bezawada
-
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు
సాక్షి,విజయవాడ: అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గ వాసికెక్కిన ఇంద్రకీలాద్రి కూటమి పాలనలో అప్రతిష్ట పాలవుతుంది. అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో.. ఆ గుడిలో లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తే అంతే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల నమ్మకం వమ్ము అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా,లడ్డూ ప్రసాదంలో తల వెంట్రుక ప్రత్యక్షమవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల్లో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయి. ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. లడ్డూ ఫొటోల్ని మంత్రులు నారాలోకేష్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘తప్పు జరిగింది. మరోసారి లాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి ఆనం రీట్వీట్ చేశారు’.ఇంతకీ ఏం జరిగిందంటే?ఇటీవల ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అంనతరం ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో వెంట్రుక కంట పడింది. లడ్డూలో వెంట్రుక పొరపాటున పడిందేమో అని అనుకున్నారు. సాయంత్రం తన భార్య కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో మరో వెంట్రుక కనపడడంతో భక్తుడు హతాశుడయ్యాడు. వెంటనే వెంట్రుక ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. లడ్డూ ప్రసాదంలో వెంట్రుక పడిన విషయాన్ని మంత్రులు నారా లోకేష్,ఆనంకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.@naralokesh @Anam_RNReddy Respected sir yesterday we visited sri kanaka durga temple vijayawada the laddu prasadam was unhygienic we found hair in one laddu in the morning(we didn't take any photos of that)again my wife found hair in another Laddu now so pls look in to this sir pic.twitter.com/c6KjqAXLyE— Saran Baba (@SaranBaba1) February 8, 2025 ఆ ట్వీట్‌పై ఆనం రామనారాయణ రెడ్డి ట్వీట్లో దుర్గుగుడిలో తయారు చేసే లడ్డూ నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తే. నేను స్వయంగా లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ప్రసాదం పవిత్రంగా ఉంటామని చర్యలు తీసుకుంటాన్నారు. అయితే, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పలు దేవాలయాల్లో నాణ్యత లోపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడ దుర్గ గుడిలో దర్శనం,అన్నప్రసాదం, ఇప్పుడు లడ్డూ ప్రసాదం తయారీ.. ఇలా వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బెజవాడలో భారీ వాన..
-
బెజవాడ కాలకేయుడు..!
-
బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు?
ఆయనో సీనియర్ ఎంపీ. పార్టీ అధినేత దగ్గర్నుంచి.. ముఖ్యనేతల వరకూ అందరికీ కొరకరాని కొయ్యగా మారారు. దీంతో నిన్నా.. మొన్నటి వరకూ అందరూ కలిసి ఆయన్ను టార్గెట్ చేశారు. ఎంపీకి తెలియకుండానే ఆయనకు ఎర్త్ పెట్టే ప్లాన్లు అమలుచేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనే రివర్స్ ఎటాక్ చేస్తుండటంతో పచ్చ పార్టీలో కలవరం మొదలైందట. ఇంతకీ సైకిల్ పార్టీ అధినేతని.. ఆ పార్టీ నేతలను కంగారు పెడుతున్న ఆ ఎంపీ ఎవరు? బెజవాడ రాజకీయాల్లో తనకు తాను ఓ బ్రాండ్ గా చెప్పుకునే వ్యక్తి ఎంపీ కేశినేని నాని. రెండోసారి ఎంపీగా గెలిచినప్పటినుంచీ పార్టీ అధినేతతో, కొందరు లోకల్ లీడర్లతో కేశినేనికి గ్యాప్ ఏర్పడిందనే టాక్ నడిచింది. దీంతో నానికి సీటు గల్లంతయ్యేలా అక్కడి నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నారు. కొన్నాళ్ల పాటు సహించిన కేశినేని నాని.. సైలెంట్‌గా ఉంటే ఇక తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారనే ఆలోచనతో రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేశినేని నాని తీరుతో సొంత పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయిందట. ఇటీవల కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని వ్యవహారశైలి పైనే గుసగుసలాడుకుంటున్నారని చెబుతున్నారు. ఎంపీ తీరు నచ్చని చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టాలనే ఆలోచనలో భాగంగా అతని సోదరుడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిని తెరపైకి తెచ్చారని టాక్. పెద్దబాబు, చినబాబు మద్దతు ఉండటంతో ఇక కేశినేని చిన్ని సొంత అన్నకే పోటీగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినాయకుల మద్దతుతో ఎంపీ వర్గాన్నంతా తన వైపు లాగేసుకుంటూ వస్తున్నారట. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ వస్తున్న నాని కామ్ గా ఉంటే తన సీట్‌కు ఎసరు పెట్టేస్తారనే ఫీలింగ్ కి వచ్చి.. కొద్దిరోజులుగా పార్టీ నేతలతో పాటు అధినేతను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారని బెజవాడ తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తన పంచ్ డైలాగ్ లతో నేరుగా పార్టీకి, అధినేతకు ఝలక్ ఇచ్చారని పార్టీ నాయకులే చెబుతున్నారు. లోఫర్లకు , డాఫర్లకు టిక్కెట్లివ్వొద్దని పార్టీ అధినేతకి నేరుగా సూచించారు. ఈ కామెంట్స్ తన సోదరుడు కేశినేని శివనాధ్ ను ఉద్ధేశించే చేశాడని బెజవాడలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు పచ్చ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా మారాయట. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని నాని.. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడి పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. అభివృద్ధి విషయంలో తాను భేదాలను చూడనని, పార్టీ ఫీలింగ్ కేవలం ఎన్నికలప్పుడే అని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొండితోక బ్రదర్స్‌పై పదే పదే విమర్శలు చేస్తున్న నందిగామ టీడీపీ నేతలకు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. నందిగామతో సరిపెట్టకుండా.. తాజాగా మైలవరంలోనూ కేశినేని నాని తన పంచ్ డైలాగ్ లతో పార్టీ నేతలను కంగారు పెడుతున్నారు. చదవండి: వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తనకంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉందని..ఈసారి బెజవాడ ఎంపీ టిక్కెట్‌ను ఏ పిట్టలదొరకు ఇచ్చినా తననేం చేయలేరంటూ కామెంట్ చేశారట. తన అభిప్రాయాలతో ఏకీభవించేవారితో కలిసి నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని.. ప్రజలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా తనకుందంటూ బాంబ్ పేల్చారట. కేశినేని నాని చేసిన ఇండిపెండెంట్ కామెంట్స్‌పై బెజవాడ దేశంలో ఓ రేంజ్లో చర్చ సాగుతోందట. నాని పార్టీ నేతలను అలర్ట్ చేశారా.. లేక టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలిచ్చారా అనే విషయం అర్థం కాక కొందరు నేతలు తల బాదుకుంటున్నారట. బెజవాడ ఎంపీ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుకు ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తారో? -సత్యానందరెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: కోడెలకు అన్యాయం చేస్తున్నారు -
బెజవాడలో దంచికొట్టిన వాన
-
అర్ధరాత్రి పూజలు
-
బెజవాడ రౌడీలు
విజయవాడలో మళ్లీ అరాచక శక్తులు పెచ్చరిల్లుతున్నాయి. సామాన్యులపై దాడులు, బలవంతపు వసూళ్లు, హత్యలు, కిడ్నాపులు, సెటిల్మెంట్లతో నగరం అట్టుడుకుతోంది. రౌడీలు, కేడీలు నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కఠినచర్యలు చేపట్టాల్సిన పోలీసులు స్తబ్దుగా ఉంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకుల ఆదేశాలతోనే పోలీసులు చర్యలు చేపట్టలేకపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : ముంబాయి, హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరంలోనూ సుపారీ కల్చర్ విస్తరిస్తోంది. గతంలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నగరంలో రౌడీయిజం ఉండేది. 2014 నుంచి రాజధానిలో రౌడీయిజం రూపు మార్చుకుంది. ఆస్తులు, డబ్బు కొల్లగొట్టడమే లక్ష్యంగా రౌడీయిజం చెలరేగిపోతోంది. టీడీపీ నేతలు పక్కా వ్యూహంతో రౌడీలను చేరదీస్తున్నారు. ‘సుపారీ’ పేరుతో డీల్ కుదుర్చుకుని దాడులు చేయిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం నగరాన్ని హడలెత్తించిన వర్గపోరు రౌడీయిజానికి భిన్నంగా ప్రస్తుతం రౌడీలు దందాలు సాగిస్తున్నారని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. సామన్యులు, వ్యాపారులు లక్ష్యంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి రౌడీలను కూడా రప్పిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆ నలుగురి అండ... నలుగురు టీడీపీ ప్రజాప్రతినిధులతోపాటు మధ్యస్థాయి నేతల అండతోనే విజయవాడలో రౌడీయిజం జడలు విప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదాస్పదుడైన ఓ ప్రజాప్రతినిధి రౌడీయిజంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. దీంతో అరాచక శక్తులు వాణిజ్య ప్రాంతంలో సెటిల్మెంట్లు చేస్తూ వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండేళ్ల కాలంలో దాదాపు 50 వరకు దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించడం గమనార్హం. శివారుప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్ద గ్యాంగ్లనే నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రియల్టర్లను బెదిరిస్తూ బహిరంగంగానే దందాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నగర పాలకు సంస్థకు చెందిన ప్రజాప్రతినిధి అండతో రౌడీలు సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెలరేగిపోతున్నారు. ఈ నలుగురి అండతోనే రౌడీలు విజృంభిస్తున్నారు. అందుకు కొన్ని తాజా తార్కాణాలు ఇవీ... ♦ కొన్ని నెలల క్రితం నగరంలో కొందరు వైద్యులు ఏకంగా ఓ వ్యాపారిని కిడ్నాప్ చేయించి మరీ దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఆ కేసును నీరుగార్చేలా టీడీపీ ప్రజాప్రతినిధి కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ ఓ మహిళా న్యాయవాది హత్యకు పొరుగు జిల్లా నుంచి రౌడీలతో సుపారీ కుదుర్చుకున్నారు. ♦ గుంటూరు జిల్లాకు చెందిన రౌడీతో ఒప్పందం కుదుర్చుకుని రామవరప్పాడులో ఓ మహిళను హత్య చేశారు. ♦ సింగనగర్, సత్యనారాయణపురంలో సామాన్యుల ఆస్తులే లక్ష్యంగా రౌడీ మూకలు చెలరేగిపోతున్నాయి. తాము చెప్పిన ధరకు ఆస్తులు అమ్ముకుని వెళ్లాలని బెదిరిస్తున్నాయి. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలో మహిళలు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు కూడా. ♦ కొన్ని నెలల క్రితం ఖల్ నాయక్ అనే నగరబహిష్కృత రౌడీ షీటర్ ఒకర్ని హత్య చేశారు. ♦ టీడీపీ ప్రజాప్రతినిధి తమకు పోటీగా ఉన్న ఒక ట్రావెల్స్ ఆపరేటర్‌ను కొంతకాలం క్రితం రౌడీలతో బెదిరించడం వివాదాస్పదమైంది. రౌడీలు బాబోయ్ రౌడీలు... రాజధాని రౌడీషీటర్లు, కేడీలకు అడ్డాగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో విజయవాడలోనే అత్యధికంగా నలుగురు నగర బహిష్కృతులు, 274 మంది రౌడీషీటర్లు, 130 మంది కేడీలు, 70 మంది వరకు బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు ఉన్నారు. వారిపై పోలీసులకు ఎలాంటి నియంత్రణ లేకుండాపోయింది. వారు నియమితకాల వ్యవధిలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయడమే లేదు. రౌడీషీటర్ ఖల్ నాయక్ చేతిలో ఒకరి హత్యకు గురైన తరువాత కొన్ని రోజులు పోలీసులు కౌన్సెలింగ్ అంటూ హడావుడి చేశారు. అయితే అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తరువాత ఆ విషయాన్నే వదిలేశారు. అధికారం అండతో రౌడీలు తమ దందా సాగిస్తున్నారు. తీవ్రమైన నేరస్తులను గరిష్టంగా ఆరునెలల పాటు నగరం నుంచి బహిష్కరిస్తారు. ఆరు నెలల తరువాత సమీక్షించి అవసరమైతే బహిష్కరణను పొడిగిస్తూ ఉంటారు. ఆ విధంగా విజయవాడకు చెందిన నలుగురు రౌడీషీటర్లు రెండేళ్లుగా బహిష్కరణలోనే ఉన్నారు. అయితే వారు నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు. -
బెజవాడ ఎయిర్ షో అదుర్స్
-
బెజవాడలో పవన కళ్యాణ్ పోస్టర్ల కలకలం
-
హైదరాబాద్‌కు విజయవాడ పోటీ కాదు
బెజవాడలో భయపెడుతున్న అద్దెల మోత.. నైట్ ఫ్రాంక్ నివేదిక సాక్షి, అమరావతి: మౌలిక వసతుల లేమి.. నిపుణుల లభ్యత లేకపోవడం.. విపరీతమైన అద్దెల మోత విజయవాడలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తెలిపింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న హైదరాబాద్‌కు విజయవాడ ఏ విధంగానూ పోటీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రాజకీయంగా కొద్దిపాటి అనిశ్చితి ఉన్నప్పటికీ వృద్ధికి ఎటువంటి ఢోకా లేదంది. హైదరాబాద్‌తో పోటీపడాలంటే విజయవాడలో మౌలిక వసతులు పెరగడంతోపాటు అద్దెలు దిగి రావాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. ఈ సంస్థ రాష్ట్ర రాజధాని అమరావతిపై తొలిసారిగా ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పూర్తయి.. మౌలిక వసతులు ఏర్పడిన తర్వాతనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే వీలుంటుందని అందులో అభిప్రాయపడింది. విజయవాడలో అద్దెలు భారీగా ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండటానికి పదేళ్లు అవకాశమున్నప్పటికీ ముందుగానే సచివాలయాన్ని తరలించడంతో వాణిజ్య, నివాస స్థలాలకు బాగా డిమాండ్ ఏర్పడి అద్దెలు విపరీతంగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ డెరైక్టర్ శ్రీవాసుదేవన్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్‌లోని అబిడ్స్, కోఠి వంటి ప్రధానమైన వాణిజ్య, వ్యాపార ప్రాంతాల్లో చదరపు అడుగు రూ.30 నుంచి రూ.40 ఉంటే విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోందన్నారు. -
హైదరాబాద్‌కు విజయవాడ పోటీ కాదు
-
బెజవాడలో కష్టాలుపడుతున్న భక్తులు
-
బెజవాడలో ఆలయం, దర్గా కూల్చివేత
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రార్థనాలయాలను కూల్చివేస్తోంది. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపక్కగా ఉన్నవాటిని అర్ధరాత్రి సమయంలో పడగొట్టేస్తోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి దుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొ న్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు. లాగే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధి మొదట్లో ఉండే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా ప్రాంగణాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దర్గా మరమ్మతులు పూర్తయి కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోకుండానే ఇలా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా కూల్చివేతల కొనసాగింపు.. గతంలో 30 దేవాలయాలను కూల్చివేసినందుకు నిరసనగా పీఠాధిపతులు, మఠాధిపతులు విజయవాడలో పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక నుంచి ఏ దేవాలయం, ప్రార్థనాలయం తొలగించాలన్నా ఆయా ప్రార్థనామందిరాల పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. తొలగించిన దేవాలయాలను నిర్మించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. అయితే వీటిన్నంటినీ పక్కన పెట్టి యథావిధిగా దేవాలయాలు, దర్గాల కూల్చివేతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆలయాల కూల్చివేతలు ఇక లేవంటూ ప్రకటిస్తూనే మరో వైపు ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు
విజయవాడ: ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది. అక్కడ ఉంటూనే ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బెజవాడకు ఐదు మండలాలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినరెవెన్యూ అధికారులు జేసీ, సబ్కలెక్టర్లతో కలిసి కసరత్తు విజయవాడ : బెజవాడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఐదు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్థానిక జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జేసీ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృ జన, ఇతర రెవెన్యూ అధికారులు సమావేశమై కొత్త మండలాల ఏర్పాటుపై కసరత్తు చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న తహశీల్దారు కార్యాలయ పరిధిని గతంలో 3 రెవెన్యూ మండలాలుగా విభజిస్తూ చేసిన ప్రతిపాదనలపై పునః సమీక్షించారు. ప్రజలు, పరిపాలనా సౌలభ్యం నేపథ్యంలో నగరంలో ఐదు, కనీసం నాలుగైనా రెవెన్యూ మండలాలు అవసరమని అధికారులు భావించారు. ఈ సందర్భంగా 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3.31 లక్షలు, పశ్చిమలో 3.03 లక్షలు, సెంట్రల్లో 4.66 లక్షల మంది ఉన్నారని నివేదిక తయారు చేశారు. తాజా లెక్కల ప్రకారం 15 లక్షల జనాభా ఉంటారని అంచనా వేశారు. అధిక జనాభా కలిగి ఉన్న విజయవాడ మధ్య నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 4 లేక 5 రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని జేసీ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ప్రతి 3 లక్షల జనాభాకు రెవెన్యూ మండలం అవసరమని, కొత్త మండలాల కూర్పుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. సబ్ కలెక్టర్ సృ జన, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, రూరల్ తహశీల్దార్ వి.మదన్‌మోహన్‌తో ఆయన చర్చించి నివేదిక తయారు చేశారు. -
బోసిపోయిన బెజవాడ
సంక్రాంతి పండుగ సందర్భంగా జనమంతా పల్లె బాట పట్టారు.దీంతో బెజవాడనగరం బోసిపోయింది.రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో కిక్కిరిసి ఉండే బెజవాడ నగరం శనివారం బోసిపోయింది. వాహనాల హడావిడి నామమాత్రంగా కనపడింది. జనం రోడ్లపై పెద్దగా కనిపించలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ప్రజలు తమ స్వస్థలాలకు తరలి వె ళ్లారు. పండుగ సెలవులు కావటంతో విజయవాడ నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో సుమారు 12 లక్షల జనాభా ఉండగా దాదాపు మూడు లక్షల మంది తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి జనం వ్యాపారంతో బతుకు తెరువు కోసం నగరంలో జీవనం సాగిస్తున్నారు. వారంతా నగరం విడిచి వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావటంతో ఉద్యోగులు కూడా బంధుమిత్రుల ఇళ్లకు, తీర్థయాత్రలకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్లపై జనసంచారం తగ్గింది. దీంతో ఆటోలు, సిటీ బస్సుల సంఖ్య కూడా మూడు రెట్లు తగ్గింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా అంతగా కనపడలేదు. దీనికి తోడు నగరంలో వీఐపీల తాకిడి కూడా కనిపించలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ సొంత ఊళ్లకు పరిమితమయ్యారు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపుల వద్ద మాత్రం కొద్దిపాటి సందడి నెలకొంది. కోడిపందేలకు తరలి వె ళ్లిన జనం నగరంలో కోడిపందేలు, జూదం లేకపోవటంతో విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు జనం పయనమయ్యారు. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడిపందేలు, జూదం ఆడేందుకు, వీక్షించేందుకు వందలాది కార్లలో పలువురు తరలివెళ్లారు. -
బెజవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' పై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు...ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు. పేరు.. ఊరు.. ఏం చేస్తారు.. రాత్రి వేళ ఏ పనిమీద వెళ్తున్నారు వంటి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు ముఖ్యంగా సదరు పౌరునికి సంబంధించి ఆధార్‌కార్డు లేదా ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన మరేదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తారు. ఒకవేళ పట్టుబడిన వారు నేరస్థులైతే.. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తారు. దీనిపై న్యాయమూర్తి...హైకోర్టును ఆశ్రయించటంతో ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను తాత్కాలికంగా బ్రేక్ వేసింది. -
బెజవాడ బుల్లోడినే..
సినీ నటుడు శ్రీకాంత్ కొత్త సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన తన చిన్ననాటి సంగతులు, తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించారు. ఆ వివరాలు ... విలన్‌గా అద్భుతమైన పాత్రలు పోషించి.. అనతికాలంలోనే హీరోగా ఉన్నతస్థానానికి చేరుకుని విజయవంతమైన చిత్రాల్లో నటించారు హీరో శ్రీకాంత్. పెళ్లిసందడి, తాజ్‌మహల్, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి సినీరంగంలో ఉన్నతస్థానానికి చేరుకున్న ఆయనకు విజయ వాడతో ప్రత్యేక అనుబంధమే ఉంది. శ్రీకాంత్ మన జిల్లాలోనే పుట్టినా.. తరువాత కర్ణాటక వెళ్లిపోయూరు. బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆదివారం నగరానికి వచ్చిన శ్రీకాంత్ కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - సాక్షి, విజయవాడ - హీరో శ్రీకాంత్ సాక్షి : మీ కొత్త సినిమా విశేషాలేమిటి? శ్రీకాంత్ : కొత్త సినిమాలో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ నాది. ఫ్యామిలీతో పాటు రాజకీయం కొంత టచ్‌లో ఉండే పాత్ర. ఇక మిగిలిన విషయాలు చెబితే కథలో సస్పెన్స్ పోతుంది. దర్శకుడు బాబ్జీ (శ్రీను) మంచి కథా రచయితగా నాకు తెలుసు. మంచి కథతో పాటు శ్రీను దర్శకత్వం వహిస్తే ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన్ను ఒప్పించాం. సాక్షి : ప్రస్తుతం నటిస్తున్న మిగతా సినిమాలు? శ్రీకాంత్ : జల్సారాయుడు, నాటుకోడి, ఢీ అంటే ఢీతో పాటు సతీష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటిలో జల్సారాయుడు త్వరలోనే విడుదలకానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాక్షి : మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? శ్రీకాంత్ : బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. నగరానికి చెందిన లక్ష్మీ ఫిలిమ్స్ నా సినీ ఎదుగుదలకు ఎంతో సాయమందించింది. సాక్షి : నవ్యాంధ్రలో సినిమాలకు అనుకూలమైన ప్రాంతమేది? శ్రీకాంత్ : విజయవాడతో పాటు వైజాగ్, శ్రీకాకుళం పరిసరాలు షూటింగ్‌లకు అనుకూలం. ఇప్పటికే వైజాగ్, శ్రీకాకుళంతో పాటు రాజమండ్రి పరిసరాల్లో జరుగుతున్నాయి. ఇకపై విజయవాడలో కూడా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతాయని భావిస్తున్నా. మా నుంచే ప్రారంభం అయితే అందరికీ మంచిదే. సాక్షి : నగరంతో మీకున్న అనుబంధం? శ్రీకాంత్ : నా చిన్నతనమంతా విజయవాడలోనే సాగింది. ఇక.. నా చెల్లెల్ని నగరంలోని పటమటకు కోడల్ని చేశాను. ఏడాదిలో కనీసం కొన్ని రోజులైనా నగరంలోనే గడుపుతాను. పైగా.. దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అమ్మ దయతో కొత్త సినిమా విజయవంతం కావాలని కోరుకున్నా. సాక్షి : షూటింగ్‌లకు విజయవాడ అనుకూలమేనా..? శ్రీకాంత్ : పల్లెలు, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు విజయవాడ ఎంతో అనువుగా ఉంటుంది. దీనికితోడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రకటించారు. ఇకపై మరికొంతమంది నగరంలో సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. అయితే, దీనికి నగర ప్రజలతో పాటు పోలీసుల సహకారం ఎంతో అవసరం. -
మీ..అపర్ణ వర్మ అల్లరి పిల్ల
బెజవాడలో పుట్టిన ఈ బుల్లెమ్మకు సిటీకొచ్చాకే లైఫ్ టర్న్ అయింది. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ వచ్చిన ఈ అమ్మాయి స్టైల్ మార్చేసింది హైదరాబాదే. చిన్నప్పుడు అల్లరి పిల్లగా.. స్కూల్ డేస్‌లో కిలాడీ పిల్లగా.. కాలేజ్ గాళ్‌గా ఫ్యాషన్ మంత్రం పఠించిన ఈ ముద్దుగుమ్మ నటిగా, యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న అపర్ణ వర్మ ‘మీ’ అంటూ ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. - శిరీష చల్లపల్లి నేను పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. డిగ్రీ వరకూ అక్కడే చదివాను. మా అక్క వాళ్లు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉండేవాళ్లు. మా నాన్న లారీ ట్రాన్స్పోర్టర్. అమ్మ హోమ్ మేకర్. తమ్ముడికి నాకు ఏజ్‌లో పెద్ద తేడా లేదు. ఇద్దరం మాక్ అసెంబ్లీ ఆడుకునేవాళ్లం. టవల్ భుజానికి కట్టుకుని, చేతిలో ఇడ్లి పాత్ర పట్టుకుని, ఇంకో చేత్తో అట్లకాడ పట్టుకుని రాజుల్లా యుద్ధాలు చేసేవాళ్లం. కిలాడీయోంకా కిలాడీ చిన్నప్పుడు అబ్బాయిలతో సమానంగా అల్లరి చేసేదాన్ని. స్కూల్లో కోకో చాంపియన్ని కూడా. మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే ఉండేది. మా ఫ్రెండ్స్ లంచ్ బాక్స్‌లు తెచ్చుకునేవాళ్లు. ఫస్ట్ పీరియడ్‌లోనే వాళ్ల బాక్స్‌ల్లోని ఐటమ్స్ టేస్ట్ చేసేసేదాన్ని. లంచ్ బ్రేక్‌లో బాక్స్ తెస్తానని ఇంటికి వెళ్లి తినేసి వచ్చేదాన్ని. అందుకే నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. చదువు కంటే డ్యాన్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఫ్యాషన్ మంత్ర.. డిగ్రీ అయిపోయాక ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేయడానికి ఫస్ట్‌టైమ్ సిటీకి వచ్చాను. హైటెక్ సిటీ, నిఫ్ట్ కాలేజీ పక్కన గవర్నమెంట్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్‌లో చేరాను. కోర్సు చేస్తుండగానే జాబ్ ఆఫర్స్ వచ్చాయి. రీబాక్ స్టోర్స్‌లో మేనేజర్‌గా కొన్నాళ్లు పని చేశాను. ఓసారి మా ఫ్యామిలీతో కలసి రామోజీ ఫిలింసిటీకి వెళ్లాను. అక్కడ నన్ను చూసిన లారెన్స్.. ‘స్టైల్ సిని మాలో నటిస్తావా’ అని అడిగారు. ముందు ఆశ్చర్యపోయాను. మా పేరెంట్స్ కూడా వద్దన్నారు. దాంతో ఊరుకున్నాను. 12 కిలోలు తగ్గాను.. వెండితెరపై వెతక్కుండా వచ్చిన అవకాశం.. అలా వెళ్లిపోయింది. తర్వాత మూడు నెలలు యాంకరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. కానీ నేను చాలా బొద్దుగా ఉండటంతో నన్ను న్యూస్ రీడింగ్‌కు రిజెక్ట్ చేశారు. నేను దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. రోజుకు 8 గంటలు జిమ్‌లో ఎరోబిక్స్ చేశాను. 45 రోజుల్లో 12 కిలోలు తగ్గాను. ఆ తర్వాత అదే చానల్‌కు వెళ్తే.. అంతా ఆశ్చర్యపోయి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అలా జెమినీ, మా, ఈ టీవీలలో యాంకర్‌గా పలు ప్రోగ్రామ్స్ చేశాను.. చేస్తున్నాను. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. ఎంత మార్పో.. సిటీకి వచ్చిన కొత్తలో.. ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఫ్లైఓవర్లు, మల్లీప్లెక్స్‌లు.. పదేళ్లలో ఎంతో చేంజ్. సిటీ ఫుడ్ టేస్ట్ సూపర్బ్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 365 డేస్ హలీమ్ దొరికే స్టాల్ ఉంటుంది. అక్కడ హలీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉండే చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ భలే రుచిగా ఉంటుంది. ఇక నాకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే కూడా గొప్ప నమ్మకం. వినాయకచవితి పండుగకు రకరకాల లంబోదరుడి విగ్రహాలు భలేగా ఉంటాయి. ఖైరతాబాద్‌లోని మహా వినాయకుడిని చూడటం మాత్రం మిస్సవ్వను. -
బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!
విజయవాడ : మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు బెజవాడ వేదిక కానుంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, చిరంజీవే స్వయంగా వెల్లడించారు. అవకాశం వస్తే తన 150వ చిత్రానికి విజయవాడలోనే శ్రీకారం చూడతానని ఆయన ప్రకటించారు. ప్రముఖ హాస్యనటుడు దివంగత డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిన్న బెజవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మొట్టమొదటిసారిగా అల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగానికి విజయవాడ ఎప్పుడో రాజధాని అయ్యిందన్నారు. అల్లు రామలింగయ్య పేరుమీద ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణలకు ప్రదానం చేశారు. -
ఆర్చరీ మెరుపులు
- విజయవాడ చేరుకున్న పూర్వాష, జ్యోతిసురేఖ - ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు ఘనస్వాగతం విజయవాడ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌లో బెజవాడ కీర్తిపతాకను ఎగురవేసి నగరానికి వచ్చిన ఆర్చర్లకు ఘనస్వాగతం లభించింది. ఇంచియాన్ (కొరియా)లో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో విజయవాడ నుంచి భారత కాంపౌండ్ మహిళా ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన పూర్వాష, వెన్నం జ్యోతి సురేఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పూర్వాష తన కోచ్ ఎల్.చంద్రశేఖర్‌తో కలిసి గన్నవరం చేరుకోగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.రామకృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు, క్రీడాసంఘాల ప్రతినిధులు నామిశెట్టి వెంకట్, డి.శ్రీహరి, శాతవాహన కళాశాల పీడీ సంగీతరావు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అర్చర్లతో పాటు పూర్వాష చదువుకున్న విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ర్యాలీగా నగరానికి చేరుకున్నారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విజయవాడ ఓల్గా అకాడమీ ఆర్చర్లు తప్పకుండా పతకాలు సాధిస్తారని ముందుగానే చెప్పామని, అదిప్పుడు నిజమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎంను కలిసిన సురేఖ భారత జట్టుతో శుక్రవారం ఢిల్లీ వచ్చిన మరో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శనివారం నగరానికి చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాసంఘాలు, సహచర ఆర్చర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి సురేఖకు సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సీబీఆర్ ప్రసాద్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. 1951 ఢి ల్లీలో జరిగిన తొలి ఏషియన్ గేమ్స్‌లో కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు, దండమూడి రాజగోపాలరావు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించగా.. ఇన్నేళ్ల తరువాత జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించిందన్నారు. ఆమెకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చారు. జ్యోతిసురేఖ వెంట తండ్రి సురేంద్ర, డీఎస్డీవో పి.రామకృష్ణ, కేఎల్‌యూ డెరైక్టర్ రామకృష్ణ, శాయ్ కోచ్ వినాయకప్రసాద్, సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు అర్జా పాండురంగారావు ఉన్నారు. -
బెజవాడలో రేపు బాబు 2 కి.మీ పాదయాత్ర
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 నుంచి 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ యాత్ర చేపట్టనున్నారు. జన్మభూమితో పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారి కూడా జన్మభూమిలో పాల్గొంటారు. కాగా ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించనున్నారు. -
నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడిలా..!
-
ఇంద్రకీలాద్రిపై సీఐ నీలిచిత్రాల వీక్షణం
విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఓ సీఐ అపచారానికి పాల్పడ్డాడు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న సీఐ వర ప్రసాద్ సెల్ఫోన్లో బూతు చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిపోయాడు. ఓవైపు భక్తులు క్యూ లైన్లలోఅమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తుంటే...మరోవైపు సీఐ మాత్రం విధులు పక్కనపెట్టి దర్జాగా కుర్చీలో కూర్చొని బూతు పురాణాన్ని వీక్షించటం గమనార్హం. పక్క జిల్లా నుంచి డిప్యూటేషన్ మీద దేవీ నవరాత్రులు సందర్భంగా బందోబస్తు నిమిత్తం అతడు దుర్గగుడికి వచ్చాడు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన సీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. సీఐపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారులు కూడా ఈ ఘటనను సీరియస్ గా పరిగణిస్తున్నారు. సీఐపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై విజయవాడ సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. -
బెజవాడలో బతుకమ్మ
బతుకమ్మ... ఓ ఇంద్రధనస్సు ‘ప్రపంచంలో మరెక్కడా కనిపించని పండుగ బతుకమ్మ.. ప్రకృతితో మమేకమై జరుపుకునే అతి పెద్ద సంబురం.. ఇంద్రధనస్సును తలపించేలా బతుకమ్మలోని పూల వర్ణాలు ఉండడం అద్భుతం’ అంటారు ఠాగూర్, గుర్రం జాషువా అవార్డు గ్రహీత కోవెల సుప్రసన్నాచార్య. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన కవిగా, రచయితగా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు బతుకమ్మ పండుగ ప్రత్యేకత, తన చిన్ననాటి సంగతులను ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. కాకతీయులు చాలా గొప్ప రాజులు. పంచాయన దేవతలైన ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరులను ఆరాధించారు. ఒక్క వేయి స్తంభాల ఆలయంలోనే శివుడు, కేశవుడు, ఆదిత్యుడు ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ కాకతీయుల కాలంలోనూ, అంతకుముందు కూడా ఉండి ఉండవచ్చు కానీ అందుకు ఆధారాలు లేవు. గణపతి నవరాత్రుల తర్వాత బొడ్డెమ్మ పండుగ, ఆ తర్వాత బతుకమ్మ పండగ జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. శ్రీ చక్ర ంలో నాలుగు దళాల మధ్య గణపతి మూలధారా చక్రంలో బీజాక్షరం దగ్గర ఉంటాడు. కుటుంబంంలో పెళ్లిళ్లు, ఇతర ఏ శుభకార్యాలు జరిగినా కూడా గారెలు చేస్తారు. అవి పితృలకు శ్రాద్ధకర్మల కోసం ప్రతి పనికి పితృదేవతలకు పూజించాలి. ఆ విధంగా పెత్రమాసతోనే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. మూలపుటమ్మ.. ప్రకృతిని తల్లిగా చూస్తాం కాబట్టి భూ మాత అంటాం. కనకదుర్గ అంటాం. ఇవి దేవతా అర్చనలో కొన్ని భాగాలు. ఇన్ని పూలను కలుపుకుని అర్థించడం అనేది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. దానికి బతుకమ్మ అని పేరు పెట్టారు. శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అంటూ లక్ష్మి, గౌరి, పార్వతి, సరస్వతి అందరి పేర్లు వస్తాయి. బతుకమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మ అంశంగా చూశారు. తొమ్మిది రోజుల పాటు అమంత్రకంగా (మంత్రాలు లేకుండా) ఉపాసన చేస్తారు. పాటలు పాడుతారు. నృత్యాలు చేస్తారు. చతుఃషష్టి ఉపచార పూజలలో కూడా సంగీతం, నృత్యం దర్శయామీ అంటారు కదా. సూర్య చంద్రులు కలిసే ఉంటారు సద్దుల బతుకమ్మ రోజు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు కలిసే ఉంటారు. దుర్గ అమ్మవారికి చంద్ర విద్య, చంద్ర సహోదరి అని పేరు. సూర్య మండలంలో మద్రస్తురాలిగా ఉండే దేవత అని పిలుస్తారు. చల్లని తల్లిగానూ ఉగ్రకాళీగా ఉంటుంది. దుర్అంటే దుర్లభమైనది, వెళ్లలేనిది అని అర్థం. గ అంటే వెళ్లాల్సినది అని అర్థం. రెండు అంశలు కలిసి దుర్గ అయింది. సామాన్యులు జరుపుకునేది.. వైదిక సంప్రదాయం హోమాలతో సంబంధం లేకుండా సామాన్యులు జరుపుకునేది బతుకమ్మ పండగ. మహిళను దేవతగా భావించి సమాజంలో భాగంగా చేశారు. ఇదే విధంగా సువాసినీ పూజ సంప్రదాయం కనిపిస్తుంది. మహిళలు తమ పుట్టింటి, మెట్టినింటి వారందరూ బాగుం డాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. రెండు భిన్నమైన కుటుంబాల మధ్య కలిసిపోవడం కనిపిస్తుంది. ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ దశ మహావిద్యల్లో భగళామాత శత్రువును మాట్లాడకుండా అడ్డుకుంటుంది. అందుకే దీక్షలో ఉన్నవారు భగళాదేవికి ఇష్టమైన పసుపు బట్టలే కడుతారు. అందుకే పసుపు వర్ణంతో కూడిన తంగేడు పూలకు ప్రాధాన్యం ఉంటుంది. జీవితానికి పరిపూర్ణతను ఇస్తుంది. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే చందమామ అంటూ పాడుతారు. ఈ విధంగా ఏకోత్తర వృద్ధిలో ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవడం ఆత్మసమర్పణకు ప్రతీక. ఇన్ని రంగుల పూలతో బతుకమ్మ ఇంద్రధనస్సులా అవుతుంది. భేదాలు ఉండవు.. బతుకమ్మ పండుగ సమయంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే భేదాలు మరిచిపోతారు. సద్దుల వద్ద ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు. ప్రసాదాలు పంచుకుంటారు. పండుగ సమయంలో కొత్తగా పెళ్లయిన వారికి శిక్షణ ఇవ్వడం కనిపిస్తుంది. బెజవాడలో బతుకమ్మ ఆడిన గుర్తు 1948లో జిల్లాలో దుర్లభమైన పరిస్థితి. రజాకారుల అకృత్యాలు పెరిగిపోయాయి. వందలాది కుటుంబాలు వలస వెళ్లాయి. మా కుటుంబాలు కూడా విజయవాడ, రాజమండ్రి, ఏలూరు తదితర చోట్లకు వలస వెళ్లిపోయాయి. మళ్లీ వస్తమో రామో కూడా తెలియదు. అప్పుడు బతుకమ్మ పండుగను విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో కృష్ణా నది ఒడ్డున జరుపుకున్నాం. గునుగుపువ్వు, తంగేడు పువ్వు ఎలా తెచ్చుకున్నారో తెలియదు కానీ వందలాది మంది తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుని కృష్ణానదిలో బతుకమ్మలను వదలడం ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతోంది. అప్పడు నా వయస్సు 12 ఏళ్లు. విజయవాడ ప్రజలు ఆశ్చర్యపోయి చూశారు. పోలీస్ చర్య తర్వాత మళ్లీ ఇక్కడకు తిరిగి వచ్చాం. వరంగల్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం ఎన్నడూ బతుకమ్మ పండుగలో పాల్గొనడం చూడలేదు. వరంగల్‌లో ఎడ్లబండ్ల మీద భారీ బతుకమ్మలను పెట్టుకుని వెళ్లేవారు. మొదటి నుంచి ఇప్పటిలాగే వైభవంగా జరుగుతోంది. -
బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్న విజయవాడలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెజవాడలో రౌడీ అనేవాడే ఉండకూడదన్నారు. ఇక నుంచి తాను విజయవాడవాసినే అని, ఇక్కడే ఎక్కువ కాలం ఉండి పాలన సాగిస్తానని అన్నారు. ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఢిల్లీ నిర్భయ ఉదంతంతో టూరిస్టులు భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే టూరిస్టులు సందర్శనలకు వస్తారని, దాంతో ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. మాఫీయాను క్షమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పుడప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతాయన్నారు. వినోదం కోసం కోడిపందాలు ఆడితే తప్పులేదని అయితే డబ్బు పెట్టి ఆడటం నేరమన్నారు. హైదరాబాద్ బిర్యానీని మించిన వంటకాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వీజీటీ వుడాను మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. -
బెజవాడకు డబుల్ డెక్కర్ చక్కర్లు
విజయవాడ : విజయవాడకు త్వరలోనే డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం డబుల్ డెక్కర్ రైలు ట్రైల్ రన్ నిర్వహించడం ఇందుకు బలాన్నిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఉన్న డబుల్ డెక్కర్ రైలు స్టేషన్‌లోని 1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై మధ్యాహ్నం మూడు నుంచి సాయత్రం ఆరు గంటల వరకు చక్కర్లు కొట్టింది. అనంతరం రైల్వే యార్డుకు చేరుకుంది. బుధవారం ఉదయం 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై నడిపి పరిశీలిస్తారు. అనంతరం గుంటూరుకు, అక్కడ నుంచి గురువారం కాచిగూడకు వెళ్తుందని అధికారులు తెలిపారు. డబుల్ డెక్కర్ రైలును విజయవాడ వరకు నడిపితే ఇక్కడ ప్లాట్‌ఫారాలు ఎంతమేరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రైలు ప్లాట్ఫారానికి ఎంత దూరంలో ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఏ ఇబ్బందులు రావని అధికారులు నిర్ధారణకు వస్తే త్వరలోనే విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు వస్తుంది. డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ-తిరుపతి మార్గంలో వారానికి రెండు రోజులు నడుపుతున్నారు. గుంటూరు-కాచిగూడ మార్గం తొలుత నడిపినా ప్రస్తుతం నిలిపివేశారు. ఈ డబుల్ డెక్కర్ రైలును విజయవాడ నుంచి కాచిగూడకు నడపాలని ఇక్కడి కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైల్వే బోర్డుకు కొంతకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నారు. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మధ్య నడిపితే మేలు కాచిగూడ-గుంటూరు మధ్య నడిపిన డబుల్ డెక్కర్ రైలుకు అధికారులు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రాలేదు. దీంతో ఆ రైలును విజయవాడ వరకు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలోనూ డబుల్ డెక్కర్ రైలు నడపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అందువల్లే నగరంలోని అన్ని ప్లాట్‌ఫారాల పైన డబుల్ డెక్కర్ రైలును పరిశీలిస్తున్నారని సమాచారం. ఆకట్టుకున్న డబుల్ డెక్కర్ రైలు.. రెండు ఫ్లోర్లతో ఆకట్టుకునే రంగులు, పూర్తి ఏసీ సదుపాయంతో రూపొందిన ఈ రైలును ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. మొత్తం 17 బోగీలు ఉండగా, రెండు అంతస్తుల్లో కలిపి ఒక్కో బోగీలో 120 సీట్లు చొప్పున ఉన్నాయి. రైలులోని బోగీలు కొద్దిగా వెడల్పుగా ఉండటంతోపాటు సాధారణ బోగీల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నాయి. -
ఏపీ రాజధానిపై ఆరా తీసిన సచిన్!
భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ విజయవాడ నగరం గురించి వాకబు చేశాడు. నగరంలో శుక్రవారం పీవీపీ మాల్ ప్రారంభోత్సవ కార్యాక్రమానికి అతడు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను 20 ఏళ్ల కిందట క్రికెట్ ఆడటానికి వచ్చానని, అప్పటి బెజవాడకు, ఇప్పటికి ఉన్న తేడాను గమనిస్తూ సచిన్ ...పీవీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు, కొత్త రాజధానిపై సచిన్ ఆరా చేసినట్లు సమాచారం. కాగా కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద ఎత్తున భూములు కొన్నట్లు ఓ రూమర్ హల్చల్ చేసింది. రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జోరందుకోవటంతో అతడు ఇక్కడ భూములు కొన్నాడని ప్రచారం జరిగింది. అయితే సచిన్ స్నేహితులు మాత్రం ఈ వార్తను కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సచిన్ ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై సచిన్ మాత్రం పెదవి విప్పలేదు. కాగా గతంలో నెల్లూరు జిల్లాలో సచిన్ భూములు కొన్న విషయం తెలిసిందే. -
బెజవాడలోనే ఎయిమ్స్: కామినేని
విజయవాడ : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) విజయవాడలోనే ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ కోసం కేంద్రం రూ.12 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కామినేని తెలిపారు. మెడికల్ హబ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో
ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ వచ్చినా ఏ చిన్నా చితకా పాత్రలో మాత్రమే. హీరోలవ్వడం అనేది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. కొంచెం అటూ ఇటుగా, ఇదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి సినీ ప్రపంచంలోకి ఏ మాత్రం సినీ సంబంధంలేని ఒక నటుడు వచ్చి కేవలం హీరో మాత్రమే కాదు ఏకంగా స్టార్ అయి చూపించాడు. అతడే 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణాలేవైనా.. అతన్ని జనాలకు దగ్గర చేసింది మాత్రం సోషల్ మీడియానే. చిత్రీకరణే మొదలవ్వకముందు విడుదల చేసిన సంపూ ఫోటోలు.. ఆ తర్వాత రాజమౌళి ట్వీట్‌తో సంచలనం సృష్టించాయి. తదనంతరం ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఒక సంచలనమే. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరంపర కొనసాగడంతో సంపూకు తిరుగులేకుండా పోయింది. గత కొంత కాలంగా 'ఫేస్బుక్'లో తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వారికి మరింత దగ్గరయిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు. తన అఫీషియల్ ఫేస్బుక్ ఎకౌంట్లో లక్షకు పై చిలుకు లైక్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రతీ పోస్ట్‌కి చివర్లో, 'సదా మీ ప్రేమకు బానిసను' అని చెప్పుకునే సంపూ.. తనపై వచ్చే విమర్శలను కూడా చాలా ఓపికతో, సహృదయంతో ఎదుర్కొనే వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నసంపూర్ణేష్ బాబు మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతాడో వేచి చూడాలి. -
బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్
విజయవాడ : హృదయ కాలేయం చిత్రానికి తాము ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందని చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన తొలిచిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ ‘ హృదయ కాలేయం’ చిత్రం కలెక్షన్లు తగ్గలేదన్నారు. ప్రేక్షకులు చూపించిన ఆదరణను తానెపుడూ మరచిపోలేనన్నారు. త్వరలో తన రెండో చిత్రం ‘ కొబ్బరి మట్ట ’ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఐలాపురం హోటల్లో శుక్రవారం చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ కార్యక్రమంలో పాల్గొంది. కాగా హీరోయిన్ కావ్యకుమారి మాట్లాడుతూ.. తొలి చిత్రం విజయవంతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేమన్నారు. దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తామని ప్రేక్షకులు రుజువు చేశారన్నారు. చిన్న హీరోలు అగ్రహీరోల డైలాగులు చెబితే వచ్చే కామెడీని ప్రేక్షకులకు అందించేందుకే ఈ చిత్రం తెరకెక్కించామని, ఏ హీరోని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో విలన్‌గా నటించిన కె.సురేష్, దుర్గాఫిలింస్ అధినేత తుమ్మల రామ్మోహనరావు పాల్గొన్నారు. -
బెజవాడ బస్టాండ్‌లో 18.లక్షల బంగారం చోరీ
విజయవాడ : విజయవాడ బస్టాండ్‌లో సుమారు రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గత రాత్రి ఈ సంఘటన జరిగింది. స్నేహితురాలి పెళ్లికి వచ్చిన మహిళ సూట్‌కేసులో 450 గ్రాముల బంగారు నగలున్న పెట్టెను అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.... నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక అమెరికాలో ఉంటుంది. ఆమె స్నేహితురాలు అనూష వివాహం బుధవారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ పెళ్లి కోసం ప్రియాంక తన తల్లి జానకితో కలిసి విజయవాడ వచ్చింది. నిజామాబాద్ వెళ్లేందుకు గురువారం రాత్రి పెళ్లివారు ఏర్పాటు చేసిన కారులో బస్టాండుకు వచ్చారు. అంతలో గుర్తు తెలియని వ్యక్తి చొరవగా వచ్చి ఆమె లగేజీని బస్సు దగ్గరకు మోసుకొచ్చాడు. ఆ వ్యక్తి పెళ్లివారికి సంబంధించివాడని భావించి వారు అతడి వెంట నడిచారు. లగేజిని హైదరాబాద్ రూట్లో వెళ్లే బోధన్ బస్సులో పెట్టాడు. అంతలో తల్లి కింద ఉండగా ప్రియాంక టికెట్లు తీసుకునేందుకు వెళ్లింది. అంతే...తర్వాత లగేజి తెచ్చి బస్సులో పెట్టిన వ్యక్తి కనిపించలేదు. ఆ తర్వాత లగేజిని చూసుకోగా, రూ.18 లక్షల విలువైన బంగారు నగలున్న పెట్టె కనిపించలేదు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. లగేజీ తెచ్చిన వ్యక్తే నగల్ని అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.