sampoornesh babu
-
వేసవిలో సోదరా
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న సినిమాయే ‘సోదరా’. ఈ వేసవికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు’’ అని తెలిపారు చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
‘డర్టీ ఫెలో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
-
మీ ప్రేమకు నేను ఎప్పుడూ బానిసనే: సంపూర్ణేష్ బాబు
-
ఓటు విలువ చెప్పే సినిమా..అందరూ తప్పక చూడండి
-
Martin Luther King Movie Review:‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ
టైటిల్:మార్టిన్ లూథర్ కింగ్ నటీనటులు:సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా దర్శకత్వం:పూజ కొల్లూరు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా సంగీతం:స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ:దీపక్ యరగెరా విడుదల తేది: అక్టోబర్ 27, 2023 ‘మార్టిన్ లూథర్ కింగ్’ కథేంటంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రమిది. పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు..రోడ్లు సరిగా ఉండదు. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు). అతనొక అనాథ. ఊర్లో ఉన్న ఓ పెద్ద చెట్టుకింద చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అతనికి తోడుగా మరో అనాథ బాటా ఉంటాడు. వీరిద్దరికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు.ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్టాఫీస్ ఉద్యోగిణి వసంత(శరణ్య) స్మైల్ పెరుని మార్టిన్ లూథర్ కింగ్‌గా మార్చి ఓటర్ కార్డుతో పాటు పోస్టాఫీస్‌లో ఖాతాని తెరిపిస్తుంది. అతని ఓటే కీలకం కావడంతో.. ఒకవైపు జగ్గు, మరోవైపు లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. వాస్తవానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి తెలుగు రీమేక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్ సెటైరికల్‌గానే సాగుతుంది. పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క సీన్‌తోనే జగ్గు, లోకి పాత్రల స్వభావంతో పాటు కథకు కీలకమైన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకురాలు. పోస్టాఫీస్ ఉద్యోగి వసంత పాత్రతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. స్మైల్‌కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టే క్రమంలో సాగే సన్నివేశాలు.. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి దుస్థితిని చూపిస్తాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాల పేర్లతో ప్రజలను ఎలా విడదీస్తారనేది చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది. అయితే ద్వితియార్థం మాత్రం మొత్తం సీరియస్ సైడ్ తీసుకుంటుంది. ‘మండేలా’ లో వర్కౌట్ అయిన ఎమోషనల్ ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా నరేశ్ పాత్ర కొన్ని చోట్ల చేసే కామెడీ కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. అలాగే కింగ్ ఓటు కోసం జగ్గు, లోకి ఇద్దరు పడే తంటాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించినట్టే రొటీన్‌గా ఉంటుంది. స్క్రిప్టుని మరింత బలంగా రాసుకొని, ఎమోషన్స్‌పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఇప్పటివరకు సంపూర్షేష్ బాబు అంటే మనకు కామెడీ హీరోగానే తెలుసు. అతను చేసిన స్పూఫ్ కామెడీని బాగా ఎంజాయ్ చేశాం. కానీ అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. టైటిల్ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. తెరపై కొత్త సంపూని చూస్తాం. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రెసెడెంట్ పదవి పోటీదారులు జగ్గుగా వీకే నరేష్.. లోకిగా వెంకట్ మహా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్ బాటా పాత్రను పోషించిన చిన్నోడి నటన బాగుంది.పోస్టాఫీసు ఉద్యోగి వసంత పాత్రకి శరణ్య న్యాయం చేసింది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్ చేసేలా ఉంటాయి. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్‌గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సంపూర్ణేష్‌బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యాడు. తాజాగా సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలో 'మార్టిన్ లూథర్ కింగ్' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో సంపూర్ణేష్‌బాబు రానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పటి వరకు తనపై వస్తున్న రూమర్స్‌కు ఆయన స్పందించాడు. 'ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా?’ అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేం లేదని సంపూర్ణేశ్ బాబు తెలిపాడు. తాను అందరితోనూ మంచిగానే ఉంటానని నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదన్నాడు. తనకు అనారోగ్యం వల్ల సినిమాలు చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ‘మార్టిన్ లూథర్ కింగ్’ రిలీజ్ తర్వాత నెలల వ్యవధిలోనే అవి ప్రేక్షకుల ముందుకొస్తాయని తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి 'మార్టిన్ లూథర్ కింగ్' రీమేక్. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్‌బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అక్టోబర్ 27న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
'మార్టిన్ లూథర్ కింగ్'గా రాబోతున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్ డేట్ ఫిక్స్
సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు సినిమాలలో ఇదో కొత్త అనుభూతిని అందిస్తుందని. అలాగే ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. అక్టోబర్ 27న ఈ ఈ చిత్రం విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్.. అప్పుడు తారక్ ఏం చేశారంటే?
బిగ్‌బాస్ షోకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి ఏడాది ఎప్పుడెప్పుడు బిగ్‌బాస్ ప్రారంభమవుతుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. కానీ ఆరో సీజన్ పుణ్యమా అని మెచ్చినవాళ్లే మండిపడ్డారు. చెత్త కంటెస్టెంట్లు, చెత్త సీజన్ అని ఈసారి బిగ్‌బాస్ షోను ఏకిపారేశారు. మొదట్లో బాగానే ఉండేది కానీ రానురానూ మరీ దారుణంగా తయారవుతుందని పెదవి విరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మొదటి సీజన్ కంటెస్టెంట్ సమీర్. 'మా సీజన్లో చాలా బాగా ఉండేది. కానీ ఈసారి స్క్రిప్టెడ్ అయిందేమోనని అందరూ డౌట్ పడుతున్నారు. అయితే మా సీజన్లో సంపూర్ణేశ్ బాబు స్వతాహాగా ఎలిమినేషన్‌కు సిద్ధపడటాన్ని కూడా కొందరు స్క్రిప్ట్ అనుకున్నారు, కానీ అసలు నిజమేంటంటే.. అతడు పల్లెటూరి వ్యక్తి, పల్లెటూరి వాతావరణాన్ని అతడు బాగా ఇష్టపడతాడు. ఇప్పటికీ షూటింగ్ అయిపోగానే సిటీలో ఉండలేక తిరిగి సిద్దిపేటకు వెళ్లిపోతాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహల్ లాంటి బిగ్‌బాస్ హౌస్‌లో పడేశారు. ఒక వారం ఉన్నాడు, కానీ తనవల్ల కాలేదు. గదిలో బంధించినట్లుగా ఫీలయ్యాడు. మైండ్ డిస్టర్బ్ అయింది, ఆ క్షోభ భరించలేక నిజంగా ఏడ్చాడు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. గేట్లు ఓపెన్ చేయండి, వెళ్లిపోతా.. లేదంటే గేట్లు పగలగొట్టుకుని వెళ్లిపోతానన్నాడు. కానీ బిగ్‌బాస్‌లో అగ్రిమెంట్లు ఉంటాయి. ఎలిమినేషన్ ద్వారా వెళ్లిపోతే ఓకే కానీ తనంతట తానుగా వెళ్లాలంటే తిరిగి రూ.25 లక్షలు కట్టాలి. డబ్బులు కట్టడానికైనా సరే కానీ ఉండనని ఏడుస్తూనే ఉన్నాడు. సరిగా తిండి కూడా తినలేదు. సంపూ పరిస్థితి చూసి తారక్ బిగ్‌బాస్ టీమ్‌తో మాట్లాడాడు. పాతిక లక్షలు కట్టకుండానే అతడిని హౌస్ నుంచి పంపించేశాడు. ఇప్పుడంటే సిటీ మధ్యలోనే బిగ్‌బాస్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, మాది మహారాష్ట్ర లోనావాలాలోని అడవిలో సెట్ వేశారు' అని చెప్పుకొచ్చాడు సమీర్. చదవండి: ఏమున్నాడ్రా బాబూ, హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ లుక్ వైరల్ వంద కోట్లకు చేరువలో ధమాకా -
ధగడ్ సాంబలో స్పూఫ్‌లు ఉండవు: సంపూర్ణేశ్ బాబు
‘‘ఇప్పటివరకు నేనెక్కువగా కామెడీ రోల్స్ చేశాను. ‘ధగడ్ సాంబ’లో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ‘కొబ్బరి మట్ట, సింగం 123’ వంటి సినిమాల్లో ఎక్కువగా స్పూఫ్‌లు ఉన్నాయి. కానీ ‘ధగడ్ సాంబ’లో స్పూఫ్‌లు ఉండవు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఎన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో సంపూర్ణేష్, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ‘ధగడ్ సాంబ’. బి.ఎస్. రాజు సమర్పణలో ఆర్ఆర్ బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘చిన్న సమస్య వల్ల హీరో చిన్నతనంలో తన ఆస్తి కోల్పోతాడు.. మళ్లీ అది సంపాదించుకునే క్రమంలో జరిగే సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు 12 సినిమాల్లో హీరోగా చేశాను. వాటిలో ‘ధగడ్ సాంబ’ ఏడవది. మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ‘బ్రిలియంట్ బాబు, సన్నాఫ్ తెనాలి, ‘దాన వీర శూర కర్ణ, మిస్టర్ బెగ్గర్’తో పాటు ఒక తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాను’’అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్‌గా అఖిల్! హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ -
‘ధగడ్ సాంబ’లో కొత్త సంపూని చూస్తారు
‘‘ధగడ్ సాంబ’ చిత్రం సంపూ కెరీర్లో ది బెస్ట్ అవుతుంది. ఇందులో కొత్త సంపూని చూస్తారు. కుటుంబ ప్రేక్ష కులు చూసేలా సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ ఎన్.ఆర్. రెడ్డి అన్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా బి.ఎస్. రాజు సమర్పణలో ఆర్ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ’ధగడ్ సాంబ’ ఈ నెల 20న విడుదల కానుంది. ఎన్ఆర్. రెడ్డి మాట్లాడుతూ– ‘‘ధగడ్ సాంబ’కి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు నేనే రాసుకున్నాను. ఈ చిత్రకథను నా ఫ్రెండ్, కెమెరామేన్ ముజీర్కి వినిపించాను. సంపూకి కూడా నచ్చడంతో సినిమా చేశాం. ఈ సినిమా ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ముజీర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌లా నిలిచారు’’ అన్నారు. -
అతని వివరాలు తెలియజేస్తే సాయం చేస్తా: సంపూర్ణేష్‌బాబు
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామిని సినీ హీరో సంపూర్ణేష్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈఓ ఆకుల కొండలరావు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సంపూర్ణేష్‌బాబుకి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తున్న ఆలయ ఈఓ వివరాలిస్తే సాయం చేస్తా జంగారెడ్డిగూడెం: సినీ హీరో, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు జంగారెడ్డిగూడెంలో సందడి చేశారు. స్థానిక బైనేరు వద్ద ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ తనను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన స్వర్ణకార సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను నటించిన చిత్రం ఈ నెలలో ఒకటి విడుదల కానుందని, అలాగే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. స్వర్ణకార సభ్యులు టి.నరసాపురానికి చెందిన ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, సహాయపడాలని కోరగా, అతని వివరాలు తనకు తెలియజేస్తే సాయం చేస్తానని సంపూర్ణేష్‌బాబు హామీ ఇచ్చారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు భోగేశ్వరరావు, ఈఓ ఆకుల కొండలరావు, వాడపల్లి శ్రీనివాస్, తుపాల సాయికృష్ణ పాల్గొన్నారు. -
'బెగ్గర్'గా మారిన సంపూర్ణేష్ బాబు..
Sampoornesh Babu Mr Beggar Movie Motion Poster Released: 'హృదయ కాలేయం' సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తనదైన కామెడీ శైలీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ఆడియెన్స్‌కు ఎంటర్టైన్మెంట్ పంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. ఇటీవలే 'శీలో రక్షతి రక్షితః' అనే విభిన్నమైన క్యాప్షన్‌తో క్యాలీఫ్లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా బెగ్గర్‌గా అలరించనున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు, అద్వితీ శెట్టి జంటగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. ‘వీడు చిల్లరడగడు’ అన్నది ట్యాగ్‌లైన్. వడ్ల నాగశారద సమర్పణలో గురురాజ్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరదాగా సాగే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ నెల 25న ప్రారంభించే సెకండ్ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది’’ అన్నారు వడ్ల జనార్థన్. ‘‘దర్శకుడు చక్కటి ప్లానింగ్‌తో అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తున్నారు’’ అని గురురాజ్, కార్తీక్ అన్నారు. చదవండి: ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’ -
ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు ‘క్యాలీ ఫ్లవర్’
Cauliflower Movie OTT Release Date: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన తాజా చిత్రం తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’ .‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం గతేడాది నవంబరు 26న థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందనను దక్కించుకుంది. సంపూ కామెడీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ఏప్రిల్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ,హంగామా మొదలగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ.. థియేటర్స్‌లో మిస్సైయిన ప్రేక్షకులందరూ ఈ నెల 9న ఓటీటీలో ‘క్యాలీఫ్లవర్’ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. దర్శకుడు ఆర్కే మలినేని మాట్లాడుతూ.. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ ను ఈ సినిమాలో చెప్పడం జరిగింది.నవంబర్ 26న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయడం జరిగింది.ఎన్నో సీరియల్స్ తీసిన నన్ను చాలా మంది ఇన్ని సీరియల్స్ చేస్తున్న నువ్వు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను ఎందుకు తీయలేవు అన్నదానికి సమాధానమే ఈ క్యాలీఫ్లవర్.మేము చేసిన మంచి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు -
గొప్ప మనసు చాటుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థికస్థోమత లేక అల్లాడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి హీరో సంపూర్ణేశ్‌బాబు ఆర్థికసాయం అందించి ఔదార్యం చాటుకున్నాడు. మండలంలోని రామన్నపేటకు చెందిన సంకోజి లావణ్య- రమేశ్‌బాబుకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. నెల రోజులుగా చిన్నారి శివ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందించగా, సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు శనివారం రామన్నపేటకు వచ్చి చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. రామన్నపేట, బండపల్లి గ్రామాల సర్పంచులు దుమ్ము అంజయ్య, న్యాత విజయజార్జ్, మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ ఉన్నారు. -
‘హాఫ్ స్టోరీస్’మూవీ రివ్యూ
టైటిల్ : హాఫ్ స్టోరీస్ నటీ,నటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, సంపూర్ణేష్ బాబు, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్ తదితరులు నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్ నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి దర్శకత్వం : శివ వరప్రసాద్ కె. సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల ఎడిటర్: సెల్వ కుమార్ విడుదల తేది : జనవరి 7,2022 ఒమిక్రాన్ దెబ్బతో సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పకున్నాయి. దీంతో చిన్న సినిమాలు పుంజుకున్నాయి. విభిన్నమైన కాన్సెప్టులతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్ స్టోరీస్’.ఈ మూవీలో రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోటి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ మోస్తరు అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్ స్టోరీస్’ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కొన్ని కథల, పాత్రల సంకలనమే ‘హాఫ్ స్టోరీస్’కథ. అసిస్టెంట్ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ(శ్రీజ), చిన్నా(జబర్దస్థ మహేశ్) మధ్య జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్యాంక్ క్యాష్ వ్యాన్ ప్రమాదానికి గురికావడం.. ఆ డబ్బును కాసేయడానికి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు మోసానికి పాల్పడుతుంటారు. చివరికి ఆ డబ్బులు ఎవరికి సొంతం చేసుకున్నారు? ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ముగ్గురిలో దెయ్యాలు ఎవరు? మనుషులు ఎవరు? ఈ కథలోకి సంపూర్ణేష్ బాబు ఎలా ఎంటర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో పాత్రలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్‌గా రాజీవ్, చిన్నగా మహేశ్, సినిమా రచయిత సంపూగా సంపూర్ణేశ్ బాబు, రాఘవ్‌గా జెమిని సురేశ్, ఎస్సై శశికాంత్‌గా టీఎన్ఆర్, లక్ష్మీగా శ్రీజ, ఆధ్యాగా అంకిత ఇలా... అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. తెలుగులో దెయ్యాల కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో చాలా వరకు హిట్ కొట్టాయి కూడా. ‘హాస్ స్టోరీస్’కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. కథ నేపథ్యం పాతదే అయినప్పటికీ.. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు శివ వరప్రసాద్. వరుస ట్విస్ట్‌లో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించాడు. శివ అనే అప్‌కమింగ్ డైరెక్టర్ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీలో ఇంకో స్టోరీ రావడం..ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా వరుస ట్విస్ట్‌లతో ‘హాఫ్ స్టోరీస్’సినిమా సాగుతుంది. సినిమాలో మనుషులు ఎవరో, దెయ్యాలు ఎవరో తెలియకుండా.. క్షణ క్షణానికి ఓ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుడి సీటుకే కడ్డిపడేశాడు. అయితే అది సినిమాకు ఎంత ప్లస్ అయిందే.. అంతే మైనస్ అయింది కూడా. సగటు ప్రేక్షకుడికి సినిమాలోని ట్విస్టులన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అసలు స్టోరీ ఏంటనేది తెలియక అయోమయానికి గురవుతాడు. అయినప్పటికీ.. సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అయితే టైటిల్ మాదిరే ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా మాత్రమే చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేశారు. క్లైమాక్స్‌లో అయినా ఈ ట్విస్ట్‌లన్నింటికీ పుల్‌స్టాఫ్ పెడిగే బాగుండేది. పార్ట్-2 ఉంది కాబట్టి ఆ చిక్కుముడులన్నీ అలానే వదిలేశాడేమో దర్శకుడు. మొత్తగా ఈ సినిమా ఓటీటీలో వెబ్ సిరీస్‌గా వస్తే ఇంకా బాగుండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటి సంగీతం బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్ అదిరిపోయింది. తనదైన బీజీఎంతో ప్రేక్షకులను భయపెట్టాడు. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ బాగుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ‘హాఫ్ స్టోరీస్’
రాజీవ్, `రంగస్థలం` ఫేమ్ మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హాఫ్ స్టోరీస్'. శివవరప్రసాద్ కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై యం. సుధాకర్ రెడ్డి నిర్మించారు. . కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అతిథి పాత్రలో నటించడం విశేషం. తాజాగా అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 7 న విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన హాఫ్ స్టోరీస్ సినిమా ను జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుంది. అందరు ఈ సినిమా ను చూడాలని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాం. జనవరి 7 ఈ సినిమా అందరి ముందుకు రాబోతుంది. మీ అందరిని ఈ సినిమా అలరిస్తుంది. దర్శకుడు మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించాడు. కోటి సంగీతం సినిమాకి హైలైట్. అన్నారు. -
"Mr బెగ్గర్"గా బర్నింగ్ స్టార్ సంపూ
Sampoornesh Babu: వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే విడుదలైన క్యాలీ ఫ్లవర్ సినిమా ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” పోస్టర్ వదిలారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్. -
మగవాళ్లు 35 ఏళ్లు వచ్చేవరకు పవిత్రంగా ఉండాలి: సంపూర్ణేష్ బాబు
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్‌గా పేరు పొందిన సంపూ ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్’ అనే సరికొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చసినిమాను నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబరు 26న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్.. రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో అదే కాపాడే కవచంగా మారుతుందని డైరెక్టర్ అన్నారు. ► శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. ► ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి. ► 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశపారంపర్యంగా వస్తుంది. అందుకే అంతవరకు పవిత్రంగా ఉండాలని, ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదని, అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం. ► ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని అన్నాను. ► డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. ఈ పాత్ర అలా ఉండాలి.. ఇలా ఉండాలని అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు వచ్చి కథ చెప్పారు. ► హీరోయిన్ వాసంతి ఇది వరకు కన్నడలో సీరియల్స్ చేశారు. తనకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయినా కూడా చక్కగా నటించారు. పల్లెటూరిలో చలాకీగా తిరుగుతూ, బావను ఏడిపించే మరదలి పాత్రలో కనిపిస్తారు. ► నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. హృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. సింగం 123 సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను. ► ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను. ► హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ కారెక్టర్ వేశాను. గోల్డ్ మ్యాన్ సినిమా చేద్దామనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది. ► నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం. ► ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది. ► తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది. ► సాయి రాజేష్ గారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మేం మళ్లీ ఓ సినిమా చేస్తాం. -
ఆ టైటిల్ విని షాక్ అయ్యాను!
సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా ఆర్కే మలినేని దర్శకత్వంలో గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే కానీ బెంగళూరులో చదువుకున్నాను. ఏరో నాటికల్ ఇంజనీర్ అవుదామనుకున్న నేను హీరోయిన్ అయ్యాను. ఐదు సంవత్సరాల క్రితం మోడల్‌గా నా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ఆ తర్వాత నటి అయ్యాను. కన్నడంలో ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు ‘క్యాలీఫ్లవర్’తో తెలుగు చిత్రపరిశ్రమకు వస్తున్నాను. ఇందులో హీరోగా నటించిన సంపూర్ణేష్ బాబుకు మరదలిగా, నీలవేణి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ నా కోసమే డిజైన్ చేశారా? అన్నట్లు నాకనిపించింది. కొందరిలా నేను కూడా ‘క్యాలీఫ్లవర్’ టైటిల్ విని షాకయ్యాను. కానీ సస్పెన్స్, థ్రిల్, కామెడీ, మెసేజ్ ఉన్న ఈ చిత్రం ఆడియన్స్‌కు నచ్చుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఉంది. హీరో నానీగారంటే ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఆది సాయికుమార్, మారుతి అండ్ టీమ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాను. కన్నడంలో కొత్త సినిమాలు కమిట్ కాలేదు’’ అన్నారు. -
శీల రక్షణ కోసం రంగంలోకి సంపూ.. ఇప్పుడంతా క్యాలీఫ్లవర్ గురించే చర్చ
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్’ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించే చర్చ. ‘అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్’ వీడెవడే ఒక్కరోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు’అనే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇక సంపూ చెప్పే డైలాగ్స్ అయితే నవ్వులు పూయిస్తున్నాయి. ‘ఈ ఊర్లో పుట్టిన మనిషితో పాటు జంతువుకు అందరికీ ఒక్కటే భర్త, ఒక్కటే భార్య ఇదే ఈ క్యాలీఫ్లవర్ రూల్’అని సంపూ అంటుండగా.. అక్కడే ఉన్న ఓ గేదె ‘ఏం కర్మరా బాబు.. నాక్కుడా ఒక్కడే మొగుడు అట’అని చెప్పడం ఫన్నీగా ఉంది. మొత్తంగా ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా.. క్యాలీఫ్లవర్ అంటూ సంపూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. -
‘క్యాలీ ఫ్లవర్’తో వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు
‘‘ఓ మహిళ వల్ల శీలం పోగొట్టుకున్న ఒక మగాడు న్యాయం కోసం చేసే పోరాటమే ‘క్యాలీ ఫ్లవర్’ కథ’’ అని సంపూర్ణేష్ బాబు అన్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఆర్కే మలినేని శాడిజాన్ని చూపించి నాలోని నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా హిట్ అయితే దానికి కారణం ప్రేక్షకులు.. తేడా కొట్టిందంటే నా వల్లే’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
బర్నింగ్ స్టార్ ట్యాగ్‌పై సంపూ ఫీలింగ్ ఇది
-
‘బంగారం’ లాంటి బర్నింగ్‌స్టార్
కొలిమి భగ భగలో మండితేనే కదా బంగారం.. ఆభరణం అయ్యేది. వేలమంది పోటీలో ‘ఒక్కఛాన్స్’ తనకు దక్కుతుందా? అనే అనుమానాల నడుమే బర్నింగ్ స్టార్‌గా తయారయ్యాడు నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో, మరోవైపు సాయాలతో తెలుగు ప్రజల అభిమానం అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇంతకీ సంపూలో నటనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఏంటో తెలుసా? ‘ఉపేంద్ర’ సినిమా. త్వరలో బజార్ రౌడీ సినిమాతో సంపూ ఆడియొన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాక్షి.కామ్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. -
నటుడిగా నాలో మరో యాంగిల్‌ను చూస్తారు: సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోరాని, మహేశ్వరి హీరోయిన్లు. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు నాలుగు (‘హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123, వైరస్’) సినిమాలు చేశాను. ‘బజార్ రౌడీ’ ఐదో చిత్రం. నా గత చిత్రాలు ఒక ఎత్తు అయితే ‘బజారు రౌడీ’ మరో ఎత్తు. ఈ సినిమా నా జర్నీకి మరో మెట్టు అవుతుంది’’ అని అన్నారు. ‘‘నటుడిగా సంపూర్ణేష్లో మరో యాంగిల్‌ను చూస్తారు’’ అన్నారు నాగేశ్వరరావు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు శ్రీనివాసరావు. ‘‘సంపూర్ణేష్ కెరీర్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్. -
'నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్' అంటున్న సంపూర్ణేశ్ బాబు
టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బజార్ రౌడీ’.సంపూర్ణేశ్ బాబుకు జోడీగా మహేశ్వరి వద్ది హీరోయిన్గా నటిస్తుంది. ఆగస్టు20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బజార్ రౌడీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు’, ‘నీకు బాంబే (ముంబయి)లో బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్’ వంటి డైలాగులు హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. షాయాజి షిండే, కత్తి మహేశ్, కరాటే కల్యాణి, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితురలు ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి : కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కు సెన్సార్ పూర్తి -
ఆగస్టులో సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’
సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వర రావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్‌కి మంచి ఆదరణ లభించింది’’ అన్నారు. ‘‘నవ్వులు, పాటలు, ఫైట్స్.. ఇలా ప్రేక్షకులకు కిక్ ఇచ్చే హంగులతో సినిమా ఉంటుంది’’ అన్నారు వసంత నాగేశ్వరరావు. ‘‘మా చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ అలవలపాటి. -
ఇంట్రెస్టింగ్గా సంపూ క్యాలీఫ్లవర్ టైటిల్ థీమ్ పోస్టర్
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం క్యాలీఫ్లవర్. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గూడురు శ్రీధర్ సమర్పణలలో మధుసూదన క్రిమేషన్స్, రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడమే కాకు సంపూ ఈ మూవీతో మరోసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ క్యాలీప్లవర్ టైటిల్ థీమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్ మ్యాన్‌గా సంపూ కనిపించనున్నాడు. ఈ టైటిల్ థీమ్‌లో సంపూ నగ్నంగా దర్శనంగా ఇచ్చాడు. ఒంటిపై ఒక్క నూలుపోగు లేకుండా నగ్నంంగా ఉన్న సంపూ అడ్డుగా క్యాలీఫ్లవర్ పెట్టుకుని ధర్నాకు దిగిన ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాపై మరింత అసక్తిని పెంచుతోంది. ఈ టైటిల్ థీమ్‌కు ‘శీలో రక్షతి రక్షిత:’ అనే ట్యాగ్‌లైన్ చూస్తుంటే సంపూ తన శీలాన్ని కాపాడుకోవడానికి ధర్నా చేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే అతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియజేసే సన్నివేశమే ఈ సినిమాకు మేజర్ హైలెట్‌గా ఉండబోతుంది. ఈ మూవీలో సంపూర్ణేష్ సరసన వాసంతి హీరోయిన్గా నటిస్తుంది. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఇందులో పోసాని కృష్ణమురళి, నాగ మహేశ్, గెటప్ శ్రీను, రోహిణి, గౌతం రాజు తదితరలు నటిస్తున్నారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు
హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారి బాధ్యత తీసుకుని చదివించేందుకు ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. కాగా చిన్న హీరో అయినప్పటికీ సంపూ ఇప్పటికే వరదలు, విపత్తుల సమయంలో తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలిచారు. ఇటీవల జర్నలిస్టు టీఎన్ఆర్ మృతి అనంతరం ఆయన కుటుంబానికి రూ. 50 వేలు అర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు అనాథలుగా మారారు. ఈ వార్త చూసి చలించిన సంపూర్ణేష్ బాబు తక్షణమే వారికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇదే విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేస్తూ.. ‘దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలకు నేను, మా నిర్మాత సాయి రాజేష్‌లు కలిసి రూ. 25వేల ఆర్థిక సాయం అందించాం. అంతేగాక వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇవ్వడం జరిగింది’ అంటూ ఆయన రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం సంపూ.. ‘బజారు రౌడీ, క్చాలీఫ్లవర్, పుడింగి నంబర్ వన్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరిమట్ట చిత్రంతో సంపూ హిట్ అందుకున్నారు. -
శ్రీరాముని అవతారంలో సంపూర్ణేష్ బాబు
‘హృదయకాలే యం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’కి గుమ్మడికాయ కొట్టారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా నటించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. గుడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమాలో శ్రీరాముడు వేషధారణలో ఉన్న సంపూర్ణేష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లిష్ వ్యక్తిగా సంపూ కనిపిస్తారు. గోపీ కిరణ్ చక్కని కథ అందించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
‘క్యాలీఫ్లవర్’ షూటింగ్‌కు రెడీ అయిన సంపూ
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి కొంచెం విరామం ఇచ్చిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి, కథ: గోపీ కిరణ్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్. -
Bazaar Rowdy: పిల్లా నా మతి చెడగొట్టావే...
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘బజార్ రౌడి’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. మహేశ్వరి వద్ది హీరోయిన్. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మతి చెడగొట్టావే..’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో అలరిస్తారు. మా చిత్రం టీజర్‌కి సోషల్ మీడియాలో 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే మా ‘బజార్ రౌడి’ని విడుదల చేస్తాం. మరుధూరి రాజా మాటలు రాయగా, గౌతంరాజు ఎడిటింగ్ చేశారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేఖర్ అలవలపాటి. -
TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. టీఎన్ఆర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి ఫోన్లో టీఎన్ఆర్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక మరో నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల అర్థిక సహాయం చేశారు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా తాను ఓ మెట్టు ఎదిగానని, వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సహాయం తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీఎన్ఆర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ ఎంతో గుర్తింపు పొందారు. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్లో ప్రశ్నలడిగేవారు టీఎన్ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన.రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన. జర్నలిస్ట్ #TNR మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబసభ్యులతో ఫోన్ లో విచారం వ్యక్తం చేశారు. TNR కుటుంబానికి రూ 1 లక్ష ఆర్థిక సహాయం అందించారు చిరంజీవి @KChiruTweets — BARaju (@baraju_SuperHit) May 11, 2021 తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు సపోర్ట్ చెయ్యండి pic.twitter.com/1MBYS8F6pm — Sampoornesh Babu (@sampoornesh) May 11, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది.. -
రౌడీయిజం ఎలా చేయాలో నేర్పుతున్న సంపూర్ణేశ్ బాబు
టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బజార్ రౌడీ’. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్లో సంపూ చెప్పే పంచ్ డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా దమ్ము, దమ్ము కావాలి’అంటూ సంపూ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. సీరియస్ కామెడీతో పాటు రోమాన్స్ కూగా బాగానే ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. షాయాజి షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితురలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సంపూర్ణేష్‌బాబు సినిమా సందడి
మంచిర్యాల: మంచిర్యాల పట్టణ శివారులోని బొక్కలగుట్ట గ్రామంలోని గాంధారి ఖిల్లాలో సినిమా సందడి నెలకొంది. తైదలబాపు నిర్మాణ సారథ్యంలో ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్లో శనివారం నటులు ఆమని, సంపూర్ణేష్‌బాబు, శిరీషా, ఆనంద్‌పై చిత్ర సన్నివేశాలు చిత్రీకరించారు. ఎనిమిది రోజుల పాటు షూటింగ్ జరుగుతుండడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ సందర్శించారు. -
సంపూర్ణేశ్ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన ‘బజార్ రౌడీ’ అనే సినిమా షూటింగ్లో జరిగింది. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంపూర్ణేశ్ హీరోగా వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా బజార్ రౌడీ. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్లో భాగంగా సంపూర్ణేశ్ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఆ సీన్ తీస్తుండగా బైక్‌పై సంపూర్ణేశ్ లేచి కిందకు దిగుతుండగా అదుపు తప్పింది. తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది. బైక్‌తో పాటు సంపూ కింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వారు సంపూను పైకి లేపారు. హృదయ కాలేయంతో సంపూర్ణేశ్ బాబు సడన్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. సింగం 123, కొబ్బరిమట్ట, కరెంట్ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. తెలుగు బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. -
కొండవీడు కోటలో ‘బజార్ రౌడీ’
యడ్లపాడు (గుంటూరు): ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసనంటూ హీరో సంపూర్ణేష్ బాబు చెప్పారు. మండలంలోని కొండవీడు కోట ప్రాంతంలో ఆయన మహేశ్వరి వద్దితో జంటగా కలసి నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’ షూటింగ్ మూడు రోజుల పాటు జరిపారు. షూటింగ్‌కు వచ్చిన సంపూ మాట్లాడుతూ హృదయకాలేయం, సింగం 123, వైరస్, కొబ్బరిమట్ట విడుదల కాగా, తాజాగా బజార్‌రౌడీ పోస్టు ప్రొడక్షన్లో ఉందన్నారు. ఇవిగాక మరో మూడు సినిమాలు చేస్తున్నానని, వాటిలో ఒక చిత్రంలో మూడు పాత్రలు పోషించడం విశేషమని చెప్పారు. చిత్రం కథానాయిక మహేశ్వరి వద్ది మాట్లాడుతూ తమిళంలో రెండు, తెలుగులో సంపూతో బజార్‌రౌడీ చేస్తున్నానన్నారు. త్వరలోనే ఈ మూడు చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపారు. తాను పక్కా తెలుగమ్మాయినని, కర్నూల్ జిల్లా పత్తికొండలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగానని వివరించారు. ముగిసిన బజార్ రౌడీ సినిమా షూటింగ్.. కేఎస్ క్రియేషన్ పతాకంపై సంపూర్ణేష్‌బాబు, మహేశ్వరివద్ది జంటగా నటిస్తున్న ‘బజార్ రౌడీ’ చిత్రం డ్యూయెట్‌ను కొండవీడు ఘాట్ రోడ్డు, పురాతన కట్టడాల వద్ద చిత్రీకరించారు. షూటింగ్ ముగింపు సందర్భంగా చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని కొండవీడు ఊటీ, అరకు లోయలను తలపించేలా షూటింగ్‌లకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. సమావేశంలో చిత్ర నిర్మాత సంగిశెట్టి శ్రీనివాసరావు, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ అలవాలపాటి, కో–డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, కొరియోగ్రాఫర్ నిక్సన్, ఫొటోగ్రఫీ కె. విజయకుమార్, ఎడిటర్ గోపాల్రాజు మాట్లాడారు. -
ఔదార్యం చాటుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
సాక్షి, సిద్ధిపేట : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు సంబంధిత చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారని వారికి తన వంతు సహాయం అందించానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్రశంసించారు. (హైదరాబాద్ వరదలు : ప్రభాస్ భారీ విరాళం ) గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరవాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నేలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్ వరదలు: నాగార్జున విరాళం) -
వూహాన్ గబ్బిలాల మార్కెట్లో సంపూ
సంపూర్ణేష్ బాబు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘హృదయ కాలేయం’తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. అనంతరం హాస్యమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తూ సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ బర్నింగ్ స్టార్. అయితే హృదయ కాలేయం తర్వాత ఆయన చేసిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కాస్త విరామం ప్రకటించి ‘కొబ్బరిమట్ట’తో థియేటర్లలో సందడిచేసి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ రోజు బర్నింగ్ స్టార్ సంపూ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. చైనా దేశంలోని వూహాన్లో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. అయితే కరోనా అంశాన్నే కథాంశంగా తీసుకొని సంపూ తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర పోస్టర్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. వైరస్ పుట్టిన వూహాన్‌లోని గబ్బిలాల మార్కెట్లో చిత్రీకరించిన చివరి సినిమా అంటూ పోస్టర్లపై ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపయింది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ కానప్పటికీ ఈ పోస్టర్లో సంపూ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆయన చుట్టు కరోనా వైరస్ వ్యాపించినట్టు కనిపిస్తుంది. హృదయకాలేయంలో కంప్యూటర్ కనిపెట్టినట్టు ఈ చిత్రంలో కరోనా వైరస్‌తో సంపూ యుద్దం చేస్తాడేమో వేచి చూడాలి. నోలాన్ మౌళి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: ‘ఆకాశవాణి’ని వదిలేసిన జక్కన్న తనయుడు? మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు: సంపూ
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు వారి వారి ఫ్యామిలీలతో జాలీగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాత్రం ఈ సమయంలో తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తన కంశాలి వృత్తిని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా ఆయన చేతులతో తయారు చేశారు. తనదైన శైలిలో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సంపూర్ణేష్ బాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రాజు పేద తేడా లేదు. నీ ఆస్తి, డబ్బు.. నీ వెనక రావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు, గుర్తుచేసుకుంటున్న సమయం ఇది. మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అని సంపూ పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. -
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
-
లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’
దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించారు. అనురాగ్, ముస్కాన్ శెట్టిలు జంటగా నటించిన ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమ కథను చూపించబోతున్నాం. అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని ‘రాధాకృష్ణ’చిత్ర యూనిట్ పేర్కొంది. అలీ, కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీత మందిస్తున్నారు. చదవండి: ‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ పది వేల అడుగుల ఎత్తులో... -
సంపూర్ణేష్ బాబు సందడి
సాక్షి, చీమకుర్తి: సీనీ నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నంబర్–1 సినిమా షూటింగ్ శనివారం సంతనూతలపాడులోని కృష్ణసాయి గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగింది. గ్రానైట్ యజమాని శిద్దా వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి సంపూర్ణేష్ బాబుపై క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. కేఎస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నూతన తార నటించనున్నట్లు యూనిట్ నిర్వాహకులు తెలిపారు. పృథీ్వ, షియాజీ షిండే, కత్తి మహేష్, తనికెళ్ల భరణి, సుధాతో పాటు పలువురు తారాగణం ఈ సినిమాలో నటించనున్నారని తెలిపారు. సినిమాకి మాటలు మరుదూరి రాజా రచిస్తుండగా కెమెరామెన్‌గా అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్ గౌతమ్‌రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అలవలపాటి శేఖర్, నిర్మాతలుగా ఎస్ శ్రీనివాసరావు, నారాయణ, చిరంజీవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్.హరిబాబు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్ చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. -
సంపూర్ణేష్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
సాక్షి, సిద్ధిపేట: సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అలాగే కారు కూడవా కొద్దిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మంగళవారం ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సంపూర్ణేష్ బాబు -
దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుక
-
సంపూ రికార్డ్.. 3 రోజుల్లో రూ.12 కోట్లు!
హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, మరోసారి అదే రేంజ్లో దూసుకుపోతున్నాడు. గత శనివారం రిలీజ్ అయిన సంపూ సినిమా కొబ్బరిమట్ట మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. పెద్ద హీరోల సినిమాలో పోటి ఉన్నా సంపూ సినిమా కలెక్షన్ల విషయంలో సత్తాచాటటం విశేషం. ఈ సినిమా మూడు రోజుల్లో 12 కోట్ల గ్రాస్ సాదించినట్టుగా పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్లో తమ మార్క్ చూపించారు. ఆ పోస్టర్లో స్టార్ మార్క్ పెట్టి ఫ్యాన్స్ కోసం రూ. 9 కోట్ల ఫేక్ కలెక్షన్లు యాడ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు. అయితే సంపూ సినిమా భారీ పోటి మధ్య మూడు కోట్ల వసూళ్లు సాధిచటం కూడా ఘనవిజయమే అంటున్నారు విశ్లేషకులు. హృదయకాలేయం సినిమా దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా వీక్డేస్లోనూ స్టడీ కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. -
సంపూ డైలాగ్.. వరల్డ్ రికార్డ్
హృదయ కాలేయంతో బర్నింగ్ స్టార్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్దమయ్యాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన సింగిల్ షాట్ డైలాగ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ షాట్లో తీసి.. వరల్డ్ రికార్ద్ నెలకొల్పినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. సంపూ ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రూపక్ రోనాల్డ్సోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది. -
సంపూ ట్వీట్.. నవ్వులే నవ్వులు
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరి మట్ట. రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నట్టు సంపూ ప్రకటించారు. ఆగస్ట్ 9న కింగ్ నాగార్జున ‘మన్మథుడు-2’విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్‌లను ట్యాగ్ చేస్తూ సంపూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మా సినిమా ఆగస్ట్ 10న విడుదల కాబోతుంది. నాగార్జున సర్, రాహుల్ సర్, రకుల్ గారు, వెన్నెల కిశోర్ గార్ల ఆశీర్వాదాలు కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్ అయి, టికెట్లు దొరకక మా సినిమాకు రావాలని కోరుకుంటున్నాము. మీ సంపూర్ణేష్ బాబు’అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. ఇక సంపూ ట్వీట్‌పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్‌లు తమదైన రీతిలో స్పందించారు. ‘హహహ తథాస్తు సంపూ గారు, ఆల్ ద బెస్ట్’అంటూ రాహుల్ పేర్కొనగా.. ‘ఐదు వేళ్లలాంటి మనకు నాలుగు బ్రష్‌లు అవసరం లేనప్పుడు, మన రెండు సినిమాలకు ఏంటన్నా. లవ్ అండ్ కేరింగ్‌కు లవ్ యూ’అంటూ వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా ఎపుడో విడుదల కావాల్సి ఉన్న ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కున్న అడ్డంకులు తొలగడంతో ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నారు. We are releasing on August 10th. Need blessings from King @iamnagarjuna sir, @23_rahulr sir, @Rakulpreet garu and @vennelakishore anna garu. Mee cinema housefulls ayi, tickets dorakka maa cinema ki ravalani korukuntunnanu. Mee Sampoornesh babu#KobbariMattaOnAug10 pic.twitter.com/O8hl8SgrIC — Sampoornesh Babu (@sampoornesh) July 26, 2019 -
‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా ప్రమోషన్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంపూ, తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోగా నటించిన సింగం 123తో పాటు కామెడీ రోల్స్ కూడా పెద్దగా క్లిక్ కాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. సంపూ మంచి ఫాంలో ఉండగానే కొబ్బరి మట్ట పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. పోస్టర్లు, టీజర్లతో బాగానే హడావిడి చేశాడు. కానీ తరువాత ఆ సినిమా గురించి ఆడియన్స్ మర్చిపోయారు. అప్పుడప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందని మరో పోస్టర్ రిలీజ్ చేశాడు సంపూ. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూన్ 20న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నాట్టుగా తెలిపాడు. రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. మరి ఈ సినిమా బర్నింగ్ స్టార్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తుందేమో చూడాలి. Vasthunnaaam...#KOBBARIMATTA pic.twitter.com/JYLrny7HGB — Sampoornesh Babu (@sampoornesh) 18 June 2019 -
‘కంటి చూపుతో కాదు.. అరటిపండుతో చంపేస్తా’
సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్ చాలా కామెడీగా, లాజిక్ లేకుండా ఉంటాయి. వందమంది విలన్లనైనా సరే మన హీరో ఒంటి చేత్తో రఫ్పాడిస్తాడు. అదీ చొక్కా నలగకుండా. విలన్ ఎంతటి వాడైనా సరే చివరకు హీరోదే పై చేయి అవుతుంది. ఇవే కాక కొన్ని సినిమాల్లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్లు మరీ దారుణంగా ఉంటాయి. తొడగొడితే.. ట్రైన్ ఆగిపోవడం, మీసం తిప్పితే.. ప్రత్యర్థులు భయపడటం వంటివి. వీటికి లాజిక్ లేకపోయినా సినిమాలో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ఇలాంటి సీన్లు తీస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్లో మన హీరో ఏకంగా అరటి పండుతోనే అరడజను మంది విలన్ల పీకలు కోస్తున్నాడు. అరటి పండుతో పీకలు కోయడం ఏంటని అనుకుంటున్నారా.. అదే మరి మన సినిమాల గొప్పతనం. హీరో తల్చుకుంటే అరటి పండు ఏం ఖర్మ..! దాని తొక్కతో కూడా ప్రత్యర్థుల బెండు తీయగలడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ‘హృదయ కాలేయం’ ఫేం సంపూర్ణేష్ బాబు హీరోగా.. అమిత్ నాయర్ దర్శకత్వంలో 2015లో వచ్చిన సింగమ్ 123 సినిమాలోనిది ఈ సీన్. అదిప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయింది. Senjata dan action scene TNCFU masih kalah brutal, jauh. pic.twitter.com/iZGKkaVyna — Kampus Film (@kampusfilmID) December 25, 2018 30 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సంపూ అరటి పండుతో విలన్ల పీకలు కోస్తాడు. అదే విలన్ గన్‌తో ఫైర్ చేసినా మన హీరోకేం కాదు. బుల్లెట్ల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా వాళ్లకు తెగ నచ్చిందంట. దాంతో మొత్తం సినిమా చూడ్డానికి సాయం చేయండని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వారిని కోరారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా తెరకెక్కించిన ‘నైట్ కంమ్స్ ఫర్ ఆస్’ సినిమాలో కూడా సేమ్ ఇలాంటి సీనే ఉందంట. వీరి రిక్వెస్ట్‌కు స్పందించిన సినిమా నిర్మాత, హీరో మంచు విష్ణు సినిమా సీడీని నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్‌కు పంపిస్తానని ట్వీట్ చేశారు. Dammmmmmnnnnn, Boy! ROFL 🤣 🤣😂🤣😂🤣 @NetflixIndia @NetflixID You got it! Will send it over to your office!!!! https://t.co/7tO4wwvH5V — Vishnu Manchu (@iVishnuManchu) December 27, 2018 -
ఎన్టీఆర్ 15, విజయ్ దేవరకొండ 5
సాక్షి, హైదరాబాద్: తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ కథానాయకులు ముందుకు వచ్చారు. తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆపన్న హస్తం అందించేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. వరద బీభత్సానికి కకావికలమైన కేరళ రాష్ట్రానికి దన్నుగా నిలిచిన తెలుగు చిత్ర ప్రముఖులు ఇప్పుడు తిత్లీ తుపాను బాధితులకు అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, నందమూరి కళ్యాణ్‌రామ్ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ‘అర్జున్‌రెడ్డి’ రూ.5 లక్షలు అలాగే యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తన వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు పంపారు. తుపాను బాధితులకు అండగా నిలవాలని ఆయన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. తన వంతు సాయం చేస్తానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. తిత్లీ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు విరాళాలు ఇచ్చి సహకరించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంపూ.. శభాష్! టాలీవుడ్లో అందరికంటే ముందుగా ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేశ్‌బాబు స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 వేలు విరాళమిచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. హుద్ హుద్ తుపాను సమయంలో కూడా లక్ష రూపాయలు సహాయంగా అందించారు. ఆపన్నులకు అండగా నిలవడంలో అందరికంటే ముందుండే ‘సంపూ’పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తిత్లీ తుపాను బాధితులకు సహాయం చేయాలనుకునే వారు తమ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించొచ్చు అకౌంట్ పేరు: సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ నంబరు: 110310100029039 ఐఎఫ్ఎస్సీ కోడ్: ANDB0003079 బ్యాంకు, బ్రాంచ్: ఆంధ్రా బ్యాంకు, ఏపీ సచివాలయం బ్రాంచ్, వెలగపూడి -
ఇంద్రకీలాద్రిపై సంపూ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : సినీ హీరో సంపూర్ణేష్ బాబు ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న సంపూర్ణేష్‌బాబు తన నటించిన నూతన చిత్రం కొబ్బరి మట్ట విజయవంతం కావాలని అమ్మవారికి మొక్కుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపించారు. కొంత మంది భక్తులు సంపూ మొదటి చిత్రమైన హృదయకాలేయం గురించి మాట్లాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సంపూ
పరకాల రూరల్ : వెన్నుపూస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగు సినిమా హీరో సంపూర్ణేష్ బాబు కోరారు. వెన్నుపూస బాధితుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ నడవలేక వెన్నుపూస సమస్యతో పూర్తిగా మంచానికే పరిమితమై దుర్భరజీవితం గడుపుతున్న బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. స్పైనల్‌కార్డ్ బాధిత దివ్యాంగులకు ప్రత్యేక ఫిజియోథెరపీ సెంటర్లను నెలకొల్పడంతోపాటు వైద్యఖర్చుల నిమిత్తం ప్రతి నెల రూ.10వేలను అందించాలని కోరా రు. వారికి బ్యాటరీ వీల్‌చైర్స్ అందించాల ని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ జాతీయ కన్వీనర్ టి.రాజేందర్ మాట్లాడుతూ స్పైనల్‌కార్డ్ బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్పైనల్‌కార్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షఫీ అహ్మద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ రాజు, ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్మున్నా, అర్భన్, రూరల్ జిల్లా అధ్యక్షులు వద్దె మానుకోట తిరుపతి, అడ్డరాజు, నియోజకవర్గ ఇంచార్జ్ లాసాని నర్సింగారావు, రాములు, రఘుపాల్‌రెడ్డి, రాముడు, రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టక్కరి దొంగ.. చక్కని చుక్క
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘టక్కరి దొంగ.. చక్కనిచుక్క’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. అలీ కథానాయకుడిగా ‘అల్లరి పెళ్లికొడుకు’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ కాంబినేషన్లో ఆర్.కె. ఫిలిం ఫ్యాక్టరీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ మాట్లాడుతూ –‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. స్క్రిప్ట్ బాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయి. ఈ నెల రెండో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: పైడాల శ్రీనివాస్. -
‘కొబ్బరి మట్ట’పై కొత్త అప్డేట్
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సంపూర్ణేష్ బాబు తరువాత హీరోగా నటిస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రారంభమైంది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమా ఫైనల్‌గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు రాజేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఫైనల్ గా సినిమా పూర్తయ్యింది. సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.. ఈ సినిమా నిర్మాణం కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ధారాపోశాం. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన. ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మీ ప్రేమ, సపోర్ట్ కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా మీరు మంచోరు’ అంటూ ట్వీట్ చేశారు. Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... Get ready for the release date...#KobbariMatta @sairazesh @RonaldsonRupak pic.twitter.com/Jc8ZvPQout — Sampoornesh Babu (@sampoornesh) 2 July 2018 Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... ఎలాంటి క్రియేటివ్ PUBLICITY ఎలా చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన... pic.twitter.com/StOiOsS7tn — Sai Rajesh (@sairazesh) 2 July 2018 -
సంపూ సినిమాకు 233 కోట్ల కలెక్షన్లు..
హైదరాబాద్: వేటాడే ముందు వెనకడుగేసిన సింహంలా.. కొన్నాళ్లపాటు ప్రచారానికి దూరంగా సంపూర్ణేశ్ బాబు మళ్లీ జూలు విదిల్చాడు. బిగ్‌బాస్ షో తర్వాత దాదాపు కనిపించకుండాపోయిన ఈ ‘బర్నింగ్ స్టార్’ .. బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించాడు. తన తాజ చిత్రం ‘కొబ్బరిమట్ట’ తొలివారం ఏకంగా రూ.233.64 కోట్ల కలెక్లన్లు సాధించాడు. ‘అదేంటి? అసలా సినిమా రిలీజైందా?’ అనేకదా మీ డౌట్! నిజమే, సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు చెబితే అతను సంపూ ఎందుకవుతాడు? బాబుకు బర్త్‌డే గిఫ్ట్: ‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసగా మారిన సంపూ.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలుపెట్టిందే కొబ్బరిమట్ట సినిమా. రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన ఈ స్ఫూఫ్ యాక్షన్ కామెడీని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. బుధవారం సంపూర్ణేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కొబ్బరిమట్ట యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. అందులో ‘233.64 కోట్లు.. ఫస్ట్ వీక్ ఎక్స్పెక్టెడ్ గ్రాస్’ అని పేర్కొన్నారు. -
వారి ప్రేమకు బానిసను: సంపూర్ణేష్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇన్నేళ్లకి నా కల నెరవేరిందంటున్నాడు సంపూ. ఇంతకీ ఆయన కల ఏంటనేగా.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. సంపూర్ణేష్ బాబు (నర్సింహా చారి)కు అభిమాన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను కలవాలని ఈ నటుడికి ఎప్పటినుంచో కోరిక. అది ఇప్పుడు సాకారం కావడంతో సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు సంపూ చేసిన ట్వీట్ ను గమనించండి. 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవటం నా కల...ఆ కల ఇన్నేళ్ళకి సాకారం అయింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలిశాను. సదా వారి ప్రేమకి నేను బానిసను' అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను ట్వీట్టర్లో తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నాడు. సంపూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవటం నా కల...ఆ కల ఇన్నేళ్ళకి సాకారం అయింది. Met our Jr.@KTRTRS too - sadhaa vaari premaki banisa pic.twitter.com/99NwmyC1KN — Sampoornesh Babu (@sampoornesh) 27 November 2017 -
పోస్టర్ చూసి రాజమౌళి కామెంట్ చేశారు..
హృదయ కాలేయం.. పేరు నుంచి తీరు వరకు అందరినీ తన వైపునకు తిప్పుకున్న సినిమా. ‘మీ ప్రేమకు బానిసను’ అంటూ.. అందులో కథానాయకుడి పాత్ర పోషించి అంతే స్థాయిలో మెప్పించిన నటుడు సంపూర్ణేష్ బాబు. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా సంపూ నటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. హాస్య నటుడే అయినా కథా నాయకుడి స్థాయిలో అలరిస్తూ అభిమానులను సంపాదించుకున్నారాయన. సినిమాల్లో కమెడియన్ వేషాలు వేస్తూనే సోలో హీరోగానూ సింగం 123, వైరస్, కొబ్బరి మట్ట వంటి చిత్రాలు చేస్తున్నారు. శ్రీకాకుళం వచ్చిన ఈ హాస్య నటుడు ‘సాక్షి’తో ఇలా ముచ్చటించాడు. చదువుంటే హీరోనే శ్రీకాకుళం రూరల్: చదువుకున్న ప్రతి ఒక్కరూ హీరోలేనని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం పీఎన్ కాలనీలో గల సాయివిద్యామందిర్కు విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సిక్కోలు నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారని, ఇక్కడి వారి ప్రేమాభిమానాలు ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. అనంతరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంక్షేమం తరఫున సంపూర్ణేష్ బాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్ముణల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.వేణుగోపాలరావు, కోశాధికారి కె.బ్రహ్మజీ, యూత్ కోఆర్టినేటర్ జి.రమేష్, కె.వీరభద్రరావు, ఎం.హరనాథ్, సాయివిద్యామందిర్ కరస్పారెండెంట్ ఎస్.లక్ష్మి, ప్రిన్సిపాల్ బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బర్నింగ్ స్టార్.. ఈ పేరే విచిత్రంగా ఉంది. ఈ బిరుదు ఎలా వచ్చింది? హృదయ కాలేయం పోస్టర్ చూసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్లో కామెంట్ చేశారు. దీంతో ఆ సినిమా అందరి దృష్టిలో పడింది. ఆ సినిమాలో నా డైలాగ్ డెలివరీని చూసి బర్నింగ్ స్టార్ అని పెట్టారు. అభిమానులే దాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన వారైనా సమైక్యాంధ్రకు అప్పట్లో ఎలా మద్దతు ఇచ్చారు? బేసిక్‌గా మాది తెలంగాణలోని సిద్ధిపేట గ్రామం. అప్పట్లో అందరం కలిసి ఉందామనే భావనతో నేనూ ఉద్యమంలో పాల్గొన్నాను. మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు? నా మొదటి చిత్రం హృదయ కాలేయంతో నేనేంటో ఇండస్ట్రీకి చూపిం చాను. తర్వాత సింగం 123 చేశాను. మూడో చిత్రంగా వైరస్, ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంలో చేశాను. ఇది డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. కొబ్బరి మట్ట చిత్రం కథేంటి? అందులో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటించాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య చిత్రం ఇది. ఇందులో ఏకధాటిగా స్త్రీల కోసం రెండు నిమిషాల్లో ఒక డైలాగ్ చెప్పాను. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. బిగ్‌బాస్ అనుభవాలేంటి? బిగ్‌బాస్ షోకి వెళ్లిన మూడు రోజులకే నాకు ఫోబియా వచ్చేసింది. చదవడానికి న్యూస్ పేపర్లు, చూడడానికి టీవీ, మాట్లాడడానికి మొబైల్ ఏవీ లేవు. ఒకవిధంగా బయట ప్రపంచంతో సంబంధమే లేదు. దీంతో నేను ఆ షోలో ఉండలేకపోయాను. తొమ్మిది రోజులకే షో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాను. షార్ట్‌ఫిల్మ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. వారిని ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయా? టాలెంట్ ఉన్నవారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయి. నిద్రపోతూ కలలు కంటే అవి నెరవేరవు. కలలు నెరవేరాలంటే మనం కష్టపడి పనిచేయాలి. సేవా కార్యక్రమాల్లో మీరు ముందంజలో ఉంటారు. ఎలా ఫీలవుతున్నారు? ప్రతి ఒక్కరిలో సేవాభావం, మానవత్వం ఉండాలి. అందులో భాగంగానే నేను నాకు తోచిన సాయం చేస్తున్నారు. హుద్‌హుద్‌లో రూ.ఒక లక్ష ముఖ్యమంత్రికి అందించాను. చెన్నై వరదల సమయంలోనూ నా వంతు చేయూత అందించాను. ఇటీవల ఐరన్ లెగ్ శాస్త్రి కొడుక్కి బాగు లేదని నన్ను కలిశారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశాను. నాటకాలు ఏమైనా చేసి ఉన్నారా? సంపూ: ఎప్పటి నుంచో రంగస్థలం నాటకాలు చేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాను. -
'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి!
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఏడో ఎపిసోడ్లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. తెలుగులో తొలి రియాల్టీ షోగా ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న 'బిగ్ బాస్' షో హౌస్ నుంచి తనను పంపంచి వేయాలని నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (నరసింహాచారి) కోరడం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను అశ్చర్యానికి గురిచేసింది. షోలో తొలి నాలుగు రోజులు కెప్టెన్‌గా వ్యవహరించిన సంపూ తగిన రీతిలో ఆకట్టుకోకపోవడం, సభ్యులను నియంత్రించడంలో విఫలమవడం.. అధిక సమయం నిద్రకు కేటాయించారన్న కారణాలతో బిగ్ బాస్ ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయారు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పారు. మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన చెందారు. దీంతో 'బిగ్ బాస్'గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేశారు. షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని సంపూర్ణేష్‌కు ధైర్యం చెప్పారు. టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పారు. ఒకవేశ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్లో సంపూ పేరు వచ్చేలా చేస్తామన్నారు. తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్‌కు 'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో ఆయన కాస్త కంట్రోల్ అయ్యారు. సంబంధిత కథనాలు 'బిగ్ బాస్'లో నటుడు సంచలన వ్యాఖ్యలు బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్‌కు షాక్..! -
బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్‌కు షాక్..!
హైదరాబాద్ : ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోంది. అయితే ఐదో ఎపిసోడ్లో క్రమశిక్షణ తప్పిన ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి (గురువారం) ఎపిసోడ్లో బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకుని సంపూర్ణేష్ బాబు కు పెద్ద షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంపూర్ణేష్ బాబుని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. తనకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు ఎక్కువ సేపు నిద్రపోవడం , పగటి పూట కూడా పడుకోవడంతో ఆయన్ను కెప్టెన్ పదవి నుండి తొలగించారు. సంపూ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగించిదని, ఇంకెప్పుడు సంపూ కెప్టెన్ కాలేడని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇంకా సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంలో విఫలమైన సమీర్ని స్వయంగా బిగ్ బాస్ వచ్చేవారం ఎలిమినేషన్‌కి ఎంపిక చేశారు. -
సంపూర్జేష్బాబు ఫస్ట్ లుక్
-
మహేష్‌కు పోటీగా మరో స్టార్..!
సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్‌ల సినిమా ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయటంలో మురుగదాస్‌కు మంచి రికార్డ్ ఉంది. ముఖ్యంగా మురుగదాస్ సినిమాల టీజర్లు సంచలనాలు నమోదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. The Countdown Begins!Mark your Calendar!!Set your Time!!#Mahesh23 #ARM11 #FirstLook12Apr17@5pm @ARMurugadoss @urstrulyMahesh — NVR Cinema (@NVRCinema) 10 April 2017 అయితే ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ టీజర్‌కు పోటిగా మరో స్టార్ తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా 'కొబ్బరి మట్ట' సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పాపరాయుడు సాంగ్ టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నటుగా చిత్రయూనిట్ ప్రకటించారు. -
స్టేటస్ ఫైట్: సంపూర్ణేష్, తమ్మారెడ్డికి బ్రేక్!
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఆందోళనకు దిగిన విద్యార్థులు, యువతపై పోలీసుల ఓవరాక్షన్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ వచ్చిన సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సంపూర్ణేష్ బాబు, సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటులు పలువురు ట్విట్టర్, ఫేస్బుక్లో మద్దతు పలికిన సంగతి తెలిసిందే. హీరోలు చాలామంది సోషల్ మీడియాలో ఉద్యమానికి జై కొట్టినప్పటికీ, హీరో సంపూర్ణేష్ బాబు హోదా పోరుకు మద్దతుగా వైజాగ్ వస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన తమ్మారెడ్డి భరద్వాజ తదితరులతో కలిసి వైజాగ్ రాగా, నిరసన ప్రదర్శనలో పాల్గొనకముందే వారిని పోలీసులు అడ్డుకున్నారు. -
కోలీవుడ్‌కి సంపూ సినిమా
ఆన్లైన్ సెన్సెషన్‌గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ తరువాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాలో త్రిపాత్రాభియం చేస్తున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ ఒకరు ఈ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సంజన మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలిసారి సంపూర్ణేష్ సినిమాను ఓవర్సీస్లోనూ మిడ్ వెస్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా భారీగా రిలీజ్ చేస్తున్నారు. -
మోహన్‌బాబు నాకు పరోక్ష గురువు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘సాక్షి’తో మాటామంతీ మచిలీపట్నం : ‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే అత్యంత ఇష్టం. మోహన్‌బాబు సుదీర్ఘంగా చెప్పే డైలాగులను పదే పదే వల్లెవేసే వాడిని. పెద్ద పెద్ద డైలాగులు చెప్పటంలో ఆయనే నాకు పరోక్ష గురువు. డ్రస్సుల విషయంలో ఉపేంద్ర శైలిని ఫాలో అయ్యే వాడిని’- అని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు అన్నారు. వినాయకచవితి వేడుకల్లో పాల్గొనేందుకు మచిలీపట్నం వచ్చిన ఆయన కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. సిద్దిపేట మెట్టపల్లి తన స్వగ్రామమని చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా సాగింది.... సాక్షి : సినిమాల పట్ల ఆసక్తి ఎలాపెరిగింది? సంపూర్ణేష్ : సినిమాలంటే చిన్ననాటి నుంచి ఇష్టం. మోహన్‌బాబుకు వీరాభిమానిని. ఆయన డైలాగులను బట్టీపట్టి నాలో నేనే చెప్పుకునే వాడిని. నటన పట్ల ఆసక్తి ఉండటంతో సినిమా రంగం వైపు మళ్లాను. కృష్ణవంశీ దర్శకత్వంలో మహాత్మా సినిమాలో చిన్నపాత్రలో నటించాను. సాక్షి : హృదయకాలేయం సినిమా హిట్ అవుతుందని ఊహించారా ? సంపూర్ణేష్ : హృదయకాలేయం సినిమా తీసే సమయ ుంలో అందరు నన్ను తిట్టారు. ఈ సినిమా తీస్తున్నావు... రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయినా ఆడుతుందా అన్నారు. సినిమా విడుదలయ్యాక ఇంతగా ప్రజలు ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. సినిమా రిలీజ్ ముందు ప్రచారానికి డబ్బులు లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాం. సాక్షి : ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ వస్తుందని ఊహించారా ? సంపూర్ణేష్ : ప్రతి ఒక్కరు కలలు కంటారు. నేను సినిమాలో హీరోగా చేస్తున్నానంటే కొందరు నమ్మలేకపోయారు. సినిమా రంగంలో నిలబడాలనేది నా కోరిక. ఎదిగేందుకు కొంత కృషి తోడైతే అనుకున్నది సాధించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. సాక్షి : మీ రాబోయే సినిమాలు ? సంపూర్ణేష్ : కొబ్బరిమట్ట, వైరస్ సినిమాల నిర్మాణం పూర్తయింది. త్వరలో ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి. మోహన్‌బాబుకు ఉన్న లక్షలాది అభిమానుల్లో నేను ఒకడిని. నేను ఆయన బ్యానర్లోనే ‘సింగం 123’ సినిమా చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షి : సినిమా రంగంలో మీకు ప్రోత్సాహం ఎలా ఉంది. ? సంపూర్ణేష్ : నాకు సినిమాల పట్ల అభిమానం ఉంది. హీరో అవుతానని అనుకోలేదు. హృదయకాలేయం సినిమా డెరైక్టర్ స్టీవెన్ శంకర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన చొరవ లేకపోతే సంపూర్ణేష్‌బాబు లేడు. సినిమా రంగంలో టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు అధికంగానే ఉన్నాయి. సినిమా రంగానికి మీడియా వెన్నుదన్నుగా ఉంటోంది. అందుకు నేనే ఉదాహరణ. సాక్షి : మచిలీపట్నం రావడం ఎలా అనిపించింది ? సంపూర్ణేష్ : మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నన్ను ఆహ్వానించి వినాయకచవితి పూజల్లో పాల్గొనాలని కోరారు. మచిలీపట్నం మొట్టమొదటిసారిగా వచ్చాను. ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. -
సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!
యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీయన్‌గా కూడా దూసుకుపోతున్న సంపూ, తన ట్విట్టర్ పేజ్‌లో స్టార్ హీరోలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా మొదట్లో వచ్చే ఈ నగరానికేమయ్యింది యాడ్ స్టైల్లో ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంపై కౌంటరేశాడు సంపూ. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన కామెంట్‌ను షేర్ చేశాడు సంపూ. 'ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్థార్ గబ్బర్‌సింగ్, మరో పక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరుమెదపలేదు, ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమగీతం' అని రాసున్న పోస్ట్‌ను షేర్ చేశాడు. అయితే ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేస్తే అభిమానుల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ముందే ఆలోచించిన సంపూర్ణేష్, ఎవరో పంపించారు సరదాకి తీసుకోండి అంటూ స్టార్ హీరోల అభిమానులను కూల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అదే సమయంలో తన కొబ్బరి మట్ట సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసుకున్నాడు. Hahaha....evaro pampincharu...saradaki theesukondi pic.twitter.com/I4d9U4C2Bs— Sampoornesh Babu (@sampoornesh) 24 July 2016 -
ఆ డైలాగులకు సునామీ వచ్చేలా ఉంది
- మారుతి ‘‘సంపూ ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకున్నాక అతనిపై గౌరవం పెరిగింది. టీజర్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందనడంలో సందేహం లేదు’’ అని హీరో సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు. సంపూర్ణేశ్ బాబు, గాయత్రి, గీతాంజలి ముఖ్యతారలుగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో సాయిరాజేశ్ నీలం, ఆది కుంభగిరి నిర్మించిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ- ‘‘టీజర్లో సంపూ చెప్పిన డైలాగులకు సునామీ వచ్చేలా ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టీజర్ సాయిధరమ్ తేజ్ లాంచ్ చేస్తుంటే, నాకు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవిగారు లాంచ్ చేశారనే ఫీలింగ్ కలిగింది’’ అని సంపూర్ణేశ్ బాబు అన్నారు. ఈ వేడుకలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్, నిర్మాత సాయిరాజేశ్ నీలం పాల్గొన్నారు. -
పెదరాయుడిగా సంపూర్ణేశ్
హైదరాబాద్: సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హృదయకాలేయం చిత్రంతో విలక్షణ నటన కనబరిచి అభిమానులను కుప్పలుగా సంపాదించుకుని బర్నింగ్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తిరిగి అదే టీంతో చేస్తున్న చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ చిత్ర టీజర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రుపక్ రోనాల్డ్స్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేశ్ బాబు గతంలో బడా హీరోలు చేసిన పాత్రలను అనుకరించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారట. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఆయన పెద రాయుడిలా కనిపించారు. అప్పటి పెద రాయుడు చిత్రంలో మోహనబాబు ఎలాంటి వేషధారణలో కనిపించారో అచ్చం అలాగే. ఒక మహిళను కొడుతుండగా.. ఎంట్రీ ఇచ్చిన మహిళల గొప్పతనం ఏమిటో ఓ భారీ డైలాగ్‌లో గుక్క తిప్పుకోకుండా కనిపించారు సంపూర్ణేష్. ఈ డైలాగ్ పూర్తవడంతోనే ట్రైలర్ కూడా ముగిసిపోతుంది. అన్నట్లు ఈ చిత్రంలో బాహుబలి స్ఫూప్ కూడా ఉందంట. -
విద్యార్థులకు సంపూ బహుమతి..
'హృదయ కాలేయం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు సంపూర్ణేష్ బాబు ఓ స్కూలు విద్యార్థుల మనసు గెలుచుకున్నాడు. చిత్రమైన గెటప్‌లు, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న సంపూ తోటివారికి సాయం చేయడానికి 'నేను సైతం' అంటూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సంపూ తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' సినిమా షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతుంది. షూటింగ్ విరామంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించాడు సంపూ. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. టాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు రూ.15,000 లు చొప్పున బహుమతిగా ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. దాంతో విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించరాదని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు, దేశానికి సేవ చేయాలని విద్యార్థులను కోరాడు. -
వైరస్‌లా మారిన సంపూ
హృదయకాలేయం సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ టాప్ స్టార్లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సోషల్ మీడియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బర్నింగ్ స్టార్, ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. స్పెషల్ క్యారెక్టర్లతో పాటు హీరోగానూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే కొబ్బరి మట్ట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు, మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్.కామ్ పేరుతో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌ను రెడీ చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. సిహెచ్ రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతాషా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హృదయకాలేయం సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంపూ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
సంపూర్ణేష్ కొత్తచిత్రం ’కొబ్బరిమట్ట’ప్రారంభం
-
సంపూర్ణేశ్తో సినిమా అంటే వద్దన్నాను!
‘‘విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆరంభించి, కొత్త టెక్నీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజు సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేస్తానని విష్ణు చె బితే, నేనొప్పుకోలేదు. కానీ అతనితోనే చేస్తానని పట్టుబట్టేసరికి కాదనలేక పోయాను’’ అని మోహన్‌బాబు అన్నారు. సంపూర్ణేశ్‌బాబు, సనమ్ జంటగా డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘సింగం 123’. అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చూసినపుడు సంపూర్ణేశ్ బాబులో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించింది. ప్రతి సన్నివేశంలో చాలా అద్భుతంగా నటించాడు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, రచయిత డైమండ్ రత్నం, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
అక్క పెట్టిన ఆవకాయ ఇష్టం
పెరుగన్నంలోకి ఆవకాయలేందే ముద్ద తిగదు. అంతేకాదు అటుకులు, మరమరాల్లో కూడా మామిడి చట్నీ కలుపుకొని తినడం ఇష్టం. యేడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి కన్నా లేత మామిడికాయను చిన్న ముక్కముక్కలుగా తరిగి పెట్టే పచ్చడంటే ప్రాణం. మామిడికాయ చట్నీ పెట్టడంలో మా అక్కయ్య భాగ్యమ్మ తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మొన్నే పెట్టేసిందట.. వచ్చి తీసుకెళ్లు అంది. టైమ్‌లేక వెళ్లలేదు. అమ్మ (కమలమ్మ) అయితే పెట్టి పంపించేసింది. అక్క పెట్టిన పచ్చడీ తెచ్చుకోవాలి. కొత్త పచ్చడి వచ్చిందంటే ఓ వారం దాకా దాంతోనే భోజనం. ఎన్ని అద్భుతమైన కూరలున్నా మామిడికాయ పచ్చడి ముందు దిగదిడుపే! - సంపూర్ణేశ్ బాబు -
ఎవర్నీ నొప్పించే ఉద్దేశం లేదు : మంచు విష్ణు
‘‘ ‘హృదయ కాలేయం’ చూశాక సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నా. ‘సింగం 123’ కేవలం ఓ స్పూఫ్ మాత్రమే. ఈ చిత్రాన్ని కామెడీ యాంగిల్లోనే చూడ మని నా తోటి నటీనటులను కోరుతున్నా. ఈ చిత్రంతో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన నిర్మాతగా, సంపూర్ణేశ్ బాబు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగం 123’. శేషు కేఎంఆర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ -‘‘కరెంట్ తీగ సినిమాలో చిన్న రోల్ చేశాను. ఆ రోల్ నాకు చిన్నదైపోయిందేమో అని నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేసేశారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేశాను’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘విష్ణు నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఓ డిఫరెంట్ సంపూను చూస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘డైమండ్’ రత్నం, ఛాయాగ్రాహకుడు సతీశ్ ముత్యాల, నటులు వైవా హర్ష, విజయ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. -
సంపు 'సింగం 123' ఆడియో విడుదల
-
'సింగం123'గా వస్తున్న సంపూర్ణేష్
-
బ్రేక్ ఖాయం - ప్రిన్స్
‘‘ఈ టైటిల్ చాలా బాగుంది. ప్రిన్స్ నా తమ్ముడితో సమానం. క్రికెట్లో ఓపెనర్‌గా తను బాగా ఆడినట్టుగానే, ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలి’’ అని హీరో శ్రీకాంత్ చెప్పారు. ప్రిన్స్, జ్యోతీ సేథీ, సంపూర్ణేశ్‌బాబు, రావు రమేశ్ ముఖ్య తారలుగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీభ్రమరాంబా క్రియేషన్స్ పతాకంపై కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో ఎల్. వేణుగోపాలరెడ్డి, పి. లక్ష్మీనరసింహారెడ్డి, ఎ. చిరంజీవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ప్రిన్స్ మాట్లాడుతూ - ‘‘కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని అంశాలూ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాతో నాకు బ్రేక్ ఖాయం’’ అన్నారు. థ్రిల్ ఫీలయ్యే క్రైమ్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. -
‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!
ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. ‘సాక్షి’తో సంపూర్ణేశ్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... ‘‘నరేశ్ పక్కన అదీ ఈవీవీ గారి సంస్థలో నటించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ‘బందిపోటు’లో నటించడం ఓ గొప్ప అనుభవం. సెట్లో గడిపిన ప్రతీ క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఈ సినిమా వల్ల ‘అల్లరి’ నరేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే తదితర గొప్ప నటులతో కలిసి తెరను పంచుకొనే అవకాశం కలిగింది. వీళ్లందరితో కలిసి నటించాలని తెలిసి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ సెట్లోకి అడుగుపెట్టగానే వాతావారణం అంతా మారి పోయింది. అందరూ చాలా సరదాగా... ఆద్యంతం నవ్వుతూ, నవ్విస్తూ నన్ను కలుపుకొన్నారు. ఆర్యన్ రాజేశ్ గారికి, ‘అల్లరి’ నరేశ్ గారికి నేనంటే చాలా ఇష్టం. వాళ్లు నన్నెంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను. ఆర్యన్ రాజేశ్ గారి ప్రత్యేకమైన ఆసక్తి వల్లే నేను ఈ సినిమాలో నటించాను.’’ టైమింగ్ తెలిసింది! ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు తెల్లబ్బాయ్. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఎదుటివారి ఎత్తుల్ని, పైఎత్తుల్ని, లాజిక్కుల్ని పసిగట్టలేక పోతుంటాను. అందుకే ‘నీ తెల్లటి మనసుకు తెలియలేదురా తెల్లబ్బాయ్’ అని డైలాగ్ చెబుతాడు అల్లరి నరేశ్. ఆయనకి స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తాను. నరేశ్‌తో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం నా జీవితాంతం గుర్తుండి పోతుంది. కామెడీ టైమింగ్ అంటే ఏంటో ఆయన నుంచి బాగా తెలుసుకున్నాను. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.’’ ఇంట్రడక్షన్ మిస్ కావద్దు! ‘‘సినిమాలో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే... నా ఇంట్రడక్షన్ మరో ఎత్తు. గురువుగారు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో నన్ను తెరపై చూపించారు. అందుకే ఆ సన్నివేశాలను అస్సలు మిస్ కావద్దని చెబుతున్నా. సడన్ స్టార్, బర్నింగ్ స్టార్ కలిస్తే థియేటర్ నవ్వులతో మార్మోగిపోవాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది.’’ రాజమౌళి గారిని అడుగుతా..! ‘‘ ‘బందిపోటు’ ఆడియో వేడుకలో రాజమౌళి గారిని కలిశాను. ‘బాహుబలి’ విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిసి.. ‘తదుపరి మీరు చేయ బోయే సినిమాలో కనీసం రెండు నిమిషాలైనా కనిపించాలనుంది’ అని అడుగుతా. ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం 123’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నా. వాటితో పాటు ఇంకో మూడు చిత్రాల్లోనూ సోలోగా నటించడానికి ఒప్పుకొన్నా.’’ -
సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు సింగర్ గా మారాడు. 'కొబ్బరి మట్ట' సినిమా కోసం గొంతు సవరించాడు. దీంతో గాయకులుగా మారిన నటుల జాబితాలో చోటు సంపాదించాడు. హీరోలు పాటలు పాడడం ఇటీవలకాలంలో ట్రెండ్ గా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ పాటలు పాడి అభిమానులను అలరించారు. సంపూర్ణేష్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. సంపూ పాడిన పాటను ఇంటర్నెట్ లో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. 'కొబ్బరిమట్ట'లో సంపూర్ణేష్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో అతడు కనిపించనున్నాడు. 'హృదయకాలేయం'తో సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ 'కొబ్బరిమట్ట'తో తన హవా కొనసాగించాలని భావిస్తున్నాడు. -
కోలీవుడ్‌లో సంపూకి బంపర్ ఆఫర్
-
వినోదం 100% మూవీ స్టిల్స్
-
కోరుకున్నది దేవుడిచ్చేశాడు!
అంతర్వీక్షణం: సంపూర్ణేశ్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ విలక్షణత సంపూర్ణేశ్‌బాబు. తెలుగు సినిమాలపై వ్యంగ్యాస్త్రంగా ఆయన సంధించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఆ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక్క సినిమాతో అందరికీ సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క సినిమాతో వంద సినిమాల ఆదరణ చూపిన ప్రేక్షకులకు వందనమనే ‘సంపూ’తో కొన్ని ముచ్చట్లు... ఎక్కడ పుట్టారు?... మెదక్ జిల్లాలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి అమ్మానాన్నలు?...నాన్న మహాదేవ్, అమ్మ కౌసల్య ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? ఇలా, అలా అని లేదు. అందరినీ ఇష్టపడతాను. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ? ఒక్కసారి చూడగానే అంచనా వేసేటంత గొప్ప వాడిని కాదు, అందరితో స్నేహంగా ఉంటాను. అందరిలో స్నేహితులనే చూస్తాను. మీలో మీకు నచ్చే లక్షణం ఏది? ఫలానా అంటూ ఏ ఒక్కటో కాదు. నాకు నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ప్రపంచాన్ని ఇష్టపడతాను. ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఆర్టిస్టుగా విలక్షణమైన స్థానం కావాలనుకున్నాను. ప్రభావితం చేసిన వ్యక్తి ?... మోహన్‌బాబు. మీ తొలి సంపాదన?...‘హృదయకాలేయం’ సినిమాకి తీసుకున్న అడ్వాన్సు. అత్యంత సంతోషం కలిగిన రోజు... 2014 ఏప్రిల్ 4 - ‘హృదయకాలేయం’ విడుదలైన రోజు. ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా ? ఇంతవరకు ఎవరూ లేరు. ఇకపై తప్పు చేస్తే క్షమించమని ప్రేక్షకులనే అడుగుతాను. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి?...భయపడాల్సిన అవసరమే రాలేదింత వరకు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?...‘నేనింత వరకు అబద్ధమే చెప్పలేదు’ అని ఎవరైనా అంటే ... ఆ మాట నిజమని నమ్మవచ్చా? చిన్నప్పుడు హోమ్‌వర్క్ చేయక స్కూల్లో అబద్ధం చెప్పడం వంటివి తప్ప ఘోరాలకు, నేరాలకు దారి తీసే అబద్ధాలేమీ చెప్పలేదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?... నేను కోరుకున్నది ఇచ్చేశాడు. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంతమందిని హాయిగా ఉంచుతున్న దేవుడు నన్ను మాత్రం ఎందుకు కష్టపెడతాడు? అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ?... మేకప్ కుదిరిందా లేదా అని చూస్తాను. ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉందా?... ప్రసారమాధ్యమాలకు, సోషల్ నెట్వర్క్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా నాకు చేసిన సహాయం చాలా గొప్పది. ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను తమ ఇంటి వ్యక్తిగా ఆదరించింది. అలాగే అందరు హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు. అందరికీ సదా రుణపడి ఉంటాను. మీ ప్రేమకు బానిసను. సంపూర్ణేశ్ బాబు అంటే ఏమి గుర్తు రావాలనుకుంటారు?... ‘హృదయ కాలేయం’ గుర్తు రావాలి, స్టీవెన్ శంకర్ అనే దర్శకుడు లేకపోతే సంపూర్ణేశ్ బాబు లేడు... అని కూడా. - వాకా మంజులారెడ్డి -
దీపావళి స్పెషల్ : సంచలనాల సంపూతో స్పెషల్ డిస్కషన్
-
వైరస్
తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో ఓ విభిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్‌బాబు www.virus.com పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సీహెచ్ శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం, ఏజే రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని విజయదశమికి మొదలు పెడతామని, డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు: తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వీజే. -
హృదయ నగరం
వెరైటీ డ్రెస్సింగ్.. డిఫరెంట్ లుక్స్.. కిక్కిచ్చే డైలాగ్స్.. వెరసి సంపూ! ఉరఫ్ సంపూర్ణేష్ బాబు!! పొట్టి చిత్రాల ప్రపంచంలో రికార్డు లైక్స్ సంపాదించిన ఈ బుల్లోడు.. వెండితెరపై ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చిన్నతనంలో సిటీకి చుట్టపుచూపుగా వచ్చిన నాడే ఈ భాగ్యనగరంపై మనసు పారేసుకున్నాడు. అడుగడుగునా థియేటర్స్ ఉన్న ఒకప్పటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మనోడికి ప్రాణం. ఇప్పుడన్ని థియేటర్లు లేకపోయినా.. తన హృదయం ఎప్పుడూ ఐ లవ్ హైదరాబాద్ అంటుందని చెబుతాడు. - శిరీష చల్లపల్లి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాపై వాటి ప్రభావమే ఎక్కువగా ఉండేది. మా ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మా బంధువులు ఉండేవారు. దీంతో మా ఫ్యామిలీ సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలే సినిమాలు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్లం. అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సూపర్‌గా ఉండేది. ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మాల్స్‌లా మారిపోతున్నాయి. అప్పటి క్రాస్ రోడ్స్ మళ్లీ తీసుకురాలేం. కానీ, అక్కడి బావర్చి బిర్యాని టేస్ట్ మాత్రం ఇప్పటికీ మారలేదు. పెద్దమ్మ తల్లో.. సాయంత్రం వేళలో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. కాస్త చీకటి పడ్డాక బిర్లా టెంపుల్‌కు వెళ్లి.. పై నుంచి లైట్ల వెలుతురులో మిరుమిట్లు గొలిపే సిటీని చూస్తే భలేగా ఉంటుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడికి తరచూ వెళ్తుంటాను. నా వరకైతే పెద్దమ్మతల్లి పవర్ఫుల్ దేవత. ఇలా కోరుకోగానే.. అలా తీర్చేస్తుంది. గోల్కొండ చూడ పోత.. గోల్కొండ వెళ్తే ఫుల్ రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. కోట విశేషాలు గైడ్లు చెబుతుంటే.. ఐస్‌క్రీమ్ తింటూ అవి వింటుంటే ఆ మజాయే వేరు. ఇక రంజాన్ నెలలో చార్మినార్ అందాలు చూడాల్సిందే. అక్కడ షాపింగ్ సరదాగా ఉంటుంది. మక్కామసీద్ ముందుండే పావురాలు..ఎంతో హాయినిస్తాయి. టేస్టీ సిటీ సిటీలో ఒక్కో చోట ఒక్కో రుచి ఫేమస్. పూర్ణ టిఫిన్ సెంటర్లో దోశ అదుర్స్. ఉలవచారు రెస్టారెంట్లో చేపల పులుసు, బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమీర్‌పేట చందనాబ్రదర్స్ బయట స్వీట్‌కార్న్, ఐస్‌క్రీమ్ అండ్ సోన్‌పాపిడి ఎంతో రుచిగా ఉంటాయి. అవి చూడగానే చిన్నపిల్లాణ్ని అయిపోతాను. బేగంపేట లైఫ్‌స్టైల్ పక్కన ఉన్న ఫ్రాంకీ రెస్టారెంట్లో పనీర్ టిక్కా భలే ఇష్టం. సిటీవాసులు ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఇక్కడే ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. నేను ఓషన్ పార్క్ వెళ్లానంటే ఓ పట్టాన బయటకు రాను. కల్చర్ నేర్పింది.. హైదరాబాదీతో మాట్లాడుతుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాదీలు మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఇక్కడి జనాలు సిటీ కల్చర్‌లో పుట్టి పెరిగినా.. కొత్తగా వచ్చిన వారితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను సిటీ కల్చర్ వాళ్ల నుంచే నేర్చుకున్నాను. -
'త్రిపాత్రాభినయం థ్రిల్లింగ్‌గా ఉంది'
కరీంనగర్ : త్వరలో విడుదల కానున్న కొబ్బరిమట్ట సీనిమాలో త్రిపాత్రాభినయం చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని ‘హృదయకాలేయం’ ఫేం హీరో సంపూర్ణేష్‌బాబు అన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకు చెందిన చింతోజు ఈష్‌కుమార్‌ను కలిసి వేడుకలు చేసుకోవడానికి శనివారం ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు వచ్చారు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నడిస్తున్నట్లు తెలిపారు. మూడింటిలో అతిథి పాత్ర.. రెండింటిలో హీరోగా చేస్తున్నట్లు వెల్లడించారు. రూపక్ దర్శకత్వంలో వస్తున్న కొబ్బరి మట్టలో తాను పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో కనిపిస్తానని తెలిపారు. మొదట సినిమాల్లో వేషాలకోసం పడరాని పాట్లు పడ్డానని, ఎందరినుంచో విమర్శలు ఎదుర్కొన్నానని అప్పుడే విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుని చాలెంజ్‌గా తీసుకున్నానన్నారు. కొత్త ఆర్టిస్టులకు అవకాశం వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. స్నేహబంధం గొప్పదని పేర్కొంటూ..స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు చింతోజు భాస్కర్ సంపూర్ణేష్‌బాబును మెమోంటోతో సత్కరించారు. -
నా తీరే ‘బర్నింగ్ స్టార్’ని చేసింది
దోసకాయలపల్లిలో ‘సంపూ’ దోసకాయలపల్లి (మధురపూడి) : ఆయన హీరోగా నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా (హృదయకాలేయం). 25 సినిమాలలో నటించినంత గుర్తింపు పొందారు. ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ..మరో ఆరు సినిమాలలో కేరక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిపోయారు. ఆయనే ‘బర్నింగ్‌స్టార్’ సంపూర్ణేష్‌బాబు. ఇ.వి.వి. సినిమా బ్యానర్ పై ఆయన వారసులు ఆర్యాన్ రాజేష్ నిర్మాతగా,‘అల్లరి’ నరేష్ హీరోగా నిర్మిస్తున్న ‘బందిపోటు’ సినిమా షూటింగ్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని బొమ్మనరాజ్‌కుమార్ తోటలో నిర్విరామంగా జరుగుతోంది. ఈ సినిమాలో నరేష్‌కు స్నేహితుడిగా సంపూ నటిస్తున్నారు. ఆయనతో చిట్‌చాట్... ప్ర: హలో...సంపూర్ణేష్బాబూ...ఎలా వున్నారు ? జ: చాలా బాగున్నాను..సార్.... ప్ర : ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు..? ఇది ఎలా సాధ్యమైంది.? జ: నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా వుండాలని కోరుకునేవాడ్ని. ఆ స్వభావమే నన్నీస్థాయికి తీసుకొచ్చింది. ప్ర : సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? జ : సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితుడ్ని. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ‘హృదయకాలేయం’ సినిమా దర్శకుడు స్టీవెన్‌శంకర్ పరిచయంతో ఆ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. జన్మనిచ్చింది..స్టీవెన్‌శంకర్ అయితే..జీవం పోసింది..మీడియా సోదరులే. ఆ సినిమా ఆడియో వేడుకలో నేను మాట్లాడిన తీరు చిత్రపరిశ్రమను,ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్ర : మీ స్వస్థలం ఎక్కడ.. జ: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి.. హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ప్ర : ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు.. ప్రస్తుతం ఏ చిత్రాలు చేస్తున్నారు.? జ: హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తా. మంచి నటుడిగా స్థిరపడాలనుంది. త్వరలో ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరోగా చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు ఒప్పుకున్నాను. బందిపోటులో అల్లరి నరేష్ స్నేహితుడిగా గుర్తింపు ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ప్ర : నటనలో మీకు ఎవరు స్ఫూర్తి? జ : మొదటి నుంచి మోహన్బాబుగారంటే చాలా ఇష్టం.అలాగే పవన్‌కళ్యాణ్, కన్నడ హీరో ఉపేంద్ర. వీరి నటన,స్టైల్ చాలా ఇష్టం. ప్ర: ఈ జిల్లా వాతావరణం...షూటింగ్ అనుభవాలు..? జ: గోదావరి జిల్లాలంటే నాకు ప్రాణం. ఇక్కడున్న పచ్చదనం... ప్రశాంతత...ప్రజల ఆదరాభిమానాలు జీవితంలో మరవలేను. -
9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్
వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండచ్చు. ఒకప్పుడు పాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలు సెకండ్ రిలీజ్ అయ్యేవి. అవికూడా మొదటిది విడుదలైన చాలా నెలల తర్వాత. కానీ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9వ తేదీన ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు సంపు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తన పుట్టినరోజు బహుమతిగా అందజేస్తున్నానన్నాడు. ''మే 9న మళ్లీ థియటర్స్లో మీ ముందుకు ఈ బర్నింగ్ స్టార్ రాబోతున్నాడు. మీరు కడుపుబ్బా నవ్వితే నాకదే పదివేలు. మా సినిమాని చూసినవాళ్లు, చూడనివాళ్లు ఈసారి తప్పక చూడండి. నా మీద ఫేస్బుక్లో నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్లు, ఈ సినిమా చూసి ఆ తర్వాత మాట్లాడండి. మీరు పాయింటవుట్ చేస్తున్నా, ఇన్ని నెగెటివ్స్ ఉండి నేను ఒక హీరోగా సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ సెకండ్ రిలీజ్ కూడా చేస్తున్నా. అదికూడా ఇంత పోటీ ఉన్న మన టాలీవుడ్లో. ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించకుండా నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ల దిమాగ్కి, ధైర్యానికి ఛాలెంజ్. చూసి మాట్లాడండి. మా ప్రయత్నం తప్పక నచ్చుతుంది. మీలో మార్పు వస్తుంది'' అని తన ఫేస్బుక్ పేజీలో సంపు రాశాడు. ఇంతకుముందు బాలకృష్ణ లెజెండ్ విడుదలైన సమయంలోనే తన సినిమాను విడుదల చేసి, మంచి కలెక్షన్లు కూడా సాధించిన సంపు, ఇప్పుడు రజనీకాంత్ సంచలనాత్మక సినిమా 'విక్రమసింహ'తో పోటీపడుతూ తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇంతకుముందు తన సినిమా వచ్చినప్పుడు యువత అంతా పరీక్షలు, ఎన్నికలతో బిజీగా ఉన్నారని, అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత తన సినిమా విడుదల చేస్తున్నానని చెప్పాడు. -
లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో
ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ వచ్చినా ఏ చిన్నా చితకా పాత్రలో మాత్రమే. హీరోలవ్వడం అనేది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. కొంచెం అటూ ఇటుగా, ఇదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి సినీ ప్రపంచంలోకి ఏ మాత్రం సినీ సంబంధంలేని ఒక నటుడు వచ్చి కేవలం హీరో మాత్రమే కాదు ఏకంగా స్టార్ అయి చూపించాడు. అతడే 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణాలేవైనా.. అతన్ని జనాలకు దగ్గర చేసింది మాత్రం సోషల్ మీడియానే. చిత్రీకరణే మొదలవ్వకముందు విడుదల చేసిన సంపూ ఫోటోలు.. ఆ తర్వాత రాజమౌళి ట్వీట్‌తో సంచలనం సృష్టించాయి. తదనంతరం ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఒక సంచలనమే. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరంపర కొనసాగడంతో సంపూకు తిరుగులేకుండా పోయింది. గత కొంత కాలంగా 'ఫేస్బుక్'లో తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వారికి మరింత దగ్గరయిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు. తన అఫీషియల్ ఫేస్బుక్ ఎకౌంట్లో లక్షకు పై చిలుకు లైక్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రతీ పోస్ట్‌కి చివర్లో, 'సదా మీ ప్రేమకు బానిసను' అని చెప్పుకునే సంపూ.. తనపై వచ్చే విమర్శలను కూడా చాలా ఓపికతో, సహృదయంతో ఎదుర్కొనే వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నసంపూర్ణేష్ బాబు మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతాడో వేచి చూడాలి. -
బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్
విజయవాడ : హృదయ కాలేయం చిత్రానికి తాము ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందని చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన తొలిచిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ ‘ హృదయ కాలేయం’ చిత్రం కలెక్షన్లు తగ్గలేదన్నారు. ప్రేక్షకులు చూపించిన ఆదరణను తానెపుడూ మరచిపోలేనన్నారు. త్వరలో తన రెండో చిత్రం ‘ కొబ్బరి మట్ట ’ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఐలాపురం హోటల్లో శుక్రవారం చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ కార్యక్రమంలో పాల్గొంది. కాగా హీరోయిన్ కావ్యకుమారి మాట్లాడుతూ.. తొలి చిత్రం విజయవంతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేమన్నారు. దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తామని ప్రేక్షకులు రుజువు చేశారన్నారు. చిన్న హీరోలు అగ్రహీరోల డైలాగులు చెబితే వచ్చే కామెడీని ప్రేక్షకులకు అందించేందుకే ఈ చిత్రం తెరకెక్కించామని, ఏ హీరోని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో విలన్‌గా నటించిన కె.సురేష్, దుర్గాఫిలింస్ అధినేత తుమ్మల రామ్మోహనరావు పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ సంచలనంగా మారిన 'సంపూ'
-
సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!
'హృదయ కాలేయం' చిత్రం విడుదలకు ముందే సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూని సోషల్ మీడియా హీరో చేసింది. సోషల్ మీడియా అందించిన ఊపుతో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. హృదయ కాలేయం చిత్ర అందించిన విజయంతో నిర్మాత సాయి రాజేష్ కొబ్బరి మట్ట చిత్రాన్ని ప్రారంభించారు. హృదయ కాలేయం చిత్రం విడుదల రోజున 'కొబ్బరి మట్ట' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొబ్బరి మట్ట చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే కొబ్బరి మట్ట చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్ గా మలిచేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలను సంపూ పోషిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందే చిత్రం 'కొబ్బరిమట్ట' హిట్ సాధిస్తుందో లేదో చూడాలి. -
సినిమా వాళ్ల మీదకొస్తే చూస్తూ ఊరుకోం..!
‘తెలంగాణలో కోటిన్నరమంది. సెటిలర్స్ ఉన్నారు. వాళ్లకు గనుక కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలంగాణ వాదులు అక్కడి దాకా తెచ్చుకోవద్దు’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హెచ్చరించారు. ఇటీవలే విడుదలైన ‘హృదయ కాలేయం’ చిత్రం దర్శకుడు స్టీవెన్ శంకర్, హీరో సంపూర్ణేష్‌బాబులపై కొందరు తెలంగాణ వాదుల దాడిని ఖండిస్తూ ఆయన ఈ రకంగా స్పందించారు. ‘‘తెలంగాణ వ్యక్తిని హీరోగా పెట్టి వ్యంగ్యంతో కూడిన కామెడీ సినిమా తీస్తావా? అని స్టీవెన్ శంకర్‌ని కొట్టడం సబబైన పని కాదు. తెలంగాణ వాడైన సంపూర్ణేష్‌బాబుకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్‌శంకర్‌ని అభినందించాలి కానీ... కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి సినిమావాళ్ల మీదకొస్తే... చూస్తూ ఊరుకోం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాలూ సినిమాకు సమానమే. తెలుగువారందరూ అన్నదమ్ముల్లా సామరస్యంగా ఉండాలనేది మా అభిమతం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. -
హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు
కేవలం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వెండితెర మీదకు దూసుకొచ్చిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోటిన్నర రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు తొలి వారాంతంలోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. స్వదేశంతో పాటు అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి ఈ సినిమాకు రూ. 3.9 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ చెప్పారు. సాధారణంగా అయితే స్పూఫ్‌లు చిత్రపరిశ్రమలో అంతగా వెళ్తాయో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం బాగానే నడిచిందని, మంచి వసూళ్లు సాధిస్తోందని ఆయన అన్నారు. థియేటర్లకు జనం బాగా వస్తుండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే ఉన్నా కూడా ఇంత మంచి విజయం సాధించడం పట్ల త్రినాథ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
హృదయ కాలేయం దర్శకుడిపై దాడి
-
హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి
హృదయ కాలేయం హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ లు కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో సినిమా చూసి ఓ హోటల్ కెళ్లినట్టు తెలిసింది. ఆ హోటల్ లో ఓ గ్రూప్ కు దర్శకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఆ గొడవలో దర్శకుడు స్టివెన్ శంకర్ పై మనోజ్ అనే వ్యక్తితోపాటు ఇతర వ్యక్తులు కూడా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో స్టీవెన్ శంకర్ కు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. తమపై దాడిపై చిత్ర యూనిట్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు మనోజ్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. -
మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు
తాను సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు, కథ.. అన్నీ సిద్ధమైపోయినా మూడు నెలల పాటు హీరోయిన్ దొరకలేదని సంచలన హీరో సంపూర్ణేష్ బాబు తెలిపాడు. 'సాక్షి' కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు.. హృదయ కాలేయం సినిమా ఆలస్యం కావడానికి, దాదాపు ఏడాది పాటు బయటకు రాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించినప్పుడు ఈ విషయం బయటపెట్టాడు. నిజానికి తన పక్కన హీరోయిన్గా నటించడానికి ఎవరూ ముందుకు రాలేదని, మూడు నెలల పాటు వెతికి వెతికి, చివరకు తప్పనిసరైతే ఎవరైనా అబ్బాయికే అమ్మాయి వేషం వేయించి అయినా హీరోయిన్గా పెట్టేద్దామని అనుకుంటుండగా ఈ హీరోయిన్ దొరికిందని, దాంతో ఇక అప్పటినుంచి ప్రాజెక్టు వేగం పుంజుకుందని చెప్పాడు. ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, కానీ స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రేక్షక దేవుళ్లు విపరీతంగా ఆదరించారని తెలిపాడు. అమెరికాలో 20 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టినట్లు తెలిసిందని, వాళ్ల అభిమానానికి తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నాడు. రాబోయే సినిమా 'కొబ్బరిమట్ట'ను కూడా ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. -
సంచలనాల 'సంపూ'తో సాక్షి చిట్ చాట్
-
సినిమా రివ్యూ: హృదయ కాలేయం
బ్యానర్: అమృత క్రియేషన్స్ నటీనటులు: సంపూర్ణేష్ బాబు కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు సంగీతం: కెకే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్ నిర్మాత: సాయి రాజేష్ విడుదల తేదీ: 04, ఏప్రియల్ 2014 ప్లస్ పాయింట్స్: చెప్పడం చాలా కష్హమైన పనే మైనస్ పాయింట్స్: లెక్కలేనన్ని 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం కావడానికి ముందే సోషల్ మీడియా సృష్టించిన ఓ హీరో సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సంపూ మీడియాలో సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు. విడుదలకు ముందే 'హృదయ కాలేయం' సినిమాపై కంటే సంపూ మీదే తెలుగు ప్రేక్షకులు దృష్టి కేంద్రికృతమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4 తేది శుక్రవారం విడుదలైన సంపూ చిత్రం 'హృదయ కాలేయం' ప్రేక్షకుల అంచనాలు చేరుకుందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 'సంపూ' ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. సంపూ పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు ఓ నటుడా, స్టారా, ఎలా నటించాడు అనే ప్రశ్నను కాస్త పక్కన పెడుదాం. సంపూ పాత్రను పోషించిన సంపూర్ణేష్ బాబు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. తనకున్నస్థాయితో పోల్చుకుంటే సంపూర్ణేష్ బాబు తొలి సినిమా పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. రెండున్నర గంటల సినిమా ప్రేక్షకుడిని చూసేలా మాత్రం ఓ ఆసక్తిని రేకెత్తించాడని మాత్రం చెప్పవచ్చు. హృదయ కాలేయం సినిమాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సంపూదే వన్ మ్యాన్ షో. మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే కమిషనర్ పాత్రను పోషించిన కత్తి మహేశ్ కుమారే కాకుండా అన్ని పాత్రలు అతిగానే స్పందించాయి. టెక్నికల్ అంశాలు: ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. తన కెమెరా పనితీరుతో సంపూని తెరపై భరించే స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి కేకే అందించిన రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ. సంపూ టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుండటంతో సీన్లు చకచకా పరిగెత్తాయి. తెలుగు సినిమాపై సెటైర్ తో సంధించిన అస్త్రమే హృదయకాలేయం. ప్రతి సీన్ అతిగానే ఉంటుంది. తెలుగు సినిమాలో ఉండే లోటుపాట్లను ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు స్టివెన్ శంకర్ 'హృదయ కాలేయం' చిత్రాన్ని రూపొందించారు. అంతా అతి కాబట్టి.. ఆ స్థాయికి తగ్గ, ఖచ్చితంగా సరిపోయే హీరో 'సంపూ'తో ప్రయోగం చేయడమే ఓ సాహసం. ఓ సాహసోపేతమైన ప్రయత్నంతో విడుదలకు ముందే డైలాగ్స్ తో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టిని మర్చేలా చేశారు. అంతేకాకుండా ఓ పెద్ద హీరోకు రాని పాపులారిటీని టీజర్, పోస్టర్స్ తో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. చెట్టు పసర్లతో కంప్యూటర్ చేయడం, ఆర్టిఫియల్ గుండెను తయారు చేయడం, క్లైమాక్స్ లో చనిపోయిన సంపూ చితి నుంచి లేచి వచ్చే అంశాలు సరదాగా నవ్వుకోవడానికి పనికి వస్తాయి. సినిమాలో ప్రతి సీన్ పిచ్చిగా అనిపించినా.. ఈ సినిమానే అతి అనే ప్రధానాంశంతో రూపొందింది కాబట్టి.. హిట్టా, ఫ్లాఫా అనే కేటగిరిలో చేరని ఓ ప్రత్యేకమైన చిత్రం 'హృదయ కాలేయం'. సినిమా కెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు అసంతృప్తి కావడం ఎలానో.. చిత్రాన్ని ఆలరించే వారి సంఖ్య అదే మొత్తంలో ఉంటుంది. ఇదే ఈ చిత్రంలో పాజిటివ్ అంశం. ఎలాంటి సినిమాను అందించాడు అనే విషయాని వదిలేస్తే.. చిత్ర దర్శకుడిగా స్టీవెన్ శంకర్ ను అభినందించాల్సిందే. సంపూ తెరపైకి వచ్చాడు.. కొద్దిరోజుల ఉంటాడు.. ఎన్ని రోజులని మాత్ర ఖచ్చితంగా చెప్పలేం. కాని సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు సృష్టించిన హల్ చల్ మాత్రం తెలుగు ప్రేక్షకుడ్ని వెంటాడం మాత్రం ఖాయం. ట్యాగ్: నచ్చని వారికి పిచ్చి సినిమా.. నచ్చిన వారికి నవ్వుకునే సినిమా -
'సంపూ' ఓ సోషల్ మీడియా హీరో..
ఇది సోషల్ మీడియా కాలం. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ లో అందరూ భాగస్వాములవుతున్నారు. దేశ ప్రథమ పౌరుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారు. హీరోలను జీరోలుగా చేయాలన్నా, ఓ సామాన్యుడిని హీరో చేయాలన్నా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను చేరుకోడానికి, పార్టీ ఎజెండాను ప్రజలకు విన్నవించడానికి, ప్రత్యర్ధులను ఎండగట్టడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆస్త్రంగా మలుచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ప్రభావం ఓ అతి సామాన్యుడుగా కనిపించే 'సంపూర్ణేష్ బాబు' ఓ హీరోను చేసింది. 'నేనే సంపూ... ముద్దు పేరు తెగింపు... ఎప్పుడెపుడా అని చూస్తున్నారా.. కన్నులకి ఇంపు.. ఎక్కడెక్కడా అని చూస్తున్నారా.. ఇదిగోరా సంపూ' అంటూ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా హీరో అనిపించుకోడానికి కావాల్సిన లక్షణాల్లో ఏ ఒక్కటీ లేని సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రత్యేక చర్చగా మారాడు. సంపూర్ణేష్ బాబు వెనుక సినీ వారసత్వం లేదు, సినీ పరిశ్రమలో ఏ ఒక్క గాడ్ ఫాదర్ లేడు. పెద్ద పొట్ట, పొట్టి ఆకారంతో కమెడియన్ ను మరిపించేలా ఉండే సంపూర్ణేష్ బాబును సోషల్ మీడియానే టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చింది. వారసత్వంగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న, నిలదొక్కుకుంటున్న హీరోల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపించే సంపూర్ణేష్ బాబు.. ఏ నలుగురు కలిసినా చర్చతోపాటు నవ్వుకోవడానికి పాయింట్ గా మారాడు. సినిమాలో నవ్వించాడో లేదు.. నవ్విస్తాడో తెలియదు కానీ.. ట్రైలర్ వచ్చినా.. ఫేస్ బుక్ లో సంపూ కనిపించినా చాలు పెదవిపై నవ్వు విరబూయాల్సిందే. తొలి చిత్రం 'హృదయ కాలేయం' ప్రారంభం కావడానికి ముందు సంపూర్ణేష్ బాబు ఓ అనామకుడు. హృదయ కాలేయం టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ లో లెక్కలేనన్ని హిట్స్ వచ్చాయి. 9 నెలల క్రితం విడుదలైన ట్రైలర్ కు ఇప్పటివరకు 9,46,807 హిట్స్ వచ్చాయి. దానికి తోడు సంచలన దర్శకుడు రాజమౌళి కామెంట్ల తో 'సంపూ'కి కోట్లు కుమ్మరించినా రాని పబ్లిసిటీ లభించడమే కాకుండా, సెలబ్రిటీగా మారాడు. తనకు లభించిన పాపులారిటీని మార్కెట్ చేసుకోవడానికి 'హృదయ కాలేయం' ఆడియో వేడుకను సంపూ వేదికగా చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకుండానే 'కొబ్బరి మట్ట' అనే రెండో చిత్రానికి స్వీకారం చుట్టాడు కూడా. ఏది ఏమైనా ఇప్పటి వరకు టీజర్లతో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన 'సంపూ'లో అసలు సత్తా ఉందా అనే అంశాన్ని తేల్చేందుకు 'హృదయ కాలేయం' శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమాతో సంపూ ఏకంగా వర్మ, మోహన్ బాబు నటించిన చిత్రం 'రౌడీ'ని ఢీకొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో గత తొమ్మిది నెలలకు పైగా ఆసక్తిని రేపి.. హృదయ కాలేయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సంపూ' సోషల్ మీడియా హీరోగా మిగిలుతాడు.. టాలీవుడ్ లో తనదైన ముద్రను వేసుకుంటాడా అనే కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం. ఇప్పటికే ఐమాక్స్ లాంటి థియేటర్లలో మొదటి రెండు షోలకు టికెట్లు మొత్తం బుక్కయిపోయాయి. ఒకవేళ నిజంగానే ఈ సినిమా హిట్టయితే మాత్రం ఆ క్రెడిట్ హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ కన్నా.. ఫేస్ బుక్, యూట్యూబ్ లకే దక్కుతుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. -
సంపూర్ణేష్ను చూసి భయపడుతున్న టాలీవుడ్
-
హృదయం కాలేయం ఆడియో
-
‘హృదయ కాలేయం’ పాటలు
‘‘నీ జీవితానికి నువ్వే హీరో’ అన్న పవన్‌కల్యాణ్ మాట నాకు బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నా ‘హృదయ కాలేయం’ సినిమాకి నేనే హీరో అని. హృదయం, కాలేయం ఉన్నవారు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారు’’ అని సంపూర్ణేష్‌బాబు అన్నారు. ‘హృదయ కాలేయం’... కొన్నాళ్లుగా సోషల్నెట్వర్క్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు సంపూర్ణేష్. ఏ ‘హృదయ కాలేయం’ ద్వారా పాపులర్ అయ్యాడో... అదే టైటిల్‌తో ఆయన హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కె.కె. స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని మారుతి ఆవిష్కరించి, సందీప్ కిషన్‌కి అందించారు. సంపూర్ణేష్ మాట్లాడుతూ -‘‘సినీ పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలుండవని, బ్యాగ్రౌండ్ ఉంటేనే ఇక్కడ ఎదుగుదల సాధ్యమని చాలా మంది అభిప్రాయం. కానీ మనల్ని మనం కొత్తగా ప్రజెంట్ చేసుకుంటే అవకాశాలు అవే వస్తాయి’’ అని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, మల్టీడైమన్షన్ వాసు, మారుతి, వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, వీరశంకర్, సందీప్‌కిషన్, రాహుల్, దేవిప్రసాద్, వివేక్ కూచిభొట్ల, మధురా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
'హృదయ కాలేయం' మూవీ స్టిల్స్
-
హృదయ కాలేయం
సంపూర్ణేష్ బాబు... సోషల్ నెట్వర్కింగ్లో అతనో సంచలనం. గొప్ప గొప్ప సెలబ్రిటీలను సైతం తన ‘హృదయ కాలేయం’ టీజర్ ద్వారా ఆకర్షించిన వ్యక్తి అతను. ఇంటర్నెట్లో కేవలం టీజర్ రూపంలో అలరించిన ‘హృదయ కాలేయం’.. త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కావ్యకుమార్, ఇషిక సింగ్ కథానాయికలు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్టీడైమన్షన్ వాసు, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, బార్బీ హండ, ఎస్కేఎన్, శ్రేయ మీడియా శ్రీనివాస్ అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంపూర్ణేష్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలో పాటలను, నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. గుడ్ సినిమా గ్రూప్ ద్వారా ఈ చిత్రం విడుదల అవుతోంది.