సాక్షి, విజయవాడ: టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింధును, ఆమె కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడింది. అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ‘ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయి. 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి.. ఈసారి స్వర్ణం సాధించాలి’ అని పేర్కొంది.
PV Sindhu: దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు
Published Fri, Aug 6 2021 10:54 AM | Last Updated on Fri, Aug 6 2021 12:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment