బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్న క్రైం పోలీసు
సాక్షి, విజయవాడ : దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులనే లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర ఉండే బంగారు నగలు, నగదు చోరీకి కొందరు పాల్పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ ఏర్పడింది. రద్దీ అధికంగా ఉండటంతో అమ్మవారి దర్శనం ఆలస్యం అవుతుంది. దీంతో క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న దొంగలు భక్తుల బంగారు వస్తువులతో పాటు నగదును చాకచక్యంగా తస్కరిస్తున్నారు.
ఆదివారం రాయగడ నుంచి విచ్చేసిన మాధురి అనే భక్తురాలి హ్యాండ్ బ్యాగ్‌లో భద్రపరిచిన 22 గ్రాముల బంగారపు నెక్లెస్‌తో పాటు రెండు చిన్న సైజు ఉంగరాలు అపహరణకు గురయ్యాయి. మహా మండపం దిగువన బ్యాగ్‌లను తనిఖీ చేసే సమయంలో వస్తువులను భద్రపరిచిన బాక్స్ ఉందని, క్యూలైన్‌లోకి వచ్చిన తర్వాత అది మాయమైనట్లు గుర్తించింది. దీంతో ఆలయ ప్రాంగణంలోని పోలీస్ ఔట్ పోస్టుకు వెళ్లి నగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే మరో ఇద్దరు భక్తులు తమ జేబులోని పర్సులు మాయం అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం, పండుగలు, సెలవు దినాల్లో రద్దీ సమయంలో ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment