అజిత్‌ కుమార్‌ యాక్షన్‌ మూవీ.. ట్రైలర్‌ వచ్చేసింది | Ajith kumar latest Movie Good Bad Ugly Trailer out Now | Sakshi
Sakshi News home page

అజిత్‌ హీరోగా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'.. ట్రైలర్‌ చూసేయండి..

Published Fri, Apr 4 2025 9:44 PM | Last Updated on Fri, Apr 4 2025 9:44 PM

Ajith kumar latest Movie Good Bad Ugly Trailer out Now

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది.  ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో  వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్‌ అగ్లీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement