బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్ | I owe a lot to Bezawada, says Hrudaya Kaleyam hero Sampoornesh Babu | Sakshi
Sakshi News home page

బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్

Published Sat, Apr 12 2014 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్

బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్

విజయవాడ : హృదయ కాలేయం చిత్రానికి తాము ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందని చిత్ర హీరో సంపూర్ణేష్‌ బాబు అన్నారు.   ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన తొలిచిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ ‘ హృదయ కాలేయం’ చిత్రం కలెక్షన్‌లు తగ్గలేదన్నారు.  ప్రేక్షకులు చూపించిన ఆదరణను తానెపుడూ మరచిపోలేనన్నారు.

త్వరలో తన రెండో చిత్రం ‘ కొబ్బరి మట్ట ’ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఐలాపురం హోటల్‌లో శుక్రవారం చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ కార్యక్రమంలో పాల్గొంది. కాగా హీరోయిన్ కావ్యకుమారి మాట్లాడుతూ.. తొలి చిత్రం విజయవంతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేమన్నారు.

దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తామని  ప్రేక్షకులు రుజువు చేశారన్నారు. చిన్న హీరోలు అగ్రహీరోల డైలాగులు చెబితే వచ్చే కామెడీని ప్రేక్షకులకు అందించేందుకే ఈ  చిత్రం తెరకెక్కించామని,  ఏ హీరోని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.  సభలో విలన్‌గా నటించిన కె.సురేష్, దుర్గాఫిలింస్ అధినేత తుమ్మల రామ్మోహనరావు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement