love affair
-
చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్న
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వడ్డాది వినయ్‌కుమార్(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ సాగుతుండగానే వినయ్ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.చదవండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడుఅయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్‌చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్ తెలియదని, వినయ్‌ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్‌కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్‌పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్‌రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలుకాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్ రోధిస్తూ వెల్లడించారు. -
యువతి దారుణ హత్య
రాయగడ: ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఆనందమయమైన జీవితాన్ని కొనసాగిద్దామని ప్రేమికురాలిని ప్రియుడు ఒప్పించాడు. అయితే వీరిద్దరి పెళ్లికి ప్రేమికురాలి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించకపోవడంతో కోపోద్రేక్తుడైన ప్రేమికుడు పథకం ప్రకారం ప్రేమికురాలిని పిలిచి హత్య చేసిన అనంతరం ఒక అడవిలో మృతదేహాన్ని పారేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తన కూతురుని హత్య చేశాడంటూ బిసంకటక్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడిపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తప్పించుకోలేనని తెలిసి, సరాసరి జిల్లాలోని గుణుపూర్ పోలీసుస్టేషన్లో ప్రేమికుడు లొంగిపొయాడు.మనస్థాపంతో హత్యవివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బిసంకటక్‌లో నివాసముంటున్న నిటు నౌరి (23) అనే యువతితో గుణుపూర్‌లోని మరాటిగుడ గ్రామానికి చెందిన మేన్యూవ్ సబర్ (28) అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇదే క్రమంలో తన ప్రేయసిని కలిసేందుకు సరాసరి బిసంకటక్ వెళ్లి మాట్లాడి వస్తుండేవాడు. అయితే ఇక పెళ్లి చేసుకుందామని అందుకు తల్లిదండ్రులకు ఒప్పించమని ప్రేయసిని అడిగాడు. తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని యువతి తన ప్రియుడితో చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే సోమవారం తన ప్రేయసికి ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని రమ్మన్నాడు. అందుకు అంగీకరించిన ఆమె కలిసేందుకు వెళ్లింది. అప్పటికే బిసంకటక్‌లో ఉన్న సబర్ తన వ్యూహం ప్రకారం ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బిసంకటక్ సమీపంలోని కిరిబిరి అడవుల్లో పడేశాడు. తిరిగి ఏమీ తెలియని వాడిలా తన స్వగ్రామమైన గుణుపూర్ వెళ్లిపోయాడు. ఇంట్లో కుమార్తె లేకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న సబర్ సరాసరి గుణుపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. తానే హత్య చేసి మృతదేహాన్ని పారివేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో బిసంకటక్ పోలీసులు అడవిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్ మోసం చేశాడని ఓ యువతి..
కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన యువతిని కొడిమ్యాల మండలానికి చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేశాడు. దీంతో ఆ యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలిని పట్టణ ఎస్సై మన్మధరావు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవి చదవండి: పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. -
లవ్ బ్రేకప్ చెప్పడంతో ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్: లవ్ బ్రేకప్ చెప్పడంతో ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడి తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన మెరుగు వన్ష్ (21) మౌలాలి ఎంజే కాలనీలో నివసించే యువతి (21) ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఒకే స్కూల్లో చదువుకున్న వారు చిన్ననాటి నుంచే స్నేహంగా ఉంటూ వస్తున్నారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారి ప్రేమికులయ్యారు. ప్రస్తుతం వారు కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అమ్మాయి లవ్ బ్రెకప్ చెప్పింది. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న వన్ష్ ప్రియురాలిని చంపి తాను కూడా చనిపోవాలని పథకం వేసుకున్నాడు. శనివారం తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఒక్కసారి మాట్లాడుకుందా అంటూ నమ్మించి పిలిపించాడు. అలా ఇద్దరు కలిసి కారులో డీఏఈ కాలనీకి వెళ్లారు. కాలనీలో ఓ మూలన కారు పార్కు చేసి కారు అద్దాలు వేసుకొని మాట్లాడుకున్నారు. ఎందుకు బ్రేకప్ చెబుతున్నావంటూ కొద్దిసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కత్తి తీసి ప్రియురాలి, పొట్ట, మెడపై విచక్షణ రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వన్ష్ కూడా పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కారు వద్దకు వెళ్లి కారు అద్దాలు పగులగొట్టి కారు డోర్ తెరిచారు. వారిని స్థానిక ఎన్ఎఫ్సీ సంజీవని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ప్రాణాలకు హాని లేదన్నారు. -
కటకటాల్లోకి నయవంచకులు
అనంతపురం క్రైం: ప్రేమ పేరుతో ఓ యువతి జీవితాన్ని నరకప్రాయం చేశాడో వంచకుడు. అదే యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి తెగబడ్డాడు మరో దుర్మార్గుడు. ఎస్పీ ఆదేశాలతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి పంపారు. స్థానిక దిశ పోలీసు స్టేషన్లో శనివారం డీఎస్పీ ఆంథోనప్ప వెల్లడించిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన మొలకతాళ్ల్ల కృష్ణారెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. తను పట్టించుకోకపోవడంతో బ్లాక్ మెయిల్‌కు దిగాడు. బెంగళూరుకు పిలిపించుకొని స్నేహితుల గదికి తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం కృష్ణారెడ్డి క్లాస్మేట్, గుంతకల్లు పట్టణంలోని బెంచ్కొట్టాలకు చెందిన దివాకర్ బాబుకు తెలిసింది. సదరు యువతి కృష్ణారెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సేకరించి, ఆమెను వేధించడం ప్రారంభించాడు. బలవంతంగా ఆమెను గుంతకల్లుకు పిలిపించుకుని, స్థానికంగా ఉండే ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే మళ్లీ తెరపైకి వచ్చిన కృష్ణారెడ్డి.. దివాకర్‌తో సదరు యువతి కలిసి ఉన్న ఫొటోలను సంపాదించి, వాటిని సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టి బెదిరింపులకు దిగాడు. నరకయాతన అనుభవించిన బాధితురాలు ఎట్టకేలకు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంది. ‘దిశ’ యాప్ ద్వారా బాధను గ్రామ మహిళా పోలీసుకు విన్నవించింది. ఈ విషయం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు తెలియడంతో సీరియస్‌గా పరిగణించారు. తక్షణమే కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ‘దిశ’ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆంథోనప్పకు ఆదేశాలు చేశారు. ఈ విషయం తెలిసిన కృష్ణారెడ్డి, దివాకర్ బాబులు పరారయ్యేందుకు ప్లాన్ వేసుకున్నారు. శనివారం స్థానిక నగర శివారులోని నేషనల్ పార్కు వద్ద దాక్కుని ఉండగా, పక్కాగా అందించిన సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి పంపారు. -
బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి
హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్‌హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్‌హోం ఇన్చార్జి ముంతాజ్‌బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్ ఎంట్రీతో షాక్!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశి్చతార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు.. నావాడంటూ మరొకరు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఇరువురూ తమ ఆవేదను తెలియజేశారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు ఎగ్బాల్ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. -
బస్సులో ప్రేమికుడి వీరంగం... ‘నా లవర్ మోసం చేసింది’
పలమనేరు: బస్సులో ఎక్కి పూటుగా మద్యం సేవించి నానా హంగామా చేసి ప్రయాణికుల వద్ద దెబ్బ లు తిన్న యువకుని వ్యవహారం మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. తిరుపతిలో కర్ణాటక ఆర్టీసీ రాజహంసలో బస్సు ఎక్కి ఓ 26 ఏళ్ల యువకుడు బెంగళూరుకు టికెట్ తీసుకున్నాడు. బస్సు కొంతదూరం కదలగానే పూటుగా మద్యం సేవించాడు. బంగారుపాళెం వచ్చేసరికి కిక్కు ఎక్కువై ‘నా లవర్ మోసం చేసింది’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతన్ని ప్రయాణికులు చితకబాదారు. విధిలేక కండక్టర్, డ్రైవర్లు అతన్ని పలమనేరులోని అంబేడ్కర్ సర్కిల్లో బస్సు నుంచి దించేశారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు ఐలవ్యూ అంటూ గట్టిగా అరుస్తూ జనంపైకి మట్టిని చల్లడం ప్రారంభించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేక పోయింది. దీంతో అక్కడున్న స్థానికులు అతనిపై నీళ్లు పోసి మత్తు దింపారు. అదే బస్సులోకి అతన్ని ఎక్కించారు. -
‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’
చిత్తూరు: ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. ఆపై పెళ్లిమాట ఎత్తగా ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకోవడం ప్రారంభించాడు. గట్టగా నిలదీయగా.. ‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’ అంటూ ముఖంపై తెగేసి చెప్పేశాడు. పాపం.. అతనే జీవితమని నమ్ముకున్న ఆ ప్రియురాలి మనసు కకావికలమైంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. మిద్దైపె నుంచి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మృతురాలి తల్లి భారతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతికి కుమారుడు, కుమార్తె కావ్య ఉన్నారు. కావ్య (25) బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి నిమిత్తం విధులు నిర్వర్తిస్తుండగా పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో తేజ పెళ్లి చేసుకుంటానని కావ్యను నమ్మించాడు. దీంతో కావ్య తేజకు దగ్గరైంది. అలా రెండేళ్ల వరకు గడిచాయి. కావ్య తేజాతో పెళ్లి విషయంపై మాట్లాడినప్పుడల్లా అతను ఏదో ఒకరకంగా మాట్లాడుతూ దాటవేసేవాడు. కావ్య అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో ‘మీది వేలే కులం.. మాది వేరే కులం.. నిన్ను పెళ్లిచేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను’ అంటూ యువతికి సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య శుక్రవారం రాత్రి ప్రియుడు తేజాకు చివరి సారిగా ఫోన్‌చేసి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. అతను ఒప్పుకోకపోవడంతో విఽధిలేని పక్షంలో ఆ యువతి ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ తన ఇంటి మిద్దైపెన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు మిద్దైపెకి వెళ్లి పరిశీలించగా.. ఆమె విగత జీవిగా ఉరితాడుకు వేలాడుతోంది. కావ్య ఫోన్ కాల్‌డేటా ఆధారంగా మృతురాలి తల్లి భారతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మలేషియా యువతిని మోసం చేసిన యువకుడి అరెస్టు
తిరుత్తణి: ప్రేమ పేరుతో విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని తిరుత్తణి పోలీసులు అరెస్టు చేశారు. భగవతాపురం గ్రామానికి చెందిన వెంకట కుప్పరాజు కుమారుడు తిరుమలై కృష్ణన్ (28) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మలేషియాకు చెందిన నాగజ్యోతి అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మిత్రులయ్యారు. కొద్దికాలానికి ప్రేమికులుగా మారారు. ఫలితంగా నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్‌ను కలిసేది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తనకు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగిందని ఇకపై తనతో టచ్‌లో వద్దని తిరుమలై కృష్ణన్ చెప్పడంతో నాగజ్యోతి మలేషియా నుంచి తిరుత్తణి చేరుకుంది. తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. హత్యా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి తిరుమలై కృష్ణన్‌ను అరెస్టు చేశారు. -
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హైదరాబాద్‌లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది. మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు. మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు. కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట! జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు. ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు. కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు. ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్‌లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 90107 57776 -
ప్రేమ విఫలం.. మనసు కలత చెంది..
రామగుండం: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం యువకుడి, యువతి మధ్య ప్రేమగా మారింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన కల్వల శార్వాణి(20) సోమవారం అతివేగంగా వస్తున్న రైలు ఎదుట పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ కల్వల ప్రదీప్‌కుమార్ కూతురు శార్వాణికి రెండేళ్ల క్రితం ఏపీలోని తిరుపతికి చెందిన యువకుడు గంగాధర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ఇద్దరూ చాటింగ్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని గంగాధర్‌ను కోరింది. అయితే, తనకు ఇప్పటికే వివాహమైందని, పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువకుడు తిరస్కరించాడు. తీవ్రమనస్తాపం చెందిన శార్వాని.. సోమవారం ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడుకుంటూనే.. రామగుండం రైల్వేస్టేషన్‌లోకి చేరుకుంది. వేగంగా వస్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును చూసి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకుంది. శార్వాణి ఎన్టీపీసీలోని హోండా షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జీఆర్పీ ఔట్‌పోస్ట్ ఇన్చార్జి వివరించారు. -
ప్రియుడి మృతిని తట్టుకోలేక.. ఉరేసుకొని ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్: ఇద్దరు ఒకే బేకరీలో పని చేసేవారు.. వీరి మధ్య ఏర్పపడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి ప్రియుడి కుటుంబం నిరాకరించడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన ప్రేమికురాలు ఉరి వేసుకొని తనువు చాలించిన విషాద ఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జేమ్స్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహ (19) ఎనిమిది నెలల క్రితం నగరానికి వచ్చి గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో వైష్ణవి పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. నానక్‌రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్‌లోని ఓ బేకరీలో సేల్స్ గర్ల్‌గా చేరింది. బాలాపూర్ పీఎస్ పరిధిలో వెంకటాపురంలో నివసించే సల్మాన్ ఆరు నెలల క్రితం సదరు బేకరీలో చేరాడు. వీరిరువురు మధ్య స్నేహం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో సల్మాన్‌ను బేకరీ నుంచి తొలగించారు. సల్మాన్ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు చనిపోయిన విషయం తెలియడంతో నేహ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు రూమ్ మేట్స్ డ్యూటికీ వెళ్లగానే తలుపు గడియ పెట్టుకుంది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ నిర్వాహకులు వెంటనే గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రియుడు సల్మాన్ ఆత్మహత్యను జీరి్ణంచుకోలేక తనువు చాలించిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు..
ఇటీవలి కాలంలో లివింగ్ పార్ట్నర్స్ దారుణ హత్యకు గురవుతున్న వార్తలు చాలానే చూశాం. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం, దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఆమె డెడ్‌బాడీని సూటుకేసులో పెట్టి బయటపడేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సినీ మేకప్ ఆర్టిస్ నైనా మహత్(29)కు మనోహర్ శుక్లా(43)తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో శారీరకంగా కూడా వీరద్దరూ దగ్గరయ్యారు. అయితే, మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి వ్యవహరం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు.. తన బంధాన్ని కొనసాగించారు. నైనా ఫోన్ ఆఫ్.. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో.. నైనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేసింది. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆఫ్ రావడంతో నైనా కుటుంబ సభ్యులు ఆగస్టు 12వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. నైనా ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు. గుజరాత్ సరిహద్దుల్లో డెడ్‌బాడీ.. ఇక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నైనా లవర్ శుక్లాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి ఆమెకు బ్రేకప్ చెప్పినట్టు తెలిపాడు. కానీ.. ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే శుక్లాపై అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన టార్చర్ భరించలేకనే నైనాను చంపేసిన్నట్టు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం, నైనా డెడ్‌బాడీ ఉన్న సూట్‌కేసును పోలీసులు గుజరాత్ బోర్డర్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Manohar Shukla (43) KiIIed LIVE-IN Partner Naina Mahat (28) stuffed her body in SUITCASE & dumped her body in Gujrat with the help of his wife Shukla visited Naina's society but left the place with suitcase. It created suspicion Shukla said: Naina was forcing him to marry her pic.twitter.com/QAZVzmHeNf — Mohammad Nawaj (@NawazJ78) September 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
పెళ్లికి నిరాకరించిందని బ్లేడ్‌తో ప్రేయసి గొంతు కోశాడు
విశాఖపట్నం: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడి సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో కలకం రేపింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 59వ వార్డు నెహ్రూనగర్ ప్రాంతంలో లలితశ్రీ(19) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి సమీపాన నిందితుడు రామారావు(26) ఉంటున్నాడు. ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రామారావు పనీపాటా లేకుండా జులాయిగా కాలం గడిపేయడం లలితశ్రీకి నచ్చలేదు. ఈ కారణంగా అతను తీసుకొచ్చిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. కొన్ని రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నా ఆమె ససేమిరా అంది. దీంతో సోమవారం రాత్రి భోజనం చేసి మేడపై వాకింగ్ చేస్తున్న ఆమె వద్దకు మరోసారి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో దాడి చేస్తానని భయపెట్టాడు. వాదనకు దిగాడు. అయినప్పటికీ అంగీకరించకపోవడంతో బ్లేడ్‌తో ఆమె కంఠం భాగంలో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమె కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు, బంధువులు అక్కడకు చేరుకుని గాయపడిన లలితశ్రీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును మల్కాపురం పోలీస్ స్టేషన్ సీఐ జి.డి.బాబు ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిపై దాడి, యువతి తమ్ముడి హత్య
షాద్‌నగర్/ కొందుర్గు: మానవత్వాన్ని మరిచి మృగాడిలా వ్యవహరించాడు.. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో కొట్టి హతమార్చాడు.. ఆదివారం ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్ వ్యవహార శైలి ఇదీ. కొందుర్గుకు చెందిన ఇందిర, సురేందర్‌గౌడ్ దంపతులకు కూతురు సంఘవి కుమారులు పృథ్వీ(23), రోహిత్ ఉన్నారు. సంఘవి తమ్ముడు పృథ్వీతో కలిసి ఎల్బీనగర్ ప్రాంతంలో ఉంటూ హోమియోపతి వైద్యవిద్యలో నాలుగో సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా శివకుమార్ ప్రేమపేరుతో ఆమె వెంట పడుతున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత కొంత కాలంగా శివకుమార్ సైకోలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తన తండ్రి శంకరయ్యను సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. తాజా ఘటనతో శివకుమార్ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కొందుర్గులో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పరువు హత్య... కూతురిని దారుణంగా హత్య చేసిన తండ్రి
కోలారు : కోలారు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. పరువు కోసం ఓ తండ్రే కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. కోలారు తాలూకా తొట్లి గ్రామానికి చెందిన రమ్య (19) హత్యకు గురైన యువతి. వివరాలు... గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ కుమార్తె రమ్య ఇంటర్ చదువుతోంది. రమ్య ఇదే గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. విషయం ఇంట్లో తెలిసి తండ్రి వెంకటేషగౌడ మందలించాడు. అయినా రమ్య వినలేదు. దీంతో ఆగ్రహించిన తండ్రి వెంకటేషగౌడ ఈనెల 25వ తేదీ రాత్రి రమ్యను హత్య చేసి తెల్లవారకనే తన సంబంధీకులతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా ముగించాడు. చివరికి గుట్టు రట్టయ్యింది.. గ్రామంలో రమ్య మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం చివరికి విషయం పోలీసులకు చేరడంతో కోలారు రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్గౌడను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. పోలీసుల విచారణలో రమ్యను తానే హత్య చేసిన విషయం బయట పడడంతో రూరల్ పోలీసులు తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో రమ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి నిర్ణయించారు. తహసీల్దార్ హర్షవర్ధన్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. రూరల్ పోలీసులు రమ్య తండ్రి వెంకటేష్‌గౌడ అతని సమీప బంధువు చౌడగౌడను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాజల్ అనుమానస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం
సాక్షి, వరంగల్: హనుమకొండ బొక్కలగడ్డలో యువతి కాజల్ అనుమానస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అబ్బాస్ తో సహజీవనం చేసే యువతి కాజల్ జూలై 12న మృతి చెందగా కుటుంబసభ్యులు పూడ్చి పెట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కాజల్ తల్లి షరనార్జన్ బిడ్డ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు 20 రోజుల క్రితం పూడ్చిపెట్టిన కాజల్ మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ వైద్య బృందం, తహశీల్దార్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. కూలీ పనితో కుటుంబాన్ని పోషించుకునే కాజల్ ను అబ్బాస్ లోబర్చుకుని హత్య చేసి అనుమానం రాకుండా అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించాడని కాజల్ తల్లి ఆరోపించారు. (చదవండి: బావా కలవాలని ఉంది.. అని మెసేజ్ పెట్టి) -
కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి.. యువతి గల్లంతు
మాదాపూర్: తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గంచెరువులోకి దూకి గల్లంతైన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (20) 6 నెలల క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లోని డీమార్ట్ వద్ద స్నేహితురాలితో కలిసి ఉంటోంది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన పాయల్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు. -
స్వాతి ఎందుకమ్మా ఇలా చేశావ్...
మిర్యాలగూడ: ప్రేమోన్మాది వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన దామరచర్ల మండంలోని గణేష్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. బుధవారం దామరచర్ల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌పహాడ్ గ్రామానికి చెందిన కొర్ర రెడ్యా, విజయ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మూడో కుమార్తె కొర్ర స్వాతి(17) సూర్యాపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మెగావత్ హుస్సేన్ ఐటీఐ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. హుస్సేన్ గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో స్వాతిని వేధిస్తున్నాడు. తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వాతి తన తల్లిదండ్రులకు చెప్పగా వారు హుస్సేన్‌ను మందలించారు. అయినా తీరు మారని హుస్సేన్ స్వాతిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. దీంతో విసుగు చెందిన స్వాతి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయి గణేష్‌పహాడ్ గ్రామ పరిధిలో కృష్ణా నది ఒడ్డున గల పంప్‌హౌజ్ పైనుంచి కిందకు నదిలోకి దూకింది. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం కృష్ణా నదిలో స్వాతి మృతదేహం లభ్యమైంది. నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడని, అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తండ్రి అనుమానమే నిజమైంది.. ప్రియుడి మోజులో కన్నకూతుర్ని..
సాక్షి, హైదరాబాద్: ప్రియుడిపై మోజుతో కన్నబిడ్డనే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందినట్టు చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడకు చెందిన నాయక్వడి రమేష్ (30) కల్యాణి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల కూతురు తన్విత సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. కల్యాణి కుషాయిగూడ మార్కెట్లో పని చేస్తూ.. సమీపంలో కూతురు తన్వితతో కలిసి ఉంటోంది. ఈ నెల 1న కల్యాణి కూతురు తన్వితకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అంతా కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే వైద్యులు తన్విత చనిపోయినట్లు ప్రకటించారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వచ్చిన కూతురు భోజనం చేసి పడుకుందని, నిద్రలోనే ఇలా జరిగిందని కల్యాణి అందరినీ నమ్మించింది. అనుమానంతో ఫిర్యాదు... భార్య తీరుపై అనుమానం కలిగిన తండ్రి రమేష్ తన కూతురు చనిపోలేదని, చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఊపిరాడకపోవడంతో చిన్నారి చనిపోయినట్టు వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. అడ్డు తొలగించుకోవాలని... కల్యాణికి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన ఇండ్ల నవీన్‌కుమార్ (19) అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కల్యాణి వద్దను అతను తరచూ వచ్చేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. కల్యాణి భర్తకు విడాకులిచ్చి ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విడాకులు సాధ్యం కాకపోవడంతో కూతురు తన్వితను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1న స్కూల్ కు వెళ్లి వచ్చిన తన్విత నిద్రలో ఉండగా ముందే వేసుకున్న ఫ్లాన్ ప్రకారం ముఖంపై బెడ్‌షీట్ కప్పి దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితులు కల్యాణి, నవీన్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చిన్నారి హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ షేక్ షఫీలను డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు. -
ప్రేమ వ్యవహారం .. యువతి బంధువుల దాడితో మనస్తాపం?
ఖమ్మం: మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన బొల్లం రమేష్ (21) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం ఆమె వచ్చేసరికి గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుండి చూడగా రమేష్ ఉరి వేసుకుని ఉండడంతో స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. కాగా, రమేష్‌కు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉండగా, ఆమె బంధువులు ఇటీవల ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతోనే మనస్తాపానికి గురైన రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తండ్రి లింగయ్య చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌కుమార్ తెలిపారు. -
ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు?
సాక్షి, వరంగల్: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్మెంట్ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్మెంట్కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే! -
మొన్ననే వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి న్యూస్ వరంగల్: ప్రేమ... పెళ్ళి... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మృతురాలి బంధువులు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ప్రేమించిన విషయం చెప్పలేదని, చెప్పిఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదని తెలిపారు. - లింగయ్య, మృతురాలి తండ్రి కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ప్రేమ గురించి మానస పెద్దలకు చెప్పినప్పటికీ యాదవ వర్గాని చెందిన అమ్మాయిని పద్మశాలి వర్గానికి చెందిన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేకనే తమ కులానికి చెందిన మరో అబ్బాయితో పెళ్ళి జరిపించినట్లు ప్రియుడి బందువులు తెలిపారు. ప్రియుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.