
సాక్షి, విజయవాడ: ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తన మేనకోడలితో మాట్లాడదామని వెళ్లిన శ్రీనివాస్ అనే వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురయ్యాయి. ఈ ఘటన సత్యనారాయణపురంలోని ఖుద్దూస్ నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నవీన్ అనే యువకుడికి ఒంగోలుకు చెందిన శ్వేత అనే యువతితో పరిచయం ఏర్పడింది. అయితే, వాళ్ళిద్దరూ ఇంటినుంచి వెళ్లిపోవడంతో వివాదం తలెత్తింది.
ఇంటినుంచి వెళ్లిపోయిన శ్వేతతో మాట్లాడేందుకు ఆమె మేనమామ శ్రీనివాస్ సహా పలువురు కుటుంబ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. శ్వేతను తమతో ఒంగోలుకు తీసుకుపోతామని శ్రీనివాస్ అనడంతో నవన్ అన్న జగదీష్ కోపోద్రిక్తుడయ్యాడు. శ్రీనివాస్‌పై కత్తితో దాడిచేశాడు.
తీవ్రగాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, దారిలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. జగదీష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. జగదీష్ గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment