kanaka duraga temple
-
విజయవాడ దుర్గగుడిలో అపచారం
సాక్షి,విజయవాడ : కనక దుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా పోలీసులు కాళ్లకు షూ వేసుకొని అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు షూ వేసుకుని డ్యూటీ చేయడంపై భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే, ఆలయ ముఖద్వారం వద్ద షూ వేసుకుని డ్యూటీ చేస్తున్నా చూసి చూడనట్టు ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. కాగా, ఆలయాల పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు ,మంత్రులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇంద్రకీలాద్రిలో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
-
ఐదో రోజు శ్రీమహాచండీ దేవిగా అమ్మవారి దర్శనం
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ : దుర్గమ్మకు ఘనంగా ఆషాడమాసం సారె (ఫొటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. పలు అంశాలపై పాలకమండలి చర్చించారు. సుమారు 66 అజెండాలపై చర్చించి, చాలా వరకు అంశాలను పాలక మండలి ఆమోదించింది. రానున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు పాలకమండలి వెల్లడించింది. ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్‌ను ప్రసాదంగా ఇవ్వాలని దుర్గగుడి పాలకమండలి నిర్ణయించింది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను ఇవ్వనున్నట్లు పాలకమండలి పేర్కొంది. దసరా ఏర్పాట్లను చేయడానికి పాలకమండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కలెక్టర్, కో ఆర్డినేషన్ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు బడ్జెట్‌ను కేటాయిస్తామని పేర్కొంది. గత దసరాకి ముఖ్యమంత్రి కేటాయించిన రూ. 70 కోట్ల నిధులకు సంబంధించి పనులను పూర్తి చేస్తున్నట్లు దుర్గగుడి దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో భ్రమరాంబ వెల్లడించారు. చదవండి: ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి -
దీక్ష విరమణ ఘట్టం... భక్తి పారవశ్యం
-
జనవరి 31 డెడ్ లైన్
సాక్షి, భవానీపురం(విజయవాడ పశ్చిమ): ‘మీరు అడిగినవన్నీ ఇచ్చాం. మీరేం చేస్తారో నాకు తెలియదు.. జనవరి 31 నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. దట్సాల్’.. అని కలెక్టర్ ఇంతియాజ్ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ సోమాను ఆదేశించారు. బుధవారం నేషనల్ హైవేస్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంఫ్లై ఓవర్ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తికాగా, మిగిలిన పనులు డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని చెప్పారు. జనవరి 31 నాటికి ఫినిషింగ్ పనులు పూర్తిచేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను, సోమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. పనులు వేగవంతం.. నిర్మాణ పనులకు సంబంధించి 43 స్పాన్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల దసరా ఉత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా నిలుపుదల చేసిన 3 స్పాన్స్ పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండు, మూడు ఏళ్ల నుంచి మందకొడిగా సాగిన పనులు గత ఆరు నెలల నుంచి వేగవంతమయ్యాయని చెప్పారు. విజయవాడ నగరానికి తలమానికంగా తయారవుతున్న ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. నేషనల్ హైవే సూపరింటెండెంట్ ఇంజినీర్ జాన్‌మోషే మాట్లాడుతూ రూ.320 కోట్లతో చేపట్టిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆరు లేన్ల ఈ ఫ్లై ఓవర్‌పై ఒక వైపు కొంత మేర బీటీ లేయర్ వేయడం జరిగిందని, త్వరలోనే రెండో వైపు కూడా మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విజయవాడలో ఘనంగా దసరా ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తజనం
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భక్తజనం
సాక్షి, విజయవాడ : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. నవరాత్రులలో భాగంగా ఏడవరోజున అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రద్దీ అధికసంఖ్యలో ఉంది. అమ్మవారి దర్శనానికి మూడుగంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని శనివారం అన్నిరకాల వీఐపీ, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముఖమండపం ద్వారానే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కెనాల్ రోడ్డులోని కంపార్ట్మెంట్లు దర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి వచ్చేవారు తొక్కిసలాటకు గురవకుండా రోప్ సహాయంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులను వదులుతున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. ఈ ఏడాది శరన్ననవరాత్రుల ఏర్పాట్లు గతంలో కంటే బాగున్నాయని ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు : మంత్రి వెల్లంపల్లి మూలా నక్షత్రం కావడంతో లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు దాదాపు లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. కాగా దర్శనం సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించినట్లు గుర్తుచేశారు. -
రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5న ఢిల్లీ పర్యటన ఉన్న కారణంగా ముందు రోజే ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ సీఎం జగన్ రేపు సాయంత్రం దుర్గమ్మవారిని దర్శించుకొనున్న నేపథ్యంలో డీసీపీ విజయరావు నేడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకుంటారని, ఓంకారం వద్ద మంత్రులు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో సీఎం జగన్ పట్టు వస్త్రాలు తీసుకువచ్చి దుర్గమ్మకు సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకునే సమయంలో సాధారణ, 100 టికెట్ క్యూలైన్లు యథావిధిగా నడుస్తాయని.. వీఐపీ క్యూలైన్లు మాత్రమే నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఘాట్ రోడ్ పైకి ఏవిధమైన వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్) 5న ఢిల్లీకి సీఎం జగన్ అక్టోబరు 5న ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. -
సెల్‌ఫోన్ నిషేధం ఎత్తివేసినట్లేనా.!?
సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో సెల్‌ఫోన్ నిషేధం ఉన్నట్లా.. లేనట్టా..! ఈ విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఏమి తెలియని భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని సెల్‌ఫోన్ కౌంటర్లో భద్రపరుచుకుంటే.. అధిక శాతం మంది భక్తులు సెల్ఫోన్లతో క్యూలైన్లోకి ప్రవేశించి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు, ఫొటోలు దిగుతుంటే కౌంటర్లో సెల్‌ఫోన్ భద్రపరుచుకున్న భక్తులు ఆశ్చర్య పోవడం వారి వంతవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల స్ఫూర్తితో దుర్గమ్మ భక్తులకు దేవస్థానం ఉచిత సేవలను అందించాలని నిర్ణయించినట్లు ప్రకటిస్తూ దుర్గగుడి ఈవో గత నెల 30వ తేదీ నుంచి సెల్ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ల టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కౌంటర్ల నిర్వహణ భారం అనుకున్నారో.. లేక తనిఖీలు ఎందుకులే అనుకున్నారో ఏమో... నాటి నుంచి క్యూలైన్ల వద్ద తనిఖీలు ఎత్తి వేశారు. దీంతో భక్తులు సెల్ఫోన్లు పట్టుకుని ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. మూడేళ్లగా నిషేధం అమలు : మూడేళ్ల కిందట ఆలయ భద్రత విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలనే బావనతో అప్పటి ఈవో దుర్గగుడిలోకి భక్తులెవరూ సెల్‌ఫోన్‌తో ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు. దీంతో భక్తుల సెల్ఫోన్లు భద్రపరుచుకునేందుకు దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కౌంటర్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే భక్తుల నుంచి అధిక మొత్తంలో రుసుం వసూలు చేస్తున్నారనే కారణాన్ని చూపి కొద్ది నెలల కిందట కౌంటర్లను దేవస్థానం స్వాధీనం చేసుకుంది. ఇటీవల దుర్గగుడి ఈవో వీ.కోటేశ్వరమ్మ ఆ సేవలను ఉచితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉచిత సేవలతో సెల్‌ఫోన్ నిషేధాజ్ఞలు తుడిచి పెట్టుకుపోయాయి. క్యూలైన్ల వద్ద భక్తులకు కనీస తనిఖీలు లేకపోవడంతో ఆలయంలోని సెల్ఫోన్లతో ప్రవేశించడమే కాకుండా, భక్తులు నేరుగా అమ్మవారిని తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీస్తున్న ఘటనలు పునరావృతం అవుతున్నాయి. రాజగోపురం, రావిచెట్టు వద్ద భక్తులు సెల్ఫోన్లతో తిరుగుతున్నా కనీస హెచ్చరికలు లేవు. ఆదాయం కోల్పోతే.. వదిలేస్తారా..! సెల్‌ఫోన్ కౌంటర్ల నిర్వహణతో దేవస్థానానికి ప్రతి రోజు వేలాది రూపాయల ఆదాయం సమకూరేది. ఆదాయం కోసం దేవస్థానం క్యూలైన్ల వద్ద ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించి మరీ హెచ్చరికలు జారీ చేసేవారు. భక్తులు క్యూలైన్ వద్దకు ఫోన్‌తో వస్తే.. వారు కుటుంబ సభ్యులతో ఉన్నా.. లేక చిన్న పిల్లలతో ఉన్నా సరే వెనక్కి పంపి మరీ కౌంటర్లో ఫోన్ పెట్టుకుని రావాలని సూచించే వారు. అయితే కొద్ది రోజులుగా క్యూలైన్ల వద్ద పరిస్థితి మారిపోయింది. కౌంటర్లో సేవలు ఉచితం కావడంతో సెల్‌ఫోన్ నిషేధం గురించి సెక్యూరిటీ సిబ్బంది మర్చిపోయినట్లు ఉన్నారు.. కనీసం తనిఖీలు లేవు.. సెక్యూరిటీ సిబ్బంది పక్కనే ఉన్నా క్యూలైన్లో అమ్మవారిని ఫొటోలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై కొంత మంది భక్తులు మండిపడుతున్నారు. సెల్ఫోన్ల నిషేధం అమలు చేస్తే ఖచ్చితంగా అమలు చేయాలని, లేని పక్షంలో పూర్తిగా నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
దేవీ అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం, 17–10–2018 సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే ‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది. లోక కంటకుడైన దుర్గమాసురుడిని సంహరించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది ఆ తల్లి. రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది అష్టమి తిథి నాడే. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను తొలగి సద్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే మంత్రం సకల జనులకూ శుభాలను కలుగచేస్తుంది. దుర్గతులను నశింపచేసి సద్గతులను ప్రసాదించి, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం. -
అమ్మ అనుగ్రహ ప్రసాదం
ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశం చెందుతారు. దర్శనానంతరం అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేస్తారు. అమ్మవారికి జరిగే నిత్యపూజలు, ఆర్జిత సేవలలో పాల్గొనే ఉభయదాతలకు దేవస్థానం పులిహోర, లడ్డూ ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి ప్రసాదాలుగా లడ్డు, శ్రీచక్ర లడ్డు, పులిహోరలతో పాటు చక్కెరపొంగలిని సైతం దేవస్థానం విక్రయిస్తుంది. మహామండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆరు కౌంటర్ల ద్వారా ఈ ప్రసాదాలను విక్రయిస్తారు. కొండపై నటరాజ స్వామి వారి గుడి, ఓం మలుపు దగ్గర కూడా ప్రసాదాలను విక్రయిస్తారు. దసరా, భవానీ దీక్షల సమయంలో కొండ దిగువన కనకదుర్గనగర్‌లో 13 కౌంటర్ల ద్వారా అమ్మవారి ప్రసాద విక్రయాలు జరుగుతాయి. బస్ స్టాండ్‌లోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదాలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా పోటును నిర్వహిస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి శిక్షకులైన వంట వారితో పాటు లడ్డూను చుట్టేందుకు మహిళలు పనిచేస్తారు. పులిహోర, చక్కెరపొంగలి తయారుచేసేందుకు సిబ్బందిని దేవస్థానం నియమిస్తుంది. ఉచితంగా అప్పాల ప్రసాదం... ఈ దసరా ఉత్సవాల నుంచి అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి అప్పం ప్రసాదంగా అందచేస్తున్నారు. ఇందుకుగాను అప్పాలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా వంటశాలను కొండపై సిద్ధం చేశారు. దసరా ఉత్సవాలలో సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్.. ఇతర రాష్ట్రాలలోని అమ్మవారి భక్తులకు ప్రసాదాలు అందాలనే భావనతో దుర్గ గుడి అధికారులు రైల్వే స్టేషన్ తూర్పు కౌంటర్ దగ్గర ప్రత్యేక ప్రసాదం కౌంటర్‌ను నడుపుతోంది. ఇక్కడ పులిహోర, లడ్డూ ప్రసాదాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. విజయవాడ మీదుగా ప్రయాణించే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కౌంటర్లలో ప్రసాదాలను కొనుగోలు చేసి, బంధువులకు, మిత్రులకు అందచేస్తారు. అమ్మవారిని దర్శించుకోలేకపోయినా, ప్రసాదాలను స్వీకరించే భాగ్యమైనా దక్కిందని భక్తులు తృప్తిచెందుతారు. త్వరలో బస్టాండ్‌లో సైతం అమ్మవారి ప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దివ్య దర్శనం భక్తులకు చిన్న లడ్డు... రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసే దివ్య దర్శనం భక్తులకు దేవస్థానం ప్రత్యేకంగా ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందచేసి, దేవస్థానం తరపున రవిక, అమ్మవారి కుంకుమ ప్రసాదంతో పాటు చిన్న సైజు లడ్డూను అందచేస్తారు. అనంతరం అన్న ప్రసాదాన్ని సైతం అందిస్తారు. అమ్మవారి ప్రసాదాలు – ధరలు పులిహోర – రూ. 5లు లడ్డూ – రూ. 15లు శ్రీచక్ర లడ్డూ – రూ. 100 చక్కెర పొంగలి – రూ. 20 – ఉప్పులూరి శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, విజయవాడ -
అందుకే నన్ను ఓడించారు: సాయికుమార్
విజయవాడ: కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ఉంటాయన్న నమ్మకం తనకు లేదని నటుడు, బీజేపీ నేత సాయికుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ అమ్మవారిని సాయికుమార్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెళ్లి వేడుక నిమిత్తం విజయవాడ వచ్చినట్లు తెలిపారు. ‘నా స్వరం నాన్నగారిది, ఆయన స్పూర్తి నన్ను ఈ స్థాయిని తీసుకు వచ్చింది. పుష్కరాల సమయంలో నా గొంతుకతో సేవ చేసే భాగ్యం కలిగింది. సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులతో కలిసి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉంది. నా కుమారుడు ఆది మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాడు. రాజకీయాల్లో కూడా సినిమాల మాదిరిగా గెలుపు ఓటములు ఉంటాయి. దేశానికి మనం ఏం చేశాము అనే ఆలోచనతో ఉన్నానని, ప్రజలకు నాపై ఇంకా నమ్మకం కలగలేదని, అందుకే నన్ను గెలిపించలేదు. నాకు దేశభక్తి మెండుగా ఉంది. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. విభజన తర్వాత విజయవాడ బాగా అభివృద్ధి చెందింద’ని వెల్లడించారు. రాజకీయంగా శత్రువులు లేకపోయినా ప్రత్యర్థులు ఉంటారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. -
ఘనంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజులకు కలిసి సుమారు 40 టన్నుల కూరగాయలను ఈ మహోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కనకదుర్గమ్మను పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభరాణి దంపతులు, రాష్ట్ర హైకోర్టు జడ్జి సురే్‌షకుమార్ కైట్ దంపతులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసూదన్‌చారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి అదనపు ఈవో వై.వి.అనురాధ ఉన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు. -
ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై వరాలను అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయ కార్యాలకు ఈమె అనుగ్రహం తప్పనిసరి. నిత్యం ఈమెను పూజించిన ముత్తయిదువులు అఖండ మాంగల్య సౌభాగ్యం పొందుతారు. సకల సంపదలు ఈ తల్లి అనుగ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి. శ్రీచక్రాన్ని అర్చించి, కుంకుమ పూజ చేయడం ద్వారా ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్వయంగా ప్రతిష్టించి, ఇక్కడ నిత్యం కుంకుమపూజ జరిగేలా ఆదేశించారు. అంతకుపూర్వం ఉగ్రస్వరూపిణిగా ఉన్న కనకదుర్గాదేవి నాటినుంచి శాంతరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. లలితాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజున లలితా సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయాలి. అలాగే లలితా అష్టోత్తరం, స్తోత్రాలు, పంచరత్నాలు పఠించాలి. మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి. నివేదన: అమ్మకు గారెలు నివేదన చేయాలి. సువాసినులకు పూజచేసి, మంగళద్రవ్యాలు అందించాలి. ఫలం: దారిద్య్ర దుఃఖం తొలగి, సకల శుభాలు, ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి. -
శ్రీ గాయత్రీ అలంకారం దేవీనవరాత్రులు
మూడవ రోజు సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే. శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. న గాయత్య్రాః పరో మంత్రం న మాతుః పరదైవతం అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే. ఫలమ్ : మంత్రసిద్ధి, వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం. నివేదన : గుడాన్నం (బెల్లం పరమాన్నం) శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు. -
ఇంద్రకీలాద్రిపై మాజీ ప్రధాని
విజయవాడ: మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా దేవెగౌడకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.