ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్‌ దంపతులు | Dussehra celebrations on Indrakiladri Updates | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్‌ దంపతులు

Published Sun, Oct 15 2023 8:35 AM | Last Updated on Sun, Oct 15 2023 9:41 AM

Dussehra celebrations on Indrakiladri Updates - Sakshi

Updates..

►ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.

►పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు.

►అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు 

►అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన గవర్నర్ దంపతులు 

►అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేసిన వేద పండితులు 

►అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించిన ఈవో,ఛైర్మన్

►దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది.

►ఆదివారం కావడంతో తొలిరోజే పెరిగిన భక్తులు 

►8:30 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

►స్నపనాభిషేకం అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు మొదలైన దర్శనాలు 

►శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 

►తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

►భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. 

►భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. 

►భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్‌ రామారావు, ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement