చిక్కబళ్లాపురం: భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడో భర్త. చిక్కబళ్లాపురంలోని కొరచరపేటెలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మిథున్‌కుమార్ వివరాలను వెల్లడించారు.
అయితే, అరవింద్, భార్య మమత (30) భార్యభర్తలు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. కాగా, అరవింద్ పానీపూరి షాపులో పనిచేసేవాడు. ఇతడు భార్యపై అనుమానంతో తరచూ రగడపడేవాడు. శనివారం అర్ధరాత్రి కూడా భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమె తలను నేలకేసి పదేపదే కొట్టాడు. దీంతో నోట్లో నుంచి, చెవుల్లో నుంచి రక్తం కారి ఆమె మృత్యువాత పడింది. గొడవ విషయం తెలిసి పోలీసులు చేరుకుని నిందితున్ని పట్టుకున్నారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వారి పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు.
ఇది కూడా చదవండి: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న ఏం చేశాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment