'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్ | Sampoornesh Babu Latest Movie Sodara Trailer Out Now | Sakshi
Sakshi News home page

Sodara Trailer: 'నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా?'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్

Apr 10 2025 7:48 PM | Updated on Apr 10 2025 8:11 PM

Sampoornesh Babu Latest Movie Sodara Trailer Out Now

టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేశ్‌బాబు (Sampoornesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సోదరా. ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మన్మోహన్‌ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేశ్‌కు తమ్ముడిగా సంజోశ్‌ నటించారు. ఈ మూవీని క్యాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో చంద్ర చగన్ల నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను బేబీ డైరెక్టర్‌ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అన్నదమ్ముల పెళ్లి విషయంలో జరిగే పరిణామాలే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతందించగా.. శివ సర్వాణి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement