shakambari ustawalu
-
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
దుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం
-
ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
-
శాకంబరిగా రాజరాజేశ్వరి దేవి
సాక్షి, నెల్లూరు : ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అమ్మవారు శ్రీవిద్యవంచ కల్పగణపతి అలంకారంలో ఫల, కాయగూరలతో భక్తులను కటాక్షించారు. రాహుకాల పూజలు, రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరిగా దర్శనమివ్వడంతో దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి సహస్రనామార్చనలు, చండీహోమం, ఖడ్గమాల స్తోత్రపారాయణం, తదితర పూజలను నిర్వహించారు. అనివెట్టి మండపాన్ని ఫల, కాయగూరలతో సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి సుమారు ఐదు టన్నులకుపైగా ఫల, కాయగూరలతో అమ్మవారిని, ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాజరాజేశ్వరి అమ్మవారి భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలు, నృత్య ప్రదర్శనలను వేడుకగా నిర్వహించారు. సుమారు మూడువేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శాకంబరి అలంకారానికి ఉభయకర్తలుగా కొలపర్తి వెంకట రమేష్‌కుమార్, సువర్ణలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పట్టువస్త్రాల సమర్పణ శాకంబరి అలంకారం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఎమ్మెల్యే తరఫున రాజరాజేశ్వరి అమ్మవారు, దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సుందరేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలను అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, చెక్కా సాయిసునీల్, మురళీకృష్ణయాదవ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్‌తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఊరేగింపుగా బోనాలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది. కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్‌తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు. నేడు లక్ష మంది దర్శనం ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. -
ఘనంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజులకు కలిసి సుమారు 40 టన్నుల కూరగాయలను ఈ మహోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. -
సర్వ మంగళాదేవిగా అమ్మవారి దర్శనం
భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉదయం అమ్మవారిని మాత్రా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజు శర్మ, పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం తదితరులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ధృవమూర్తిని టమాట, నిమ్మకాయలు, ఆకుకూరల దండలతో, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భద్రకాళి మాత ఇచ్ఛామూర్తిని మాత్రాక్రమంలోనూ, సర్వమంగళా మాతగా అలంకరించారు. చతుః స్థానార్చన పూజలు, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేడు(సోమవారం) ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో అమ్మవారు పూజలు అందుకోనున్నారు. రేపు(మంగళవారం) శాకంబరీ అలంకరణ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా దేవాలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. -
దుర్గమ్మకు 8 టన్నుల కూరగాయలు
ఇంద్రకీలాద్రి: శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని వ్యాపారులు 8 టన్నుల కూరగాయాలను విరాళంగా ఇచ్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మరి కొద్ది సేపట్లో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల పాటు భక్తులు అమ్మవారికి కూరగాయలను, ఆకుకూరలను కానుకలుగా సమర్పించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.