9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్ | Hridaya kaleyam to be released again on 9th | Sakshi
Sakshi News home page

9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్

Published Tue, May 6 2014 12:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్

9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్

వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండచ్చు. ఒకప్పుడు పాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలు సెకండ్ రిలీజ్ అయ్యేవి. అవికూడా మొదటిది విడుదలైన చాలా నెలల తర్వాత. కానీ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9వ తేదీన ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు సంపు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తన పుట్టినరోజు బహుమతిగా అందజేస్తున్నానన్నాడు. ''మే 9న మళ్లీ థియటర్స్లో మీ ముందుకు ఈ బర్నింగ్ స్టార్ రాబోతున్నాడు. మీరు కడుపుబ్బా నవ్వితే నాకదే పదివేలు. మా సినిమాని చూసినవాళ్లు, చూడనివాళ్లు ఈసారి తప్పక చూడండి. నా మీద ఫేస్బుక్లో నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్లు, ఈ సినిమా చూసి ఆ తర్వాత మాట్లాడండి.

మీరు పాయింటవుట్ చేస్తున్నా, ఇన్ని నెగెటివ్స్ ఉండి నేను ఒక హీరోగా సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ సెకండ్ రిలీజ్ కూడా చేస్తున్నా. అదికూడా ఇంత పోటీ ఉన్న మన టాలీవుడ్లో. ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించకుండా నెగెటివ్గా మాట్లాడేవాళ్ల దిమాగ్కి, ధైర్యానికి ఛాలెంజ్. చూసి మాట్లాడండి. మా ప్రయత్నం తప్పక నచ్చుతుంది. మీలో మార్పు వస్తుంది'' అని తన ఫేస్బుక్ పేజీలో సంపు రాశాడు.

ఇంతకుముందు బాలకృష్ణ లెజెండ్ విడుదలైన సమయంలోనే తన సినిమాను విడుదల చేసి, మంచి కలెక్షన్లు కూడా సాధించిన సంపు, ఇప్పుడు రజనీకాంత్ సంచలనాత్మక సినిమా 'విక్రమసింహ'తో పోటీపడుతూ తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇంతకుముందు తన సినిమా వచ్చినప్పుడు యువత అంతా పరీక్షలు, ఎన్నికలతో బిజీగా ఉన్నారని, అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత తన సినిమా విడుదల చేస్తున్నానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement