
డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్‌తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్ మూవీ జాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్ ట్రైలర్‌లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.
అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్‌కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో హీరో క్యారెక్టర్‌కు.. ఆ సమయంలో ఎమోషన్‌కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్‌కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.
కాగా.. ఈ చిత్రంలో సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది.