Woman Killed Her Boyfriend Having Extramarital Affair At Karnataka - Sakshi
Sakshi News home page

ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..

Published Tue, Aug 23 2022 7:32 AM | Last Updated on Tue, Aug 23 2022 8:44 AM

Woman Killed Her Boyfriend Having Extramarital Affair At Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: దారితప్పిన మహిళ ప్రవర్తన ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. ఒకరితో పెట్టుకున్న అక్రమ సంబంధం.. మరో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తికి తెలుస్తుందనే భయంతో మహిళ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నెలమంగల తాలూకాలో కలకలం సృష్టించింది.

వివరాల ప్రకారం.. జూలై నెల 2న తుమకూరు జయనగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కేసులో నెలమంగల పోలీసులు లక్ష్మి, వెంకటేశ్‌ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు ఇద్దరూ దొడ్డలింగప్ప అనే వ్యక్తిని తుమకూరులో హత్య చేసి నెలమంగల తాలూకా కళలుఘట్ట బ్రిడ్జి వద్ద శవాన్ని పారవేసి పరారయ్యారు.  

అందరిదీ రాయచూరు 
నిందితులు లక్ష్మి, వెంకటేశ్, హతుడు దొడ్డలింగప్ప అందరూ రాయచూరుకు చెందినవారే. వీరంతా తుమకూరు వద్ద ఉన్న గోశాలలో పనిచేసేవారు. లక్ష్మి మొదటి భర్త మృతి చెందగా, రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో లక్ష్మి.. దొడ్డలింగప్ప, వెంకటేశ్‌ అనే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే దొడ్డలింగప్పతో అక్రమ సంబంధం గురించి వెంకటేశ్‌కు తెలుసు. 

కానీ, వెంకటేశ్‌తో అక్రమ సంబంధం ఉన్న సంగతి దొడ్డలింగప్పకు తెలీదు. దొడ్డలింగప్పకు లక్ష్మి రూ.30 వేలు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వెంకటేశ్‌తో ఉన్న సంబంధం తెలిస్తే గొడవ చేస్తాడని భావించిన లక్ష్మి జులై 2న అతడ్ని ఇంటికి పిలిపించి  మద్యం తాగించి తలపై బండరాయితో బాది హత్య చేసింది. ఇందుకు వెంకటేశ్‌  సహకరించాడు. శవాన్ని తీసుకువచ్చి నెలమంగల వద్ద బ్రిడ్జి కింద పారవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement