మూడవ రోజు
సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే. శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది.
న గాయత్య్రాః పరో మంత్రం
న మాతుః పరదైవతం
అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే.
ఫలమ్ : మంత్రసిద్ధి,
వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం.
నివేదన : గుడాన్నం (బెల్లం పరమాన్నం)
శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః
భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ
మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు.