devi navaratrulu
-
శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..
శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.మంగళ ప్రదాయినిఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే.."నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని. కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!) -
శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..
త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ముఖ్యంగా వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వయుజం. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారాలను ధరించిన మాసం...ఇవాళ నుంచే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మహిళలు, భవాని భక్తులు, నియమ నిష్టలతో అమ్మవారిని ఆరాధించటం ప్రారంభిస్తారు. తొలిరోజు నుంచి మొదలు పెట్టి చివరి రోజు వరకు అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుచుకుంటారు. ఆ క్రమంలో తొలిరోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు ధర్శనమివ్వనుంది, ఏ నైవేద్యం నివేదిస్తారో చూద్దామా..!అమ్మవారిని బుధవారం అక్టోబర్ 03న సుమహుర్తంలో నవరాత్రలు పూజలందుకోమని స్వాగతం పలుకుతూ కలశస్థాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని రోజుకో అవతారం రూపంలో అలంకరణ చేసి భక్తితో ఆరాధిస్తారు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు ఎవరైనా కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే, 8 గంటలలోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే ఆఖండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఎవరీ శక్తిసామర్థ్యాల మేరకు వారు వివిధ స్తోత్ర పారాయణాదులతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటారుతొలిరోజు..తొలి రోజు ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను తొలిరోజు బాలా త్రిపురసుందరీగా అలంకారిస్తారు. ఈ అమ్మ దర్శనం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి ఉంటారు. ఈ అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే..సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.నైవేద్యంగా కట్టుపొంగలి లేదా పులగం నివేదిస్తారు.మరి కొన్నిచోట్ల తొలిరోజు పాఢ్యమి తిథి పురస్కరించుకుని అమ్వవారిని శైలపుత్రిగా లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తారు.శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్! వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది. -
దసరోత్సాహం! ఈ పండుగవేళ ఇంటిని ఇలా అలంకరిస్తే..
ఇంటి లోపల అడుగుపెట్టగానే మన దృష్టి ముందుగా హాలు, వంటగదివైపే ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్పేస్‌లో అలంకరణ ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అందమైన గంటలను వేలాడదీయవచ్చు. అలాగే, గుమ్మం ముందూ వివిధ మోడల్స్‌లో దొరికే గంటలు వేలాడదీయవచ్చు. వాటికి నచ్చిన రంగులతో పెయింట్ చేయవచ్చు. ఇంటి లోపల మెట్లు ఉంటే ఫెయిరీ లైట్లను, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రమిదలనూ అమర్చుకోవచ్చు. బొమ్మల కొలువు ఏర్పాటుచేసుకోవచ్చు. కర్టెన్స్ .. పెయింటింగ్స్ గాడీగా కాకుండా సింపుల్‌గా ఉండాలనుకుంటే లివింగ్ రూమ్‌లో సంప్రదాయ ప్రింట్స్‌తో ఉన్న కర్టెన్లను ఎంచుకోవాలి. ప్లెయిన్‌గా ఉండే గోడలపై పౌరాణిక పాత్రలున్న పెయింటింగ్స్‌ను అలంకరించుకోవచ్చు. లివింగ్ రూమ్ ఫ్లోర్ డల్‌గా ఉంటే వెంటనే కళాత్మకమైన డిజైన్ ఉన్న కార్పెట్‌ను వేసి గది శోభను పెంచొచ్చు. మరింత లుక్ రావాలంటే సెంటర్ టేబుల్ని ఒక సైడ్‌గా ఉంచి.. ప్రమిదలను ఏర్పాటు చేసుకోవచ్చు. మండపం అలంకరణ దేవుడిని పెట్టుకునే మండపానికి డార్క్ బ్రౌన్ కలర్ వేస్తే బాగుంటుంది. అలాగే పసుపు, గులాబీ, నారింజ రంగుల్లో పూల దండలతో అలంకరించుకోవాలి. మండపం ముందు రంగోలీకి బదులు సంప్రదాయ కార్పెట్‌ను వాడొచ్చు. మధ్యలో రాగి లేదా ఇత్తిడి గిన్నెను నీళ్లతో నింపి పువ్వులతో అలంకరించాలి. పూజగది గుమ్ముం ముందు రెండు ఏనుగు బొమ్మలను ఉంచితే ఇంట్లో ఆలయం కొలువుదీరిన అనుభూతి కలుగుతుంది. క్రొషే కళ పండగ ప్రత్యేక అలంకరణలో మరో ఆకర్షణీయమైన హంగు క్రోషే డిజైన్. ప్లెయిన్ గోడలపై క్రోషే వాల్ హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తే అద్భుతంగా ఉంటుంది. క్రోషే హ్యాంగింగ్స్ వద్దనుకుంటే క్రోషే తోరణాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. (చదవండి: థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!) -
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు
Updates.. ►ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు. ►అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు ►అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన గవర్నర్ దంపతులు ►అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేసిన వేద పండితులు ►అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించిన ఈవో,ఛైర్మన్ ►దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ►ఆదివారం కావడంతో తొలిరోజే పెరిగిన భక్తులు ►8:30 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ►స్నపనాభిషేకం అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు మొదలైన దర్శనాలు ►శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ►తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ►భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. ►భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. ►భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. -
గాయత్రీ దేవికి ఇది పెట్టండి మీ జీవితం మారిపోతుంది!
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
గరుడ వాహనంపై విశ్వపతి
విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. – తిరుమల దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు. – జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్)/బాసర(ముథోల్)/హన్మకొండ కల్చరల్ -
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
Dussehra: దసరా రోజున ఏం చేయాలి?!
ఒకప్పుడు లోకాలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే మాయావులైన చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులతో రోజుకో రూపంలో పోరాడి సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది ఆది పరాశక్తి. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దేవీ నవరాత్రులు... విజయ దశమి వేడుకలు. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా విజయ దశమి రోజునే. దసరా రోజునే శ్రీరామచంద్రుడు... దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ బల పరాక్రమాలు కలవారే, తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అమాయకులను పీడించడమే వారి పని. ఆయా రాక్షసులకు స్త్రీలంటే చిన్నచూపు. తమ జోలికి వారు రాలేరని, తమనేమీ చేయలేరన్న చులకన భావం. అందుకే పురుషుల చేతిలో ఓడిపోరాదన్న వరాలను పొందారు. అటువంటి లక్షణాలున్న వారిని అణిచి వేయకబోతే అందరి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి దేవి ముందుకు వచ్చింది. అందరి మొరలూ ఆలకించే అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. ఇంట్లో బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు అమ్మ వచ్చి దండిస్తుందేమోననే భయంతో ఉంటారు. ఆ సమయంలో అమ్మ మామూలుగా చూసినా, కోపంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే. ఆ శత్రువులపై మనమే పోరాటం చేయాలి. విజయం సాధించాలి. మామూలుగా దసరా... దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం... వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. విజయాలకు పునాది విజయదశమి అంటే సకల విజయాలనూ కలగ చేసే దశమి. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. ఈ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభించడం వల్ల నిరాటంకంగా జరుగుతాయని నమ్మకం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. దసరా రోజున ఏం చేయాలి? దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్య మంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఆయుధ పూజ, వాహన పూజ చేయడం, వృత్తిదారులు తమ పనిముట్లను పూజించడం వంటివి మహర్నవమితోపాటు ఈ రోజున కూడా కొందరు చేస్తారు. విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. ఆ శ్లోకంతోపాటు మన కోరికలేమైనా ఉంటే వాటిని చీటీ మీద రాసి జమ్మి కొమ్మకు కట్టాలి. జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణ నమస్కారాలు అయిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. ఆడపడచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ పండుగ విధులలో ఇతర ప్రధానమైన అంశాలు. సమష్టి బలం ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామి నుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసి విజయం సాధించింది. దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఒక్కరుగా చేయలేని పనిని ఐకమత్యంగా చేయవచ్చని. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ తెలియచేస్తోంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
హైదరాబాద్‌లో ప్రారంభమైన దేవి నవరాత్రుల సందడి
-
శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే
సాక్షి, విజయవాడ : శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే... రెండో రోజు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు.. మూడో రోజు.. దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు నాలుగో రోజు.. దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి అయిదవ రోజు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. ఆరవ రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ఏడోరోజు.. ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తొమ్మిదవ రోజు.. దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. -
కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు..
సాక్షి, విజయవాడ : కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విజయవాడ కనకదుర్గ గుడిలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం రోజు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈసారి దసరా ఉత్సవాలకు రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికే దర్శన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దుర్గగుడిలో దసరా నవరాత్రులు ఆహ్వాన పత్రికను దుర్గగుడి పాలకమండలి సభ్యులు, తదితరులు ఆవిష్కరించారు. చదవండి: ‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’ -
నేడు తెప్పోత్సవం
ఉదయమంతా భక్తితన్మయత్వం.. సాయంత్రం సాంస్కృతిక వైభోగం.. వెరసి ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లింది. వేల సంఖ్యలో తరలివచ్చిన భవానీలతో కొండ సిందూర శోభిమైంది. జగన్మాత కనకదుర్గమ్మ తొమ్మిదో రోజు సోమవారం మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చారు. శక్తిస్వరూపిణిని దర్శించుకుని భక్తకోటి తరించింది. మరోవైపు విజయదశమినాడు ఆది దంపతుల జలవిహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో నిర్వహించిన తెప్పోత్సవం ట్రయల్ రన్ విజయవంతమైంది. సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. పదో రోజు మంగళవారం మధ్యాహ్నం దేవస్థానం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణాహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగిస్తారు. 9వ రోజు నవమి నాడు అమ్మవారు ఉగ్రరూపమైన శ్రీ మహిషాసురమర్దనీదేవిగా దర్శనమిచ్చారు. ఇక ఆఖరి రోజు దశమి నాడు శాంతస్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవిగా కొలువుదీరుతారు. జలవిహారానికి ఏర్పాట్లు పూర్తి.. గత పక్షం రోజులుగా వరద ఉధృతితో పోటెత్తిన కృష్ణమ్మ ప్రస్తుతం శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు మూసివేశారు. దీంతో తెప్పోత్సవానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. మంగళవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ గంగా పార్వతీసమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లు నదీ విహారం చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, జలవనరులు, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య తెప్పోత్సవం నిర్వహిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం తెప్పోత్సవం ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. భవానీభక్తులు రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దీక్షలు తీసుకున్న భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకుని హోమ గుండాల్లో పూజాద్రవ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణవేణి ఘాట్ భవానీభక్తులతో నిండిపోయింది. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించిన భక్తులు కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానాలు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భవానీమాలలు ధరించిన భక్తులు లారీల్లో తరలివస్తున్నారు. బుధ, గురువారంల్లోనూ రద్దీ.. సోమ, మంగళవారాల్లోనే కాకుండా తర్వాత మరో రెండు రోజులు భవానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అందువల్ల బుధ, గురువారాల్లోనూ దీక్షల విరమణకు కావాల్సిన ఏర్పాట్లు అధికారులు కొనసాగిస్తున్నారు. అమ్మవారి దర్శనభాగ్యం దక్కేనా! తాడేపల్లి రూరల్ : దేవీ నవరాత్రులు చివరి రోజు అమ్మవారి తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరిస్తారు. కానీ గత ఐదేళ్లుగా పక్కనే ఉన్న గుంటూరు జిల్లా వాసులకు మాత్రం కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై అమ్మవారి దర్శనభాగ్యం కలగడం లేదు. 2014 ముందు దుర్గా ఘాట్ వద్ద ప్రారంభమయ్యే తెప్పోత్సవం గుంటూరు జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ 10 కానా వద్దకు వచ్చి తిరిగి మరలా దుర్గా ఘాట్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో మూడుసార్లు భక్తుల దర్శనార్థం కృష్ణానదిలో తెప్పోత్సవం కొనసాగుతోంది. తర్వాతి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం తగ్గడం, మధ్యలో ఒక సంవత్సరం వరదలు రావడంతో గుంటూరు జిల్లా వైపు తెప్పోత్సవ కార్యక్రమాన్ని దేవదాయ శాఖాధికారులు నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండటంతో గుంటూరు జిల్లా వాసులు ప్రకాశం బ్యారేజీ 10వ కానా వరకు అమ్మవారు తెప్పోత్సవం నిర్వహించాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీపై నుంచి లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేచి చూస్తారు. ఈసారైనా తెప్పోత్సవాన్ని చేసే అవకాశం జిల్లా వాసులకు దక్కుతుందో లేదో చూడాలి. -
దుర్గమ్మ ప్రసాదిట్టం
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దేవీ నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర తీరాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మను దర్శించుకుని ప్రసాదం సేవిస్తేనే కాని తృప్తి చెందరు భక్తులు. అంతేనా! పులిహోర, లడ్డు ప్రసాదం తినకుండా లేదా కొనకుండా వెళ్లరు. అమ్మవారి మీదే కాదు, అమ్మవారి ప్రసాదం మీద కూడా భక్తి ఎక్కువే. ఈ ప్రసాదం స్వీకరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ప్రసాదాలను ‘దిట్టం’ ప్రకారమే అంటే కొలతల ప్రకారంగానే చాలా సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు. ప్రసాదాలకు పెరుగుతున్న ఆదరణతో ప్రసాదం తయారీలో చిన్న చిన్న మార్పులూ వస్తున్నాయి. వాటిల్లో భాగంగానే లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి తయారు చేయడానికి దేవస్థానం వారు రకరకాల కొలతలతో వంటవారికి రకరకాల ‘దిట్టం’ అందచేశారు. ఆ దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేసి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు రుచి చూపించి, వారి సలహాలు తీసుకున్నారు. అందరి దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త ‘దిట్టం’ అనుసరిస్తున్నారు. కొత్త కొలతలు ఎండోమెంట్స్ కమిషనర్ కొత్తగా స్థిరపరచిన దిట్టం ప్రకారం 516 లడ్లు తయారు చేయడానికి (ఒక్కో లడ్డు బరువు 80 గ్రా.) ఆరు కేజీల నెయ్యి, పది కేజీల సెనగ పిండి, 20 కేజీల పంచదార, 750 గ్రా. జీడిపప్పు, అర కేజీ కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష, 75 గ్రా. ఏలకులు, 15 గ్రా. జాజికాయ, 15 గ్రా. పచ్చ కర్పూరం ఉపయోగిస్తున్నారు. పులిహోరకు సంబంధించి స్థిరపరచిన దిట్టం ప్రకారం పది కిలోల బియ్యం, అర కేజీ సెనగ పప్పు, అర కేజీ చింతపండు, 200 గ్రా. ఎండు మిర్చి, 15 కేజీల నూనె, 60 గ్రా. బెల్లం ఉపయోగించి 230 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్టు బరువు 150 గ్రా.) తయారు చేస్తున్నారు. లడ్లు సులువుగా తయారు చేయడానికి కూడా దేవస్థానం చిన్న చిన్న మార్పులు చేసింది. గతంలో ఒక కడాయిలో 730 లడ్డూలు తయారుచేసేవారు. ఇప్పుడు 516 లడ్లు మాత్రమే తయారు చేస్తున్నారు. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
ఇంద్రకీలాద్రిపై నాల్గవరోజు జగన్మాత శ్రీఅన్నపూర్ణాదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్తజనబాంధవి, అన్నార్తుల పాలిట అన్నపూర్ణమ్మగా అందరింటా పూజలందుకునే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరారు. ఓ వైపు కుంకుమార్చనలు, మరోవైపు చండీయాగం, వేదఘోషతో కృష్ణాతీరం బుధవారం పులకించింది. సెలవు దినం కలసి రావడం పిల్లా–పెద్దా కొండకు బారులు తీరారు. క్యూలైనులన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. వచ్చిన ప్రతిభక్తుడికి సులభంగా ‘అమ్మ’ దర్శనం లభించేలా.. సంతృప్తిగా భోజన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లేలా యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ) : అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిట లాడాయి. సర్వదర్శనం, రూ. 100 టికెట్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 300, వీఐపీ క్యూలైన్లో నాలుగు గంటల సమయం పట్టింది. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీయాగంలో ఉభయదాతలు పాల్గొన్నారు. అంతరాలయం దర్శనం రద్దు రూ. 300, వీఐపీ టికెట్లు, ఉత్సవ కమిటీ సభ్యుల సిఫార్సుతో దర్శనానికి విచ్చేసిన భక్తులతో ప్రత్యేక క్యూలైన్ మార్గంలో రద్దీ కనిపించింది. దీంతో బుధవారం అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అయితే ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయకుండా అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. క్యూలైన్లో సీపీ టికెట్ల తనిఖీ వీఐపీ క్యూలైన్లో రద్దీ అధికంగా ఉండటం, ఆర్జీత సేవలలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనం ఆలస్యం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేవస్థానానికి విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు క్యూలైన్లను పరిశీలించారు. దీంతో సీపీని పలువురు భక్తులు నిలదీయడంతో ఆయన క్యూలైన్లో ఉన్న భక్తుల వద్ద టికెట్లను తనిఖీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఎటువంటి టికెట్లు లేకుండా దర్శనానికి క్యూలైన్లో వేచి ఉండటం గమనించారు. దీనిపై ఈవో ఎంవీ. సురేష్‌బాబుతో మాట్లాడారు. అంతే కాకుండా వీఐపీలకు కేటాయించిన సమయంలోనే దర్శనానికి అనుమతించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీఐపీల పేరిట వచ్చేవారు దేవస్థానం నిర్ణయించిన సమయంలోనే క్యూలైన్లోకి అనుమతిస్తామని పోలీసులు సిబ్బంది పేర్కొనడంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. మార్మోగిన పురవీధులు ఆలయాల్లో నిత్య పూజలు అందుకునే ఆది దంపతులు, దసరా మహోత్సవాల సందర్భంగా పల్లకిలో ఊరేగుతూ తమ మధ్యకు రావడంతో భక్తజనం పులకించారు. కోలాట నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, పంచ వాయిద్యాలతో నగరోత్సవం కోలాహలంగా సాగింది. యాగశాల నుంచి ప్రారంభమైన ఈకార్యక్రమం మహా మండపం, కనక దుర్గనగర్, కెనాల్‌రోడ్డు, వినాయకుడి గుడి, దుర్గాఘాట్, మీదగా ఆలయానికి చేరుకుంది. శ్రీచక్ర సంచారిణే వన్‌టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ నిత్యం శ్రీచక్రంలోనే సంచారం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయ కారిణి, లోకమాతగా పేర్కొనే జగన్మాత నిత్యం కొలు ఉండే పవిత్ర స్థలమే శ్రీచక్రమే. ఈ శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి. అయితే లలితాదేవే దుర్గమ్మ, ఈ దుర్గమ్మే లలితాదేవని, రెండిటికీ బేధం లేదని పండితులు చెబుతారు. పూర్వం ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీగా ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మను శంకరాచార్యులవారు దర్శించారు. ఆమెను శాంతపరిచేందుకు శ్రీచక్రాన్ని దుర్గమ్మ సన్నిధిలో ప్రతిష్టించారు. అమ్మవారికి నిర్వహించే పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహించాలని సూచించారు. అప్పటి నుంచి అమ్మవారి సన్నిధిలో పూజలన్నీ శ్రీచక్రానికే నిర్వహిస్తున్నారు. లోకపావని కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర నవావరణార్చన నిత్యం అత్యంత వైభవంగా జరుగుతోంది. లలితా త్రిపురసుందరీ దేవికి సాక్షాత్తూ లక్ష్మీ, సరస్వతులే వింజామరులు విసురుతూ సేవలందిస్తుంటారు. అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రం రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది భూప్రస్తరం. ఇది యంత్ర రూపంలో ఒక రాగి లేక వెండి రేకు మీద రేఖలతో చెక్కించబడి ఉంటుంది. రెండోది మేరు ప్రస్తరం. ఇది శ్రీచక్రంలోని బిందు త్రికోణాది రేఖలు, వృత్తాలు, దళాలు పైకి శిఖరంలాగా కనిపించేలా పోతపోయబడి ఉంటుంది. ఈ మేరు ప్రస్తరం శ్రీ చక్రం నవావరణార్చన జరపటానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో లక్ష కుంకుమార్చన జరిగే అమ్మవారి దగ్గర, నిత్యపూజల అమ్మవారి దగ్గర, నవావరణార్చన దగ్గర మేరు ప్రస్తమైన శ్రీచక్రాల్నే ప్రతిష్టించడం జరిగింది. వాటికే అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. సాధారణ పూజలకు భిన్నంగా శ్రీచక్ర నవావరణార్చన జరగడం విశేషం. శక్తి ప్రధానమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షించటానికి కారణం ఇక్కడ నిరంతరం శ్రీచక్రానికి జరుపబడే పూజలే. అందుకే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా శ్రీచక్రానికి నిత్యం శాస్త్రోక్తంగా పూజలను నిర్వహిస్తారు. ఈ పూజల నిమిత్తం దేవస్ధానం ప్రత్యేకంగా ఒక అర్చకుడిని సైతం నియమించింది. అనుకున్న కొర్కెలు తీరటం కోసం, ఐశ్వర్య ప్రాప్తికోసం, వ్యాపారాభివృద్ధి కోసం, సమస్త శుభాలు జరగటం కోసం ఈ అర్చనను అందరూ జరిపించుకుంటారు. దుర్గమ్మ సేవలో పీవీపీ ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బుధవారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పీవీపీని ఆలయ ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న పీవీపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. ప్రముఖుల రాక దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ విశ్వజిత్, ఆలయ పూర్వ ఈవో, సివిల్ çసప్లయిస్ ఎండీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, మీడియా పాయింట్లో మాట్లాడారు. నాల్గో రోజు ఆదాయం రూ. 35.56 లక్షలు దసరా ఉత్సవాలలో నాల్గో రోజున దేవస్థానానికి రూ. 35.56 లక్షల మేర ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ. 12.75 లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ. 7.10 లక్షలు, వీఐపీ టికెట్ల దర్శనం రూ. 1.62 లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం రూ. 8.40 లక్షలు, లక్ష కుంకుమార్చన టికెట్ల విక్రయం ద్వారా రూ. 66 వేల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడో రోజున దేవస్థానానికి మొత్తంగా రూ. 32.90 లక్షల మేర ఆదాయం సమకూరింది. గత ఏడాది దసరా ఉత్సవాలలో మూడో రోజున దేవస్థానానికి రూ. 42.97 లక్షల మేర ఆదాయం సమకూరగా, ఈ ఏడాది సుమారు రూ. 10 లక్షల మేర ఆదాయం తగ్గింది. –ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) నేటి అలంకారంశ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజు గురువారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరుకు గడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. -
ప్రజాభాగస్వామ్యంతోనే ఉత్సవాలు: డిప్యూటీ సీఎం
సాక్షి, విజయనగరం : ప్రజలందరి భాగస్వామ్యంతో విజయనగరం ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులు, వివిధ కమిటీల సభ్యులకు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం సిరిమానోత్సవం, విజయనగర ఉత్సవాలపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ నిర్వహణలో సంప్రదాయాలకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సిరిమానోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తూనే అధికంగా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా భక్తుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఏ చిన్న సంఘటనకు తావులేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకూ మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు, విజయనగరం సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపా రు. ఐదు వేదికల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, జిల్లాకు చెందిన విశిష్ట వ్యక్తులకు సత్కరించనున్నామని వెల్లడించారు. జిల్లా ప్రతిష్ట పెంపొందించాలి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జిల్లా ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాకు సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉందని, దాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే మిన్నగా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అత్యధికంగా భక్తులు సిరిమానోత్సవం తిలకించేలా అవకాశం కల్పించాలన్నారు. సిరిమానోత్సవం రోజున నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రముఖుల దర్శనానికి నిర్దిష్ట సమయాలు కేటాయించాలని చెప్పారు. సామాన్య భక్తుల దర్శనానికే అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జేసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్కో వేదిక వద్ద కార్యక్రమాల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను సంగీత కళాశాలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనందగజపతి ఆడిటోరియంలోనూ, 13, 14 తేదీల్లో సాయంత్రం వేళల్లో అయోధ్యా మైదానంలో కార్యక్రమాలను ఏర్పాటుచేశామన్నారు. 15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని పోలీసు అధికారులే గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో పలు స్వచ్చందసంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, తమ అభిప్రాయాలను, సూచనలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీఆర్ఓ వెంకటరావు, ఓఎస్డీ జె.రామ్మోహనరావు, ఏఎస్పీ ఎన్.శ్రీదేవీరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతులివ్వద్దు విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులివ్వవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక అధికారులను ఆదేశించారు. ఏ పార్టీ తరఫునైనగానీ, వ్యక్తుల తరఫునగానీ బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నియంత్రించాలన్నారు. మున్సిపాలిటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు అనుమతించిన హోర్డింగులు మినహా ఏ ఒక్కటీ అదనంగా కనిపించడానికి వీల్లేదన్నారు. -
అమ్మవు నీవే అఖిల జగాలకు..
అమ్మలగన్న అమ్మ.. ముగురమ్మల మూలపటమ్మ కొలువుదీరింది. దేవీ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఊరిలో ప్రతి వాడలో అమ్మవారిని నెలకొల్పారు. పాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంత్రులు కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ దర్శించిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే కళావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాలకొండ కోటదుర్గమ్మ, పాతపట్నం నీలమణిదుర్గ, రాజాం నవదుర్గమ్మ, ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు గ్రామాల్లోనూ ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి దేవీ విగ్రహాలను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. – సాక్షి నెట్వర్క్ సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతపట్నం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం తెల్లవారు జామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలిరోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్.కుమారస్వామి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరుణించమ్మా కోటదుర్గమ్మ కోటదుర్గమ్మ.. కరుణించు మాయమ్మ అన్న నామస్మరణతో పాలకొండ పట్టణం మారుమోగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 సమయంలో మూహూర్తపురాటను అర్చకులు దార్లపూడి లక్ష్మిప్రసాదశర్శ వేయించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పోటెత్తిన భక్తజనం.... ఏడాదిలో ఒక్కసారి అమ్మ నిజరూపదర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తారు. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈవో టి.వాసుదేవరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఛి వారాహి అమ్మవారికి విశేష పూజలు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని వారాహి అమ్మవారిగా అలంకరించారు. ముందుగా అర్చకులు గణపతి పూజతో ప్రారంభించి ప్రత్యేక అర్చనలు చేశారు. మహిళలు కుంకమ పూజలు చేశారు. పూజలందుకుంటున్నవారాహి అమ్మవారు శ్రీచక్రపురంలో ప్రత్యేక పూజలు ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగిరికటకంలో దసరా సరదా జలుమూరు: దసరా ఉత్సవాలు సంసృతీ సంప్రదాయాలకు ప్రతీకలని నగిరికటకం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం పైల సూర్యనారాయణ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం పాఠశాల విద్యార్థులతో సంప్రదాయ వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణలతో ప్రదర్శన చేయించారు. వీధివీధికీ వెళ్తూ ‘దసరాకు వచ్చాము విస సలు వద్దు..’ అంటూ పాటలు పాడారు. వెదురు కర్రతో బాణాలు చేసి పువ్వులు,పత్రితో కోలాటాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.నీలవేణి, ఎం.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. శైలపుత్రికగా స్వేచ్ఛావతి అమ్మవారు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు లక్ష్మికాంత్పాఢీ ఆధ్వర్యంలో స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. దేవీ నవరాత్రి పూజ మండపంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, పలువురు భక్తులు సామూహిక దీపారాధన కార్యక్రమంలను నిర్వహించారు. దేవీ నవరాత్రులు ప్రారంభంలో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రికగా భక్తులకు దర్శనమిచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మాలధారణ నరసన్నపేట: స్థానిక పైడితల్లి ఆలయం వద్ద ఆదివారం దేవీ మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. 56 మంది భక్తులు భవానీ మాల ధరించారు. పైడితల్లి ఆలయ అర్చకులు లకు‡్ష్మడు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల మాలధారణ చేసిన అనంతరం విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటామని నిర్వాహక కమిటీ ప్రతినిధి గూర్జా రమణ తెలిపారు. అంబరాన్నంటిన సంబరాలు పాలకొండ రూరల్: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పాలకొండ పట్టణంలోని చిన్న, పెద్ద గొల్ల వీధులకు చెందిన ప్రజలు సామూహిక సంబరాలు చేపట్టారు. ఆదివారం సాయింత్రం పెద్ద ఎత్తున మహిళలు æముర్రాటలతో ముందుకు సాగారు. తొలుత ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకుని అక్కడి నుంచి పాలకొండ– వీరఘట్టం రహదారిలోని గారమ్మ వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. నవదుర్గా నమోస్తుతే..! రాజాం : రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రత్యేక పూజలు చేసి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఈఓ శ్యామలరావు, అర్చకులు వేమకోటి రవికిరణ్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం జ్ఞాన సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేయాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం మండలం కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు. యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్‌కుమార్, గొర్లె బ్రదర్స్, పారంకోటి సుధ, ఆసపు సూర్యం తదితరులు పాల్గొన్నారు. నవదుర్గకు ప్రత్యేక పూజలు రాజాం సిటీ: స్థానిక నవదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తిని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ట్రస్టీ వానపల్లి నర్సింగరావు, పర్యవేక్షకులు కూరాడ వెంకటరావు, భక్తులు పాల్గొన్నారు. మంత్రి కృష్ణదాస్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి అమ్మవారి సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యరనారాయణ, ఝాన్సీ దంపతులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి దర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు మజ్జి శ్రీని వాసరావు, తమ్మినేని చిరంజీవినాగ్ తదితరులు కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, దేవదాయశాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి జ్ఞాపికలు అందించారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి పాలవలస విక్రాంత్, ఆర్డీవో టి.వి.ఎస్.కుమార్, డీఎస్పీ పి.రారాజు ప్రసాద్, తహసీల్దార్ జల్లేపల్లి రామారావు, నగర కమిషనర్ వై.లిల్లీపుష్పనాథంతోపాటు ఉత్సవకమిటీ సభ్యులు, ఇతర జిల్లాకు చెందిన అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారీ బందోబస్తు... వేలాదిమంది భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ ఆదాం నేతృత్వంలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వీరఘట్టం, ఎస్ఐలు, సిబ్బందితోపాటు పలు కళాశాల సీపీవోలు స్వచ్ఛందంగా సేవలుందించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. -
వీధి బొమ్మలు
వీధి బొమ్మలు.. అయ్యో.. తప్పు రాశామే! విధి బొమ్మలేమో కదా!విధాత రాసిన విధి కాదు. కొందరు దురాగతుల రాత ఇది.రాలిన పూలను నులిమి ఆ రంగులు పూసిన వీధులివి. మన వీధులే. మన పిల్లలే. మన సమాజమే. కానీ.. వీధిలో వదిలేశారు.అదే వీధి బొమ్మలు ఇవాళ మన సంస్కారాన్ని వెక్కిరిస్తున్నాయి. కోల్‌కతా రెడ్‌లైట్ ఏరియాలోని చెల్లెళ్లు గీసిన ఈ బొమ్మలు అమ్మవారి మంటపాల ముందు కొలువయ్యాయి. దసరా నవరాత్రులకు పుట్టిల్లు కోల్‌కతా. ఈ నవరాత్రుల్లో దుర్గాపూజలో పాల్గొన్నారీ కోల్‌కతా మహిళలు. కోల్‌కతాలో వీళ్లు నివసించే ప్రదేశం ‘సోనాగచ్చి’ గురించి నూటికి తొంభై మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియనట్లు ముఖం పెడతారంతే. ఆ ప్రదేశం పేరు పలకడానికి కూడా ఇష్టపడనంత విముఖతను కూడా వ్యక్తం చేస్తుంది సభ్యసమాజం. మరి వాళ్ల జీవితాలు అక్కడికి చేరడంలో సభ్యసమాజం పాత్ర లేదా? లేదా కాదు, పూర్తి బాధ్యత సమాజానిదే. దేహంతో వ్యామోహం తీర్చుకోవచ్చనే కుత్సిత బుద్ధికి, దేహం మీద వ్యాపారం చేయవచ్చనే కుటిలనీతికి పుట్టిన వృత్తి వారిది. ఇప్పుడీ మహిళలు దుర్గామాతకు అర్పిస్తున్న నైవేద్యం ఏమిటో తెలుసా? వారి మనోవేదన! తమ జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మాటలు కావాలి. చెప్పడానికి మాటలు చాలని బాధను వాళ్లు కుంచెతో చెప్పారు. నోరు విప్పడానికి ధైర్యం లేని తమ దుస్థితిని బొమ్మల్లో చూపించారు. వీధే వేదిక కోల్‌కతా సోనాగచ్చి మహిళలు ‘అహిరోతోలా’ లో మూడు వందల అడుగుల పొడవున్న వీధిలో బొమ్మలు వేశారు. ఆ వీధి వెంట నడుస్తూ ఆ బొమ్మలను చూస్తుంటే కొద్ది నిమిషాలు మాటలు రావు. ప్రతి బొమ్మా మౌనంగా మాట్లాడుతుంటుంది. ఆ మాటలను నిశ్శబ్దంగా వింటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఒక బొమ్మలో... తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంటుంది, ముగ్గురమ్మాయిలు ఒకరి వెనుక ఒకరు నిలబడి బయటకు తొంగి చూస్తుంటారు. అది విటుడు వచ్చినప్పుడు వేశ్యాగృహం నిర్వహకుల పిలుపుతో బయటకు వచ్చి చూసే దృశ్యం. ఆ బొమ్మకు పైన మూడు బొమ్మలున్నాయి. మొదటి బొమ్మలో ఒక అమ్మాయి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటోంది, రెండవ బొమ్మలో అదే అమ్మాయి అలంకరణ పూర్తి చేసుకుని చేతి విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. ఇక మూడవ బొమ్మలో అమ్మాయి ముఖాన్ని సగం మేర చీర కొంగు కప్పేసి ఉంది. మిగిలిన సగం ముఖంలో బొట్టు కూడా సగం మేరకే కనిపిస్తోంది. ఆ బొమ్మ చెప్తున్న విషయం ఏమిటంటే.. ఆ బొట్టు చెరిగి ఉందన్న వాస్తవాన్ని గమనించమని. కన్నీటి మడుగు ఒక బొమ్మలో ఒక టీనేజ్ దాటని అమ్మాయి.. కళ్ల నుంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. అలా కారిన నీళ్లు ఆమె ముందే మడుగు కట్టి ఉంది. తన దుర్భర జీవితాన్ని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కార్చిందని చెబుతోందా బొమ్మ. మరొకమ్మాయి ఒంటి మీద ఉండాల్సిన చీర నేల మీద పరుచుకుని ఉంది. ఆమె చేతులతో దేహాన్ని కప్పుకుంటోంది. మరికొన్ని బొమ్మలు కేవలం పెదాలే.. వాటికి తాళం కప్పలు వేసి ఉన్నాయి. మరికొన్ని బొమ్మల్లో కేవలం చేతులు.. మా దేహం మీద దాష్టీకం వద్దు అడ్డు చెబుతున్నట్లున్నాయి. మరో బొమ్మలో ముగ్గురమ్మాయిలు ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకుంటున్నారు. ఇదీ.. సోనాగచ్చి మహిళలు చెప్పదలుచుకున్న వారి జీవితం. వంద వాక్యాల్లో కూడా చెప్పలేని దైన్యాన్ని బొమ్మల్లో చూపించిన వైనం. అమ్మవారిని శక్తిస్వరూపిణిగా పూజించే సమాజమే... అమ్మాయిని మాత్రం వ్యామోహం తీర్చుకోవడానికి, ఆమె దేహంతో వ్యాపారం చేయడానికి వాడుకుంటుంది. ఆమె పొట్ట నింపుకోవడానికి ఆమె దేçహాన్నే పెట్టుబడి వనరుగా మారుస్తుంది. ఈ ద్వంద్వ ప్రవృత్తి రూపుమాసిపోనంత కాలం ఈ వీధి బొమ్మలు కూడా చెరిగిపోవు. చెప్పడానికే ఇదంతా సెక్స్ వర్కర్ల జీవితంలో ఉన్న దౌర్బల్యాన్ని సమాజానికి తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జుబాక్బృంద దుర్గాపూజ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా. ఒక మహిళ సెక్స్ వర్కర్‌గా మారిందంటే... అందుకు కారణం అక్రమ రవాణా కావచ్చు లేదా తన పిల్లల కడుపు నింపడానికి మరోదారి లేక కావచ్చు... అన్నారాయన. – వాకా మంజులారెడ్డి -
దుర్గాపూజ స్పెషల్స్
నిన్నటి వంటల శీర్షికలో రకరకాల బొబ్బట్లు ఇచ్చాం. ఇప్పుడు ఫుల్‌గా నవరాత్రి స్పెషల్ దుర్గాపూజ నైవేద్యాలు. మాతను ప్రసన్నం చేసుకోండి. దసరాను సంతోషంగా స్వీట్‌గా చేసుకోండి. సూజీ కా హల్వా కావలసినవి: బొంబాయి రవ్వ – కప్పు, పంచదార – అర కప్పు, పాలు – కప్పు, నెయ్యి – అర కప్పు, కిస్మిస్ – 2 టే బుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు – 1, ఏలకుల పొడి – టీ స్పూను, కుంకుమ పువ్వు – చిటికెడు, జీడి పప్పులు – 2 టేబుల్ స్పూన్లు తయారి: ∙పెద్ద పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు వేసి వేయించాలి .ఏలకుల పొడి, బిర్యానీ ఆకు వేసి మరో మారు వేయించాలి. జీడిపçప్పులు బంగారు రంగులోకి వచ్చాక బొంబాయి రవ్వ వేసి బాగా వేయించాలి ∙ఒక పాత్రలో పాలు పోసి వేడి చేయాలి ∙రవ్వ వేగుతున్న పాత్రలో కాచిన పాలు పోస్తూ బాగా కలిపి నాలుగు నిమిషాలు ఉడికించాలి ∙పంచదార, కిస్మిస్ వేసి మరోమారు బాగా కలపాలి ∙చివరగా కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. లొబోంగో లతికా కావలసినవి: మైదా పిండి – కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, ఉప్పు – చిటికెడు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, వేడి నీళ్లు – అర కప్పు, స్టఫింగ్ కోసం: కొబ్బరి తురుము – అర కప్పు, పచ్చి కోవా – కప్పు, ఏలకుల పొడి – టీ స్పూను, బెల్లం తురుము – అర కప్పు, జాజికాయ పొడి – చిటికెడు. పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – 2 కప్పులు, ఏలకుల పొడి – అర టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి తగినంత తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, పంచదార, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా వేడి నీళ్లు జత చేస్తూ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలపాలి. ∙కొద్దిగా నూనె జత చేసి పిండిని బాగా మర్దిస్తూ కలిపి, ఓ గంట సేపు పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారి: ∙స్టౌ మీద బాణలిలో కొబ్బరి తురుము, పచ్చి కోవా, ఏలకుల పొడి, బెల్లం తురుము, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి ∙మిశ్రమం అంతా ఉడికి, గట్టి పడిన తరవాత స్టౌ మీద నుంచి దింపి, చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను చిన్న పూరీలా ఒత్తి, కొబ్బరి తురుము మిశ్రమం ఉండను ఇందులో ఉంచి నాలుగు వైపులా పువ్వు ఆకారం వచ్చేలా మడిచిపెట్టి, విడిపోకుండా మధ్యలోకి లవంగం గుచ్చాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి, తీగ పాకం వచ్చే వరకు కలిపి దింపేయాలి ∙సౌ ్టమీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న లొబోంగో లతికాలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙కొద్దిగా చల్లారగానే వీటిని పంచదార పాకంలో వేసి అరగంట తరవాత సర్వ్ చేయాలి నోలెన్ గుర్ పాయష్ కావలసినవి: చిక్కటి పాలు – లీటరు, బియ్యం – 4 టేబుల్ స్పూన్లు (సాధారణంగా గోబిందో భోగ్ బియ్యం ఉపయోగిస్తారు. ఇక్కడ లభించవు కనుక బాస్మతి బియ్యం ఉపయోగించుకోవచ్చు), బెల్లం తురుము – 6 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు – 1, ఏలకుల పొడి – టీ స్పూను తయారి: ∙ఒక పాత్రలో పాలు, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ∙పాలు మరుగుతుండగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసి బాగా కలపాలి ∙మరో పాత్రలో బెల్లం, తగినన్ని నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి లేత పాకం పట్టి దింపేయాలి ∙పాలలో బియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం పాకం వేసి బాగా కలిపి మూడు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తినొచ్చు ∙ఈ పాయసం రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది. షోర్ భోజో పంచదార పాకం కోసం: పంచదార – 2 కప్పులు, నీళ్లు – కప్పు, నిమ్మ రసం – అర టీ స్పూను, ఏలకుల పొడి – కొద్దిగా, రోజ్ ఎసెన్స్ – కొద్దిగా షోర్ భోజో కోసం: చిక్కటి పాలు – 2 లీటర్లు, పంచదార – టేబుల్ స్పూను, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు, బాదం + పిస్తా పప్పులు – అలంకరణ కోసం కొద్దిగా, నెయ్యి – తగినంత పాకం తయారి: ∙ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి మరిగించాలి ∙ఏలకుల పొడి, రోజ్ ఎసెన్స్ జత చేసి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి స్టౌ మీద నుంచి దింపి పక్కనుంచాలి ∙ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. మీగడ మందంగా వచ్చినప్పుడల్లా, తీసి జాగ్రత్తగా ఒక ప్లేట్లో ఉంచాలి ∙కొద్దిగా చల్లారగానే మీగడ పొర మీద పంచదార వేయాలి ∙అదేవిధంగా మళ్లీ మీగడ తీసి, మళ్లీ పంచదార చల్లాలి ∙ఈ విధంగా మొత్తం పాలు ఇగిరిపోయేవర కు చేయాలి ∙మొత్తం పూర్తయ్యాక మీగడలో పాలు ఏమైనా మిగిలి ఉంటే, మీగడను నెమ్మదిగా ఒత్తి పాలు తీసేసి, మీగడను ముక్కలుగా కట్ చేయాలి ∙వీటి మీద కొద్దిగా మైదా పిండి చల్లి, కాసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఒక ప్లేట్లో కొద్దిగా మైదా పిండి చల్లి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న ముక్కలను అందులో వేసి జాగ్రత్తగా పిండి అంటేలా చేసి, సరైన ఆకారంలోకి జాగ్రత్తగా ఒత్తుకోవాలి ∙రెండేసి ముక్కల చొప్పున నేతిలో వేసి సన్నని మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న పాకాన్ని మళ్లీ స్టవ్ మీద ఉంచి, వేయించిన ముక్కలను అందులో వేసి బాగా కలిపి దింపేయాలి ∙పది నిమిషాల తర్వాత, బాదంపిస్తా పప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి. కదమ్ ఖీర్ కావలసినవి: రసగుల్లాలు – 8 (పొడిగా ఉన్నవి), పచ్చి కోవా – 150 గ్రా. (100 గ్రా. లడ్డూ తయారీ కోసం, 50 గ్రా. పైన అద్దడం కోసం), పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు, పాలు – 2 టేబుల్ స్పూన్లు, రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు తయారి: ∙కదమ్ ఖీర్ తయారుచేయడానికి అరగంట ముందు రసగుల్లాలను పంచదార పాకంలో నుంచి బయటకు తీయాలి ∙ఒక పాత్రలో సన్నగా తురిమిన పచ్చికోవా, పంచదార పొడి, పాలు, రోజ్ ఎసెన్స్ వేసి మెత్తగా అయ్యేలా నెమ్మదిగా కలిపి, ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని వడ మాదిరిగా ఒత్తి, అందులో రసగుల్లా ఉంచి అన్నివైపులా మూసేసి, పై భాగం నున్నగా ఉండేలా లడ్డూలాగ చేతితో సరిచేయాలి ∙కోవాలో మిగిలిన భాగాన్ని సన్నగా తురిమి ప్లేట్లో వేసి, తయారుచేసి ఉంచుకున్న లడ్డూలను అందులో దొర్లించి, తీసి పేపర్ కప్‌లో ఉంచాలి. (లడ్డూలను ముందుగా పంచదార పాకంలో దొర్లించిన తరవాత కోవాలో దొర్లించాలి. అలా చేయకపోతే లడ్డూలకు కోవా అంటుకోదు) మిష్టీ ధోయ్ కావలసినవి: చిక్కటి పాలు – లీటరు, గడ్డ పెరుగు – 4 టేబుల్ స్పూన్లు, పంచదార – పావు కేజీ తయారి: ∙మందపాటి పాత్రలో పాలు పోసి, మధ్యమధ్యలో కలుపుతూ, అరలీటరు అయ్యే వరకు పాలను మరిగించి, దించి చల్లార్చాలి స్టౌ మీద బాణలి వేడయ్యాక, పంచదార వేసి గోధుమరంగులోకి వచ్చి, కరిగే వరకు కలిపి దించేయాలి పాలను జత చేసి మెత్తగా గిలక్కొట్టాలి ∙చివరగా పెరుగు జత చేసి, జాగ్రత్తగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసి, మూత పెట్టి సుమారు నాలుగు గంటలు అలా ఉంచేయాలి ∙మిస్టీ ధోయ్ తయారయిందనిపించాక, ఆ పాత్రను ఫ్రిజ్‌లో ఉంచి, రెండు గంటల తర్వాత చల్లగా సర్వ్ చేయాలి. – సేకరణ: డా. వైజయంతి -
ఆరట్ల ఆరగింపు
ఓలిగలు.. బొబ్బట్లు.. భక్ష్యాలు.. పోలెలు.. పూరన్ పోలి.. స్టఫ్డ్ పాన్‌కేక్స్... ఇలా ఈ అట్లకు ఎన్నో పేర్లు. పేరు ఏదైనా అమ్మవారికి ఈ ఆరట్ల ఆరగింపు భక్తితో చేసి దీవెనలు పొందండి. గుమ్మడి బొబ్బట్లు కావలసినవి: గుమ్మడికాయ తురుము – 3 కప్పులు, తురిమిన బెల్లం – 1 1/2 కప్పు, మైదా – 3/4 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నెయ్యి – సరిపడ తయారి: ∙మందపాటి బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయేలా 5 నిమిషాలు వేయించాలి ∙తరిగిన బెల్లం వేసి సన్నని మంటపై కలుపుతూ ఉండాలి ∙యాలకుల పొడి వేసి మిశ్రమం ఉండలా తయరయ్యేంత వరకు కలిపి స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఒక గిన్నెలో మైదా పిండి, ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలి ∙గిన్నెపై మూతపెట్టి 1 గంట సేపు పిండిని నాననివ్వాలి ∙పిండిని ఒకే సైజులో ఉండేలా ఉండల్లా చేసి పెట్టుకోవాలి ∙అరచేతిలో నెయ్యి రాసుకుని పిండి ముద్దను తీసుకుని మధ్యలో గుమ్మడి తురుము మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా జాగ్రత్తగా మూసివేయాలి ∙ఇప్పుడు అప్పడాల పీటపైన కొంచెం పిండి చల్లి నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి ∙స్టౌ వెలిగించి, పెనం పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక బొబ్బట్టు వేసి బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చుకోవాలి ∙వేడి వేడి గుమ్మడి బొబ్బట్టుపై నెయ్యి వేసి వేడిగా సర్వ్ చేయాలి. డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు కావలసినవి: మైదా పిండి – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత, జీడిపప్పు పొడి – టేబుల్ స్పూను, పిస్తా పొడి – టేబుల్æస్పూను, బాదం పప్పుల పొడి – టేబుల్ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, కొబ్బరి తురుము – టేబుల్ స్పూను తయారి: ∙ఒక పాత్రలో మైదా, నెయ్యి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి ∙కొద్ది కొద్దిగా నీరు జత చేస్తూ చపాతీపిండిలా తయారుచేసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్లో కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ∙మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి, మైదా పిండి ఉంచి చేతితో చపాతీలా ఒత్తి, అందులో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నెయ్యి వేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్ బొబ్బట్టును పెనం మీద వేసి రెండు వైపులా గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి. డేట్స్ పాన్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు, బేకింగ్ పౌడర్ – కొద్దిగా, ఖర్జూరాలు – కప్పు (గింజలు తీసి ముక్కలు చేయాలి), పాలు – అర కప్పు, వెనిలా ఎసెన్స్ – టీ స్పూను, బటర్ – కొద్దిగా, తేనె – టేబుల్ స్పూను తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. మిక్సీలో మైదాపిండి మిశ్రమం, పాలు, ఖర్జూరం ముక్కలు వేసి చిక్కగా అయ్యేలా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙వెనిలా ఎసెన్స్ జత చేయాలి . స్టౌ మీద పెనం వేడయ్యాక, కొద్దిగా బటర్ వేసి పెనమంతా అంటేలా చేయాలి ∙పెద్ద స్పూనుతో మైదా పిండి, ఖర్జూరం మిశ్రమం వేసి మందంగా ఉండేలా పరచాలి ∙రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. (పెద్ద మంట మీద కాల్చకూడదు) ∙ప్లేట్లోకి తీసి, పైన కొద్దిగా తేనె వేసి సర్వ్ చేయాలి. పూర్ణం బొబ్బట్లు కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు, గోధుమరవ్వ – టీ స్పూను, ఉప్పు – చిటికెడు, నెయ్యి – అర టీ స్పూను నూనె – అర టేబుల్ స్పూను, నీళ్లు – తగినంత పూర్ణం తయారీకి: సెనగ పప్పు – అర కప్పు, బెల్లం తురుము – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, కొబ్బరి తురుము – పావు కప్పు, నీళ్లు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ, చపాతీ పిండిలా కలపాలి. నూనె జత చేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు గంటసేపు నాననివ్వాలి ∙ఒక పాత్రలో సెనగ పప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, బయటకు తీసి తడి పోయేవరకు చల్లారనివ్వాలి. ∙మిక్సీలో వేసి పొడి చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఏలకుల పొడి, బెల్లం తురుము, కొబ్బరి తురుము జత చేయాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙నానబెట్టిన మైదా పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ మీద మైదా పిండి ఉండ ఉంచి చపాతీ మాదిరిగా చేతితో ఒత్తాలి ∙పూర్ణం ఉండ అందులో ఉంచి, మైదాపిండితో మూసేసి మరోమారు చపాతీలా చేతితో ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె లేదా నెయ్యి వేసి కాగిన తరవాత, ఒత్తి ఉంచుకున్న బొబ్బట్టు జాగ్రత్తగా వేయాలి ∙రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి తీసేయాలి. క్యారెట్ బొబ్బట్లు కావలసినవి: గోధుమపిండి – 2 కప్పులు, క్యారెట్ తురుము – 1 కప్పు, తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకుల పొడి – 1 స్పూను, నూనె – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – సరిపడ తయారి: ∙ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకుని నీళ్ళు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ ముద్దపై కొంచెం నూనె వేసి ఒక గంట సేపు నాననివ్వాలి ∙ఒక మందపాటి బాణలిని స్టౌ మీద పెట్టి, క్యారెట్ తురుము, బెల్లం వేసి కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమానికి యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి సన్న మంటపై కలుపుతూ ఉండాలి ∙ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. బాణలికి అంటుకోకుండా, అంచుల్లో నెయ్యి పక్కకు వస్తున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్దను నూనె రాసిన ప్లాస్టిక్ కవర్‌పై తీసుకుని చిన్న చపాతీ మాదిరిగా చేతితో ఒత్తుకోవాలి ∙ఈ చపాతీ మధ్యలో క్యారెట్ మిశ్రమాన్ని తీసుకుని అంచులు పూర్తిగా మూసివేసి, కొబ్బరి మిశ్రమం బయటకు రాకుండా చపాతీ మాదిరిగా చేసుకోవాలి ∙వేడిచేసిన పెనంపై నెయ్యి వేసి వేడయ్యాక, రెండువైపులా బాగా కాల్చుకోవాలి. నువ్వులు కొబ్బరి బొబ్బట్లు కావలసినవి: నువ్వులు – అర కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు, బెల్లం తురుము – కప్పు, నూనె – టేబుల్ స్పూను, ఏలకుల పొడి – అర టీ స్పూను, మైదా పిండి – రెండు కప్పులు, నీళ్లు – తగినన్ని, ఉప్పు – కొద్దిగా, నెయ్యి – అరకప్పు తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరో మారు కలిపి గంట సేపు పక్కన ఉంచాలి ∙మిక్సీలో నువ్వులు, కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, పాత్రలోకి తీసుకోవాలి ∙నువ్వుల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ∙ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి, మైదా పిండి ఉండ ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి ∙నువ్వుల మిశ్రమం ఉండను ఉంచి, అన్ని వైపులా మూసి, మరోమారు చేతితో పల్చగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టు వేసి నేతితో రెండు వైపులా కాల్చి తీసేయాలి. – సేకరణ: డా. వైజయంతి -
ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున దుర్గాదేవి శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఇది ఆఖరి రోజు. దీనికే దుర్గాష్టమి అనే పేరు వాడుకలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం సకల దేవీ, దేవతల శక్తి స్వరూపంగా ఈ తల్లి ఆవిర్భవించింది. ఇది అత్యుగ్రరూపం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ అవతారంలో అమ్మ సింహవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషుడిని సంహరిస్తున్న రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని ఉపాసించడం ద్వారా సకల భయాలు, శత్రుపీడ, రోగాలు దూరమవుతాయి. విశ్వశాంతి కలుగుతుంది. శత్రువిజయాన్ని కాంక్షించేవారు ఈ తల్లిని ఉపాసించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజున చండీ సప్తశతీ పారాయణ, హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మంత్రం: ‘ఓం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని జపించడం మంచిది. నైవేద్యం: గారెలు, పులిహోర, పొంగలి -
ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారం
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తూ పులా గజరాజు సేవిస్తున్న తేజోమూర్తిగా శరన్నవరాత్రుల్లో ఆరోరోజున కనకదుర్గాదేవి భక్తులను మహాలక్ష్మీ అవతారంలో అనుగ్రహిస్తుంది. ఈ తల్లి సర్వమంగళకారిణి, సకల సౌభాగ్యప్రదాయిని, ఆనంద సంధాయిని. నిత్యం ప్రసన్నవదనంతో ఉంటుంది. అష్టలక్ష్ముల సమష్టిరూపంగా, సకల జీవకోటిలో, ప్రకృతిలో నిండి ఉన్న సకల లక్ష్మీస్వరూపంగా ఈమెను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని చండీసప్తశతి చెబుతోంది. డోలాసురుడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం ఈ దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యలో ఉంటుంది. ఎరుపురంగు పూలతో అర్చించి, లక్ష్మీస్తోత్రం పారాయణ చేస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీ ప్రీతిగా పూర్ణాలు నివేదన చేయాలి. సువాసినులకు షోడశోపచారాలతో అర్చించి, శక్తికొద్దీ మంగళద్రవ్యాలు అందించాలి. మంత్రం: ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్షై్మ్య నమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి నైవేద్యం: పూర్ణాలు ఫలితం: సకలైశ్వర్య సిద్ధి. -
శ్రీ గాయత్రీ అలంకారం దేవీనవరాత్రులు
మూడవ రోజు సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే. శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. న గాయత్య్రాః పరో మంత్రం న మాతుః పరదైవతం అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే. ఫలమ్ : మంత్రసిద్ధి, వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం. నివేదన : గుడాన్నం (బెల్లం పరమాన్నం) శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు. -
రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
దేవీనవరాత్రులు నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం. దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా, పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. శ్లోకం : దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా! భావం : వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను స్ఫటికమాలను ధరించి జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ! అర్చన, సందర్శన ఫలమ్ : ఉన్నతవిద్య, విశేషజ్ఞాన సంపదలు చేకూరతాయి. నివేదన : కట్టెపొంగలి, దధ్యోదనం -
శరన్నవరాత్రి వేడుకల్లో టీమిండియా