దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు | Hair Found in Laddu Prasadam at Bezawada Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు.. లోకేష్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసిన భక్తుడు

Published Sun, Feb 9 2025 4:42 PM | Last Updated on Sun, Feb 9 2025 5:26 PM

Hair Found in Laddu Prasadam at Bezawada Kanaka Durga Temple

సాక్షి,విజయవాడ: అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గ వాసికెక్కిన ఇంద్రకీలాద్రి కూటమి పాలనలో అప్రతిష్ట పాలవుతుంది. అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో.. ఆ గుడిలో లడ్డూ ప్రసాదాన్ని సేవిస్తే అంతే పుణ్యం వస్తుందని నమ్మే భక్తుల నమ్మకం వమ్ము అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా,లడ్డూ ప్రసాదంలో తల వెంట్రుక ప్రత్యక్షమవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల్లో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు కలకలం రేపాయి. ప్రసాదంలో నాణ్యత లోపించడంపై భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. లడ్డూ ఫొటోల్ని మంత్రులు నారాలోకేష్‌, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘తప్పు జరిగింది. మరోసారి లాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి ఆనం రీట్వీట్‌ చేశారు’.

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అంనతరం ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో వెంట్రుక కంట పడింది. లడ్డూలో వెంట్రుక పొరపాటున పడిందేమో అని అనుకున్నారు. సాయంత్రం తన భార్య కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో మరో వెంట్రుక కనపడడంతో భక్తుడు హతాశుడయ్యాడు. వెంటనే వెంట్రుక ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. లడ్డూ ప్రసాదంలో వెంట్రుక పడిన విషయాన్ని మంత్రులు నారా లోకేష్‌,ఆనంకు ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

 ఆ ట్వీట్‌పై ఆనం రామనారాయణ రెడ్డి ట్వీట్‌లో దుర్గుగుడిలో తయారు చేసే లడ్డూ నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తే. నేను స్వయంగా లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ప్రసాదం పవిత్రంగా ఉంటామని చర్యలు తీసుకుంటాన్నారు. 

అయితే, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పలు దేవాలయాల్లో నాణ్యత లోపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడ దుర్గ గుడిలో దర్శనం,అన్నప్రసాదం, ఇప్పుడు లడ్డూ ప్రసాదం తయారీ.. ఇలా వరుస వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement