్ చేయించాను. నాకు పాటలు రాయడం, సంగీతం, గానం రావు. కానీ, భావం– భక్తి ప్రధానం అని నమ్మి పాడాను. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఇష్టదైవంపై గానామృతం
- శివ ప్రకాశం పేరుతో గానం - ఈ నెల 24న హైదరాబాద్‌లో విడుదల - సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ఇష్టదైవమైన శివునిపై శివప్రకాశం పేరుతో పాటలు గానం చేసినట్లు సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. దీంతో తన చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. తన గానామృత సీడీలను ఈ నెల 24న హైద్రాబాద్‌లోని ఫిలిమ్ చాంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి బంధువు, స్నేహితుడైన ఏడీఏ రమణారెడ్డి, ఇతర వ్యవసాయ సిబ్బందితో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు యాక్టింగ్, డైలాగ్స్ మాత్రమే చూశారని, ఇపుడు మొదటి సారిగా శివునిపై పాడిన భక్తి పాటలు వింటారని తెలిపారు. విద్యార్థి దశనుంచే పాటలు పాడటం హాబీగా ఉందని, అయితే శివునిపై భక్తి పాటలు పాడాలనే చిరకాల వాంచ ఇప్పటికి నెరవేరిందన్నారు. జొన్నవిత్తల రచించిన ఆరు పాటలను, వీణపాణి సంగీత దర్శకత్వంలో గానం చేసినట్లు తెలిపారు. లక్ష్మిదేవికి ఒక లెక్కుంది అనే మూవీలో ఒక పాట పాడినప్పటికి అది పాపులర్ కాలేదన్నారు. ఇప్పటి వరకు 300కు పైగా సినిమాల్లో నటించినట్లు తెలిపారు. నాటక రంగం కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పిన జయప్రకాశ్‌రెడ్డి ఇటీవల గుంటూరులో ప్రత్యేక నాటక సమాజాన్ని స్థాపించామని వివరించారు. కర్నూలు జిల్లా శిరువెల్ల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన తాను గ్రామంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇస్తుంటానని తెలిపారు. ఆయన వెంట సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆశా కూడా ఉన్నారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఏఓ శివశంకర్ తదితరులతో ఆయన కలిశారు. -
మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష
-
మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష
-10 నుంచి సంగారెడ్డిలో నిరశన -అవసరమైతే సుప్రీం కోర్టుకు -కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి వెల్లడి సంగారెడ్డి మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 10 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే పార్టీ పక్షాన సుప్రీం కోర్టును ఆశ్రరుుస్తామన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు సంగారెడ్డిలోని ఐబీ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటాన్ని చూస్తే న్యాయవ్యవస్థపై కూడా విశ్వాసం లేకుండా పరిపాలన సాగిస్తోందన్నారు. తాము రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్ష కోసం ఇప్పటికే తమకు అనుమతి ఇవ్వాలని పోలీసుశాఖను కోరామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోన్నం శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒకే వేదికపైకి అన్ని కళాపరిషత్‌లు
ఆ దిశగా కృషి చేస్తున్నామన్న పరుచూరి వెంకటేశ్వరరావు పల్లెకోన (భట్టిప్రోలు): రాష్ట్రంలోని అన్ని కళాపరిషత్‌లు కలిపి ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పరుచూరి రఘుబాబు మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం పల్లెకోనలో నిర్వహిస్తున్న అఖిల భారత నాటకోత్సవాలకు హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దాతల సహకారంతో రూ 1.10 కోట్ల వ్యయంతో పల్లెకోనలో కళా మండపం నిర్మించామన్నారు. స్థల దాత వేములపల్లి సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఖమ్మం, పల్లెకోనలో నాటకోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సినీనటులు తనికెళ్లభరణి, రఘుబాబు, రావు రమేష్, 2న ‘శరణం గచ్ఛామి’ చిత్ర యూనిట్ విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఆడిటోరియం ఏర్పాటు వెనుక పరుచూరి బ్రదర్స్ కృషి అనిర్వచనీయమన్నారు. 26 ఏళ్లుగా నాటకోత్సవాలు నిర్వహించటం ముదావహని పేర్కొన్నారు. ‘ప్రేమించుకుందాంరా’’ సినిమాలో రాయలసీమ మాండలికం డైలాగులు పెట్టాలని సూచించిన వెంటనే పరుచూరి బ్రదర్స్ ఆచరించారని తెలిపారు. సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనుమలు వెలగపూడి రఘు ఆదిత్య, వేదవ్యాస్, ట్రస్ట్ కోశాధికారి డాక్టర్ వెలగపూడి రాజగోపాల్ పాల్గొన్నారు. -
నేడు జయప్రకాశ్‌రెడ్డి పుట్టినరోజు!
-
నవ్వుల విలన్!
-
నల్లగొండతో విడదీయరాని బంధం
నల్లగొండ అర్బన్ : రాయలసీమ ఫ్యాక్షనిజం డైలాగులు పలికించాలన్నా, తెలంగాణ యాసను, కోస్తాంధ్ర భాషను అలవోకగా నోట నర్తించాలన్నా ప్రముఖ సినీ, నాటకరంగ కళాకారుడు తాడిపర్తి వీరజయప్రకాశ్రెడ్డికే (జేపీ) సాధ్యం. నాటక రంగ కళాకారుడిగా ఎన్నో ఉత్తమ ప్రదర్శనలిచ్చి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినీ రంగంలో కూడా విలనిజం, హాస్యరసం పండిస్తూ విలక్షణ నటుడుగా కొనసాగుతున్నారు. తండ్రి పోలీసుశాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు 1979 నుంచి 1981 వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశారు. ఆయనకు సినీరంగ అవకాశమొచ్చిందీ ఇక్కడినుంచే.. అందుకే తన జీవితానికి నల్లగొండతో విడదీయరాని సంబంధముందని చెబుతుంటారు. సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నటనంటే నాకు ప్రాణం, సినీ నటుడిగా వేషాలేస్తున్నా గానీ టీచర్‌గా పని చేశానని చెప్పుకోవడానికే గర్వపడతాను. ఆ రోజుల్లో మేం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే గడిపేవాళ్లం. తల్లిదండ్రుల బాధ్యత కూడా మాదే అన్నట్లుగా పిల్లలను లాలించి, బుజ్జగించి, అవసరమైతే మందలించేది. ఈ రోజు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావడం ఆనందంగా ఉంది. ఎప్పుడూ 100 శాతం ఫలితాలు వచ్చేవి., ఎప్పుడో ఓసారి కాదు, ఈ పాఠశాలలో ఎప్పుడూ 100 శాతం ఫలితాలను సాధిం చిన విద్యార్థులున్నారు. అప్పటి ప్రిన్సిపాల్ బ్రధర్ జోయిస్ డానియల్ పనితీరు గొప్పగా ఉండేది. అప్పటికీ ఈ స్కూల్లో ఎయిడెడ్ అవకాశం లేదు. అనుకోకుండా గుంటూరు మున్సిపల్ స్కూల్లో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం లభించింది. సినిమాల్లో నటించడం వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నాను. ఇప్పటికీ ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నాను. సినీ రంగంలో రాణించలేవన్నారు. మక్కుసూటిగా వెళ్లే నీకు అవకాశాలు కష్టం, రాణించలేవని మా నాన్న హెచ్చరించేవారు. ముందొక మాట, వెనకొకమాట చెప్పే సమర్థత లేకపోతే అక్కడ కష్టమని ఆయన భావన. పలు అనుభవాలు ఎదుర్కొన్నా, రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకోగలిగాను. మాది చిన్న కుటుంబం... నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మాయి గృహిణి, అల్లుడు ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అబ్బాయి ఇటీవలే అమెరికా నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నాడు. సినిమాల్లో ప్రవేశించాలనే ఆలోచన ఏ కోశాన లేదు. అతడికి అంతకన్నా ఆసక్తి లేదు. నాలుగు నందులు.... నా నట జీవితంలో వందలకొద్ది అవార్డులు అందుకున్నాను. 2000 సంవత్సరంలో జయం మనదేరా సినిమాలో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. నాటక రంగంలో రాణి రుద్రమ, వేట, కొత్త సైన్యం అనే సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి. దాదాపు 265 సినిమాల్లో నటించా... నేను ఇప్పటి వరకు 265 సినిమాల్లో నటించాను. 1984లో సినిమా అవకాశం వచ్చాక 1992 వరకు 25 సినిమాల్లో నటించగలిగాను. కానీ ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ రంగాన్ని అర్ధంతరంగా వదిలేసి మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ చేసిన అ ప్పులు తీర్చుకున్నాను. 1997లో ప్రేమించుకుందాం రా అనే సినిమా ద్వారా రామానాయుడు గారు మరో అవకాశం కల్పించారు. 1999లో సమర సింహారెడ్డి సినిమా ద్వారా మళ్లీ సినిమా రంగంలో నిలదొక్కుకోగలిగాను. సినిమాలకన్నా నాటికలు కష్టం... సినిమాల్లోకన్నా నాటికల్లో నటించడం చాలా కష్టం. అయినా నాకు రంగస్థలం అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ టేక్‌లు ఉండవు. ప్రేక్షకులు చూస్తుంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అప్రతిష్ట తప్పదు. సెకండ్ టేక్‌లు ఉండవు. చాలా ప్రాక్టీస్ జాగ్రత్తగా ప్రేక్షకులను మెప్పించేలా సంకల్పంతో నటించాల్సి ఉంటుంది. ఫ్యాక్షనిజం సినిమాలకు నేను ఆద్యుడిని... ఫ్యాక్షనిజం సినిమాలు నాతోనే ఆరంభమయ్యాయి. ఊపందుకున్నాయి. పక్కాగా రాయలసీమ భాష మాట్లాడగలగడం నా అదృష్టం. భాష రాని వారు ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్లుగా ఎక్కువ కాలం నిలబడలేరనేది నా అభిప్రాయం. రాయలసీమ భాషకు ప్రత్యేక గుర్తింపు తె చ్చిన నేనంటే ఆ ప్రాంతం వారికి ప్రాణం. వారి యాసలో మాట్లాడటం నా ప్రత్యేకత, ఒక్క రాయలసీమ యాసే కాదు, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలపై నాకు పట్టుంది. నాకు చదువు చెప్పడమన్నా, నటించడమన్నా చాలా ఇష్టం. 30 ఏళ్లు చదువు చెప్పా, 30 ఏళ్లుగా నటిస్తున్నా. సమాజానికి ఉపయోగపడే పాత్రలకు ప్రాధాన్యమిస్తూ నటనను కొనసాగించాలనేది నా లక్ష్యం. నటనకు తొలి అడుగు పడింది నల్లగొండలోనే... సినీ రంగంలోకి వెళ్లేందుకు తొలి అడుగు ప డింది నల్లగొండలోనే. ఇది నా సొంత భూ మి, ఈ జీవితాన్నిచ్చిన గడ్డ, ఇక్కడికొస్తె సొంత ఇంటికొచ్చినట్లు అనిపిస్తుంది. 19 84లో అనుకుంటా నల్లగొండ జిల్లా పరిషత్ ఆవరణలో ప్రజా పోరు పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘గప్‌చుప్’ అనే నాటికను ప్రదర్శించాను. ఆ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి నారాయణరా వు, సినీ నిర్మాత రామానాయుడు ద్వారా బ్రహ్మపుత్రుడు సినిమాలో అవకాశం కల్పించారు. -
మా టీచరమ్మ దయవల్ల..
అరచేతిని తిరగేయమని వేళ్ల ముడుసులపై చెక్క స్కేలుతో కొడుతుంటే.. టీచరమ్మపై భలే కోపం వచ్చేది. అదే టీచరు మధ్యాహ్నం భోజనం సమయంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆమె తెచ్చుకున్న కూరలేసి అన్నం పెట్టినపుడు అమ్మ గుర్తుకొచ్చేది. ఆ టీచర్ పేరు ఆరోగ్యమ్మ. ఓనమాలు నేర్చుకున్నప్పటి నుంచి ఆమె కన్నుమూసేవరకూ ఆమెతో నాకు అనుబంధం కొనసాగింది. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లో నన్ను చేర్చేసరికి ఆ స్కూల్లో ఆరోగ్యమ్మ టీచర్ ఒక్కరే ఉన్నారు. అంటే సింగిల్ టీచర్ స్కూలన్నమాట. మా నాన్నగారు సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. ఇన్స్పెక్టర్ గారి అబ్బాయినని మిగతావారంతా కాస్త గారంగా చూసేవారు. పైగా ఇంట్లో నేనే పెద్దవాడ్ని. నాకు పన్నెండో ఏటప్పుడు చెల్లి పుట్టింది. అప్పటివరకూ ఇంట్లో, బయటా నేనే హీరోని. మా టీచరమ్మ దగ్గర మాత్రం ఎలాంటి పప్పులు ఉడికేవి కావు. అక్షరం నేర్పే దగ్గర ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఆమె ఒక్కరే అన్ని క్లాసులు చెప్పేవారు. నా జీవితంపై ఆరోగ్యమ్మ టీచర్ ప్రభావం చాలా ఉంది. నిజంగా ఆమె చాలా గొప్ప మనిషండి. ఐదోతరగతి తర్వాత నేరుగా ఎనిమిదో తరగతిలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ పరీక్షకు నన్ను ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడింది. ఆమె కోరుకున్నట్టే నేను పరీక్ష బాగా రాసి రంగనాయకులపేటలోని హైస్కూల్లో చేరాను. ఆ తర్వాత కూడా ఆమెను కలుస్తుండేవాడ్ని. నేను పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరాను. అక్కడ టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం నాపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు నేను, నా స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశాం. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. నా స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. నేను మాత్రం చాలా ఫీలయ్యాను. మూడురోజులు బెంగపెట్టుకున్నాను. ఆ బాధ, కసి కారణంగానే నేను నటుణ్ణయ్యాను. ఒకవేళ మా గుండాచారి మాస్టారు నేను చెప్పిన డైలాగులు విని బాగానే ఉన్నాయంటే.. నా యాక్టింగ్ పార్ట్ అక్కడితోనే ముగిసిపోయేదేమో. టీచరయ్యాక కూడా... నేను బీఎస్సీ బీఎడ్ పూర్తిచేశాక గుంటూరు మున్సిపల్ హైస్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. పాతికేళ్ల పాటు టీచర్‌గా పనిచేశాను. తర్వాత ఐదేళ్లు హెడ్మాస్టర్గా చేసి ‘నర్సింహనాయుడు’ సినిమా టైమ్‌లో రిటైర్ అయ్యాను. టీచర్‌గా ఉద్యోగం వచ్చాక కూడా అప్పుడప్పుడు మా ఆరోగ్యమ్మ టీచర్ని చూడ్డానికి నెల్లూరు వెళ్లేవాడ్ని. చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకునేవాడ్ని. పదేళ్లక్రితం ఆమె చనిపోయినపుడు వెళ్లాను. ఆ సమయంలో నేను బాధపడింది.. ఓనమాలు నేర్పిన గురువుకి దూరమైనందుకే కాదు.. ఆమె చిన్నప్పుడు పెట్టిన అన్నం ముద్దల అనురాగానికి కూడా! ..:: భువనేశ్వరి -
పరువు ప్రతిష్ట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(కేడీసీసీబీ)పై పట్టుకు తెలుగుతమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత చైర్మన్ కాంగ్రెస్ నేత కావడంతో.. అధికార బలంతో కైవసం చేసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చైర్మన్ పదవిని సవాల్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరువు కోసం ఒకరు.. ప్రతిష్ట కోసం మరొకరు బరిలోకి దిగుతున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే టీడీపీ నేతలు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చించనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. టీడీపీకి ఎంత మంది డెరైక్టర్లు మద్దతిస్తారనే విషయంలో స్పష్టత ఆధారంగా బుధవారం లోపు అవిశ్వాసానికి నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలాఉంటే నోటీసుకు ముందే టీడీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. కొందరు డెరైక్టర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించినట్లు తెలిసింది. కర్నూలు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాలకవర్గానికి 2013లో ఎన్నిక నిర్వహించారు. వివిధ సహకార సంఘాల నుంచి 21 మంది డెరైక్టర్లు ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 16 మందికి పైగా ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. మిగిలిన గొర్రెలు, చేనేత సంఘాలు, హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా ఐదుగురు డెరైక్టర్లు కూడా కాంగ్రెస్‌కు అనుకూలురే విజయం సాధించారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అండతో చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డెరైక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కొందరు ఒకప్పుడు టీడీపీ నేతలకు అనుచరులుగా ఉన్నారు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు ప్రస్తుతం టీడీపీలో ఉన్నందున డెరైక్టర్లతో బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఇష్టం లేకపోయినా మద్దతిచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే మాజీ మంత్రి కోట్ల కేడీసీసీబీపై పట్టును కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ మేరకు టీడీపీకి మద్దతిస్తున్న డెరైక్టర్ల వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు వినికిడి. ఓ మాజీ మంత్రి ఎమ్మెల్సీ కోసమే జెడ్పీని, కేడీసీసీబీని టీడీపీకి కట్టబెట్టే విషయంలో శ్రద్ధ పెట్టినట్లు తెలుసుకున్న కోట్ల ఆయన ఎత్తులను చిత్తు చేసేందుకు రంగంలోకి దిగినట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. తమ ‘చేతి’లోని కేడీసీసీబీ చైర్మన్ పదవిని కోల్పోతే జిల్లాలో పెద్దాయనకు విలువుండదని.. ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదని కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ పెట్టబోయే అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేడీసీసీబీపై ఎవరు పట్టు సాధిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. -
రుణమాఫీపై రాద్దాంతం తగదు
కేసీఆర్ సీఎం కావడం సంతోషకరం: జగ్గారెడ్డి సంగారెడ్డి, న్యూస్‌లైన్: పంట రుణాలమాఫీ అంశాన్ని ఇప్పుడే రాద్దాంతం చేయటం సరికాదని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే తాను స్పందిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మెదక్ జిల్లాకు చెందిన కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన చొరవ చూపాలని కోరారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను విశ్వసించి జిల్లా ప్రజలు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్లు ఆయన వివరించారు. -
లొంగిపోయిన జగ్గారెడ్డి
హైదరాబాద్, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మూడు రోజుల క్రితం కంటోన్మెంట్ గన్‌రాక్ గార్డెన్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను వారికి సెల్ఫోన్లు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తూ జగ్గారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో జగ్గారెడ్డితోపాటు మరో ముగ్గురు కూడా కార్ఖానా పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. వీరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. -
ముగిసిన ఏఐసీసీ పరిశీలన
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరిరోజైన ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌తో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఏఐసీసీ పరిశీలకుడిని కలుసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విప్ జయప్రకాశ్‌రెడ్డి కోరగా జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యే అయిన తనకు మారో మారు పటాన్చెరు నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కోరారు. మరోవైపు పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిశారు. ఇదిలాఉండగా.. డిప్యూటీ సీఎం సతీమణి పద్మినీదామోదర ఏఐసీసీ పరిశీలకుడిని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే పద్మినీ దామోదర కానీ, ఆమె మద్దతుదారులు కానీ ఏఐసీసీ పరిశీలకుడిని కలవలేదు. దీంతో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు. పార్టీ పరిస్థితి ఆరా మంత్రి సునీతారెడ్డి తన మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కలిశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు తమ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాల్సిందిగా కోరారు. మంత్రి సునీతారెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీసినట్టు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని బస్వరాజ్‌పాటిల్ అడుగగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి లాభిస్తుందని మంత్రి సూచించినట్టు తెలిసింది. విప్ మద్దతుదారుల హల్చల్ విప్ జయప్రకాశ్‌రెడ్డి మద్దతుదారులు హల్చల్ చేశారు. తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, బొంగుల రవి, గోవర్ధన్‌నాయక్, షేక్‌సాబేర్, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి స్థానం నుంచి జయప్రకాశ్‌రెడ్డికి మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇదిలా ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజయ్య సంగారెడ్డి నుంచి టికెట్ కోరేందుకు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసేందుకు ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డితో కలిసి రాజయ్యను కలిసినట్లు సమాచారం. విరమించుకోవాలని రాజయ్యకు నచ్చజెప్పినట్లు తెలిసింది. పటాన్చెరు టికెట్ కోసం పోటీ పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు పరిశీలకుడిని కలిశారు. మరోమారు అవకాశం ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ కోరగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మరికొం దరు మద్దతుతెలిపినట్టు సమాచారం. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదర్శ్‌రెడ్డి యూత్‌కాంగ్రెస్ కోటాలో తనకు పటాన్చెరు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కార్పొరేటర్ పుష్పనగేశ్ యాద వ్ కాంగ్రెస్ నాయకులు శంకర్‌యాదవ్, బాల్‌రెడ్డి, డోకూరి రామ్మోహన్‌రెడ్డి, బాశెట్టి అశోక్‌లు టికెట్ కోసం పోటీపడ్డారు. -
పద్మిని దామోదర అడుగులెటు?
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజకీయ అరంగేట్రం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి నుంచే పోటీ చేస్తారని కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పద్మిని కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు తన వద్దకు వచ్చే స్థానిక నేతలకు తోచిన సాయం చేస్తున్నారు. మరోవైపు జయప్రకాశ్‌రెడ్డిని విభేదిస్తున్న చాలామంది సంగారెడ్డి నేతలు ఎలాగైనా రానున్న ఎన్నికల్లో పద్మినీ దామోదర్‌ను తమ నియోజకవర్గం నుంచే బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ ఎదుట ప్రస్తావించి ఆయన్ను ఒప్పించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్ పాటిల్ ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల దృష్టంతా ఆదివారం జరగనున్న ఏఐసీసీ పరిశీలకుడి భేటీపైనే కేంద్రీకృతమై ఉంది. సంగారెడ్డి టికెట్ ఆశించినట్లయితే ఆమే స్వయంగా ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి అవకాశం ఉంది. ఆమె సంగారెడ్డి టికెట్‌పై అంతగా మక్కువ చూపకపోతే మాత్రం ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలే ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి సంగారెడ్డి టికెట్ గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు జరగకపోతే మాత్రం ఆమె రాజకీయ అరగేంట్రంపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. బలప్రదర్శనకు సిద్ధమైన జయప్రకాశ్‌రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ ఆదివారం సంగారెడ్డికి రానున్న నేపథ్యంలో విప్ జయప్రకాశ్‌రెడ్డి తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆయన, తన మద్దతుదారులతో కలిసి ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడిని భేటీకానున్నట్లు సమాచారం. భారీ జన సమీకరణతో ఏఐసీసీ పరిశీలకుని ఎదుట తన సత్తా చాటిచెప్పి తద్వారా మరోమారు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకోవాలని జయప్రకాశ్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు సమాచారం. -
సీఎం పర్యటన మళ్లీ రచ్చనే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన మరోమారు రచ్చకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 26న సంగారెడ్డి నియోజకవర్గంలో సీఎం పర్యటన కోసం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అయితే సీఎం పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యలు పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. సీఎం పర్యటన ఖరారైన పక్షంలో అదే రోజు జిల్లాలో ఏదో ఒకచోట సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ జైత్రయాత్ర సభ నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పటాన్చెరు లేదా సిద్దిపేటలో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులకు సూచించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఎం జిల్లాలో పర్యటిస్తే ఆ ప్రభావం తమపై పడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో వారు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో జరుగుతున్న రచ్చబండ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీఎం కిరణ్ ఫొటోలను తొలగించి డిప్యూటీ సీఎం ఫొటోలను పెట్టించటంతోపాటు సీఎం సందేశాన్ని చదవనివ్వటంలేదు. డిప్యూటీ సీఎం దామోదర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు సీఎం పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కిరణ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎం పర్యటన జరిగేనా? సదాశివపేట మండలం వెల్టూరులో ఈనెల 16న నిర్వహించతలపెట్టిన రచ్చబండ సమావేశంలో పాల్గొనాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సీఎం కిరణ్‌ను కోరడంతో ఆయన అంగీకరించారు. దీంతో 16న సీఎం జిల్లా పర్యటన ఖరారు కావడంతోపాటు అధికారులు యుద్ధప్రాతిపదికన సదాశివపేట, వెల్టూరు గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటనను డిప్యూటీ సీఎం, జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం పర్యటనను వ్యతిరేకించటంతోపాటు ఆయన హాజరయ్యే కార్యక్రమానికి దూరంగా ఉండాలని డీసీసీ నిర్ణయించింది. సొంతపార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం తన పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పైచేయి సాధించినట్లు అయ్యింది. తాజాగా ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తన నియోజకవర్గానికి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నారు. వెల్టూరులో వాయిదా వేసిన రచ్చబండ సమావేశానికే సీఎంను తీసుకువచ్చి తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవాలనే భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోమారు వెల్టూరులో రచ్చబండకు హాజరు కావాల్సిందిగా జయప్రకాశ్‌రెడ్డి సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సీఎం పర్యటన 26న ఉంటుందని జయప్రకాశ్‌రెడ్డి ప్రకటించిన వెంటనే డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి సీఎం పర్యటనను అడ్డుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలు సీఎం పర్యటనను కోరుకోవడంలేదు. దీంతో జిల్లాలో పర్యటించాలన్న సీఎం రెండో ప్రయత్నం సఫలం అవుతుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
డీఈఓ x ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డీఈఓ రమేశ్ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల మధ్య నె లకొన్న విభేదాలు కాస్తా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య చీలికకు దారితీశాయి. డీఈఓ కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి డీఈఓ రమేశ్‌ను సెలవులో వెళ్లాలంటూ హెచ్చరికలు చేయటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. డీఈఓ బదిలీ విషయంలో విప్ జయప్రకాశ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు బాసటగా నిలుస్తుండగా మంత్రులు, ఎమ్మెల్యే డీఓఈ రమేశ్‌కు ‘‘మీరు ఏమి పట్టించుకోవద్దు.. పనిచేసుకోండి’’ అని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు, డీఈఓ రమేశ్‌కు మధ్య పొసగటం లేదు. డీఈఓ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగటంతోపాటు ఆందోళనకు సిద్ధమయ్యాయి. డీఈఓ అంశం ముదురిపాకాన పడటంతో కలెక్టర్ చొరవ తీసుకుని ఉపాధ్యాయ సంఘాలు, డీఈఓతో సమావేశం నిర్వహించే బాధ్యతను డీఆర్ఓకు అప్పగించారు. డీఆర్ఓ ప్రకాశ్‌కుమార్ డీఈఓ రమేశ్ సమక్షంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. అయినా డీఈఓ వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇటీవల విప్ జయప్రకాశ్‌రెడ్డిని కలిసి డీఈఓపై ఫిర్యాదు చేశారు. దీనికితోడు వారం రోజుల క్రితం విప్ జయప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు డీఈఓపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రెండు రోజుల క్రితం విప్ జయప్రకాశ్‌రెడ్డి డీఈఓ రమేశ్‌కు ఫోన్ చేసి సెలవులో వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డీఈఓ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విప్ జయప్రకాశ్‌రెడ్డి డీఈఓను హెచ్చరించినట్లు వార్తలు బయటకు పొక్కడంతో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు డీఈఓ రమేశ్‌కు సంఘీబావం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని మంత్రులు డీఈఓకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఓ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకువేసి ‘‘మీరు వచ్చాకే ఉపాధ్యాయుల పనితీరులో మార్పువచ్చింది, ఎవరి బెదిరింపులకు లొంగాల్సిన పనిలేదు..మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి’’అంటూ బాసటగా నిలిచినట్లు తెలుస్తోంది.దీంతో అధికార పార్టీలో డీఈఓ అంశంపై రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఓవైపు విప్ జయప్రకాశ్‌రెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు అండగా నిలుస్తుండగా మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు డీఈఓను సమర్థిస్తున్నారు. దీంతో విషయం కాస్తా రాజకీయరంగు పలుముకున్నట్లు కనిపిస్తోంది. డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఇప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. -
భావి శాస్త్రవేత్తలు మీరే..
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వపడేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. తన సొంత నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ వేడుకలు జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆవిష్కర్తలుగా ఎదగాలి.. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుని ఆవిష్కర్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మళ్లించటం సరికాదన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు పరిశోధనలవైపు మళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ దినకర్‌బాబు మాట్లాడుతూ సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. బాలమేధావులైన విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సైన్స్రంగం వైపు ఆకర్షింపజేసేందుకు ప్రేరణ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రగతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వచ్చేనెల 8 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. ప్రతిభను చాటేందుకు చక్కని వేదిక.. మూడురోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ మెదక్ జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ జి.రమేశ్ అన్నారు. 11 జిల్లాకు చెందిన 625 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. విద్యార్థులు తమలోని ప్రతిభాపాటవాలను చాటిచెప్పేందుకు సైన్స్‌ఫెయిర్ చక్కని వేదికని పేర్కొన్నారు. సైన్స్‌ఫెయిర్ ద్వారా విద్యార్థులు శాస్త్రసాంకేతిక రంగాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందన్నారు. ప్రశంసలతో ముంచెత్తిన అతిథులు.. సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించిన అనంతరం అతిథులు విప్ జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ దినకర్‌బాబు తదితరులు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. విప్ జయప్రకాశ్‌రెడ్డి నీటిపంపు సైకిల్‌ను తొక్కి నీటి సరఫరా ఎలా జరుగుతుంది పరిశీలించారు. అనంతరం ఆ నమూనా తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ గోపాల్, ఎంపీడీఓ హరిసింగ్, ఎంఈఓ చంద్రశేఖర్, గిర్మాపూర్ సర్పంచ్ కృష్ణ, కమిటీ సభ్యులు విజయరాజు, ప్రభాకర్, రాంచందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘విప్’ దూరం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో ‘సోనియా అభినందన’ సభ నిర్వహించారు. సొంత నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి దూరంగా ఉన్నారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో సాన్నిహిత్యం, సమైక్యవాదం వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు సమాచారం. అయితే జయప్రకాశ్‌రెడ్డి అనుచరులు మాత్రం సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల సందర్భంగా పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటుతో హడావిడి చేసే విప్ మాత్రం ఈ సారి ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. మరోవైపు సమావేశం ఆద్యంతం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కేంద్రంగా సాగింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఎదుట డిప్యూటీ సీఎం సమర్థవంతంగా వాదనలు వినిపించారంటూ పార్టీ నేతలు పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి గీతారెడ్డి గైర్హాజరవుతారనే ప్రచారం జరగ్గా, ఆలస్యంగా సమావేశ ప్రాంగణానికి వచ్చారు. ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, సీహెచ్ ముత్యంరెడ్డి సమావేశ ప్రాంగణానికి వచ్చి సభ ప్రారంభానికి ముందే వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తుండటంతో మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం, ఇతర నేతలను కలిసి వెళ్లారని పార్టీ నేతలు వివరణ ఇచ్చారు.