
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి.. మాకు ఆ డబ్బులు రావాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. మనీ హైయిస్ట్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. 'మనం ఆయుధాలు దాచే విధానం చూస్తే జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి' అనే డైలాగ్ వింటే థియేటర్లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
(ఇది చదవండి: జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్)
ఇక ట్రైలర్ చివర్లో నీకు సమంత ఇష్టమా? రష్మిక ఇష్టమా? అంటే.. ఇద్దరు కాదు అనుష్క అనే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి ట్రైలర్‌లోనే చౌర్యపాఠం ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌గానే రూపొందించినట్లు క్లూ ఇచ్చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు దావ్‌జాంద్ దర్శకత్వం వహించారు.