Kanakadurga Temple
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక, నేడు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. కాగా, ఇంద్రకీలాదిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేశారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, మూలనక్షత్రం సందర్బంగా విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగనున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మరోవైపు, తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆరోరోజు తిరుమల శ్రీవారు.. హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇక, గురువారం గరుడోత్సవం సందర్భంగా రెండు లక్షలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,757 కాగా, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,395గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. ఇది కూడా చదవండి: వరుసగా మూడో ఏడాదీ వైఎస్సార్ అవార్డులు -
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు
Updates.. ►ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు. ►అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు ►అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన గవర్నర్ దంపతులు ►అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేసిన వేద పండితులు ►అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించిన ఈవో,ఛైర్మన్ ►దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ►ఆదివారం కావడంతో తొలిరోజే పెరిగిన భక్తులు ►8:30 గంటలకు అమ్మవారిని దర్శించుకోనున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ►స్నపనాభిషేకం అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు మొదలైన దర్శనాలు ►శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ►తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ►భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. ►భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. ►భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ (ఫొటోలు
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి అత్యుత్సాహం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో ఓ భక్తురాలు అత్యుత్సాహం చూపారు. అమ్మవారి మూల విరాట్‌ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే దుర్గగుడి ఈవో భ్రమరాంబ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించి శాంతి కుమారి అనే భక్తురాలు వీడియో తీసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ) -
బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వై.వి. సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కాగా, దసరా ఉత్సవాల్లో టీటీడీ దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అనంతరం.. మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న దుర్గమ్మను వారు దర్శించుకున్నారు. ఇక, దర్శనానంతరం వేద పండితులు దంపతులిద్దరికీ వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ.. సుబ్బారెడ్డి దంపతులకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. దర్శనం అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి బ్రహ్మోత్సవాల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాము. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని రెండున్నర లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సీఎం జగన్ పాలనలో సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించాను’ అని తెలిపారు. -
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవురోజు కావడంతో సాయంత్రానికి 50 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రం వేళ కృష్ణమ్మ అందాలను తనివితీరా ఆస్వాదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ఘనంగా నగరోత్సవం జరిగింది. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారిని హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు దర్శించుకున్నారు. కాగా, మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు
సాక్షి, విజయవాడ: టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడింది. అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ‘ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయి. 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి.. ఈసారి స్వర్ణం సాధించాలి’ అని పేర్కొంది. -
శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే
సాక్షి, విజయవాడ : శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే... రెండో రోజు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు.. మూడో రోజు.. దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు నాలుగో రోజు.. దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి అయిదవ రోజు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. ఆరవ రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ఏడోరోజు.. ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తొమ్మిదవ రోజు.. దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. -
దుర్గాగుడి పాలకమండలి నిర్ణయాలు
-
‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గగుడి రథంలోని వెండి సింహాలు చోరీ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రథం పక్కన పెట్టి ఏడాది పైనే కావస్తుందని, చోరీ ఎప్పుడు జరిగిందో విచారణలో తెలాల్సి ఉందన్నారు. సీపీ మాట్లాడుతూ.. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇంటి దొంగల పనా లేక ప్రొఫెషనల్స్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 1,500 పైగా దేవాలయాలు ఉన్నట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. 215 దేవాలయాలకు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు లేని ఆలయాల్లో ఆలయ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. (రథంపై సింహాలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు) ‘కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. పీస్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ప్రతి ఆలయంలో పెట్టుకోవాలని సూచించాం. అంతర్వేది ఘటన తరువాత వివిధ ఆలయాలపై దాడులు జరిగాయి. వాటన్నిటిపై విడివిడిగా విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయి. ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని ఎవరినీ వదలం. ఆలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్థుల కదలిక పైనా నిఘా పెట్టాం’ అని కమిషనర్ పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం) -
‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు.. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. (‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’) వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్రోడ్లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని గుర్తుచేశారు. 2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడిన తర్వాత కరోనా వలన వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు ఏ రకంగా వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్‌రూమ్‌లో లేవన్నారు. పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి అమర్చే ప్రక్రియను బుధవారమే ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు మాట్లాడుతూ.. ‘పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీసులను దర్యాప్తు చేయాలి అని కోరాం. హిందువుల మనోభావాలు కాపాడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా?. గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న. విచారణలో దోషులు తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సారులు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్ జనగ్పై అపార నమ్మకం ఉంది.’ అన్నారు. 2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని దుర్గగుడి ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. ‘స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు. అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్‌లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము.’ అన్నారు. -
రేపటి నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం నిలిపివేత
సాక్షి, విజయవాడ: కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్నందున నేడు సాయంత్రం నుంచి బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు ప్రకటించారు. అయితే అమ్మవారికి ప్రతిరోజూ పూజాకార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటి నుంచి ఘాట్‌లో వాహనాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. తిరిగి అమ్మవారి దర్శనం ఎప్పుడు ఉంటుందనేది తర్వాత చెప్తామని తెలిపారు. (శ్రీవారి ఆలయంలో 128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం) అప్పటివరకు భక్తులు గుడికి రావద్దని విఙ్ఞప్తి చేశారు. వీఐపీ దర్శనాలను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సిబ్బంది ఎప్పటిలాగే తమ విధులు నిర్వహిస్తారని పైలా సోమినాయుడు పేర్కొన్నారు. కాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి పలు ఆలయాలు భక్తులకు దర్శనాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. (అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత) -
కనకదుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
-
దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
సాక్షి, విజయవాడ : ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వైఎస్ భారతిరెడ్డిని కలిసిన నమ్రతా శిరోద్కర్ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిరెడ్డిని..నమ్రతా శిరోద్కర్ మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు. కాగా హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామమ్ ఫౌండేషన్ ద్వారా బుర్రిపాలెంలో అభివృద్ధి పనులు మహేష్ బాబు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర ఈ సందర్భంగా తెలిపారు. -
అమ్మ గుడిలో అన్నీ..అవకతవకలే
సాక్షి, అమరావతి: ఎలాంటి అనుమతులు లేకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకంలోనూ ఇదే పరిస్థితి. ప్రసాదాల పేరిట రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి. చివరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారాలపై దేవదాయ శాఖ కమిషనర్ పద్మ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలివి. తెలుగుదేశం పార్టీ హయాంలో.. గడచిన ఏడాది కాలంలో విజయవాడ దుర్గ గుడిలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఒక పోస్టులో ఉండే అధికారి బదిలీపై వెళ్లి.. మరొకరు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టిన అధికారి అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారికి నివేదిక ఇవ్వడం అనవాయితీ. 2018 ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 22 వరకు దుర్గ గుడి ఈవోగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి వి.కోటేశ్వరమ్మ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టిన దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్ తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో గుర్తించిన లోపాలు, అవకతవకలపై దేవదాయ శాఖ కమిషనర్‌కు సమాచారమిచ్చారు. కమిషనర్ వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతూ.. చర్యలు తీసుకోవడానికి తగిన సూచనలు చేయాలని కోరారు. నివేదికలో పేర్కొన్న అవకతవకల వివరాలివీ.. ►2018 దసరా ఉత్సవాల నాటినుంచి 2019 సెప్టెంబర్ వరకు ఆలయంలో అప్పాలు ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసినందుకు రూ.1.21 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించారు. అయితే, ఆలయంలో అప్పాలు ప్రసాదం పంపిణీకి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ►రికార్డుల్లో పేర్కొన్న చీరల ధరలకు, గోడౌన్లలో ఉంచిన చీరల ధరలకు మధ్య చాలా తేడాలున్నాయి. అమ్మవారి చీరల విషయంలోనే ఆ ఏడాది కాలంలో రూ.9,50,218 మేర అక్రమాలు చోటు చేసుకున్నాయి. ►గతంలో భక్తులు సమర్పించే చీరల వ్యవహారాలన్నీ ఆలయ రెగ్యులర్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉండేవి. టీడీపీ సర్కారు హయాంలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే అమ్మవారి చీరల పర్యవేక్షణను ఒక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కనీసం ప్రభుత్వ అనుమతి కూడా లేదు. ఈవో కోటేశ్వరమ్మ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఒక జూనియర్ అసిస్టెంట్ ద్వారానే 14 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపులు చేశారు. ►ఆలయ అధీనంలో ఉండే వేద పాఠశాల, ప్రసాదం స్టోర్, గుడిలో పని చేసే క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు కలిపి 21 మంది సిబ్బందిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ►గర్భగుడిలో అమ్మవారి అలంకారం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేయాలి. టీడీపీ హయాంలో.. కోటేశ్వరమ్మ ఈవోగా పనిచేసిన కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమ్మవారి అలంకారం కోసమంటూ కన్సాలిడేట్ పే కింద ఒక వ్యక్తిని నియమించారు. దీనివల్ల గర్భాలయంలోకి బయటి వ్యక్తుల ప్రవేశానికి వీలు కలిగినట్టయ్యిందని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. ►ఆలయ ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి వివిధ వ్యక్తులు చెల్లించాల్సిన బిల్లులు రూ.6.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కమిషనర్ తన నివేదికలో వెల్లడించారు. -
ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
-
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
-
దుర్గమ్మ ప్రసాదిట్టం
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దేవీ నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర తీరాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మను దర్శించుకుని ప్రసాదం సేవిస్తేనే కాని తృప్తి చెందరు భక్తులు. అంతేనా! పులిహోర, లడ్డు ప్రసాదం తినకుండా లేదా కొనకుండా వెళ్లరు. అమ్మవారి మీదే కాదు, అమ్మవారి ప్రసాదం మీద కూడా భక్తి ఎక్కువే. ఈ ప్రసాదం స్వీకరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ప్రసాదాలను ‘దిట్టం’ ప్రకారమే అంటే కొలతల ప్రకారంగానే చాలా సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు. ప్రసాదాలకు పెరుగుతున్న ఆదరణతో ప్రసాదం తయారీలో చిన్న చిన్న మార్పులూ వస్తున్నాయి. వాటిల్లో భాగంగానే లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి తయారు చేయడానికి దేవస్థానం వారు రకరకాల కొలతలతో వంటవారికి రకరకాల ‘దిట్టం’ అందచేశారు. ఆ దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేసి, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు రుచి చూపించి, వారి సలహాలు తీసుకున్నారు. అందరి దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు కొత్త ‘దిట్టం’ అనుసరిస్తున్నారు. కొత్త కొలతలు ఎండోమెంట్స్ కమిషనర్ కొత్తగా స్థిరపరచిన దిట్టం ప్రకారం 516 లడ్లు తయారు చేయడానికి (ఒక్కో లడ్డు బరువు 80 గ్రా.) ఆరు కేజీల నెయ్యి, పది కేజీల సెనగ పిండి, 20 కేజీల పంచదార, 750 గ్రా. జీడిపప్పు, అర కేజీ కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష, 75 గ్రా. ఏలకులు, 15 గ్రా. జాజికాయ, 15 గ్రా. పచ్చ కర్పూరం ఉపయోగిస్తున్నారు. పులిహోరకు సంబంధించి స్థిరపరచిన దిట్టం ప్రకారం పది కిలోల బియ్యం, అర కేజీ సెనగ పప్పు, అర కేజీ చింతపండు, 200 గ్రా. ఎండు మిర్చి, 15 కేజీల నూనె, 60 గ్రా. బెల్లం ఉపయోగించి 230 ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్టు బరువు 150 గ్రా.) తయారు చేస్తున్నారు. లడ్లు సులువుగా తయారు చేయడానికి కూడా దేవస్థానం చిన్న చిన్న మార్పులు చేసింది. గతంలో ఒక కడాయిలో 730 లడ్డూలు తయారుచేసేవారు. ఇప్పుడు 516 లడ్లు మాత్రమే తయారు చేస్తున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రికి దుర్గగుడి ఈవో ఎం.వీ.సురేష్, ప్రధాన అర్చకులు ఎల్.డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్‌శర్మ తదితరులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టుచీర తదితరాలతో కూడిన వెండి పళ్లెంను ముఖ్యమంత్రి జగన్ తన శిరస్సుపై ఉంచుకుని దుర్గమ్మ సన్నిధికి చేరుకుని వాటిని అమ్మవారికి సమర్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ సీఎం పేరిట అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఈవో శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందచేశారు. సీఎం వెంట దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు తదితరులున్నారు. అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకునే సమయంలో సాధారణ, రూ.100 టికెట్ క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఐశ్వర్యప్రాప్తి, విజయాన్ని అందించే శ్రీమహాలక్షి్మని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. -
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వైఎస్ జగన్ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. అంతకుమందు ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్ జగన్‌ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ, రూ. 100 టికెట్ క్యూలైన్లలోని భక్తులు యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ క్యూలైన్లను మాత్రం కొద్దిసేపు నిలిపివేశారు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్యూలైన్లో దుర్గమ్మ భక్తురాలి నగలు చోరీ
సాక్షి, విజయవాడ : దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులనే లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర ఉండే బంగారు నగలు, నగదు చోరీకి కొందరు పాల్పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ ఏర్పడింది. రద్దీ అధికంగా ఉండటంతో అమ్మవారి దర్శనం ఆలస్యం అవుతుంది. దీంతో క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న దొంగలు భక్తుల బంగారు వస్తువులతో పాటు నగదును చాకచక్యంగా తస్కరిస్తున్నారు. ఆదివారం రాయగడ నుంచి విచ్చేసిన మాధురి అనే భక్తురాలి హ్యాండ్ బ్యాగ్‌లో భద్రపరిచిన 22 గ్రాముల బంగారపు నెక్లెస్‌తో పాటు రెండు చిన్న సైజు ఉంగరాలు అపహరణకు గురయ్యాయి. మహా మండపం దిగువన బ్యాగ్‌లను తనిఖీ చేసే సమయంలో వస్తువులను భద్రపరిచిన బాక్స్ ఉందని, క్యూలైన్లోకి వచ్చిన తర్వాత అది మాయమైనట్లు గుర్తించింది. దీంతో ఆలయ ప్రాంగణంలోని పోలీస్ ఔట్ పోస్టుకు వెళ్లి నగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే మరో ఇద్దరు భక్తులు తమ జేబులోని పర్సులు మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం, పండుగలు, సెలవు దినాల్లో రద్దీ సమయంలో ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.