
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
మూడు రోజులకు కలిసి సుమారు 40 టన్నుల కూరగాయలను ఈ మహోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment