Hrudaya Kaleyam
-
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
సంపూర్ణేశ్‌బాబును హీరో చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh). హృదయ కాలేయం చిత్రంతో సంపూ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ విజయం సాధించడంతో అతడు వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇతడు సోదరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.ఏ హీరో ఒప్పుకోలేదుగురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సాయి రాజేశ్ అతిథిగా విచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను, సంపూర్ణేశ్ (Sampoornesh Babu) ఒక షార్ట్ ఫిలిం చూడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చాం. ఆ సమయంలో నేను బాధలో ఉన్నాను. 'యార్క్ యార్' అనే తమిళ సినిమా చూసి ఓ పిచ్చి మూవీ తీయాలనుకున్నాను. దానిచుట్టూ కామెడీ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ను అప్పుడే ఎదుగుతున్న పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ ఒప్పుకోలేదు. నా బతుకు అయిపోయిందనుకున్నాను. హీరో దొరికేశాడుఈ ప్రసాద్ ల్యాబ్‌లో షార్ట్ ఫిలిం చూసి బయట చెట్టు కింద నిల్చున్నప్పుడు సంపూ రంగురంగుల చొక్కాతో కనిపించాడు. అతడిని చూసి నాకు హీరో దొరికేశాడు అనుకున్నాను. ఇది జరిగి 13 ఏళ్లవుతోంది. ఇదంతా కలలా ఉంది. అప్పుడు నాకు రూ.60 వేలదాకా అప్పు ఉంది. కథ డిస్కషన్ కోసం సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేవాడు. ఏదో ఒక పార్క్‌లో కూర్చుని కథ గురించి మాట్లాడుకుని సాయంత్రానికి బస్‌స్టాప్‌లో దింపేసేవాడిని. ఇంటికి తిరిగెళ్లడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? అని అడిగితే లేవన్నాడు.గిల్టీగా ఫీలయ్యాదాంతో నా దగ్గరున్న రూ.500లలో రెండు వందలు అతడికి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే నేనేదో పనిలో పడిపోయి అతడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడు సంపూ కృష్ణానగర్‌లో మడత మంచం అద్దెకు తీసుకుని రోజంతా అక్కడే ఉన్నాడు. నాకు మళ్లీ ఫోన్ చేసి.. అన్నా, నేను వచ్చేశాను అని చెప్పాడు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. సినిమా పిచ్చితో నేను చెడిపోయిందే కాక మరొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా సినిమా తీయగలనా? ఇలా రకరకాలుగా అనుకున్నాను.లక్షల్లో రెమ్యునరేషన్చివరకు ఎలాగోలా సినిమా తీశాం. తను హీరో అయ్యాడు, నేను డైరెక్టర్ అయ్యాను. హృదయకాలేయం (Hrudaya Kaleyam Movie) సూపర్ హిట్ అయ్యాక సంపూర్ణేశ్‌కు లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ఫామ్లో ఉండేవాడిని. సంపూ సిద్దిపేటలో నాలుగంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను ఈఎమ్ఐలో నానో కారు కొనుక్కుంటే మనోడు ఫోర్డ్ కొన్నాడు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో నేను ఆర్థికంగా చితికిపోయానని సంపూ గ్రహించాడు. రూ.6 లక్షలు పెట్టి హోండా కారు కొనిచ్చాడు. ఇల్లు కొనుగోలు..మణికొండలో ఒక అపార్ట్మెంట్ కోసం రూ.12 లక్షలు కట్టి.. మిగతా రూ.13 లక్షలు నువ్వు ఎలాగైనా కట్టుకో అన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తను సంపాదించిన డబ్బు.. నాకోసం, తన చుట్టూ ఉండేవాళ్లకోసం, సమాజం కోసం ఖర్చుపెడతాడు. ఓ వ్యక్తి నేను సంపూను రోడ్డు మీద వదిలేశాను అని కామెంట్ చేశాడు. రోడ్డు మీద వదిలేయడం ఏంట్రా? ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటా.. నాకోసం సంపూ ఉంటాడంతే! అని సాయి రాజేశ్ ఎమోషనలయ్యాడు.చదవండి: సూర్య కొత్త సినిమాలో హీరోయిన్ 'అనఘా రవి'కి ఛాన్స్ -
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
‘‘నేను నటించిన ‘హృదయ కాలేయం’ విడుదలై పదకొండేళ్లయింది. ఇన్నేళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. ఈ నెల 25న ‘సోదరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి’’ అని సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) తెలిపారు. సాయి రాజేశ్ నీలం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హృదయ కాలేయం’. ఈ మూవీ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. 2014 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంపూర్ణేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయ కాలేయం’తో సంపూర్ణేష్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు రుణపడి ఉంటాను. ఈ మూవీ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళిగారు చేసిన ట్వీట్ వల్ల నాకెంతో గుర్తింపు దక్కింది. ‘హృదయ కాలేయం’ టైమ్‌లో సందీప్ కిషన్ అన్న, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజగార్లు ఎంతో సపోర్ట్ చేశారు. నా జీవన విధానానికి, ‘బిగ్ బాస్’ పరిస్థితికి సరిపోక ఆ షోలో ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. కనీసం కారులో తిరగ్గలనా? అనుకున్న నన్ను విమానంలో తిరిగేలా చేశారు సాయి రాజేశ్ అన్న’’ అని తెలిపారు. -
వూహాన్ గబ్బిలాల మార్కెట్లో సంపూ
సంపూర్ణేష్ బాబు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘హృదయ కాలేయం’తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. అనంతరం హాస్యమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తూ సినీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఈ బర్నింగ్ స్టార్. అయితే హృదయ కాలేయం తర్వాత ఆయన చేసిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కాస్త విరామం ప్రకటించి ‘కొబ్బరిమట్ట’తో థియేటర్లలో సందడిచేసి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ రోజు బర్నింగ్ స్టార్ సంపూ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. చైనా దేశంలోని వూహాన్లో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. అయితే కరోనా అంశాన్నే కథాంశంగా తీసుకొని సంపూ తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర పోస్టర్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. వైరస్ పుట్టిన వూహాన్‌లోని గబ్బిలాల మార్కెట్లో చిత్రీకరించిన చివరి సినిమా అంటూ పోస్టర్లపై ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపయింది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ కానప్పటికీ ఈ పోస్టర్లో సంపూ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆయన చుట్టు కరోనా వైరస్ వ్యాపించినట్టు కనిపిస్తుంది. హృదయకాలేయంలో కంప్యూటర్ కనిపెట్టినట్టు ఈ చిత్రంలో కరోనా వైరస్‌తో సంపూ యుద్దం చేస్తాడేమో వేచి చూడాలి. నోలాన్ మౌళి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: ‘ఆకాశవాణి’ని వదిలేసిన జక్కన్న తనయుడు? మే 9 వెరీ స్పెషల్ డే ఎందుకంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంపూ రికార్డ్
‘హుృదయకాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచి, ‘బర్నింగ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్ రొనాల్డ్ సన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా – ‘‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగిల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ పెద్ద డైలాగ్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ‘‘ఏరా పెదరాయుడు.. త్రికాలాత్రక.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూర్ణేష్ డైలాగ్.. ‘పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్.. ఆండ్రాయుడు టైమ్ స్టార్ట్స్ నౌ..’ అనే డైలాగ్‌తో ముగుస్తుంది.3.30 నిమిషాలపాటు సంపూ చెప్పిన ఈ డైలాగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు.. లాంటి మూడు పాత్రలతో సంపూ మెప్పించబోతున్నారు. అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. ఇటీవల విడుదల చేసిన ‘అఆ.. ఇఈ...’ అనే పాటకి యూట్యూబ్‌లో 24 గంటల్లో రెండు లక్షల వ్యూస్ వచ్చాయంటే మా సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలియజేస్తోంది. ఈ చిత్రం నైజాం, ఓవర్సీస్ హక్కులని ‘నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్’ వారు సొంతం చేసుకున్నారు’’ అన్నారు. -
టక్కరి దొంగ.. చక్కని చుక్క
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘టక్కరి దొంగ.. చక్కనిచుక్క’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. అలీ కథానాయకుడిగా ‘అల్లరి పెళ్లికొడుకు’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ కాంబినేషన్లో ఆర్.కె. ఫిలిం ఫ్యాక్టరీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ మాట్లాడుతూ –‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. స్క్రిప్ట్ బాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయి. ఈ నెల రెండో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: పైడాల శ్రీనివాస్. -
‘కొబ్బరి మట్ట’పై కొత్త అప్డేట్
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సంపూర్ణేష్ బాబు తరువాత హీరోగా నటిస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రారంభమైంది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమా ఫైనల్‌గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు రాజేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఫైనల్ గా సినిమా పూర్తయ్యింది. సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.. ఈ సినిమా నిర్మాణం కోసం రక్తం, చెమట, కన్నీళ్లు ధారాపోశాం. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన. ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మీ ప్రేమ, సపోర్ట్ కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే బేసిక్ గా మీరు మంచోరు’ అంటూ ట్వీట్ చేశారు. Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... Get ready for the release date...#KobbariMatta @sairazesh @RonaldsonRupak pic.twitter.com/Jc8ZvPQout — Sampoornesh Babu (@sampoornesh) 2 July 2018 Finally....We are Ready....సంవత్సరమున్నర కష్టం.... కష్టం అనేది చిన్న మాట.... I poured my blood, sweat and tears to produce this film... ఎలాంటి క్రియేటివ్ PUBLICITY ఎలా చేస్తే జనం దగ్గరకి ఈ సినిమా తీసుకెళ్తాను అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన... pic.twitter.com/StOiOsS7tn — Sai Rajesh (@sairazesh) 2 July 2018 -
వైరస్
తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో ఓ విభిన్నమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సంపూర్ణేష్‌బాబు www.virus.com పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సీహెచ్ శివరామకృష్ణ దర్శకత్వంలో సలీం, ఏజే రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని విజయదశమికి మొదలు పెడతామని, డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు: తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వీజే. -
నా తీరే ‘బర్నింగ్ స్టార్’ని చేసింది
దోసకాయలపల్లిలో ‘సంపూ’ దోసకాయలపల్లి (మధురపూడి) : ఆయన హీరోగా నటించింది కేవలం ఒకే ఒక్క సినిమా (హృదయకాలేయం). 25 సినిమాలలో నటించినంత గుర్తింపు పొందారు. ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ..మరో ఆరు సినిమాలలో కేరక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారిపోయారు. ఆయనే ‘బర్నింగ్‌స్టార్’ సంపూర్ణేష్‌బాబు. ఇ.వి.వి. సినిమా బ్యానర్ పై ఆయన వారసులు ఆర్యాన్ రాజేష్ నిర్మాతగా,‘అల్లరి’ నరేష్ హీరోగా నిర్మిస్తున్న ‘బందిపోటు’ సినిమా షూటింగ్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని బొమ్మనరాజ్‌కుమార్ తోటలో నిర్విరామంగా జరుగుతోంది. ఈ సినిమాలో నరేష్‌కు స్నేహితుడిగా సంపూ నటిస్తున్నారు. ఆయనతో చిట్‌చాట్... ప్ర: హలో...సంపూర్ణేష్బాబూ...ఎలా వున్నారు ? జ: చాలా బాగున్నాను..సార్.... ప్ర : ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు..? ఇది ఎలా సాధ్యమైంది.? జ: నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా వుండాలని కోరుకునేవాడ్ని. ఆ స్వభావమే నన్నీస్థాయికి తీసుకొచ్చింది. ప్ర : సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? జ : సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితుడ్ని. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ‘హృదయకాలేయం’ సినిమా దర్శకుడు స్టీవెన్‌శంకర్ పరిచయంతో ఆ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. జన్మనిచ్చింది..స్టీవెన్‌శంకర్ అయితే..జీవం పోసింది..మీడియా సోదరులే. ఆ సినిమా ఆడియో వేడుకలో నేను మాట్లాడిన తీరు చిత్రపరిశ్రమను,ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్ర : మీ స్వస్థలం ఎక్కడ.. జ: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి.. హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ప్ర : ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు.. ప్రస్తుతం ఏ చిత్రాలు చేస్తున్నారు.? జ: హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తా. మంచి నటుడిగా స్థిరపడాలనుంది. త్వరలో ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరోగా చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు ఒప్పుకున్నాను. బందిపోటులో అల్లరి నరేష్ స్నేహితుడిగా గుర్తింపు ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ప్ర : నటనలో మీకు ఎవరు స్ఫూర్తి? జ : మొదటి నుంచి మోహన్బాబుగారంటే చాలా ఇష్టం.అలాగే పవన్‌కళ్యాణ్, కన్నడ హీరో ఉపేంద్ర. వీరి నటన,స్టైల్ చాలా ఇష్టం. ప్ర: ఈ జిల్లా వాతావరణం...షూటింగ్ అనుభవాలు..? జ: గోదావరి జిల్లాలంటే నాకు ప్రాణం. ఇక్కడున్న పచ్చదనం... ప్రశాంతత...ప్రజల ఆదరాభిమానాలు జీవితంలో మరవలేను. -
సందడి చేసిన ‘సంపూ'
‘హృదయ కాలేయం’ హీరో సంపూర్ణేష్‌బాబు (సంపూ) గురువారం దొమ్మేరులో సందడి చేశారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న బందిపోటు సినిమా షూటింగ్ మూడోరోజు కొనసాగింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికలకు సంబందించి సన్నివేశాలను అల్లరి నరేష్, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లపై దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చిత్రీకరించారు. గ్రామ చావిడి వద్ద సంపూర్ణేష్ బాబుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సహాయ నటుడు చాగల్లు సూరిబాబుతో పాటు పలువురు స్థానిక కళాకారులు నటించారు. శుక్రవారం నుంచి కొవ్వూరులో షూటింగ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. - దొమ్మేరు (కొవ్వూరు రూరల్) నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు సంపూర్ణేష్‌బాబు దొమ్మేరు (కొవ్వూరు రూరల్): హృదయకాలేయం సినిమాలో తన పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదని సినీహీరో సంపూర్ణేష్‌బాబు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ చిత్రంలో నటించేందుకు ముందుకురాలేదన్నారు. ఈవీవీ బ్యానర్లో పూర్తిస్థాయి నటుడిగా అవకాశం రావడం ఆనందంగా ఉందని సంపూ చెప్పారు. బందిపోటు చిత్రంలో నటించేందుకు కొవ్వూరు మండలం దొమ్మేరు వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ. మీ స్వగ్రామం ఏది మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం మెట్టపల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అల్లరి నరేష్‌తో నటించడం ఎలా ఉంది. అల్లరి నరేష్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. హృదయకాలేయం సినిమాకు మీరే నిర్మాత అని టాక్.. నిజానికి నేనే నిర్మాతగా తీద్దామనుకున్నా. అయితే స్టీవెన్ శంకర్ అనే మిత్రుడు నిర్మాతగా చిత్రాన్ని నిర్మించాం. హృదయకాలేయం నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సినిమా ప్రారంభించడానికి ముందు మూడు నెలల వరకు నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నా సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. ఎవరూ రాకపోతే మగవారికి ఆడవారి వేషాలు వేసి సినిమా పూర్తిచేద్దామని నిర్ణయించాం. అయితే మా అదృష్టం వల్ల కావ్యకుమారి, ఈషికా సింగ్‌లు హీరోయిన్లుగా నటించేందుకు అంగీకరించారు. ధైర్యంతో కొత్త ప్రయోగం చేశాం. జనం ఆదరించారు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీపరిశ్రమకు వచ్చారట లేదండీ. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినీపరిశ్రమలోనే కొనసాగుతున్నాను. తొలిసారిగా మహాత్మా చిత్రంలో డెరైక్టర్ కృష్ణవంశీ చిన్నపాత్ర ద్వారా నటించడానికి అవకాశం ఇచ్చారు. మీ తదుపరి చిత్రం కొబ్బరిమట్ట సినిమాలో హీరోగా నటిస్తున్నా. స్టీవెన్ శంకర్ నిర్మాత. ఆగష్టు 25న ప్రారంభంకానుంది. త్రిపాత్రాభినయం చేస్తున్నా. ఏడుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. -
లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో
ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ వచ్చినా ఏ చిన్నా చితకా పాత్రలో మాత్రమే. హీరోలవ్వడం అనేది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. కొంచెం అటూ ఇటుగా, ఇదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి సినీ ప్రపంచంలోకి ఏ మాత్రం సినీ సంబంధంలేని ఒక నటుడు వచ్చి కేవలం హీరో మాత్రమే కాదు ఏకంగా స్టార్ అయి చూపించాడు. అతడే 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణాలేవైనా.. అతన్ని జనాలకు దగ్గర చేసింది మాత్రం సోషల్ మీడియానే. చిత్రీకరణే మొదలవ్వకముందు విడుదల చేసిన సంపూ ఫోటోలు.. ఆ తర్వాత రాజమౌళి ట్వీట్‌తో సంచలనం సృష్టించాయి. తదనంతరం ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఒక సంచలనమే. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరంపర కొనసాగడంతో సంపూకు తిరుగులేకుండా పోయింది. గత కొంత కాలంగా 'ఫేస్బుక్'లో తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వారికి మరింత దగ్గరయిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు. తన అఫీషియల్ ఫేస్బుక్ ఎకౌంట్లో లక్షకు పై చిలుకు లైక్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రతీ పోస్ట్‌కి చివర్లో, 'సదా మీ ప్రేమకు బానిసను' అని చెప్పుకునే సంపూ.. తనపై వచ్చే విమర్శలను కూడా చాలా ఓపికతో, సహృదయంతో ఎదుర్కొనే వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నసంపూర్ణేష్ బాబు మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతాడో వేచి చూడాలి. -
బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్
విజయవాడ : హృదయ కాలేయం చిత్రానికి తాము ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందని చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన తొలిచిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ ‘ హృదయ కాలేయం’ చిత్రం కలెక్షన్లు తగ్గలేదన్నారు. ప్రేక్షకులు చూపించిన ఆదరణను తానెపుడూ మరచిపోలేనన్నారు. త్వరలో తన రెండో చిత్రం ‘ కొబ్బరి మట్ట ’ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఐలాపురం హోటల్లో శుక్రవారం చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ కార్యక్రమంలో పాల్గొంది. కాగా హీరోయిన్ కావ్యకుమారి మాట్లాడుతూ.. తొలి చిత్రం విజయవంతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేమన్నారు. దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తామని ప్రేక్షకులు రుజువు చేశారన్నారు. చిన్న హీరోలు అగ్రహీరోల డైలాగులు చెబితే వచ్చే కామెడీని ప్రేక్షకులకు అందించేందుకే ఈ చిత్రం తెరకెక్కించామని, ఏ హీరోని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో విలన్‌గా నటించిన కె.సురేష్, దుర్గాఫిలింస్ అధినేత తుమ్మల రామ్మోహనరావు పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ సంచలనంగా మారిన 'సంపూ'
-
సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు!
'హృదయ కాలేయం' చిత్రం విడుదలకు ముందే సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూని సోషల్ మీడియా హీరో చేసింది. సోషల్ మీడియా అందించిన ఊపుతో విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. హృదయ కాలేయం చిత్ర అందించిన విజయంతో నిర్మాత సాయి రాజేష్ కొబ్బరి మట్ట చిత్రాన్ని ప్రారంభించారు. హృదయ కాలేయం చిత్రం విడుదల రోజున 'కొబ్బరి మట్ట' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కొబ్బరి మట్ట చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే కొబ్బరి మట్ట చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్ట్ గా మలిచేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సంపూ సరసన ఏడుగురు హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలను సంపూ పోషిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందే చిత్రం 'కొబ్బరిమట్ట' హిట్ సాధిస్తుందో లేదో చూడాలి. -
హృదయ కాలేయానికి 4 కోట్ల కలెక్షన్లు
కేవలం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని వెండితెర మీదకు దూసుకొచ్చిన 'హృదయ కాలేయం' చిన్న సినిమాల్లో రికార్డు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోటిన్నర రూపాయల ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు తొలి వారాంతంలోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. స్వదేశంతో పాటు అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ సినిమా విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి ఈ సినిమాకు రూ. 3.9 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ చెప్పారు. సాధారణంగా అయితే స్పూఫ్‌లు చిత్రపరిశ్రమలో అంతగా వెళ్తాయో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం బాగానే నడిచిందని, మంచి వసూళ్లు సాధిస్తోందని ఆయన అన్నారు. థియేటర్లకు జనం బాగా వస్తుండటంతో శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. సినిమాలో అందరూ కొత్త నటీనటులే ఉన్నా కూడా ఇంత మంచి విజయం సాధించడం పట్ల త్రినాథ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు ఓ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
‘హృదయ కాలేయం’ నిర్మాతపై దాడి
సాక్షి,హైదరాబాద్: ‘హృదయ కాలేయం’ చిత్ర నిర్మాత నీలం సాయిరాజేశ్‌పై మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్లో దాడిజరిగింది. ఎస్సై రంజిత్‌కుమార్ కథనం ప్రకారం... హృదయ కాలేయం సినిమా నిర్మాత సాయిరాజేశ్, మరో ఆరుగురు వ్యక్తులు శనివారం రాత్రి వెస్టిన్ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మనోజ్ (29) మద్యం సేవించి అదే హోటల్లో బస చేశాడు. కాగా, తెల్లవారుజామున 3 గంటలకు బాత్రూమ్కు వెళ్లిన మనోజ్ అక్కడే ఉన్న సాయిరాజేశ్‌పై తాగిన మత్తులో దుర్భాషాలాడాడు. సినిమా డైలాగులతో జనాన్ని చంపుతున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా సాయిరాజేశ్‌పై దాడిచేయడంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందుతుడు మనోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హృదయ కాలేయం దర్శకుడిపై దాడి
-
హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి
హృదయ కాలేయం హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ లు కూకట్ పల్లి లోని ఓ థియేటర్ లో సినిమా చూసి ఓ హోటల్ కెళ్లినట్టు తెలిసింది. ఆ హోటల్ లో ఓ గ్రూప్ కు దర్శకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఆ గొడవలో దర్శకుడు స్టివెన్ శంకర్ పై మనోజ్ అనే వ్యక్తితోపాటు ఇతర వ్యక్తులు కూడా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో స్టీవెన్ శంకర్ కు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. తమపై దాడిపై చిత్ర యూనిట్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు మనోజ్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. -
సంచలనాల 'సంపూ'తో సాక్షి చిట్ చాట్
-
సినిమా రివ్యూ: హృదయ కాలేయం
బ్యానర్: అమృత క్రియేషన్స్ నటీనటులు: సంపూర్ణేష్ బాబు కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు సంగీతం: కెకే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్ నిర్మాత: సాయి రాజేష్ విడుదల తేదీ: 04, ఏప్రియల్ 2014 ప్లస్ పాయింట్స్: చెప్పడం చాలా కష్హమైన పనే మైనస్ పాయింట్స్: లెక్కలేనన్ని 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం కావడానికి ముందే సోషల్ మీడియా సృష్టించిన ఓ హీరో సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు. టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సంపూ మీడియాలో సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు. విడుదలకు ముందే 'హృదయ కాలేయం' సినిమాపై కంటే సంపూ మీదే తెలుగు ప్రేక్షకులు దృష్టి కేంద్రికృతమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4 తేది శుక్రవారం విడుదలైన సంపూ చిత్రం 'హృదయ కాలేయం' ప్రేక్షకుల అంచనాలు చేరుకుందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 'సంపూ' ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. సంపూ పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు ఓ నటుడా, స్టారా, ఎలా నటించాడు అనే ప్రశ్నను కాస్త పక్కన పెడుదాం. సంపూ పాత్రను పోషించిన సంపూర్ణేష్ బాబు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. తనకున్నస్థాయితో పోల్చుకుంటే సంపూర్ణేష్ బాబు తొలి సినిమా పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. రెండున్నర గంటల సినిమా ప్రేక్షకుడిని చూసేలా మాత్రం ఓ ఆసక్తిని రేకెత్తించాడని మాత్రం చెప్పవచ్చు. హృదయ కాలేయం సినిమాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సంపూదే వన్ మ్యాన్ షో. మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే కమిషనర్ పాత్రను పోషించిన కత్తి మహేశ్ కుమారే కాకుండా అన్ని పాత్రలు అతిగానే స్పందించాయి. టెక్నికల్ అంశాలు: ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. తన కెమెరా పనితీరుతో సంపూని తెరపై భరించే స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి కేకే అందించిన రీరికార్డింగ్ అదనపు ఆకర్షణ. సంపూ టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుండటంతో సీన్లు చకచకా పరిగెత్తాయి. తెలుగు సినిమాపై సెటైర్ తో సంధించిన అస్త్రమే హృదయకాలేయం. ప్రతి సీన్ అతిగానే ఉంటుంది. తెలుగు సినిమాలో ఉండే లోటుపాట్లను ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు స్టివెన్ శంకర్ 'హృదయ కాలేయం' చిత్రాన్ని రూపొందించారు. అంతా అతి కాబట్టి.. ఆ స్థాయికి తగ్గ, ఖచ్చితంగా సరిపోయే హీరో 'సంపూ'తో ప్రయోగం చేయడమే ఓ సాహసం. ఓ సాహసోపేతమైన ప్రయత్నంతో విడుదలకు ముందే డైలాగ్స్ తో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టిని మర్చేలా చేశారు. అంతేకాకుండా ఓ పెద్ద హీరోకు రాని పాపులారిటీని టీజర్, పోస్టర్స్ తో ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. చెట్టు పసర్లతో కంప్యూటర్ చేయడం, ఆర్టిఫియల్ గుండెను తయారు చేయడం, క్లైమాక్స్ లో చనిపోయిన సంపూ చితి నుంచి లేచి వచ్చే అంశాలు సరదాగా నవ్వుకోవడానికి పనికి వస్తాయి. సినిమాలో ప్రతి సీన్ పిచ్చిగా అనిపించినా.. ఈ సినిమానే అతి అనే ప్రధానాంశంతో రూపొందింది కాబట్టి.. హిట్టా, ఫ్లాఫా అనే కేటగిరిలో చేరని ఓ ప్రత్యేకమైన చిత్రం 'హృదయ కాలేయం'. సినిమా కెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు అసంతృప్తి కావడం ఎలానో.. చిత్రాన్ని ఆలరించే వారి సంఖ్య అదే మొత్తంలో ఉంటుంది. ఇదే ఈ చిత్రంలో పాజిటివ్ అంశం. ఎలాంటి సినిమాను అందించాడు అనే విషయాని వదిలేస్తే.. చిత్ర దర్శకుడిగా స్టీవెన్ శంకర్ ను అభినందించాల్సిందే. సంపూ తెరపైకి వచ్చాడు.. కొద్దిరోజుల ఉంటాడు.. ఎన్ని రోజులని మాత్ర ఖచ్చితంగా చెప్పలేం. కాని సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు సృష్టించిన హల్ చల్ మాత్రం తెలుగు ప్రేక్షకుడ్ని వెంటాడం మాత్రం ఖాయం. ట్యాగ్: నచ్చని వారికి పిచ్చి సినిమా.. నచ్చిన వారికి నవ్వుకునే సినిమా -
'సంపూ' ఓ సోషల్ మీడియా హీరో..
ఇది సోషల్ మీడియా కాలం. సోషల్ మీడియా సృష్టిస్తున్న ట్రెండ్ లో అందరూ భాగస్వాములవుతున్నారు. దేశ ప్రథమ పౌరుడి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారు. హీరోలను జీరోలుగా చేయాలన్నా, ఓ సామాన్యుడిని హీరో చేయాలన్నా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను చేరుకోడానికి, పార్టీ ఎజెండాను ప్రజలకు విన్నవించడానికి, ప్రత్యర్ధులను ఎండగట్టడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆస్త్రంగా మలుచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా ప్రభావం ఓ అతి సామాన్యుడుగా కనిపించే 'సంపూర్ణేష్ బాబు' ఓ హీరోను చేసింది. 'నేనే సంపూ... ముద్దు పేరు తెగింపు... ఎప్పుడెపుడా అని చూస్తున్నారా.. కన్నులకి ఇంపు.. ఎక్కడెక్కడా అని చూస్తున్నారా.. ఇదిగోరా సంపూ' అంటూ పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా హీరో అనిపించుకోడానికి కావాల్సిన లక్షణాల్లో ఏ ఒక్కటీ లేని సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రత్యేక చర్చగా మారాడు. సంపూర్ణేష్ బాబు వెనుక సినీ వారసత్వం లేదు, సినీ పరిశ్రమలో ఏ ఒక్క గాడ్ ఫాదర్ లేడు. పెద్ద పొట్ట, పొట్టి ఆకారంతో కమెడియన్ ను మరిపించేలా ఉండే సంపూర్ణేష్ బాబును సోషల్ మీడియానే టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చింది. వారసత్వంగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న, నిలదొక్కుకుంటున్న హీరోల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపించే సంపూర్ణేష్ బాబు.. ఏ నలుగురు కలిసినా చర్చతోపాటు నవ్వుకోవడానికి పాయింట్ గా మారాడు. సినిమాలో నవ్వించాడో లేదు.. నవ్విస్తాడో తెలియదు కానీ.. ట్రైలర్ వచ్చినా.. ఫేస్ బుక్ లో సంపూ కనిపించినా చాలు పెదవిపై నవ్వు విరబూయాల్సిందే. తొలి చిత్రం 'హృదయ కాలేయం' ప్రారంభం కావడానికి ముందు సంపూర్ణేష్ బాబు ఓ అనామకుడు. హృదయ కాలేయం టీజర్ విడుదలైన కొద్ది రోజులకే యూట్యూబ్ లో లెక్కలేనన్ని హిట్స్ వచ్చాయి. 9 నెలల క్రితం విడుదలైన ట్రైలర్ కు ఇప్పటివరకు 9,46,807 హిట్స్ వచ్చాయి. దానికి తోడు సంచలన దర్శకుడు రాజమౌళి కామెంట్ల తో 'సంపూ'కి కోట్లు కుమ్మరించినా రాని పబ్లిసిటీ లభించడమే కాకుండా, సెలబ్రిటీగా మారాడు. తనకు లభించిన పాపులారిటీని మార్కెట్ చేసుకోవడానికి 'హృదయ కాలేయం' ఆడియో వేడుకను సంపూ వేదికగా చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకుండానే 'కొబ్బరి మట్ట' అనే రెండో చిత్రానికి స్వీకారం చుట్టాడు కూడా. ఏది ఏమైనా ఇప్పటి వరకు టీజర్లతో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన 'సంపూ'లో అసలు సత్తా ఉందా అనే అంశాన్ని తేల్చేందుకు 'హృదయ కాలేయం' శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమాతో సంపూ ఏకంగా వర్మ, మోహన్ బాబు నటించిన చిత్రం 'రౌడీ'ని ఢీకొట్టేందుకు సిద్దమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో గత తొమ్మిది నెలలకు పైగా ఆసక్తిని రేపి.. హృదయ కాలేయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సంపూ' సోషల్ మీడియా హీరోగా మిగిలుతాడు.. టాలీవుడ్ లో తనదైన ముద్రను వేసుకుంటాడా అనే కొద్ది రోజులాగితే స్పష్టమవ్వడం ఖాయం. ఇప్పటికే ఐమాక్స్ లాంటి థియేటర్లలో మొదటి రెండు షోలకు టికెట్లు మొత్తం బుక్కయిపోయాయి. ఒకవేళ నిజంగానే ఈ సినిమా హిట్టయితే మాత్రం ఆ క్రెడిట్ హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుడు స్టీవెన్ శంకర్ కన్నా.. ఫేస్ బుక్, యూట్యూబ్ లకే దక్కుతుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. -
సంపూబాబు రెండో సినిమా కొబ్బరిమట్ట
సోషల్ మీడియా సైట్స్ ద్వారా వెలుగులోకొచ్చిన నటుడు సంపూర్ణేష్‌బాబు. విడుదలకు ముందే ‘హృదయ కాలేయం’తో సంచలనం సృష్టించాడు తను. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇదిలావుంటే... సంపుబాబు హీరోగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘కొబ్బరిమట్ట’. ఇందులో సంపూబాబు త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంక రే ఈ చిత్రానికి కూడా దర్శకుడని వినికిడి. -
సంపూర్ణేష్ను చూసి భయపడుతున్న టాలీవుడ్
-
‘హృదయ కాలేయం’ పాటలు
‘‘నీ జీవితానికి నువ్వే హీరో’ అన్న పవన్‌కల్యాణ్ మాట నాకు బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నా ‘హృదయ కాలేయం’ సినిమాకి నేనే హీరో అని. హృదయం, కాలేయం ఉన్నవారు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారు’’ అని సంపూర్ణేష్‌బాబు అన్నారు. ‘హృదయ కాలేయం’... కొన్నాళ్లుగా సోషల్నెట్వర్క్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు సంపూర్ణేష్. ఏ ‘హృదయ కాలేయం’ ద్వారా పాపులర్ అయ్యాడో... అదే టైటిల్‌తో ఆయన హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కె.కె. స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని మారుతి ఆవిష్కరించి, సందీప్ కిషన్‌కి అందించారు. సంపూర్ణేష్ మాట్లాడుతూ -‘‘సినీ పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలుండవని, బ్యాగ్రౌండ్ ఉంటేనే ఇక్కడ ఎదుగుదల సాధ్యమని చాలా మంది అభిప్రాయం. కానీ మనల్ని మనం కొత్తగా ప్రజెంట్ చేసుకుంటే అవకాశాలు అవే వస్తాయి’’ అని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, మల్టీడైమన్షన్ వాసు, మారుతి, వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, వీరశంకర్, సందీప్‌కిషన్, రాహుల్, దేవిప్రసాద్, వివేక్ కూచిభొట్ల, మధురా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
హృదయ కాలేయం
సంపూర్ణేష్ బాబు... సోషల్ నెట్వర్కింగ్లో అతనో సంచలనం. గొప్ప గొప్ప సెలబ్రిటీలను సైతం తన ‘హృదయ కాలేయం’ టీజర్ ద్వారా ఆకర్షించిన వ్యక్తి అతను. ఇంటర్నెట్లో కేవలం టీజర్ రూపంలో అలరించిన ‘హృదయ కాలేయం’.. త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కావ్యకుమార్, ఇషిక సింగ్ కథానాయికలు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్టీడైమన్షన్ వాసు, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, బార్బీ హండ, ఎస్కేఎన్, శ్రేయ మీడియా శ్రీనివాస్ అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంపూర్ణేష్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలో పాటలను, నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. గుడ్ సినిమా గ్రూప్ ద్వారా ఈ చిత్రం విడుదల అవుతోంది.