హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి
హృదయ కాలేయం హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ లు కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో సినిమా చూసి ఓ హోటల్ కెళ్లినట్టు తెలిసింది.
ఆ హోటల్ లో ఓ గ్రూప్ కు దర్శకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఆ గొడవలో దర్శకుడు స్టివెన్ శంకర్ పై మనోజ్ అనే వ్యక్తితోపాటు ఇతర వ్యక్తులు కూడా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో స్టీవెన్ శంకర్ కు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. తమపై దాడిపై చిత్ర యూనిట్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు మనోజ్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.