
పాయల్ గుప్తా, నరేన్, బి.గోపాల్
దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్‌పై ఆమె నిర్మిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. నరేన్ వనపర్తి హీరోగా, పాయల్ గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బి.గోపాల్ క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు అవినాష్ కొకటి. ‘‘నాన్నగారి (జేపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్మాణంలోకి వచ్చాను’’ అన్నారు మల్లికా రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శివ.
Comments
Please login to add a commentAdd a comment