అందుకే నన్ను ఓడించారు: సాయికుమార్‌ | There Is No Belief That Congress And JDS Will Be Together Said By Sai Kumar | Sakshi
Sakshi News home page

అందుకే నన్ను ఓడించారు: సాయికుమార్‌

Published Tue, Sep 4 2018 10:34 AM | Last Updated on Tue, Sep 4 2018 3:07 PM

There Is No Belief That Congress And JDS Will Be Together Said By Sai Kumar - Sakshi

సాయికుమార్‌ దంపతులు(పాత చిత్రం)

విజయవాడ: కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ఉంటాయన్న నమ్మకం తనకు లేదని నటుడు, బీజేపీ నేత సాయికుమార్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ అమ్మవారిని సాయికుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెళ్లి వేడుక నిమిత్తం విజయవాడ వచ్చినట్లు తెలిపారు.

‘నా స్వరం నాన్నగారిది, ఆయన స్పూర్తి నన్ను ఈ స్థాయిని తీసుకు వచ్చింది. పుష్కరాల సమయంలో నా గొంతుకతో సేవ చేసే భాగ్యం కలిగింది. సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులతో కలిసి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉంది. నా కుమారుడు ఆది మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాడు. రాజకీయాల్లో కూడా సినిమాల మాదిరిగా గెలుపు ఓటములు ఉంటాయి. దేశానికి మనం ఏం చేశాము అనే ఆలోచనతో ఉన్నానని, ప్రజలకు నాపై ఇంకా నమ్మకం కలగలేదని, అందుకే నన్ను గెలిపించలేదు. నాకు దేశభక్తి మెండుగా ఉంది. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. విభజన తర్వాత విజయవాడ బాగా అభివృద్ధి చెందింద’ని వెల్లడించారు. రాజకీయంగా శత్రువులు లేకపోయినా ప్రత్యర్థులు ఉంటారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement