శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను గత నెల 24న సీఎం జగన్ మోహన్‌రెడ్డికి అందజేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చిత్రంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు.
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5న ఢిల్లీ పర్యటన ఉన్న కారణంగా ముందు రోజే ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
సీఎం జగన్ రేపు సాయంత్రం దుర్గమ్మవారిని దర్శించుకొనున్న నేపథ్యంలో డీసీపీ విజయరావు నేడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకుంటారని, ఓంకారం వద్ద మంత్రులు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో సీఎం జగన్ పట్టు వస్త్రాలు తీసుకువచ్చి దుర్గమ్మకు సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకునే సమయంలో సాధారణ, 100 టికెట్ క్యూలైన్లు యథావిధిగా నడుస్తాయని.. వీఐపీ క్యూలైన్లు మాత్రమే నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఘాట్ రోడ్ పైకి ఏవిధమైన వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్)
5న ఢిల్లీకి సీఎం జగన్
అక్టోబరు 5న ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment